LATEST NEWS
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని మచిలీపట్నం నియోజకవర్గంలో  తెగ హడావుడి చేస్తున్నారు. అనుచరవర్గాన్ని చెదిరిపోకుండా చూసుకోవడానికి నానా పాట్లూ పడుతున్నారు. గత ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత దాదాపు వైసీపీ క్యాడర్ చెల్లాచెదురైపోయినట్లు కనిపిస్తున్నది. జగన్ చుట్టపుచూపుగా రాష్ట్రానికి వస్తున్నారు. అడపాదడపా పరామర్శలంటూ రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో వినా మిగిలిన సమయంలో రాష్ట్రంలో వైసీపీ పరిస్థితి ఉనికి మాత్రంగానే మారింది. గత ఎన్నికలలో వైసీపీ కేవలం 11 స్థానాలలో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఆ గెలిచిన స్థానాలలో కూడా వెసీపీ స్తబ్దుగానే ఉంది. అయితే మచిలీపట్నంలో మాత్రం వైసీపీ హడావుడి ఒకింత ఎక్కువగా ఉంది. మచిలీపట్నంలో గత ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిగా పేర్ని నాని కుమారుడు పేర్ని కిట్టు పోటీ చేసి ఘోర పరాజయాన్ని ఎదుర్కొన్నారు. ఇప్పుడు పేర్ని నానికి కుమారుడి రాజకీయ అస్తిత్వం కాపాడాలంటే జనంలో కనిపించడం వినా మరో మార్గం లేకుండా పోయింది. అందుకే అవనసరపు హడావుడితో నిత్యం వార్తల్లో నిలుస్తున్నారనీ, కాదు కాదు వార్తల్లో ఉండటానికి పాకులాడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   రాష్ట్రవ్యాప్తంగా ఓడిపోయిన  నియోజకవర్గాల్లో వైసీపీ నేతలు మౌనాన్ని ఆశ్రయించినా, ఓడిపోయినప్పటికీ మచిలీపట్నంలో మాత్రం పేర్ని నాని హడావుడి చేస్తున్నారు. స్థానిక అంశాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వరకు ప్రతిదానికీ స్పందిస్తూ మీడియా ముందుకు వస్తున్నారు.  కేసులు, అరెస్టులు వంటి బెదిరింపులకు వెనకాడబోమంటూ సవాళ్లు విసురుతున్నారు. వాస్తవంగా కేసులు, అరెస్టుల వరకూ వచ్చే సరికి పలాయనం చిత్తగించి, అవి సద్దుమణగగానే మళ్లీ హడావుడి పెంచుతున్న పరిస్థితి.  ఇందుకు తన కుమారుడి రాజకీయ భవిష్యత్ పై పేర్ని నానికి ఉన్న ఆందోళనే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పుడు తాను సైలంట్ అయితే.. మచిలీపట్నంలో పోలిటికల్ ఎగ్జిస్టెన్స్ ప్రశ్నార్థకమౌతుందన్న ఆందోళనే నానిని చీటికీ మాటికీ మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడం ద్వారా లైమ్ లైట్ లో ఉండేందుకు తాపత్రేయపడేలా చేస్తున్నదని అంటున్నారు. అయితే నాని ఈ తాపత్రేయం ఎంతవరకూ ఫలిస్తుందన్నది మాత్రం ప్రశ్నార్థకమేనని పరిశీలకులు అంటున్నారు. రాజధాని అమరావతికి అతి సమీపంలోని నియోజకవర్గం అయిన మచిలీపట్నంలో అమరావతికి వ్యతిరేక స్టాండ్ తీసుకున్న పార్టీగా వైసీపీ పుంజుకునే అవకాశాలు అంతంతమాత్రమేనని చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో పేర్ని నాని ఎంతగా పాకులాడినా పట్టు నిలుపుకోవడం అంత తేలిక కాదనీ చెబుతున్నారు. 
కాకినాడ మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్  నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై చర్యలకు జనసేన పట్టుపడుతోంది. జగన్ హయాంలో జనసేనాని పవన్ కళ్యాణ్‌పై ద్వారంపూడి చేసిన వ్యక్తిగత విమర్శలు, సవాళ్లు తెలిసిందే.  అప్పట్లో పవన్ వర్సెస్ ద్వారంపూడి అన్నట్టుగా సాగిన మాటల యుద్ధాన్ని దృష్టిలో పెట్టుకున్న జనసేన నాయకులు,  కూటమి అధికారంలోకి రావడంతో ఆయనపై చర్యలకు ఒత్తిడి పెంచుతున్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన జనసేన నేతలు ద్వారంపూడిపై చర్యల తీసుకోవాల్సిందే అని ఒత్తిడి తీసుకువస్తున్నారు. ఈ నేపథ్యంలోనే   అవినీతి బండారాన్ని బట్టబయలు ప్రభుత్వం పకడ్బందీగా అడుగులు వేస్తున్నదని అంటున్నారు. రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్‌లో ద్వారంపూడికి ఉన్న పట్టును సడలించడం ద్వారా ఆయన ప్రాభవాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఇప్పటివరకు ఈ అసోసియేషన్ ఆయన కనుసన్నల్లోనే నడుస్తున్న పరిస్థితి. అక్కడ ఆయన ఆధిపత్యాన్ని దెబ్బతీయడమే లక్ష్యంగా జనసేన నాయకులు పావులు కదుపుతున్నారు.   మరోవైపు  కాకినాడ పోర్టు కేంద్రంగా సాగుతున్న బియ్యం రవాణా, ఎగుమతులపై ప్రభుత్వం డేగకన్ను వేసింది. గతంలో జరిగిన అక్రమాలపై ఆరా తీస్తుండటంతో ద్వారంపూడి వ్యాపార సామ్రాజ్యం కుదేలైన పరిస్థితి కనిపిస్తోంది.  కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ఆయనకు చెక్ పెట్టేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందంటున్నారు. ఇలా ఉండగా జనసైనికులు అయితే ద్వారంపూడిపై తక్షణ చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.  జగన్ హయాంలో పవన్‌ను టార్గెట్ చేసి ఆయనపై వ్యక్తిగత విమర్శలకు, దూషణలకు పాల్పడిన ద్వారంపూడిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదిలిపెట్టడానికి వీల్లేదని పట్టుబడుతున్నారు. జనసేన ఒత్తిడి ఫలితంగానే  త్వరలో  రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉదనీ, ఆ ఎన్నికల్లో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పెత్తనానికి చెక్ పడటం ఖాయమని పరిశీలకులు అంటున్నారు.  ఒక సారి రైస్ మిల్లర్స్ అసోసియేషన్ లో ద్వారంపూడి పట్టు సడలితే.. ఇక వరుసగా అన్ని వైపుల నుంచీ గతంలో ఆయన చేసిన అక్రమాలు, దౌర్జన్యాలపై ముప్పేట దాడికి జనసైనికులు రెడీగా ఉన్నారని అంటున్నారు. ఈ పరిణామాలు కాకినాడ రాజకీయాల్లో పెను మార్పులకు దారితీస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు.
వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు హైకోర్టును ఆశ్రయించారు.  అయితే ఆయన హైకోర్టును ఆశ్రయించింది ఏదో కేసులో తనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిలు కోసం కాదు. గతంలో తనను పోలీసులు అరెస్టు చేసిన సమయంలో కస్టడీలో అమానుషంగా ప్రవర్తించారనీ, శారీరక హింసకు గురిచేశారనిఆరోపిస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేర తనను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన పోలీసులపై కఠిన చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని  కోరుతూ అంబటి రాంబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగం విషయంలో  రాష్ట్రంలో  తీవ్ర   రాజకీయ దుమారం రేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై అంబటి రాంబాబు అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై అంబటి రాంబాబును  కొద్ది రోజుల కిందట  గుంటూరు జిల్లా నల్లపాడు పోలీసులు  అరెస్టు చేసి జైలుకు పంపారు. అయితే.. ఆ సమయంలో పోలీసు స్టేషన్‌లో తనను  చిత్రహింసలకు గురిచేశారని ఆరోపిస్తూ అంబటి రాంబాబు తాజాగా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.  అరెస్టై, ఆ తరువాత రిమాండ్ ఖైదీగా రాజమహేంద్రవరం జైలులో ఉండి, ఆ తరువాత బెయిలుపై బయటకు వచ్చిన ఇన్ని రోజుల తరువాత.. నల్లపాడు పోలీసు స్టేషన్ లో తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారంటూ అంబటి హైకోర్టును ఆశ్రయించడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకూ ఆయన పలు సందర్భాలలో తన అరెస్టు అక్రమం అని చెప్పారే కానీ, పీఎస్ లో తన పట్ల అమానుషంగా ప్రవర్తించారనిగానీ, శారీరకంగా హింసించారని కానీ ఎన్నడూ చెప్పలేదు. పోలీసులు అనుచితంగా ప్రవర్తించారనీ, ఒక మాజీ మంత్రిని ట్రీట్ చేయాల్సినట్లుగా మర్యాదగా వ్యవహరించలేదని అటూ వచ్చారు.   అటువంటిది ఇప్పుడు ఏకంగా తనను కస్టోడియల్ టార్చర్ కు గురి చేశారనీ, నేలపై కూర్చోబెట్టి అమానుష పద్ధతుల్లో హింసించారనీ ఆరోపిస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.   అంబటి  పిటిషన్‌ను విచారించిన హైకోర్టు, దీనిపై స్పందించాలని రాష్ట్ర ప్రభుత్వం,  పోలీసు శాఖను ఆదేశించింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.  
పరిగి భూసేకరణ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నేతల అరెస్టులను, గృహనిర్బంధాలను ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఖండించారు.  కాంగ్రెస్ ప్రభుత్వం పిరికిపంద చర్యలకు పాల్పడుతోందని విమర్శించారు.  పరిగి నియోజకవర్గంలో తమ భూములను కాపాడుకోవడానికి పోరాడుతున్న రైతులకు మద్దతు తెలపడం నేరమా అని ప్రశ్నించిన కేటీఆర్..  మాజీ మంత్రులు హరీశ్ రావు, సబితా ఇంద్రా రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు మహేశ్ రెడ్డి, నరేందర్ రెడ్డి, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ వంటి నేతలను అక్రమంగా నిర్బంధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.  రైతుల ఆవేదనను వినాల్సింది పోయి, వారికి మద్దతుగా వస్తున్న విపక్ష నేతలపై ఆంక్షలు విధించడం దారుణమన్నారు.  అరెస్టులు, జైళ్లు, అక్రమ కేసులు బీఆర్ఎస్ నాయకులకు కొత్తేమీ కాదనీ,  తెలంగాణ ఉద్యమ కాలం నుండి ఇలాంటి   ఆంక్షలెన్నో ఎదుర్కొన్నామన్నారు. బీఆర్ఎస్ ఎల్లప్పుడూ ప్రజాపక్షమేనని ఉద్ఘాటించిన కేటీఆర్.. పరిగిలో ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో రైతుల అనుమతి లేకుండా సాగిస్తున్న బలవంతపు భూసేకరణను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పోరాడుతుందనీ, బాధితులకు అండగా నిలబడుతుందనీ చెప్పారు. అక్రమంగా నిర్బంధించిన నేతలను వెంటనే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.
వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలంలో  తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాళ్లపూర్ గ్రామంలో జరుగుతున్న రిలే నిరహార దీక్షకు మద్దతుగా భారీ ఎత్తున తరలివస్తున్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీక్ష స్థలానికి వెళ్లే ప్రధాన రహదారులపై పోలీసులు భారీగా మోహ రించి మొత్తం తొమ్మిది చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు.   రిలే దీక్షకు మద్దతుగా గ్రామానికి చేరుకోవాలని ప్రయత్నించిన బీఆర్ఎస్ నేతలు, కార్య కర్తలను పోలీసులు మార్గ మధ్యలోనే నిలిపివేస్తూ వెనక్కి పంపించేశారు. దీంతో పరిగి పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్తత నెలకొంది.ఈ నేపథ్యంలోనే పరిగి పర్యటనకు బయల్దేరిన మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావును పోలీసులు అప్ప జంక్షన్ వద్ద అడ్డుకుని అరెస్టు చేశారు.  ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. దీక్షకు మద్దతుగా భారీగా తరలివస్తున్న బీఆర్ఎస్ శ్రేణులను అడ్డుకోవడం, కీలక నేతల అరెస్టులతో పరిగి ప్రాంతంలో ఉద్రిక్తతలు పీక్స్ కు చేరాయి. ఇలా ఉండగా అరెస్టు చేసిన హరీష్ రావు, సరిత తదితరులను పోలీసులు శంషాబాద్ పోలీసు స్టేషన్ కు తరలించారు.  
ALSO ON TELUGUONE N E W S
టాలీవుడ్ యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరో సంతోష్ శోభన్ తన కెరీర్‌లో మరో ఆసక్తికరమైన అడుగు వేశారు. విభిన్నమైన కథాంశాలను ఎంచుకుంటూ యూత్ ఆడియన్స్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో, తాజాగా తన కొత్త చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాకు 'సత్తిబాబు పరలోక యాత్ర' అనే వెరైటీ టైటిల్‌ను ఖరారు చేయడం విశేషం. టైటిల్ వినడానికే చాలా ఫన్నీగా, ఆసక్తికరంగా ఉండటంతో ఇండస్ట్రీ వర్గాల్లో ఈ ప్రాజెక్ట్ గురించి చర్చ మొదలైంది. ఇటీవలే 'కపుల్ ఫ్రెండ్లీ' సినిమాతో సంతోష్ శోభన్ బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకున్నారు. కేవలం తెలుగులోనే కాకుండా, తమిళంలో కూడా ఈ సినిమా సుమారు 50 రోజులు ప్రదర్శితమై రికార్డ్ క్రియేట్ చేసింది. ఒక యంగ్ తెలుగు హీరో సినిమాకు కోలీవుడ్ మార్కెట్‌లో ఈ స్థాయి ఆదరణ లభించడం నిజంగా విశేషమనే చెప్పాలి. ఆ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో సంతోష్ ఇప్పుడు 'సత్తిబాబు పరలోక యాత్ర' చేయడానికి రెడీ అయిపోయారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'స్వాతిముత్యం' వంటి ఫీల్ గుడ్ మూవీని తెరకెక్కించిన దర్శకుడు లక్ష్మణ్ కె కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తిస్థాయి వినోదాత్మక కథాంశంతో ఈ సినిమా రూపొందనుంది. యువి క్రియేషన్స్ సమర్పణలో ఏఆర్ ఫిలింస్ సంస్థ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. తెలుగుతో పాటు తమిళ భాషల్లోనూ ఈ సినిమాను ఏకకాలంలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. గతంలో 'ఏక్ మినీ కథ', 'పేపర్ బాయ్', 'మంచి రోజులు వచ్చాయి' వంటి సినిమాలతో సంతోష్ తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్నారు. నటనలో ఈజీనెస్, కామెడీ టైమింగ్‌లో తనదైన ముద్ర వేయడం సంతోష్ ప్రత్యేకత. ఇప్పుడు లక్ష్మణ్ కె కృష్ణ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో జతకట్టడం ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచుతోంది. 'కపుల్ ఫ్రెండ్లీ' మ్యాజిక్ మరోసారి రిపీట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ విషయానికి వస్తే.. జూన్ మొదటి వారం నుండి చిత్రీకరణ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ మూవీలోని ఇతర నటీనటులు మరియు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. డిఫరెంట్ టైటిల్‌తో వస్తున్న ఈ 'సత్తిబాబు' ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తాడో చూడాలి!
టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య(Naga Shaurya) ఎప్పుడూ లవర్ బాయ్ ఇమేజ్‌తో అలరిస్తుంటాడు. కానీ ఈసారి రూటు మార్చి పూర్తి స్థాయి మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు వస్తున్నాడు.  నాగశౌర్య లేటెస్ట్ మూవీ 'బ్యాడ్ బాయ్ కార్తీక్'(Bad Boy Karthik). ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు ఈ సినిమా బయటకు వస్తోంది. ఏప్రిల్ 17న థియేటర్లలో అడుగుపెట్టనుంది. ఈ నేపథ్యంలో తాజాగా ట్రైలర్ విడుదల చేశారు. అయితే ఈ ట్రైలర్ రెస్పాన్స్ అంతంత మాత్రంగానే ఉంది. కొందరైతే "ఇది ఏ కాలం నాటి సినిమా" అంటూ ట్రోల్ చేస్తున్నారు.  2023లో వచ్చిన 'రంగబలి' తర్వాత నాగశౌర్య నుంచి సినిమా రాలేదు. పైగా కొన్నేళ్ళుగా సాలిడ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఈ క్రమంలో కాస్త గ్యాప్ తర్వాత 'బ్యాడ్ బాయ్ కార్తీక్'తో వస్తున్నాడు. అయితే ఈ మూవీ ట్రైలర్ రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో సాగడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. కొన్నేళ్ళుగా ప్రేక్షకులు సినిమా చూసే తీరు మారిపోయింది. అయితే కంటెంట్ ఉన్న చిన్న సినిమాలను ఆదరిస్తున్నారు.. లేదంటే భారీ బడ్జెట్ తో తెరకెక్కే విజువల్ వండర్స్ కి జై కొడుతున్నారు. రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్ లో స్టార్ హీరోలు సినిమాలు చేసినా ప్రేక్షకులు చూడటానికి అంతగా ఆసక్తి చూపించట్లేదు. దీంతో నాగశౌర్య లాంటి టాలెంటెడ్ యంగ్ హీరో ఈ ఫార్మాట్ లో సినిమా చేయడం చూసి నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు.  2014లో వచ్చిన 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించాడు నాగశౌర్య. తన లుక్, కటౌట్ తో టాలీవుడ్ కి మరో మంచి హీరో దొరికాడు అనిపించుకున్నాడు. అందుకు తగ్గట్టే కొన్ని హిట్స్ చూశాడు. అయితే 10-12 ఏళ్ళ సినీ ప్రయాణంలో స్క్రిప్ట్ సెలక్షన్ లో వేసిన కొన్ని తప్పటడుగులు కారణంగా ఫ్లాప్ లే ఎక్కువగా పలకరించాయి.  ఇలాంటి ఫేజ్ ను ఎందరో హీరోలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత సాలిడ్ కంటెంట్ తో కమ్ బ్యాక్ ఇచ్చారు. నాగశౌర్య కూడా అలాంటి కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో.. ఇప్పుడు ఆయన నుంచి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' వంటి రొటీన్ కమర్షియల్ సినిమా వస్తోంది. అయితే కొన్ని సినిమాలు ట్రైలర్ తో మెప్పించలేకపోయినప్పటికీ, బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుంటాయి. మరి 'బ్యాడ్ బాయ్ కార్తీక్' కూడా ఆ లిస్టులో చేరుతుందో లేక నాగశౌర్య ఖాతాలో మరో ఫ్లాప్ పడేలా చేస్తుందో చూడాలి.  
    -పేట్రేగిపోతున్న కల్తీగాళ్ళు  -ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ కి కారణం వాళ్ళు కూడా  -నైనికా అనసూరు పిక్స్ చెప్తున్న కన్నీటి గాధ ఏంటి సినిమాల్లో అవకాశాల కోసం కొంత మంది అమ్మాయిలు కమిట్మెంట్ కి రెడీ అవుతున్నారు. వాళ్ళ వల్లే ఇండస్ట్రీలో కమిట్ మెంట్ అనేది ఎప్పుడు ఎక్స్ క్లూజివ్ టాపిక్ తో రన్ అవుతుంది. నేను కూడా కమిట్ మెంట్ బారిన పడ్డాను. ఒక వేళ నేను నటిని అయితే నా కూతురిని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వను. ఇప్పుడు ఈ మాటలన్నీ అంటుంది ఎవరో కాదు  బిగ్ బాస్ ఫేమ్ ఢీ డ్యాన్సర్ నైనికా అనసూరు. మరి పూర్తి మ్యాటర్ ఏంటో చూద్దాం.  నైనికా రీసెంట్ గా ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతు  సోషల్ మీడియాలో నా ఫొటోలు అసభ్యకరమైన రీతిలో ఉండటమే కాకుండా రేట్లు కూడా ఫిక్స్ చేసారు. నా ప్రమేయం లేకుండా ఇలాంటి ఘటనలు ఎలా జరుగుతాయో అర్థం కాదు. చాలా కోపం, అసహ్యం కలిగింది. తట్టుకోలేక సూసైడ్ అటెంప్ట్ కూడా చేశా. ఇప్పుడున్న పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీ చాలా వల్గర్‌గా మారిపోయింది. నేరుగా కమిట్మెంట్  అడుగుతున్నారు. ఒకసారి బ్రాండ్ ప్రమోషన్ పేరుతో ఒక వ్యక్తి నన్ను సంప్రదించాడు. ప్రమోషన్ వివరాలు చెప్పాక 'పర్సనల్ రిక్వైర్మెంట్’అని పదేపదే అంటుండడంతో అసలు విషయం అర్థమైంది. also read: Ram Charan: అశ్వద్ధామగా రామ్ చరణ్.. ధురంధర్ 2 డైరెక్టర్ ఆదిత్య ధర్ చర్చలు!  కొంత మంది అమ్మాయిల వల్లే ఇండస్ట్రీలో ఈ పరిస్థితి దాపరించింది. ఆఫర్స్ కోసమే క   మిట్మెంట్ కి ఒప్పుకుంటున్నారు. ఒక వేళ నేను నటిని అయితే నా కూతురిని మాత్రం ఇండస్ట్రీకి రానివ్వనని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ మాటలు వైరల్ గా మారాయి. బిగ్ బాస్ సీజన్ 8 లో నైనికా హౌస్ మెంబర్ గా ఉంది.  
టాలీవుడ్‌లో ఈ వారం బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పోరు సాగుతోంది. యంగ్ హీరో శర్వానంద్ నటించిన భారీ బడ్జెట్ స్పోర్ట్స్ డ్రామా ‘బైకర్’ మరియు సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో వచ్చిన ఫాంటసీ కామెడీ ‘రాకాస’ ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. సాధారణంగా పెద్ద హీరో సినిమా ఉంటే చిన్న సినిమాలు వెనక్కి తగ్గుతాయి. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ అవుతున్నట్లు కనిపిస్తోంది. వీకెండ్ ముగిసి సోమవారం వసూళ్ల ట్రెండ్స్ చూస్తుంటే, చిన్న సినిమాగా వచ్చిన ‘రాకాస’ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. సోమవారం బాక్సాఫీస్ లెక్కలు చిత్ర పరిశ్రమను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. భారీ అంచనాలతో, టెక్నికల్ వండర్‌గా ప్రచారం పొందిన ‘బైకర్’ వసూళ్లు వర్కింగ్ డే కావడంతో ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. నాలుగో రోజు (సోమవారం) ఈ చిత్రం ఇండియా వ్యాప్తంగా కేవలం 94 లక్షల నెట్ వసూళ్లను మాత్రమే రాబట్టగలిగింది. దీంతో నాలుగు రోజుల మొత్తం నెట్ కలెక్షన్స్ 8.35 కోట్లకు చేరుకున్నాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ పరంగా చూస్తే ‘బైకర్’ ఇప్పటివరకు 11.32 కోట్ల మార్కును అందుకుంది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ, సోమవారం టెస్టులో ఈ మూవీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మరోవైపు, నిహారిక కొణిదెల నిర్మాణంలో వచ్చిన ‘రాకాస’ మాత్రం బాక్సాఫీస్ వద్ద గట్టి పట్టు సాధించింది. సోమవారం కూడా ఈ సినిమా సుమారు 1.12 కోట్ల రూపాయల నెట్ వసూళ్లను సాధించి ‘బైకర్’ కంటే ముందంజలో నిలిచింది. ఇప్పటివరకు ఈ సినిమా ఇండియా నెట్ కలెక్షన్స్ 9.12 కోట్లకు చేరుకోగా, ప్రపంచవ్యాప్తంగా 13.81 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించి లాభాల బాటలో పయనిస్తోంది. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్‌లో రాకాస జోరు స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఇప్పటికే 3.30 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది. నేపథ్యం విషయానికి వస్తే, ‘బైకర్’ సినిమా భారతదేశంలోనే మొదటి మోటోక్రాస్ రేసింగ్ నేపథ్యంతో రూపొందింది. దర్శకుడు అభిలాష్ రెడ్డి కంకర ఈ చిత్రాన్ని చాలా రిచ్‌గా తెరకెక్కించారు. శర్వానంద్ తన కెరీర్‌లో అత్యంత కష్టపడి చేసిన పాత్ర ఇది. సీనియర్ నటుడు రాజశేఖర్ తండ్రి పాత్రలో మెప్పించగా, మాళవిక నాయర్ హీరోయిన్‌గా నటించింది. యూవీ క్రియేషన్స్ వంటి పెద్ద సంస్థ నిర్మించిన ఈ సినిమాకు ప్రమోషన్స్ విషయంలో కొంచెం వెనకబడటం మైనస్ అయ్యిందని ఇండస్ట్రీ టాక్. ఇక ‘రాకాస’ విషయానికి వస్తే, ఇది ఒక పక్కా ఫాంటసీ హారర్ కామెడీ. ఒక శపింపబడిన కోట, దాని చుట్టూ తిరిగే మిస్టరీని దర్శకురాలు మానస శర్మ వినోదాత్మకంగా మలిచారు. ‘మ్యాడ్’ ఫేమ్ సంగీత్ శోభన్ తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తుండగా, వెన్నెల కిషోర్, గెటప్ శ్రీను కామెడీ ట్రాక్స్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. తక్కువ బడ్జెట్‌తో నిర్మించిన ఈ సినిమా ప్రస్తుతం భారీ లాభాల దిశగా దూసుకుపోతోంది. సోషల్ మీడియాలో కూడా ఈ రెండు సినిమాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ‘బైకర్’ సినిమా టెక్నికల్ పరంగా అద్భుతంగా ఉందని, క్లైమాక్స్ రేసింగ్ సీన్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయని యువత కామెంట్స్ చేస్తున్నారు. అదే సమయంలో ‘రాకాస’ సినిమాను ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువగా ఆదరిస్తున్నారు. వీక్ డేస్‌లో కూడా ఈ సినిమాకు బుకింగ్స్ ఆశాజనకంగా ఉండటం విశేషం. ప్రస్తుత ట్రెండ్ చూస్తుంటే, ‘రాకాస’ ఈ వారం బాక్సాఫీస్ విజేతగా నిలిచేలా కనిపిస్తోంది. ‘బైకర్’ సినిమా మళ్లీ పుంజుకోవాలంటే రాబోయే రోజుల్లో వసూళ్లు పెరగాల్సి ఉంటుంది. మరి శర్వానంద్ తన రేసింగ్‌తో బాక్సాఫీస్ వద్ద మళ్ళీ పుంజుకుంటారా లేక సంగీత్ శోభన్ ‘రాకాస’ మేజిక్ కొనసాగుతుందో వేచి చూడాలి. ఈ సినిమాల ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
  -పెద్దితో బిజీగా ఉన్న రామ్ చరణ్  -ధురంధర్ 2 డైరెక్టర్ తో చర్చలు జరుపుతున్నాడా! -అశ్వద్ధామ వెనక ఉన్న కథ ఏంటి రూమర్ పేరుపై కూడా గుళ్లో అర్చన చేసే రోజు వస్తుందని ఎవరైనా ఉహించి ఉంటారా!. మసీదు, చర్చిల్లో సైతం అదే గౌరవం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి  వచ్చింది. ధురంధర్ 2 (Aditya Dhar)  డైరెక్టర్ ఆదిత్య ధర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan)కాంబోలో మూవీ తెరకెక్కబోతుందనేదే రూమర్ .. పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఆదిత్య ధర్ డ్రీం ప్రాజెక్ట్స్ లో 'ఇమ్మోర్టల్ అశ్వద్ధామ'(immortal ashwatthama)ఒకటి. నిజానికి ధురంధర్ 2 కంటే   ముందే స్టార్ట్ అవ్వాల్సిన మూవీ. అంటే తన సెకండ్ మూవీగా రావాల్సింది. అగ్ర నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ భారీ బడ్జెట్ తో తెరకెక్కించడానికి ముందుకొచ్చినా, కారణాలు తెలియదు కానీ ఆ ప్రాజెక్ట్ ప్లేస్ లోకి ధురంధర్ వచ్చేసింది. ఇప్పుడు ఆదిత్య ధర్ తన నెక్స్ట్  ప్రాజెక్ట్ గా ఇమ్మోర్టల్ అశ్వద్ధామని తెరకెక్కించాలని రామ్ చరణ్ టైటిల్ రోల్ లో చేయబోతున్నట్టుగా రూమర్. మరి వింటు ఉంటేనే గూస్ బంప్స్ వస్తున్నాయి కదా! మరి ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. నిజానికి ఆదిత్య ధర్ ఇమ్మోర్టల్ అశ్వద్ధామని ప్రకటించినప్పుడే రామ్ చరణ్ హీరో అనే పుకారు వచ్చింది. ఎందుకంటే ఆ టైంలో ఆర్ఆర్ఆర్ తో బాలీవుడ్ ని ఆకట్టుకున్నాడు.  Also Read: ott: ఓటీటీలో 7 హై ఓల్టేజ్ రొమాంటిక్ చిత్రాలు.. ఒంటరిగా మాత్రమే చూడండి  కానీ రెండో చిత్రానికే ఆదిత్య ధర్ తో బడ్జెట్ విషయంలో రిస్క్ చేయడం ఎందుకని నిర్మాతలు ఆలోచించారనే న్యూస్ వినపడింది. కానీ ఆ వార్తలో నిజం లేదు. ఎందుకంటే ధురంధర్ పార్ట్ 1 , పార్ట్ 2 నిర్మించింది కూడా జియో స్టూడియోస్ నే. ఏది ఏమైనా ఫస్ట్ టైం ఒక రూమర్ అరుదైన గౌరవానికి అర్హత సాధించింది. ప్రెజెంట్ రామ్ చరణ్ అయితే పెద్దికి ఫినిషింగ్ టచ్ ఇచ్చే పనిలో ఉన్నాడు. ఆదిత్య ధర్ ఇంకా కొత్త చిత్రాన్ని ప్రకటించలేదు.   
తమిళ సినీ ఇండ‌స్ట్రీలో విజ‌య‌వంత‌మైన ప్రముఖ కంటెంట్ స్టూడియో అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఇప్పుడు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. అందులో భాగంగా టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్‌తో క‌లిసి చేయ‌బోతున్న సినిమా ‘కనక దుర్గ’ను ఇటీవల పూజా కార్య‌క్ర‌మాల‌తో ప్రారంభించారు.  అల్ల‌రి న‌రేష్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో కాజ‌ల్ చౌద‌రి హీరోయిన్‌. ఈ సినిమాలో న‌టుడు సుబ్బ‌రాజు కీల‌క పాత్ర పోషిస్తున్నారు. ఈ భక్తి ప్రధాన కథా చిత్రానికి బి.వి.ఎస్. రవి కథ అందిస్తుండ‌గా ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నారు. స‌మీర్ నాయ‌ర్‌, దీపక్ సెహ‌గ‌ల్‌, అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి నిర్మాత‌లు.   భారతీయ దేవతల ఆధారంగా ఒక దివ్యమైన ప్రపంచాన్ని ఆవిష్క‌రిస్తూ ఈ సినిమా భక్తి, యాక్షన్, భావోద్వేగాలు, సంగీతం ఇలా అన్ని అంశాల‌తో ప్రేక్ష‌కుల‌కు ఓ అద్భుత‌మైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను అందించ‌నుంది. అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ స‌మ‌ర్ప‌ణ‌లో టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమా ఈ రెండు సంస్థ‌ల‌కు ఎంతో ప్ర‌త్యేక‌మైన‌ది.  ఘనంగా జరిగిన లాంచ్ ఈవెంట్ లో చిరంజీవి సతీమణి సురేఖ‌ కొణిదెలతో పాటుగా అల్లు అర‌వింద్‌, శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి, హ‌రీష్ శంక‌ర్‌, మిక్కిలినేని సుధాక‌ర్‌, కోన వెంక‌ట్‌, ప్ర‌శాంత్ వ‌ర్మ‌, మ‌ధుర శ్రీధ‌ర్‌, స్వ‌ప్నాద‌త్‌, సుప్రియ‌, విద్యా కొప్పినీడు, ప‌ద్మ క‌స్తూరి రంగ‌న్‌, అనురాధ గూడూరు, దివ్య విజ‌య్‌, హ‌న్షిత రెడ్డి, జాన్వీ నారంగ్, స్ర‌వంతి చొక్కార‌పు, వైఘా రెడ్డి, విరుప తదితరులు అతిథులుగా విచ్చేశారు. సినిమా భావాన్ని ప్రతిబింబిస్తూ పూజా కార్యక్రమం చివర్లో కనకదుర్గ అమ్మవారి దివ్య స్త్రీ శక్తిని ప్ర‌త్యేకంగా స్మ‌రించుకున్నారు. హాజరైన మహిళలు కలిసి అమ్మ‌వారి శక్తి, కరుణ, మహిమలను గౌరవించారు. ముహూర్త‌పు స‌న్నివేశానికి నిర్మాత అల్లు అర‌వింద్ క్లాప్ కొట్ట‌గా, సురేఖ కొణిదెల కెమెరా స్విచ్ ఆన్ చేశారు. స్వ‌ప్న ద‌త్ గౌర‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శ్యామ్ ప్ర‌సాద్ రెడ్డి స్క్రిప్ట్‌ను అందించారు.   అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ మూవీస్ బిజినెస్ హెడ్ సునీల్ చైనాని మాట్లాడుతూ “తమిళంలో మా ప్రయాణం ఎంతో ప్రోత్సాహకరంగా, విజయవంతంగా సాగింది. ఇప్పుడు ‘కనక దుర్గ’తో తెలుగులోకి అడుగుపెడుతుండ‌టం ఎంతో ఆనందంగా ఉంది. భ‌క్తి, సంస్కృతి, భావోద్వేగాల క‌ల‌యిక‌ల‌తో ఈ సినిమా రూపొందుతోంది. అజిత్ ఠాకూర్‌, బి.వి.ఎస్‌.ర‌వి, అల్ల‌రి న‌రేష్, ప్ర‌దీప్ మ‌ద్దాలితో క‌లిసి ప‌ని చేయ‌టం చాలా ఆనందంగా ఉంది” అన్నారు.  టెంపుల్ టౌన్ పిక్చ‌ర్స్ నిర్మాతలు అజిత్ ఠాకూర్, బి.వి.ఎస్. రవి మాట్లాడుతూ “కనక దుర్గ కథ తెలుగు నేలకు సంబంధించిన ఆధ్యాత్మికత, సంస్కృతిలో బలంగా నాటుకుపోయింది. దీంతో మా ప్ర‌యాణం ప్రారంభం కావటం ఎంతో ప్ర‌త్యేకం. మా బ్యాన‌ర్‌లో రూపొందుతోన్న తొలి తెలుగు సినిమా ఇది. మంచి క‌థ‌తో పాటు మంచి భాగ‌స్వామ్యంలో సినిమా చేస్తుండ‌టం అదృష్టంగా భావిస్తున్నాం. మా ప్ర‌యాణంలో తోడుగా నిలుస్తోన్న అప్లాజ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌కి థాంక్స్‌. దైవ అనుగ్ర‌హంతోనే ఈ ప్ర‌యాణం సాగుతున్న‌ట్లు అనిపిస్తోంది. అమ్మ‌వారి ఆశీర్వాదంతోనే ఈ సినిమాను రూపొందిస్తోన్న భావ‌న క‌లుగుతోంది” అన్నారు.  దర్శకుడు ప్రదీప్ మద్దాలి మాట్లాడుతూ ‘‘కనక దుర్గ సినిమా నాకు చాలా ప్రత్యేకం. దర్శకుడిగా మాత్రమే కాదు, ఆ అమ్మవారిపై నాకు ఉన్న భక్తి కూడా దీనికి కార‌ణం. ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైంది. ఈ సినిమా అసలు కథ భక్తి గురించి మాత్రమే కాదు.. జీవితంలో చిద్రమైన ఒక మనిషి, తనకంటే గొప్పదైన శక్తిని ఎదుర్కొన్నప్పుడు ఏమి జరుగుతుందో చెప్పే కథే ఇది. మా క‌థ‌ను నమ్మి ‘అప్లాజ్ ఎంటర్‌టైన్‌మెంట్’ లాంటి సంస్థ ముందుకు రావడం, అలాగే ‘టెంపుల్ టౌన్ పిక్చర్స్’ ఈ ప్రాజెక్ట్‌ను ఇంత నమ్మకంతో ముందుకు తీసుకెళ్లడం చాలా ఆనందంగా ఉంది. విజువల్‌గా కూడా భారీ స్థాయిలో ఉండే ఈ సినిమాతో మా ప్రయాణాన్ని ప్రారంభించడం మాకు చాలా గర్వంగా ఉంది” అన్నారు.
  -రెగ్యులర్ చిత్రాలు చూసి బోర్ కొట్టిందా! -రొమాన్స్ చిత్రాలు చూడాలనే అనుకుంటున్నారా  -అయితే లేటు చెయ్యకుండా ఇవి చూసెయ్యి కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా.. ప్రేమ అంటే అర్ధం తెలియని దాన్ని ప్రేమించి తప్పు చేశాను.. రికార్డ్స్ లో నేను ఉండటం కాదు నా పేరుపైనే రికార్డ్స్ ఉంటాయి..నా ఫ్యామిలీనే నా బలం.. నువ్వు జీవితంలో ఎందుకు ఎదగలేకపోయావో ఇప్పుడు అర్థమైంది.. ఈ ఏజ్ లో లవ్ ఫెయిల్యూర్ అంటే సామాన్యమైన విషయమా.. ఎనీ సెంటర్ సింగిల్  హ్యాండ్ గణేష్.. ఊరిని దత్తత తీసుకోవడమంటే ఊరి మనుషులని కూడా తీసుకున్నట్టే.. ఇలాంటి డైలాగ్స్ తో కూడిన సినిమాలు చూసి చూసి బోర్ కొడుతుందా! మరి మంచి రొమాంటిక్ టచ్ తో పాటు రొమాంటిక్ డైలాగ్స్ తో కూడిన సినిమాలు ఓటిటిలో నువ్వు ఏ రోజుకైనా చూడకపోతావా అనే ఆశతో ఎదురుచూస్తూ ఉన్నాయి. మరి ఆ లిస్ట్ చూద్దాం. ట్రిపుల్ ఫ్రాంటియర్, ది ఐరిష్‌ మ్యాన్, లేడీ చాటర్లీస్ లవర్, ది ట్రయల్ ఆఫ్ ది చికాగో, హిట్ మ్యాన్, ఇన్‌డీసెంట్ ప్రపోజల్, సాసేజ్ పార్టీ.. ఈ ఏడు హాలీవుడ్ లో తెరకెక్కిన  మూవీస్. వరల్డ్ మూవీ లవర్స్ కైతే ఆ ఏడు చిత్రాల పుట్టు పూర్వోత్తరాలు తెలుసనుకోండి.  ఈ ఏడుచిత్రాల్లో అదిరిపోయే బోల్డ్‌ సన్నివేశాలు, డైలాగ్స్ ఉంటాయి. ఈ విషయంలో మిమ్మల్ని ఏ మాత్రం నిరాశపరచవు. R-rated కూడా ఉంది. అలా అని కంటెంట్ మొత్తం బోల్డ్ గా ఉండదు. విభిన్నమైన సబ్జెట్స్ తో తెరకెక్కి కథనం ఎన్నో మలుపులు తిరుగుతు ఉంటుంది. నటీనటుల పెర్ఫార్మెన్సు, సాంకేతిక నిపుణుల పని తనం కూడా మెస్మరైజ్ చేస్తు  మూవీ మజాని ఇస్తాయి. Also read: Adivi Sesh: అడవి శేష్ కామెంట్స్ వైరల్.. ఆ కుళ్లుబుద్ది హీరో అతనేనా! మరో ముఖ్యమైన విషయం ఏంటంటే శృంగార సన్నివేశాలు వస్తున్నప్పుడు మాత్రం దయచేసి ఒంటరిగా చూడండి. అంతలా ఒక రేంజ్ లో ఉంటాయి. స్ట్రీమింగ్ పార్టనర్ వివరాలు గూగుల్ లో ఉంటాయి.  ఆల్రెడీ ఆ ప్రిపరేషన్ లోనే ఉన్నామని అంటారా! అయితే ఓకే.     
అమీర్ ఖాన్ మేనకోడలి గ్లామర్ షో 'డెకాయిట్' ట్రైలర్ లాంచ్‌లో మెరిసిన జైన్ మేరీ ఖాన్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటోలు టాలీవుడ్‌లో అప్పుడప్పుడు కొంతమంది బ్యూటీలు మెరుపు తీగల్లా మెరిసి, కుర్రకారు మనసు దోచుకుంటారు. తాజాగా 'డెకాయిట్'(Dacoit) ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో ఒక కొత్త పేరు టాలీవుడ్ సర్కిల్స్‌లో మార్మోగిపోతోంది. ఆ పేరే జైన్ మేరీ ఖాన్(Zayn Marie Khan). అడవి శేష్, మృణాల్ ఠాకూర్ వంటి స్టార్స్ ఉన్న ఈ ఈవెంట్‌లో అందరి కళ్లు ఒక్కసారిగా ఈ ముద్దుగుమ్మ వైపు మళ్లాయి. తన అదిరిపోయే అవుట్‌ఫిట్, కాన్ఫిడెంట్‌తో ఇండస్ట్రీ చూపు తనవైపు తిప్పుకుంది ఈ బ్యూటీ.  జైన్ మేరీ ఖాన్ వెనుక ఒక పెద్ద సినీ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్‌కు ఈమె స్వయానా మేనకోడలు. అలాగే ప్రముఖ దర్శకుడు మన్సూర్ ఖాన్ కుమార్తె. హిందీలో ఇప్పటికే కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేసినా రాని గుర్తింపు, కేవలం హైదరాబాద్‌లో జరిగిన ఈ ఒక్క ఈవెంట్‌తో వచ్చేసింది. గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో ఆమె సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. అడవి శేష్ హీరోగా వస్తున్న 'డెకాయిట్' సినిమాతో జైన్ టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. విశేషం ఏంటంటే, ఇందులో ఆమె ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తోంది. ట్రైలర్‌లో తన ఇంటెన్స్ పర్ఫార్మెన్స్‌తో మెప్పించిన జైన్, ఈవెంట్‌కు వచ్చేసరికి మాత్రం పూర్తి గ్లామర్ అవతారంలో దర్శనమిచ్చి అందరినీ ఆశ్చర్యపరిచింది. స్క్రీన్ మీద రగ్గడ్ పోలీస్ గా చూసిన జనం, బయట ఆమె గ్లామర్ చూసి ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా జైన్ మేరీ ఖాన్ ఫోటోలు, వీడియోలే చక్కర్లు కొడుతున్నాయి. మృణాల్ ఠాకూర్ వంటి క్రేజీ హీరోయిన్ పక్కన ఉన్నా సరే, తన ప్రత్యేకతను చాటుకోవడంలో జైన్ సక్సెస్ అయ్యింది. నెటిజన్లు ఆమెను 'టాలీవుడ్ కొత్త క్రష్' అంటూ ఆకాశానికెత్తేస్తున్నారు. కేవలం కొన్ని గంటల్లోనే ఇంత పాపులారిటీ రావడంతో అటు చిత్ర యూనిట్, ఇటు జైన్ ఖాన్ కూడా ఫుల్ ఖుషీగా ఉన్నారట. 'డెకాయిట్' సినిమా ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. అడవి శేష్ సినిమాలు అంటేనే ఏదో ఒక కొత్తదనం ఉంటుంది. ఇప్పుడు ఈ సినిమాలో జైన్ మేరీ ఖాన్ వంటి టాలెంటెడ్ అండ్ గ్లామరస్ బ్యూటీని పరిచయం చేయడం మరో విశేషం. మరి డెకాయిట్ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో, అలాగే ఈ సినిమా జైన్ కెరీర్‌కు ఎంతవరకు ప్లస్ అవుతుందో చూడాలి. ఏదేమైనా, సినిమా విడుదల కాకముందే జైన్ మేరీ ఖాన్ మాత్రం తెలుగు ఆడియన్స్‌లో మంచి మార్కులు కొట్టేసింది.  
టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ రూపొందించిన ‘హను-మాన్’ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ మైథలాజికల్ ఫాంటసీ మూవీ ఏకంగా రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్ సినిమాను ఆశ్చర్య పరిచింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జై హనుమాన్’ (Jai Hanuman) పనులను ప్రశాంత్ వర్మ మరింత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించి ఒక క్రేజీ టెక్నికల్ అప్‌డేట్ ఫిలిం నగర్ వర్గాల్లో వైరల్ అవుతోంది. ‘జై హనుమాన్’ చిత్రాన్ని మునుపటి కంటే భారీ స్థాయిలో, అత్యున్నత సాంకేతిక విలువలతో నిర్మించాలని ప్రశాంత్ వర్మ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగానే చిత్ర సాంకేతిక బృందంలో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎపిక్ సీక్వెల్ కోసం ఆస్కార్ విజేత, లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఎం. ఎం. కీరవాణిని రంగంలోకి దించారు. గత చిత్రానికి గౌర హరి సంగీతం అందించగా, ఇప్పుడు కీరవాణి వంటి దిగ్గజం తోడవ్వడం సినిమా స్థాయిని మరో మెట్టు ఎక్కించింది. ఆయన అందించే నేపథ్య సంగీతం ఈ సినిమాకు ప్రధాన బలంగా నిలవనుంది. మరో ఆసక్తికరమైన మార్పు ఏమిటంటే, ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌గా ‘లక్కీ భాస్కర్’ ఫేమ్ నిమిష్ రవి ఎంపికయ్యారు. వాస్తవానికి ఈ ప్రాజెక్ట్ కోసం సీనియర్ డీఓపీ తిరును అనుకున్నప్పటికీ, ఫైనల్‌గా నిమిష్ రవి బాధ్యతలు చేపట్టారు. తన విజువల్ సెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేసే నిమిష్ రవి, ఈ మైథలాజికల్ యూనివర్స్‌ను తన కెమెరాతో ఎలా ఆవిష్కరిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రశాంత్ వర్మ తన విజన్‌ను వెండితెరపై మరింత గ్రాండ్‌గా చూపించేందుకే ఈ మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో ‘కాంతార’ స్టార్ రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపిస్తుండటం ఇప్పటికే దేశవ్యాప్తంగా హైప్ క్రియేట్ చేసింది. ఆయన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో భారీ స్పందన తెచ్చుకుంది. అలాగే, రానా దగ్గుబాటి ఒక పవర్‌ఫుల్ పాత్రలో నటించబోతున్నారని, మొదటి భాగంలో హీరోగా నటించిన తేజ సజ్జా కూడా ఈ సీక్వెల్‌లో కీలక పాత్రలో మెరుస్తారని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ఏమాత్రం రాజీ పడకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. హనుమాన్ సినిమా విడుదలైన సమయం నుండి ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU)పై ప్రేక్షకుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన వాగ్దానం నేపథ్యంలో సాగే ఈ కథ, ఆధ్యాత్మికతతో పాటు అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలతో నిండి ఉంటుందని సమాచారం. ఇటీవలే హంపీలోని అంజనాద్రి బెట్టలో పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. సాంకేతిక బృందంలో ఈ భారీ మార్పులు చూస్తుంటే, ప్రశాంత్ వర్మ కేవలం తెలుగు ప్రేక్షకులనే కాకుండా, ప్రపంచ స్థాయి ప్రేక్షకులను మెప్పించేలా ‘జై హనుమాన్’ను తీర్చిదిద్దుతున్నారని స్పష్టమవు తోంది. కీరవాణి సంగీతం, రిషబ్ శెట్టి పర్ఫార్మెన్స్ తోడైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరోసారి సునామీ సృష్టించడం ఖాయమని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలోనే మరిన్ని అధికారిక వివరాలు వెల్లడికానున్నాయి.
    - మ‌లేషియాలో బాల‌య్య‌ను పోలిన వ్య‌క్తి  - అభిమానుల మధ్య మొదలైన రచ్చ! - వైరల్ అవుతున్న క్రేజీ వీడియో! నందమూరి బాలకృష్ణ అంటే కేవలం ఒక హీరో మాత్రమే కాదు, ఆయనో ప్రభంజనం. డైలాగ్ డెలివరీలో అయినా, యాక్షన్ సీక్వెన్స్‌లో అయినా ఆయన శైలే వేరు. అటువంటి నటసింహాన్ని అచ్చుగుద్దినట్లు పోలి ఉన్న ఒక వ్యక్తి ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యాడు. ప్రపంచంలో ఒకే పోలికలతో ఏడుగురు ఉంటారని అంటుంటారు. బాలయ్య బాబును తలపించే వ్యక్తి విదేశాల్లో కనిపించడంతో నందమూరి అభిమానులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అసలు విషయంలోకి వెళ్తే.. ప్రస్తుతం ఒక వీడియో ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. మలేషియాలో జరిగిన ఒక స్థానిక హిందూ జాతరలో ఒక వ్యక్తి పానీపూరీ బండి నడుపుతున్నాడు. అయితే అక్కడ పానీపూరీ తిందామని వెళ్లిన ఒక తెలుగు యూట్యూబర్‌కు ఆ వ్యక్తిని చూసి మైండ్ బ్లాక్ అయింది. ఎందుకంటే ఆ వ్యక్తి రూపం, కళ్లు, చిరునవ్వు అచ్చం మన బాలయ్యను గుర్తు చేస్తున్నాయి. ముఖ్యంగా సినిమాల్లో ఉండే గెటప్స్ కాకుండా, బాలయ్య రియల్ లుక్‌ను ఆ వ్యక్తి తలపిస్తుండటంతో సదరు యూట్యూబర్ వెంటనే వీడియో తీసి నెట్టింట వదిలాడు. ఆ వీడియోలో పానీపూరీ అమ్ముతున్న ఆ వ్యక్తిని చూస్తుంటే నిజంగానే బాలయ్య బాబు విదేశాల్లో ఏమైనా షూటింగ్ చేస్తున్నారా? లేక ఇది ఆయన కొత్త సినిమా ప్రమోషన్ లాంటిదా? అనిపించక మానదు. "మలేషియాలో పానీపూరీ అమ్ముతున్న బాలయ్య" అంటూ సాగుతున్న ఈ వీడియో గంటల వ్యవధిలోనే లక్షలాది వ్యూస్ సాధించింది. కేవలం పోలికలే కాదు, ఆ వ్యక్తి పలకరిస్తున్న తీరు కూడా నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సాధారణంగా సినిమాల్లో డూప్‌లను వాడటం సహజం. గతంలో సూపర్ స్టార్ మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, చిరంజీవి వంటి హీరోలను పోలిన వ్యక్తులు చాలామంది సోషల్ మీడియా ద్వారా వెలుగులోకి వచ్చారు. కొందరు స్టేజ్ షోలు చేస్తూ పాపులర్ అయ్యారు, మరికొందరు టీవీ షోలలో కూడా మెరిశారు. కానీ, ఇలా మలేషియా లాంటి దేశంలో పానీపూరీ బండి దగ్గర బాలయ్య డూప్ కనిపించడం మాత్రం నిజంగా వింతే అని చెప్పాలి. అయితే ఈ వీడియోపై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు కొందరు "జై బాలయ్య.. అక్కడ కూడా పానీపూరీ సెంటర్ పెట్టేశారా?" అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరు మాత్రం "వ్యూస్ కోసం ఎవరో ఒకరిని పట్టుకొని బాలయ్య అని ప్రచారం చేయడం ఏంటి?" అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా నందమూరి అభిమానులు తమ అభిమాన హీరోకి ఆ వ్యక్తికి అసలు సంబంధమే లేదని, ఇలాంటి పోలికలు తీసుకురావడం కరెక్ట్ కాదని గట్టిగానే వాదిస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య తన తదుపరి భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. వరుస విజయాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న నటసింహం, రాబోయే చిత్రాల్లో ఎలాంటి మాస్ ఇమేజ్‌తో కనిపిస్తారో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన డూప్ వీడియో బయటకు రావడం చర్చనీయాంశంగా మారింది. ఏది ఏమైనా, మనిషిని పోలిన మనుషులు ఎక్కడో ఒకచోట తారసపడటం సహజమే అయినా, సెలబ్రిటీల విషయంలో మాత్రం అది ఎప్పుడూ ఒక క్రేజీ అప్‌డేట్‌గానే మిగిలిపోతుంది. ఆ పానీపూరీ అమ్మే వ్యక్తికి బాలయ్యకు ఉన్న పోలిక ఎంతవరకు నిజం అనేది పక్కన పెడితే, ప్రస్తుతం ఈ వీడియో మాత్రం నెట్టింట రచ్చ చేస్తోంది.
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
పంచతంత్రంగా పిలుచుకుంటున్న ఐదు రాష్టాల అసెంబ్లీ ఎన్నికల్లో అద్భతం జరగబోతోంది. కేంద్ర ఎన్నికల సంఘం నాలుగు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు ప్రకటించిన వెంటనే, వివిధ సంస్థలు అసెంబ్లీ ఎన్నికలు జరిగే  అస్సాం. పశ్చిమబెంగాల్, తమిళనాడు రాష్ట్రాలతో పాటుగా కేరళలోనూ ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఆ ఒపీనియన్ పోల్ ఫలితాలు నిజంగా నిజం అయితే, కేరళలో మళ్ళీ సీపీఎం సారధ్యంలోని వామపక్ష కూటమి అధికారంలోకి వస్తుంది. ఇదే ఆ అద్భుతం. ఎందుకంటే, గత నాలుగు దశాబ్దాలలో కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే కూటమి వరసగా రెండవసారి అధికారంలోకి వచ్చిన చరిత్ర లేనే లేదు. ఒక సారి ఎల్డీఎఫ్ అధికారంలోకి వస్తే ఐదేళ్ళ తర్వాత కాంగ్రెస్ సారధ్యంలోని ఐక్య ప్రజాస్వామ్య కూటమి(యూడీఎఫ్) అధికారంలోకి రావడం, దేవభుమిలో దైవ నిర్ణయమా అన్నట్లుగా ప్రతి ఎన్నికల్లోనూ అధికారం చేతులు మారుతూ వస్తోంది. అలాంటిది, ఈసారి ఒపీనియన్ పోల్స్ నిజమై వరసగా రెండవసారి వామపక్ష కూటమి అధికారంలోకి వస్తే, అది చరిత్రే అవుతుంది. ఇక ఒపీనియన్ పోల్స్ విషయానికి వస్తే, జాతీయ న్యూస్ ఛానెల్ ఏబీపీ, సీ ఓటర్ సంస్థలు సంయుక్తంగా ఒపీనియన్ పోల్స్ నిర్వహించాయి. ఈ సర్వే ప్రకారం, 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో వామపక్ష కూటమికి 83 నుంచి  91 స్థానాలు, యూడీఎఫ్ కూటమికి 47 నుంచి 55 స్థానాలు మాత్రమే దక్కుతాయని తెలుస్తోంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఇలా జాతకాలు తిరగబడడంపై సోషల్ మీడియాలో,’లెగ్ మహిమ’ లాంటి జోక్స్  ట్రోలవుతున్నాయి. అయితే 2016లో జరిగిన ఎన్నికల్లో కేవలం 47 సీట్లకే పరిమితం అయిన కాంగ్రెస్’కు ఈసారి ఒకటీ అరా సీట్లు ఎక్కువస్తే, రావచ్చును. అదే కాంగ్రెస్’కు కాసింత ఊరట. అదలా ఉంటే, పశ్చిమ బెంగాల్లో సైతం పట్టు సాధించిన బీజేపే, కేరళలో మాత్రం పట్టు కాదు కదా, పట్టుమని పది సీట్లు తెచ్చుకునే స్థితిలో లేదు. నిజానికి, దేశంలో బీజేపీకి అసలు ఏ మాత్రం మింగుడు పడని రాష్ట్రాలు ఎవైన ఉన్నాయంటే కేరళ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల  పేర్లే ప్రముఖంగా వినిపిస్తాయి. ఈ సారి కూడా కమల దళం కేరళలో కాలు పెట్టె పరిస్తి లేదని సర్వే ఫలితాలు చెపుతున్నారు. ఎప్పటిలానే ఇప్పడు కూడా  బీజేపీకి సున్నా నుంచి రెండు సీట్లు వచ్చే అవకాశం ఉందని, సర్వేస్వరుల అభిప్రాయంగా ఉంది. కేరళలో మొత్తం 140 స్థానాలకు ఏప్రిల్ 6 తేదీన ఒకే విడతలో పోలింగ్ జరుగుతుంది. మే 2 తేదీన ఫలితాలు వెలువడతాయి. కేరళ ఎలక్షన్ పై యావత్ దేశం ఆసక్తి కనబరుస్తోంది.    
కేంద్ర ఎన్నికలసంఘం ‘పాంచ్ పటాక’ గంట కొట్టింది. అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు రాష్ట్రాలు, పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలును కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. ఎన్నికల గంట మోగడంతో మొదలైన మరో భారత ‘మినీ’  సంగ్రామానికి మే 12 తేదీన జరిగే ఓట్ల లెక్కింపుతో తెర పడుతుంది.ఈలోగా వివిధ అంచల్లో పోలింగ్ జరుగుతుంది.  నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతం ఓటరు తీర్పుకు వెళుతున్నా, అందరి దృష్టి, ముఖ్యంగా ప్రాంతీయ పార్టీల ఏలుబడిలో ఉన్న ఉభయ తెలుగు రాష్ట్రాలు, మరీ ముఖ్యంగా ఇప్పటికే బీజేపీ కన్నుపడిన తెలంగాణ రాష్ట్ర ప్రజలు, రాజకీయ పార్టీల దుష్టి  మాత్రం పశ్చిమ బెంగాల్ పైనే వుంది.  పశ్చిమ బెంగాల్లో ‘అద్భుతం’ జరిగి బీజేపీ విజయం సాధిస్తే, ఇక  కమల దళం ఫోకస్, తెలంగాణకు షిఫ్ట్ అవుతుంది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. ఈ నేపధ్యంలో బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయంలో రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. బెంగాల్లో బీజేపీ గెలిస్తే, ఇప్పటికే అంతర్గత కుటుంబ కలహాలతో సతమతవుతున్న తెరాస నాయకత్వానికి మరిన్నితిప్పలు తప్పవన్న మాట అంతఃపుర వర్గాలలో సైతం వినవస్తోంది.  పశ్చిమ బెంగాల్’లో ఎలాగైతే కమలదళం ఓ వంక తమ ట్రేడ్ మార్క్, హిందుత్వ రాజకీయాలు సాగిస్తూ, మరో వైపు నుంచి ‘ఆకర్ష్’ అస్త్రంతో అధికార పార్టీని నిర్వీర్యం చేసిన విధంగానే, ఇక్కడ కూడా ఫిరాయింపులను ప్రోత్సహింఛి పార్టీని నిట్టనిలువునా చీల్చే ప్రమాదాన్ని కొట్టివేయలేమని పార్టీ వర్గాలు కూడా అనుమానం వ్యక్త పరుస్తున్నాయి.  ఇప్పటికే తెలంగాణ  బీజేపీ నాయకులు 30 మంది తెరాస ఎమ్మెల్యేలు తమ టచ్ లో ఉన్నారని బెదిరిస్తున్నారు.అది నిజం అయినా కాకపోయినా..తెరాసలో అసంతృప్తి అగ్గి రగులుతోందనేది మాత్రం ఎవరూ కాదనలేని నిజం. అంతే కాకుండా రాష్ట్రానికి వచ్చిన కేంద్రనాయకులు ఎవరిని పలకరించినా, నెక్స్ట్ టార్గెట్ తెలంగాణ అని ఎలాంటి సషబిషలు లేకుండా కుండబద్దలు కొడుతున్నారు.అందుకే, బెంగాల్లో బీజేపీ గెలిస్తే.. అనే ఊహా కూడా  గులాబీ గూటిలో గుబులు పుట్టిస్తోంది. అయితే, బెగాల్’లో బీజేపీ గెలిస్తే ఒక్క తెలంగాణలోనే కాదు, దేశ రాజకీయ వాతావరణంలోనే పెను మార్పులు చోటు చేసుకుంటున్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  అలాగే,  దేశ ముఖ చిత్రంలో కూడా పెను మార్పులు తప్పవని అంటున్నారు. అయితే రాజకీయాలలో ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవరూహించెదరు..
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు. అయితే మనిషి తన స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులకు నష్టం కలిగిస్తూ, ఇతరుల జీవితాలు నాశనం అవుతున్నా తనకు అది అనవసరం అనుకునే స్థాయిలో కొందరు ఉంటారు. వారికి కేవలం తమ క్షేమం, తమ సంతోషం మాత్రం ముఖ్యం.  అలాంటి వారిని సింపుల్ గా అవకాశవాదులు అని కూడా అంటారు. కానీ ఇలాంటి వారు తమలో ఉన్న స్వార్థం, అవకాశవాదం బయటకు కనిపించకుండా మంచితనం అనే ముసుగు వేసుకుని ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం.  మంచితనం ముసుగు ధరించిన చెడ్డ వ్యక్తులలో కనిపించే కొన్న లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వారిని గుర్తించి జాగ్రత్త పడవచ్చు.. మంచితనం ముసుగు వేసుకున్న వ్యక్తుల లక్షణాలు.. కొంతమంది ప్రతి విషయంలో ఇతరులను విమర్శిస్తూ, ఆలోచించకుండానే తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. వారి మాటలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఎదుటివారి మనసును గాయపరుస్తాయి. తమ తప్పులను ఒప్పుకోకుండా, ఇతరులను నిందించే వారు ఉంటారు. తాము చెప్పిందే సరైనదని నిరూపించుకోవడమే వారికి ముఖ్యం. ఇతరులను,  ఇతరుల అభిప్రాయాలను  గౌరవించరు,  వాటిని పట్టించుకోరు. వారి ప్రవర్తన కేవలం వారి ప్రాధాన్యత, వారికి నచ్చిన విషయాలే అయి ఉండాలని అనుకుంటారు. కృతజ్ఞత అనేది వీరిలో కొంచెమైనా ఉండదు.  ఎప్పుడూ ప్రతికూలతపైనే దృష్టి పెడతారు. ఏ విషయంలో అయినా సరే.. మంచిని చూడటం కంటే ఫిర్యాదు చేయడానికి,  నెగెటివ్ గా మాట్లాడటానికి ఇష్టపడతారు. మంచితనం అనే ముసుగు వేసుకున్నవారు ఎవరికీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోరు.  మాట దాటేస్తుంటారు. అవకాశం కోసం మాటలు ఇవ్వడం తర్వాత మాట తప్పడం వీరి దృష్టిలో అస్సలు తప్పు కాదు.  ఒకవేళ తప్పిన మాట గురించి మాట్లాడితే ఎదురుదాడి చేసి మాట్లాడతారు. సరదా లేదా ఫన్ పేరుతో ఇతరులను ఎగతాళి చేయడం, కించపరిచి మాట్లాడటం వీరి గుణం. ఇలాంటివి పదే పదే చేస్తూ ఉంటే.. వారు మంచితనం ముసుగు వేసుకున్న చెడ్డ వ్యక్తుని అర్థం చేసుకోవచ్చు. తాము ఇతరుల కన్నా గొప్ప అని  భావించుకుంటూ, తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి  ప్రయత్నిస్తుంటారు. పైగా ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. తక్కువ చేసి మాట్లాడతారు.  పాత పగలను మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరినీ క్షమించరు.  చిన్న చిన్న తప్పులను కూడా చాలా కాలం గుర్తుంచుకుంటారు. గాసిప్స్ చెప్పుకోవడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ చేరవేడం,  అందరి దృష్టిలో ఇతరులను చెడ్డ చేయడం అంటే వీరికి చాలా సంతోషం కలిగించే విషయం. చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు.  ఇలాంటి అబద్దాలు విని విని అవి సహజం అనుకునే వారు ఏదో ఒకరోజు వీరి ద్వారా చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది క్రమంగా సంబంధాలలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.                                *రూపశ్రీ.
