![]() |
![]() |

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ లోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచింది `రంగస్థలం` చిత్రం. పిరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో.. చిట్టిబాబుగా చరణ్ అభినయం అభిమానులనే కాదు సగటు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకుంది. అలాంటి `రంగస్థలం`కి త్వరలోనే సీక్వెల్ రాబోతోందని టాలీవుడ్ టాక్.
ఆ వివరాల్లోకి వెళితే.. `రంగస్థలం`ని ఊహాతీత పతాక సన్నివేశంతో ముగించిన దర్శకుడు సుకుమార్.. అక్కడనుంచి మరో కొత్త కోణంతో సీక్వెల్ ని డిజైన్ చేసుకున్నారట. అంతేకాదు.. తొలి భాగానికి అచ్చంగా కొనసాగింపు కథగా ఉండే ఈ చిత్రంలో కొన్ని ముఖ్య పాత్రలు కంటిన్యూ అవుతాయని బజ్. ఎటొచ్చి.. ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి మరో ఏడాదికి పైగా సమయం పడుతుందని వినికిడి.
ప్రస్తుతం చరణ్ `ఆచార్య`, `ఆర్ ఆర్ ఆర్`ని పూర్తిచేసే పనిలో ఉన్నారు. అలాగే జూలై నుంచి శంకర్ డైరెక్టోరియల్ పట్టాలెక్కనుంది. ఇక సుక్కు విషయానికొస్తే `పుష్ప` చిత్రీకరణ దశలో ఉంది. ఆ నెక్స్ట్ విజయ్ దేవరకొండతో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఈ కమిట్ మెంట్స్ అన్నీ పూర్తయ్యాకే `రంగస్థలం` సీక్వెల్ సెట్స్ పైకి వెళ్ళే అవకాశముందంటున్నారు.
ఇదిలా ఉంటే.. `రంగస్థలం` తమిళ డబ్బింగ్ వెర్షన్ ఈ నెల 30న తమిళనాడు థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |