LATEST NEWS
వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు భగ్గు మన్నాయి. ఎమ్మెల్యే చీఫ్ విప్ వినయ్ బాస్కర్ దిష్టి బొమ్మ దగ్ధం వరకూ పరిస్థితి దిగజారింది. పార్టీ ఘనంగా జరుపుకుంటున్న దీక్షా దివస్ ఉత్సవాలలో విభేదాలు భగ్గు మనడంలో తెరాసలో ఐక్యత మేడి పండు చందమేనని బయటపడిపోయింది. విషయం ఏమిటంటే..దీక్షా దివస్ సందర్భంగా    తెరాస వరంగల్ లో చేపట్టిన 11 రోజుల ఉత్సవాలు మూడో రోజునే  రోజే రసాభాసగా మారాయి. దిక్షా దివస్ సందర్భంగా గత నెల 29 నుంచి 11 రోజుల పాటు కార్యక్రమాలను షెడ్యూల్ చేసి అమలు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా 29న కాళోజీ సెంటర్​ లో దీక్ష దివస్ ప్రారంభించారు, 30న  జయశంకర్ పార్క్ నుంచి క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఇక డిసెంబర్ 1న బైక్ ర్యాలీ నిర్వహించారు.  శుక్రవారం (డిసెంబర్ 2)న వరంగల్ పబ్లిక్ గార్డెన్స్ లో తెలంగాణ ఉద్యమ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడ తెరాసలో విభేదాలు భగ్గు మన్నాయి. ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వకుండా చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ ఇష్టారీతిగా వ్యవహరిస్తున్నారంటూ అసమ్మతి గళం బలంగా లేచింది. ఉద్యమంలో చురుకుగా పాల్గొని జైలుకు కూడా వెళ్లిన మెహరున్నీసా ఫొటోకు  ఆ ఎగ్జిబిషన్ లో  స్థానం కల్పించకపోవడంతో ఆమె వర్గీయులు ఆందోళనకు దిగారు. దీంతో ఫొటో ఎగ్జిబిషన్ కార్యక్రమం రసాభాసగా మారింది. దాస్యం వినయ్ భాస్కర్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఫొటో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేసిన ఫొటోలను చింపేసి మొహరున్నీసా ఆందోళనకు దిగారు. నిజమైన ఉద్యమ కారులకు గుర్తింపు ఇవ్వకుండా దిక్షాదివస్ నిర్వహించడమేమిటంటూ దాస్యం వినయ్ భాస్కర్ ను నిలదీశారు. ఒక దశలో వినయ్ భాస్కర్ దిష్టిబొమ్మ దగ్ధానికి కూడా దిగారు. దీంతో వరంగల్ టీఆర్ఎస్ లో విభేదాలు ఒక్కసారిగా రోడ్డున పడినట్లైంది. తెరాస ముందస్తు ప్రణాళికలు జోరుగా రచిస్తున్న సమయంలో అత్యంత కీలకమైన వరంగల్ లో పార్టీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమనడంతో టీఆర్ఎస్ వర్గాలలో ఆందోళన మొదలైంది. అత్యంత ఉత్సాహంగా ప్రారంభమైన దిక్షా దివస్ ఉత్సవాల మూడో రోజుకే ఇలా విభేదాలు రచ్చకెక్కి కార్యక్రమం  రచ్చరచ్చగా మారడం సంచలనం సృష్టిస్తోంది. పార్టీ అధినాయకత్వం పరిస్థితి ‘ఆల్ ఈజ్ వెల్’ చెప్పడానికి ఎంత ప్రయత్నిస్తున్నా విభేదాల కారణంగా తెరాస ప్రతిష్ట మసకబారుతోందని పరిశీలకులు అంటున్నారు. అసలే కేంద్ర దర్యాప్తు సంస్థల దూకుడుతో డిఫెన్స్ లో పడిన తెరాస ఇప్పుడు కీలకమైన వరంగల్ జిల్లాలో రచ్చకెక్కిన విభేదాలతో  కొత్త తలనొప్పి మొదలైనట్లేనని అంటున్నారు. ఉద్యమ కారులకు తెరాసలో సరైన గుర్తింపు దక్కడం లేదన్న విమర్శ చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఉద్యమ కారులు ఒక్కరొక్కరుగా పార్టీ నుంచి వైదొలుగుతుండటానికి కారణం వారికి పార్టీలో ప్రాధాన్యత కల్పించకపోవడమేనని పార్టీ వర్గాలే అంటున్నాయి. దానికి తోడు ఉద్యమ సమయంలో సమైక్య వాదులుగా ముద్ర పడిన పలువురు ఇప్పుడు కేసీఆర్ కేబినెట్ లో మంత్రులుగా ఉండటాన్ని చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఉద్యమంలో క్రియాశీలంగా పని చేసిన వారికి ఇసుమంతైనా గుర్తింపు లేకుండా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ విషయంలో మొహరున్నీసా నిరసన గళమెత్తి వినయ్ బాస్కర్ పై విమర్శలతో విరుచుకుపడటమే కాకుండా ఉద్యమ కారుల ఫొటో ఎగ్జిబిషన్ లో ఉన్న కొన్ని ఫొటోలను చింపేసి ఆందోళనకు దిగడం పార్టీకి ఒకింత ఇబ్బంది కరమేనని చెప్పక తప్పదు.  ఎన్నికల వేళ రచ్చకెక్కతున్న విభేదాలు పార్టీ నాయకత్వంలో ఆందోళనకు కారణమౌతున్నాయి. 
ఇటునుంచి కాకపోతే, అటునుంచి నరుక్కు రమ్మన్నారు, పెద్దలు. తెలంగాణ రాజకీయాల్లో చకచకా చోటు చేసుకుంటున్న మార్పులను గమనిస్తే, అధికార తెరాస నాయకత్వం, కమ్ముకోస్తున్న ‘కారు’ మబ్బుల్లోంచి బయట పడేందుకు,  సమైక్య కుట్రల పేరున సెంటిమెంట్’ను శరణు వేడడం తప్ప మరో మార్గం లేదనే నిర్ణయానికి వచ్చినట్లు కనిపిస్తోందని,రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా మంత్రి మల్లారెడ్డి ఇళ్లు వాకిళ్లపై ఐటీదాడులు,ఆ తర్వాత డైరెక్ట్ గా, ఢిల్లీ మద్యం కేసులో, తెరాస ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత పేరు పైకి రావడంతో, తెరాస నాయకత్వానికి  మరోమార్గం లేక  సెంటిమెంట్  గుర్తుకొచ్చింది.  నిజానికి, 2014లో అధికారంలోకి వచ్చీ రాగానే ముఖ్యమంత్రి కేసీఆర్ తెరాస ఇకపై ఎంత మాత్రం  ఉద్యమ పార్టీ కాదని తేల్చి చెప్పారు. అలాగే  తెరాస ఇక పై ఫక్తు పదహారు అణాల రాజకీయ పార్టీగా రాజకీయాలే చేస్తుందనీ కుండ బద్దలు కొట్టారు. నిజానికి  ప్రభుత్వంలో, తెలంగాణ రాజకీయాల్లో  ఉద్యమ స్పూర్తి కాదు, కనీసం ఉద్యమ వాసనలు అయినా లేకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలంగా ఉన్న తమ కుటుంబ సభ్యులు మినహా మిగిలిన వారందరినీ సాగనంపారు. వైఎస్సార్, ‘చేవెళ్ళ చెల్లెమ్మ’ సబితా ఇంద్రా రెడ్డి  సహా తెరాస ఉద్యమ నాయకత్వం ఉద్యమ ద్రోహులుగా ప్రకటించిన  తలసాని శ్రీనివాస యాదవ్, ఎర్రబెల్లి వంటి వారందరికీ మంత్రి వర్గంలో స్థానం కల్పించారు. అదేమంటే, ఉద్యమంలో పాల్గొన్నవారికే మంత్రివర్గంలో స్థానం కల్పించాలని రాజ్యాంగంలో ఉందా అంటూ ప్రశ్నించారు. ఒక్క మాటలో చెప్పాలంటే, తెలంగాణ సెంటిమెంట్ ను ఉద్దేశపూర్వకంగా పలుచన చేశారు.  అయితే ఇప్పుడు  మారిన పరిస్థితులలో  తెరాస నాయకత్వానికి సెంటిమెంటే శ్రీరామ రక్షగా కనిపిస్తోంది. అందుకే, అన్యధా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ  అంటూ మళ్ళీ తెలంగాణ సెంటిమెంట్ ను సొంత చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తాజా పరిణామాలను రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా, ప్రాంతీయ వాదాన్ని, తెరపైకి తెచ్చే ప్రయత్నం మొదలైందని పరిశీలకులు అంటున్నారు. వైఎస్సార్ టీపీ నాయకురాలు వైఎస్ షర్మిల అరెస్ట్  వెనక ప్రాంతీయ వాదాన్ని రెచ్చగొట్టే కుట్ర ఉందని  అందుకే కేసీఆర్ కుమార్తె కవిత మొదలు తాజగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వరకు, అనేక మంది మంత్రులు, ఇతర నాయకులు, ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నిస్తున్నారని అంటున్నారు. ఆమె పార్టీ పెట్టి పాదయాత్ర మొదలు పెట్టి సంవత్సరం పైగా అయిన తర్వాత ఇప్పడు షర్మిల ప్రాంతీయ మూలాలను ప్రశ్నించడం వెనక  సెంటిమెంట్ ను రెచ్చగొట్టే ప్రయత్నం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  వైఎస్ షర్మిల మనసులో ఏముందో ఇందుకోసం ఆమె పుట్టింటిని వదిలి అత్తింటికి చేరారో ఏమో కానీ, ఆమె తెలంగాణలో పార్టీ పెట్టి  పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పటికి మూడు వేల ఐదు వందల కిలోమీటర్ల మేర యాత్ర పూర్తి చేశారు. ఈ దశలో ఆమె యాత్ర మీద దాడి జరగటం, ఆపై నాటకీయ పరిణామలు నడుమ ఆమెను  అరెస్ట్ చేయడం  తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యయాయి.ఇక ఇదే సమయంలో గులాబీ నాయకులు వైఎస్ షర్మిలను ఆంధ్ర పేరుతో టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. నిన్న మొన్నటి వరకు వైఎస్ షర్మిలకు పులివెందులలో ఓటు హక్కు ఉందని అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం షర్మిల పని చేసిందని  సోదరుడు పదవి ఇవ్వకపోవడంతో, ఇప్పుడు తెలంగాణలో షర్మిల తాను తెలంగాణ కోడలినని కొత్త రాగం అందుకుందని టార్గెట్ చేస్తున్నారు. అయితే  ఇక్కడ తెరాస అసలు టార్గెట్  షర్మిల కాదని, ప్రధాన లక్ష్యం స్వీయ రక్షణ అయితే బీజేపీకి సమైక్య ముద్ర వేసే ప్రయత్నమే ప్రధానంగా కనిపిస్తోందని అంటున్నారు. అందుకే, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి,ముఖ్యమంత్రి కేసీఆర్ ను మానసికంగా దెబ్బ కొట్టడానికి, ఆయన ప్రతిష్టను దెబ్బతీసి, తెరాసను, తెరాస నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలను అప్రతిష్టపాలు చేయడానికి సమైక్యవాదులు కుట్రలకు పాల్పడుతున్నారని, సంచలన వ్యాఖ్యలు చేశారని అంటున్నారు.  కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని జరుగుతున్న దాడులు గత కొద్ది రోజులుగా టిఆర్ఎస్ పార్టీ నేతలపై జరుగుతున్న దాడులు కెసిఆర్ కుటుంబం పై జరుగుతున్న కుట్రలు, తెలంగాణ రాష్ట్రంలో గవర్నర్ తీరు, వైయస్ షర్మిల పాదయాత్ర, బండి సంజయ్ పాదయాత్ర  తెలంగాణపై కేంద్రం చూపిస్తున్న వివక్ష వంటి అంశాలను ప్రస్తావించిన ఆయన ఈ పరిణామాలన్నింటినీ చూస్తే కెసిఆర్ ను దెబ్బ తీయడం కోసం జరుగుతున్న కుట్రగా కనిపిస్తోందన్నారు. ఏపీలో చేతకాక తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి కేసీఆర్ ను అడ్డు తొలగించుకోవాలని భావిస్తున్నారని గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.  నిజానికి, ఫార్మ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్’ ఆశించిన విధంగా రక్తి కట్టక పోవడం, అదే సమయంలో సర్దుకుందనుకున్న ఢిల్లీ మద్యం స్కాం లో లో కవిత రోల్ ఒక్కసారిగా దూసుకు రావడం, ఈ అన్నిటినీ మించి కేంద్రం కుట్రలు చేస్తోందని ముఖ్యమంత్రి మొదలు  మంత్రులు, సామంతులు, ఎంతమంది ఎంతగా గగ్గోలు పెట్టినా  సామాన్య తెలంగాణ ప్రజలు స్పందించక పోవడంతో  తెరాస నాయకత్వం సెంటిమెంట్ అస్త్రాన్ని మరోమారు తెర మీదకు తెచ్చే ప్రయత్నం చేస్తోందని అంటున్నారు. అయితే, సమైక్యవాదం మాటున తెలంగాణ సెంటిమెంట్ ను మళ్ళీ తెరమీదకు తేవడం అయ్యేపని కాదని పరిశీలకులు అంటున్నారు.నిజానికి, సమైక్యవాదానికి బట్టలు తొడిగితే ఎలా ఉంటుందో, అలా ఉండే ఉండవల్లి అరుణ కుమార్ కు పూర్ణ కుంభంతో ప్రగతి భవన్ లోకి  స్వాగతం పలికిన తెలంగాణ నాయకత్వం, ఇప్పడు సమైక్య వాదం, సమైక్య వాదుల కుట్రల గురించి  మాట్లాడితే ప్రజలు నమ్మరని, నవ్వుతారని  పరిశీలకులు అంటున్నారు.
కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. ఆ విషయం ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. తమిళనాడులోని కన్యా కుమారిలో సెప్టెంబరు 7న తొలి అడుగు పడింది మొదలు, మధ్యలో ఒకటి రెండు చిన్న చిన్న బ్రేకులు తీసుకున్నా,ఎలాంటి ఆటంకాలు అవరోధాలు లేకుడా, సాఫీగా సాగిపోతోంది. చివరకు, రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రంలో పాదయాత్ర చేయలన్నా,అవరోధాలు, అరెస్టులు తప్పని, తెలంగాణ రాష్ట్రంలోనూ రాహుల్ గాంధీ యాత్ర మాత్రం ఎప్పుడు జరిగిందో కూడా తెలియకుండానే, రాష్ట్రం దాటేసింది. ఇంతవరకు 7 రాష్ట్రాల్లోని 36 జిల్లాల మీదుగా నడిచిన రాహుల్ యాత్ర ప్రస్తుతం మధ్య ప్రదేశ్ లో సాగుతోంది. రేపో మాపో రాజస్థాన్ లో ప్రవేశిస్తుంది. నిజానికి, రాజకీయ నాయకుల పాదయాత్ర అంటే, పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండకచో కొద్దిమంది ఇతర రంగాల సెలబ్రిటీలు మాత్రమే పాల్గొంటారు. కానీ, రాహుల్ యాత్రలో రాజకీయ పార్టీ నాయకులు, కార్యకర్తల కంటే, సెలబ్రిటీలే ఎక్కువగా పాల్గొంటున్నారా అన్నట్లుగా, యాత్ర చాలా కలర్ ఫుల్’గా సాగుతోంది. సినిమా స్టార్లే కాదు, కాలేజీ అమ్మాయిలు, విద్యార్ధులు, యువకులు, చివరకు చిన్న పిల్లలు కూడా రాహుల్ వెంట నడుస్తున్నారు. సహజంగా రాజకీయ నాయకుల పాదయాత్రలలో గంభీర ఉపన్యాసాలు, సీరియస్ చర్చలు ఉంటాయి. జెండాలు, స్లొగన్స్ ఉంటాయి. కానీ రాహుల్ గాంధీ యాత్రలో రాజకీయ వాసనలు అంతగా కనిపించడం లేదు. రాహుల్  యాత్ర ఒక పిక్నిక్ లాగా సాగిపోతోందని, పార్టీ నాయకులు చెప్పుకొస్తున్నారు. ఆట పాటలు, సెల్ఫీ లు, కరచాలనాలు, హగ్గులు, ఆలింగానాలు ఒకటని కాదు, ఒక ప్రత్యేక పంధాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సాగుతోంది. అయితే, ఈ యాత్ర వలన అంతిమంగా ఏమి జరుతుగుంది, ఏమి జరగదు అనేది పక్కన పెడితే, రాహుల్ యాత్ర పాదయాత్రల చరిత్రలో ఒక కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిందని అయితే, చెప్ప వచ్చును.  రాహుల్‌ గాంధీ మొదలుపెట్టిన భారత్‌ జోడో యాత్రకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు హాజరై తమ మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా బాలీవుడ్‌ ప్రముఖ నటి స్వరా భాస్కర్‌ పాల్గొన్నారు. మధ్య ప్రదేశ్ లోని  ఉజ్జయినిలో రాహుల్ గాంధీ వెంట స్వరా భాస్కర్ భారత్ జోడో యాత్రలో నడిచారు. భారత్ జోడో యాత్రలో పాల్గొనండి.. మన దేశం కోసం నిలబడండి అని స్వరా భాస్కర్ పిలుపునిచ్చారు. అంతే కాదు, రాహుల్ గాంధీకి, ఆమె ప్రేమ పూర్వకంగా రోజా పూలిచ్చారు. ఫోటోలకు ఫోజులిచ్చారు, ఇందుకు సంబందించిన ఫొటోలను కాంగ్రెస్‌  తన ట్విటర్‌ ఖాతాలో పంచుకుంది.  రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడో యాత్రలో ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. అమోల్ పాలేకర్, సంధ్యా గోఖలే, పూనమ్‌ కౌర్‌, పూజా భట్, రియా సేన్, మోనా అంబేగావ్కర్, సుశాంత్ సింగ్, రష్మీ దేశాయ్, ఆకాంక్ష పూరీ పాదయాత్రలో పాల్గొన్నారు. హాలీవుడ్‌ స్టార్‌ జాన్‌ కుసాక్‌ కూడా రాహుల్‌కు ట్విటర్‌ వేదికగా మద్దతు ప్రకటించారు. భారత్‌ జోడో యాత్ర డిసెంబర్‌ 4న రాజస్థాన్‌లోకి ప్రవేశించనుంది. ఇదలా ఉంటే,భారత్ జోడో యాత్రపై, కొందరు సీనియర్ నాయకులు కొంత అసంతృప్తి వ్యక పరుస్తున్నారు. కాంగ్రెస్ సీనియర్ లీడర్, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ చేసిన కామెంట్లు ఆ పార్టీని ఇరకాటంలో పడేశాయి.ప్రస్తుతం రాహుల్ యాత్ర మధ్యప్రదేశ్ లో కొనసాగుతుండగా.. షెడ్యూల్ కఠినంగా రూపొందించడంపై కమల్ నాథ్ అసహనం వ్యక్తం చేశారు. రాహుల్ యాత్రతో చచ్చిపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రదీప్ మిశ్రా అనే పండితుడితో ఆయన మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. గత ఏడు రోజులుగా మేం చచ్చిపోతున్నం.. ఇక్కడ రెండే నిబంధనలు ఉన్నాయి. ఉదయం 6 గంటలకు యాత్ర ప్రారంభించాలి. రోజులో కనీసం 24 కిలోమీటర్లు నడవాలి. అంతే కాకుండా మధ్యప్రదేశ్ లో యాత్రకు రాహుల్ ముందే మూడు కండీషన్లు పెట్టారు. ఆదివాసీ వీరుడు తాంత్య భీల్ జన్మస్థలం, ఓంకారేశ్వర్, ఉజ్జయిని మహంకాళి ఆలయాలను సందర్శించాలని షరతు పెట్టారు అని కమల్ నాథ్ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో ఉంది. ఇటీవల పాదయాత్రలో దిగ్విజయ్ సింగ్ జారిపడిన నేపథ్యంలో కమల్ నాథ్ ఈ కామెంట్లు చేయడం గమనార్హం.  నిజానికి రాహుల్ గాంధీ, సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో ప్రారంభించిన  జోడో యాత్ర 150 రోజుల్లో 12 రాష్ట్రాల గుండా 3,570 కిలోమీటర్లు ప్రయాణించి కశ్మీర్ చేరుకునేలాప్లాన్ చేశారు. ఈ యాత్ర ఇప్పరికే  సగం దూరం దాటేసింది. ఈరోజు (శుక్రవారం) 84వ రోజుకు చేరింది.మరో 1200 కిలోమీటర్లు నడిస్తే, యాత్ర పూర్తవుతుంది.యాత్ర పూర్తవుతుంది కానీ  యాత్ర లక్ష్యం అది భారతీయలను కులాలు, మతాలకు అతీతంగా ఏకం చేయడమే అయినా కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే అయినా, 2024 ఎన్నికల నాటికి రాహుల్ గాంధీని మోడీకి సమ ఉజ్జీగా నిలపడమే అయినా నెరవేరుతుందా? ఇప్పడు యాత్రలో పాల్గొంటున్న నాయకులనే కాదు కాంగ్రెస్ నేతలు అందరినీ వేధిస్తున్న ప్రశ్న.
వైఎస్సార్ టీపీ అధినేత్రి వరంగల్ జిల్లా నర్సంపేట వద్ద ఆమె పాదయాత్ర పై రాళ్లదాడి, కాన్వాయ్ లోని వామనం దగ్ధం ఘటనలో స్వల్పంగా గాయపడ్డారు. నాలుగు రోజుల కిందట ఈ సంఘటన జరిగింది. ఆ తరువాత ఆమె తన గడ్డం, పెదవిపై తగిలిన గాయాలను మీడియాకు చూపించి రాజశేఖరరెడ్డి బిడ్డను, ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం పాదయాత్ర చేస్తున్న మహిళను తెరాస ప్రభుత్వం ఈ విధంగా గాయపరుస్తుందా అంటు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా ఇది గడిచి రెండు రోజులు అయ్యింది. తాజాగా ఆమె మీడియా ముందుకు వచ్చినప్పుడు ఆమె ముఖంపై గాయమే కాదు.. ఆ గాయం తాలూకు మచ్చ కూడా కనిపించలేదు. దీంతో ఆమె నిజంగా గాయపడ్డారా అన్న అనుమానాన్ని తెరాస నేతలు వ్యక్తం చేస్తున్నారు. గాయం పేరుతో మీడియా ముందు ఆమె సెంటిమెంట్ పండించేందుకు ప్రయత్నించారని నర్సంపేట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి విమర్శించారు. అయినా గాయాలు అంత తొందరగా మానిపోయే చికిత్సలు అందుబాటులోకి వచ్చాయా  అని సెటైర్ వేశారు. ఇప్పటికైనా షర్మిల  వ్యక్తిగత విమర్శలు మానుకుని బుద్ధిగా పాదయాత్ర చేసుకుంటే మంచిదని హితవు పలికారు.
రిషభ్ పంత్ వరుస వైఫల్యాలతో సతమతమౌతున్న టీమ్ ఇండియా క్రికెటర్ బంగ్లాదేశ్ పర్యటనకు దూరం అవుతాడా? అతడి పేరును సెలక్టర్లు బంగ్లా  టూర్ కు దూరం పెట్టేయాలని డిసైడయ్యారా? అంటే క్రికెట్ నిపుణులు ఔననే అంటున్నారు. అయితే గాయం కారణంగానే పంత్ బంగ్లాటూర్ కు దూరమయ్యే అవకాశాలున్నాయని టీమ్ ఇండియా ఆటగాళ్లు చెబుతున్నారు. పంత్ ఫామ్ లేమితో ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమే అయినా అతడికి మరి కొన్ని అవకాశాలు ఇవ్వాలని టీమ్ ఇండియా మేనేజ్ మెంట్, బీసీసీఐ, సెలక్షన్ కమిటీ భావిస్తోందంటున్నారు. అద్భుత మైన టాలెంట్ ఈ యువ క్రికెటర్ సొంతమని చెబుతున్నారు. అందుకే ఫామ్ లేమితో ఇబ్బందులు పడుతున్నా పంత్ కు వరుస అవకాశాలు ఇస్తున్నారంటున్నారు. అయితే కివీస్ తో రెండు రోజుల కిందట జరిగిన మూడో వన్డేలో రిషభ్ పంత్ కేవలం పది పరుగులకే ఔటై పెవిలియన్ చేరాడు. కానీ ఆ తరువాత అతడు స్ట్రెచర్ పై పడుకుని ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో  తెగ వైరల్ అయ్యాయి. దీంతో రిషబ్ పంత్ గాయపడ్డాడా అన్న చర్చ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే పంత్ బంగ్లా టూర్ కు దూరం అయ్యే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.   
ALSO ON TELUGUONE N E W S
Urvashivo Rakshasivo, starring Tollywood's young hero Allu Sirish and Anu Emmanuel, was released in theatres last month. The film did not fare well at the box office. The film, directed by Rakesh Shashi, is now ready for its digital premiere. Aha Video, a Telugu OTT platform, has announced that the film will premiere on its platform on December 9, 2022.   Those who missed the film in theatres will be able to watch it on Aha beginning next Friday. The romantic comedy entertainer stars Vennela Kishore, Sunil, Amani, Shankar and others in lead roles. Produced by Dheeraj Mogileni and Vijay M. Achu Rajamani, the film has music by Anup Rubens.
Dhanush is expected to collaborate with sensible filmmaker Shekar Kammula. The project was recently launched with a formal pooja ceremony. Expectations are high for this film and this unique combo, which is being produced by Asian Sunil.   However, it appears that director Shekhar Kammula will make this film based on some true events. The original story of this film appears to be set in the background of India's biggest scam, with a political twist. A love story is also included.   The regular shooting will begin in January. According to reports, Dhanush agreed to do the film only after the director had completed the full bounded script.   Dhanush seems to be appearing in two different shades for this film. Shekhar is also said to be planning some action episodes for the first time. According to the plot, the film will feature two heroines and a powerful villain.
Supreme Hero Sai Dharam Tej currently working on a mystic thriller tentatively titled SDT15. The movie’s shooting is going on well at a brisk pace. Now the actor next film Pooja ceremony happened today in Hyderabad. The film will be produced by BVSN Prasad under Sri Venkateswara Cine Chitra LLP banner. Bapineedu is presenting the film.   The film marks the directorial debut of Jayanth Panuganti. Sai Dharam Tej, Buchi Babu Sana, BVSN Prasad and Bapineedu Bhogavalli attended the puja ceremony. The muhurat shot today was given a clap by Sai Dharam Tej.   Signifying the commencement of the film’s production, Bapineedu Bhogavalli switched on the camera, and pooja formalities handled by SDT's mother. Sai Dharam Tej, who always impresses with the content and films he chooses, is now coming with a family entertainer.   The filming will begin shortly. Makers stated that the actors and technical crew announcement will be made soon.
బైక్ యాక్సిడెంట్ నుంచి కోలుకొని మళ్ళీ షూటింగ్స్ తో బిజీ అయిన మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన 15వ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్ లో చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన 16వ సినిమాని కూడా అదే బ్యానర్ లో చేస్తుండటం విశేషం. తాజాగా ఈ మూవీ ప్రారంభమైంది. సాయి తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. బాపినీడు సమర్పణలో ఎస్వీసీసీ బ్యానర్ పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రంతో జయంత్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. త్వరలోనే ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే సాయి తేజ్ వరుసగా ఎస్వీసీసీ బ్యానర్ లో సినిమాలు చేస్తుండటం ఆసక్తికరంగా మారింది.
పారిశుధ్య కార్మికుల కష్టాలను కళ్ళకు కట్టినట్టు చూపించేలా తెరకెక్కిన చిత్రం 'విట్ నెస్'. మన సమాజంలో ఇప్పటికీ ప్రబలంగా ఉన్న అత్యంత అమానవీయ పద్ధతుల్లో మాన్యువల్ స్కావెంజింగ్ ఒకటి. కార్మికులు ప్రాణాలకు తెగించి మరీ మురుగు కాల్వలు శుభ్రం చేస్తుంటారు. అనేక చర్యలు మరియు విధానాలు అమలులో ఉన్నప్పటికీ, దీనివల్ల ప్రతి సంవత్సరం ఎందరో పేద కార్మికుల ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఈ సమస్య ఆధారంగా తెరకెక్కిన 'విట్ నెస్'ను సోనీ లివ్ అందిస్తోంది. పార్థిబన్ అనే 20 ఏళ్ల కుర్రాడు రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్ సెప్టిక్ ట్యాంక్‌ను క్లీన్ చేస్తూ మరణిస్తాడు. ఆ కుర్రాడి మరణానంతరం, అతని తల్లి ఇంద్రాణి న్యాయం కోసం పోరాడుతుంది. ఆ పోరాటంలో ఆమె గెలిచిందో లేదో తెలియాలంటే 'విట్ నెస్' చూడాలి. ప్రముఖ నిర్మాత టి.జి. విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రానికి దర్శకుడిగా, సినిమాటోగ్రాఫర్ గా దీపక్ వ్యవహరించారు. ఈ సినిమాకి వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్, రోహిణి, షణ్ముగ రాజా, అజగం పెరుమాళ్, జి. సెల్వ , రాజీవ్ ఆనంద్, తమిళరసన్, శ్రీనాథ్ తదితరులు నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 9 నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో సోనీ లివ్ లో మాత్రమే ప్రసారం కానుంది.
సినిమా పేరు: మట్టి కుస్తీ తారాగణం: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, కరుణాస్, అజయ్, శత్రు, మునీష్ కాంత్, గజరాజ్, శ్రీజ రవి, కాళీ వెంకట్, రెడిన్ కింగ్స్లీ, హరీశ్ పేరడీ సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం. నాథన్ ఎడిటర్: ప్రసన్న జీకే రచన, దర్శకత్వం: చెల్లా అయ్యావు నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్, శుభ్ర, ఆర్యన్ రమేష్ బ్యానర్స్: ఆర్.టీ. టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ విడుదల తేదీ: డిసెంబర్ 1, 2022  విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'మట్టి కుస్తీ'. ఇది తమిళ్ సినిమా అయినప్పటికీ చిత్ర నిర్మాణంలో మాస్ మహారాజ రవితేజ భాగస్వామి కావడంతో దీనిపై తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తి ఏర్పడింది. మరి ఈ చిత్రం ఎలా ఉంది? నిర్మాతగా రవితేజకు విజయాన్ని అందించేలా ఉందో లేదో రివ్యూలో తెలుసుకుందాం. కథ: కేరళలో నివసించే తెలుగు కుటుంబానికి చెందిన కీర్తి(ఐశ్వర్య లక్ష్మి) చిన్నతనం నుంచి తన బాబాయ్(మునీష్ కాంత్) వల్ల కుస్తీపై మక్కువ పెంచుకుంటుంది. దూకుడు స్వభావం గల ఆమె తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా రెజ్లర్ గా మారుతుంది. అబ్బాయిల్లా కటింగ్ చేయించుకొని కుస్తీలు పట్టే ఆమెను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. మరోవైపు ఆంధ్రాలో నివసించే కుర్రాడు వీర(విష్ణు విశాల్) తల్లిదండ్రులు చనిపోవడంతో మావయ్య(కరుణాస్) అడుగుజాడల్లో నడుస్తుంటాడు. ఏ పని చేయకుండా ఉన్న ఆస్తులు కరగదీస్తూ మద్యం సేవిస్తూ, పేకాట ఆడుతూ ఫ్రెండ్స్ తో కలిసి జులాయిగా తిరుగుతుంటాడు. ఎనిమిదో తరగతి వరకు చదివిన వీర.. తనకంటే తక్కువ చదువుకున్న, బాగా పొడవు జుట్టు ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటాడు. అయితే వీర మావయ్యకి కీర్తి బాబాయ్ స్నేహితుడు కావడంతో.. ఒకసారి వీరని చూసిన కీర్తి బాబాయ్, కుర్రాడు బుద్ధిమంతుడు అని భావించి.. డీగ్రీ చదివిన కీర్తిని ఏడు వరకే చదువుకుందని, ఆమెకు పొడవు జడ కూడా ఉందని అబద్దం చెప్పి పెళ్లి జరిపిస్తాడు. రెండు అబద్దాలతో మొదలైన వారి వివాహ బంధం ఎలాంటి మలుపులు తీసుకుంది? ఆ అబద్దాల కారణంగా వారి జీవితాల్లో ఎలాంటి మార్పులు వచ్చాయి? విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకున్నారు? భార్యాభర్తలిద్దరూ కుస్తీ పోటీకి దిగడానికి కారణమేంటి? ఇద్దరి మధ్య జరిగిన పోరులో ఎవరు పైచేయి సాధించారో తెలియాలంటే సినిమా చూడాలి. విశ్లేషణ: ట్రైలర్ చూసినప్పుడే ఇది పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా కాదనే విషయం అర్థమైపోతుంది. ఫస్టాఫ్ అంతా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా సరదాగా సాగిపోయింది. కథాకథనాల్లో బలం లేకపోయినా సన్నివేశాలు, సంభాషణలు ద్వారా వచ్చే హాస్యం వల్ల ఫస్టాఫ్ బోర్ కొట్టకుండా నడిచింది. ఏ పని లేకుండా ఆవారాగా తిరిగే వీర తన మావయ్య మాటలు విని భార్యను గ్రిప్ లో ఉంచుకోవాలన్న ఉద్దేశంతో ఆమె ముందు బిల్డప్పులు ఇచ్చే సన్నివేశాలు అలరిస్తాయి. అలాగే భర్త ముందు అమాయకంగా నటిస్తూ.. విగ్గు ఊడిపోయి బండారం బయటపడుతుందన్న భయంతో అవస్థలు పడే కీర్తి సన్నివేశాలు కూడా నవ్వులు పూయిస్తాయి. ఇక ఇంటర్వెల్ సీన్ అయితే సినిమాకే హైలైట్ గా నిలిచింది. పేరుకి అది ఫైట్ సీన్ అయినా ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వుతారు. సెకండాఫ్ లో కూడా కొంతవరకు కామెడీ డోస్ బాగానే ఉంటుంది. వీరాకు తన భార్య రెజ్లర్, ఆమెది పొట్టి జుట్టు అని తెలిశాక వచ్చే సన్నివేశాలు బాగా నవ్వు తెప్పిస్తాయి. అప్పటివరకు కామెడీతో బాగానే నడిపించిన దర్శకుడు.. కీలక సన్నివేశాల్లో మాత్రం కాస్త తడబడ్డాడు. భార్యని దూరం చేసుకున్నాక.. ఆమె గురించి తెలుసుకుని వీరా రియలైజ్ అయ్యే సన్నివేశాలు ఇంకా బలంగా ఉంటే బాగుండేది. అలాగే భార్యభర్తల మధ్య కుస్తీ పోరు అంటూ వచ్చే సన్నివేశాలు సినిమాటిక్ గా అనిపిస్తాయి. ఇక ఈ చిత్రం ద్వారా ఇచ్చిన సందేశం బాగుంది. మహిళలకు ఎంతో సాధించాలని ఉన్నా కుటుంబసభ్యుల మద్దతు లేక వారు ఇంటికే పరిమితమవుతున్నారు. ముఖ్యంగా వారు అబ్బాయిల్లా ఆటలాడటం తప్పు అన్నట్టుగా భావిస్తారందరూ. అలా కాకుండా వారికి మద్దతుగా నిలిస్తే వారు ఎంతో సాధిస్తారు అనే సందేశాన్ని ఈ చిత్రం ద్వారా ఇచ్చారు. ఈ చిత్రంలో సంభాషణల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాలి. ఫస్టాఫ్ లో సంభాషణలు ఎంతలా నవ్వించాయో, సెకండాఫ్ సంభాషణలు అంతలా ఆలోచింపజేసేలా ఉన్నాయి. అయితే కొన్ని పాత్రల తెలుగు డబ్బింగ్ సహజంగా లేదు. పాటలతో ఆకట్టుకోలేకపోయిన జస్టిన్ ప్రభాకరన్ నేపథ్య సంగీతంతో పర్లేదు అనిపించుకున్నాడు. రిచర్డ్ ఎం. నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్ ప్రసన్న జీకే సినిమాని ఇంకాస్త ట్రిమ్ చేసి ఉండాల్సింది. నిర్మాణ విలువలు బాగున్నాయి. నటీనటుల పనితీరు: వీర పాత్రలో విష్ణు విశాల్ చక్కగా ఒదిగిపోయాడు. ఆవారాగా తిరిగే పల్లెటూరి కుర్రాడిగా మెప్పించాడు. భార్యను గుప్పిట్లో పెట్టుకోవాలనుకొని, చివరికి ఆమెను చూసే భయపడే భర్తగా అలరించాడు. యాక్షన్, ఎమోషన్ సన్నివేశాల్లోనూ ఆకట్టుకున్నాడు. ఈ చిత్రంలో ఐశ్వర్య లక్ష్మి పాత్ర చాలా కీలకం. కొన్ని సన్నివేశాల్లో హీరోనే డామినేట్ చేసేలా ఉండే పాత్ర ఆమె పోషించింది. ఆ పాత్రకు ఆమె పూర్తి న్యాయం చేసింది. కుటుంబం కోసం తన దూకుడు స్వభావాన్ని, తన లక్ష్యాన్ని పక్కన పెట్టి బాధపడే యువతిగా.. తనవాళ్ళకు హాని జరుగుతుందంటే తిరగబడే శక్తి ఉన్న మహిళగా ఆమె నటన మెప్పించింది. కరుణాస్, అజయ్, శత్రు, మునీష్ కాంత్, గజరాజ్, శ్రీజ రవి, కాళీ వెంకట్, రెడిన్ కింగ్స్లీ, హరీశ్ పేరడీ తదితరులు పాత్ర పరిధి మేరకు నటించి మెప్పించారు. తెలుగువన్ పర్‌స్పెక్టివ్: టైటిల్ చూసి ఇది పూర్తిస్థాయి స్పోర్ట్స్ డ్రామా అనుకుంటే పొరపాటే. అబద్దాలతో వివాహ బంధంలోకి అడుగుపెట్టిన భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు అలరిస్తాయి. కథాకథనాల్లో బలం లేకపోయినా హాస్యం బాగుంది. సందేశం కూడా ఉంది. అంచనాలు పెట్టుకోకుండా ఒకసారి చూడదగ్గ కుటుంబ కథా చిత్రం. రేటింగ్: 2.5/5 -గంగసాని
సినిమా పేరు: హిట్-2 తారాగణం: అడివి శేష్, మీనాక్షి చౌదరి, కోమలి ప్రసాద్, రావు రమేష్, సుహాస్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి  నేపథ్య సంగీతం: జాన్ స్టీవర్ట్ ఏడూరి సినిమాటోగ్రఫీ: మణికందన్ ఎడిటర్: గ్యారీ బి.హెచ్ రచన, దర్శకత్వం: శైలేశ్ కొలను నిర్మాత: ప్రశాంతి త్రిపురనేని బ్యానర్: వాల్ పోస్టర్ సినిమా విడుదల తేదీ: డిసెంబర్ 2, 2022 అడివి శేష్ ప్రధాన పాత్రధారిగా శైలేశ్ కొలను దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'హిట్: ది సెకండ్ కేస్'. 2020లో విడుదలై విజయం సాధించిన 'హిట్: ది ఫస్ట్ కేస్'కి సీక్వెల్ కావడంతో పాటు 'మేజర్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత శేష్ నటించిన సినిమా కావడంతో 'హిట్-2'పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీజర్, ట్రైలర్ ఆ అంచనాలను పెంచేశాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకుండేలా ఉందో లేదో తెలుసుకుందాం. కథ: వైజాగ్ లో హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్(HIT)లో పనిచేసే ఎస్పీ క్యాడర్ అధికారి కృష్ణ దేవ్ అలియాస్ కేడీ(అడివి శేష్)కి సిన్సియారిటీ, స్పీడ్, నోటిదూల అన్ని ఎక్కువే. ఎలాంటి కేసునైనా చాలా ఈజీగా సాల్వ్ చేస్తాడు. క్రిమినల్స్ వి కోడి బుర్రలు.. వాళ్ళు నేరం చేసినా ఈజీగా దొరికిపోతారనే అభిప్రాయం కేడీకి ఉంటుంది. అలాంటి కేడీకి ఒక కేసు సవాల్ గా మారుతుంది. శరీర భాగాలు వేరు చేసి దారుణంగా హత్య చేయబడిన ఒక యువతి శవం కనిపిస్తుంది. అయితే విచారణలో తల మాత్రమే ఆ యువతిదని, మిగతా శరీర భాగాలు మరో ముగ్గురువని తెలుస్తుంది. చనిపోయినవాళ్లు ఎవరు?.. వాళ్ళని ఎవరు చంపారు? ఎందుకు చంపారు?.. చంపిన కిల్లర్ ని కేడీ ఎలా పట్టుకోగలిగాడు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. విశ్లేషణ: హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చే సినిమాల స్టోరీలు ఎలా ఉంటాయో ఇప్పటికే మనకు ఓ క్లారిటీ వచ్చేసింది. హత్యలు జరుగుతాయి.. అవి ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అని హీరో ఇన్వెస్టిగేషన్ చేసి కనిపెడతాడు. ఇదే కథ. అయితే స్క్రీన్ ప్లే ఎంత ఎంగేజింగ్ గా ఉంది, ఇన్వెస్టివషన్ ఎంత ఇంట్రెస్టింగ్ గా సాగింది, కిల్లర్ మోటివ్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది అనే దాని మీద సినిమా ఫలితం ఆధారపడి ఉంటుంది. ఆ పరంగా చూస్తే హిట్-2 కి మంచి మార్కులే పడతాయి. దర్శకుడు శైలేశ్ ను ఒక విషయంలో మెచ్చుకోవాలి. సినిమా ప్రారంభం నుంచి చివరి దాకా కథ నుంచి ఎక్కడా బయటకు వెళ్లకుండా సినిమాని చక్కగా నడిపించాడు. కేడీ పాత్ర తీరుని పరిచయం చేసి, కాసేపటికే అసలు కథలోకి వెళ్లడం బాగుంది. అయితే కొన్ని ఇన్వెస్టిగేషన్ సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ఫస్టాఫ్ ఆశించినంత ఎంగేజింగ్ గా లేదు. దొరికిన ఆధారాలతో కిల్లర్ గా భావించి ప్రథమార్థంలో ఒక వ్యక్తిని అరెస్ట్ చేస్తారు. అతను కిల్లర్ కాదనే విషయం ప్రేక్షకులకు ముందే అర్థమైపోతుంది. ఎందుకంటే కిల్లర్ అంత ఈజీగా దొరకడు. అందుకే ఆ సన్నివేశాలు చూసే ప్రేక్షకులకు అంత కిక్ ఇవ్వవు. ఇంటర్వెల్ ముందు వచ్చే సన్నివేశాలు, ఇంటర్వెల్ బాగానే ఉన్నాయి. సెకండాఫ్ పై ఆసక్తి కలిగేలా చేశాయి. సెకండాఫ్ లో ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా సాగుతుంది. కొన్ని పాత్రల మీద అనుమానం కలుగుతుంది గాని.. ఈ పాత్రే హత్యలు చేసిందని ఖచ్చితంగా చెప్పలేము. ఆ సస్పెన్స్ ని మైంటైన్ చేయడంలో దర్శకుడు బాగానే సక్సెస్ అయ్యాడు. అయితే సెకండాఫ్ సగం అయ్యాక ఈ హత్యలు ఎందుకు జరుగుతున్నాయనేది మాత్రం ఒక ఐడియా వస్తుంది. కానీ కిల్లర్ ఎవరనేది మాత్రం చివరిలో రివీల్ అవుతుంది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు ఇంకా బలంగా రాసుకొని ఉంటే బాగుండేది. సినిమా అంతా బాగానే ఉన్నట్టు ఉంటుంది కానీ ఓ రెగ్యులర్ సైకో థ్రిల్లర్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది. మన మధ్య మామూలుగా తిరుగుతున్నట్టు ఉండే ఓ వ్యక్తి సైకోలా హత్యలు చేస్తుండటం, అతను అలా మారడానికి ఫ్యామిలీ చెందిన ఒక ఫ్లాష్ బ్యాక్ ఉండటం ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. ఇందులో కూడా అలాంటిదే చూస్తాం. సినిమా నిడివి రెండు గంటలే కావడం కలిసొచ్చింది. ఎక్కడా బోర్ అనిపించకుండా నడిచింది. జాన్ స్టీవర్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మణికందన్ సినిమాటోగ్రఫీ ఆకట్టుకున్నాయి. నటీనటుల పనితీరు: అడివి శేష్ తన ఇంటెన్స్ యాక్టింగ్ తో మెప్పించాడు. కృష్ణ దేవ్ పాత్రకి ఏం కావాలో అది చేశాడు. తన యాటిట్యూడ్, బాడీ ల్యాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ పాత్రకు తగ్గట్టుగా ఉన్నాయి. శేష్ ప్రేయసిగా మీనాక్షి చౌదరి ఆకట్టుకుంది. ఇక శేష్ టీమ్ లో పోలీస్ ఆఫీసర్ గా కోమలి ప్రసాద్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. రావు రమేష్, సుహాస్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి తదితరులు పాత్రల పరిధి మేరకు నటించి మెప్పించారు. తెలుగుఒన్ పర్‌స్పెక్టివ్: హిట్ ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన 'హిట్-2' కూడా ఆకట్టుకునేలా ఉంది. అయితే ఇది ఒక రెగ్యులర్ సైకో థ్రిల్లర్ సినిమాలాగా అనిపిస్తుంది. హిట్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలు మిగతా క్రైమ్ థ్రిల్లర్ సినిమాలకు భిన్నంగా ప్రత్యేకతను చాటుకునేలా ఉంటాయనే అంచనాలతో వెళ్తే కాస్త నిరాశచెందుతారు. రేటింగ్: 2.75/5  -గంగసాని
The senior heroes who are still making waves in Tollywood are Megastar Chiranjeevi and Balakrishna. Their films enthral audiences, and there has always been competition between them. After five years, Waltair Veerayya and Veera Simha Reddy will square off again for Sankranthi 2023.   For the next episode of Nandamuri Balakrishna's talk show Unstoppable 2, he invited renowned producers Allu Aravind, Suresh Babu, and director Raghavendra Rao.   In the promo, Balakrishna says that a film is yet to come in their combination with Allu Aravind. Allu Arvind responds saying "I want to do a multi starrer with you (Nandamuri Balakrishna) and Megastar Chiranjeevi garu. Nandamuri Balakrishna immediately reacts by saying "Then that will be a Pan World Cinema."   Balakrishna's comments have gone viral on social media. We've seen both stars compete against each other on numerous occasions, but we've never seen them together in a single frame.
HIT 2: The Second Case, is the second installment of the HIT Verse by Sailesh Kolanu. The film releasing tomorrow in theatres around the world. Starring Adivi Sesh, the film is carrying sky high expectations among audience.   Today Adivi Sesh attended print and web media Interview and revealed few interesting things about the film. He said "We intend to release the Hindi version of HIT 2 at the end of December. This is not an official date; we are looking at December 30th as a tentative date. And, like Major, we will promote the film through events in major cities thorought India."   Hindi audience eagerly expecting for the film's release in North. Now Major actor revealed this excited news and said that he will be dubbing in Hindi.   Nani is the presenter of the film. Prasanthi Tipirneni bankrolled the film under Wallposter Cinema. Meenakshi Chaudhary is the lead actress. Manikandan is the cinematographer, and Garry BH is the editor.
Thalapathy Vijay’s Varisu/Vaarasudu has been making headlines with every update. It is an upcoming bilingual film directed by Vamshi Padipally. The music was composed by SS Thaman. With Varisu all set to hit the theatres on January 12 next year, another interesting update about the film budget and actors remuneration is now going viral on social media.   Thalapathy Vijay is India's biggest and he has the massive craze in TamilNadu and he holds good market in Telugu and Malayalam also. Now the latest news is that he apparently received massive remuneration for this bilingual.   He received a whopping amount Rs 105 Crores + GST. Only GST is around 19 crores. In other words, he will receive around RS 124 Crores for this big budgeted project.   Director Vamshi Paidipally also received huge remuneration for this project. The actress Rashmika Mandanna and music director SS Thaman also received fat pay checks for the film. Varisu production cost alone is approximately Rs 100 Crores.    Now including all actors remuneration and production costs the film's total budget is around Rs 250 Crores. Dil Raju spent this massive amount on a Pongal family entertainer. Non Theatrical and theatrical business is very good for the film and it remains to be seen how much it collects at Box Office after the release.   On the work front, the Varisu team is shooting the final schedule of the movie in Hyderabad and the works are expected to be completed by the first week of December.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పాప్వులు కదుపు తున్నారా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రానున్న రెండు మూడు నెలల్లో జరగనునన్న  నాలుగు రాష్ట్రాల,పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలకు జరిగే ఎన్నికల్లో  బీజేపీ కి ఆశించిన ఫలితాలు  వస్తే ... ఇక ఆ తర్వాత అధ్యక్ష తరహ పాలనా వ్యవస్థ వైపుగా పావులు మరింత వేగంగా కడులుతాయని అంటున్నారు.నాలుగు రాష్టాలు అస్సాం, పశ్చిమ బెంగాల్ తమిళనాడు,కేరళ, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి శాసన సభలకు  మరో రెండు నెలల్లో ఎన్నికలు జరుగుతాయి. ఇది అందరికీ తెలిసిన విషయం. ఈ ఎన్నికలలో విజయం సాధించడం కోసం, అన్నిరాజకీయ పార్టీలు ఎప్పటినుంచో  సన్నాహాలు చేసుకుంటున్నాయి.అయితే,కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, అందరికంటే మిన్నగా, ఎట్టి పరిస్థితులలోనూ ఒక్క కేరళ తప్పించి మిగిలిన మూడు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో సొంత ప్రభుత్వం కాదంటే  తమ చెప్పు చేతల్లో ఉండే ప్రభుత్వాలు ఏర్పడాలని, అందుకోసం ఎందాకా అయినా వెళ్లేందుకు సిద్దం అన్న సంకేతాలను ఇస్తోంది.  పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్నతృణమూల్ కాంగ్రెస్’ను పూర్తిగా తుడచి పెట్టేస్తోంది, తెర వెంక ఏమి చేస్తోందో ఏమో గానీ, తెరమీద చూస్తే, తృణమూల్ ఎంపీలు, ఎమ్మెల్ల్యేలు, మంత్రులు చివరకు తృణమూల్ అధినాయకురాలు, ముఖ్యమంత్రి మమత బెనెర్జీ సొంత మనుషులు, ఇంటి మనుషులు, కుటుంబ సభ్యులు బారులుతీరి మరీ కమలదళంలో చేరిపోతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా, మరో పది మందివరకు కేంద్ర మంత్రులు, విధ రాష్టాల ముఖ్యమంత్రులు ఇలా ఒకరి వెంట ఒకరు, పస్చిమ బెంగాల్ పై దండయాత్ర చేస్తున్నారు. మమతా బెనర్జీ అంతటి గడుసు పిండాన్ని ఒక్కరి బిక్కిరి చేస్తున్నారు. అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయి అన్నది ఎలా ఉన్నా, ప్రస్తుతానికి అయితే పశ్చిమబెంగాల్ కమల దళం ఖాతాలో చేరినట్లే  అన్న అభిప్రాయమే వ్యక్తమౌతోంది.  అలాగే ఇటీవల పుదుచ్చేరిలో ఏమి జరిగిందో చూశాం, మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న సమయంలో, అధికార కాంగ్రెస్ పార్టీ  ఎమ్మెల్యేలు వరస పెట్టి రాజీనామా చేయడం,ఆవెంటనే ముఖ్యమంత్రి నారాయణస్వామి ప్రభుత్వం కుప్ప కూలిపోవడం, అదే సమయంలో అంతే వేగంగా లెఫ్ట్’నెంట్ గవర్నర్’ కిరణ బేడీ ఉద్వాసన, ఆమె స్థానంలో తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజన్’కు అదనపు బాధ్యతలు అప్పగించడం, ఆమె సిఫార్సు మేరకు, రాష్ట్రపతి పాలన విధించడం అన్నీ  చక చకా జరిగి పోయాయి. గతంలో కర్ణాటక, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలలో బీజేపీ రాజీనామాల రూటులో కాంగ్రెస్ ప్రభుత్వాలను కూల్చి అధికారాన్ని ఎగరేసుకు పోయినా, రాజస్థాన్’లో అలాంటి విఫల ప్రయత్నం చేసిందన్నా కొంతవరకు అర్థం చేసుకోవచ్చునుకానీ, నిండా నాలుగు పుంజీల సభ్యులు లేని పుదుచ్చేరిలో అది కూడా మరో రెండు నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సమయంలో ఇంతటి తెలివి తక్కువ పరువు తక్కవ పని బీజేపీ ఎందుకు చేసింది,అనేది అనేక మందిలో ఉన్న సందేహం. అయితే అందరూ అనుకుంటున్నట్లుగా బీజేపీ నాయకత్వం తెలివి తక్కువగా, పరువు తక్కువ పనులు చేయడం లేదు. పార్టీ లోగుట్లు, అంతర్గత వ్యవహారాలు తెలిసిన అంతరంగికుల సమాచారం ప్రకారం, సంఘ్ పరివార్ సిద్దాంతానికి కార్యరూపం ఇచ్చే వ్యూహంలో భాగంగానే బీజేపీ నాయకత్వం అడుగులు చేస్తోంది. అంతిమ లక్ష్యం, అంతిమ గమ్యం చేరుకోవడంలో ఐడియాలజీ విషయంలో కొంచెం కాంప్రమైజ్’ అయినా ఫర్వాలేదని, ఇటీవల పార్టీ అంతర్గత సమావేశాల్లో సర్దుబాటు ధోరణి స్పష్టంగా కనిపిస్తోందని కూడా లోపలి సమాచారం.  అయితే ఇక్కడ బీజేపీ ముందున్న అంతిమ లక్ష్యం ఏమిటి,అంటే, ఆర్టికల్ 370 రద్దు నుంచి, పాక్ ఆక్రమిత కాశ్మీర్’ తిరిగి భారత దేశంలో కలుపుకోవడం వరకు, ట్రిపుల్ తలాక్ నుంచి ఉమ్మడి పౌర స్మృతి వరకు ... రామ మందిరం నిర్మాణం మొదలు, అధ్యక్ష తరహ పాలన వరకు పార్టీ మూల సిద్ధాంతానికి సంబందించిన అన్ని అంశాలకు సంబందించిన లక్ష్యాలు ఇందులో ఉన్నాయి. గడచిన ఆరేడు సంవత్సరాలలో ఇందులో కొన్ని సాఫల్య మయ్యాయి.  ఇక ఇప్పుడు, కమల నాధులు,జమిల ఎన్నికల మీదుగా అధ్యక్ష తరహ పాలన లక్ష్యంగా పావులు కదుపుతోందని విశ్వసనీయ సమాచారం. నిజానికి అధ్యక్ష తరహ పాలనకు, ఆదాయ తరహ పాలనా వ్యవస్థకు,బీజేపీ, సంఘ్ పరివార్ సిద్దాంత కర్తలు మొదలు సామాన్య కార్యకర్తలు మొదలు అందరూ అనుకూలమే. అందుకే ఎప్పటి నుంచో పార్టీ వేదికల మీద, బయట కూడా ఇలాంటి చర్చ జరుగుతూనే  ఉంది.  నిజానికి ఒక్క బీజేపీలోనే కాదు,ఇతర పార్టీలలోనూ చాలా కాలంగా అధ్యక్ష తరహ పాలనపై  చర్చ జరుగుతోంది. రాజకీయ పార్టీలలో ఇప్పడు చర్చ జరగడంకాదు,రాజ్యాంగ సభలోనూ ఆ దిశగా చర్చ జరిగింది. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, కూడా “అధ్యక్ష తరహా పాలనలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుంది. కాకపోతే జవాబుదారీతనమే కొరవడుతుంది” అంటూ ఎప్పుడోనే తమ అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు.అలాగే రాజ్యాంగసభ చర్చల్లో పాల్గొన్న వల్లభాయ్‌ పటేల్‌ కూడా దేశాధ్యక్షుడు, గవర్నర్‌ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు జరగాలని సూచించారు. ఇక బీజేపీ విషయం అయితే చెప్పనే అక్కర లేదు. బీజేపీ, ఆ పార్టీ సిద్ధాంతకర్తలు మొదటి నుంచీ అధ్యక్ష వ్యవస్థకే మొగ్గు చూపుతున్నారు. బీజేపీ సిద్ధాంత కర్త దీనదయాళ్‌.. అధ్యక్ష వ్యవస్థను సమర్థించారు. మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజపేయి 1998లో చేసిన ప్రసంగంలో.. అధ్యక్ష వ్యవస్థ గురించి ఆలోచించాలని చెప్పారు. రాజకీయ కురువృద్ధుడు, బీజేపీ సీనియర్‌ నేత లాల్‌ కృష్ణ ఆడ్వాణీ కూడా దేశంలో అధ్యక్ష తరహ పాలనకు మద్దతుగా ఉపన్యాసాలు చేశారు.వ్యాసాలు రాశారు.    అలాగే  కాంగ్రెస్ పార్టీ ఏక చత్రాధిపత్యానికి గండిపడిన తర్వాత సుమారు మూడు దశాబ్దాల పాటు సాగిన సంకీర్ణ యుగంలో,అస్థిర ప్రభుత్వాలు సక్రమంగా పాలన సాగించలేని పరిస్థితులు ఏర్పడిన సమయంలోనూ, అధ్యక్ష తరహ పాలన గురించి చర్చ జరిగింది. ఆ నేపధ్యంలో 2014 లో మోడీ నాయకత్వంలో తొలిసారిగా బీజేపీ సారధ్యంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఆ ఎన్నికలలో మోడీ అధ్యక్ష తరహ ఎన్నికల పచారామ్ సాగించారు. ఆ 2019 ఎన్నికల ప్రచారంతో పాటుగా పరిపాలన కూడా అదే తరహాలో పీఎంఓ, ప్రధాన మంత్రి కార్యాలయం సెంట్రిక్’గా పరిపాలన సాగుతోందని ,ఇది కూడా అందుకు మరో సంకేతమని అంటున్నారు.  ఇక ప్రస్తుతానికి వస్తే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సంఘ పరివార్, ప్రస్తుత పార్లమెంటరీ ప్రజాసామ్య వ్యవస్థ స్థానంలో  అధ్యక్ష తరహ వ్యవస్థను తెచ్చేందుకు ఇంతకంటే మంచి సమయం మరొకటి ఉందని భావిస్తున్నారు. పరిపాలన వ్యవస్థలో మార్పులు తీసుకు రావాలంటే అందుకు రాజ్యాంగ సవరణ అవసరం అవుతుంది. రాజ్యంగ సవరణకు రాజ్యాంగంలోని 368 అధికరణం ప్రకారం, ప్రభుత్వం లేదా సభ్యులు ప్రవేశ పెట్టె తీర్మానానికి పార్లమెంట్ ఉభయ సభలు మూడింట రెండు వంతుల మెజారిటీతో ఆమోదించడంతో పాటుగా మొత్తం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల శాసన సభలలో సగం శాసన సభలు ఆమోదించ వలసి ఉంటుంది. అందుకే, బీజేపీ సాధ్యమైన మేరకు రాష్రాలను గెలుచుకుని, తద్వారా రాజ్యాంగ సవరణ, అందుకు కొనసాగింపుగా అధ్యక్ష తరహ పాలనకు శ్రీకారం చుట్టాలని చూస్తోంది.  ఇప్పటికే బీజేపీ 12  రాష్ట్రాల్లో అధికారంలో ఉంది. మరో ఆరు రాష్ట్రాలలో మిత్ర పక్షాలతో కలిసి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్రభుత్వలున్నాయి... ఇక ..పార్లమెంట్ ఉభయ సభలో సొంత బలం కొంత తగ్గినా, మేనేజ్ చేయగల సమర్ధులున్నారు .. సో .. ఇదే అందుకు మంచి సమయమని కమలనాధులు భావిస్తున్నారు. రాజ్యాంగ సవరణ అనుకున్నది అనుకున్నట్లు సాగితే, 2022 చివరిలో అధ్యక్ష పదవికీ, ఎంచుకున్న అధ్యక్ష తరహ పాలనకు అనుగుణంగా పార్లమెంట్ ,శాసన సభలకు  జమిలి ఎన్నికలు జరుగుతాయి. ఆ తర్వాత నరేంద్ర మోడీ అధ్యక్షుడిగా, అమిత్ షా ప్రధానిగా ... కొత్త పాలన వస్తుంది. అయితే, ఇదులో చాలా అయితే గియితే లున్నాయి. రాజ్యాంగ సవరణ సహా, ఇంకా చాలా చిక్కుముళ్ళు ఉన్నాయని అవన్నీ విడతేస్తేనే గానీ, మోడీ ఆలోచనలు కార్యరూపం దాల్చవని న్యాయ కోవిదులు అంటున్నారు. నిజానికి గతంలోనే సుప్రీం కోర్టు రాజ్యంగ ధర్మాసనం రాజ్యాంగం మౌలిక స్వరూపాన్ని మార్చే వీలు లేదని పేర్కొందని, కాబట్టి  మోడీ అలోచన కార్యరూపం  దాల్చడం అంతసులభం కాదన్నమాట కూడా వినవస్తోంది.
