అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యశ్వంత్ వర్మ తన పదవికి శుక్రవారం (ఏప్రిల్ 10) రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. గత కొంతకాలంగా తనపై సాగుతున్న అభిశంసన ప్రక్రియ, అలాగే నివాసంలో లభించిన లెక్కకు రాని నగదు వివాదం నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.    రాజీనామా చేయాలని ఆయనకు గతంలోనూ సూచనలు అందినప్పటికీ అప్పట్లో ఆయన అందుకు నిరాకరించారు.  ఇప్పుడు ఆయన తప్పుకోవడం న్యాయ వర్గాల్లో  హాట్ టాపిక్ గా మారింది.  గత ఏడాది మార్చి 14న ఢిల్లీలోని జస్టిస్ యశ్వంత్ వర్మ అధికారిక నివాసంలో అగ్నిప్రమాదం సంభవించింది. మంటలను ఆర్పేందుకు వచ్చిన అగ్నిమాపక సిబ్బందికి అక్కడ భారీ ఎత్తున నగదు   కనిపించింది. కాలిపోయిన నోట్లతో పాటు కొన్ని వందల నోట్ల కట్టలు బయటపడటంతో ఈ అంశం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఆ సమయంలో ఆయన ఢిల్లీ హైకోర్టులో న్యాయ మూర్తిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు అంతర్గత విచారణకు ఆదేశించడంతో పాటు, ఆయనను అలహాబాద్ హైకోర్టుకు బదిలీ చేసింది. అంతర్గత విచారణ కమిటీ నివేదిక ఆధారంగా జస్టిస్ యశ్వంత్ వర్మపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. ఆ నగదుతో తనకు సంబంధం లేదని ఆయన వాదించినప్పటికీ విచారణలో ఆ నగదు ఆయన నివాసంలోనిదే అని తేలింది.  ఈ క్రమంలోనే ఆయనపై పార్లమెంటులో అభిశంసన ప్రక్రియను ప్రారం భించేందుకు   146 మంది లోక్‌సభ సభ్యులు సంతకాలు చేసి నోటీసు ఇచ్చారు. ఈ అభిశంసన ప్రక్రియ వేగవంతం కావడంతోనే ఇప్పుడు ఆయన  రాజీనామా నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారు.  ఇలా ఉండగా, యశ్వంత్ వర్మ రాష్ట్రపతికి పంపిన లేఖలో   తన రాజీనామాకు గల కారణాలను వివరించకుండా..  ప్రస్తుత పరిస్థితుల్లో తనకు పదవిలో కొనసాగడం ఇష్టం లేదని పేర్కొన్నారు. న్యాయ వ్యవస్థ గౌరవాన్ని కాపాడేందుకే ఆయన ఈ  నిర్ణయం తీసుకున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. భారతదేశ చరిత్రలో ఒక హైకోర్టు న్యాయమూర్తి ఇలాంటి తీవ్ర ఆర్థిక ఆరోపణలతో అభిశంసన ఎదుర్కొంటూ రాజీనామా చేయడం అత్యంత అరుదు.  జస్టిస్ యశ్వంత్ వర్మ రాజీనామాతో ప్రస్తుతం సాగుతున్న అభిశంసన ప్రక్రియ నిలిచిపోతుందా లేదా అన్నవిషయంపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. సాధారణంగా రాజీనామా చేసిన తర్వాత అభిశంసన ప్రక్రియను కొనసాగించాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే ఆ ప్రక్రియ ముఖ్య ఉద్దేశ్యం సదరు వ్యక్తిని పదవి నుంచి తొలగించడమే. అయితే ఇక్కడ యశ్వంత్ వర్మపై  నమోదైన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.  
బీహార్ రాజకీయాల్లో సుదీర్ఘ కాలం పాటు చక్రం తిప్పిన నితీశ్ కుమార్ తన రాజకీయ ప్రస్థానంలో మరో కీలక అడుగు వేశారు. దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఆయన రాజ్యసభ సభ్యుడిగా శుక్రవారం (ఏప్రిల్ 10)  ప్రమాణ స్వీకారం చేశారు. ఈ పరిణామంతో ఆయన ఇకపై పూర్తిస్థాయిలో జాతీయ రాజకీయాలకే పరిమితం కానున్నారు.   రాజ్యసభ ఎంపీగా ప్రమాణం చేసిన అనంతరం నితీశ్ కుమార్   ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న బీహార్ ముఖ్యమంత్రి పదవికి మరో మూడు నాలుగు రోజుల్లో రాజీనామా చేయనున్నట్లు  వెల్లడించారు. తాను లేని పక్షంలో రాష్ట్ర బాధ్యతలను కొత్త ముఖ్యమంత్రి, మంత్రుల బృందం సమర్థవంతంగా నిర్వహిస్తుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ ప్రమాణ స్వీకారంతో నితీశ్ కుమార్ భారత రాజకీయాల్లో ఒక అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. శాసనసభ , శాసనమండలి , లోక్‌సభ,  రాజ్యసభ లలోనూ  సభ్యుడిగా పనిచేసిన అతికొద్ది మంది నాయకుల జాబితాలో నితీశ్ చేరారు. ఇది ఆయన సుదీర్ఘ,  వైవిధ్యభరితమైన రాజకీయ అనుభవానికి అద్దంపడుతోంది. గత నెలలో జరిగిన ఎన్నికల్లో నితీశ్ కుమార్ రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన సంగతి తెలిసిందే. దాంతో ఆయన గత నెల  30న తన శాసనమండలి సభ్యత్వానికి   రాజీనామా సమర్పించారు. నిబంధనల ప్రకారం ఎమ్మెల్సీ పదవిని వదులుకున్నందున, ముఖ్యమంత్రి హోదాలో కొనసాగేందుకు సాంకేతిక ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకు ఆయన తన పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. బీహార్ అభివృద్ధి కోసం తాను ఇన్నేళ్లుగా పని చేశాననీ, రాష్ట్ర ప్రగతికి అవసరమైన పునాదులు వేశాననీ చెప్పుకొచ్చారు.  ఇక నుంచీ జాతీయ స్థాయిలో సేవలు అందించడమే తన లక్ష్యమన్నారు. 2005 నుండి బీహార్ ముఖ్యమంత్రిగా వరుసగా కొనసాగుతూ వచ్చిన ఆయన, దాదాపు రెండు దశాబ్దాల పాటు రాష్ట్ర రాజకీయాలను శాసించారు.  
పొలిటికల్ ఫ్లెక్సీల సంస్కృతి,  సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న వ్యక్తిత్వ హననంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. రాజకీయ ప్రయోజనాల కోసం సామాన్య ప్రజలను, వ్యవస్థలను ఇబ్బంది పెట్టేలా వ్యవహరించడం తగదంటూ హైకోర్టు ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. రాజకీయ నేతలు ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు శ్రుతిమించుతున్నాయని, ఇది రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పేర్కొంది. వైసీపీ సోషల్ మీడియా మాజీ కోఆర్డినేటర్ సజ్జల భార్గవ్ రెడ్డిపై జారీ అయిన లుక్ అవుట్ సర్క్యులర్‌ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. విచారణలో భాగంగా న్యాయమూర్తులు రాజకీయ ఫ్లెక్సీలపై స్పందిస్తూ.. ఎవరిని ధ్వంసం చేయాలని చూస్తున్నారు? 2029లో రాష్ట్రాన్నా లేక ప్రజలనా?  అంటూ ప్రశ్నించారు. బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వారిని ఉద్దేశించి చేసే వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉండకూడదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టే వారిపై పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడం వల్లే ఇటువంటి పరిస్థితులు పునరావృతం అవుతున్నాయంటూ హైకోర్టు మండిపడింది. గతంలో న్యాయమూర్తులను సైతం లక్ష్యంగా చేసుకుని పోస్టులు పెట్టిన సందర్భాలను గుర్తు చేస్తూ, అప్పట్లోనే కఠిన చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదని అభిప్రాయపడింది. ఒకసారి అరెస్టయిన వారు  మళ్లీ మళ్లీ అవే తప్పులు చేస్తున్నారంటే లోపం ఎక్కడుందో ఆలోచించాలని సూచించింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి వంటి గౌరవప్రదమైన స్థానంలో ఉన్న వ్యక్తిని దూషించడం అంటే, ఆ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని కోర్టు వ్యాఖ్యానించింది. ఎవరి కుటుంబ గౌరవానికి భంగం కలిగించే హక్కు ఎవరికీ లేదని, రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని హితవు పలికింది. కేవలం అధికారం కోసం లేదా రాజకీయ కక్ష సాధింపునకు ఇలాంటి అరాచక సంస్కృతిని ప్రోత్సహించడం సరికాదని హైకోర్టు విస్పష్టంగా పేర్కొంది.  భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా కఠినమైన నిబంధనలు అమలు చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో సజ్జల భార్గవ్ రెడ్డికి సంబంధించిన పిటిషన్‌పై ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తన తీర్పును రిజర్వ్ చేసింది.
ALSO ON TELUGUONE N E W S
  - వీఎఫ్ఎక్స్ విషయంలో మెగాస్టార్ కఠిన నిర్ణయం - క్వాలిటీ కోసం వెనక్కి తగ్గిన మెగా హీరోలు  - వాయిదా బాటలో భారీ చిత్రాలు మెగా అభిమానులకు ప్రస్తుతం ఒకటే టెన్షన్. తమ అభిమాన హీరోల సినిమాలు అనౌన్స్ అయి నెలలు గడుస్తున్నా, షూటింగులు పూర్తి చేసుకున్నా రిలీజ్ డేట్ల విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర, రామ్‌చ‌ర‌ణ్ పెద్ది విడుదల తేదీల చుట్టూ ఇప్పుడు టాలీవుడ్‌లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ రెండు సినిమాల జాప్యానికి ప్రధాన కారణం టెక్నికల్ సమస్యలు, ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ (VFX) నాణ్యత అని ఫిల్మ్ నగర్ టాక్. విశ్వంభ‌ర చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విష‌యంలో ఇప్ప‌టికీ క్లారిటీ లేదు. ఇక రామ్‌చ‌ర‌ణ్ పెద్దికి మొద‌ట మార్చి 27 రిలీజ్ డేట్‌గా ఫిక్స్ చేశారు. ఆ త‌ర్వాత ఏప్రిల్ 30కి మార్చారు. ఇప్పుడు కొత్త‌గా వినిపిస్తున్న మాటేమిటంటే.. ఈ చిత్రం జూన్‌కి వెళ్లిపోయింది. ఈ రెండు సినిమాల‌ను విఎఫ్ఎక్స్ స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయ‌న్న‌ది సినీ వ‌ర్గాల్లో ఉన్న అభిప్రాయం.  గతంలో 'విశ్వంభర' టీజర్ విడుదలైన సమయంలో సోషల్ మీడియాలో విజువల్స్ పట్ల కొంత మిశ్రమ స్పందన వచ్చింది. గ్రాఫిక్స్ క్వాలిటీ ఆశించిన స్థాయిలో లేదని కొందరు నెటిజన్లు పెదవి విరిచారు. దీంతో అప్రమత్తమైన మెగాస్టార్ మరియు దర్శకుడు వశిష్ట, అవుట్‌పుట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని నిర్ణయించుకున్నారట. దాదాపు ఐదారు కీలకమైన సన్నివేశాల్లో వీఎఫ్ఎక్స్ పనులు మళ్ళీ మొదటి నుంచి చేయిస్తున్నట్లు సమాచారం. ఈ రీ-వర్క్ కారణంగానే సినిమా విడుదల తేదీ ప్రకటించడంలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. మరోవైపు  'పెద్ది' పరిస్థితి కూడా ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. ఈ సినిమా షూటింగ్ వేగంగానే జరుగుతున్నప్పటికీ, పోస్ట్ ప్రొడక్షన్ దశలో విజువల్ ఎఫెక్ట్స్ పనులు మేకర్స్‌కు పెద్ద సవాలుగా మారాయట. రాజమౌళి వంటి దర్శకులు ఇండియన్ సినిమాను వీఎఫ్ఎక్స్ పరంగా అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్న తరుణంలో, చిన్న పొరపాటు జరిగినా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు. అందుకే క్వాలిటీ కోసం మరికొంత సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ, పక్కాగా రావాలని పట్టుబడుతున్నారు. వాస్తవానికి మెగా ఫ్యామిలీకి వీఎఫ్ఎక్స్ సమస్యలు కొత్తేమీ కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  'హరిహర వీరమల్లుస చిత్రానికి కూడా వీఎఫ్ఎక్స్‌పై ప‌లు విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఇప్పుడు చిరంజీవి 'విశ్వంభర'కు కూడా అదే పరిస్థితి ఎదురుకావడం మెగా ఫ్యాన్స్‌ను కొంత నిరాశకు గురిచేస్తోంది. సోషల్ మీడియాలో మాత్రం ఈ ఆలస్యంపై విభిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. "లేటైనా లేటెస్ట్‌గా రావాలి" అని కొందరు ఫ్యాన్స్ సపోర్ట్ చేస్తుంటే, "ముందే పక్కా ప్లానింగ్‌తో ఉంటే ఈ ఇబ్బందులు ఉండేవి కావు కదా" అని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భారీ బడ్జెట్ చిత్రాలైనప్పుడు టెక్నికల్ టీమ్స్‌ను ముందే సరిగ్గా ఎంచుకోవాలని సినీ విశ్లేషకులు కూడా సూచిస్తున్నారు. ఏది ఏమైనా మెగాస్టార్ చిరంజీవి తన 'విశ్వంభర'తో బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాలని కంకణం కట్టుకున్నారు. గతంలో 'బింబిసార'తో మెప్పించిన వశిష్ట, ఈసారి చిరు కోసం అంతకు మించి అద్భుతమైన విజువల్ వండర్‌ను సిద్ధం చేస్తున్నారట. ఇక 'పెద్ది' టీమ్ కూడా త్వరలోనే ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ వేసవిలో రావాల్సిన సినిమాలు కాస్త అటు ఇటుగా మారినా, వెండితెరపై విజువల్ ఫీస్ట్ మాత్రం పక్కా అని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. మరి ఈ వీఎఫ్ఎక్స్ అడ్డంకులను దాటుకుని మెగా హీరోలు ఎప్పుడు థియేటర్లలో సందడి చేస్తారో వేచి చూడాలి!
