English | Telugu

Anjali Lavania in Pawan Kalyan Shadow

Anjali Lavania in Pawan Kalyan Shadow

పవన్ పళ్యాణ్ "ది షాడో"లో మరో హీరోయిన్ గా అంజలి లావణ్య నటిస్తుందని విశ్వసనీయ వర్గాల ద్వారా అందిన సమాచారం. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఆర్ట్స్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, అడివి శేషు ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, అంజలీ లావణ్య మరో హీరోయిన్ గా నటిస్తూండగా, ప్రముఖ తమిళ దర్శకుడు, తమిళ్ "బిల్లా" ఫేం విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం "ది షాడో". పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రంలో రెండవ హీరోయిన్ గా, కింగ్ ఫిషర్ క్యాలెండర్ 2011 లో స్థానం సంపాదించుకున్న ముంబాయి ముద్దుల గుమ్మ 27 యేళ్ళ అంజలి లావణ్య నటించబోతోందని ఫిలిం నగర్ వర్గాల ద్వారా అందిన సమాచారం.

అంజలీ లావణ్య ఒక్క కింగ్ ఫిషర్ క్యాలెండర్ లోనే కాక అనేక బికినీ ఫొటో షూట్స్ లో కూడా పాల్గొంది. తెలుగులో ఇదే అంజలీ లావణ్యకు తొలి చిత్రం కావటం విశేషం. కాగా పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రంలో మాఫియా డాన్ గా ప్రముఖ బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తున్నారని తెలిసింది. "మే" తొలి వారంలో పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రం కలకత్తా మహా నగరంలో ప్రారంభమవుతుందట.