అమరావతిని అడ్రస్ లేకుండా చేసేందుకు సీఎం జగన్ రెడ్డి చేయని ప్రయత్నం లేదు. . ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి జై కొట్టిన మడమ తిప్పని నేత.. పవర్ లోకి వచ్చాకా  రాజధాని విషయంలో కంప్లీట్ యూ టర్న్ తీసుకున్నారు. రాజధానిని మూడు ముక్కలు చేశారు. ఆంధ్రుల కలల సౌధాన్ని కుప్పకూలుస్తూ.. అమరావతిని కేవలం శాసన రాజధానికే పరిమితం చేశారు. అక్కడి ఆకాశ హర్మాలు, విశాల రోడ్లను ఎక్కడికక్కడే వదిలేశారు. రాజధాని కోసం రైతులు ఉవ్వెత్తున ఉద్యమం చేస్తున్నా.. ఏమాత్రం కనికరం చూపించలేదు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అలాంటిది సడెన్ గా జగన్ మనసు మారినట్టుంది. ఏపీ కేబినెట్ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే 50 శాతం నిర్మాణం పూర్తయి.. పెండింగ్‌లో ఉన్న భవనాలను పూర్తి చేయాలని సర్కారు నిర్ణయించింది. అందుకు  3వేల కోట్ల బ్యాంక్ గ్యారంటీ ఇచ్చేందకు ప్రభుత్వం అంగీకరించింది. ఇప్పటికీ ప్రారంభం కానీ, కొద్దిగా ప్రారంభమైన భవనాల నిర్మాణాలపై ఇంజనీరింగ్ నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకోవాలని కేబినెట్‌ అభిప్రాయ పడింది.  జగన్ తీసుకున్న తాజా నిర్ణయం ఏపీలో సంచలనంగా మారింది. చంద్రబాబుకు క్రెడిట్ వస్తుందని అమరావతి లాంటి అద్భుత రాజధానిని కాలరాసే ప్రయత్నం చేసిన జగన్ రెడ్డిలో సడెన్ గా ఇంతటి ఛేంజ్ చూసి అంతా అవాక్కవుతున్నారు. అసంపూర్తి భవనాల నిర్మాణం పూర్తైతే.. అమరావతికి కొత్త అందం వస్తుంది. డిమాండ్ పెరుగుతుంది. ఇక విశాఖతో పనేముంది? అమరావతిలో భవనాలను పూర్తి చేస్తున్నారంటే.. ఇక విశాఖలో రాజధాని అంశాన్ని పక్కకు పెట్టేసినట్టేనా? లేక తాత్కాలికంగా ఆపుతారా? ఆలస్యం చేస్తారా? అనే చర్చ జరుగుతోంది. అందుకే జగన్ నిర్ణయంపై అమరావతి రైతులు సైతం ఈ నిర్ణయాన్ని నమ్మలేకపోతున్నారు.  అయితే హైకోర్టులో రాజధాని నిర్మాణం వ్యవహారాలపై విచారణ షెడ్యూల్ వచ్చింది. త్వరలోనే కోర్టుకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉంది. అమరావతి భవనాల నిర్మాణంపై సర్కారు తీరుపై గతంలో హైకోర్టు పలుమార్లు అక్షింతలు వేసింది. కోర్టు ఎంత చెప్పినా సర్కారులో కదలిక రాలేదు. భవనాలు పూర్తి చేయడంపై ఉలుకూ పలుకూ లేదు. ఈ సారి విచారణ సందర్భంగా హైకోర్టుకు అమరావతి భవనాలపై ప్రభుత్వ నిర్ణయమేంటో చెప్పక తప్పని పరిస్థితి. అందుకే, కేబినెట్ లో అంపూర్తి భవనాలు పూర్తయ్యేలా పాజిటివ్ నిర్ణయం తీసుకొని.. ఆ విషయాన్ని కోర్టు ద్రుష్టికి తీసుకెళ్లనుంది సర్కారు. అమరావతి రోడ్ల విషయంలోనూ ఇప్పటికే రివ్యూ కూడా నిర్వహించారు సీఎం జగన్.  ప్రభుత్వ పాజిటివ్ దృక్పదంతో.. భవన నిర్మాణాలు పూర్తైతే.. ఇక అమరావతికి డిమాండ్ అమాంతం పెరగడం ఖాయం. అదే జరిగితే.. ఇక విశాఖపట్నంతో పెద్దగా అవసరం ఉండకపోవచ్చు. ఆకర్షణీయమైన రోడ్లు, భవనాలతో అమరావతి అసలైన రాజధానిగా నిలిచే అవకాశాలున్నాయి. అటు, కేంద్రం సైతం మూడు రాజధానుల విషయంలో జగన్ కు ఇప్పటికే హితబోధ చేసినట్టు సమాచారం. ఇటు హైకోర్టు సైతం కేపిటల్స్ ను తిరష్కరించే అవకాశాలే ఎక్కువ అనేది న్యాయ నిపుణుల మాట. ఇలా ఎలా చూసినా.. భవిష్యత్ లో అమరావతికి మళ్లీ మంచి రోజులు వస్తాయనే ఆశ అక్కడి ప్రజల్లో.  సీఎం జగన్ తాజా నిర్ణయంతో వారి ఆశలు మరింత చిగురిస్తున్నాయి. తమ కలల రాజధాని కోసం మరింతగా పరితపిస్తున్నారు అమరావతి ప్రజలు. 
'సలహా ఇచ్చేవాడు బుద్ధిహీనుడు' అంటారు శ్రీ జిడ్డుకృష్ణమూర్తిగారు. అంటే ఆయన ఉద్దేశం ఎవరైనా ' మీ అనుభవంలో షేవ్ చేసుకోవడానికి ఏ బ్లేడు మంచిదంటారు?' అని అడిగినప్పుడు ఏమీ చెప్పకుండా ఉండాలని కాదు, అలాగే ఒక చోటినుండి మరో చోటికి వెళ్ళడానికి ఏ రూటు బస్సుల్లో ఏదెక్కి వెళ్తే త్వరగా చేరే అవకాశముంటుంది అని అడిగినప్పుడు సలహా చెప్పకూడదని కాదు, జీవితంలో ముఖ్యమైన సమస్యలు అనగా వివాహం చేసుకోవాలా, చేసుకోవడం మానేయాలా లేక ప్రొఫెసర్ ఉద్యోగానికి వెళ్ళమంటారా అని ఎవరైనా సలహా అడిగితే ఇలాంటి సమస్యలకు ఎవరికి వారే సరిగా ఆలోచించుకొని సరైన నిర్ణయం చేసుకోవాలని వారి అభిప్రాయం. ఈ విషయాల్లో సలహాలివ్వాలనుకున్నవాడు చివరకు చాలా పశ్చాత్తాప పడవలసి వస్తుంది. ఇలాంటి వాటిలో ఎవరైనా వచ్చి అడిగినప్పుడే సలహా ఇవ్వడం మంచిది. కాదని అనుకున్నప్పుడు ఇక అడగక ముందే సలహా ఇవ్వజూడడం మరీ అధ్వాన్నమని వేరే చెప్పనక్కరలేదు. ఒకాయనకు "ఫలాని సినిమా చూచి రావోయ్ చాలా బాగుంది" అని సలహా ఇచ్చాడు అతడి మిత్రుడు. అతడి ఆర్థిక ఇబ్బందులు ఏమిటో తెలుసుకోకుండా ఈ సలహా తొందరపడి ఇచ్చాడని చెబుతున్నట్టుగా అతను  ఎగాదిగా చూసి "ఈ సారి ఇలాంటి సలహాలిచ్చేప్పుడు, సలహాతోబాటు నాకూ నా ఫామిలీకి టిక్కెట్లకు సరిపడే డబ్బుకు ఒక చెక్కు రాసి పంపించు" అన్నాడు. ఆ మాటలు ఆ సలహా ఇచ్చిన సదరు స్నేహితుడి నసాళానికి అంటటంతో ఇలా ఇతరులకు ఉచిత సలహాలివ్వకూడదు అని అప్పటి నుండి సలహాలు ఇవ్వడం ఆపేసాడు.  పిచ్చుక గూడు కట్టుకునప్పుడు దాని ద్వారాన్ని క్రిందివైపుగా ఉంచుతుంది. అందువల్ల వర్షం పడినా ఒక్క చుక్క కూడా ఆ గూట్లోకి వెళ్ళకుండా ఆ గూడెప్పుడూ చక్కగా పొడిగా వుంటుంది. బోరున వర్షం కురిసిన ఒకనాడు ఒక పిచ్చుక తన గూటిలో తలదాచుకొని, వర్షం వెలసిన తర్వాత తిన్నగా బయటికి వచ్చి ఒక ఇంటి కప్పుమీద వాలింది. పక్కనే ఒక చెట్టుకొమ్మమీద ఒక కోతి కనిపించింది. కోతికి గూడు నిర్మించుకునే ఆనవాయితీ లేనందువల్ల, వర్షం పడేప్పుడు కూడా అది ఏ చెట్ల కొమ్మలమధ్యో కూచొని అలాగే తడుస్తూ వుంటుంది. చప్పగా తడిసి విచారగ్రస్తమైన మొహంతో కూచున్న కోతిని చూచి ఆ పిచ్చుక దానిస్థితికి జాలిపడి "మిత్రమా నిన్ను చూస్తే నాకు బాధగా ఉంది. నాకుండేదల్లా ఈ ముక్కొక్కటే, అయినప్పటికీ నేనా ముక్కు సహాయంతోనే ఇంత చక్కటి గూడు కట్టుకున్నాను. నీకు చూస్తేనా, మనిషికుండే చేతులూ కాళ్ళూ అనే నాలుగంగాలు ఉండటమే కాక తోక కూడా ఒకటుంది. వీటన్నిటి సహాయంతో నీవో చిన్న నివాసం సులభంగా ఏర్పరుచుకోవచ్చు. అప్పుడు నువ్వీ విధంగా ముద్దగా తడిసిపోవలసిన అవసరముండదు కదా” అన్నది. సద్బుద్ధితో పిచ్చుక ఇచ్చిన ఈ సలహాను కోతి అపార్థం చేసుకున్నది. తనని ఆటలు పట్టించి ఏడ్పించడానికే ఈ పిచ్చుక ఇలా మాట్లాడుతున్నది అని భావించింది. “నీకు మంచి గూడున్నదనీ అందువల్ల నీవు తడవలేదనీ నీకు మహా మిడిసిపాటుగా వున్నట్లుంది. నేను వర్షంలో తడిశానని నన్ను వెక్కిరించడానికి ఆ గూటిలో నుండి ఈ ఇంటి కప్పుమీదికి ఎగిరి వచ్చావన్న మాట. మహా ఎగిరి పడుతున్నావ్, నీ గర్వమణుస్తాను ఆగు" అని అంటూ ఒక్క దుముకు దుమికి ఆ పిచ్చుక గూడును చిందరవందర చేసి నాలుగు వైపులా పారేసింది. "పైసారి వర్షం వచ్చినప్పుడు నాతో బాటు నువ్వూ తడుద్దుగాని” అని హూంకరిస్తూ వెళ్ళిపోయింది. "మనుష్యుల్లో కూడా ఈ కోతి మనస్తత్వం చాలా మందిలో కనిపిస్తుంది” అంటారు స్వామి సచ్చిదానంద. “అలాంటి వారెవరితోనైనా “పోనీ ఇట్లా చేస్తే...”. అని మనం అనే లోగానే వారికి మనమీద చెప్పరాని ఆగ్రహం కలుగుతుంది. అందుచేత వారి గతికి వారిని వదిలివేయడమే శ్రేయస్కరం. అయాచితంగా వారికి సలహాలివ్వవద్దు. వారంతట వారు వచ్చి అడిగేంతవరకూ ఏమీ చెప్పద్దు. చిరునవ్వుతో ముందరికి సాగిపోతూవుండటమే మంచిది.”                                     ◆నిశ్శబ్ద.
