![]() |
![]() |

అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ పై ఏం జరుగుతుంది
అల్లు ఆర్మీ రెస్పాన్స్ ఏంటి
మరి ముందు ముందు రికార్డులు ఉంటాయా!
కొన్ని కాంబినేషన్స్ ఇచ్చే కిక్కు ఫుల్ బాటిల్ మందు తాగినా రాదు. అలాంటి కిక్కుని అభిమానులకి, ప్రేక్షకులకి ప్రీ గా ఇస్తున్నారు అల్లు అర్జున్(Allu Arjun),లోకేష్ కనగరాజ్(lokesh kanagaraj). అసలు ఈ ఇద్దరి కాంబోలో సినిమా వస్తుందని ఎవరు ఊహించలేదు. ఇన్ క్లూడింగ్ అల్లు ఆర్మీతో సహా. అలాంటిది ఏకంగా సంక్రాంతికి వెల్ కమ్ చెప్తు థీమ్ సాంగ్ తో అధికార ప్రకటన ఇచ్చేసి సిల్వర్ స్క్రీన్ ని వశం చేసుకోవడానికి రెడీ కాబోతున్నారు. ఇప్పుడు ఆ థీమ్ సాంగ్ దెబ్బకి సోషల్ మీడియా సైతం కొంచం రెస్ట్ ఏమైనా ఇస్తారా అని అడిగే పరిస్థితి.. సోషల్ మీడియాకే ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందో చూద్దాం.
థీమ్ సాంగ్ పై ఇనిస్టా లో 355000 రీల్స్ క్రియేట్ అయ్యాయి. ఇది నిజం.. అక్షరాల మూడు లక్షల యాభై ఐదు వేల రీల్స్ చేసారు. పైగా ఇంకో అరుదైన రికార్డు ఏంటంటే కొన్ని రోజులుగా ట్రెండ్ అవుతున్న 'ఇట్స్ మై సెల్ఫ్' వీడియోకి సదరు థీమ్ సాంగ్ ని ఉపయోగిస్తున్నారు. దీంతో పదమూడు రోజుల్లోనే లక్షల రీల్స్ అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ తమ ఖాతాలో ఒక రికార్డుగా ఉంచుకున్నట్లయింది. సదరు రికార్డుపై అల్లు ఆర్మీ స్పందిస్తు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. రికార్డు అనే పదాన్ని మార్చేసి కొత్త పేరు పెట్టాలనే డిమాండ్ ముందు ముందు వింటారని తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.
also read: ప్రభాస్, సాయిపల్లవి కాంబో ఫిక్స్ అయ్యిందా!
ఈ సంవత్సరమే షూట్ కి వెళ్లనుండగా పుష్ప ,పుష్ప 2 తో పాన్ ఇండియా బ్యానర్ గా గుర్తింపు పొందిన మైత్రి మూవీ మేకర్స్(Mythri Movie Makers)కనీవినీ ఎరుగని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోంది. లోకేష్ గత చిత్రాల జర్నీప్రకారం సదరు చిత్రానికి సంబంధించిన కథ, కథనాలతో పాటు క్యాస్టింగ్ పై కూడా పాన్ ఇండియా వ్యాప్తంగా అందరిలో ఆసక్తి నెలకొని ఉంది. అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ(Atlee)అండర్ లో ఉన్న విషయం తెలిసిందే.

![]() |
![]() |