![]() |
![]() |
.jpg)
ఇప్పుడు తెలుగు నాట భీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఎవరంటే టక్కున వచ్చే సమాధానం పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్. విలక్షణమైన నటన, సామాజిక కార్యక్రమాలు, వ్యక్తిత్వంతో పవన్ అందరికి దగ్గరయ్యారు. వీటన్నింటిని చూసి ఫ్యాన్ అయ్యాడంటే అర్థముంది..కానీ చిన్నప్పుడే ఆయనతో రెండు మాటలు మాట్లాడి అప్పుడే పవన్ ఫ్యాన్ అయిన వారు ఒకరు ఉన్నారు. ఆయనే హీరో కమ్ విలన్ ఆది పినిశెట్టి.
త్రివిక్రమ్ దర్శకత్వంలో పవన్ హీరోగా తెరకెక్కిన అజ్ఞాతవాసి ఆడియో రిలీజ్ కార్యక్రమానికి అటెండైన ఆది మాట్లాడుతూ.. షూటింగ్ టైంలో పవన్ సార్‌తో చాలా తక్కువగా మాట్లాడే అవకాశం వచ్చిందని.. మీరందరూ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు అయ్యారేమో కానీ నేను చిన్నప్పుడే పవర్‌స్టార్ అభిమానినని అన్నాడు. తన చిన్నతనంలో పవన్ ఒకసారి మా ఇంటికి వచ్చారని అప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం కలిగిందని అప్పుడే కళ్యాణ్ ఫ్యాన్‌గా మారిపోయానని చెప్పుకొచ్చాడు.
![]() |
![]() |