Home  »  News  »  Silk smitha: తన కోరిక తీర్చని మగాడిని ఏం చేసిందో చూడండి

Updated : Apr 13, 2026

 

-రాజనర్తకి సింహనందిని ఎంత పని చేసిందో చూడండి 
-కోరిక తీర్చకపోతే ఉరిశిక్ష వరకు తీసుకెళ్లింది
-మరి చివరకి ఏం జరిగింది 

 

తెలుగు సినిమా, తెలుగు ప్రేక్షకులు, నందమూరి అభిమానులు సంపాదించిన ఆస్థి 'ఆదిత్య 369'. ఎక్స్ పైరీ డేట్ అనేది లేని విధంగా ఎన్ని తరాలైనా నిలబడిపోతుంది.  టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్‌ తో సైన్స్ ఫిక్షన్ చిత్రంగా రుపొందగా ప్రతి సన్నివేశంతో పాటు నటీనటుల పెర్  ఫార్మెన్సు చూపు పక్కకి తిప్పుకోనివ్వదు. బాలకృష్ణ(Balakrishna)చేసిన ద్విపాత్రాభినయంలోని శ్రీకృష్ణ దేవరాయలు క్యారక్టర్ అయితే నభూతో నభవిష్యత్. ఆ క్యారక్టర్ లో నమకం దగ్గరనుంచి చమకం, వాచకం వరకు సాక్షాత్తు శ్రీకృష్ణ దేవరాయలు కనపడేలా చేయడం బాలకృష్ణ నిబద్దతకి నిదర్శనం. మరి శ్రీకృష్ణ దేవరాయల కాలంలో జరిగిన ఒక సన్నివేశాన్ని గుర్తు చేసుకుందాం.

సింహ నందిని శ్రీకృష్ణ దేవరాయల ఆస్థానంలో రాజనర్తకి. మంచి అందగత్తె. నృత్యంలో తనని ఓడించే వారు ఈ భూమ్మీదనే లేరని తన నమ్మకం. కృష్ణకుమార్ పై మోజు పడి తన కోరిక తీర్చమని అడుగుతుంది. కానీ కృష్ణకుమార్ ఒప్పుకోడు. దీంతో శ్రీకృష్ణదేవరాయలు దగ్గరకి వచ్చి కృష్ణ కుమార్ నన్ను పెళ్లి చేసుకుంటానని శారీరకంగా వాడుకొని ఇప్పుడు హేమ(మోహిని) వెంట పడుతున్నాడని చెప్తుంది. కృష్ణ కుమార్ అదంతా  అబద్దమని  చెప్తాడు. దీంతో కొన్ని పరిణామాల నేపథ్యంలో కృష్ణ కుమార్ ప్రియురాలు హేమ, సింహ నంది మధ్య నాట్యంలో పోటీ జరుగుతుంది. ఆ పోటీలో సింహ నందిని గెలిస్తే సింహ నందిని కృష్ణ కుమార్ పెళ్లి చేసుకోవాలి. కానీ హేమ గెలవడంతో సింహ నందిని మరింత ఆగ్రహాన్ని తెచ్చుకుంటుంది. ఆ తర్వాత శ్రీకృష్ణ దేవరాయలు పవిత్రంగా పూజించే అత్యంత విలువైన శివమణిని  కృష్ణ కుమార్ దొంగిలించాడనికి చూశాడని రాయలు నమ్మేలా ప్లాన్ చేస్తుంది. దాంతో కృష్ణ కుమార్ కి రాయలు వారు ఉరిశిక్ష విధిస్తారు. ఆ తర్వాత రాయలు వారే కృష్ణ కుమార్ ని విడిపిస్తాడనుకోండి.  కానీ ఒక ఆడది తనకి నచ్చిన వాడు తన పొందుని ఇష్టపడకపోతే ఎంత దూరం వెళ్తుందో ఆ సన్నివేశం చెప్తుంది.

Anasuya: అనసూయ చీర వీడియోపై సెటైరికల్ కౌంటర్.. శివాజీ సృష్టించాడా! 

కృష్ణ కుమార్ గా, శ్రీకృష్ణ దేవరాయలుగా బాలకృష్ణ, రాజనర్తకి సింహ నందిని గా సిల్క్ స్మిత(Silk Smitha)ల పెర్ఫార్మ్ లోని  మ్యాజిక్ మనల్ని కట్టిపడేస్తుంది. మరియు ఆ ఇద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు కేవలం వినోదం కోసమే కాకుండా, విజయనగర రాజుల కాలం నాటి రాజసానికి ప్రతీకగా నిలుస్తాయి. సదరు సన్నివేశం జరుగుతున్నంత సేపు బాలయ్య తన గాంభీర్యంతో,బాడీ లాంగ్వేజ్ తో,  డైలాగ్ డెలివరీతో రాయలవారిని కళ్ళముందు ఉంచితే, సిల్క్ స్మిత తన నటనతో మరియు నృత్యంతో ఆ సన్నివేశానికి ఒక ప్రత్యేకమైన గ్లామర్‌ని అద్దింది.


తెలుగు సినిమా చరిత్రలో 'ఆదిత్య 369' ఒక మైలురాయి. లెజెండరీ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు(Singitham srinivasarao)ఆ విధంగా తీర్చిదిద్దారు.మేస్ట్రో ఇళయరాజా నుంచి వచ్చిన సంగీతం,సెట్ డిజైన్ మనల్ని నిజంగానే విజయనగర సామ్రాజ్యానికి తీసుకెళ్తాయి. నేటి ఆధునిక కాలంలో ఎన్ని గ్రాఫిక్స్ ఉన్నా, 1991లోనే ఎంతో పరిమితమైన వనరులతో అద్భుతమైన విజువల్స్ చూపించారు. ఈ క్లిప్ చూస్తుంటే పాత తరం టాలీవుడ్ సినిమాలు ఎంత నాణ్యంగా ఉండేవో అర్థమవుతుంది. బాలయ్య అభిమానులకి మాత్రమే కాకుండా, సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సన్నివేశం ఒక విందు లాంటిది. వింటేజ్ టాలీవుడ్ మ్యాజిక్ మళ్ళీ అనుభవించాలనుకుంటే ఈ వీడియో తప్పక చూడాల్సిందే.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.