LATEST NEWS
అప్పుల ఊబిలో కురుకు పోయి , ఇక అప్పులు పుట్టని స్థితికి చ్రుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పుడు కసులకోసం  కొత్త ఎత్తులు వేస్తోందా,అంటే అవుననే అంటున్నారు లోగుట్టు తెలిసిన రాజకీయ విశ్లేషకులు. ఏపీ ప్రభుత్వం పేరు చెపితే ఎక్కడా పైసా అప్పు పుట్టడం లేదు. అవకాశం  ఉన్న వరకు అప్పు పాత్రలు అన్నింటినీ జగన్ రెడ్డి ప్రభుత్వం ఎప్పుడోనే పూర్తిగా తుడిచేసింది.(గిట్టని వాళ్ళు అయితే నాకేసిందని అంటారనుకోండి అది వేరే విషయం,)  ఇక ఎక్కడా రూపాయి కాదు కదా, హాఫ్ రూపీ అప్పు కూడా పుట్టే పరిస్థితి లేదనేది అందరికి తెలిసిన విషయమే.  రాష్ట్ర్ర ఆర్థిక పరిస్థితి అత్యంత దయనీయంగా ఉందని స్వయంగా ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పార్లమెంట్ ఉభయ సభలలో  వైసేపీ  నాయకులు ఒకటికి రెండు సార్లు గోడు వెళ్ళబోసుకున్నారు. సో, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక  స్థితి అధ్వాన్నంగా ఉందని కానీ, అప్పులు పుట్టని దుస్థితి ఉందని గానీ , వేరే ఎవరూ చెప్పనక్కరలేదు.  అందుకే, ఇక ఇలా కాదని, ఏపీ ప్రభుత్వం కాసు కొత్త ఎత్తులు వేస్తోందని విస్వవసనీయ వర్గాల సమాచారం. అప్పులు ఇవ్వకపోతే ఇవ్వక పోయారు, విరాళాలు అయినా ఇవ్వండని, దేశీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థలను వేడుకునేందుకు, ఏపీ ప్రభుత్వం సిద్డంవుతోందని అధికార వర్గాల సామాచారం.  ప్రస్తుతానికి, నాడు – నేడు పేరుతొ అమలవుతున్న పాఠశాల భవనాల రంగులు, హంగులు కార్యక్రమానికి, అదనపు తరగతి గదుల నిర్మాణానికి దాతలనుంచి విరాళాలు సేకరించాలని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది. పాఠశాలలో ఆవసరం మేరకు అదనపు తరగతి గదుల నిర్మాణానికి, రూ.6321 కోట్లు అవసరమని గుర్తించి ప్రభుత్వం జాతీయ, అంతర్జాతీయ దాతృత్వ సంస్థల నుంచి విరాళాలుసేకరించాలని నిర్ణయించిందని తెలుస్తోంది. ఇందుకు సంబందించిన విధివిధానాలు, ప్రభుత్వ ఉత్తర్వులు త్వరలోనే విడుదల అవుతాయని, అదికార వర్గాలు అంటున్నాయి.  అయితే జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్నఈ నిర్ణయం వెనక చాల పెద్ద కుట్ర ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ విరాళాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఆంక్షలను కఠినతరం చేసింది. దేశంలో ఇంచుమించుగా ఆరు వేల వరకు స్వచ్చంద సంస్థల లైసెన్సులను కేంద్రహోమ్ శాఖ రద్దు చేసింది. అంటే ఆ సంస్థలకు ఇక విదేశాల నుంచి విరాళాలు రావు. ఇందులో టీటీడీ సహ, ఐఐటీ ఢీల్లీ, జమియా మిలియా ఇస్లామియా, నెహ్రూ మెమోరియల్‌ మ్యూజియం వంటి సంస్థలు ఉన్నా, సేవా కార్యక్రమాల ముసుగులో మతమార్పిడులకు పాల్పడే, క్రైస్తవ సంస్థలే ఎక్కువగా ఉన్నాయి. ముఖ్యంగా, ఏపీలో జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రైస్తవ మత ప్రచారం, మత మార్పిడులు ఏ స్థాయిలో జరుగుతున్నాయో వేరే చెప్పనక్కరలేదు. ఈ నేపధ్యంలోనే నాడు – నేడు పేరిట విదీశీ మిషనరీలకు బ్యాక్ డోర్ ఎంట్రీ కలిపించేందుకు, జగన్ రెడ్డి ఈ ఎత్తు వేశారా, అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇందుకు సంబందించిన విధివిధానాలు వెలువడితేనే గానీ, అసలు కుట్ర ఏమిటన్నది తేలదు. స్వచ్చంద సంస్థలు ఇచ్చే విరాళాలను ప్రభుత్వం నేరుగా సేకరిస్తుందా, లేక అప్పుల కోసం ఏపీ డెవలప్మెంట్ కార్పొరేషన్ పేరిట,ఒక సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేసిన విధంగా విరాళాల సేకరణకు మరో సూట్ కేసు సంస్థను ఏర్పాటు చేస్తుందా, అనేది తేలితే గానే, విరాళాల అసలు రంగు బయట పడదని అంటున్నారు. అయితే, అంతర్జాతీయ క్రైస్తవ మిషనరీలతో వైఎస్సార్ కుటుంబానికి ఉన్న సంబంధాల దృష్ట్యా అనుమానాలకు బలం చేకూరుతోందని అంటున్నారు.
ఆంధ్రా ఐపీఎస్ ఆఫీసర్లకు ఇప్పుడో పెద్ద సమస్య వచ్చి పడింది. సమస్య తమదే అయినా దానికి పరిష్కారం మాత్రం వారి చేతుల్లో లేకపోవడమే విశేషం. తాము ఎదుర్కొంటున్న సమస్యకు ప్రతిపక్షం నుంచి పరిష్కారాన్ని ఆశిస్తున్నారు. ఇది మరీ విచిత్రమైన సమస్య. ఒక వస్తువు ఎక్కడ పోయిందో అక్కడ వెదికితేనే దొరుకుతుందని ఎంత చిన్న పిల్లాడిని అడిగినా చెబుతాడు. పోయిన చోటే వెదుక్కో పోరా.. అని మన పెద్దలు కూడా చిన్నప్పట్నుంచే చెవినిల్లు కట్టుకొని చెబుతారు. కానీ ఏపీలో ఐపీఎస్ ఆఫీసర్లు మాత్రం ఇంత చిన్న లాజిక్ ను మిస్సవుతుండడమే అసలు పాయింటు.  ఇక విషయానికొద్దాం. మొన్న గుడివాడ ఘటన తరువాత ఐపీఎస్ అధికారుల సంఘానికి ఓ పేద్ద డౌటొచ్చింది. రాష్ట్రంలో శాంతి భద్రతల నిర్వహణంతా తామే దగ్గరుండి చూసుకునే ఖాకీ బాసులు అయినప్పటికీ ప్రజలంతా తమను ఎందుకనో లైట్ తీసుకుంటున్నారన్న అనుమానం మొదలైంది. అనుమానం వచ్చిందే తడవు ఓ అనౌన్స్ మెంటు ప్రిపేర్ చేశారు. ప్రజల మీదికి వదిలారు. ఐపీఎస్ అధికారులను ప్రతిపక్షాలు లైట్ తీసుకుంటున్నాయని, ముఖ్యంగా రాష్ట్ర పోలీస్ బాసును ఏకవచనంతో సంబోధించడంతో తామంతా హర్ట్ అవుతున్నామని, శాంతి భద్రతల నిర్వహణలో నిద్రాహారాలు మాని పనిచేస్తుంటే తమనే ప్రతిపక్షాలు అనుమానిస్తున్నాయని, ఇది తమకెంతో అవమానకరమని, ఖాకీ బట్టలేసుకున్న తమకు ఈ అవమానమే ఎంతో అమర్యాదాకరమని, ప్రతిపక్షాలు కాసింత మర్యాదలు నేర్చుకొని ప్రజాక్షేత్రంలోకి రావాలని ఓ ప్రకటన జారీ చేశారు.. ఐపీఎస్ అధికార్ల సంఘం జాయింట్ సెక్రటరీ ఆర్పీ మీనా.  ఇదంతా ఎందుకొచ్చిందంటే గుడివాడలో కొడాలి నానికి సంబంధించిన కె.కన్వెన్షన్ లో విచ్చలవిడిగా జూదం ఆడుతున్నారంటూ ప్రతిపక్షాలు ఆరోపించాయి. దానిపై నిజనిర్ధారణ కోసం టీడీపీ ఆధ్వర్యంలో కొంతమంది నాయకుల బృందం అక్కడికి బయల్దేరింది. అయితే టీడీపీ నాయకులు అక్కడకు వెళ్లకుండా విజయవంతంగా అడ్డుకున్న పోలీసులు.. వైసీపీ నేతల ప్రవాహాన్ని మాత్రం అడ్డుకోలేకపోయారు. అసలు అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదంటే సబబుగా ఉంటుంది. వైసీపీ నేతల వాహన ప్రవాహాన్ని శక్తివంచన లేకుండా యథేచ్ఛగా ముందుకు పోనిచ్చారనేది ఇంకా కరెక్టు. దీంతో ఏమైంది? మందబలం చూసుకున్న వైసీపీ నేతలంతా రెచ్చిపోయి టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని దొరికినవారిని దొరికినట్టు చితకబాదారు. పిడిగుద్దులు కురిపించారు. కనీసం అక్కడి నుంచి తప్పించుకునే అవకాశం లేకుండా వారి వాహనాల్ని కూడా వ్యూహాత్మకంగా ధ్వంసం చేశారు. పనిలో పనిగా నోటిక్కూడా పని చెప్పి బూతు పురాణాలు అందుకున్నారు. అసలక్కడ క్యాసినో లాంటి అంతర్జాతీయ జూదక్రీడ జరగనప్పుడు టీడీపీ నిజనిర్ధారణ టీమ్ ను ఆపడం దేనికి? అక్కడ క్యాసినో ఒకవేళ జరిగితే జరుగుతున్నట్టు ప్రజలు తెలుసుకుంటారు. జరక్కపోతే అలాంటిదేం లేదని, ప్రతిపక్ష టీడీపీనే అనవసరంగా డ్రామా క్రియేట్ చేసిందని ప్రజలే నిర్ధారించుకుంటారు కదా. జరగాల్సిన కార్యక్రమాన్ని శాంతిభద్రతల సమస్య రాకుండా జరగనిస్తే అయిపోయేదానికి ఈ ప్రకటన దాకా తీసుకురావడంలో ఆంతర్యమేంటి? అసలు  తాము చేయాల్సిన పని చేయకపోవడం వల్లే ప్రతిపక్షాలు రంగంలోకి దిగాయన్న సింపుల్ లాజిక్ ను పోలీసులు ఎందుకు మిస్సవుతున్నారని అడుగుతున్నారు సామాన్య జనం. పోనీ శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా టీడీపీ పరివారాన్ని ఆపారే అనుకుందాం. మరి వైసీపీ నేతలను కూడా అదే తరహాలో ఆపి ఉండాల్సింది కదా. అలా జరిగినప్పుడే పోలీసు బాసులు విధి నిర్వహణను సక్రమంగా నిర్వర్తించినట్లు అవుతుంది కదా. ఆ పని చేయలేని, చేత కాని నిర్వాకం చేత.. కడుపు రగిలిన ప్రతిపక్షాలు పోలీస్ అధికారుల వైఫల్యాల మీద విరుచుకుపడితే, ఓ నాలుగు ఘాటైన వ్యాఖ్యలతో చురకలంటిస్తే అది వారి తప్పెలా అవుతుంది? ఈ మాత్రం విమర్శలు కూడా తట్టుకోలేనివారు... మరి అధికార పార్టీకి అంతలా ఏజెంట్లలాగా వ్యవహరించడం ఎందుకున్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తే ఆ తప్పెవరిది? అయినా ఖాకీ బాసులు విఫలమైనప్పుడు ఇక ప్రతిపక్షాలకు మిగిలిందేమిటి? ప్రెస్ మీట్ల ద్వారా ప్రజలకు తమ గోడేంటో వెళ్లబోసుకోవడమే కదా. దానిక్కూడా ఐపీఎస్ అధికారుల సంఘం ఉడుక్కుంటే ఎలా? అసలు మీనా అంటున్నదేంటి? డీజీపీ గౌతం సవాంగ్ ను ఏకవచనంతో సంబోధిస్తారా.. అని. ఏం? ఏకవచన ప్రయోగం ఏమైనా నేరామా? ఘోరమా? అప్రజాస్వామికమా? అవమానకరమైన పద ప్రయోగమా? పోనీ... నువ్వు అనే పదాన్ని ఐపీఎస్ సంఘం సంస్కార రహితంగా భావిస్తున్నదా? ఖాకీ బట్టల అంకిత భావాన్ని తమరు చేజేతులా అధికార పార్టీ ముందు ఒగ్గేస్తే... మాటలు పడి, దెబ్బలు తిని, వాహనాలు కోల్పోయి చెల్లాచెదురైన టీడీపీ నేతలు.. ఏకవచన ప్రయోగం చేసినందుకే మీకు మర్యాద లోపించినట్లు అనిపించిందా? ఇంతకన్నా విడ్డూరం ఉంటుందా? ఈ మాత్రం కూడా ఆత్మపరిశీలన చేసుకోలేదు కాబట్టే... ఆంధ్రా పోలీసు బాసులు మర్యాదలను అడుక్కోవాల్సిన దుస్థితిలో పడిపోయారని సామాన్య జనం చెవులు కొరుక్కుంటున్నారు. కనీసం ఇకనుంచైనా ఇలా మర్యాదలు అడుక్కోవడం కాకుండా మీ మర్యాదల్లో మీరుంటే ఎదుటివారు కూడా మర్యాదలు పాటిస్తారని, లేనిపక్షంలో వారిచేతుల్లో మళ్లీ మర్యాదలు చేయించుకోవాల్సిన పరిస్థితులు వచ్చినా ఆశ్చర్యపోవల్సిన అవసరం లేదన్న సెటైర్లు కూడా వినిపిస్తున్నాయి.
