![]() |
![]() |

`కేజీఎఫ్`తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. త్వరలో `కేజీఎఫ్ ఛాప్టర్ 2`తో పలకరించబోతున్నాడీ టాలెంటెడ్ కెప్టెన్. జూలై 16న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్.. థియేటర్స్ లో సందడి చేయనుంది.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో `సలార్` చేస్తున్న ప్రశాంత్ నీల్.. ఆపై యంగ్ టైగర్ యన్టీఆర్ తో సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. `కేజీఎఫ్` తరహాలో ఈ రెండు మూవీస్ కూడా పాన్ - ఇండియా వెంచర్స్ నే. ఈ రెండు చిత్రాల తరువాత మరో తెలుగు స్టార్ తోనే ప్రశాంత్ డైరెక్టోరియల్ ఉంటుందని టాక్. ఆ స్టార్ మరెవరో కాదు.. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. తన శైలిలో సాగే యాక్షన్ డ్రామాగానే బన్నీ మూవీని ప్లాన్ చేస్తున్నాడట ప్రశాంత్. అంతేకాదు.. ఈ బడా ప్రాజెక్ట్ ని అల్లు అర్జున్ హోమ్ బేనర్ గీతా ఆర్ట్స్ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించనుందని కథనాలు వస్తున్నాయి. త్వరలోనే బన్నీ - ప్రశాంత్ నీల్ మూవీకి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
మరి.. తెలుగు స్టార్స్ తోనే మూడు వరుస చిత్రాలు సెట్ చేసుకున్న ప్రశాంత్.. రాబోయే సినిమాలతో `కేజీఎఫ్` మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలి.
![]() |
![]() |