English | Telugu

Ram Charan, Chiru with Sachin Tendulkar

Ram Charan, Chiru with Sachin Tendulkar

సచిన్ తో చిరు, రామ్ చరణ్ ఫొటో దిగారు. వివరాల్లోకి వెళితే భారత క్రికెట్ కే కాకుండా, ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే అనేకానేక రికార్డులు సొంతం చేసుకుని, లిటిల్ మాస్టర్ స్థాయి నుంచి మాస్టర్ బ్లాస్టర్ స్థాయికెదిగి, గాడ్ ఆఫ్ క్రికెట్ గా పేరు గాంచిన సచిన్ రుమేష్ టెండూల్కర్ అంటేనే ఒక చరిత్ర. అలాంటి సచిన్ తో ఫొటో దిగటమంటే అదో గొప్ప అనుభూతిని కలిగించే జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అందుకు మన తెలుగు సినీ హీరోలేం మినహాయింపు కాదు.

మన టాలీవుడ్ స్టార్లకూ సచిన్ కూ సన్నిహిత సంబంధాలున్నాయనేది చాలా మందికి తెలియని విషయం. ఉదాహరణకు టాలీవుడ్ స్టార్స్ క్రికెట్ మ్యాచ్ జరిగినప్పుడు నాగార్జున కుమారుడు అఖిల్ ఆడిన బ్యాట్ ను సచినే ముంబాయి నుంచి పంపించాడని అంటారు. అలాగే మెగాస్టార్ కూ సచిన్ కు కూడా మంచి సన్నిహిత సంబంధాలున్నాయి. ఇటీవల సచిన్ పుట్టపర్తికి వెళ్ళే సమయంలో హైదరాబాద్ వచ్చినప్పుడు మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ తేజ కలసి సచిన్ తో ఫొటోలు దిగారు. వాటిలో ఒకటి తెలుగువన్ కు లభించింది.