అపరాజిత లేదా శంఖు పుష్పాలు నీలం ,  తెలుపు రంగులో ఉంటాయి.  ఈ పువ్వులు  చాలా అందంగా ఉంటాయి. శంఖు పుష్పం మొక్కను దేవతా మొక్కగా పరిగణిస్తుంటారు.  ఈ పువ్వులు  సంతోషం, శ్రేయస్సు,  సానుకూల శక్తికి చిహ్నంగా భావిస్తారు. వేసవిలో ఈ తీగ ఎండిపోవడం మొదలై, పూయడం ఆగిపోతూ ఉంటుంది.  చాలా మంది వేసవిలో శంఖు పుష్పం మొక్క ఇక పువ్వులు పూయదు ఈ సీజన్ లో అనుకుంటారు.  అయితే గార్డెనింగ్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ మొక్కకు మార్చి,  ఏప్రిల్ నెలలు ప్రత్యేకంగా ముఖ్యమైనవి. కొన్ని చిట్కాలు పాటిస్తే  శంఖు పుష్పం మొక్కకు పువ్వులు చక్కగా పూస్తాయి.  ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. శంఖు పుష్పం మొక్కకు మార్చి, ఏప్రిల్ నెలలు చాలా ముఖ్యమైనవి. ఈ సమయంలో తీగను కత్తిరించడం చాలా అవసరం. పాత, ఎండిపోయిన, పసుపు రంగులోకి మారిన కొమ్మలను కత్తిరించాలి. ఇది మొక్క కొత్త కొమ్మలను చిగురించడానికి ప్రోత్సహిస్తుంది. కొమ్మలు ఎంత ఎక్కువగా ఉంటే, అది అంత ఎక్కువగా పువ్వులను పూస్తుంది. శంఖు పుష్పం తీగ కుండీలోని మట్టి ఒకటి నుంచి రెండు సంవత్సరాల పాతదైతే దానిని మార్చాలి. కాలక్రమేణా, మట్టిలోని పోషకాలు తగ్గిపోయి చాలా గట్టిగా మారుతుంది. కుండీ పైభాగంలోని 2 నుంచి 3 అంగుళాల మట్టిని తీసివేసి, దాని స్థానంలో కొత్త కంపోస్ట్ కలిపిన మట్టిని నింపాలి. ఇది మొక్క  కొత్త వేర్లను బలపరిచి, వేగవంతమైన పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. వేసవిలో శంఖు పుష్పం  మొక్కకు తేమ మాత్రమే అవసరం. అధికంగా నీరు పోయడం మొక్కకు హాని కలిగిస్తుంది. వేసవి కాలంలో, ఆకులకు నీరు పోయడానికి స్ప్రే బాటిల్‌ను ఉపయోగించాలి. ఇది మొక్కను తేమగా ఉంచుతుంది. మట్టి పై పొర ఎండిపోయినప్పుడు మాత్రమే నీరు పోయాలి. శంఖు పుష్ప మొక్కకు సూర్యరశ్మి అంటే చాలా ఇష్టం. ఈ మొక్కకు కనీసం 5 నుండి 6 గంటల సూర్యరశ్మిని అందించాలి. ఒకవేళ ఈ మొక్క ఎక్కువ కాలం నీడలో ఉంటే, తీగ పొడవుగా పెరుగుతుంది కానీ పూలు పూయదు. శంఖు పుష్ప మొక్క కోసం మట్టిని సిద్ధం చేసేటప్పుడు, ఇసుక, వర్మీకంపోస్ట్ సరైన నిష్పత్తిలో ఉండేలా చూసుకోవాలి. నెలకు ఒకసారి మట్టిలో లిక్విడ్  ఆవాల పిండి ఎరువును కలపాలి. దీనివల్ల పూల సంఖ్య పెరగవచ్చు. ప్రత్యామ్నాయంగా ఆవు పేడ ఎరువును కూడా వేయవచ్చు.                                        *రూపశ్రీ.
వేసవి వచ్చేసింది, తీవ్రమైన ఎండ , మండే ఎండలు చాలా ఇబ్బంది కలిగిస్తాయి.  ఈ ఎండల ఇబ్బందికి తోడు వేసవిలో కరెంట్ కోత కూడా దారుణంగా ఉంటుంది. దీనివల్ల ఇంట్లో ఉండటం చాలా కష్టమవుతుంది. ఫ్యాన్లు, కూలర్లు, ఏసీలు అన్నీ ఉన్నా కరెంట్ కోత వల్ల అవి  పనిచేయడం ఆగిపోతాయి. ఇలాంటి పరిస్థితిలో వేసవి వేడి నుండి ఉపశమనం పొందాలంటే కొన్ని చిట్కాలు ఫాలో అవ్వాలి.  ఈ చిట్కాలు తెలుసుకున్న వారు వేసవి వేడి ఎక్కువ ఇబ్బంది పెడుతున్నా,  కరెంట్ కోత ఉన్న సమయంలో అయినా టెన్షన్ పడకుండా రిలాక్స్ ఫీల్ అవుతారు.  ఇంతకీ కరెంట్ లేకపోయినా చల్లగా ఉండాలంటే ఫాలో అవ్వాల్సిన చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. కిటికీల, తలుపులు.. వేసవిలో విద్యుత్ కోత  గురించి  చింతించాల్సిన అవసరం లేదు. కిటికీలు, తలుపులను తడిపి, వాటిని తెరిస్తే చాలు, చల్లని గాలి గదిలోకి ప్రవహిస్తుంది. లేదంటే కిటికీలు,  తలుపులకు తడి కర్టెన్లు ఏర్పాటు చేసుకున్నా చల్లగా ఉంటుంది. వట్టివేర్ల మ్యాట్.. బయటి వేడి గాలి లోపలికి రాకుండా కిటికీలలో వట్టివేర్ల  చాపను వేయాలి.  ఈ చాపను కిటికీల దగ్గర ఏర్పాటు చేసి వాటిని అప్పుడప్పుడ తడుపుతూ ఉండాలి. ఈ పద్ధతిని గ్రామీణ ప్రాంతాలలో కూడా విస్తృతంగా ఉపయోగిస్తారు. వట్టివేర్లు చాలా చాలా చల్లగా ఉంచుతుంది. సీజనల్ ప్రూట్స్.. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే, వేసవి కాలంలో  లభించే పండ్లను కూడా తినవచ్చు. పెరుగు, మజ్జిగ, పుచ్చకాయ, దోసకాయ, ముల్లంగి శరీరానికి చాలా మేలు చేస్తాయి. అవి వేడిని తట్టుకోవడానికి  సహాయపడతాయి. చన్నీటి స్నానం..  ఇంట్లో కరెంట్ పోయినప్పుడు శరీరాన్ని చల్లగా ఉంచుకోవాలనుకుంటే,  చల్లటి నీటితో స్నానం చేయవచ్చు.  వేడిగా అనిపించకుండా ఉండటానికి  చేతులు, పాదాలు, ముఖాన్ని తరచుగా కడుక్కోవడం కూడా మంచి మార్గం. కుండనీరు..  మట్టి కుండలోని నీటిని త్రాగడం కూడా మంచి ఉపశమనం. ఈ నీరు  ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడుతుంది ,  శరీరాన్ని తాజాగా, చల్లగా ఉంచుతుంది. తడిబట్ట.. ఇంట్లో వేడిగా ఉన్నప్పుడు తడిబట్ట పెట్టడం అంటే. గదిలో ప్లోర్ ను తుడవడం కూడా మంచి ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది డీప్ క్లీన్ కానక్కర్లేదు. కేవలం కాస్త నీరు చల్లి ప్లోర్ తుడుచుకున్నా చల్లగా ఉంటుంది. రూప్ కూలింగ్.. మేడపైన కూలింగ్ పెయింట్ వేస్తుంటారు కొందరు.  వేసవిలో ఈ పెయింట్ వేయడం వల్ల ఇంట్లో చాలా చల్లగా ఉంటుందని చెబుతారు.  అయితే ఇలా కాకపోయినా ఇంటి మేడ పైన రూఫ్ ను నీటితో తడుపుతూ ఉన్నా కూడా ఇంట్లో చల్లగా ఉంటుంది.                                     *రూపశ్రీ.