  -ఈ నెల 8 న బర్త్ డే వేడుకలు జరుపుకున్న అల్లు అర్జున్  -ట్రెండ్ అవుతున్న అల్లు స్నేహ రెడ్డి ఆస్తులు -మరి అవి నిజమేనా! కొన్నిపేర్లకి పరిచయ వ్యాఖ్యానాలు అవసరం ఉండదు. అలాంటి వాళ్ళల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun)వైఫ్ స్నేహరెడ్డి ఒకరు. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండటంతో నిత్యం ఆమె పేరు ఏదో ఒక రూపాన ట్రెండ్ అవుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే రీసెంట్ తన ఆస్తుల లిస్ట్ గురించిన న్యూస్ ట్రెండ్ అవుతూ ఉంది. మరి ఆ డీటెయిల్స్ చూద్దాం. స్నేహా రెడ్డి(Allu Sneha Reddy)ఆస్తి విలువ సుమారు 40 నుంచి 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుందనే న్యూస్ ఈ రోజే తనకి స్వాతంత్య్రం వచ్చినట్టుగా కనపడిన ప్రతి వాళ్ళకి హాయ్ చెప్తుంది. పైగా ఆ ప్రాపర్టీని తనే సొంతంగా సంపాదించిందనేది కూడా టాక్. అమెరికాలో మాస్టర్  డిగ్రీని పూర్తి చేసుకొని వచ్చిన స్నేహ రెడ్డి స్టైలిష్ ఫ్యాషన్ నుంచి ట్రావెల్ డైరీల వరకు, తన లైఫ్‌కి సంబంధించిన విషయాలని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. మొదట తన తండ్రికి చెందిన ఇంజనీరింగ్ కాలేజీలో జాబ్ చేసి ఆ తర్వాత వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతం ఒక స్టూడియోని కూడా నడుపుతున్నారు. పలు బ్రాండ్లతో కలిసి వర్క్ చేస్తు నెలకి లక్షల్లో సంపాదిస్తుంది.  Also read: Dacoit: డెకాయిట్ హైలెట్స్ ఇవే.. టాక్ ఎలా ఉంది స్నేహరెడ్డిది తెలంగాణలోని నల్గొండ జిల్లాలోని చింతపల్లి విలేజ్. రీసెంట్ గా బర్త్ డే జరుపుకున్న అల్లు అర్జున్ బర్త్ డే వేడుకలని తనే దగ్గర్నుండి నిర్వహించింది.పిల్లలు అయాన్, అర్హ ల గురించి తెలిసిందే. అల్లు అర్జున్ ప్రెజెంట్ రాకా(Raaka)తో బిజీగా ఉన్న విషయం తెలిసిందే      
టాలీవుడ్‌లో మొదలైన పర్సెంటేజ్ వార్  నిర్మాతలు వర్సెస్ ఎగ్జిబిటర్స్ పర్సెంటేజ్ గొడవతో థియేటర్ల మూసివేతకు రంగం సిద్ధం! తెలుగు సినీ పరిశ్రమలో ఇప్పుడు ఒక కొత్త వివాదం రాజుకుంది. 'పర్సెంటేజ్' (శాతం) విధానంపై తెలంగాణ ఫిలిం ఛాంబర్, నిర్మాతల గిల్డ్ మధ్య కోల్డ్ వార్ మొదలైంది. పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాల్సిందేనని ఎగ్జిబిటర్లు పట్టుబడుతుంటే, అది కుదరదని నిర్మాతలు తెగేసి చెబుతున్నారు. ఈ వివాదం చిలికి చిలికి గాలివానలా మారి, చివరికి మే 1 నుంచి తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేసే దిశగా అడుగులు పడుతున్నాయి. పర్సెంటేజ్ విధానం అంటే ఏమిటి? సాధారణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో 'రెంటల్' విధానం అమలులో ఉంటుంది. అంటే సినిమా ఆడినా ఆడకపోయినా నిర్మాత థియేటర్ యజమానికి నిర్ణీత అద్దె చెల్లించాలి. అయితే, ఇప్పుడు తెలంగాణ ఫిలిం ఛాంబర్ మల్టీప్లెక్స్ తరహాలోనే పర్సెంటేజ్ విధానాన్ని కోరుతోంది. దీని ప్రకారం, మొదటి వారం వసూళ్లలో 60 శాతం, రెండో వారం 50 శాతం, మూడో వారం 40 శాతం థియేటర్ యాజమాన్యానికి ఇవ్వాలని ప్రతిపాదించారు. హైదరాబాద్‌లోని సుమారు 23 ప్రధాన థియేటర్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు ఛాంబర్ స్పష్టం చేసింది. నిర్మాతల గిల్డ్ అభ్యంతరం.. ఈ పర్సెంటేజ్ విధానంపై నిర్మాతల గిల్డ్ తీవ్రంగా మండిపడుతోంది. ప్రస్తుత పరిస్థితుల్లో థియేటర్లకు భారీగా పర్సెంటేజ్ ఇవ్వడం సాధ్యం కాదని, కేవలం అద్దె విధానం (Rental System) ద్వారానే సినిమాలను ప్రదర్శించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రెంటల్ విధానానికి ఒప్పుకునే థియేటర్లకే తమ సినిమాలను ఇస్తామని నిర్మాతలు ఖచ్చితంగా చెబుతున్నారు. దీంతో అటు థియేటర్ల యాజమాన్యాలు, ఇటు నిర్మాతల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. ఫిలిం ఛాంబర్ ఆగ్రహం - లెటర్ వార్! నిర్మాతల గిల్డ్ వైఖరిపై తెలంగాణ ఫిలిం ఛాంబర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసలు తెలుగు ఫిలిం ఛాంబర్‌ను కాదని గిల్డ్ నిర్ణయాలు తీసుకోవడం ఏంటని వారు ప్రశ్నిస్తున్నారు. "నిర్మాతల గిల్డ్ ఎవరు?" అంటూ ఘాటైన వ్యాఖ్యలు చేయడమే కాకుండా, తెలుగు ఫిలిం ఛాంబర్‌కు ఒక లేఖ కూడా రాశారు. ఈ నెలాఖరు (ఏప్రిల్ 30) లోగా ఈ సమస్యపై తుది నిర్ణయం తీసుకోవాలని, లేనిపక్షంలో కఠిన నిర్ణయాలు తీసుకుంటామని హెచ్చరించారు. మే 1 నుంచి థియేటర్ల మూసివేత? ఒకవేళ ఏప్రిల్ 30 లోగా పర్సెంటేజ్ విధానంపై స్పష్టత రాకపోతే, మే 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా సింగిల్ స్క్రీన్ థియేటర్లను మూసివేస్తామని ఎగ్జిబిటర్ల సంఘం ప్రకటించింది. అద్దె విధానం వల్ల తాము భారీగా నష్టపోతున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికే పర్సెంటేజ్ విధానమే విజయవంతంగా నడుస్తోందని వారు గుర్తు చేస్తున్నారు.  ప్రేక్షకులపై ప్రభావం.. సమ్మర్ సీజన్ కావడం, రాబోయే రోజుల్లో పెద్ద సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో ఈ థియేటర్ల బంద్ వార్త ప్రేక్షకులను ఆందోళనకు గురిచేస్తోంది. ఒకవేళ థియేటర్లు మూతపడితే బాక్సాఫీస్ వద్ద కోట్ల రూపాయల నష్టం వాటిల్లే అవకాశం ఉంది. మరి ఈ వివాదానికి ఏప్రిల్ 30 లోగా ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.  
  -థియేటర్స్ లోకి వచ్చిన అడివి శేష్, మృణాల్ ఠాకూర్  -భారీ ఓపినింగ్స్  -హైలెట్స్ ఇవేనా    హిట్ కి కేర్ ఆఫ్ అడ్రస్స్ గా నిలిచే 'అడివి శేష్'(Adivi Sesh)మరోసారి హిట్ ని అందుకోని సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని ఈ రోజు 'డెకాయిట్'(Dacoit)తో థియేటర్స్ లో తిష్ట వేసాడు. లక్కీ చార్మ్  'మృణాల్ ఠాకూర్'(Mrunal Thakur)హీరోయిన్ కావడం 'డెకాయిట్' కి అతి పెద్ద ప్లస్ పాయింట్. ప్రచార చిత్రాలు కూడా పాజిటీవ్ గా ఉండటంతో అభిమానులు, ఫ్యాన్స్ థియేటర్స్ బాట పట్టారు. మరి మూవీ చూసాక  ట్రేడ్ వర్గాలు, ప్రేక్షకులు కొన్ని హైలెట్స్ ని వ్యక్తం చేస్తున్నారు. అవేంటో చూద్దాం. 1 .అడివి శేష్ మేనరిజమ్స్  2 .మృణాల్ పెర్ ఫార్మెన్స్  3 . మృణాల్, కూతురు మధ్య సీన్స్  4 .అనురాగ్ కశ్యప్ పెర్ ఫార్మెన్స్  5 . ఫొటోగ్రఫీ  6 . బ్యాక్ గ్రౌండ్ స్కోర్  7  ప్రీ క్లైమాక్స్  8 . క్లైమాక్స్  Also Read: sanya malhotra: ప్రియుడికి గుడ్ బై చెప్పిన హీరోయిన్.. ఆ ప్రియుడు ఎవరో తెలిస్తే షాక్ అవుతారు డెకాయిట్ ని సునీల్ నారంగ్ తో కలిసి కింగ్ నాగార్జున(Nagarjuna)మేనకోడలు సుప్రియ నిర్మించింది. షానియెల్ డియో(Shaneil Deo)దర్శకుడు కాగా ప్రకాష్ రాజ్, సునీల్,అతుల్ కులకర్ణి, కామాక్షి భాస్కర్ల కీలకమైన క్యారెక్టర్స్ లో కనిపించారు. తెలుగుతో పాటు పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యింది. రివ్యూస్ అయితే కొంచం నెగిటివ్ గా వస్తున్నాయి. మరి సుమారు 70  కోట్లరూపాయల బడ్జెట్ తో తెరకెక్కించారనే  టాక్ వినిపిస్తుండంతో ఏ మేర కలెక్షన్స్ ని సాధిస్తుందో చూడాలి.    