ఈ ఫోటో చూస్తుంటే.. ఆహా.. అద్బుతం అనిపించ‌ట్లేదూ.. మ‌నం కూడా ఓసారి ఆ వంతెన పైకెక్కి.. ఆ ప్రకృతి అందాల‌ను ఆస్వాదిస్తే బాగుండు అనిపిస్తోందిగా.. కానీ, ఈ ఫోటో రష్యా రాజ‌ధాని మాస్కోది. ఆగండాగండి.. అంత‌లోనే డిస‌ప్పాయింట్ అవ్వాల్సిందేమీ లేదు.. సేమ్ టూ సేమ్ అలాంటిదే కాకున్నా.. దాదాపు ఇలాంటి ఆకాశ వంతెన త్వ‌ర‌లోనే మ‌న హైద‌రాబాద్‌లో అందుబాటులోకి రానుంది.. న‌గ‌రం మ‌ధ్య‌లో ఉన్న హుస్సేన్ సాగ‌ర్ తీరంలో మాస్కో త‌ర‌హా వేలాడే బ్రిడ్జి నిర్మించ‌నున్నారు. అంతా అనుకున్న‌ట్టే జ‌రిగితే.. ఈ ఏడాది చివరికల్లా నెక్లెస్‌ రోడ్డులోని పీవీ ఘాట్ ద‌గ్గ‌ర ఇలాంటి వంతెన‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నట్టు హెచ్‌ఎండీఏ కమిషనర్‌, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అరవింద్‌కుమార్‌ ట్విటర్‌ ద్వారా వెల్ల‌డించారు.  మాస్కోలోని జర్యాడే పార్క్‌లో మోస్క్వా నదిపై ఈ తేలియాడే వంతెన ఉంది. నది లోపలకి యూ ఆకారంలో దాదాపు 70 మీటర్ల పొడవుతో నిర్మించారు. వంతెన కింద 13 మీటర్ల దూరం నుంచి మోస్వ్యా నది ప్రవహిస్తుంది. ఈ వంతెనపై ఉంటే.. నదిపైన ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. వంతెన‌పై ప‌ర్యాట‌కులు న‌డిచే భాగంలో.. పారదర్శకమైన గాజును ఏర్పాటు చేయ‌డంతో.. బ్రిడ్జిపై నిల్చొని కిందకు చూస్తే.. నది అలలు, అందాలు స్పష్టంగా కనిపిస్తాయి. నది లోపల ఎలాంటి స్తంభాలు లేకుండా రోప్‌వే ద్వారా దీనిని నిర్మించారు.  మాస్కో బ్రిడ్జి కాన్సెప్ట్‌తో.. మ‌న ప‌రిస్థితులు, అవ‌స‌రాల‌కు త‌గ్గ‌ట్టు మార్పు చేర్పుల‌తో హుస్సేన్ సాగ‌ర్ తీరంలో నెక్లెస్ రోడ్డు ద‌గ్గ‌ర ఇలాంటి వంతెన నిర్మాణానికి ప్ర‌తిపాద‌న‌లు రెడీ అయ్యాయి. ఇప్పటికే ట్యాంక్‌ బండ్‌, నెక్లెస్‌ రోడ్డుకు సంద‌ర్శ‌కుల తాకిడి ఎక్కువే. త్వరలో ట్యాంక్‌బండ్ ద‌గ్గ‌ర‌ నైట్‌ బజార్ కూడా రానుంది. ఇక‌, మాస్కో మాదిరే తేలియాడే వంతెన కూడా వ‌స్తే.. హుస్సేన్ సాగ‌ర్ తీరం మ‌రింత‌ టూరిస్ట్ డెస్టినేష‌న్‌గా మార‌నుంది. అయితే, వ‌చ్చిన‌వారు ఆ హుస్సేన్ సాగ‌ర్ నీటి దుర్వాస‌న‌ను మాత్రం భ‌రించాల్సిందే.  ఇక‌, గతంలో ట్యాంక్‌బండ్‌పై లండన్‌ ఐ ఏర్పాటుకు హెచ్‌ఎండీఏ ప్రణాళికలు సిద్ధం చేసినా ఎందుకోగానీ ఆ ప్రాజెక్టు ముందుకు కదలలేదు. ఇప్పుడు మాస్కో బ్రిడ్జి త‌ర‌హా ప్రాజెక్టు రూపకల్పన చేస్తున్నారు. మ‌రి, ఇదైనా...!?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెత్తినిండా కోర్టులు మొట్టిన మొట్టికాయలే.. ఎన్నెన్ని కేసుల్లో న్యాయస్థానాలు వైసీపీ ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టాయో.. ప్రభుత్వం తీసుకున్న రాజ్యాంగ విరుద్ద నిర్ణయాల విషయంలో న్యాయస్థానాలు సర్కార్ నెత్తిన ఎన్నిమార్లు అక్షింతలు వేశాయో లెక్క లేదు. పంచాయతీ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం మొదలు.. అనేక విషయాల్లో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను న్యాయస్థానాల తీర్పులతో వెనక్కి తీసుకుంది. అందుకోసంగా, వందల కోట్ల ప్రజా ధనాన్ని ఖర్చు చేసింది. అంతే కాదు, ప్రభుత్వ పెద్దల తప్పులకు చీఫ్ సెక్రటరీ, డీజీపీ ఇతర అధికారులు కోర్టు బోనులో నిలబడి క్షమాపణలు కోరవలసి  వచ్చింది. అయినా కుక్క తోక వంకర అన్నట్లుగానే వైసీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. న్యాయవ్యవస్థతో కయ్యానికి కాలు దువ్వుతూనే వుంది. మఖ్యమంత్రి జగన్ రెడ్డి కనిపెట్టిన రివర్స్ పీఆర్సీ విషయంగా, ఉద్యోగ సంఘాల ఆందోళన ఉదృతం వుతున్న వేళ, ఈ విషయంలో మరోమారు న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం అనివార్యం అని గ్రహించిన ప్రభుత్వం, అధికార పార్టీ పెద్దలు మరోసారి న్యాయవ్యవస్థను టార్గెట్ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాల్లో ముందుండే మంత్రి పేర్నినానీ, సమయ సందర్భాలతో సంబంధం లేకుండా, ‘తప్పు చేస్తే జడ్జిలనుకూడా వదలబోమంటూ’ న్యాయ వ్యవస్థను టార్గెట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.  అంతే కాదు, న్యాయ వ్యవస్థను, సినిమా, రాజకీయ వ్యవస్థలతో కలిపి ఒకే గాటన కట్టేస్తూ తప్పు చేస్తే, న్యాయమూర్తులానే కాదు రాజకీయ పార్టీలను, పార్టీలు పెట్టిన సినీ నటులనూ వదలబోమంటూ హెచ్చరిక చేశారు. సినిమా  నటులను, రాజకీయ నాయకులను హెచ్చరించారంటే అర్థం చేసుకోవచ్చును, కానీ, న్యాయమూర్తులను హెచ్చరించడం, అది కూడా ఒక మంత్రి అలాంటి హెచ్చరికలు చేయడం ఎంతవరకు సమంజసం... అనేది న్యాయవ్యవస్థే  నిర్ణయించాలని అంటున్నారు.  అయితే, మంత్రి పేర్నినానీ, ఈ వ్యాఖ్యలు ఎవరిని ఉద్దేశించి చేశారు? ఎందుకు చేశారు? అనేది పక్కన పెడితే,  అసలు న్యాయవ్యవస్థ గురించి పేర్ని నాని, ఈ సమయంలో ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందనేది ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్’లో హాట్ టాపిక్‌గా మారుతోంది. నిజానికి, న్యాయ వ్యవస్థ ఆసు పసులు తెలిసిన ఎవరికైనా న్యాయవ్యవస్థ ప్రభుత్వాలకు లోబడి ఉండదు, అనే విషయం కూడా తెలిసే ఉంటుంది. న్యాయమూర్తులపై ప్రభుత్వాలు చర్యలు తీసుకోలేవు అనేది కూడా తెలిసే ఉంటుంది. పేర్ని నానీ మంత్రి కూడా కాబట్టి ఆయనకు కూడా ఈ విషయం తెలియదని అసలే అనుకోలేము. అయినా, ఆయన నేరుగా న్యాయమూర్తులనే హెచ్చరించారంటే, పీఆర్సీ విషయంలో ప్రభుత్వం, ఇటు ఉద్యోగ సంఘాలతోనే కాకుండా  వ్యవస్థలతోనూ కయ్యానికే సిద్డంవుతోందని అర్థం చేసుకోలసి ఉంటుందని అంటున్నారు.  పీఆర్సీతో పాటుగా ఇతర సమస్యల విషయంగా ఉద్యోగ సంఘాలు చేపట్టిన ఉమ్మడి ఆందోళనను, ఎదురు దాడితో ఎదుర్కోవాలని మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో మంత్రి పేర్ని నాని ఈ అసందర్భ ప్రకటన చేయడంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి. ఈ వ్యాఖ్యల వెనక ఖచ్చితంగా ఓ ప్రణాళిక ఉండే ఉంటుందని, రాజకీయ వర్గాలు అనుమనిస్తున్నాయి.    గతంలోనూ వైసీపీ ప్రభుత్వం న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేసింది. కయ్యానికి కాలు దువ్వింది. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఘర్షణకు సిద్ధమవుతోందని, ఇందుకు మంత్రి వ్యాఖ్యలు సంకేతమని అంటున్నారు. అయితే, అటు ఉద్యోగులతో, ఇటు న్యాయవ్యవస్థతో పెట్టుకున్నవారు ఎవరైనా అంతిమంగా అభాసుపాలు కాక తప్పదని చరిత్ర చెపుతున్న పాఠం. జగన్ రెడ్డి ఆయన ప్రభుత్వం అందుకు మినహాయింపు కాదు అంటున్నారు గత చరిత్రకు సాక్షిగా నిలిచిన రాజకీయ విశ్లేషకులు.
