![]() |
![]() |

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ సరసన ఎక్కువ చిత్రాల్లో కథానాయికగా నటించిన ఘనత చెన్నై పొన్ను సమంత సొంతం. `బృందావనం`, `రామయ్యా వస్తావయ్యా`, `రభస`, `జనతా గ్యారేజ్`.. ఇలా ఇప్పటివరకు నాలుగు సినిమాల్లో జంటగా కనువిందు చేశారు తారక్, సామ్. కట్ చేస్తే.. త్వరలో ఈ ఇద్దరు ఐదోసారి జట్టుకట్టనున్నారని సమాచారం.
ఆ వివరాల్లోకి వెళితే.. `జనతా గ్యారేజ్` అనంతరం విజనరీ కెప్టెన్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఓ పాన్ - ఇండియా మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో పట్టాలెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో సమంత ప్రధాన నాయికగా నటించనుండగా.. `పెళ్ళి సందD` ఫేమ్ శ్రీలీల సెకండ్ లీడ్ గా దర్శనమివ్వనుందని ప్రచారం జరుగుతోంది. అదే గనుక నిజమైతే.. తారక్ తో జోడీ కట్టిన ప్రతీ సినిమాలోనూ సామ్ మరో హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఆసక్తిని రేకెత్తించే అంశమనే చెప్పాలి. `బృందావనం`లో కాజల్, `రామయ్యా వస్తావయ్యా`లో శ్రుతి హాసన్, `రభస`లో ప్రణీత, `జనతా గ్యారేజ్`లో నిత్యా మీనన్.. సామ్ తో పాటు సందడి చేశారు.
ఏదేమైనా.. తారక్ - కొరటాల కాంబో మూవీలో సామ్ నటిస్తుందా? లేదా? అన్నదానిపై త్వరలోనే క్లారిటీ రానున్నది.
![]() |
![]() |