- కన్నతల్లి సెంటిమెంట్.. కొడుకు ఆవేదన - వ్యవస్థపై తిరుగుబాటు చేసిన యువ ఇంజనీర్! - గుండెలను పిండేసే సెంటిమెంట్ దృశ్యం. నేటి సమాజంలో ప్రతిభ ఉన్నా అవకాశాలు లేక, సిఫార్సుల నీడన నలిగిపోతున్న ఎందరో యువకుల గోడుకు ఈ దృశ్యం ఒక నిలువుటద్దం. కన్నతల్లి కష్టాన్ని కళ్లారా చూస్తూ, చదువుకున్న చదువుకి గౌరవం దక్కని వేళ ఆ యువకుడి గుండెల్లో చెలరేగిన ఆవేదన ప్రతి ఒక్కరినీ కదిలిస్తుంది. నంద‌మూరి బాల‌కృష్ణ‌, విజ‌య‌శాంతి, జ‌గ్గ‌య్య‌, గొల్ల‌పూడి, అన్న‌పూర్ణ‌, చంద్ర‌మోహ‌న్ త‌దిత‌రులు ముఖ్య‌పాత్ర‌లు పోషించిన భార్గ‌వ రాముడు చిత్రానికి సంబంధించిన వీడియో ఇది. ఎ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సినిమాలోని భావోద్వేగ పూరిత‌మైన ఈ వీడియో మీకు అందిస్తున్నాం.  యూనివర్శిటీలో గోల్డ్ మెడల్ సాధించిన ఒక ఇంజనీర్, ఇంటర్వ్యూ బోర్డు ముందు నిలబడినప్పుడు అతనికి ఎదురైన ప్రశ్నలు అతని మేధస్సును కాక, అతని సహనాన్ని పరీక్షించాయి. పురాణాల గురించి, ప్రపంచ చరిత్ర గురించి అనర్గళంగా సమాధానాలు చెప్పినా, చివరకు మీ నాన్న ఏం చేస్తారు? అన్న ఒక్క ప్రశ్న అతన్ని నిలువునా దహించివేసింది. "సిఫార్సుల రాజ్యం ఏలుతున్నంత కాలం, మాలాంటి మేధావులు రోడ్డున పడాల్సిందేనా?" అంటూ అతను కురిపించిన ప్రశ్నల వర్షం వ్యవస్థలోని లోపాలను ఎండగట్టింది. కట్టుకున్న భార్యను, కన్న బిడ్డను అనాథలుగా వదిలేసి వెళ్ళిపోయిన తండ్రిపై ఆ కొడుకుకి అంతులేని కోపం. తనను తండ్రి లేని వాడిగా సమాజం ముందు నిలబెట్టిన ఆ వ్యక్తి ఫోటోను ముక్కలు చేయాలని చూస్తాడు. కానీ, అదే సమయంలో ఆ తల్లి మాటలు హృదయాన్ని ద్రవింపజేస్తాయి. "ఆయన మంగళసూత్రం కట్టబట్టే నాకు ఈ గౌరవం, నా నుదుట కుంకుమ నిలిచి ఉందంటే కారణం ఆ మహానుభావుడే.. నేను బ్రతికుండగా ఆయన్ని ఒక్క మాట అనొద్దు" అని ఆ తల్లి వేడుకోవడం భారతీయ స్త్రీ మూర్తి సహనానికి, సంప్రదాయానికి ప్రతీకగా నిలుస్తుంది. గోల్డ్ మెడల్ సాధించిన చేతులతో ఆటో తోలాలని నిర్ణయించుకున్న ఆ యువకుడి నిర్ణయం, నేటి విద్యావంతుల దుస్థితికి నిదర్శనం. "గాంధీల సంఖ్యను పెంచండి కానీ, గాడ్సేల సంఖ్యను కాదు" అంటూ అతను చేసిన హెచ్చరిక ఆలోచింపజేస్తుంది. మేధావులు నిరాశతో రోడ్డున పడితే అది రక్తపాతానికి దారితీస్తుందన్న హెచ్చరిక వెనుక ఎంతటి ఆవేదన ఉందో అర్థం చేసుకోవచ్చు. చివరగా, నీతికి నిలబడి ఉద్యోగాన్ని కూడా పణంగా పెట్టిన ఒక నిజాయితీ గల అధికారి, ఆయనను కాపాడటానికి సిద్ధమైన ఆ యువకుడు.. ఈ కథనం మనకు నేర్పే పాఠం ఒక్కటే - కష్టం ఎన్ని అడ్డంకులు సృష్టించినా, సంస్కారం వీడకూడదు. ఈ ఎమోషనల్ వీడియో చూసిన నెటిజన్లు "నిజమైన టాలెంట్ ఎప్పుడూ ఓడిపోకూడదు" అంటూ కామెంట్లతో సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రతిభావంతులకు సరైన గుర్తింపు దక్కాలని ఆశిద్దాం.
Cast: Adivi Sesh, Mrunal Thakur, Prakash Raj, Anurag Kashyap, Sunil, Atul Kulkarni, Kamakshi Bhaskarla   Crew: Cinematography: Dhanush Bhaskar Editing: Kodati Pavan Kalyan Music: Bheems Ceciroleo Producer: Supriya Yarlagadda Co-Producer: Sunil Narang Banners: SS Creations, Sunil Narang Production Written & Directed by: Shaneil Deo Release Date: April 10, 2026   After experimenting as both actor and director, Adivi Sesh has faced a string of setbacks pre Panjaa. But destiny turned with Kshanam, a film that redefined his career and gave him the connect he had been searching for. Since then, he’s been on a ridiculous run. He went from the goofy charm of Ami Thumi to becoming the smart man’s action hero in Goodachari, HIT 2 and Major. Now with Dacoit, he’s ditching the spy games for a gritty, raw love story. It’s a massive gamble. Does he actually pull it off or has the streak finally run out? Let’s get into it.    Plot:  Back in 2005, Hari Das (Adivi Sesh) was a carefree soul who found himself drawn to Saraswati (Mrunal Thakur) and soon fell deeply in love with her. But in Hindupuram, society still split people into upper and lower castes and their love couldn’t stay hidden for long. Once exposed, everything began to unravel, Hari was accused of a crime and thrown behind bars. The real wound wasn’t the arrest itself, but the crushing blow of Saraswati’s statement against him. That betrayal cut deeper than any punishment.   Decade later, Hari breaks free from prison, carrying only one burning purpose: to make Juliet pay for the words that destroyed him. What truly happened in 2005? Will Hari’s thirst for revenge consume him or will the remnants of love and compassion find their way back into his heart? That internal conflict forms the rest of the storyline.    Analysis:  Dacoit actually kicks off with some real energy. The way it uses those jittery jump cuts and a flashback heavy narration to set up the central "burning issue" is genuinely slick. But once the titles fade, it just slides right back into that tried trope we’ve seen a thousand times: two strangers meet, fall in love, become rebels in their divided community and march towards a climax you can see coming from a mile away. It tries to be everything at once, juggling class divides, systemic oppression, honor, COVID-era struggles, and this forced attempt at a modern Romeo and Juliet parallel. It’s just too much. For instance (small spoiler here) in this whole upper vs. lower class clash, seven people get involved, one dies and the heroine basically ruins the hero's life with a statement. Yet Hari (Sesh) never really cares about the collateral damage or the actual people involved. It’s just "blind revenge" because he’s angry.   And speaking of Hari and Saraswati, the love scenes completely miss the mark. The chemistry and emotional connection between Sesh and Mrunal are so absent that you tend to become investigator yourself to find what's missing. Hari makes a crucial decision regarding her that initially spikes your excitement, but as their scenes drag on, whatever curiosity you had completely flatlines. Then there are the glaring logical loopholes. Take the jailbreak sequence: he could have so easily faked his death, but instead they go with him escaping right before the cops and it's totally unconvincing. By the time we reach the interval, the supposedly Sujeeth twist totally fails to give you that necessary kick.   