మాజీ ఎంపీ, ఒక‌ప్ప‌టి వైసీపీ నేత పొంగులేటి శ్రీనివాస‌రెడ్డి ఇటీవ‌ల సీఎం జ‌గ‌న్‌రెడ్డిని క‌లిశారు. తాడేప‌ల్లి ప్యాలెస్‌లో కీల‌క చ‌ర్చ‌లు జ‌రిపారు. మామూలుగా అయితే ఇది కామ‌న్ న్యూసే. కాక‌పోతే, పొంగులేటి తెలంగాణ రాష్ట్రానికి చెందిన నాయ‌కుడు కావ‌డ‌మే కాస్త ఆస‌క్తిక‌రం. మ‌రి, ఆ ఖ‌మ్మం జిల్లా కారు పార్టీ లీడ‌ర్‌కు.. తాడేప‌ల్లిలో ఏం ప‌ని? జ‌గ‌న్‌తో ర‌హ‌స్య భేటీ జ‌ర‌పాల్సిన అవ‌స‌రం ఏముంది? అనేదే ఇంట్రెస్టింగ్ పాయింట్‌.  పొంగులేటి ప్ర‌స్తుతం టీఆర్ఎస్‌లో ఉన్నారు. ఉన్నారంటే ఉన్నారంతే. పూర్తిగా స్థ‌బ్దుగా.. పార్టీతో ట‌చ్ మీ నాట్ అన్న‌ట్టు ఉంటున్నారు. 2014లో ఖ‌మ్మం పార్ల‌మెంట‌రీ స్థానం నుంచి వైసీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తెలంగాణ‌లో జ‌గ‌న్ పార్టీకి వ‌చ్చిన ఏకైనా సీటు అదొక్కొటే. ఆ త‌ర్వాత అంద‌రిలానే.. ఆయ‌న సైతం అధికార టీఆర్ఎస్‌లో చేరిపోయారు. కారులో ఓ మూల‌న స‌ర్దు కున్నారు. అయితే, ఆ స‌ర్దుబాట్లు కుద‌ర‌క‌.. కారు ఓవ‌ర్ లోడ్ కావ‌డంతో.. గ‌త ఎన్నిక‌ల్లో పొంగులేటికి గులాబీ పార్టీ టికెటే ఇవ్వ‌లేదు. అప్ప‌టి నుంచి.. ఆయ‌న‌కు పార్టీలో ప్రాధాన్యం లేదు.  ప‌వ‌ర్ లేనిదే లీడ‌ర్లు క్ష‌ణం కూడా ఉండ‌లేరు. అలాంటిది.. దండిగా డ‌బ్బులుండి.. చేతినిండా ప‌లు ప్రాజెక్టులు ఉండి.. ప‌వ‌ర్ లేక‌పోయే సరికి.. తెగ ఇబ్బంది ప‌డుతున్నారాయ‌న‌. క‌నీసం వ‌చ్చే ఎల‌క్ష‌న్‌లోనైనా త‌న‌కేదైనా స్థానం ఇస్తారా? అంటే ఆ న‌మ్మ‌క‌మూ లేదాయే. దీంతో.. కారు దిగేసి.. కాంగ్రెస్‌లో చేరేందుకు ట్రై చేశారు.. కానీ, హ‌స్త‌వాసి అస‌లేమాత్రం బాగాలేద‌ని గుర్తించి.. కారుకే కాంప్ర‌మైజ్ అయ్యారు. లేటెస్ట్‌గా బీజేపీకి బూస్ట్ రావ‌డంతో.. అటువైపు చూస్తున్నారని అంటున్నారు. అయితే, బీజేపీలో చేరినా.. తెలంగాణ‌లో అధికారంలోకి వ‌చ్చే అవ‌కాశాలు క‌ష్ట‌మేన‌ని లెక్క‌లేస్తున్నారు. ఇటు టీఆర్ఎస్‌లో ఇమ‌డ‌లేక‌.. వేరే పార్టీలోకి వెళ్ల‌లేక తెగ ఇదై పోతున్నారు పొంగులేటి సుధాక‌ర్‌రెడ్డి.  ఇలాంటి సందిగ్థ ప‌రిస్థితుల్లో పొంగులేటి.. లేటెస్ట్‌గా త‌న మాజీ బాస్ జ‌గ‌న్‌రెడ్డిని క‌ల‌వ‌డం రాజ‌కీయంగా ఊహాగానాల‌కు కార‌ణ‌మైంది. మీరు రెడ్డి.. నేను రెడ్డి.. మ‌నం మ‌నం రెడ్డి-రెడ్డి అంటూ.. వ్యాపార విష‌యాల‌తో పాటు రాజ‌కీయ అంశాలు చ‌ర్చించార‌ని అంటున్నారు. కాస్త కేసీఆర్‌కు నా గురించి చెప్పండి బాస్‌.. అంటూ జ‌గ‌న్‌ను రిక్వెస్ట్ చేశార‌నేది ఒక టాక్‌. జ‌గ‌న్‌తో చెప్పించుకొని.. బీజేపీలో బిగ్ పోస్ట్ కొట్టేయాల‌నేది ఇంకో లీక్‌. రెండిట్లో ఏది రియ‌లో.. ఏది వైర‌లో తెలీదు కానీ.. పొంగులేటి జ‌గ‌న్‌రెడ్డిని క‌ల‌వ‌డం వెనుక ఏదో లెక్క ఉండే ఉంటుంద‌ని అంటున్నారు.  
ALSO ON TELUGUONE N E W S
  ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైన ఒక చిన్న సినిమా విశేషంగా ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందుతోంది. ఆ సినిమా.. 'ఏకమ్‌'. అభిరామ్ వ‌ర్మ, శ్వేతావ‌ర్మ‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, అదితి మ్యాక‌ల్‌, క‌ల్పికా గ‌ణేశ్‌, ద‌యానంద్‌రెడ్డి ప్ర‌ధాన పాత్ర‌ధారులైన ఈ మూవీతో వ‌రుణ్ వంశీ బి. ద‌ర్శ‌కునిగా ప‌రిచ‌య‌మ‌య్యాడు. ఎస్‌.ఎమ్‌.ఎస్‌. క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ఎ. క‌ల్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్‌., శ్రీ‌రామ్ కె. ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు సినిమాల‌కు సంబంధించిన అమెజాన్ ప్రైమ్‌లో అల్లు అర్జున్ మూవీ 'పుష్ప' ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉండ‌గా, 'ఏక‌మ్' సెకండ్ ప్లేస్‌లో నిల‌వ‌డం విశేషం. దీంతో ఆ సినిమా యూనిట్ ఆనందం అంతా ఇంతా కాదు. అమెజాన్ ప్రైమ్ లో 503 వ చిత్రంగా విడుదలైన "ఏకమ్" కేవలం పదిహేను రోజుల్లో టాప్-2కి చేరి... మొదటి స్థానం కోసం "పుష్ప"తో పోటీ పడుతోంది. పంచ భూతాల నేపథ్యంలో ఫిలసాఫికల్ డ్రామాగా... తాత్విక చింతనకు ఆధునికతను జోడించి తెరకెక్కిన "ఏకమ్" చిత్రానికి అమెజాన్ ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారనుకోవాలి. Also read: రాజ‌శేఖ‌ర్ `ఓంకారం`కి పాతికేళ్ళు! అమెజాన్ ప్రైమ్‌లో త‌మ సినిమాకు విశేష ఆద‌ర‌ణ ల‌భిస్తున్న సందర్భంగా చిత్రదర్శకుడు వరుణ్ వంశీ మాట్లాడుతూ... "ఏకమ్" చిత్రానికి అమెజాన్ లో రెండో స్థానం దక్కడం కలలా ఉంది... చాలా గర్వంగానూ ఉంది.  ఇంతవరకు తెలుగులో రాని యూనీక్ జోనర్ లో రూపొందిన "ఏకమ్" చిత్రానికి అవార్డులతోపాటు రివార్డులు కూడా వస్తుండడం మరీ సంతోషంగా ఉంది" అన్నారు. Also read: 'శ్రీ‌మంతుడు' విల‌న్ రెండో పెళ్లి! ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: ఇక్బాల్ అజ్మీ, మ్యూజిక్: జోస్ ఫ్రాంక్లిన్, ఎడిటర్: శ్రీనివాస్ తోట, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: హేమ ప్రకాష్, సమర్పణ: బోయపాటి రఘు, నిర్మాతలు: ఎ.కళ్యాణ్ శాస్త్రి, పూజ ఎమ్., శ్రీరామ్ కె., కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వరుణ్ వంశీ బి.
  సొంత ఇల్ల‌నేది ప్ర‌తి ఒక్క‌రికీ ఉండే క‌ల‌. అదీ పెళ్లి కాకుండానే సొంత ఇల్లును స‌మ‌కూర్చుకుంటే దాంట్లో ఉండే ఆనంద‌మే వేరు. సెల‌బ్రిటీలైనా ఈ ఫీలింగ్‌కు అతీతులు కారని బుట్ట‌బొమ్మ పూజా హెగ్డేను చూస్తే అర్థ‌మ‌వుతుంది. స‌రిగ్గా ఏడాది క్రితం ఆమె ముంబైలో ఒక‌ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. ఆ రోజును త‌ల‌చుకుంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో త‌ను గృహ‌ప్ర‌వేశం చేసిన ఒక ఫొటోను షేర్ చేసింది. “సంవ‌త్స‌రం క్రితం ఇదే రోజు నుండి అన్ని కలలు నెరవేరినందుకు సంతోషంగా ఉంది… కేవలం మిమ్మల్ని మీరు విశ్వసించండి, కష్టపడి పని చేయండి. ప‌ట్టుద‌ల క‌లిగిన గుండెతో ఈ విశ్వం నిజంగా ప్రేమలో పడుతుంది." అని రాసుకొచ్చింది. దానికి #onwardsandupwards అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది. Also read: టాలీవుడ్ స్టార్స్ @ బ్యాక్ టు బ్యాక్ హిట్స్! ఆ ఫొటోలో సంప్ర‌దాయ‌బ‌ద్ధంగా దుస్తులు ధ‌రించి, చేతిలో కొబ్బ‌రికాయ ప‌ట్టుకొని భ‌క్తిగా పూజ‌లో పాల్గొన్న పూజ క‌నిపిస్తోంది. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో బాంద్రా (ముంబై)లో స‌ముద్రానికి అభిముఖంగా 3 బెడ్‌రూమ్ ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది పూజ‌. ఇది ఆమె త‌న సంపాద‌న‌తో కొన్న మొట్ట‌మొద‌టి ఇల్లు. అందువ‌ల్ల దానికి ఆమె హృద‌యంలో ప్ర‌త్యేక‌మైన స్థానం ఉంద‌ని ఎవ‌రైనా ఈజీగా అర్థం చేసుకోగ‌ల‌రు. ఈ అపార్ట్‌మెంట్‌ను త‌న అభిరుచికి త‌గ్గ‌ట్లు ఇంటీరియ‌ర్‌తో తీర్చిదిద్దుకుంది. Also read: ల‌క్కీ సీజ‌న్ లో పూజ డ‌బుల్ హిట్స్ కొడుతుందా!? ప‌ని విష‌యానికి వ‌స్తే, ఇప్ప‌టికే ఆమె ప్ర‌భాస్‌తో తొలిసారి జ‌త‌క‌ట్టిన 'రాధేశ్యామ్' మూవీని పూర్తిచేసి, దాని విడుద‌ల కోసం ఎదురుచూస్తోంది. అలాగే రామ్‌చ‌ర‌ణ్‌తో క‌లిసి న‌టించిన 'ఆచార్య' మూవీ ఏప్రిల్ 1 రానున్న‌ది. ఇవి కాకుండా విజ‌య్‌తో 'బీస్ట్' అనే త‌మిళ సినిమా, ర‌ణ‌వీర్ సింగ్‌తో 'స‌ర్క‌స్' అనే హిందీ సినిమా చేస్తోంది పూజ‌. 
  నంద‌మూరి బాల‌కృష్ణ టైటిల్ రోల్ చేయ‌గా, బోయ‌పాటి శ్రీ‌ను డైరెక్ట్ చేసిన 'అఖండ' సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర అంచ‌నాల‌ను మించి వ‌సూళ్ల‌ను సాధించ‌డ‌మే కాకుండా, థియేట‌ర్ల‌లో 50 రోజుల‌ను దాటి ఇంకా ప్ర‌ద‌ర్శింప‌బడుతోంది. గురువారం నుంచి ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌పామ్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. కొవిడ్ సెకండ్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్ల‌కు భారీ సంఖ్య‌లో ప్రేక్ష‌కుల్ని ర‌ప్పించిన సినిమాగా 'అఖండ' పేరు తెచ్చుకుంది. నిజానికి కుదేలైవున్న టాలీవుడ్‌కు ఓ టానిక్‌లా వ‌చ్చింది 'అఖండ‌'.  బాల‌య్య ద్విపాత్రాభిన‌యం, బోయ‌పాటి డైరెక్ష‌న్‌, త‌మ‌న్ బ్యాగ్రౌండ్ స్కోర్ క‌లిసి 'అఖండ‌'ను మెమ‌ర‌బుల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మార్చాయి. 2021లో విడుద‌లైన టాప్ ఫిలిమ్స్‌లో ఒక‌టిగా విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కూడా పొందుతున్న అఖండ బాల‌కృష్ణ కెరీర్‌లో బిగ్గెస్ట్ గ్రాస‌ర్‌గా నిల‌వ‌డ‌మే కాకుండా, రూ. 75 కోట్లకు పైగా షేర్‌ వ‌సూలు చేసిన సినిమాగా కూడా నిలిచింది.  Also read: టాలీవుడ్ స్టార్స్ @ బ్యాక్ టు బ్యాక్ హిట్స్! అలాంటి ఆ సినిమాను ఇప్పుడు ఓటీటీలోనూ జ‌నం అమితాస‌క్తితో చూస్తున్నార‌ని తెలుస్తోంది. థియేట‌ర్ల‌లో ఇప్ప‌టికే అఖండ‌ను చూసిన‌వాళ్లు మ‌రోసారి ఓటీటీ వేదిక‌పై చూస్తుండ‌గా, ఇంత‌దాకా థియేట‌ర్ల‌లో చూడ్డానికి వీలుప‌డ‌ని వాళ్లు డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో దాన్ని చూసి, ఇప్ప‌టిదాకా దీన్ని చూడ‌కుండా ఎందుకు మిస్స‌య్యామా అని ఫీల‌వుతున్నారు. తొలిరోజే ఈ మూవీని చూసిన‌వాళ్ల సంఖ్య మిలియ‌న్ దాటింద‌ని స‌మాచారం. Also read: బాల‌య్య‌-గోపీచంద్ సినిమాలో కీల‌క పాత్ర‌లో అజ‌య్ ఘోష్‌! కాగా, త‌మ వేదిక‌పై 'అఖండ‌'ను చూస్తున్న ప్రేక్ష‌కుల‌కు ఆ ఓటీటీ దిగ్గ‌జం ఒక ఆస‌క్తిక‌ర‌మైన ఆఫ‌ర్‌ను అంద‌జేస్తోంది. డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో సినిమా చూసిన‌వాళ్ల‌కు బాల‌కృష్ణ‌ను వ్య‌క్తిగ‌తంగా క‌లుసుకొనే అవ‌కాశాన్ని కూడా క‌ల్పిస్తోంది. ఇంకెందుకు ఆల‌స్యం, ఓటీటీపై 'అఖండ‌'ను చూసేయండి, మీ అభిమాన హీరో అయిన బాల‌య్య‌ను క‌లుసుకునే ఛాన్స్ కొట్టేయండి.
