English | Telugu

Pawan Kalyan The Shadow Press Meet Today

ఈరోజే పవన్ "ది షాడో" ప్రెస్ మీట్ జరుగనుంది. వివరాల్లోకి వెళితే సంఘమిత్ర ఆర్ట్స్, అర్కా మీడియా పతాకాలపై, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సారా జేన్ దియాస్ హీరోయిన్ గా, అడివి శేషు ఒక ముఖ్య పాత్రలో నటిస్తూండగా, అంజలీ లావణ్య మరో హీరోయిన్ గా నటిస్తూండగా, ప్రముఖ తమిళ దర్శకుడు, తమిళ్ "బిల్లా" ఫేం విష్ణువర్థన్ దర్శకత్వంలో, నీలిమ తిరుమల శెట్టి, శోభు యార్లగడ్డ నిర్మిస్తున్న చిత్రం "ది షాడో". పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రం యొక్క ప్రెస్ మీట్ "మే" రెండవ తేదీన సాయంత్రం అయిదు గంటలకు హైదరాబాద్ సినీ మ్యాక్స్ లో జరుగనుంది.

పవన్ కళ్యాణ్ "ది షాడో"చిత్రం "మే" తొలి వారం నుంచీ కలకత్తా నగరంలో షూటింగ్ ప్రారంభించుకోనుంది. పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రం అప్పటి నుండి రెండు నుండి మూడు వారాల వరకూ కలకత్తాలోనే జరుగుతుంది. కలకత్తా షెడ్యూల్లో హీరో పవన్ కళ్యాణ్, హీరోయిన్ సారా జేన్ దియాస్ తో పాటు అడివిశేషు, అంజలి లావణ్య, జాకీ ష్రాఫ్ తదితరులు ఈ షెడ్యూల్లో పాల్గొంటారని తెలిసింది. పవన్ కళ్యాణ్ "ది షాడో" చిత్రం మాఫియా బ్యాక్ డ్రాప్ లో జరిగే యాక్షన్ బేస్డ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ అని సమాచారం.