![]() |
![]() |

విష్వక్ సేన్ టైటిల్ రోల్ చేస్తోన్న మూవీ 'పాగల్'. నరేష్ కుప్పలి డైరెక్ట్ చేస్తోన్న ఈ మూవీలో ఇప్పటికే సిమ్రన్ చౌదరి, మేఘలేఖ హీరోయిన్లుగా నటిస్తున్నట్లు నిర్మాతలు తెలిపారు. లేటెస్ట్‌గా ఈ మూవీలో మెయిన్ హీరోయిన్‌గా నివేదా పేతురాజ్ ఎంటరైంది. ఆమె క్యారెక్టర్ పేరు తీర. ఈ విషయాన్ని రివీల్ చేస్తూ గురువారం ఓ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు.
ఆ పోస్టర్‌లో హీరో విష్వక్ సేన్ రెండు చేతులు వెనక్కి పెట్టి ఉన్నాడు. నివేదా పేతురాజ్ ఆయనను హత్తుకొని ఉంది. ఆసక్తికరమైన విషయమేమంటే విష్వక్ సేన్ చేతులు రెండూ కలిపి కట్టేసి ఉన్నాయి. విడుదల చేసిన కొద్ది సేపట్లోనే ఈ పోస్టర్ ఆన్‌లైన్‌లో వైరల్ అయ్యింది. నివేదా ఎంట్రీతో ఈ సినిమాపై బజ్ మరింతగా పెరిగింది. మే 1న 'పాగల్' ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానున్నది.
మ్యూజికల్ లవ్ స్టోరీగా రూపొందుతోన్న పాగల్‌ను దిల్ రాజు సమర్పణలో లక్కీ మీడియా బ్యానర్‌పై బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్నారు. ఎస్. మణికందన్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తుండగా, రధన్ మ్యూజిక్ సమకూరుస్తున్నారు.

![]() |
![]() |