క్లాస్ మూవీకైనా, ఊర‌మాస్ బొమ్మ‌కైనా.. చార్ట్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్ ఇవ్వ‌డం రాక్ స్టార్ దేవి శ్రీ ప్ర‌సాద్ కి ట్యూన్స్ తో పెట్టిన విద్య‌. కేవ‌లం తెలుగుకే ప‌రిమితం కాకుండా అన్య భాష‌ల్లోనూ త‌న‌దైన ముద్ర వేస్తున్నాడీ టాలెంటెడ్ కంపోజ‌ర్. ఇదిలా ఉంటే.. 2022 క్యాలెండ‌ర్ ఇయ‌ర్ దేవి శ్రీ ప్ర‌సాద్ కి ఎంతో ప్ర‌త్యేకం కానుంది. ఎందుకంటే.. త‌న కెరీర్ లో ఎన్న‌డూ లేని విధంగా ఒకే ఏడాది రెండు సీక్వెల్ మూవీస్ తో ప‌ల‌క‌రించ‌బోతున్నాడు డీఎస్పీ. ఆ చిత్రాలే.. `ఎఫ్ 3`, `పుష్ప - ద రూల్`. 2019 సంక్రాంతి విజేత `ఎఫ్ 2`కి సీక్వెల్ గా రూపొందుతున్న `ఎఫ్ 3` ఈ సంవ‌త్స‌రం వేస‌విలో వినోదాలు పంచ‌నుండ‌గా.. 2021 హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ `పుష్ప - ద రైజ్`కి సెకండ్ పార్ట్ గా రాబోతున్న `పుష్ప - ద రూల్` ఈ ఏడాది చివ‌ర‌లో ఎంట‌ర్టైన్ చేయ‌నుంది. మ‌రి.. ఈ సీక్వెల్ మూవీస్ దేవి శ్రీ ప్ర‌సాద్ కి ఎలాంటి ఫ‌లితాల‌ను అందిస్తాయో చూడాలి. Also Read:  'గుడుంబా శంక‌ర్' హీరోయిన్ రి-ఎంట్రీ! కాగా,  స‌క్సెస్ ఫుల్ డైరెక్ట‌ర్ అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న `ఎఫ్ 3`లో విక్ట‌రీ వెంక‌టేశ్, మెగాప్రిన్స్ వ‌రుణ్ తేజ్ హీరోలుగా కంటిన్యూ అవుతుండ‌గా.. బ్రిలియంట్ కెప్టెన్ సుకుమార్ తీర్చిదిద్దుతున్న `పుష్ప - ద రూల్`లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయ‌కుడిగా ద‌ర్శ‌న‌మివ్వ‌నున్నారు.   
  హ్యాండ్స‌మ్ హంక్ రానా ద‌గ్గుబాటి చాన్నాళ్ళ త‌రువాత మ‌రో ప‌వ‌ర్ ఫుల్ మూవీతో రాబోతున్నాడు. ఆ సినిమానే.. `భీమ్లా నాయ‌క్`. మాలీవుడ్ బ్లాక్ బ‌స్ట‌ర్ `అయ్య‌ప్ప‌నుమ్ కోషియుమ్`కి రీమేక్ గా రూపొందుతున్న ఈ సినిమాలో ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తో క‌లిసి సంద‌డి చేయ‌నున్నాడు రానా. అన్నీ అనుకూలంగా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 25న ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేట‌ర్స్ లోకి వ‌స్తుంది. ఇదిలా ఉంటే.. ఫిబ్ర‌వ‌రి 25 రానా బాబాయ్, విక్ట‌రీ వెంక‌టేశ్ కెరీర్ లో ఓ మెమ‌ర‌బుల్ డేట్ అనే చెప్పాలి. ఎందుకంటే.. 24 ఏళ్ళ క్రితం అంటే 1998లో ఇదే తేదిన వెంకీ బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీస్ లో ఒక‌టైన `సూర్య‌వంశం` విడుద‌లైంది. వెంక‌టేశ్ ద్విపాత్రాభిన‌యం చేసిన సద‌రు సినిమా అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించింది. మ‌రి.. బాబాయ్ వెంకీకి అచ్చొచ్చిన ఫిబ్ర‌వ‌రి 25.. అబ్బాయ్ రానాకి కూడా ప్ల‌స్ అవుతుందేమో చూడాలి. Also Read: సురేఖావాణి కూతురు షాకిచ్చింది ప్ర‌స్తావించ‌ద‌గ్గ విష‌య‌మేమిటంటే.. `భీమ్లా నాయ‌క్` ఎలాగైతే రీమేక్ మూవీనో.. `సూర్య వంశం` కూడా అలాగే రీమేక్ సినిమానే. త‌మిళ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `సూర్య వంశం` సినిమాకి తెలుగు వెర్ష‌న్ గా వెంకీ `సూర్య వంశం` తెర‌కెక్కింది. ఆ కోణం కూడా రానాకి  క‌లిసొస్తుందేమో చూడాలి మ‌రి. 
గ‌త కొంత‌కాలంగా తెలుగునాట కొంద‌రు క‌థానాయ‌కులు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో వార్త‌ల్లో నిలుస్తున్నారు.   ఆ స్టార్స్ వివ‌రాల్లోకి వెళితే.. మెగాస్టార్ చిరంజీవిః `ఖైదీ నంబ‌ర్ 150`తో గ్రాండ్ రి-ఎంట్రీ ఇచ్చిన చిరంజీవి.. స‌ద‌రు సోష‌ల్ డ్రామాతో కెరీర్ హ‌య్య‌స్ట్ గ్రాస‌ర్ చూశారు. ఆపై `సైరా.. న‌ర‌సింహారెడ్డి`తోనూ ఆ ప‌రంప‌ర‌ని కొన‌సాగించారు. విక్ట‌రీ వెంక‌టేశ్ః విక్ట‌రీని త‌న ఇంటిపేరు చేసుకున్న సీనియ‌ర్ స్టార్ వెంక‌టేశ్.. ఇటీవ‌ల కాలంలో త‌ను న‌టించిన ప్ర‌తీ చిత్రంతోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తూనే ఉన్నారు. ఆ మ‌ధ్య `గురు`, `ఎఫ్ 2`, `వెంకిమామ‌` చిత్రాల‌తో థియేట్రిక‌ల్ హ్యాట్రిక్స్ కొట్టిన వెంకీ.. గ‌త ఏడాది `నార‌ప్ప‌`, `దృశ్యం 2`తో ఓటీటీలోనూ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశారు. సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబుః  గ‌త కొంత‌కాలంగా మ‌హేశ్ బాబు పట్టింద‌ల్లా బంగార‌మే. `భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`.. ఇలా వ‌రుస‌గా మూడు మ‌ర‌పురాని విజ‌యాల‌తో టాక్ ఆఫ్ టాలీవుడ్ అయ్యారు మ‌హేశ్. యంగ్ టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ః  నందమూరి యువ సంచ‌ల‌నం ఎన్టీఆర్ నుంచి ఈ మ‌ధ్య వ‌చ్చిన ఏ సినిమా కూడా ఫెయిల్యూర్ కాలేదు. `టెంప‌ర్`, `నాన్న‌కు ప్రేమ‌తో`, `జ‌న‌తా గ్యారేజ్`, `జై ల‌వ కుశ‌`, `అర‌వింద స‌మేత‌`.. ఇలా వ‌రుస‌గా ఐదు చిత్రాల‌తో తెలుగు జ‌నాన్ని రంజింప‌జేశారు తార‌క్. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ః  ఆ మ‌ధ్య కాస్త ట్రాక్ త‌ప్పిన అల్లు అర్జున్.. రీసెంట్ టైమ్స్ లో మ‌ళ్ళీ త‌న హ‌వా చూపిస్తున్నారు. `అల వైకుంఠ‌పుర‌ములో`, `పుష్ప - ద రైజ్`తో బ్యాక్ టు బ్యాక్ సంచ‌ల‌న విజ‌యాలు న‌మోదు చేసుకున్నారు బ‌న్నీ. యువ సామ్రాట్ నాగ‌చైత‌న్యః  అక్కినేని యువ సంచ‌ల‌నం నాగ‌చైత‌న్య కూడా గ‌త కొంత‌కాలంగా వ‌రుస విజ‌యాల‌తో ఆక‌ట్టుకుంటున్నాడు. `మ‌జిలీ`, `వెంకిమామ‌`, `ల‌వ్ స్టోరి`, `బంగార్రాజు` చిత్రాల‌తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ చూశాడీ యంగ్ హీరో. ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ః `ఇస్మార్ట్ శంక‌ర్`తో కెరీర్ బెస్ట్ హిట్ అందుకున్న రామ్.. ఆపై వ‌చ్చిన `రెడ్`తో చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ చూసి వార్త‌ల్లో నిలిచాడు. యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పోలిశెట్టిః  `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`, `జాతిర‌త్నాలు`తో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని టాలీవుడ్ దృష్టిని విశేషంగా ఆక‌ర్షించాడు యంగ్ సెన్సేష‌న్ న‌వీన్ పోలిశెట్టి. మ‌రి..  రాబోయే సినిమాల‌తోనూ వీరంతా ఈ విజ‌య‌ప‌రంప‌ర‌ని కొన‌సాగిస్తారేమో చూడాలి.  
సీనియ‌ర్ స్టార్ విక్ట‌రీ వెంక‌టేశ్ కి విజ‌యాలు కొత్తేమీ కాదు. ఇంకా చెప్పాలంటే..  స్టార్ హీరోల్లో హై స‌క్సెస్ రేట్ ఉన్న క‌థానాయ‌కుల్లో వెంకీ ముందు వ‌రుస‌లో ఉంటారు. ఇదిలా ఉంటే.. రీసెంట్ టైమ్స్ లో అటు థియేట‌ర్స్ లోనూ, ఇటు ఓటీటీలోనూ వెంకీ వ‌రుస‌గా ఐదు విజ‌యాలు న‌మోదు చేసి వార్త‌ల్లో నిలిచారు. `గురు` (2017), `ఎఫ్ 2` (2019), `వెంకిమామ‌` (2019)తో థియేట‌ర్స్ లో హ్యాట్రిక్ కొట్టిన వెంక‌టేశ్.. గ‌త సంవ‌త్స‌రం ప్ర‌ముఖ ఓటీటీ వేదిక అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అయిన `నార‌ప్ప‌`, `దృశ్యం 2`తోనూ వీక్ష‌కుల‌ను రంజింప‌జేసి బ్యాక్ టు బ్యాక్ ఓటీటీ హిట్స్ అందుకున్నారు. మొత్తంగా.. క‌థానాయ‌కుడిగా చాలా కాలం త‌రువాత ఐదు వ‌రుస విజ‌యాలు చూశారు విక్ట‌రీ వెంక‌టేశ్. ఈ నేప‌థ్యంలో.. వెంకీ నుంచి రానున్న కొత్త చిత్రం `ఎఫ్ 3`పై ప్ర‌త్యేక ఆస‌క్తి నెల‌కొని ఉంది. `ఎఫ్ 2`కి సీక్వెల్ గా త‌యార‌వుతున్న ఈ హిలేరియ‌స్ ఎంట‌ర్టైన‌ర్ వేస‌వి కానుక‌గా ఏప్రిల్ 28న థియేట‌ర్స్ లోకి రాబోతోంది. మ‌రి.. డ‌బుల్ హ్యాట్రిక్ దిశగా వెంకీ చేస్తున్న ప్ర‌య‌త్నం.. ఏ స్థాయిలో వ‌ర్క‌వుట్ అవుతుందో చూడాలి. కాగా, `దిల్` రాజు నిర్మిస్తున్న `ఎఫ్ 3`ని వ‌రుస విజ‌యాల ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్నాడు.