Post-interval, the film starts to give a severe headache and honestly you can predict exactly where the story is heading. They try this non-linear flashback structure that sounds good in theory, but on screen, it’s executed like a confusing mess. Every action scene feels like a forced excuse to move to the next set piece (the Karuna Hospitals are purely there to be robbed). And the logic? Don't even look for it. You have characters having deep, drawn out conversations and debates while danger is literally breathing down their necks. Who has time to chat when you're running for your life? By the time you hit that mountain top, which feels like it was ripped straight out of a 2000s potboiler, it's exhausting. Kshna Kshnam, Anaganaga Oka Roju kind of films had this cat-and-mouse structure but screenplay was always pushing forward, here it gets more into repetitive space like Daud.    It’s a shame because Sesh is actually trying to kill it here. His body language is spot on and while he clearly did his homework with the Seema slang, the makers leaned into it so hard that a lot of the dialogues end up completely muffled or hard to understand. The clarity just isn't there and it's baffling why the team ignored it. Mrunal looks beautiful and acts her heart out with a character that makes zero sense half the time. Atul Kulkarni is great early on, but then the script just forgets he exists. And don't even get me started on Prakash Raj, Zayn Marie Khan, Kamakshi Bhaskarla and Zarina Wahab are completely wasted. Anurag Kashyap tries his best but nothing lands. Looks like Telugu-Hindi bilingual approach damaged potency in the script. The performances had some heart but nothing really elevates the scenes.    On the technical front, the production values are absolutely top-notch. But the soundtrack? It really doesn't help. Bheems Ceciroleo fails to deliver a single catchy tune outside of that one "Ruberoo" track. Thank god for Gyaani, because his BGM is honestly the high point of the entire film and salvages a lot of the gritty mood. And it's not just the music that missed the mark, the dialogues by Abburi Ravi fall completely flat and just aren't good at all. Editing needed to be sharp in second hour as the story progression seems halted. It just feels like shots placed in order rather than any attempt made at storytelling. We all know the open secret: Adivi Sesh usually takes the reins on the story and screenplay to engineer his own hits. But you actually have to hand it to Shaneil Deo for his visual execution. He genuinely succeeds as a director here, crafting every single scene with an almost Hollywood style flair. His shot making and overall taking are interesting. But as a writer? He did a grave injustice to Dacoit. For all its visual brilliance, the script is a chaotic mess and unfortunately that's exactly where Sesh's usual magical touch completely faltered.    Positives: Lead performances The core robbery concept Cinematography BGM   Negatives:  Story Draggy screenplay Weak dialogues Logical loopholes Poor character arcs    Bottomline: Adivi Sesh and Mrunal try to induce life but script falters like a botched crime scene.    Rating: 2.25/5    Disclaimer: The views/opinions expressed in this review are personal views/opinions shared by the writer and organisation does not hold a liability to them. Viewers' discretion is advised before reacting to them.    
  -దంగల్ తో ఇండియన్ సినీ లవర్స్ మనసులలో స్థానం  -ఏడాదిగా లెజండ్రీతో ప్రేమలో  -మరి హఠాత్తుగా ఇనిస్టాలో అన్ ఫాలో  టాటా వీడుకోలు గుడ్ బై ఇంక సెలవు అని పాడుతు ఏఎన్ఆర్ ఏమంటు చిందులేసాడో గాని ఇప్పుడు ఇండియన్ సినీ పరిశ్రమలో బ్రేక్ అప్ చెప్పుకునే ప్రేమికుల సంఖ్య ఎక్కువ అయ్యింది.ఈ మేరకు సోషల్ మీడియాని ఖాళీగా ఉంచకుండా ఎవరో ఒకరు ఆ బాధ్యతని తమ భుజ స్కందాలపై వేసుకుంటున్నారు. మరి ఆ కర్తవ్యాన్ని ఈ సారి దంగల్ ఫేమ్ 'సన్య మల్హోత్రా'(sanya Malhotra) తీసుకుందనేది టాక్. మరి బ్రేక్ లేకుండా పూర్తి డీటెయిల్స్ చూద్దాం. ఏడాది నుంచి సన్యా మల్హోత్రా, ప్రముఖ సితార్ వాయిద్యకారుడు రిషబ్ శర్మ(Rishab Sharma)తో ప్రేమాయణం నడుపుతుందనే న్యూస్ ఎప్పటికప్పుడు ముంబై సినీ వీధుల్లో చక్కర్లు కొడుతూనే ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆ ఇద్దరు ఎన్నో ఫంక్షన్స్ కి హాజరయ్యి జంటగా కనిపించే వాళ్ళు. అయితే తాజా బి టౌన్ సమాచారం ప్రకారం ఆ ఇద్దరు తమ రిలేషన్ కి మంగళం పాడారనేది టాక్. అందుకు బలాన్ని చేకూర్చేలా ఈ ఇద్దరు ఒకరినొకరు ఇన్‌స్టాగ్రామ్‌లో అన్ ఫాలో చేసుకున్నారు. మరి కారణాలేంటో ఆ ఇద్దరికి తెలియాలి. రిషబ్ అయితే ఆల్రెడీ ఇంకో అమ్మాయితో డేటింగ్ లో ఉన్నాడనే టాక్ కూడా చాలా బలంగానే చక్కర్లు కొడుతుంది.  Also read: Dhurandhar 2: ధురంధర్ 2 మేకప్ ఆర్టిస్ట్ ప్రీతీ గురించి బయటకొచ్చిన నిజాలు సాన్యా రీసెంట్ గా 'మిసెస్' చిత్రంతో వచ్చి మరో సారి సిల్వర్ స్క్రీన్ ని తన అద్భుతమైన నటనతో షేక్ చేసింది. ఈ నెల 15 న 'టోస్టర్' అనే వెబ్ సిరీస్ తో నెట్‌ఫ్లిక్స్‌లో సందడి చేయనుంది. రాజ్‌కుమార్ రావు హీరో. సుందర్ పూనమ్', 'బందర్' వంటి చిత్రాలు కూడా సందడి చేయడానికి పందెం కోళ్ళల్లా బరిలో దిగడానికి కాచుకొని కూర్చున్నాయి. రిషబ్ కూడా తన వృత్తి పరంగా కచేరీలు చేసుకుంటు బిజీగా ఉన్నాడు. ప్రపంచ ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు పండిట్ రవిశంకర్(Pandit Ravishankar)శిష్యుడే రిషబ్ శర్మ.      
