![]() |
![]() |

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్(MOhanLal)మమ్ముట్టి(Mammootty)మూడున్నర దశాబ్దాలపై నుంచి తమదైన నటనతో ప్రేక్షకులని అలరిస్తు వస్తున్నారు.గతంలో ఎన్నోచిత్రాల్లో కలిసి నటించిన ఈ ఇద్దరు,ప్రస్తుతం మహేష్ నారాయణ్(Mahesh Narayan)దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఒక మూవీలో మళ్ళీ కలిసి చేస్తున్నారు.రీసెంట్ గా మోహన్ లాల్ తన అప్ కమింగ్ మూవీ ఎల్ 2 ..ఎంపురాన్(L2..empuraan)ఈ నెల 27 న విడుదలవుతున్న సందర్భంగా శబరిమలకొండ(Sabarimala)పై ఉన్న అయ్యప్పస్వామి(Ayyappaswami)ని దర్శించుకోవడం జరిగింది.
స్వామిని దర్శించుకున్నమోహన్ లాల్ తన కుటుంబ సభ్యుల పేర్లతో పాటు మహ్మద్ కుట్టి అనే పేరు మీద కూడా పూజలు చేయించాడనే వార్తలు కేరళ సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.మమ్ముట్టి అసలు పేరు మహ్మద్ కుట్టి. దీంతో తన మిత్రుడు కోసం పూజలు చేయించినందుకు మోహన్ లాల్ ని మెచ్చుకుంటు సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ చేస్తున్నారు.గత కొన్ని రోజులుగా మమ్ముట్టి అనారోగ్యంతో ఉన్నాడనే వార్తలు వస్తున్నాయి.
ఆ వార్తలపై మమ్ముట్టి టీం ఒక ప్రకటన విడుదల చేసింది.మమ్ముట్టి ఆరోగ్యంపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.రంజాన్ కారణంగా షూటింగ్స్ కి బ్రేక్ తీసుకుని ఒకేషన్ కి వెళ్లారు.అక్కడ్నుంచి తిరిగి రాగానే మోహన్ లాల్ తో చేస్తున్న మూవీ షూటింగ్ లో పాల్గొంటారని ప్రకటనలో చెప్పుకొచ్చారు.

![]() |
![]() |