గ‌త ఏడాది మార్చి సెన్సేష‌న్ `జాతిర‌త్నాలు`లో జంట‌గా న‌టించి ఎంట‌ర్టైన్ చేశారు న‌వీన్ పోలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా. క‌ట్ చేస్తే.. త్వ‌ర‌లో ఈ ఇద్ద‌రు మ‌రోమారు జ‌ట్టుక‌ట్ట‌బోతున్నార‌ని టాలీవుడ్ టాక్. ఆ వివ‌రాల్లోకి వెళితే.. `ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ‌`, `జాతిర‌త్నాలు` వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ త‌రువాత న‌వీన్ పోలిశెట్టి.. రెండు సినిమాల‌ను లైన్ లో పెట్టాడు. అందులో ఒక‌టి యూవీ క్రియేష‌న్స్ నిర్మాణంలో స్టార్ బ్యూటీ అనుష్క‌తో క‌లిసి న‌టించ‌బోతున్న చిత్రం కాగా.. మ‌రొక‌టి సితార ఎంటర్టైన్మెంట్స్ ప‌తాకంపై `అన‌గ‌న‌గా ఒక రాజు` పేరుతో తెర‌కెక్కుతున్న సినిమా. కాగా, క‌ళ్యాణ్ శంక‌ర్ అనే నూత‌న ద‌ర్శ‌కుడు రూపొందించ‌నున్న `అన‌గ‌న‌గా ఒక రాజు`లో `జాతిర‌త్నాలు` భామ ఫ‌రియా అబ్దుల్లా కూడా సంద‌డి చేయ‌నుంద‌ట‌. అయితే, దీనికి సంబంధించి అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. మ‌రి.. `జాతిర‌త్నాలు` జోడీ మ‌రోసారి స‌క్సెస్ అందుకుంటుందో లేదో చూడాలి. ఇదిలా ఉంటే.. `జాతిరత్నాలు` త‌రువాత ఫ‌రియా అబ్దుల్లా `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్`, `బంగార్రాజు` చిత్రాల్లో అతిథిగా మెరిసింది. ప్ర‌స్తుతం మాస్ మ‌హారాజా ర‌వితేజ స‌ర‌స‌న `రావ‌ణాసుర‌` సినిమాలో ఓ హీరోయిన్ గా న‌టిస్తోందీ టాలెంటెడ్ బ్యూటీ.
సీనియ‌ర్ స్టార్ రాజ‌శేఖ‌ర్ ని కొత్త కోణంలో ఆవిష్క‌రించిన చిత్రాల్లో `ఓంకారం` ఒక‌టి. క‌న్న‌డ‌నాట ఘ‌న‌విజ‌యం సాధించిన `ఓమ్`(1995) చిత్రానికి రీమేక్ గా ఈ సినిమా రూపొందింది. మాతృక‌ని తెర‌కెక్కించిన ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు, న‌టుడు ఉపేంద్ర‌.. తెలుగు వెర్ష‌న్ ని కూడా డైరెక్ట్ చేశారు. తెలుగులో ద‌ర్శ‌కుడిగా ఉపేంద్ర‌కిదే మొద‌టి సినిమా కావ‌డం విశేషం. అలాగే ఒరిజ‌న‌ల్ వెర్ష‌న్ లో నాయిక‌గా న‌టించిన ప్రేమ ఇందులోనూ అదే పాత్ర‌లో క‌నిపించ‌గా.. `మైనే ప్యార్ కియా` (తెలుగులో `ప్రేమ పావురాలు`) ఫేమ్ భాగ్య‌శ్రీ  ఓ ముఖ్య పాత్ర‌లో ద‌ర్శ‌న‌మిచ్చారు. ప్ర‌ముఖ న‌టులు జేవీ సోమ‌యాజులు ప్ర‌ధాన పాత్ర పోషించారు. ప్రేమ కోసం గ్యాంగ్ స్ట‌ర్ గా మారిన ఓ యువ‌కుడి క‌థే ఈ `ఓంకారం` చిత్రం. మాతృక స్వ‌ర‌క‌ర్త హంస‌లేఖ బాణీలు సమ‌కూర్చిన ఈ చిత్రంలో `గాన‌గంధ‌ర్వుడు` ఎస్పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం ఆల‌పించిన ``ఓ గులాబీ`` గీతం విశేషాద‌ర‌ణ పొందింది. అలాగే ``కాలేజీ కుర్రోడు``, ``బుల్లెమ్మ``, ``దిల్ రుబా``, ``ఓం బ్ర‌హ్మాండ‌`` పాట‌లు కూడా రంజింప‌జేశాయి. 1997 జ‌న‌వ‌రి 23న విడుద‌లై ఓ వ‌ర్గం ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్న `ఓంకారం`.. ఆదివారంతో పాతికేళ్ళు పూర్తిచేసుకుంటోంది.
  ప‌లు తెలుగు, త‌మిళ చిత్రాల్లో విల‌న్‌గా న‌టించి, ప్రేక్ష‌కుల్లో మంచి గుర్తింపు పొందిన హ‌రీశ్ ఉత్త‌మ‌న్ గురువారం మ‌ల‌యాళం న‌టి చిన్నుకురివిలాను పెళ్లాడాడు. అల‌ప్పుళ జిల్లాలోని మావ‌లిక్క‌ర రిజిస్ట్రార్ ఆఫీసులో వారి వివాహం జ‌రిగింది. ప్ర‌త్యేక వివాహ చ‌ట్టం కింద వారి వివాహాన్ని రిజ‌స్ట‌ర్ చేశారు.  Also read: చైతూతో విడాకుల‌ పోస్ట్‌ను తొల‌గించిన సామ్‌.. ఇద్ద‌రూ మ‌ళ్లీ క‌లుస్తున్నారా? ప‌వ‌ర్‌, జిల్‌, శ్రీ‌మంతుడు, ఎక్స్‌ప్రెస్ రాజా, కృష్ణ‌గాడి వీర‌ప్రేమ‌గాథ‌, దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్‌, జై ల‌వ‌కుశ‌, నా పేరు సూర్య‌, విన‌య విధేయ రామ, నాంది త‌దిత‌ర చిత్రాల‌లో చేసిన నెగ‌టివ్ రోల్స్‌తో హ‌రీశ్ ఉత్త‌మ‌న్ పాపుల‌ర్ అయ్యాడు. ప్ర‌స్తుతం మ‌మ్ముట్టి మ‌ల‌యాళం చిత్రం 'భీష్మ ప‌ర్వం'లో న‌టిస్తున్నాడు. కాగా, నార్త్ 24 క‌థ‌మ్‌, క‌స‌బ‌, లుక్కా చుప్పి వంటి చిత్రాలు చిన్ను కురువిలాకు మంచి పేరు తెచ్చాయి.  Also read: ధ‌నుష్‌, ఐశ్వ‌ర్య‌ను క‌లిపేందుకు ర‌జ‌నీ విఫ‌ల‌య‌త్నం! హ‌రీశ్‌కు ఇది రెండో వివాహం. ఇదివ‌ర‌కు 2018లో మేకప్‌ ఆర్టిస్ట్‌ అమృత కల్యాణ్‌పుర్‌ను పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరి మధ్య క‌ల‌త‌లు చెల‌రేగడంతో ఏడాదికే విడిపోయారు.
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల క్రతువు ముగిసింది. ఈ నెల 9వ తేదీన మొదలైన పోలింగ్, ఆదివారం జరిగిన నాల్గవ విడత పోలింగ్ తో ముగిసింది. ఇంచుమించుగా సంవత్సరంపాటు సాగిన పంచయతీ వివాదం చివరాఖరుకు ఆల్ ఈజ్ వెల్ దట్ ఎండ్స్ వెల్ అన్నట్లుగా మొత్తం 10,890 సర్పంచ్ స్థానాలకు జరిగిన ఎన్నికల పోలింగ్ చాలా వరకు ప్రశాంతంగా జరిగాయి.   ఈ ఎన్నికలలో ఎవరు గెలిచారు,ఎవరు ఓడిపోయారు అనే విషయాన్నిపక్కన పెడితే  కొవిడ్ భయాన్ని, ఇతరత్రా ఎదురైన సమస్యలను పక్కన పెట్టి, గ్రామీణ ఓటర్లు, ప్రజాస్వామ్య స్పూర్తిని పుష్కలంగా కురిపించారు. నాలుగు దశల్లో పోలింగ్ జరిగితే, ప్రతి దశలోనూ ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్’లో పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే 80.14 శాతం ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఒక్క విజయనగరం జిల్లా మినహా మరే జిల్లాలోనూ పోలింగ్ 70 శాతానికి తగ్గలేదు.ఇది ఒక విధంగా, పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ ఓటు వేసేందుకు బద్దకించే, చదువుకున్నాళ్ళకు, మంచి  గుణ పాఠం.  పంచాయతీ ఎన్నికల్లో పార్టీలు, జెండాల ప్రమేయం ఉండదు.. ఉండ కూడదు. అయినా అన్నిరాజకీయ పార్టీలు పంచాయతీ పోరును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ఎన్నికలు ఆపించేందుకు శత విధాల ప్రయత్నించి విఫలమైన అధికార పార్టీ గెలిచినాళ్ళు అందరూ మావాళ్ళు అంటూ .. గెలుపు గ్రాఫ్ ను పైపైకి పట్టుకు పోయింది. అలాగని మెజారిటీ పంచాయతీలను అధికార పార్టీమద్దతుదారులు గెలవలేదని కాదు. అధికార పార్టీ మద్దతుదారులే అధిక పంచయతీలలో జెండా ఎగరేశారు. అందులో సందేహంలేదు. అలాగే ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ కూడా కుప్పంలో ఓటమి లాంటి కొన్ని గట్టి ఎదురుదెబ్బలు తిన్నా, ప్రధాన పతిపక్ష హోదాను నిలుపుకుంది.  తెలంగాణలో ఇటీవల జరిగిన దుబ్బాక ఉపఎన్నిక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో, ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి అధికార తెరాసకు ప్రధాన ప్రత్యర్ధిగా నిలిచిన బీజేపీ, ఏపీలోనూ  తెలుగు దేశం పార్టీని ప్రధాన ప్రత్యర్ధి స్థానం నుంచి పక్కకు నెట్టాలనే ప్రయత్నం చేసింది కానీ, ఫలితం దక్కలేదు. చంద్రబాబు నాయకత్వం, తెలుగు దేశం పార్టీకి ఉన్న సంస్థాగత బలం ముందు బీజేపీ వ్యూహాలు ఫలించలేదు, ఒకవిధంగా బెజేపీ మిత్రపక్షం, జనసేన కొంతలో కొంత మెరుగైన ఫలితాలు సాధించింది.  అయితే ఈ ఎన్నికలు, ఎన్నికల ఫలితాలు రాష్ట్రంలో పార్టీల బలాబలాకు నిదర్శనమా అంటే కాదు. పంచాయతీ ఎన్నికలు పక్కా లోకల్ ఎన్నికలు, పైగా పార్టీల పాత్రా, ప్రమేయం ఏ మాత్రం ఉండని ఎన్నికలు. సో .. ఈ ఎన్నికల ఫలితాలు రాజకీయ పార్టీల బలాబలాలకు ప్రామాణికం కాదు. వచ్చే నెల 10 తేదీన జరిగే నగర పంచాయతీ, పురపాలక సంఘాల ఎన్నికలు, పార్టీ గుర్తులపై జరుగుతాయి. సో ..వచ్చే నెల 14 వరకు ఆగితే, పురపాలక సంఘాల ఎన్నికలఫలితాలు వస్తాయి. పార్టీల బలాబలాలు, రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం స్పష్ట మవుతుంది.  అయితే పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబదించినంతవరకు రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఎవరైనా అభినందించక తప్పదు. కోర్టు చిక్కులు, ప్రభుత్వ సహాయ నిరాకరణ, నిధుల కొరత, సమయం తక్కువ కావడం ఇలా అనేక అవరోధాలు ఎదురైనా, ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల కమమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్,  స్థితప్రజ్ఞత చూపారు. అందుకు ఆయన్ని, రాజకీయ పార్టీలు ఎంతగా రచ్చచేసినా,పవిత్ర హక్కును అంతే పవిత్రంగా  పవిత్రంగా వినియోగించుకున్న ఓటర్లను అభినందించక తప్పదు.     అయినా  ఈ ఎన్నికలలో గత 2013పంచాయతీ ఎన్నికల్లో కంటే ఏకాగ్రీవలు ఎక్కువయ్యాయి. గత ఎన్నికల్లో మొత్తం 13 జిల్లాలలో కలిపి, 1,835 గ్రామ సర్పంచ్ పదవులు ఏకగ్రీవం అయితే, ఈ ఎన్నికల్లో 2,197 గ్రామపంచాయతీలు ఏకాగ్రీవ మయ్యాయి.  సజావుగా, సక్రమంగా ఏకాగ్రీవాలు జరిగితే అది అభినందనీయమే, అయినా, ప్రలోభాలకు గురిచేసి సాగించిన బలవంతపు ఏకాగ్రీవాలే ఎక్కువకావడం ... అభ్యతరకరమే.  