  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యం బాగుంటే ఏ పనులైనా చేయవచ్చు, ఎంత డబ్బు అయినా సంపాదించుకోవచ్చు. కానీ నేటికాలంలో డబ్బు  చాలా వరకు ఆరోగ్యం కోసమే ఖర్చు పెడుతున్నారు.  ఎక్కడ చూసినా హాస్పిటల్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి.  చిన్న పిల్లల నుండి వృద్దుల వరకు వయసుతో నిమిత్తం లేకుండా చాలా  రకాల ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నారు.  అయితే ఈ ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన వరల్డ్ హెల్త్ డే జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సపం ఎలా ఆవిర్బవించింది? దీని ముఖ్య ఉద్దేశ్యం ఏమిటి? ఈ రోజు ఏ కార్యక్రమాలు చేపడతారు? ఆరోగ్యం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? తెలుసుకుంటే.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభం.. వరల్డ్ హెల్త్ డే ప్రారంభానికి ప్రధాన కారణం World Health Organization (WHO). 1948 ఏప్రిల్ 7న WHO అధికారికంగా స్థాపించబడింది. అదే తేదీని గుర్తుగా 1950 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్ హెల్త్ డే జరుపుతున్నారు. ప్రపంచంలోని ప్రజల ఆరోగ్యం మెరుగుపరచడం, ఆరోగ్య సమస్యలపై అవగాహన కల్పించడం కోసం ఈ రోజును ఏర్పాటు చేశారు. ఉద్దేశ్యం.. ప్రపంచ ఆరోగ్య సంస్థకు గుర్తుగా  ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు జరుపుకోవడం వెనుక కొన్ని ముఖ్య ఉద్దేశ్యాలు ఉన్నాయి.  ప్రజల్లో అవగాహన పెంచడం.. ఆరోగ్యం గురించి చాలామందికి సరైన సమాచారం,  అవగాహన  ఉండవు. అందుకే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా  వ్యాధుల నివారణ, ఆరోగ్యకర జీవనశైలి,  మానసిక ఆరోగ్యం వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తారు. గ్లోబల్ హెల్త్ సమస్యలపై దృష్టి.. ప్రతి సంవత్సరం ఒక ప్రత్యేక థీమ్ ఉంటుంది. ఈ థీమ్ ను అనుసరించి కార్యక్రమాల రూపకల్పన,  వాటి ఆచరణ వైపు ప్రణాళికలు ఏర్పాటు చేస్తారు.  ఉదాహరణకు..  మెంటల్ హెల్త్, క్లైమేట్ చేంజ్ ప్రభావం, యూనివర్సల్ హెల్త్ కేర్  వంటి అంశాలు ఉండవచ్చు.  ఈ రోజు తీసుకునే నిర్ణయాలు,  ప్రాణాళికలు.. ప్రపంచ మొత్తాన్ని దృష్టిలో పెట్టుకుని తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వాలు, సంస్థలను ప్రోత్సహించడం.. దేశాలు తమ ఆరోగ్య విధానాలను మెరుగుపరచడానికి ఈ రోజు ప్రేరణ కల్పిస్తుంది. ఇందుకోసం.. ఆరోగ్య సమాచారం,  ఆరోగ్యం కోసం మెరుగు పరుచుకోవలసిన అంశాలు,  పర్యావరణం,  ఆరోగ్య సూత్రాలు..  వంటివి సూచించడం జరుగుతుంది. నిర్వహించే కార్యక్రమాలు.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజున కొన్ని  కార్యక్రమాలు నిర్వహించడం పరిపాటి. ఇవి ప్రతి గ్రామం, ప్రతి ఊరు, పట్టణాలలో ప్రభుత్వ ఆసుపత్రులు,  ప్రభుత్వం,  స్వచ్చంద ఆరోగ్య సంస్థల నేతృత్వంలో జరుగుతాయి. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది.  గ్రామాలు, పట్టణాల్లో ఫ్రీ మెడికల్ చెకప్‌లు,  రక్తపరీక్షలు, షుగర్, BP పరీక్షలు వంటివి ఉచితంగా చేస్తారు. హెల్త్ ర్యాలీలు & అవగాహన కార్యక్రమాలు చేపడతారు.  కొన్ని ప్రాంతాలలో వాకథాన్‌లు, మారథాన్‌లు,  స్కూల్స్, కాలేజీల్లో అవగాహన సెషన్స్ నిర్వహిస్తారు. చాలా చోట్ల సెమినార్లు & వర్క్‌షాప్స్ నిర్వహిస్తారు. డాక్టర్లు, హెల్త్ ఎక్స్‌పర్ట్స్ ప్రసంగాలు, మానసిక ఆరోగ్యం, పోషణపై చర్చలు వంటివి జరుపుతారు. వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కూడా ఇస్తారు. పిల్లలకు, పెద్దలకు టీకాలు వేయించడం,  ప్రజల్లో ఇమ్యూనిటీ పెంపుకు తోడ్పడటం చేస్తారు. సోషల్ మీడియా క్యాంపెయిన్స్ కూడా నిర్వహిస్తారు. హ్యాష్‌ట్యాగ్స్ ద్వారా అవగాహన, ఆరోగ్య చిట్కాలు పంచుకోవడం. ఆరోగ్య సమస్యల గురించి సరైన సమాచారం అందించడం,  ఆరోగ్య విషయంలో చాలా చేసే నిర్లక్ష్యాల గురించి వివరించి జాగ్రత్తలు తీసుకోవాల్సిన సందర్బాలు చెప్పడం వంటివి చేస్తారు. అందరూ చేయాల్సింది.. హెల్త్ ఈజ్ వెల్త్ అని అంటారు.. ఆరోగ్యం బాగుంటే కోట్ల ఆస్తులు ఉన్నట్టే.. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవాలి.  వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ద కనబరచాలి.  జాగ్రత్తలు తీసుకుంటూ మంచి లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోవాలి.  ఆరోగ్య సమస్యలు ఉన్నవారు రెగ్యులర్ చెకప్స్ కు హాజరు కావాలి. వ్యాయామం, ప్రాణాయామం, ధ్యానం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని చాలా గొప్పగా మెరుగుపరుస్తాయి.  ప్రతి రోజు వీటిని కొద్దిసేపు అయినా ప్రాక్టీస్ చేయాలి. అలాగే మంచి ఆహారం తీసుకోవాలి.  మంచి ఆహారం అంటే ఖరీదైన ఆహారం అనే అపోహను వదిలేయాలి. నోటికి రుచిగా ఉన్నది కాదు.. శరీరానికి, ఆరోగ్యానికి ఏది మంచిదో అది తినడం అలవాటు చేసుకుంటే.. ఎవరి ఆరోగ్యం వారి చేతుల్లోనే భద్రంగా ఉంటుంది.                                               *రూపశ్రీ.
వేసవి కాలంలో మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే అవకాశం పెరుగుతుంది. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం అనే ప్రమాదం పెరుగుతుంది. దీనివల్ల కాల్షియం ,  ఇతర ఖనిజ స్ఫటికాలు మూత్రపిండాలలో పేరుకుపోయి, రాళ్లుగా ఏర్పడతాయి. భారతదేశంలో 12% కంటే ఎక్కువ మంది ప్రజలు మూత్రపిండాల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. అసలు వేసవిలో మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదం ఎందుకు పెరుగుతుంది? ఈ సమస్య ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? ఈ సమస్యకు పరిష్కారం ఏమిటి? వివరంగా తెలుసుకుంటే.. మూత్రపిండాల రాళ్ల ప్రమాదం.. వేసవిలో శరీరం చెమట ద్వారా ఎక్కువ నీటిని కోల్పోతుంది. తగినంత నీరు తాగకపోవడం శరీరంలో తేమ శాతం తగ్గడానికి  దారితీయవచ్చు. దీని వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. శరీరంలో నీటి కొరత మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ వంటి ఖనిజాల సాంద్రతను పెంచుతుంది. ఈ ఖనిజాలు కలిసి చిన్న స్ఫటికాలుగా ఏర్పడి మూత్రపిండాల్లో రాళ్లుగా మారుతాయి. మూత్రంలో కాల్షియం, ఆక్సలేట్ , యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడం వల్ల స్ఫటికాలు ఏర్పడతాయి. శరీరం డీహైడ్రేషన్ కు  గురైనప్పుడు, ఈ స్ఫటికాలు బయటకు వెళ్లలేక రాళ్లుగా మారతాయి. వేసవిలో డీహైడ్రేషన్  పెరగడం వల్ల ఈ ప్రమాదం అధికమవుతుంది. లక్షణాలు.. మూత్రపిండాల్లో రాళ్ల వల్ల మూత్రవిసర్జనకు సంబంధించిన సమస్యలు వస్తాయి. దీనివల్ల నడుము కింది భాగంలో లేదా పొత్తికడుపులో తీవ్రమైన నొప్పి కలగవచ్చు. ఎవరికి ఎక్కువ ప్రమాదం? వేసవిలో మూత్రపిండాలలో రాళ్ల ప్రమాదం కొంతమందికి  ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నీరు తక్కువగా తాగడం,  నీరు తాగడంలో నిర్లక్ష్యం చేసే వారికి ప్రమాదం ఉంటుంది. అలాగే..  ఎక్కువ ఎండలో తిరిగే వారికి, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి,  ఉప్పు ఎక్కువ తినేవారికి,  ప్రోటీన్ ఎక్కువగా తీసుకునేవారికి, కాఫీ టీ లు, శీతల పానీయాలు ఎక్కువ తీసుకునేవారికి, శరీరం తొందరగా డీహైడ్రేట్ కు గురయ్యే వారికి వేసవి కాలంలో మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుంది. నీరు ముఖ్యం.. వేసవిలో అధికంగా చెమట పట్టడం వల్ల నీటి అవసరం పెరుగుతుంది. సాధారణంగా, ప్రతిరోజూ 2.5-3 లీటర్ల నీరు త్రాగాలి.  ఎక్కువగా చెమట పట్టినా లేదా బయట పనిచేసినా నీటిని మరింత ఎక్కువ తాగాలి. లేత పసుపు రంగు మూత్రం తగినంత నీరు తీసుకుంటున్నారని సూచిస్తుంది, అయితే ముదురు రంగు మూత్రం వస్తే.. నీరు బాగా తాగాలని సంకేతం.                            *రూపశ్రీ.
పంచదార.. నేటికాలంలో చాలా విరివిగా వాడుతున్నారు. కాఫీ, టీ,  స్వీట్లు,  ఇంట్లో చేసే తీపి పదార్థాలు, డిజర్ట్ లు.. ఇలా చాలా తీపి పదార్థాల తయారీలో పంచదారది అగ్రస్థానం.  కాఫీ, టీ ల విషయాని వస్తే.. రోజులో కప్పుల కొద్ది తాగేవారు కూడా ఉంటారు. అయితే.. ఇది ఆరోగ్యానికి మంచిది కాదని నేటికాలంలో వైద్యులు కూడా పెద్ద ఎత్తునే చెబుతున్నారు. గత కొన్నేళ్లుగా చక్కెరను ఎడాపెడా వాడిన వారిలో చాలా మంది ప్రస్తుతం డయాబెటిస్ పేషెంట్లుగా మారారన్నది ఒప్పుకోవాల్సిన నిజం. అయితే.. కేవలం ఒక వారం రోజుల పాటూ చక్కెర వాడకాన్ని ఆపి చూడమని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతున్నారు.  వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే శరీరంలో జరిగే మార్పుల గురించి కూడా వారు చెబుతున్నారు.  అసలు వారం రోజుల పాటూ పంచదార వాడటం మానేస్తే  ఏం జరుగుతుంది? పూర్తీగా తెలుసుకుంటే.. వారం రోజులు చక్కెర వాడటం మానేస్తే జరిగే మార్పులు.. చక్కెర అలవాటు ఉన్నవారు ఉన్నపళంగా చక్కెర వాడటాన్ని ఆపేస్తే.. మొదటి ఒకటి రెండు రోజులు తీపి తినాలని అనిపిస్తుంది. కానీ క్రమంగా శరీరం చక్కెర లేకుండా ఉండటానికి అలవాటు పడుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. మునుపటి కంటే ఎక్కువగా శరీరంలో ఎనర్జీ ఉండటాన్ని గమనించవచ్చు.  దీన్ని అనుభూతి కూడా చెందవచ్చు. చర్మంలో కూడా గణనీయమైన మార్పులు కనిపిస్తాయి. చర్మంలో మెరుపు వస్తుంది.  ముఖ్యంగా చర్మం మీద మొటిమలు,  దద్దుర్లు.. వంటివి క్రమంగా తగ్గడం గమనించవచ్చు. చక్కెర వాడటం ఆపేస్తే జీవక్రియ మెరుగవుతుంది.  గతంలో అంటే.. చక్కెర వాడుతున్నప్పుడు కంటే.. చక్కెర వాడటం మానేసిన తర్వాత జీవక్రియ వేగంగా మారుతుంది. చక్కెర వాడటం మానేస్తే.. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలు సమతుల్యంగా మారతాయి. అధిక బరువు ఉన్నవారు చక్కెర వాడటం మానేస్తే.., క్రమంగా బరువు తగ్గడం మొదలవుతుంది.  వారం రోజులలో స్పష్టంగా మార్పు కనిపించకపోయినా.. చక్కెర వాడటం మానేస్తే.. క్రమంగా బరువు తగ్గడం సులువు అవుతుంది.                                       *రూపశ్రీ.