ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేదు. ఈ సామాజిక వర్గం, ఆ సామాజిక వర్గం అన్న బేధం లేదు. ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పుట్టి మునిగిపోతోంది. ఆ పార్టీ నుంచి వలసల వరద వెల్లువెత్తుతోంది. ఆ వలసల వరద ధాటికి వైసీపీ గేట్లు పగిలిపోతున్నాయి. జగన్ తాడేపల్లి ప్యాలెస్ పునాదులు కదిలిపోతున్నాయి. ఒకరు ఇద్దరు కాదు పదుల సంఖ్యలో వైసీపీ నుంచి మాజీ ఎమ్మెల్యేలు జనసేన గూటికి  చేరిపోతున్నారు. దీంతో వైసీపీ బైసీపీగా మారిపోయిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  పెద్ద సంఖ్యలో వైసీపీ మాజీ ప్రజాప్రతినిధులు, ఆ పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు పార్టీ మారిపోతుండగా ఇప్పుడు ఇక ఆ పార్టీ కీలక నేతలు, జగన్ కు అత్యంత సన్నిహితులుగా గుర్తింపు పొందిన వారూ కూడా వైసీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు.  తాజాగా ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిథి కారుమూరి రవిచంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. గత కొన్నేళ్లుగా వైసీపీ గొంతుకలా వ్యవహరిస్తున్న కారుమూరి ఇప్పుడు జగన్ కు జెల్ల కొట్టి పార్టీకి రాజీనామా చేసేశారు. అంతే కాదు ఇలా రాజీనామా చేసి అలా బీజేపీ కండువా కప్పేసుకున్నారు. తన రాజీనామా లేఖను పార్టీ అధినేత జగన్ కు పంపించిన కారుమూరి... ఆ లేఖ పంపిన గంటలోనే ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి సమక్షంలో కమలం కండువా కప్పుకున్నారు.  దీనిని బట్టి చూస్తూ కారుమూరి రవిచందరారెడ్డి చాలా కాలంగా వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారనీ, అన్నీ చూసుకుని శనివారం (జనవరి 18)న ఆయన పార్టీకి రాజీనామా చేసి బీజేపీ పంచన చేరారనీ అవగతమౌతుంది.  కారుమూరి రవిచంద్రారెడ్డి రాజీనామా ఎలా చూసినా వైసీపీకి కోలుకోలేని దెబ్బగానే చెప్పాల్సి ఉంటుంది. ఇప్పటి వరకూ వైసీపీ తరఫున దూకుడుగా వ్యవహరించారు. ఇటు మీడియాలోనూ, అటు సోషల్ మీడియాలోనూ కూడా చాలా చురుకుగా ఉన్నారు. అసలే పార్టీ తరఫున గట్టిగా గళం వినిపించే నేతలు కరవై సతమతమౌతున్న వైసీపీకి కారుమూరి గుడ్ బై చెప్పడం గట్టి షాక్ అనే చెప్పవచ్చు.  
మంచు మోహన్ బాబు ఇంట్లో రోజుకో ట్విస్ట్ చేసుకుంటుంది.  తన కష్టార్జితమైన రంగా రెడ్డి జిల్లా జల్ పల్లి నివాసాన్ని కొందరు ఆక్రమించుకున్నారని గతంలో మోహన్ బాబు జిల్లా మెజిస్ట్రేట్ , కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఇది ఫ్యామిలీ గొడవ అనుకున్నారు. అందరూ.  అధికారులు ఎటువంటి చర్య తీసుకోలేదు. దీంతో మోహన్ బాబు జిల్లా మెజిస్టేట్ అయిన రంగారెడ్డి కలెక్టర్ కు మరో మారు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన కలెక్టర్ మంచు మనోజ్ కు   నోటీసులు  ఇవ్వడంతో శనివారం మంచు మనోజ్ రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ప్రతిమాసింగ్ తో భేటీ అయ్యారు. తాను ఎక్కడికి పారిపోవడం లేదని ప్రస్తుతం తిరుపతిలో ఉంటున్నట్టు వివరణ ఇచ్చుకున్నారు. 
తిరుమలలో శనివారం (జనవరి 18) 9వ రోజు వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. గత ఎనిమిది రోజులలో తిరుమలేశుని వైకుంఠ ద్వారం ద్వారా మొత్తం 5లక్షల 36 వేల 277 మంది దర్శించుకున్నారు. ఇలా ఉండగా ఆదివారం(జనవరి 19)తో వైకుంఠ ద్వార దర్శనాలు ముగియనున్నాయి. శుక్రవారం(జనవరి 17) శ్రీవారి హుండీ ఆదాయం 3 కోట్ల 15లక్షల రూపాయలు వచ్చింది. ఇక శనివారం (జనవరి 18) టికెట్లు ఉన్న భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతుండగా, టోకెన్లు పొందిన భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఐదు గంటల సమయం పడుతోంది.  