  మన వ్యక్తిత్వం ఎలాంటిదో... మనం ఎంచుకునే వస్తువులు కొంతమేరకు ప్రతిబింబిస్తాయి. పెర్‌ఫ్యూమ్‌కి (perfume) కూడా ఈ సూత్రం వర్తిస్తుందంటున్నారు నిపుణులు. మన మనసుకి దగ్గరగా ఉన్న పరిమళాలనే ఎన్నుకొంటామని వాదిస్తున్నారు. Paul Jellinek అనే ఆయన ప్రాచీన గ్రంథాలన్నీ తిరగతోడి పరిమళాలను నాలుగు రకాలుగా విభజించారు.   AIR:-  నిమ్మ, జామాయిల్ వంటి చెట్ల నుంచి తయారుచేసే పరిమళాలు ఈ విభాగానికి వస్తాయట. ఇలాంటి పరిమళాలు మనలోని సృజనకు పదునుపెడతాయంటున్నారు. మానసికంగా దృఢంగా ఉండేవారు, నలుగురిలో కలిసే చొరవ ఉన్నవారు ఇలాంటి పరిమళాలను ఎన్నుకొంటారట. ఇలాంటివారు కొత్తదారులను వెతుకుతారనీ, తమ మనసులో మాటని నిర్భయంగా పంచుకుంటారనీ చెబుతున్నారు. ఇతరులని మందుకు నడిపించడంలోనూ, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించడంలోనూ వీరు ముందుంటారట. FIRE:- ముక్కుపుటాలు అదిరిపోయేలా ఘాటైన పరిమళాలు ఈ విభాగం కిందకి వస్తాయి. ఈ తరహా పరిమళాలను ఎన్నుకొనేవారు కొత్త కొత్త ఆలోచనలతో ముందకెళ్తుంటారు. కానీ ఒకోసారి తమ సామర్థ్యాన్ని మించిన లక్ష్యాన్ని ఎన్నుకొని భంగపడుతూ ఉంటారు. వీరి వ్యక్తిత్వం ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ... ఇతరులు తన గురించి ఏమనుకుంటున్నారో అనే పట్టింపు కానీ, ఇతరుల దృష్టిని ఆకర్షించాలన్న తపన కానీ వీరిలో కనిపించవు.   WATER:- గులాబీలవంటి సున్నితమైన పరిమళాలను ఇష్టపడేవారు ఈ విభాగానికి చెందుతారు. మానసికంగా ఎప్పుడూ సందిగ్ధావస్థలో ఉండేవారు ఇలాంటి పరిమళాలను ఇష్టపడతారట. వీరి స్వభావం, నిర్ణయాలు ఎప్పుడెలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. ప్రవహించే నీటిలాగా వీరు దేనినీ పట్టించుకోనట్లు కనిపించినా... తమ కుటుంబాలు, పిల్లలకు మాత్రం చాలా ప్రాధాన్యతని ఇస్తారట.   EARTH:- తియ్యటి పదార్థాలను పోలిన పరిమళాలు ఈ కోవకి చెందుతాయి. ఇలాంటి పరిమళాలను ఇష్టపడేవారు చాలా ప్రాక్టికల్‌గా ఉంటారట. గాలిలో మేడలు కట్టడం వీరి స్వభావానికి విరుద్ధం. లోకాన్నీ, తన వ్యక్తిత్వాన్నీ ఉన్నది ఉన్నట్లుగా గ్రహించే నైపుణ్యం వీరి సొంతం. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా తట్టుకుని నిలబడేందుకు వీరు సదా సిద్ధంగా ఉంటారు. ఇవీ Paul Jellinek చేసి తీర్మానాలు. ఆయన చెప్పినంత మాత్రాన మనం వాడే పర్‌ఫ్యూమ్‌ ఖచ్చితంగా మన వ్యక్తిత్వాన్ని ప్రతిబిస్తుందని అనుకోలేం. ముఖ్యంగా మనలాంటి మధ్యతరగతి ప్రజలు 1+1 ఆఫర్‌ ఉందనో, కొత్త పెర్‌ఫ్యూమ్‌ మార్కెట్లోకి వచ్చిందనో, పక్కవాళ్లు కొనుక్కున్నారనో... పెర్‌ఫ్యూమ్స్ వాడేస్తుంటారు. కాకపోతే సరదాగా కాసేపు బేరీజు వేసుకోవడం కోసం పైన పేర్కొన్న లక్షణాలని చదువుకోవచ్చు.           
హిమాలయాలకు ఉన్న ఖ్యాతి ఎంతటిదో అందరికీ తెలిసిందే. ఎంతో విస్తృతంగా వ్యాప్తి చెందిన శిఖరాలు ఇవి. భారతదేశానికి పెట్టు గోడల్లా రక్షిస్తున్నాయి హిమాలయాలు. భారతదేశాన్ని బ్రిటీష్ వాళ్ళు తమ ఉక్కు గుప్పిళ్లలో బంధించి, బానిసత్వాన్ని శాసించినపుడు, ఏళ్లకేళ్లుగా పోరాటాలు జరుగుతున్నా గొంతెత్తి గర్జించిన నాయకులు కొందరే ఉన్నారు. అలాంటి సాహసవంతమైన నాయకులలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూడా ఒకరు. నేతాజీ అని బోస్ అనీ ముద్దుగా అందరూ పిలుచుకునే సుభాష్ చంద్రబోస్ భారతీయ యువతకు బహుప్రియమైన నాయకుడు. ఉన్నత విద్యావంతుడూ, గొప్ప ఆలోచన, నేర్పయిన  వ్యూహాలు అందించగల సుభాష్ చంద్రబోస్ దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడం కోసం ఎన్నో గొప్ప ప్రణాళికలతో, వ్యూహాలతో ముందుకెళ్లారు.  బాల్యం!! బోస్ సంపన్నమైన కుటుంబంలో జన్మించారు. అందువల్ల బాల్యంలో ఇబ్బందులేవీ ఆయన్ను వెంటాడలేదు. తండ్రి లాయర్ కావడంతో మంచి జీవితం, ఉన్నత విద్య బోస్ కు లభించాయి. ఈయన తండ్రి కూడా జాతీయవాది కావడంతో ఆ ప్రభావం బోస్ పై ఆ నాటి నుండి పడిందని చెప్పవచ్చు. పాఠశాల, కాలేజీ విద్యలో ఎంతో మంచి విద్యార్థిగా నిలిచాడు బోస్. ఇరవై మూడు సంవత్సరాల వయసులో ఎంతో ఉన్నతమైన భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షలు రాసి నాలుగవ స్థానంలో నిలిచారు. అంత సాధించినా భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనే ఆలోచనతో ఆ సివిల్ సర్వీస్ నుండి బయటకొచ్చేసాడు. భారతజాతీయ యువజన విభాగంలో ఎంతో చురుకైన పాత్ర పోషించారు బోస్. అణిచివేత!! బోస్ లో ఉన్న ఉద్యమ స్ఫూర్తి ఎంతో గొప్పది. దేశానికి స్వాతంత్య్రం తీసుకురావాలనే ఆలోచనతో ఎంతో తెలివిగా ప్రణాళికలు రచించేవారు. అందులో భాగంగానే సాయుధ పోరాటంతో బ్రిటీష్ వాళ్ళను ఎదిరిస్తే స్వాతంత్య్రం తప్పక వస్తుందని భావించి అటువైపు ఎన్నో ప్రయత్నాలు చేసారు. అయితే ప్రతిచోటా ప్రతిభ కలిగిన వారిని అణిచివేసి పలితాన్ని తమ పేరుతో చూసుకోవాలనుకునే వాళ్ళు కొందరు ఉంటారు. అలాంటి వాళ్ళ ద్వారా అణిచివేత మొదలయ్యింది. అతివాదంలో అంతరార్థం!! నిజానికి స్వాతంత్ర్య ఉద్యమంలో అతివాదులు, మితవాదులు అంటూ రెండు వర్గాలుగా చేసి ఎందరో నిజమైన నాయకులను అణిచివేసిన ఘనత, స్వాతంత్ర్య ప్రాముఖ్యతను తమ ఖాతాలో వేసుకున్న భారత నాయకులు ఉన్నారు. వాళ్ళందరి ఆలోచనల వెనుక స్వార్థమో, స్వలాభాపేక్షో బోలెడు ఉందని ఈ భారతంలో ఇంకా తెలుసుకోలేని మూర్ఖులు అంటూ ఎవరూ లేరనే అనుకోవచ్చు. నిజానికి వారసత్వ రాజకీయం భారతదేశంలో మొదలయ్యిందే ఆ స్వాతంత్ర్య ఫలితంలో అని కూడా అందరికీ తెలుసు. నిందలు, విమర్శలు!! భారగదేశ స్వాతంత్య్రం కోసం బ్రిటిష్ కు శతృదేశాలను కలుపుకుని సాయుధ పోరాటానికి సిద్ధం కావాలని ఎన్నో ప్రణాళికలు వేసాడు బోస్. అయితే ఇది ఆయన మీద నిందలకు, విమర్శలకు దారి తీసింది. కొందరు మూర్ఖులు అవలంభిస్తున్న మార్గానికి ఇది వ్యతిరేకమని, గట్టిగా మాట్లాడేవారిని అతివాదులని అణిచివేస్తూ బోస్ ను కూడా వెనక్కు నెట్టిన చేతులు ఎన్నో ఉన్నాయి.  జైహింద్ నినాదమొక సింహగర్జన!! భారత్ యావత్తును ఉపేసిన నినాదం "జైహింద్". భారత యువతను చైతన్యపరిచి స్వాతంత్ర్య సంగ్రామనికి పిలుపునిచ్చిన శక్తి తేజం ఈ మాట. అది బోస్ గొంతు నుండి వింటే ఒకానొక సింహగర్జన దేశమంతా ధ్వనించినట్టే ఉండేదట. దేశాన్ని దేదీప్యమానంగా వెలిగింపజేయాలని ఆరాటపడిన బోస్ కు మాత్రం  దేశ బహిష్కరణ, దేశం నుండి వ్యతిరేకతలే లభించిన బహుమానాలు అనిపిస్తాయి. అడుగడుగునా అన్యాయం!! భారతజాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రెండు సార్లు ఎన్నికైనా ఆయన ఆ పదవిని వదిలేసుకున్నారు. దీనికి కారణం గాంధీ అనే విషయం అందరికీ తెలిసిందే. నేతాజీ చేసే ప్రతి పనీ మీద వ్యతిరేకత చూపించి ఆయన్ను పూర్తిగా భారతదేశ ఉనికి నుండి తప్పించాలని చూసింది కూడా వీళ్లే. చివరకు బోస్ చనిపోతే "సుభాష్ చంద్రబోస్ చాలా బాగా చనిపోయారు" అంటూ స్టేట్మెంట్ లు ఇచ్చింది కూడా ఆ అహింసా వాది, దేశ స్వతంత్ర్యాన్ని బ్రిటీష్ వారి నుండి తన గుప్పెట్లో పెట్టుకున్న వారే.  కానీ చరిత్రలో ఎక్కడో నాలుగు పేజీలలో నిలిచిపోయిన ఈ సత్యాలు నేటి భారత పౌరులకు అక్కర్లేదంటూ ప్రభుత్వమే తమ వంశాలకు అనుగుణంగా పాఠాలను కూడా తయారు చేయించి దశాబ్దాల పాటు పౌరుల బాల్యం నుండే స్వతంత్ర్యానికి చిరునామాగా నిలుస్తూ ప్రతి బడిలోనూ పూజించబడుతూ ఉన్నాయి. నిజమైన నాయకుల జీవితాలు తెలుసుకోవలసిన బాధ్యత అందరిమీదా ఉంది. చివరకు మరణం కూడా ఒకానొక మిస్టరీగా మిగిలిపోయిన బోస్ లాంటి వీరులను భారతం స్మరించుకోవాలి. ఆ హిమశిఖరాలకు, ఈ భూమికి, నదీనదాలకు తెలిసిన నిజం మనకూ తెలియాలి. ◆ వెంకటేష్ పువ్వాడ
  అదేపనిగా టీవి చూడటంలో మునిగిపోతున్నారా? అయితే మీరు తాజాగా వెలుగుచూసిన ఓ సర్వే వివరాలు తెలుసుకోవాల్సిందే. మేరీ ల్యాండ్ విశ్వవిద్యాలయం నలబై వేలమందితో చేసిన అధ్యయనం ఆసక్తిగొలిపే విషయాలను బయటపెట్టింది. వివిధ రకాల సమస్యలు, కోరికలుండి అవి తీరక అసంతృప్తితో ఉన్నవారు అధికంగా టీవి చుస్తుంటారని ఆ సర్వే వెల్లడించింది. ఆనందంగా ఉదేవారు టీవి చూసే గంటలతో పోల్చినపుడు అసంతృప్తిపరులు 30 శాతం అధికంగా కార్యక్రమాల విక్షణకు కేటాయిస్త్రున్నారు. తాత్కాలికంగా ఇది మనసుకు ఊరటనిచినప్పటికి దీర్ఘకాలంలో తీవ్ర నిరాశకు గురి చేస్తుందనేది సారాంశం. ఈ అసంతృప్తికి దూరం కావడం ఎలా అనేది దాన్లోనే బయటపడింది. పుస్తకాలు చదవడం ,స్నేహితులతో కాలక్షేపం చేయడం చక్కటి లైంగిక సంబంధాలు కలిగి ఉండటంవంటివి ఆనందానికి అసలైన మార్గాలని సర్వేలో పాల్గొన్న వారు తేల్చి చెప్పారు.