ఆలోచన ఒక అవసరానికి ముడివడకుండా ఉన్నంతవరకూ దానికి అర్ధవంతమైన గెలుపు ఉండదు. చాలా మందిలో ఆలోచన అనే ఒక బెరడు, జీవిత సాగరంలో దానికదే తేలిపోతూ ఉంటుంది. లక్ష్యం లేని ఆలోచన ఒక దుర్గుణం. ఆలోచనలను ఆలా తేలిపోనివ్వకూడదు. లక్ష్యం లేని ఆలోచనల వలన చివరకు జరిగేది విధ్వంసమే. ఒక లక్ష్యం లేకుండా జీవించే వారు తేలికగా ఆందోళన, భయం, కష్టాలు నిర్వేదాల ఉచ్చులో పడతారు. ఈ బలహీనతలన్నీ ఖచ్చితంగా జరిగే ఒక పాపపు ప్రణాళికలా  ఓటమికీ, దుఃఖానికీ మరియూ నష్టానికీ దారి తీస్తాయి. ఎందుకంటే శక్తి ఆధారంగా పరిణతి చెందే ఈ విశ్వంలో బలహీనతకి చోటు లేదు. ఒక మనిషి తన హృదయంలో ఒక ఆశయాన్ని కలిగి ఉండి, దానిని చేరుకునేవరకూ పరితపించాలి. ఆ ఆశయాన్ని లేదా లక్ష్యాన్ని తన ఆలోచనల కేంద్రబిందువుగా చేసుకోవాలి. సమయ సందర్భాలను బట్టి, ఆ లక్ష్యం ఆధ్యాత్మిక ఆశయం కావచ్చు, లేదా ప్రాపంచిక విషయం కావచ్చు. అది ఏదైనప్పటికీ తన ఆలోచనాశక్తినంతా దాని మీదే పూర్తిగా లగ్నం చేయాలి. దానినే అతని పరమ విధిగా భావించి వేరే ఇతర వ్యాపకాల పట్ల కోరికల పట్ల, ఊహల పట్ల మనస్సుని పోనివ్వకుండా తదేక దీక్షతో సాధించే వరకూ శ్రమించాలి. ఇదే ఆత్మ నిగ్రహానికి మరియూ నిజమైన ఏకాగ్రతకు రాజమార్గం. ఒక వేళ లక్ష్య సాధనలో మరలా మరలా ఓడిపోయినా (బలహీనతలను అధిగమించేవరకూ ఓటమి ఎలాగూ తప్పదు), వ్యక్తి శీలంలో అభివృద్ధి కనిపిస్తే అది విజమైన విజయానికి ఒక నిదర్శనం, భవిష్యత్తులో సాధించబోయే విజయానికి ఈ ఓటమి ఒక మెట్టులా, ఒక శక్తిలా పనిచేస్తుంది. ఉన్నత లక్ష్యం గురించి ఆదుర్దా వద్దనుకునే వ్యక్తులు చేసేది ఎంత చిన్న పనైనా సరే, దానికి ఏమాత్రం విలువలేదనిపించినా సరే, ఎటువంటి అవకతవకలు లేకుండా తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలనే దాని మీదనే తమ ధ్యాసంతా ఉంచాలి. కేవలం ఈ విధంగానే ఆలోచనలను వృద్ధి చేసుకున్నప్పుడు అవి మరింత శక్తివంతంగా మారి లక్ష్యసాధనలో ఎటువంటి ఆటంకాలు లేకుండా చేస్తాయి. శక్తిని వృద్ధి చేసుకునే ఏకైక మార్గం ఎడతెగని కృషి మరియూ సాధన మాత్రమే అని తెలుసుకుని, దానిని నమ్మిన మరుక్షణం, అతి బలహీనమైన వ్యక్తి అయినా సరే కష్టించి పనిచేయడం ప్రారంభిస్తాడు. కృషికి కృషినీ, ఓర్పుకి ఓర్పునీ, శక్తికి శక్తినీ జోడిస్తూ ఉంటే, వ్యక్తి అభివృద్ధి ఇక ఆగదు. అలా ఎదుగుతూ చివరకు ఎంతో దివ్యమైన శక్తిగా మారుతుంది. శారీరకంగా బలహీనంగా ఉన్న వ్యక్తి సహనంతో జాగ్రత్తగా సాధన చేస్తే ఎలా శక్తివంతంగా తయారవుతాడో అలాగే బలహీనమైన ఆలోచనలు కలిగిన వ్యక్తి సరైన ఆలోచనల వలన మానసికంగా శక్తివంతంగా తయారుకాగలడు. నిర్లక్ష్యాన్ని, బలహీనతనూ దూరంగా ఉంచి, ఒక లక్ష్యం వైపు ఆలోచించడం మొదలుపెట్టడమంటే, ఓటమిని కూడా లక్ష్య సాధనలో ఒక భాగంగా పరిగణించే శక్తివంతులుగా మారడమే. అటువంటి వ్యక్తులు శక్తివంతంగా ఆలోచించి, భయంలేకుండా అడుగు ముందుకేసి, ఎటువంటి పరిస్థితినైనా తమకు అనువుగా మార్చుకుని విజయాన్ని సొంతం చేసుకుంటారు. వ్యక్తి తన లక్ష్యాన్ని నిర్ణయించుకున్న తర్వాత దాన్ని చేరుకునే మార్గాన్ని మానసికంగా ఎంచుకుని దిక్కులు చూడకుండా ఋజుమార్గంలో పయనించాలి. అనుమానాలను, భయాలనూ పూర్తిగా తుడిచిపెట్టెయ్యాలి.  ఎందుకంటే అవి నాశనానికి కారకాలు, కృషి అనే దారిని మళ్ళించి వ్యక్తిని ప్రభావరహితంగా పనికిమాలినవిధంగా తయారుచేయగలవు. అనుమానం, భయం ఎప్పుడూ ఏదీ సాధించింది లేదు, ఎప్పుడూ సాధించలేవు కూడా. అవి ఎప్పుడూ ఓటమికే దారి తీస్తాయి. అవి చేరిన వెంటనే లక్ష్యం, బలం, శక్తి, సంకల్ప శక్తి అన్నీ పనిచేయడం ఆగిపోతాయి. ఏదైనా పని చేయగలమనే జ్ఞానం నుంచే చేయాలనే సంకల్పం పుట్టుకొస్తుంది. అనుమానం, భయం జ్ఞానానికి బద్ధ శత్రువులు. వాటిని చంపేయకుండా ఇంకా ఉత్సాహపరిచే వారు ప్రతి అడుగులోనూ ఇబ్బందికి గురవుతారు. అనుమానాన్నీ, భయాన్నీ జయించినవాడు ఓటమిని కూడా జయిస్తాడు. అతని ప్రతి ఆలోచన, శక్తితో కూడుకుని ఉంటుంది, అతడు ప్రతి కష్టాన్నీ వివేకంతో మరియూ ధైర్యంతో ఎదుర్కొని జయించగలడు. నిర్భయమైన ఆలోచనకు ఒక నిర్దిష్టమైన లక్ష్యం తోడైతే అది సృజనాత్మక శక్తిగా మారుతుంది. ఈ విషయం తెలిసిన వ్యక్తి ఊగిసలాడే ఆలోచనలతో మరియూ కొట్టుమిట్టాడే వాతావరణంతో ఉండే ఒక బుడగలా కాకుండా, పరిస్థితికి ఉన్నతంగా శక్తివంతంగా మారేదానికి సంసిద్ధమవుతాడు. ఈ విషయం తెలుసుకున్న వ్యక్తి తన మానసిక శక్తులను స్పృహతో మరియూ తెలివితేటలతో సమర్ధవంతంగా వాడుకోగలుగుతాడు.                                  ◆నిశ్శబ్ద.
మార్పు అనేది ఎంతో సహజమైనది. తప్పనిసరి అయినది కూడా. మార్పు జరగనిది అంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో. కాలంతో పాటు ఒక దశ నుండి మరొక దశకు రూపాంతరం చెందుతూ, కొత్తగా ఆవిష్కరమవుతూ, ఒక రూపం పతనమవుతూ ఉంటుంది. అయితే ఈ మార్పు నిజంగానే అన్నింటిలో జరుగుతుందా?? ప్రపంచంలో ఉన్న ప్రముఖ తత్వవేత్తలలో ప్లేటో కూడా ఒకరు. ఈయన మార్పు గురించి పరిపరివిధాలుగా విశ్లేషణ చేశారు. ముఖ్యంగా మార్పు గురించి ఈయన విశ్లేషణ ఎంతో లోతుగా సాగుతుంది. మార్పు చెందేవి, మార్పు చెందనివీ అంటూ మార్పు గురించి, అందులో ఉన్న లోతుపాతుల గురించి ప్లేటో చెప్పిన మాటలు... మనం మొట్టమొదటే స్పష్టంగా అడగవలసిన ప్రశ్న ఒకటుంది. ఎల్లప్పుడూ ఉంటూ మార్పు చెందనిదేది? ఎల్లప్పుడూ మార్పు చెందుతూ ఎప్పటికీ ఉండనిదేదీ? హేతువు వల్లా, ఆలోచన వల్లా గ్రహించబడేది ఏదో అదెప్పటికీ ఒక్క స్థితిలోనే ఉంటుంది. మనం దేని గురించి హేతువు సహాయం లేకుండా ఇంద్రియ సంవేదలనల ద్వారా మాత్రమే అభిప్రాయాన్ని ఏర్పరచుకుంటామో అది ఎల్లప్పుడూ మార్పు చెందుతూ, నశిస్తూ ఉండేదే. అదెప్పుడూ వాస్తవంగా ఉండేదే కాదు. మార్పు చెందే ప్రతీదీ సృష్టించబడి ఉండేదే అయిఉండాలి. దాన్ని ఏదో అవసరం కోసం ఏదో ఒక కారణం చేత సృష్టించి ఉండాలి. ఎందుకంటే  కారణం లేకుండా ఏదీ సృష్టించబడదు. సృష్టికర్త తన సృష్టిని మార్పు లేని తరహాలో చిత్రించి ఉంటే అది పరిపూర్ణంగా, సవ్యంగా ఉంటుంది. అలా కాక అతడు ఒక సృష్టి తరహాలోనే తన సృష్టి చేసి ఉంటే అది అపరిపూర్ణంగా, అపసవ్యంగా ఉంటుంది. అప్పుడు సహజంగానే ఈ ప్రశ్న వస్తుంది. నిజానికి ఈ ప్రశ్న మొదటే అడగవలసిన ప్రశ్న.  అదేమంటే ఈ ప్రపంచం అనాదిగా ఎప్పుడూ ఉంటున్నదేనా? లేదా సృష్టించబడ్డదా? దీనికో అది అంటూ ఉందా? ఇది సృష్టించబడ్డదేనేమో, ఎందుకంటే ఇది దర్శనీయం, స్పృశనీయం, దీనికో దేహముంది.  కాబట్టి ఇంద్రియగ్రాహ్యం. ఇంద్రియాల ద్వారా గ్రహించబడేవీ, అభిప్రాయాల ద్వారా తెలియవచ్చేవీ తప్పకుండా ఒక సృష్టిక్రమంలో సృష్టించబడేవే. సరే సృష్టించబడ్డ ప్రతి దానికీ అవసరమూ, ఒక కారణమూ ఉండాలి కానీ ఈ విశ్వానికి సృష్టికర్త ఎవరో మనకి తెలియదు. తెలిసినా దాన్ని తక్కినవాళ్ళకి వివరించలేం అయినా అతన్ని అడగడానికి ఒక ప్రశ్న మిగిలే ఉంటుంది. అతడు ఈ ప్రపంచాన్ని ఏ నమూనా ఆధారంగా నిర్మించి ఉంటాడు? మార్పులేని శాశ్వత వస్తువు ఆధారంగానా? లేక సృష్టించబడి మార్పు చెందే నమూనా ఆధారంగానా?  ఒకవేళ ప్రపంచం సవ్యంగానూ, ప్రణాళిక ఉత్తమంగానూ ఉండి ఉంటే మనం అతని నమూనా మార్పులేని శాశ్వత వస్తువని భావించవచ్చు. అలాకాక మరోలా అయిఉంటే (అటువంటి ఊహే దైవదూషణతో సమానమైనప్పటికి) ఆ నమూనా మరోలా ఉండి ఉంటే, అప్పుడతని నమూనా అశాశ్వత వస్తువని చెప్పవచ్చు. కానీ ఈ ప్రపంచాన్ని చూసి ఎవరేనా ఇట్టే గ్రహించవచ్చు. ఇది శాశ్వత వస్తువు నమూనా మీదనే నిర్మితమయ్యిందని. ఆ శాశ్వత వస్తువుని మనం హేతువు మీద నుండి, ఆలోచన మీద నుండీ మాత్రమే గ్రహించగలమని ప్లేటో చెబుతాడు.                                        ◆నిశ్శబ్ద.
మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్యశాఖ మాతా సురక్షిత్ తార్ ఘర్ సురక్షిత్ కార్యక్రమం లో భాగంగా గత రెండు నెలలుగా మహారాష్ట్ర గ్రామీణ పట్టణ ప్రాంతాలాలో ఆరోగ్యకేంద్రాలలో 18 సం వత్చారాలు పై బడిన మహిళల లో శారీరక మానసిక పరిస్థితుల ను తెలియచేస్తుంది 4,౦1,86,717 మంది మహిళలకు స్క్రీనింగ్ నిర్వహించారు ఇందులో ౩౦ సం వత్సరాలు పై బడిన 1.5 మంది స్త్రీలలో 52,568 మందిని నట్లు వారికి వక్షోజాల్ క్యాన్సర్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు. కాగా మరికొంత మందికి మరిన్ని పరీక్షలు నిర్వహిస్తామని వారిలో ఏ ఏ క్యాన్సర్ లు ఉన్నాయో ఈ స్థాయిలో గుర్తించడం అవసరం అని ఈ రోగులకు రాష్ట్ర ప్రభుయ్హ్వం అవసరమైన చికిత్చకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.స్క్రీనింగ్  సమయంలో వచ్చిన రేపోర్ట్ ఆధారంగా మరికొంత మందిలో నోటి క్యాన్సర్ ఊపిరి తిత్తుల క్యాన్సర్ ప్రాధమిక స్థాయిలో ఉన్నట్లు వాటికి సరైన చికిత్చ చేయవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.  ఈ కార్యక్రమం లో స్వచ్చంద సంస్థలు క్యాన్సర్ ఆసుపత్రులు చికిత్చలో పాల్గొనాలని ఇందులో మహిళలు తల్లులు వారి  బి ఎం ఐ ఆదారంగా రక్తం,మూత్ర పరీక్షలు ,డయాబెటిస్,హిమాగ్లోబిన్ శాతం ఎంత ఉందొ పరీక్షిస్తున్నారని ఈ నెల చివరి నాటికి ముగుస్తుందని ఆరోగ్యశాఖ అధికారి అనిరుద్ధ దేశ్ పాండే వెల్లడించారు.వీరిలో చాలా మందికి క్యాన్సర్ తో పాటు ఇతర నాన్ కమ్యునికేబుల్ డిసీజెస్ కూడా ఉంది ఉండవచ్చని క్యాన్సర్ సమస్యలు కూడా ఉన్నాయని చాలాకేసులను ప్రాధమిక స్థాయిలో గుర్తిస్తే చికిత్చ సాధ్యమని అన్నారు. కొందరిలో నాన్ కమ్యునికేబుల్ వ్యాధులు ఉన్నా లక్ష్సణాలు లేవని అయితే వారు ఆరోగ్యంగా ఉన్నారని వారి పై వ్యాధి వారి శరీరం పై చాలా ఆలస్యంగా ప్రభావం చూపుతుందని రోగులకు మరిన్ని పరీక్షలు చేయడం ద్వారా అవసరమైన చికిత్చ,లేదా శాస్త్ర చికిత్చ కు కూడా వెనుకడ బోనని అధికారులు వెల్లడించారు.    
ప్రపంచం ఎన్నో విషయాలలో ఎంతో ముందుకు దూసుకుపోతున్న కొన్ని విషయాలలో వెనుకబడే ఉంది అని చెప్పడానికి ఇది ఒక సాక్షం.. ప్రస్తుతం మనం ఉన్న 21 వ శతాబ్దంలో వైద్య రంగం అభివృద్దిసాధించింది. పరిశోధనలుకొనసాగుతున్నాయి. అయినా ఎయిడ్స్ వ్యాధి కి మెరుగైన వైద్యం అందకపోవడం విచారకరం.హెచ్ ఐ వి వ్యాధిగ్రస్తుల సంఖ్య తగ్గు ముఖం పట్టిందని అనుకోడం మన సంతృప్తి కోసమే వాస్తవానికి కొన్ని కాటోర వాస్తవాల పై స్పెషల్ ఫోకస్.ఎయిడ్స్ అనగా అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోం. ఈ ఎయిడ్స్ వ్యాదిని హెచ్.ఐ.వి. కలుగజేస్తుంది.ఇది ఒక రకమైన వైరస్.. దీనిని హ్యూమన్ ఇమ్యునో  డెఫిషియన్సీ వైరస్ అంటారు. ఈ వ్యాధిని ముందుగా 4 H Diseases గా పిలిచేవారు.  జూలై 1982లో ఎయిడ్స్ అనే నామ కారణం  చేసారు . ఇది మన శరీరంలో వ్యాధుల నుండి పోరాడే తెల్ల  CD 4 రక్త కణాలను ఈ వైరస్ నాశనం చేస్తుంది. ప్రపంచంలో ఎయిడ్స్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం దక్షిణాఫ్రికా... ప్రపంచంలో తొలి ఎయిడ్స్ కేసును అమెరికా 1981 లో  నమోదు అయింది.భారతదేశంలో తొలి ఎయిడ్స్ కేసు 1986 మే నెలలో చెన్నై లో నమోదయ్యింది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ప్రోగ్రాం ను 1999 లో ప్రారంభించారు. NACO అనగా నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 2010 వరకు ప్రపంచంలో మొత్తం HIV AIDS రోగుల సంఖ్య 3,40,00000 కాగ 2010 సంవత్సరంలో కొత్తగా నమోదయిన రొగుల సంఖ్య 27,000,000. ఎయిడ్స్ బాధితులలో అత్యధికులు ఆఫ్రికా ఖండంవారే. వారి తరువాత 3 వ  స్థానంలో భారతదేశం ఉందితెల్చిచెప్పింది ఎయిడ్స్ వ్యాధి బారిన పడుతున్న వారి సంఖ్య  తెలుగు రాష్ట్రా లలో చాలా తొందరగా పెరుగుతుందని కేంద్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ (NACO) చెబుతుంది. 2009 లెక్కల ప్రకారం మన దేశంలొ మొత్తం HIV/AIDS రోగుల సంఖ్య 23,95,442 అలాగే 2009 వరకు మన రాష్ట్రంలో HIV/AIDS రోగుల సంఖ్య 4,99,620 గా ఉంది. ఒక్క 2011-2012 లోనే నమోదైన HIV/AIDS కేసులు 2,66,919 గా నమోదు కావడం కాస్త ఆందోళన కలిగిస్తోంది. మన ఆంధ్రప్రదేశ్‌‌లో అయితే 60,952. మన దేశంలొ మొత్తం NACO నుండి ఉచితంగా ART మందులు అందుకుంటున్న HIV/AIDS రోగుల సంఖ్య March 2012 వరకు 5,16,412. ఆంధ్రప్రదేశ్ నుండి 1,13,106 గా వుంది. దేశంలో 20% మంది ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నారు.ఈ సంఖ్యలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఇందుకు భిన్నంగా , NACO లో నమోదు చేసుకొకుండా ప్రైవేటుగా చికిత్స అందే వారి వివరాలు నమోదు కావడం లేదని తెలుస్తోంది. హెచ్ఐవి మరియూ ఎయిడ్స్:మధ్య వ్యత్యాసం ఉందా? తాకినా,కలిసి తిరిగినా, కలిసి భోజనం చేసినా బట్టలు వేసుకున్నా,ఎయిడ్స్ వస్తుందా?పచ్చ బొట్టు వేసుకున్నాఒకరు వాడిన బ్లేడ్ లు,సూదుల వాళ్ళ వస్తుందా  అన్న సందేహాలు అపోహలు ఉన్నాయి అసలు వాస్తవం ఏమిటి?అన్నవిషయం తెలుసుకుందాం.హెచ్ఐవి వైరసు ఉన్న అందరికీ ఎయిడ్స్ ఉన్నట్లు కాదు. శరీరం లోపల హెచ్ఐవి వైరస్ ఉన్నా కూడా కొన్ని సంవత్సరాల పాటు ఆరోగ్యంగానే కనిపిస్తారు. వారికి ఎప్పుడయితే ఆరోగ్యం నశిస్తుందో అప్పుడు ఎయిడ్స్ వచ్చినట్లు పరిగణించడం జరుగుతుంది. ఒక వ్యక్తి శరీరంలో హెచ్ఐవి వైరసు ఉన్నట్లయితే అతనిని హెచ్ఐవి పాజిటివ్ అని సంభోదిస్తారు.హెచ్ఐవి ఉన్న వారికి ఎయిడ్స్ వచ్చినట్లు ఎప్పుడు నిర్ధారిస్తారంటే: •రక్త పరీక్ష చేసినప్పుడు రోగనిరోదకత బాగా క్షీణించిందని తేలినప్పుడు.CD4 కణాల సంఖ్య 5౦౦ కంటే తక్కువ ఉన్నప్పుడు •ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు మనుషులలో సహజంగా రోగనిరోధక శక్తి ఎన్నో రోగాలను అడ్డుకుంటుందిటాయి. ఆ నిరోధక శక్తి నశించినప్పుడు రుగ్మతలు శరీరంలోకి చేరుకుంటాయి.ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు సాధారణంగా, ఆరోగ్యవంతులెవరికీ రావు. అందుకనే వీటికి ఎయిడ్స్ కలిగించే రుగ్మతలు అని పిలుస్తారు. ఎయిడ్స్ కలిగించే కొన్ని రుగ్మతలు: •హర్ప్‌‌స్ జొస్టర్ ( శింగెల్స్ గజకర్ణము )Herpes Zoster Virus (shingles) •కపోసీస్ సర్కోమా (Kaposi's Sarcoma) - సాధారణంగా చర్మానికి వచ్చే క్యాన్సరు. •సిఎంవి రెటీనైటిస్ (CMV Retinitis) - కంటి వెనుక భాగంలో సోకే ఒక వైరసు. •న్యుమోనియా (PCP) - ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులలో చాలా మందికి సోకే రోగము, ఇది ఊపిరితిత్తులకు సోకుతుంది •టాక్సోప్లాస్మోసిస్ (Taxoplasmosis) - ఈ రోగము మెదడుకు సోకుతుంది. •క్షయ (Tuberculosis) •ఇన్వేసీవ్ సర్వికల్ క్యాన్సర్ (Invasive Cervical Cancer) - ఇది ఆడవారి గర్భకోశం కింద వ్యాపించే క్యాన్సరు. హె.ఐ.వి  ఉందని చాల మందికి అసలు తెలియదు. హెచ్ ఐ వి ఉందని తెలిసినా దాన్ని నిర్లక్ష్యం చేయడం, సరైన వైద్యం తీసు కోక పోవడం వాళ్ళే వ్యాధి తీవ్రత పెరిగి నీరసించి పోతు ఉంటారు. ఫలితం తీవ్ర అనారోగ్యానికి గురి అవుతున్నారు.అసలు నిర్ధారణకు చేసే పరీక్షలు ఏ మిటో తెలుసుకుందాం.బాగా వ్యాధి ముదిరేవరకు తమలో జబ్బు ఉందని ఎవరూ అనుకోరు,ఊహించరు. కలిగిన అనారోగ్యానికి కారణం తెలుసుకోవడానికి జరిపే వైద్యపరీక్షలలో ఇటువంటి ప్రాణాంతక జబ్బులు బయటపడతాయి. హెచ్.ఐ.వి.కి చేసే పరీక్షలలో ముఖ్యమైనవి 1. ట్రైడాట్,2.వెస్ట్రన్ బ్లాట్, 3.సి.డి సెల్ కౌంట్. ట్రైడాట్: ఎలీసా టెస్ట్స్ లో ఇది మొదటిది. మనిషి శరీరములో ప్రవేశించిన 'హెఐవి' క్రిములకు ప్రతిస్పందన కణాలు (Antibodies)తయారవడానికి 3-6 నెలలు పడుతుంది. అప్పుడే ఈ పరీక్ష ద్వారా ఎయిడ్స్‌ను గుర్తించవచ్చు. 'హెఐవి' ఉందా? లేదా? అని మాత్రమే తెలుస్తుంది . ఈ టెస్ట్ చేయడము తేలిక, తొందరగా అయిపోతుంది. మాస్ స్క్రీనింగ్ విధానములో ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది పూర్తిగా నిర్ధారణ అయిన పరీక్ష కాదు. వెస్ట్రన్ బ్లాట్:హెచ్.ఐ.వి నిర్ధారణ కోసం ఉపయోగించే పరీక్ష ఇది. ఖర్చు ఎక్కువ. వారం రోజులు పడుతుంది. పూర్తి టెస్ట్ వివరాలకోసం వేరే చోట చూడండి. సిడి4 కణాల సంఖ్య:మనుషుల రోగనిరోధకతకు రక్తంలో సిడి4 అనే రకం తెల్ల రక్తకణాలు ఎంతో దోహద పడతాయి. ఇవి రోగకారక జీవాలతో పోరాడి మనుషులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అయితే హెచ్ఐవీ ఈ సిడి4 కణాలను చంపేస్తుంది. హెచ్ఐవి పెరుతున్నకొద్దీ ఈ సిడి4 కణాలు నశించటం ప్రారంభిస్తాయి. ఒక మైక్రోలీటరులో 200 కన్నా తక్కువ సిడి4 కణాలు ఉన్నట్లయితే అప్పుడు ఎయిడ్స్ ఉన్నట్లు ద్రువపరుస్తారు. మనుషుల శరీరంలో ఎయిడ్స్ ఏం చేస్తుంది?మరణానికి చేరువగా తీసుకు పోయే ఎయిడ్స్ లక్షణాలు ఎలా ఉంటాయి?ఆవివరాలు అందరు తెలుకోవడం ముఖ్యం. లక్షణాలు గుర్తించి తగు జాగ్రత్త తీసుకోడం ముఖ్యం అంటున్నారు వైద్యులు. ఆవివరాలు మీకోసం.హెచ్ఐవి వైరస్ మనుషులలో చేరిన వెంటనే, రోగనిరోధకతా శక్తిని దెబ్బతీస్తుంది. తద్వారా వ్యాధి గ్రస్తులు జలుబు తదితర అంటురోగాల బారిన త్వరగా పడతారు. అంతేకాక వ్యాధి నిరొదకత తగ్గినకొద్ది ఎయిడ్స్ అహ్వానిత వ్యాధులు (Opportunistic Infections ) రావటం మొదలు పెడతాయి.