![]() |
![]() |

మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన `పోటుగాడు` (2013) చిత్రంలో ఓ హీరోయిన్ గా అలరించింది సిమ్రన్ కౌర్ ముండి. వైదేహి పాత్రలో తనదైన అభినయంతో ఆకట్టుకుంది. కట్ చేస్తే.. ఆ తరువాత మరే తెలుగు సినిమాలోనూ సిమ్రన్ దర్శనమివ్వనేలేదు. హిందీ, పంజాబీ భాషల్లోనే నటిస్తూ వస్తున్న ఈ టాలెంటెడ్ బ్యూటీ.. త్వరలో ఓ పాన్ ఇండియా మూవీతో తెలుగువారిని పలకరించబోతోంది.
ఆ వివరాల్లోకి వెళితే.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బుట్టబొమ్మ పూజా హెగ్డే జంటగా `జిల్` ఫేమ్ రాధాకృష్ణ.. `రాధేశ్యామ్` పేరుతో ఓ పిరియడ్ రొమాంటిక్ సాగాని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, ఈ సినిమాలో కథను కీలక మలుపు తిప్పే పాత్రలో సిమ్రన్ కనిపించబోతోందట. ఈ పాత్రతో మళ్ళీ తెలుగుతెరపై సందడి చేయనుండడం ఆనందంగా ఉందని సిమ్రన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. మరి.. `రాధేశ్యామ్` తరువాత సిమ్రన్ మరిన్ని తెలుగు చిత్రాల్లో నటిస్తుందేమో చూడాలి.
జూలై 30న ప్రపంచవ్యాప్తంగా పలు భాషల్లో `రాధేశ్యామ్` థియేటర్స్ లో సందడి చేయనుంది.
![]() |
![]() |