  వాషింగ్ టన్ లో పిల్లలను ను వణికిస్తున్న ఒమైక్రాన్..... యుఎస్ లో 95 మిలియన్ల పిల్లలు ఒమైక్రాన్ బారిన పడ్డారని అకాడమి అఫ్ పిరియాట్రిక్స్ వెల్లడించింది. ఆసంస్థ అందించిన డాటా ప్రకారం 9,45 2 ,49 కేసులు నమోదు అయినట్లు వెల్లడించారు.వాషింగ్ టన్ లో9.5 మిలియన్ల పిల్లలు పరీక్షలు నిర్వహించగా పోజిటివ్ వచ్చిందని పిల్లలలో కోరోనా కేసులు పెరగడం పట్ల ఆందోళన కలిగిస్తుంది. తాజా సమాచారం ప్రాకారం అకాడమి ఆఫ్ పిడియాట్రిక్స్ఆసుపత్రిలో 9,452,49 కోవిడ్ కేసులు దేశ వ్యాప్తంగా నామోదు అయినట్లు తెలుస్తోంది. ఇందులో 17.8 % ఖచ్చితమైనవని మొత్తం 1౦౦ ,౦౦౦ పిల్లలో 12,589 కేసులు అంచనా . గతవారంలో నమోదుకాగా దాదాపు ఒక మిలియన్ పిల్లలకు సోకి ఉండవచ్చని గతంలోచలికాలం తో పోలిస్తే ఇది చాలా అత్యదికమని. వారం వారం 69% పెరుగుదల దీని సంఖ్య 5,8౦, ౦౦౦ కు చేరింది. ఇంకా మరింత పూర్తి సమాచారం అందాల్సి ఉంది. వివిదవయస్సుల వారి వివరాలు వ్యాదితీవ్రత, ఏ వేరియంట్ దీర్ఘకాలిక, అనారోగ్యం సమస్యలు వాటి ప్రభావం వివరాలు అందాల్సి ఉంది. ప్రస్తుతం ప్యాండమిక్ఉన్నందున వాటిని అత్యవసరంగా గుర్తించడం అవసరం. దీర్ఘకాలిక ప్రభావం మానసికంగా, ఉండరాదన్నది సామాజికంగా ఉండరాదన్నది నిపుణుల భావన. ఒమైక్రాన్ వల్ల పిల్లల అనారోగ్యం పై ప్రభావం... ఎవరైతే పిల్లలు వ్యాక్సిన్ వేసుకోలేదో వారి పై తీవ్రప్రభావం ఉంటుందని కేంబ్రిడ్జ్ వైరాలజిస్ట్ రవీంద్ర గుప్తా వెల్లడించారు.ఒమైక్రాన్ బారినుండి తప్పించుకోవాలంటే మూడవ డోస్ అవసరమని అన్నారు. వ్యాక్సిన్ మూడవ డోస్ ఇమ్యునిటీ పెంచుకోవడం ఒక్కటే మార్గం. వ్యాక్సినేషన్ వేసుకున్న వేరియంట్ దాని వేషాలురూపాలు మార్చుకుంటుంది. భారత్ లో ఇతర దేశాలలో తీవ్రప్రభావం చూపుతోంది. పిల్లలు అనారోగ్యం పాలవుతున్నారనికేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యుట్ ఆఫ్ తిరాప్యుటిక్ ఇమ్యునాలాజీ ఇన్ఫెక్షన్ డిసీజ్ ప్రోఫెసర్ క్లినికల్ మైక్రో బయాలజీ రవీంద్ర గుప్తా వివరించారు. కాగా వ్యాక్సినేషన్ వేసుకో కుంటే వ్యాధి తీవ్రత తట్టుకోవడం కాష్టమని అన్నారు. వైరస్ ను ఎదుర్కోవాలంటే వ్యాక్సిన్ తప్పనిసరి ఒమైక్రాన్ సహజమైన వ్యాక్సిన్ కన్నా ప్రమాదకరం ఒమైక్రాన్ ఇన్ఫెక్షన్ గురించి పూర్తిగా తెలియదని గుప్తా స్పష్టం చేసారు.  పిల్లలలో ఓఒపిరితిత్తుల నాళా లలో పైభాగంలో ఇన్ఫెక్షన్ ఇతర అనారోగ్య సమస్యలు మరణాలు ఇప్పటివరకూ చూడలేదు.అని గుప్తా స్పష్టం చేసారు. ఒమైక్రాన్ వేరియంట్ పై బయాలాజికల్ పరిశోదన చేస్తున్నామని డెల్టాకు, ఒమైక్రాన్ కు మధ్య పొంతన ఏమిటి అన్న విషయాన్ని తెలుసుకునే ప్రయాత్నంలో ఉన్నామని.ట్రాన్స్ మేమ్బ్రీన్ ప్రోటీన్ కు భిన్నంగా ఒమైక్రాన్ వ్యవహరిస్తోంది. అవి ఊపిరి తిత్తుల్లో పై భాగం లో లేదా కింది భాగం లో ఉంటాయి.వారిలో నిమోనియా వచ్చే అవకాసాలు తక్కువే అను గుప్తా వివరించారు. పిల్లలు అసిపాత్రులలో చేరడానికి కారణాలు వివరిస్తూ పిల్లల శ్వాస నాళాలు చాలా చిన్నవిగా సన్నగా ఉండడం అనాళా లలో ఇంఫ్లా మేషన్ ముక్కు గొంతు లో ఉన్నందున పిల్లలు ఇబ్బందులు పడతరాని అందుకే తల్లి తండ్రులు పిల్లల్ని ఆసుపత్రులలో చేరుస్తున్నారని రవీంద్ర గుప్తా విశ్లేషించారు.
  ఒమైక్రాన్ తీవ్రత తక్కువే అంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఖండించిన డబ్ల్యు హెచ్ ఓ...ఒమైక్రాన్ ఈ పేరు వింటేనే ప్రపంచ దేశాలు గజ గాజా వణికి పోతున్నాయి. అయితేనవంబర్ లో  సౌత్ ఆఫ్రికాలో వెలుగు చూసిన  ఒమైక్రాన్ వేరియంట్  ప్రభావం తీవ్రంగా ఉండదని తక్కువేఅని, అయితే వ్యాప్తి త్వరిత గతిన విస్తరిస్తుందని నిపుణులు చేసిన సూచనలు అసంబద్దమని ప్రజలను తప్పుదారి పట్టించవద్దని ఒమైక్రాన్ ప్రపంచాన్ని ఒక ఆదుకుంటుందని తీవ్రంగా ప్రభావం చూపుతున్న వేరియంట్ ప్రభావం తక్కువేంటూ చేస్తున్న ప్రచారాన్ని డబ్ల్యు హెచ్ ఓ ఖండించింది.  ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం మీద ఒమైక్రాన్ తన ప్రతాపం చూపిస్తోందని కొన్ని ప్రభుత్వాలు ఇప్పటికే ఆంక్షలు అమలు చేస్తున్నాయి. వేరియంట్ త్వరితంగా వ్యాపిస్తున్నందున  వ్యాక్సిన్లు వేయించుకోవాలని సూచించారు. కోవిడ్19 ముప్పు తొలగి పోలేదని ఇప్పటికే ఫ్రాన్స్, జర్మని,బ్రజిల్ లో 24 గం కొత్తరికార్డులు నమోదు చేస్తున్నాయని అన్నారు. వేగంగా విస్తరించే లక్షణం ఉన్న ఒమైక్రాన్ ప్రపంచం మొత్తం చుట్టేస్తోందని ప్యాన్దమిక్ ఇప్పుడు ఇక్కడా ఉందని తదనంతరం ఎవరిని కాటేస్తుందో చెప్పలేమని ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యక్షుడు అధ్నం గేబ్రిఎసిస్ జెనీవాలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో మాట్లాడుతూ ఇప్పటికే యూరోప్ లో ఒమైక్రాన్ ప్రామాడ ఘంటికలు మొగిస్తోందని. జర్మనీలో 1౦౦,౦౦౦ కు పైగా కేసులు చేరాయనిఅన్నారు. ఫ్రాన్స్లో ఇప్పటికే హాఫ్ మిలియన్ కేసులు చేరాయని గేబ్రియసిస్ ఆందోళన వ్యక్తం చేసారు.  ఓమైక్రాన్ ప్రభావం తక్కువే అని చేస్తున్న ప్రచారాన్ని అద్నం గేబ్రియసిస్ తీవ్రంగా ఖండించారు. ఒమైక్రాన్ చాలా ప్రభావ వంతంగా సాగుతోంది. లాటిన్ అమెరిక, తూర్పు ఆశియా,దక్షిణ ఆఫ్రికాలో  నవంబర్ లో కనుగొన్న విషయాన్ని అద్నం గుర్తుచేశారు. ఒమైక్రాన్ ప్రభావం తీవ్రత అంటే ఎలాగుర్తిస్తారు ?.... ఒమైక్రాన్ తీవ్రత తక్కువగా ఉందా,? ఎక్కువగా ఉందా ? లేదా అవేరేజ్ గా ఉందా ? మామూలుగా ఉందా ? అని చేస్తున్న ప్రకటనలు వ్యాధిపట్ల ప్రజలు అయోమయానికి గురిచేస్తున్నారని, అంటే తప్పు దారి పట్టించడం సరికాదని పేర్కొన్నారు   యూరప్ లో గత వారం... గతవారం లో యూరప్ లో 5 మిలియన్ల కేసులు ఉన్నాయని.డబ్యు హెచ్ ఓ అంచనా ప్రకారం యూరప్ లో సగ భాగం ఒమైక్రాన్ తాకే అవకాశం ఉందని హెచ్కారించారు.మార్చి నాటికి ఆసుపత్రులు యూరప్ ఖండం నిన్దిపోవచ్చని అభిప్రాయం వ్యక్తం చేసారు. జర్మనీలో 112,323 కేసులు 239 మరణాలు జరిగాయని అధికారులు వెల్లడించారు. ఒమైక్రాన్ వల్ల 7౦% పైగా ఇన్ఫెక్షన్లు పెరగడం పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసారు. ఒమైక్రాన్ ఉప్పెన ప్రభావం తో జర్మని, బ్రజిల్, ఒలాఫ్ స్చూల్జ్  తప్పనిసరిగా వ్యాక్సినేషన్ ద్వారా ఇమ్యునిటి పెంచు కోవాలని ప్రజలకు సూచించారు. ఇతర యూరప్ దేశాలలో ఒమైక్రాన్ పొరుగున ఉన్న ఫ్రాన్స్ లో ఒమైక్రాన్ 3౦౦,౦౦౦ రోజు పెరుగుతున్నాయనిపేర్కొన్నారు.  ఫ్రాన్స్ లో ప్రజా ఆరోగ్యం తాజా గణాంకాల ప్రకారం 464 ,769 కొత్త కేసులు 24 గంటలలో నమోదు కావడం ఆందోళన కలిగించే అంశంగా అధికారులు పేర్కొన్నారు. చైనా లో ద్వితీయ వార్షి కొత్సవ వేడుకల ప్రకటన తరువాత కోవిడ్ తో ఒకరు  మరణించినట్లు అధికారవర్గాలకు సమాచారం యూరప్​ పర్యాటకరంగం -ప్రభావం... ప్రపంచ పర్యాటకరంగం యూరప్ పై ఆధార పడి  ఉందనికాగా జనవరి 11,2౦2౦ ప్యాండమిక్ లో 5. 5 మిలియన్లు  గా ఉంది యూరప్ పర్యాటక రంగం పైనే ప్రపంచ పర్యాటక రంగం అభివృధీ ఆధార పది ఉందని వేదే సి పర్యాటకులు రారని ప్యాండమిక్ లెవెల్ తగ్గే వరకు 2౦ 24 వరకు 2౦24 వరకు కొనసాగితే పర్యాటకం కుప్ప కూలినట్లే అని అంచనా. బ్రెజిల్ రికార్డ్ స్థాయి లో రోజు వారి కేసులలో 1,37,౦౦౦ కేసులు పెరిగాయని తెలిపారు. బ్రజిల్ లో ఎన్నడు లేని విధంగా రెండవ దశ కోవిడ్ ప్రభావం తో రోజుకు 4,౦౦౦ మరణాలు చోటు చేసుకున్నాయి. ప్రపంచం లో అత్యధిక మరణాలు జరిగిన దేశాల్ జాబితాలో రెండవ స్థానం సొంతం చేసుకుంది.  కోరోనా ప్రభావం ఆదేశంలో త్వరలో జరగనున్న ఎన్నికల పై ప్రభావం చూపుతుందని తెలుస్తోంది.ఒమైక్రాన్ ప్యాం డమిక్ ను ఎదుర్కోడం లో అధ్యక్షుడు జలిస్ బోల్సోనోరో కు కత్తిమీద సాములా మారింది.ఆక్టోబర్ ఎన్నికలో పదవీగండం పొంచి ఉందనేది అంచనా ఆశియాలో జపాన్ భారత్ లో క్వాసి ఎమర్జెన్సీజాగ్రతలు చర్యలు జనవరి 21 ఫిబ్రవరి 13 వరకు మయాజీవా కోరోనా ప్రభావిత సహాయక శాఖకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు. అయితే డబ్ల్యు హెచ్ ఓ ప్రకటన తరువాత ప్రపంచ దేశాలు అప్రమత్తమై ఒమైక్రాన్ భారిన పడకుండా బయట పదాలని ఆశిద్దాం. అసలు కోరోనా కోరోనానుకు అంతం సాధ్యం కాదా దీర్ఘాకాలాం వ్యాక్సి తీసుకుంటూ ఉండాలా అన్నదే ప్రజల సందేహం. కోరోనాది సుదీర్ఘ ప్రస్థాన మేనా ?  