'జై హనుమాన్' కోసం ప్రశాంత్ వర్మ మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర కోసం పాన్ ఇండియా యాక్టర్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన 'హనుమాన్' సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. తక్కువ బడ్జెట్‌తో వచ్చి బాక్సాఫీస్ వద్ద వందల కోట్ల వసూళ్లు రాబట్టిన ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్‌గా 'జై హనుమాన్' సిద్ధమవుతోంది. ఇప్పటికే ఈ సినిమాలో 'కాంతార' ఫేమ్ రిషబ్ శెట్టి హనుమంతుడిగా నటిస్తున్నట్లు ప్రకటించి సినిమాపై అంచనాలను రెట్టింపు చేశారు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌లోకి మరో పాన్ ఇండియా హీరో వచ్చి చేరడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. వార్ లోకి రానా.. క్యారెక్టర్ ఏంటో తెలుసా? ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (PVCU) లో రానా దగ్గుబాటి ఒక కీలక పాత్ర పోషించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. రానా వంటి పవర్‌ఫుల్ పర్సనాలిటీ ఉన్న నటుడు 'జై హనుమాన్'లోకి రావడంతో సినిమా స్థాయి మరింత పెరుగుతుంది అనడంలో సందేహం లేదు. ఈ చిత్రంలో రానా మైథలాజికల్ టచ్ ఉన్న ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారట. రానా అంటేనే స్క్రీన్ మీద ఒక గంభీరమైన రూపం గుర్తుకొస్తుంది. అందుకే ఆయన కోసం ప్రశాంత్ వర్మ ఒక స్పెషల్ రోల్‌ను డిజైన్ చేసినట్లు తెలుస్తోంది. రిషబ్ శెట్టి వర్సెస్ రానా? రిషబ్ శెట్టి ఇప్పటికే తన నటనతో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆయన హనుమంతుడిగా మారుతుండగా, రానా ఆయనకు వ్యతిరేకంగా విలన్ పాత్రలో కనిపిస్తారా? లేక మరేదైనా పాత్రలో కనిపిస్తారా? అన్నది ఇప్పుడు నెట్టింట పెద్ద చర్చగా మారింది. రానా గతంలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలను కూడా అద్భుతంగా పండించారు. మరి ప్రశాంత్ వర్మ ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్ ని ఎలా చూపిస్తారో అన్నది ఆసక్తికరంగా మారింది. నెక్స్ట్ లెవల్ విజువల్స్.. భారీ టెక్నీషియన్స్! ఈ భారీ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. రీసెంట్‌గానే ఈ సినిమాకు సంబంధించిన టెక్నికల్ టీమ్‌లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సినిమాటోగ్రాఫర్‌గా నిమిష్ రవి ఎంపికయ్యారు. ఆయన రాకతో సినిమా విజువల్స్ అద్భుతంగా ఉంటాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రశాంత్ వర్మ తన సినిమాల్లో గ్రాఫిక్స్ విషయంలో ఎప్పుడూ రాజీ పడరు, ఈసారి కూడా 'జై హనుమాన్' ఒక విజువల్ వండర్‌గా ఉండబోతోందని స్పష్టమవుతోంది. ఫ్యాన్స్ అంచనాలు మామూలుగా లేవుగా! సోషల్ మీడియాలో 'జై హనుమాన్' అప్డేట్స్ కోసం నెటిజన్లు ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. హంపి పుణ్యక్షేత్రంలో ప్రారంభమైన ఈ షూటింగ్ షెడ్యూల్స్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతున్నాయి. రానా వంటి క్రేజీ స్టార్ ఈ ప్రాజెక్ట్‌లో భాగం కావడంతో, కేవలం తెలుగులోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  త్వరలోనే రానా క్యారెక్టర్‌కు సంబంధించిన అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది. మొత్తానికి 'జై హనుమాన్' చిత్రంతో ప్రశాంత్ వర్మ తన సినిమాటిక్ యూనివర్స్‌ను మరో రేంజ్‌కి తీసుకెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. మరి బాక్సాఫీస్ వద్ద ఈ హనుమ మ్యాజిక్ ఎలా ఉండబోతుందో వేచి చూడాలి!  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
ప్రపంచంలో అన్ని రకాల మనుషులు  ఉంటారు.  మనుషులకు ఒక్కొక్కరికి ఒక్కో వ్యక్తిత్వం కూడా ఉంటుంది. ప్రపంచంలోని గొప్ప వ్యక్తులను లేదా మన చుట్టూ ఉండే గొప్ప వ్యక్తులు లేదా శక్తివంతమైన వ్యక్తులను గమనిస్తే... గొప్ప వ్యక్తులలో ఉండే అతిగొప్ప లక్షణం తక్కువ మాట్లాడటం.  తక్కువ మాట్లాడేవాడు తన చేతల్లోనే తన విజయాన్ని చూపిస్తాడు అని తరచుగా చెబుతూ ఉంటారు కూడా. ఇతరుల కంటే తక్కువ మాట్లాడేవారే ఎక్కువ తెలివైనవారని, జ్ఞానులని ఎందుకు అంటారు? తక్కువ మాట్లాడేవారు ఎందుకు ప్రత్యేకమైనవారిగా పరిగణించబడతారు? తక్కువ మాట్లాడటం అనేది గొప్ప లక్షణంగా ఎందుకు పరిగణించబడుతుంది? వివరంగా తెలుసుకుంటే.. తక్కువ మాట్లాడితే మాట విలువ పెరుగుతుంది.. ఎప్పుడూ  మాట్లాడుతూ ఉండే వ్యక్తులపై  చుట్టూ ఉన్నవారు  శ్రద్ధ పెట్టడం తగ్గిస్తారట.చాలా తక్కువగా మాట్లాడే వ్యక్తి మాట్లాడినా కూడా ప్రజలు శ్రద్ధగా వింటారు. తక్కువ మాట్లాడటం వల్ల  వ్యక్తి మాటలకు విలువ పెరిగి, సమాజంలో వారికి మరింత గౌరవం లభిస్తుందని ఆచార్య చాణక్యుడు చెబుతాడు. ఆలోచనా శక్తి.. తక్కువ మాట్లాడేవారు తమ మెదడును ఎక్కువగా ఉపయోగిస్తారు. వారు స్పందించడానికి తొందరపడరు.  ముందుగా పరిస్థితిని పూర్తిగా అర్థం చేసుకుని, ఆ తర్వాతే ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అందుకే  వారు కరెక్ట్ గా నిర్ణయాలు తీసుకున్నారని అందరూ ఒప్పుకునే విధంగా ఉంటాయి.   సమాజం కూడా ఇలా తక్కువ మాట్లాడే వారికి చాలా తెలివైన వారు అని చెబుతూ ఉంటుంది. ఆత్మవిశ్వాసం..  తక్కువ మాట్లాడేవారు ఆర్భాటాలు చేయరు. వారికి తమపై పూర్తి విశ్వాసం ఉంటుంది, కాబట్టి ఇతరులను ఆకట్టుకోవడానికి  పనికిమాలిన మాటలు మాట్లాడరు. ఇలా  నిశ్శబ్దంగా ఉండే స్వభావమే వారి నిజమైన బలం అవుతుందని చాణక్యుడు అంటాడు.  తక్కువ మాట్లాడినప్పుడు వారిలో ఎన్నో విషయాలు వారిలోనే రహస్యంగా ఉండిపోతాయి. అదే ఎప్పుడూ మాట్లాడేవారు ఏ చిన్న సంఘటన జరిగినా బయటకు చెప్పేసుకుంటారు. దీని వల్ల వారికి విలువ, గౌరవం తగ్గిపోతుంది. అర్థం చేసుకునే అవకాశం.. తక్కువ మాట్లాడటం వల్ల కలిగే అతిపెద్ద ప్రయోజనం  ఇతరుల మాటలను వినడానికి  అవకాశం లభించడం. ఇతరులు చెప్పేది బాగా వినగలిగే వ్యక్తి మాత్రమే  ఇతరుల బలహీనతలను, అవసరాలను అర్థం చేసుకోగలరని చాణక్యుడు చెబుతాడు. మౌనంగా ఉండి ఇతరుల మాటలను విన్నప్పుడు, వారి ఆలోచనలపై  ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇది నిర్ణయాలు తీసుకోవడానికి,  విజయం సాధించడానికి అత్యంత కీలకం అవుతుంది.                                 *రూపశ్రీ.
