![]() |
![]() |
.webp)
నా అభిమానులు - నా బలం అంటూ యష్ తన ఫ్యాన్స్ ని ఉద్దేశించి ఓ లేఖ రాశారు. `` మీ ప్రేమను, అభిమానాన్ని ఏడాదిపొడవునా నేను ఆస్వాదిస్తూనే ఉన్నాను. ముఖ్యంగా నా పుట్టినరోజున మీరు చూపించే ఆదరణతో నా గుండె నిండిపోతుంది. నేను పుట్టినరోజులను జరుపుకునే వ్యక్తిని కాదు. కానీ గత కొన్నేళ్లుగా మీరు చూపించే ప్రేమాభిమానాలకు చూసి ఆనందిస్తున్నాను. మిమ్మల్ని వ్యక్తిగతంగా కలిసి ఆ రోజును మరింత ప్రత్యేకంగా మలచుకుంటున్నాను.
కానీ ఇప్పుడు నేను, నాకు అత్యంత ఇష్టమైన, నేను నమ్మిన పనిలో నిమగ్నమై ఉన్నాను. నన్ను అత్యంత బలవంతుడిని చేసేది మీరే. నన్ను నేను అత్యంత అద్భుతంగా ఆవిష్కరించుకోవడానికి కారణమూ మీరే. నేను మిమ్మల్ని ఈ సారి కలిసినప్పుడు నేను ఈ విషయాలన్నిటినీ చెబుతాను. ఆ విషయాలను పంచుకోవడానికి నాకు కాస్త సమయం కావాలి. అది జనవరి 8 మాత్రం కాదు. అందువల్ల ఈ ఏడాది నాకు మీ నుంచి ఓ ప్రత్యేకమైన గిఫ్ట్ కావాలి. ఆ గిఫ్ట్ పేరు ఓపిక, అర్థం చేసుకోవడం.
ఈ ఏడాది నా పుట్టినరోజుకు నేను ఊర్లో ఉండటం లేదు. అందుకే మిమ్మల్ని కలవలేకపోతున్నాను. మీరు ఓపిగ్గా ఉన్నందుకు తగ్గ బహుమతిని తప్పకుండా ఇస్తానని ప్రామిస్ చేస్తున్నాను`` అని లెటర్ రాశారు యష్. కేజీయఫ్2 తర్వాత యష్ ఏం చేయబోతున్నారనే విషయాన్ని ఇంకా ప్రకటించలేదు.ఈ నెల 8న ఆయన పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేస్తారని ఆశించారు ఫ్యాన్స్. అయితే అనౌన్స్ మెంట్ ఉండదనే విషయాన్ని ఇలా చెప్పారు యష్. కేజీయఫ్3 ఇప్పుడప్పుడే ఉండదని రీసెంట్‌గా అనౌన్స్ చేసింది హోంబలే ఫిల్మ్స్.
![]() |
![]() |