ALSO ON TELUGUONE N E W S
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు(Ntr)గారు స్వర్గస్తులయ్యి  నేటికీ 29 సంవత్సరాలు గడిచిన సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ హైదరాబాదులోని ఫిలింనగర్ లో కృష్ణ అవతారంలో ఉన్న ఆయన విగ్రహం వద్ద పలువురు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులతో పాటు సినీ రాజకీయ ప్రముఖులు  రామారావు గారికి నివాళులు అర్పించి ఎన్టీఆర్ ను స్మరించుకోవడం జరిగింది.  ఈ సందర్భంగా పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ"నేను ఎన్టీఆర్ గారికి అభిమానిని మాత్రమే కాదు, పరమ భక్తుడిని కూడా. ఆయన మనిషి రూపంలో ఉన్న దైవం.నమ్ముకున్న వారెవరిని కూడా ఎన్టీఆర్ గారు వదులుకోలేదు.వాళ్లంతా ఈరోజు మంచి స్థాయిలో ఉన్నారు.అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి. సినిమాకి మాటలు రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.ఇంటికి వెళ్తే కడుపునిండా భోజనం పెట్టి పంపించేవారు.అలాంటి   వ్యక్తి అభిమానిని అని చెప్పుకోవడానికి గర్వపడుతున్నాను.సమాజం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు.మరోసారి అన్నగారు తెలుగు గడ్డమీద పుట్టి,మరోసారి తెలుగు వారి స్థాయిని పెంచాలని కోరుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఒకప్పటి హీరో నిర్మాత మాదాల రవి మాట్లాడుతు"దేశంలోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఈరోజు తెలుగువారి గురించి మాట్లాడుతున్నారంటే  దానికి ముఖ్య కారణం నందమూరి తారక రామారావు గారు. ఒకవైపు ఓ కథానాయకుడిగా ఆయన చేసిన పాత్రలు, అలాగే మరోవైపు ప్రజా నాయకుడిగా ఆయన చేసిన గొప్ప పనులు అందరికి తెలిసినవే. అటువంటి మహానుభావుడికి భారతరత్న ఖచ్చితంగా ఇవ్వాలి.ఆ దిశగా మనం పోరాటం చేయాలని అన్నాడు.  ఎన్టీఆర్ మనవరాలు నందమూరి రూప మాట్లాడుతు "ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా మనమందరం ఆయనకు నివాళులు అర్పిస్తున్నాము. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఎప్పటికీ మన ఆలోచనల్లో ఉంటారు.ఆయన మరణం లేని వ్యక్తి. ఎన్నో సినిమాలలో బ్రహ్మాండమైన పాత్రలు పోషించిన ఒక దృవతార.ఎన్నో దైవ పాత్రలు వేసి ప్రేక్షకులను మెప్పించిన ఏకైక వ్యక్తి.తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ పెట్టి 9 నెలల్లోని ప్రభుత్వాన్ని స్థాపించిన వ్యక్తిగా నిలిచాడు.ప్రజలకు అత్యవసరమైన కూడు, గుడ్డ, నీడను అందరికీ అందేలా చేశారు.ఒక నటుడిగా,రాజకీయ నాయకుడిగా కంటే కూడా ప్రజల శ్రేయస్సు కోరుకునే ఒక మహానుభావుడిగా ప్రజలు ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు.ఆడవారికి ఆస్తి హక్కులను కూడా సమానంగా ఉండేలా చేశారు. మా తాత గారికి పాదాభివందనాలు చేసుకుంటూ ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటున్నానని చెప్పింది   ఎన్టీఆర్ తనయుడు నందమూరి మోహన్ కృష్ణ గారు మాట్లాడుతు "ఈరోజు నాన్నగారి 29వ వర్ధంతి జరుపుకుంటున్నాం. భౌతికమైన మన మధ్య లేకపోయినా ఆయన ఆత్మ మాత్రం మన చుట్టూనే ఉంటుందని, సూర్య చంద్ర ఉన్నంతకాలం ఆయన పేరు నిలిచిపోతుంది. ఆయన సినీ రంగంలో ఎన్నో పాత్రలు పోషించి ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా రాజకీయ రంగంలో కూడా పెను తుఫాను సృష్టిస్తూ ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ఆడవారికి ఆస్తి హక్కుల దగ్గర నుండి రెండు రూపాయలకు కిలో బియ్యం కొరకు ఎన్నో గొప్ప కార్యక్రమాలు నిర్వహించారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి సత్తా చూపించారు. అది మనం అదృష్టంగా భావించాలి. ఎన్టీఆర్ గారు చేసిన సేవలను గుర్తించి ఆయనను భారతరత్నతో సత్కరించాలని విన్నపించుకుంటున్నాను. ఈ సందర్భంగా ఎక్కడికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు" అన్నారు.  బిఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు మాట్లాడుతు "స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి సందర్భంగా ఫిలింనగర్లో ఆయనకు నివాళులు అర్పించడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా నమస్కారం. ఎన్టీఆర్ అంటేనే ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారందరూ గమనించదగిన వ్యక్తి. ఎన్టీఆర్ గారికి ఇప్పుడైతే రాజకీయాల్లోకి వచ్చారు అప్పటినుండి ఆయనతో మా ప్రయాణం మొదలైంది. ఆయన నాపై ఎంతో నమ్మకం పెట్టుకుని బాధ్యతగల పదవులు అప్పగించడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిన జరిగింది. నిన్ను చూపుతో హైదరాబాదును అభివృద్ధి చేసే ప్రతి పనిలోనూ ఆయన దగ్గర ఉండి అభివృద్ధి పనులు చూసుకునేవారు. ఆయన 35 సంవత్సరాల క్రితం ప్రవేశపెట్టిన పథకాలను నేడు వేరే పేర్లతో దేశం మొత్తం అమలు చేయడం జరుగుతుంది. అంత ముందు చూపు ఉన్న వ్యక్తి తారక రామారావు గారు. కాషాయి వస్త్రాలతో రాజకీయాల్లో ఉండి ఆ రోజుల్లో దేశం మొత్తం తిడుతున్న వ్యక్తి ఆయన. పార్టీ పెట్టి 9 నెలలోనే అధికారంలోకి రావడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారికి భారతరత్న వచ్చేందుకు మనమంతా పడటం చేయాలి" అన్నారు.  తెలుగు చిత్ర నిర్మాత మండలి కార్యదర్శి తుమ్మల ప్రసన్న గారు మాట్లాడుతూ... "తెలుగువారింటనే చిన్న చూపు చూసే రోజుల్లో కేవలం 9 నెలలలో రాజకీయ పార్టీ పెట్టి అధికారాన్ని కైవసం చేసుకుని తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. పొట్టి శ్రీరాములు గారి తర్వాత తెలుగువారు ఒక ప్రభంజనంలా వెలుగెత్తడానికి కారణం ఎన్టీఆర్. ఇప్పుడు పని చేసిన వాళ్ళు వచ్చిన ఏమో కానీ ఆయన ఆరో సినిమా పాతాళ భైరవి ఆ రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో 175 రోజులు ఆడింది. ఆయన జీవితం అంతా తెలుగువారికి అంకితం చేసిన మహానుభావుడు. నేను హైదరాబాదులో ఉండే పార్టీ పెట్టారు, సీఎం అయ్యారు, అలాగే శివైక్యం చెందారు. తెలంగాణకు ఎంతో చేశారు. పటేల్ పట్వారి వ్యవస్థ రద్దుచేసి కేవలం అక్రవర్ణాలు చేతుల్లోని అధికారం కాకుండా బడుగు బలహీన వర్గాలు కూడా అధికారంలో ఉండాలని ఎన్ని బెదిరింపులు వచ్చినా వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్లిన వ్యక్తి ఎన్టీఆర్. ప్రజలందరికీ ఉపయోగపడేలా ఎన్నో పథకాలను ఆయన ప్రవేశ పెట్టడం జరిగింది. అటువంటి మహానుభావుడు ఒక సంఘసంస్కర్తగా శివైక్యం చెంది 29 సంవత్సరాలు పూర్తయిన కూడా తలుచుకుంటున్నాము. ఆయన మరణం లేని వ్యక్తి" అంటూ ముగించారు.  
సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలం నుంచి ఉంటూ వరుస విజయాలతో అగ్ర నిర్మాతగా ఎదిగారు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు(Dil Raju).ఈ సంక్రాంతి కానుకగా ఆయన బ్యానర్ నుంచి గేమ్ చేంజర్, సంక్రాంతికి వస్తున్నాం'అనే రెండు డిఫరెంట్ జోనర్స్ కి సంబంధించిన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.వాటిల్లో 'సంక్రాంతి కానుకగా వస్తున్నాం' పాజిటివ్ టాక్ తో  ముందుకు దూసుకుపోతుంది.గేమ్ చేంజర్ మాత్రం నెగిటివ్ టాక్ తో రన్ అవుతు ఉంది. ఇక 'సంక్రాంతికి వస్తున్నాం' హిట్ అయిన సందర్భాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ని నిర్వహించగా వెంకటేష్(Venkatesh)తో పాటు దర్శకుడు అనిల్ రావిపూడి(Anil Ravipudi)కూడా పాల్గొన్నాడు.దిల్ రాజు సోదరుడు సంక్రాంతికి వస్తున్నాం నిర్మాతల్లో ఒకరైన శిరీష్ మాట్లాడుతు అనిల్ రావిపూడి లేకపోతే మేము లేం.చాలా మంది మేము పోవాలని అనుకున్నారు.కానీ అనిల్ మాత్రం ఈ సినిమా మీ టోటల్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తుందని చెప్పేవాడు.పైన తధాస్తు దేవతలు ఉన్నారనుకుంటా అలాగే జరిగింది.మేము బావిలో పడుతున్నామని కొంత మంది సంతోషపడుతున్నారు.కానీ ఇప్పుడు లేచి ఈ సినిమాతో వాళ్ళ పక్కనే ఉన్నాం.ఈ క్రెడిట్ మొత్తం అనిల్ కే చెందుతుందని చెప్పాడు.   మైత్రి మూవీస్ బ్యానర్ కి దిల్ రాజుకి గొడవలు ఉన్నాయని,శిరీష్ చేసిన వ్యాఖ్యలు మైత్రిని ఉద్దేశించి చేసిందనే రూమర్స్ సినీ సర్కిల్స్ లో వినిపిస్తు ఉన్నాయి.గత కొన్ని సంవత్సరాలుగా దిల్ రాజు కి తన బ్యానర్ కి తగ్గ హిట్ లేదు.దీంతో దిల్ రాజు పని అయిపోయిందని చాలా మంది అనుకున్నారు.ఇండస్ట్రీలో మాత్రం శిరీష్ చేసిన వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీసాయి.  
One of the finest actresses in the industry, Sobhita Dhulipala, continues to prove her versatility with remarkable performances. Her Hollywood debut, Monkey Man, directed by Dev Patel, has received widespread acclaim, earning the Golden Tomato Award for Best Action & Adventure Movie on Rotten Tomatoes. The film triumphed over major Hollywood blockbusters such as Hugh Jackman’s Deadpool & Wolverine, Ryan Gosling’s The Fall Guy, and Glen Powell’s Twister, highlighting its global appeal and critical success.   Directed by Dev Patel, Monkey Man is an intense action thriller about an ex-convict seeking redemption in a corrupt, chaotic world. The film’s success marks a significant achievement for Sobhita and the team, further cementing her presence on the international stage. Sobhita has consistently proven her acting prowess with standout performances in Made in Heaven Season 2 and The Night Manager alongside Aditya Roy Kapur. Her exceptional versatility and ability to captivate audiences have solidified her position as one of the most talented actresses in the industry. With a promising slate of upcoming projects, she continues to raise the bar and leave her mark in India and globally.
Nandamuri Balakrishna has been on a success spree like never before. He delivered three back to back successful films and now, his Sankranti film, Daaku Maharaaj, has also become a blockbuster. The movie has crossed Rs.100 crores gross and it is running successfully in theatres all over.  Daaku Maharaaj makers held a success meet at Hyderabad and NBK shared that his father, NTR's blessings have been key for his success. He stated that he entered into film industry taking his father as inspiration and he would always aspire to carry forward legend's legacy for next generations.  Expressing his happiness he said, "My father never feared from doing diverse roles and different scripts. He always believed that an actor should be able to pull off any character. He blessed me with his immense knowledge and charm. I'm happy that we are celebrating him even after his centenary and I wish he would be celebrated for years."  He thanked Telugu audiences for exceptional response and praised director Bobby, music composer Thaman. He even stated that he would rename Thaman as NBK Thaman. Well, the movie produced by Naga Vamsi and Sai Soujanya is expected to bring profits to every party involved from weekend. 
