![]() |
![]() |

విక్టరీ వెంకటేష్ చాలా ఏళ్ళ తర్వాత 'సంక్రాంతికి వస్తున్నాం'(Sankranthiki vasthunnam)తో ఎంటైర్ తన సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ని అందుకున్న విషయం తెలిసిందే.అనిల్ రావిపూడి(Anil Ravipudi)దర్శకత్వంలో దిల్ రాజు(Dil Raju)నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న థియేటర్స్ లోకి అడుగుపెట్టింది.వెంకీ సరసన ఐశ్వర్య రాజేష్(Aiswarya Rajesh)మీనాక్షి చౌదరి(Meenakshi Chowdhary)హీరోయిన్లుగా చెయ్యగా నరేష్,మురళిగౌడ్,ఉపేంద్ర లి మాయే,vtగణేష్ కీలక పాత్రల్లో కనిపించారు.
ఇక ఈ మూవీ ఓటిటి స్ట్రీమింగ్ హక్కులని ప్రముఖ ఓటిటి దిగ్గజం జీ 5(Zee 5)దక్కించుకుంది.ఈ మేరకు మూవీ టైటిల్స్ లో చిత్ర నిర్మాణ సంస్థ అధికారకంగా ప్రకటించింది.దీంతో ఫిబ్రవరి సెకండ్ వీక్ లోనే ఈ మూవీ స్ట్రీమింగ్ కి రావలసి ఉందనే వార్తలు ఇప్పుడు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి.ఈ కండిషన్ తోనే రిలీజ్ కి ముందు నిర్మాణ సంస్ధతో జీ 5 ఒప్పందం కూడా చేసుకుందట.కానీ ఇప్పుడు మూవీకి సూపర్ డూపర్ హిట్ టాక్ ఉండటంతో,ప్రేక్షకులు థియేటర్స్ కి క్యూ కడుతున్నారు.దీంతో స్ట్రీమింగ్ ని వాయిదా వెయ్యమని జీ 5 ని సంక్రాంతికి వస్తున్నాం నిర్మాణ సంస్థ రిక్వెస్ట్ చేస్తుందట.గతంలో ఇలాగే తేజ సజ్జ హీరోగా వచ్చిన 'హనుమన్' కూడా సూపర్ డూపర్ హిట్ ని అందుకోవడంతో ఓటిటి
డేట్ వాయిదా పడింది.
2024 సంక్రాంతికి ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్(Hanuman)స్ట్రీమింగ్ హక్కులని జీ 5 కైవసం చేసుకోవడం జరిగింది.బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకోవడంతో నిర్మాత రిక్వెస్ట్ తో స్ట్రీమింగ్ వాయిదా పడింది.ఇప్పుడు సంక్రాంతికి వస్తున్నాం కి కూడా సేమ్ ఇదే రిపీట్ అవ్వబోతుందంటున్నారు.ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 276 కోట్ల రూపాయలగ్రాస్ ని వసూలు చేసింది.మరికొన్ని రోజుల దాకా ఎలాంటి పెద్ద చిత్రం లేకపోవడం ఈ సినిమాకి కలిసొచ్చే అంశం.దీంతో మరిన్ని కలెక్షన్స్ రాబట్టడం గ్యారంటీ అని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
![]() |
![]() |