Home

»

Latest News

'అఖండ' టైటిల్ సాంగ్.. బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలే

Nov 8, 2021 12:23PM

నటసింహం నందమూరి బాలకృష్ణ- డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'సింహా', 'లెజెండ్' సినిమాలు సంచలన విజయాలను అందుకోగా.. 'అఖండ'తో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని చూస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న 'అఖండ' నుంచి ఇప్పటికే విడుదలైన 'అడిగా అడిగా' సాంగ్ ఆకట్టుకోగా.. తాజాగా అఖండ టైటిల్ సాంగ్ విడుదలైంది.

అఖండ టైటిల్ సాంగ్ లిరికల్ వీడియోను తాజాగా మేకర్స్ యూట్యూబ్ లో విడుదల చేశారు. 'సింహా', 'లెజెండ్' సినిమాల టైటిల్ సాంగ్స్ ఎంతగా అలరించాయో తెలిసిందే. అఖండ టైటిల్ సాంగ్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఆకట్టుకుంటోంది. తమన్ సంగీతం, అనంత్ శ్రీరామ్ సాహిత్యం పవర్ ఫుల్ గా ఉన్నాయి. శంకర్ మహదేవన్, సిద్ధార్థ్ మహదేవన్, శివం మహదేవన్ ఆలపించిన ఈ పాట ఫ్యాన్స్ ని అలరిస్తోంది. లిరికల్ వీడియోలో బాలయ్య లుక్స్ చూస్తుంటే.. బిగ్ స్క్రీన్ పై ఈ వీడియో సాంగ్ చూస్తే ఫ్యాన్స్ గూజ్ బంప్స్ రావడం ఖాయమనిపిస్తోంది.

ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో శ్రీకాంత్ విలన్ గా కనిపించనున్నారు.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com