విజయం ప్రతి వ్యక్తి జీవితంలో ఒక లక్ష్యంగా ఉంటుంది.  చదువు, ఉద్యోగం, వ్యాపారం.. ఇలా ప్రతి విషయంలో ఒక లక్ష్యం పెట్టుకుని,  దాన్ని సాధించి,  విజయ బావుటా ఎగరవేయాలని అనుకుంటారు చాలా మంది. అయితే.. విజయం సాధించడానికి కష్టపడితే సరిపోతుందని  తెలివి ఉంటే చాలని అనుకుంటారు అందరూ. కానీ విజయం సాధించడానికి తెలివి తేటలు, కష్టపడే తత్వం ఉన్నా.. కొన్ని అలవాట్లు మాత్రం వారికి విజయాన్ని దూరంగానే ఉంచుతాయి.  కొన్ని అలవాట్లు ఉన్న వ్యక్తి జీవితంలో ఎప్పటికీ విజయం సాధించలేడని సాక్షత్తు ఆచార్య చాణక్యుడే చెబుతాడు.  ఒక వ్యక్తిని విజయం సాధించకుండా చేసే ఆ అలవాట్లు ఏమిటో తెలుసుకుంటే.. సోమరితనం.. కష్టపడే వ్యక్తులలో సోమరితనం ఉంటుందా అని చాలా మంది ఆశ్చర్యపోతారు. కానీ ఇది నిజం.. కష్టపడే వ్యక్తులలో ఎంతో కొంత సోమరితనం కనిపిస్తూ ఉంటుంది.  అయితే ఏదో ఒక సందర్బంలో ఈ సోమరితనం వారిని దెబ్బతీస్తుంది.  కీలకమైన సందర్బంలో ఏ విషయాన్ని అయినా లైట్ తీసుకుంటే లేదా పనిని నిర్లక్ష్యం చేస్తే.. చేతుల దాకా వచ్చిన విజయం కూడా చేజారిపోతుంది.  అందుకే.. ఏ కొద్దిపాటి సోమరితనం ఉన్నా,  దాన్ని వదిలిపెట్టడం మంచిది. పట్టుదల.. పట్టుదల ఏ పనిలో అయినా ముందుకు సాగడానికి,  పనిని పూర్తీ చేయడానికి ప్రేరణ ఇస్తుంది. కానీ చాలామంది ఏదైనా పనిని మొదలు పెట్టినప్పుడు చాలా సీరియస్ గా ప్రారంభించి కష్టపడతారు.. ఆ తరువాత మాత్రం తమ పట్టుదలను తగ్గిస్తారు.  దీని వల్ల దక్కాల్సిన విజయం చెయ్యి జారిపోతుంది. ప్రవర్తన.. మనిషి ప్రవర్తన కూడా వారు పనితీరుపై ప్రభావం చూపిస్తుంది. చాలామంది ఇతరులతో అమర్యాదగా ప్రవర్తిస్తుంటారు. ఇలాంటి వ్యక్తులను చుట్టుప్రక్కల వారు, సమాజం ఎప్పటికీ ఇష్టపడదు, వారికి గౌరవం ఇవ్వదు,  వారు చేసే పనులలో తోడ్పాటు, వారు చేసే పనులకు గౌరవం కూడా ఇవ్వదు. ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవారు తమ పనుల విషయంలో కూడా నెగెటివ్ ఫలితాలు పొందుతారు.                                   *రూపశ్రీ.
మంచి, చెడు ప్రతి మనిషిలోనూ తప్పకుండా ఉండే గుణాలు.  మనుషులు కొన్ని విషయాల్లో మంచిగా, మరికొన్ని విషయాల్లో చెడ్డగా ఉంటారు. పూర్తీగా మంచితనం ఉన్న మనుషులు, పూర్తీగా చెడ్డగా ఉన్న మనుషులు ఎక్కడా ఉండరు. అయితే మనిషి తన స్వార్థం కోసం ఇతరులను ఇబ్బంది పెడుతూ, ఇతరులకు నష్టం కలిగిస్తూ, ఇతరుల జీవితాలు నాశనం అవుతున్నా తనకు అది అనవసరం అనుకునే స్థాయిలో కొందరు ఉంటారు. వారికి కేవలం తమ క్షేమం, తమ సంతోషం మాత్రం ముఖ్యం.  అలాంటి వారిని సింపుల్ గా అవకాశవాదులు అని కూడా అంటారు. కానీ ఇలాంటి వారు తమలో ఉన్న స్వార్థం, అవకాశవాదం బయటకు కనిపించకుండా మంచితనం అనే ముసుగు వేసుకుని ఉంటారు. అలాంటి వ్యక్తులను గుర్తించడం చాలా ముఖ్యం.  మంచితనం ముసుగు ధరించిన చెడ్డ వ్యక్తులలో కనిపించే కొన్న లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుంటే.. వారిని గుర్తించి జాగ్రత్త పడవచ్చు.. మంచితనం ముసుగు వేసుకున్న వ్యక్తుల లక్షణాలు.. కొంతమంది ప్రతి విషయంలో ఇతరులను విమర్శిస్తూ, ఆలోచించకుండానే తమ అభిప్రాయాలను ఏర్పరచుకుంటారు. వారి మాటలు కొన్నిసార్లు ఎంత కఠినంగా ఉంటాయంటే, అవి ఎదుటివారి మనసును గాయపరుస్తాయి. తమ తప్పులను ఒప్పుకోకుండా, ఇతరులను నిందించే వారు ఉంటారు. తాము చెప్పిందే సరైనదని నిరూపించుకోవడమే వారికి ముఖ్యం. ఇతరులను,  ఇతరుల అభిప్రాయాలను  గౌరవించరు,  వాటిని పట్టించుకోరు. వారి ప్రవర్తన కేవలం వారి ప్రాధాన్యత, వారికి నచ్చిన విషయాలే అయి ఉండాలని అనుకుంటారు. కృతజ్ఞత అనేది వీరిలో కొంచెమైనా ఉండదు.  ఎప్పుడూ ప్రతికూలతపైనే దృష్టి పెడతారు. ఏ విషయంలో అయినా సరే.. మంచిని చూడటం కంటే ఫిర్యాదు చేయడానికి,  నెగెటివ్ గా మాట్లాడటానికి ఇష్టపడతారు. మంచితనం అనే ముసుగు వేసుకున్నవారు ఎవరికీ ఇచ్చిన మాటలను నిలబెట్టుకోరు.  మాట దాటేస్తుంటారు. అవకాశం కోసం మాటలు ఇవ్వడం తర్వాత మాట తప్పడం వీరి దృష్టిలో అస్సలు తప్పు కాదు.  ఒకవేళ తప్పిన మాట గురించి మాట్లాడితే ఎదురుదాడి చేసి మాట్లాడతారు. సరదా లేదా ఫన్ పేరుతో ఇతరులను ఎగతాళి చేయడం, కించపరిచి మాట్లాడటం వీరి గుణం. ఇలాంటివి పదే పదే చేస్తూ ఉంటే.. వారు మంచితనం ముసుగు వేసుకున్న చెడ్డ వ్యక్తుని అర్థం చేసుకోవచ్చు. తాము ఇతరుల కన్నా గొప్ప అని  భావించుకుంటూ, తమ ఆధిక్యతను నిరూపించుకోవడానికి  ప్రయత్నిస్తుంటారు. పైగా ఇతరులను తక్కువగా అంచనా వేస్తారు. తక్కువ చేసి మాట్లాడతారు.  పాత పగలను మనసులో పెట్టుకుంటారు, ఎవ్వరినీ క్షమించరు.  చిన్న చిన్న తప్పులను కూడా చాలా కాలం గుర్తుంచుకుంటారు. గాసిప్స్ చెప్పుకోవడం, ఇతరుల వ్యక్తిగత సమాచారాన్ని అందరికీ చేరవేడం,  అందరి దృష్టిలో ఇతరులను చెడ్డ చేయడం అంటే వీరికి చాలా సంతోషం కలిగించే విషయం. చిన్న విషయాల్లో కూడా అబద్ధాలు చెబుతూ ఉంటారు.  ఇలాంటి అబద్దాలు విని విని అవి సహజం అనుకునే వారు ఏదో ఒకరోజు వీరి ద్వారా చాలా పెద్ద మోసాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇది క్రమంగా సంబంధాలలో నమ్మకాన్ని దెబ్బతీస్తుంది.                                *రూపశ్రీ.