  అదే ఇందులో ట్విస్ట్  కోవిడ్ ముందు కోవిడ్ తరువాత మనకు తల నొప్పులు మరీ ఎక్కువయ్యాయి.ఈ మధ్య కాలం లో కోవిడ్ తరువాత,మూడవ విడత కోవిడ్ లో ముఖ్యంగా కోవిడ్ తీవ్రత పెద్దగ లేక పోయినా శరీరం మొత్తం తీవ్రమైన నొప్పులతో బాధ పడుతున్నారని వైద్యులు చెపుతున్నారు.  కాగా తీవ్రమైన తల నొప్పి బాదిస్తూ ఉండడం తో అది ఒమైక్రాన్ లక్షణమా అని కొందరిలో సందేహం వ్యక్త మౌతోంది. పోస్ట్ కోవిడ్ తరువాత కొందరిలో తీవ్రమైన తల నొప్పితో బాధ పడ్డవారిని పరీక్షించగా కొందరిలో మెదడులో రక్తనాళాలు గడ్డ కట్టా యని దానివల్ల కొందరిలో తలనొప్పి ఉన్నట్లు గుర్తించారు. కాగా ఇంకొందరిలో బ్రెయిన్ లో ఇన్ఫెక్షన్ సోకినట్లు గుర్తించారు ఇలా రక్త నాళాలు చిట్లే ప్రమాదం ఉందని. రక్తం గడ్డ కట్టిన  వాళ్ళ లో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉందని. నిపుణులు తమ పరిశోదనలో వెల్లడించారు. రక్తం గడ్డ కట్టిన వాళ్ళ లో,బి పి, పెరిగితే గుండె పోటు వచ్చే అవకాసం ఉందనిడానికి తోడు పక్షవాతం వస్తే పరిస్థితి మరింత తీవ్రంగా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తునారు.ఒకవేళ గతం లో మీరు హై బిపి లేదా  మెదడు కు సంబందించిన సమస్యలు ఉంటె అప్రమత్తం గా ఉండాలని హెచ్చరించారు. ముఖ్యంగా చలిగాలులు ఎక్కువగా ఉండే శీతల ప్రాంతాల లో ఉన్న వారిలో రక్త ప్రసారంలో హెచ్చుతగ్గులు ఉంటాయని దీనికారణంగా ఒక్కోసారి రక్త ప్రసారం మెదడుకు అందక పోవడం, కాగా రక్తం చిక్కగా మారడం వల్ల మరిన్ని  సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు సూచించారు.  ఇక ఇటీవలి కాలంలో ఎక్కువమందిలో ఎడమవైపు మాత్రమే తలనొప్పి రావడం గమనించినట్లు  ఒక పరిశోదన వెల్లడించింది. ఎడమ వైపు తల నొప్పి రావడానికి గల కారణాలు చికిత్సలు ఉన్నాయి. చికిత్సల ద్వారా వ్యక్తికి తల నొప్పి రాకుండా కాపాడుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా 5౦% మంది పెద్ద వాళ్ళ లో తల నొప్పి సమస్యలు ఎదుర్కుంటూ ఉంటారు. కొన్ని చిన్న చిన్న తల నొప్పులు ఇంట్లో చిత్కాలా తో పోగొట్టుకోవచ్చు. ఒక వ్యక్తికి అనుకోకుండా తీవ్రమైన తల నొప్పి నీరసం అలసట శరీరంలో ఒకవైపు మాత్రమే ఉందా అన్న విషయం లో గందర గోళానికి గురి అవుతున్నారు రోగులు. ఇందులో తల నొప్పి లక్షణాలు...చికిత్స ... తల నొప్పి కేవలం ఎడమ వైపు మాత్రమే ఉంటె తక్షణ చికిత్స అవసరం ఒక వ్యక్తికి అనుకోకుండా తీవ్రమైన తీవ్రమైన తల నొప్పి అలసట నీరసం శరీరం ఒకవైపు ఉంటె డాక్టర్ ను ఎప్పుడు  సంప్రదించాలో తెలియ చేస్తుంది.  తల నొప్పుల్లో రకాలు... వివిధ కారణాల వల్ల ఎడమవైపు మాత్రమే తల నొప్పి వస్తుంది. అది మైగ్రిన్ కవచ్చు సహజం గా వైద్యులు తల నోప్పిని  ప్రాధమిక స్థాయిలో రెండవ స్థాయి,లేదా తీవ్ర స్తాయ్గా వర్గీకరించారు. ప్రాధమిక స్థాయిలో తల నొప్పి ప్రాధాన లక్షణం రెండవ దశ తల నొప్పి మరో అనారోగ్య సమాస్య కు కారణం కావచ్చు.  1)బ్రెయిన్ ట్యూమర్ లేదా కణిత లు  2) బ్రెయిన్ స్ట్రోక్  3) ఇన్ఫెక్షన్  తల నొప్పి ఎక్కడైనా రావచ్చు. ఎడమవైపు 11 రకాల తల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.మైగ్రైన్ ... మై గ్రైన్ సమస్యతో బాధ వారు తీవ్రమైన తల నొప్పి ఎడమ వైపు వస్తుంది. యు కే లో 12%అందులో  స్త్రీలలో 5 % పురుషులు!% మైగ్రైన్ తలనొప్పి ఒకవైపు అదీ తీవ్రంగా రావడం నొప్పి కంటి చుట్టూ రావడం తల మొత్తం వ్యాపించడం గమనించవచ్చు. మైగ్రైన్ వల్ల ప్రభావం...కంటి చూపులో మార్పులు వస్తాయి. వాంతులతో తీవ్ర ఇబ్బందులు పడతారు. తల తిరగడం, ఏ చిన్న శబ్దమైనా వెలుతురు వాసన తగిలిన చేతి వెళ్ళు ముఖం తిమ్మిరిగా ఉండడం. స్పర్స లేకుండా ఉండడం చాలా అరుదుగా వచ్చే మైగ్రైన్ లలో హేమా ప్లిజిక్ మైగ్రైన్ దీనివల్ల అలసట నీరసం శరీరం లో ముఖం ఒక పక్క సత్తువ లేకుండా ఉండడం. మై గ్రైన్ సహజంగా 4 గం నుండి 72 గం ఉంటుంది. ఈ సమయంలో రోగి చీకటి గదిలో రెస్ట్ తీసుకోవాలి. మైగ్రైన్ కు  కారణం ఏమిటి అన్న  ప్రశ్నలకు సరైన కారణాలు అర్ధం కాలేదు.జెన టిక్ ఫ్యాక్టర్ లేదా వాతావరణమే కీలక పాత్ర పోషిస్తుందా అన్నది మరో ప్రశ్న. సహజం గా ఒత్తిడి 8౦% కాగా హార్మోనల్ మార్పులు 65% కరానం కావచ్చునని అంచనా. ఇది కాక మద్యం వెన్న, చాక్లెట్లు వంటి ఆహారం  కారణం కావచ్చు. నిద్ర ఎక్కువైనా నిద్ర పోకపోయినా సమస్యే. వెలుతురు కాస్త లైట్లు కొంచం మినుకు మినుకు మన్న మైగ్రైన్ యిన్  కు కారణాలుగా నిపుణులు పేర్కొన్నారు. క్లస్టర్ హె డెక్స్... క్లస్టర్ హె డెక్స్ కు కారణం తీవ్రమైన నొప్పి. తలకు ఒక పక్క మాత్రమే నొప్పి దీనినే పార్శ్వపు నొప్పి గా పిలుస్తారు. తలకు ఒకవైపు మాత్రమే తీవ్రమైన నొప్పి కంటి చుట్టూ కూడా తరచుగా నొప్పి వస్తూ ఉంటుంది. నొప్పి తీవ్రత అధికంగా ఉంటుంది. చాలా తీవ్రంగా మండి నట్లు. గుచ్చుకున్నట్లు ఉంటుంది. యుఎస్ లో 1% ప్రజలు క్లస్టర్ హెడెక్స్ తల నొప్పి ఒక్కసారి వస్తే 4 నుండి12 వారాలు ఉంటుంది.లేదా చాలా సంవత్సరాలు ఉంటుంది. తరచుగా ఒకే వైపు వస్తూ ఉంటుంది. సహజంగా క్లస్టర్ హె డెక్ లక్షణాలు ఇవే...కంటి లోపల నుండి లేదా నుదుటి వైపు నొప్పి ప్రారంభమై నిద్ర పోనివ్వదు. నొప్పి ప్రారంభ మైతే 1 లేదా 2 గం ఉంటుంది. నొప్పి 5 నుంచి 1౦ నిమిషాలు తీవ్రంగా ఉంటుంది. తీవ్రమైన నొప్పి 3౦ నుండి 6౦నిమిషాలు తక్కువలో తక్కువ 3 గం లు ఉంటుంది. దీనిలక్ష నాళలో ముక్కు కారడం లేదా ఒకవైపు ఒకవైపు మూసుకుపోవడం. కనురెప్పలు వాలి ఉండడం.ఒక కన్ను ఎర్రగా నీరు కారుతూ ఉంటుంది. ముఖం వాచీ ఉంటుంది. చమట పట్టి ఉండడం దీనికి గల ప్రాధాన్ కరానం తేలియా ల్సి ఉంది. నిపుణుల అంచనా లేదా పరిశోదనా అమ్మ్సాలలో భాగం గా మెదడులో ఉన్న హైపో తాలమిన్ నరాలు రక్తనాళాలు మధ్య వచ్చిన మార్పు ఒత్తిడి కారణంగా కన్ను ముఖం పై ప్రభావం చూపుతాయని  అంటున్నారు.  సెర్విగేనిక్ హెడేక్...ఈ రక మైన తల నొప్పికి కారణం మెదడుకు ఏదైనా గాయం అయినప్పుడు అర్తరైటిస్ వెన్నుపూస లేదా వెన్నుపూస పై భాగాలు సమాస్య ఉండవచ్చు. 1 )మెడ పై భాగాన తీవ్రమైన నొప్పి ప్రారంభమై కన్ను ముఖం పై ఒక పక్క తీవ్రమైన నొప్పి ఉంటుంది. 2) మెడ నరాలు పట్టి వేసి అటు ఇటు లేదా ఎటు వైపుకు తిరగ కుండా ఉండిపోతుంది. 3) కంటి చుట్టూ నొప్పి, భుజాలు, చేతులు కంటి చూపు సరిగా లేకపోవడం. అసహనం గా ఉండడం... చిన్న పాటి లైట్కదిలినా. శబ్దం అయినా తీవ్రంగా ఇబ్బంది పడడం. స్తేరాయిడ్స్ ఇంజక్షన్స్, లేదా నాన్ స్తేరాయిడ్ ఇంజక్షన్స్, ఇంఫ్లా మేట రీ మందు ద్వారా నేప్పిని నివారించే ప్రయత్నం చేయవచ్చు. సేర్వికోగేనిక్ హె డెక్ తల నొప్పులు 3 నెలల తగ్గించవచ్చు.మళ్ళీ రావాచ్చు. నొప్పి ఇతర లక్షణాలు పిరియాడిక్ గా వస్తూ ఉంటాయి. వ్యక్తి నుంచి వ్యక్తికి వేరు వేరుగా ఉంటాయి. వాస్కు లైటిస్... దీనిని ఆటు ఇమ్యూన్ ఎటాక్ గా పేర్కొన్నారు. శరీరంలో రక్త నళాలలో ఇతర హానికారక రాసాయానాలు ఉంటె దానిని వస్కు లైటిస్ బ్లడ్ ఇంఫ్లా మేషన్ గా పేర్కొన్నారు. సహజంగా వాస్కు లైటిస్ గిఒనేట్ సెల్ అర్తరైటెంపోటర్ ఆర్తరైటిస్ తల లోని రక్తనాళాలు  పై ప్రభావం చూపుతుంది. 5౦ సంవత్సరాలు పై బడిన వాళ్ళ లో ఉంటుంది. వాస్కు లైటిస్ తల నొప్పికి దగ్గర దగ్గర గా థందర్ క్లాట్ హెడే క్ తీవ్రమైన నొప్పి దీనికి సరైన కారణం అంటూ ఉండదా. ఒక్క నిమిషంలో తీవ్రనోప్పి కి డానికి సరైన అంటూ ఉండదు.ఒక్కోసారి ఈ నొప్పి 5 నిమిషాలు ఉంటుంది. వాస్కు లైటిస్ వల్ల వచ్చే ప్రభావం లో భాగంగా కంటి చూపు కోలోవడం. తలకు ఒక పక్క తల నొప్పి లేదా కాలికి ఒకపక్క నొప్పి నములు తున్నప్పుడు నొప్పి వాస్కు లైటిస్ తో కళ్ళు పోయే ప్రమాదం పొంచి ఉంది.