![]() |
![]() |

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ(Balakrishna)కి ఇటీవల కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన పద్మభూషణ్ ని ప్రకటించిన విషయం తెలిసిందే.దీంతో నందమూరి అభిమానులు,తెలుగు ప్రజల నుంచే కాకుండా,పలువురు సినీ,రాజకీయ,వ్యాపార ప్రముఖులు నుంచి కూడా అభినందలు వెల్లువెత్తుతున్నాయి.
ఇక ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్(Varalaxmi sarathkumar)రీసెంట్ గా తన అప్ కమింగ్ మూవీ 'మదగజరాజా' తెలుగులో రిలీజ్ అవుతున్న సందర్భంగా జరిగిన ప్రమోషన్స్ లో బాలయ్య కి పద్మ భూషణ్ రావడం గురించి మాట్లాడుతు బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చాక నేను ఆయనతో మాట్లాడాను.పద్మభూషణ్ కి బాలయ్య గారు అర్హులు.సినిమా కెరీర్ ని పక్కన పెడితే చాలామందికి హెల్ప్ చేస్తున్నారు. క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి కూడా పేద ప్రజలకి సేవలు చేస్తున్నారు.ఇవన్నీ చెయ్యడానికి పెద్ద మనసు ఉండాలి.
నా హస్బెండ్ కూడా బాలయ్య గారితో మాట్లాడాడు.రీసెంట్ గా వచ్చిన బాలయ్య సాంగ్ కి నా హస్బెండ్ పెద్ద ఫ్యాన్ కూడా అని చెప్పుకొచ్చింది.బాలయ్య,వరలక్ష్మి శరత్ కుమార్ అన్నాచెల్లెల్లు గా'వీరసింహారెడ్డి' లో కలిసి నటించిన విషయం తెలిసిందే. అన్నా చెల్లెళ్లుగా ఆ ఇద్దరి పెర్ఫార్మెన్సు నభూతో న భవిష్యత్తు అని చెప్పవచ్చు.
![]() |
![]() |