వేసవి కాలంలో శరీరానికి నీరు చాలా అవసరం. నీటి కొరత ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి రోజుకు 8 నుండి 9 గ్లాసుల నీరు త్రాగమని వైద్యులు తరచుగా సలహా ఇస్తారు. అదనంగా మజ్జిగ లేదా కొబ్బరి నీళ్లు త్రాగమని కూడా సిఫార్సు చేస్తారు. కొందరు ఆరోగ్యానికి కొబ్బరి నీరు బెటర్ అని చెబితే.. మరికొందరు మజ్జిగ చాలా మంచిది అంటారు.  ఈ రెండూ ఆరోగ్యకరమైనవే.. అయినప్పటికీ రెండింటిలో కూడా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది అనే విషయం దగ్గర చాలా మంది కన్ప్యూజ్ అవుతుంటారు.  కొబ్బరి నీరు,  మజ్జిగ.. ఈ రెండింటిలో ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేసే డ్రింక్ ఏంటో తెలుసుకుంటే.. కొబ్బరి నీరు.. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం , సోడియం ఉంటాయి. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ అంటే శరీరంలో నీటి శాతం తగ్గడం నివారించబడుతుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది, తక్షణ శక్తిని అందిస్తుంది.  తేలికగా, సులభంగా జీర్ణమవుతుంది.  అధికంగా చెమట పట్టినప్పుడు లేదా వ్యాయామం చేసినప్పుడు కొబ్బరి నీళ్లు తాగమని డైటీషియన్లు సిఫార్సు చేస్తారు. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల ఎలక్ట్రోలైట్ సమతుల్యత చేయబడుతుంది. మజ్జిగ.. మజ్జిగలో జీర్ణవ్యవస్థను బలపరిచే ప్రోబయోటిక్ గుణాలు ఉంటాయి. మజ్జిగ తాగడం జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది. ప్రతిరోజూ మజ్జిగ తాగడం వల్ల గ్యాస్, ఎసిడిటీ ,  ఉబ్బరం నుండి ఉపశమనం లభిస్తుంది. మజ్జిగ తాగితే  శరీరం  చల్లబడుతుంది. బరువును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. గ్యాస్ లేదా అజీర్ణం వంటి కడుపు సమస్యలతో బాధపడుతుంటే, మజ్జిగ చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. తేడా.. కొబ్బరి నీరు శరీరానికి తక్షణమే తేమను అందిస్తుంది. మరోవైపు, మజ్జిగ జీర్ణక్రియను బలపరుస్తుంది. కొబ్బరి నీటిలో ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండగా, మజ్జిగలో ప్రోటీన్ , ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఎప్పుడు ఏది ఎంచుకోవాలి..?  డీహైడ్రేషన్ లేదా అలసటగా అనిపిస్తే కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఇది శరీరాన్ని తిరిగి ఎనర్జీగా మారుస్తుంది.  శరీరంలో ఎలక్ట్రోలైట్ల అసమతుల్యత తగ్గిస్తుంది. భోజనం తర్వాత మజ్జిగ తాగవచ్చు. ఇది ఆహారం బాగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది.  అలాగే ఎండలో బయటకు వెళ్లే ముందు కొబ్బరి నీళ్లు తాగవచ్చు. ఎండ నుండి వచ్చిన తర్వాత కూడా కాసింత చల్లగా ఉండే మజ్జిగ తాగవచ్చు. మజ్జిగ, కొబ్బరి నీరు రెండూ మంచివే అయినా.. శరీర పరిస్థితిని బట్టి కొబ్బరి నీరు, మజ్జిగ వేర్వేరు ఫలితాలు ఇస్తాయి,  వేర్వేరుగా ఉపయోగపడతాయి.                              *రూపశ్రీ.
వేసవికాలం అంటేనే వేడి గాలులు, వడదెబ్బ, మండే ఎండలు గుర్తొస్తాయి.  ఎండల వేడి గురించి పక్కన పెడితే.. మనుషుల నుండి జంతువుల వరకు.. ప్రతి ఒక్క ప్రాణి వేసవిలో వడదెబ్బకు గురయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వడదెబ్బ కారణంగా ప్రాణాలు పోయే అవకాశం కూడా ఉంటుంది.   వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలే ప్రతి ఒక్కరికి శ్రీరామ రక్షలా కాపాడతాయి. ఆ చిట్కాలు ఏంటో తెలుసుకుంటే.. ప్రయాణాలు.. వేసవి కాలంలో చేసే ప్రయాణాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.  అధిక వేడిమితో డీహైడ్రేషన్ గురికాకుండా తరచూ మంచినీరు,ఓఆరెస్,పల్చటి మజ్జిగ వంటివి తీసుకుంటూ ఉండాలి. వీలైనంత వరకు  ఉదయం చాలా తొందరగా,  లేదా సాయంత్రం ఎండ వేడిమి చాలా వరకు తగ్గిన తర్వాత ప్రయాణాలు చేయడం ఉత్తమం. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలతో ప్రయాణాలు చేసేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. బయటకు వెళ్లడం.. వేసవి కాలంలో సాధారణంగా మిగతా రోజుల్లా పనుల కోసం బయటకు వెళ్ళే విధానాన్ని తగ్గించుకోవాలి. వేసవి కాలంలో పనుల షెడ్యుల్.. బయటకు వెళ్ళి చక్కబెట్టుకోవాల్సిన పనుల ప్రణాళికలు మార్చుకోవాలి.  తప్పనిసరిగా వెళ్లవలసి వస్తే.. వెంట వాటర్ బాటిల్,  గొడుగు ఉండేలా చూసుకోవాలి. కాలి నడకన లేదా బైక్ లో వెళ్లడం కంటే ఆటో వంటి వాహనాలలో బయటకు వెళ్లి రావడం చాలా మంచిది. ఆహార, పానీయాలు.. వేసవిలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. శరీరానికి  నీటి శాతాన్ని ఇచ్చే ఆహారాలు తీసుకోవాలి.  ఆహారంలో కారం, ఉప్పు,  నూనె వంటివి బాగా తగ్గించాలి. నీటి శాతం అధికంగా ఉండే కూరగాయలు,  పండ్లు విరివిగా తీసుకోవాలి. ముఖ్యంగా ఎండలో బయటకు వెళ్లి వచ్చిన తర్వాత తొందర పాటులో చాలా చల్లగా ఉన్న ఫ్రిజ్ లోని నీరు తాగడం  మానుకోవాలి.  బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కుండలోని నీరు లేదా పల్చగా మజ్జిగ,  సుగంద షర్బత్ వంటివి తాగవచ్చు. ఇవి శరీరానికి ఊరట ఇస్తాయి.  వేసవి తాపం తీరుస్తాయి. హెల్త్ కేర్..   వేసవి ఎండల కారణంగా ఆరోగ్య ఇబ్బందులు తలెత్తితే దగ్గరలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో తగిన చికిత్స పొందాలి. అక్కడ ఓఆర్ లేదా ఎలక్ట్రోలైట్స్ ను అందించి ఆరోగ్యాన్ని పరిరక్షిస్తారు. ఉదయం 11గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు నీడ పట్టున విశ్రాంతి తీసుకోవడం లేదా నీడ పట్టున పనులు చేసుకోవడం మంచిది.   సేవ.. వేసవికాలంలో ప్రతి ఒక్కరు తమ ఆరోగ్యం గురించి మాత్రమే కాకుండా.. నలుగురి ఆరోగ్యం గురించి కూడా ఆలోచించడం కనీస మానవత్వం.  వేసవిలో ప్రయాణాలు చేసేవారు.. దారి వెంట వెళ్లే బాటసారులు ఉంటారు. అలాంటి వారి కోసం.. మంచి నీరు ఏర్పాటు చేయడం,  అక్కడక్కడా కూర్చోవడానికి కాసింత చోటు ఇవ్వడం వంటివి కూడా చేయాలి. ఇవి కనీస మానవ ధర్మం కూడా. అయితే.. ఏ పని చేసినా ప్రమాదాలు మీదకు తెచ్చుకోకుండా చేయడమే మంచిది.                               *రూపశ్రీ.