![]() |
![]() |

2021 క్యాలెండర్ ఇయర్ లో కొంతమంది స్టార్స్ ద్విపాత్రాభినయంతో ఎంటర్టైన్ చేశారు. `డ్యూయెల్ ధమాకా` ఇచ్చిన ఆ స్టార్స్ వివరాల్లోకి వెళితే..
రామ్ పోతినేనిః
తన కెరీర్ లో ఇప్పటివరకు ద్విపాత్రాభినయం చేయని ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని.. `రెడ్` చిత్రంతో ఆ ముచ్చట తీర్చుకున్నారు. తమిళ సినిమా `తడమ్` ఆధారంగా రూపొందిన ఈ మాస్ థ్రిల్లర్ లో సిద్ధార్ధ్, ఆదిత్య అనే కవల సోదరులుగా రామ్ దర్శనమిచ్చారు. రెండు పాత్రల్లోనూ తనదైన అభినయంతో అభిమానులను అలరించారు. సంక్రాంతి కానుకగా జనవరి 14న `రెడ్` థియేటర్స్ లో సందడి చేసింది.
బాలకృష్ణః
ద్విపాత్రాభినయానికి పెట్టింది పేరు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఇప్పటికే ఈ తరహా చిత్రాలతో పలు ఘనవిజయాలు చూసిన బాలయ్య.. `అఖండ` కోసం కవల సోదరులుగా మరోమారు డ్యూయెల్ ధమాకా ఇచ్చారు. అఘోరా అఖండగా, రైతు మురళీ కృష్ణగా ద్వి పాత్రల్లో కనిపించి బాక్సాఫీస్ ని షేక్ చేశారు. డిసెంబర్ 2న `అఖండ` థియేటర్స్ లో సందడి చేసింది.
నానిః
క్రిస్మస్ స్పెషల్ గా డిసెంబర్ 24న రిలీజైన `శ్యామ్ సింగ రాయ్`లో రెండు విభిన్న పాత్రల్లో ఎంటర్టైన్ చేశారు నేచురల్ స్టార్ నాని. 1970ల కాలం నాటి బెంగాలీ యువకుడు శ్యామ్ సింగ రాయ్ గా, వర్తమానంలో కనిపించే తెలుగు కుర్రాడు వాసుగా.. రెండు డిఫరెంట్ టైమ్ లైన్స్ లో నడిచే పునర్జన్మ పాత్రల్లో తన శైలి నటనతో ఆకట్టుకున్నారు నాని.
![]() |
![]() |