![]() |
![]() |

రీసెంట్ గా రిలీజైన హిలేరియస్ ఎంటర్ టైనర్ `జాతిరత్నాలు`.. బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తున్న సంగతి తెలిసిందే. `ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ` తరువాత నవీన్ పోలిశెట్టికి ఈ సినిమాతో మరో ఘనవిజయం దక్కినట్లయ్యింది. అంతేకాదు.. ఇదే చిత్రంతో తెలుగునాట నాయికగా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లాకి శుభారంభం దక్కింది. ఇందులో `చిట్టి`గా తన క్యూట్ లుక్స్, పెర్ ఫార్మెన్స్ తో కుర్రకారుని ఫిదా చేసేసింది ఫరియా.
కట్ చేస్తే.. ఇప్పుడీ టాలెంటెడ్ బ్యూటీకి ఓ బిగ్ టికెట్ ఫిల్మ్ లో నాయికగా నటించే ఛాన్స్ దక్కిందని టాక్. ఆ వివరాల్లోకి వెళితే.. మాస్ మహారాజా రవితేజ కథానాయకుడిగా త్రినాథరావ్ నక్కిన దర్శకత్వంలో ఓ మాస్ ఎంటర్ టైనర్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఇద్దరు కథానాయికలకు స్థానమున్న ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా ఫరియా అబ్దుల్లా దాదాపుగా ఖాయమైందనే ప్రచారం సాగుతోంది. త్వరలోనే రవితేజ - త్రినాథరావ్ నక్కిన కాంబో మూవీలో ఫరియా ఎంట్రీపై క్లారిటీ వస్తుంది.
కాగా, మే నుంచి సెట్స్ పైకి వెళ్ళనున్న రవితేజ - త్రినాథరావ్ నక్కిన కాంబో మూవీ ఏడాది చివరలో థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |