![]() |
![]() |

`వకీల్ సాబ్`తో మళ్ళీ వెండితెరపై వెలుగులు పంచారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. లాయర్ సత్యదేవ్ పాత్రలో తన మార్క్ యాక్టింగ్ తో ఫ్యాన్స్ ని మరోసారి ఫిదా చేశారు. ప్రస్తుతం పవన్ చేతిలో మరో నాలుగు సినిమాలున్నాయి. `అయ్యప్పనుమ్ కోషియుమ్` రీమేక్, `హరిహర వీరమల్లు`, హరీశ్ శంకర్ కాంబినేషన్ మూవీ, సురేందర్ రెడ్డి డైరెక్టోరియల్.. ఇప్పటివరకు ఫిక్స్ అయిన ఆ నాలుగు ఫ్లిక్స్. వీటిలో `అయ్యప్పనుమ్ కోషియుమ్`, `హరిహర వీరమల్లు` చిత్రీకరణ దశలో ఉన్నాయి. మిగిలిన రెండు సెట్స్ పైకి వెళ్ళాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. `వకీల్ సాబ్` నిర్మాతల్లో ఒకరైన `దిల్` రాజుతో పవన్ మరో సినిమా చేయబోతున్నట్లు కొద్దిరోజులుగా జోరుగా ప్రచారం సాగుతోంది. అంతేకాదు.. పవన్ కి రాజు ఆల్రెడీ అడ్వాన్స్ కూడా ఇచ్చారనే కథనాలు సైతం వినిపించాయి. లేటెస్ట్ బజ్ ఏంటంటే.. ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని `దిల్` రాజు ఆస్థాన దర్శకుల్లో ఒకరైన వంశీ పైడిపల్లి తెరకెక్కించనున్నారట. ప్రస్తుతం పవన్ ఇమేజ్ కి తగ్గ కథని తయారు చేసే పనిలో వంశీ అండ్ టీమ్ బిజీగా ఉన్నట్లు టాక్. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశముంది. మరి.. స్టార్స్ తోనే వరుస సినిమాలు చేస్తున్న వంశీ.. పవన్ తోనూ విజయపరంపరని కొనసాగిస్తారేమో చూడాలి. అన్నీకుదిరితే 2022 చివరలో పవన్ - వంశీ కాంబినేషన్ వెంచర్ పట్టాలెక్కవచ్చు.
![]() |
![]() |