![]() |
![]() |

ప్రముఖ నిర్మాత, సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్, పీఆర్వో బి.ఎ. రాజు హఠాన్మరణం టాలీవుడ్‌ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. అందరకీ తలలో నాలుకలా మెలిగే, అందరికీ ఆత్మీయుడిగా మెసలే ఆయన మృతిని ఇండస్ట్రీ జీర్ణించుకోలేకపోతోంది. కేవలం టాలీవుడ్ మాత్రమే కాదు తమిళ, మలయాళ సినీ రంగాలకు చెందిన పలువురు హీరోలు, ఇతర సెలబ్రిటీలు కూడా బీఏ రాజు మృతి తమకు షాక్ కలిగించిందని చెబుతూ సంతాప సందేశాలు పంపుతున్నారు. సోషల్ మీడియా అయితే ఆయన సంతాప సందేశాలతో పోటెత్తుతోంది.
తెలుగు ఇండస్ట్రీకి చెందిన హీరోలు చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, అక్కినేని నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, డాక్టర్ రాజశేఖర్, ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కల్యాణ్‌రామ్, రామ్, మంచు విష్ణు, మంచు మనోజ్, వరుణ్ తేజ్, బెల్లంకొండ శ్రీనివాస్, సందీప్ కిషన్, ఆది సాయికుమార్, శ్రీవిష్ణు, నాగశౌర్య, అఖిల్ అక్కినేని, సప్తగిరి, లక్ష్ చదలవాడ, కార్తికేయ, సత్యదేవ్, ఆనంద్ దేవరకొండ తదితరులు..
డైరెక్టర్లు కె. రాఘవేంద్రరావు, యస్.యస్. రాజమౌళి, తేజ, వంశీ పైడిపల్లి, కొరటాల శివ, వీరభ్రదమ్, మారుతి, వేగేశ్న సతీశ్, మహి వి. రాఘవ తదితరులు...
నిర్మాతలు ఎ.ఎం. రత్నం, బీవీఎస్ఎన్ ప్రసాద్, ఎస్. రాధాకృష్ణ, లగడపాటి శ్రీధర్, బన్నీ వాస్, సూర్యదేవర నాగవంశీ, సునీల్ నారంగ్ తదితరులు..
హీరోయిన్లు సమంత అక్కినేని, లావణ్య, కియారా అద్వానీ తదితరులు..
గేయ రచయితలు భాస్కరభట్ల రవికుమార్, భాష్యశ్రీ తదితరులు...
తమిళ ఇండస్ట్రీకి చెందిన హీరోలు విక్రమ్, సూర్య, విశాల్, విజయ్ ఆంటోని తదితరులు...
మలయాళ హీరో దుల్కర్ సల్మాన్,
రాజకీయ రంగానికి చెందిన తలసాని శ్రీనివాస యాదవ్, నారా లోకేశ్ తదితరులు బి.ఎ. రాజు మృతికి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, సంతాపం ప్రకటించారు.
![]() |
![]() |