![]() |
![]() |
.jpg)
కన్నడ బాహుబలి 'కేజీఎఫ్' మూవీతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు గరుడ రామ్. నేడు(జూలై 7) ఆయన పుట్టిన రోజు సందర్భంగా.. ఆయన నటిస్తున్న 'భళా తందనాన' నుండి స్పెషల్ పోస్టర్ ను విడుదల చేశారు. గరుడ రామ్ కు బర్త్ డే విషెస్ తెలుపుతూ.. 'భళా తందనాన' మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది.
శ్రీవిష్ణు హీరోగా చైతన్య దంతులూరి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం 'భళా తందనాన'. వారాహి చలన చిత్రమ్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ మూవీలో కేథరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో కేజీఎఫ్ ఫేమ్ గరుడ రామ్.. ఆనంద్ బాలి అనే పాత్రలో నటిస్తున్నాడు. గరుడ రామ్ పుట్టినరోజు సందర్భంగా నేడు ఆయన లుక్ రివీల్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా విడుదలైన పోస్టర్ లో గరుడ రామ్ లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.
గరుడ రామ్ నటిస్తున్న మరో చిత్రం 'వైరం'. గరుడ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ చిత్రం నుండి కూడా స్పెషల్ పోస్టర్ ను విడుదల చేయగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఒక చేతిలో కత్తిని, మరో చేతిలో మనిషి తలని పట్టుకొని గరుడ రామ్ క్రూరంగా కనిపిస్తున్నాడు. ఈ సినిమాలో డేవిడ్ గా కనిపించనున్నాడు. సాయి శివ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది.
![]() |
![]() |