ఒక్కసారి గనక ART మందులు వాడటం మొదలుపెడితె ఈ వ్యాధులు రావటం అరుదు.  హెచ్ ఐ వి లక్షణాలు: సాధారణంగా వైరస్ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత కొన్ని నెలల (కనీసం 3 నుండి 6 నెలల )వరకు రక్త పరీక్ష ల ద్వారా వైరస్ జాడ కనుగోనలేము దీనినె Window Period అంటారు. ఈ క్రింది లక్షణాలు హెచ్ ఐ వి రోగులలో కనిపిస్తాయి. జ్వరం, నోటి పూత, చర్మ వ్యాధులు, నీరసం, నీళ్ళ విరేచనాలు, ఆకలి తగ్గిపోవుట, అలసట, పది శాతం బరువుని కోల్పోవడం, గ్రంథుల వాపు ( గొంతు క్రిందుగా )Swollen lymph nodes, మొదలగునవి హెచ్ ఐ వి వ్యాధి యొక్క ప్రధాన లక్షణాలు.ఒక్కసారి మనిషి శరీరంలొ హెచ్ ఐ వి వైరస్ ప్రవేశించాక కొందరికి పై లక్షణాలలొ కొన్ని కనబడి కొద్దిరోజుల్లో తగ్గిపోవచ్చు. కొందరిలొ అసలు ఎలాంటి లక్షణాలు కనపడకపొవచ్చు. హెచ్ ఐ వి వైరస్ చాల నెమ్మదిగా, బద్దకంగా శరీరంలో వ్యాపిస్తుంది. హెచ్ ఐ వి నుండి ఎయిడ్స్ దశకు చెరుకోవాటానికొ దాదాపు 10 సంవత్సరాలు పడుతుంది, కొందరిలొ అంతకంటె ఎక్కువ కూడ. కొందరిలో ఈ పది సంవత్సరాల కాలంలొ ఎలాంటి లక్షణాలు కనపడకపోవచ్చు. దీన్నే Asymptomatic Period అంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు హెచ్ ఐ వి టెస్ట్ చెసుకొని నిర్ధారించుకోవాలి. సరియైన సమయంలొ ART మందులు వాడటం మొదలుపెడితె జీవితకాలాన్ని 25 నుండి 30 సంవత్సరాలవరకు పొడిగించుకొవచ్చు. ప్రతి సంవత్సరం కొత్త కొత్త మందులు అందుబాటులొకి రావటం ద్వారా ఎయిడ్స్ రొగుల జీవితకాలం పెరుగుతు ఉంటుంది. హెచ్ఐవి మరియు ఎయిడ్స్‌ల చికిత్స:ఉందా?ఇన్ని వైద్య పరిసోదనలు జరుగు తున్నా హెచ్ ఐ వి కి సరైన వైద్యం లేకపోడం దురదృష్టకరం. మందులు ఉన్నాయంటూ కొన్ని సంస్థలు చేస్తున్న ప్రచారం లో నిజం ఎంత. హెచ్ ఐ వి రోగులు ఇప్పటికీ మోసానికి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.HIV  ని పూర్తిగా నిర్మాలిస్తాం అన్న ప్రకటన ఎంత అబద్దమో HIV కి చికిత్స లేదు అన్నది అంతె అబద్ధం. HIV కి WHO ప్రామాణికరించిన   అత్యంత సమర్థవంతమైన చికిత్స ఉంది. ఈ ART మందులతొ మరియు మంచి జీవన శైలిసహాయంతొ, HIV లేని వాళ్ళు ఎన్ని రోజులు బ్రతుకుతారొ HIV ఉన్న వాళ్ళు దాదాపు అన్ని రోజులు బ్రతకడం ఈ రోజుల్లో సుసాద్యంకాని ఇది అన్ని వేళలా సాద్యం కాదు రోగి మందులు  వేళకు వేసుకొవటం (Drug Adherence), రోగి జీవన శైలి ( ధూమపానం, మద్యపానం లాంటి చెడు అలవాట్లు), పౌష్టికరమైన ఆహారం (Protein Rich Food), వేళకు డాక్టరు గారు సూచించన ప్రకారం Lab Testలు, మీరు మందులు ప్రారంబించినప్పుడు ఉన్న CD4 సంఖ్య వీటన్నింటి పైన అదారపడి ఉంటుంది. ఒక్క సారి చికిత్స ప్రారంభించిన తర్వాత చికిత్సను నిలిపివేయడం అత్యంత ప్రమాదకరం ఒక్కసారి గనక చికిత్స ప్రారంభిస్తే జీవితాంతం మందులు వెసుకొవలసి ఉంటుంది. ప్రస్తుతానికయితే ఎయిడ్స్  ని పూర్తిగా నిర్మూలించటానికి ఎటువంటి మందు కానీ టీకా కానీ తయారు చేయలేదు. కానీ దాని తీవ్రతని తగ్గించటానికి మందులు ఉన్నాయి, అవి కొంచెం ఖరీదయినవే. కొన్ని హెచ్ఐవి వైరసులు కొన్ని మందులను తట్టుకోగలవు, అలాగే ఒకే రకమైన మందులను కొన్ని సంవత్సరాలు వాడుతుపోతు ఉంటే హెచ్ఐవీ వైరస్.., మందులను తట్టుకునే సామర్థ్యం పెంచుకుంటాయి. అందుకనే ప్రతి కొన్ని సంవత్సరాలకు మారుస్తు ఉంటారు. కొన్నయితే ఒకటి కంటే ఎక్కువ మందులను తట్టుకోగలుగుతున్నాయి.దీనినే వైరస్ రెజిస్టన్స్ అంటారు. అందుకని వాటి చికిత్సకు ఒకేసారి రెండు మూడు రకాల మందులను వాడుతూ ఉంటారు ఈ మందులనే హెచ్ఐవి కాక్‌టెయిల్ అని లేదా Fixed Dose Combination ( ఇందులో రెండు లేదా అంతకంటె ఎక్కువ మందులు ఒకే టాబ్లెట్ గా ఉంటాయి ) అని పిలిస్తారు. కాబట్టి శాస్త్రజ్ఞులు ఎప్పటికప్పుడు హెచ్ఐవితో పోరాడటానికి కొత్త కొత్త మందులను కనిపెడుతూనే ఉన్నారు. ఎయిడ్స్ ని అరికట్టడం: సాధ్యమేనా అందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నం సూన్యమేనా  స్వచ్చంద సంస్థలు చేస్తున్న సేవలు ప్రభుత్వం అందించ లేక పోతోంది. హెచ్ ఐ వి తో బాధ పడే వారి కోసం ప్రభుత్వాలు అందిస్తున్న రాయితీలు ఇతర సౌకర్యాల వివరాలు ఏమిటి అన్న సమాచారం పూర్తిగా అందడం లేదని బాదితులు వాపోతున్నారు. ఇంకా హెచ్ ఐ వి సోకిన వారి పట్ల వివక్ష కోన సాగుతూనే ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులలో సుర్జరి చేసేందుకు నిరాక రిస్తున్నారని బాదితులు తమ గోడును వెళ్ళ గక్కారు.అయితే  ఎయిడ్స్ ను పూర్తిగా నివారించే  చికిత్స ప్రస్తుతానికి లేదు. అందుకని దానిని నివారించడం ఎంతో ఉత్తమం. ఎయిడ్స్ రాకుండా దానిని అరికట్టటానికి చాలా మార్గములు ఉన్నాయి. ప్రభుత్వం అన్ని రిఫరల్ ఆసుపత్రులలో స్వఛ్ఛందంగా రక్తం పరీక్షించుకోడానికి, సరియైన సలహాలు పొందడానికి VCTC కేంద్రాలను ఏర్పరచింది.
అలా సరిగా కూర్చోనట్లయితే అష్టా వక్ర భంగిమలలో మీరు కూర్చుంటే వెన్ను నొప్పి, మెడ నొప్పికి ఆహ్వానం పలికినట్లే అని అంటున్నారు నిపుణులు.ఈ మధ్య కాలం లో స్మార్ట్ ఫోన్ వినియోగం ల్యాప్ టాప్ వినియోగిస్తూ దీర్ఘకాలం పాటు కూర్చుంటున్నారా బెడ్ పై పడుకునే టప్పుడు బెడ్ సరిగ్గా ఉందా ?సరైన భంగిమలో పడుకుంటు న్నారా ?అలా కానట్లయితే మీ చేతి వేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూస లోని జాయింట్స్ అరిగి పోతాయి. ఆస్టియో ఆర్తరైటిస్ వంటి వ్యాధులు బారిన పడతారు. మీరు దీర్ఘ కాలం పాటు వాడకం లేదా కూర్చునే భంగిమ పడుకునే భంగిమ లో ఏమాత్రం తేడా ఉన్నా సరిగ్గా లేకపోయినా మీవేళ్ళు ముంజేయి, మెడ, వెన్ను పూసా అరిగి పోతుంది.4౦ సంవత్సరాలు పై బడిన వారిలో వచ్చే ఆస్టియో ఆర్తరైటిస్ వల్ల కీళ్ళు,జాయింత్స్ లో అరుగుదల కనిపించించింది.ఈ సమస్య ఇప్పుడు 2౦ సం వచ్చరాల వాళ్ళలో అరుగుదల కనిపిస్తుంది. దాదాపు దగ్గర ఫగ్గర 1౦ నుండి 15%సమస్యలు  15౦ మంది రోగులలో రోమటాలజీ విభాగం లైఫ్ స్టైల్ డిజార్దర్ గా  పేర్కొన్నారు.ఇటీవల కాలం లో వెన్ను నోప్పితో బాధపడుతున్నారన్న పలురోగులను హెచ్ ఓ డి ప్రొఫే సర్ ఉమాకుమార్ అవుట్ పేషంట్ బ్లాక్ లో చూస్తున్నప్పుడు వచ్చిన పలు సమస్యసలను ప్రస్తావించారు. ఒక కేజీ బరువు పెరిగినా ఒత్తిడి పెరిగి కీళ్ళు పిరుదల పై నుండి ౩ నుండి 6 రెట్లు నొప్పులు పెరుగుతాయి.మెడను వంచడం 15 డిగ్రీ ల యాంగిల్ లో ఉంటె స్మార్ట్ ఫోన్ మాట్లాడం వల్ల 11 కే జీల బరువు పెరిగి మెడ వెన్ను నొప్పికి దారితీస్తుందని నిపుణులు పేర్కొన్నారు.ఎవరైతే ఎక్కువగా ౩౦ డిగ్రీల యాంగిల్ లో కింది భాగం లో స్మార్ట్ ఫోన్ లో చూస్తారో 18 కే జి ల ఒత్తిడి పెరిగి వెన్ను మెడ నొప్పి కి సంబందించిన సమస్యలు వస్తాయి.మీ మెడను కిందికి వంచే బదులు ఫోన్ ల్యాబ్ టేబ్ పైన పెట్టుకోవాలని దీని వల్ల కంటిని కాపాడవచ్చునని డాక్టర్ కుమార్ అన్నారు.ఎప్పుడైతే భుజాలు మెడ ముందుకు వంగు తాయో ముందు భాగం లో ఉన్న కండరాలు గట్టి పడి వెనుక వైపు భాగం లో ఉన్న నరాలు కండరాలు బలహీన పడతాయి ఈ కారణంగా ఒక పక్కన కండరాలు బలహీన పది కండరాల మధ్య సమతౌల్యం లోపించి దీనివల్ల స్పోండి లైటిస్ స్పొండోలసిస్ వంటి సమస్యలు వస్తాయని డాక్టర్ కుమార్ వివరించారు. ఆర్తరైటిస్ కు అవుట్ పెషంట్ గా వస్తున్నారని అంకి లోజింగ్ స్పాం డి లైటిస్ రోమటైద్ ఆర్తరైటిస్ వంటి సమస్యలతో వస్తున్నట్లు గుర్తించామన్నారు.జీవన శైలి విధానాల వల్ల సమస్యలతో బాధపడుతున్నారని లైఫ్ స్టైల్ డిజార్డర్స్ గా డాక్టర్ కుమార్ పేర్కొన్నారు.ఇలాంటి రోగులకు  ఆక్యుపేషనల్ తెరఫీ ని సూచించి నట్లు తెలిపారు అదీ వారు కూర్చునే భంగిమజీవన శైలి విధానం లో మార్పులు చేస్తే కొంత మేర సమస్యనుండి బయట పడవచ్చునని నిపుణులు సూచిస్తున్నారు.ఈ సందర్భంగా ఒక కేసు విషయాన్ని ప్రస్తావించారు.ఇతను 2౩ సంవత్చరాల పురుషుడు  అతను ఎక్జి క్యుటివ్ గా పనిచేస్తున్నారు కాల్ సెంటర్ లో పనిచేసే ఉద్యోగని తెలిపారు అతను వెన్ను నొప్పి తో బాధపడుతున్నాడని ఓపి డిలో నమోదు చేసినట్లు తెలిపారు. ఆ వ్యక్తి చేతి వేళ్ళు స్పర్స లేకుండా పోయాయని. నాలుక పై భాగం సైతం తిమ్మిరిగా స్పర్స కోల్పోయారని నిర్ధారించారు.పూర్తి పరీక్షలు నిర్వహించిన తరువాత అతని కూర్చునే భంగిమలో పడుకునే భంగిమలో తప్పు ఉందని మొబైల్ ఫోన్ కీబోర్ద్ ఎక్కువ సేపు వినియోగిస్తున్నాడని చాలా ఫోన్స్ మాట్లాడాల్సి ఉంటుందని అప్పుడు మొబైల్ ఫోన్ 6 నెలల పాటు జీవనశైలి లో మార్పులు చేయాలని  సూచించామని అన్నారు. అయితే అతనికి యాంకిలో జింగ్ స్పోండి లైటిస్ గా నిర్ధారించారు.అందుకు ప్రజలు వారి వారి పని చేసే ప్రదేశాలలో వారు కూర్చ్గునే భంగిమ నిటారుగా గుర్తించడం వాటిని వారు నియంత్రించుకోవాలి వారికి అత్యధికంగా నొప్పి వచ్చినప్పుడు మార్చుకునే ప్రాయత్నం చేయాలి అందుకోసం ఆర్గనామిక్ సెట్ అప్ చేసుకోవాలి.మోచేయి 9౦%టేబుల్ ల్యాబ్ టాబ్ టేబుల్ పై ఉండే విధంగా మానీటర్ మీకీబోఅర్డ్ కింది భాగం లో ఉండాలి 2౦ నిమిషాల తరువాత 2౦ సెకండ్లు విరామం అవసరం సుదీర్ఘంగా పనిచేయకుండా విరామం తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు కూర్చ్గున్నవద్దె కదలకుండా పనిచేస్తే సమస్యలు తప్పవని నిపుణులు పేర్కొన్నారు.