Global star Ram Charan showcased a different side to his highly known star image. He showcased his philantrophic side on NBK's Unstoppable on AHA, OTT platform. Charan did not want any kind of publicity for his kind gesture but such gestures do inspire others to help those in needy.  Going into the details, a devoted fan, known for his regular blood donations, found himself in a difficult situation. When Ram Charan learned about the fan’s struggle, he took immediate action. Along with his wife Upasana, the actor arranged for free medical treatment for the fan's wife at one of Hyderabad's leading hospitals. For 17 days, she received ICU care with daily visits from specialists, all at no cost. The fan, initially concerned about the hospital bills, was later relieved to find that Ram Charan and Upasana had taken care of everything. Fan shared that Ram Charan even sent ambulance to his house and took care of every expense without him asking for anything. This proves his humility and maturity where he understood the necessity of a person who shows unconditional love towards him and helped him without any second thought.  Such acts of kindness inspires others to also help those in necessity and be kind to everyone. Don’t miss this heartwarming story, shared by the fan himself, in the second part featuring Ram Charan, only on Unstoppable with NBK Season 4. 
ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన 'నువ్విలా' మూవీతో  తెలుగు సినీ రంగానికి పరిచయమైన హీరోయిన్ మాధవిలత.మొదటి సినిమాతోనే మంచి నటిగా గుర్తింపు పొందిన మాధవి లత ఆ తర్వాత స్నేహితుడా,ఉసురు,చూడాలని చెప్పాలని,అనుక్షణం వంటి పలు తెలుగు సినిమాలో మెరిసింది.కొన్నితమిళ సినిమాల్లో కూడా నటించిన ఆమె ప్రస్తుతం భారతీయజనతా పార్టీ తరుపున రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. రెండు వారాల క్రితం తాడిపత్రి మున్సిపల్ కమిషన్ చైర్మన్,మాజీ ఏంఎల్ఏ జెసిప్రభాకర్ రెడ్డి ఏర్పాటు చేసిన నూతన సంవత్సరం వేడుకల్ని ఉద్దేశించి మాధవిలత సోషల్ మీడియా వేదికగా కొన్ని ఆరోపణలు చేయడం,వాటికి  కౌంటర్ ఇచ్చే సమయంలో మాధవీలతపై జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం తెలిసిందే.ఆ తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి తన మాటలకి  క్షమాపణలు చెప్పాడు.కానీ ఇప్పడు జెసి ప్రభాకర్ రెడ్డి పై మాధవిలత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్( మా) లో  ఫిర్యాదు చేసింది.ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ నేను సోషల్ ఎవర్నేస్  కోసమే ఆ వీడియో చేశాను.ఆయన సారీ చెప్పినప్పుడు కూడా నేను సినిమా అమ్మాయిని అని చులకనగా మాట్లాడాడు. ఈ విషయంలో నేను హ్యూమన్ కమిషన్ ని కూడా కలిసాను. కేసు నంబర్స్ కూడావాళ్ళు ఇచ్చారు.సినిమా వాళ్లంటే ఆయనకి అంత చులకన ఎందుకు.నాపై చేసిన ఆరోపణల మీద న్యాయ పరంగా పోరాడతానని చెప్పుకొచ్చింది.       
శ్రీవెంకటసాయి బ్యానర్‌పై శెట్టిపల్లి శ్రీనివాసులు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘షూటర్‌’. రవిబాబు, ఏస్తర్‌, ఆమని, రాశి, సుమన్‌ కీలకపాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో వరల్డ్‌వైడ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు  ఈ సందర్భంగా దర్శక నిర్మాత శెట్టిపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ ‘విభిన్న కథా కథనాలతో షూటర్‌ని తెరకెక్కించాము. ప్రతి ఫ్రేమ్‌ కూడా ఆర్టిస్టులతో అద్భుతంగా ఉంటుంది. ప్రేక్షకులను ఆకట్టుకునే అన్ని అంశాలతో ఈ సినిమా రూపొందించాం. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 22న రిలీజ్‌ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. ఫిబ్రవరి 22న భారీ స్థాయిలో వరల్డ్‌ వైడ్‌గా శ్రీలక్ష్మీ పిక్చర్స్‌ బాపిరాజు ద్వారా రిలీజ్‌ కానుంది.  రవిబాబు, సుమన్‌, ఎస్తార్‌, ఆమని, రాశి,, అన్నపూర్ణ, సత్య ప్రకాష్‌, సమీర్‌, జీవా, ఛత్రపతి శేఖర్‌, జబర్దస్త్‌ మహేష్‌, ఘర్షణ శ్రీనివాస్‌ తదితరులు నటించారు. స్టోరీ, డైలాగ్స్‌, స్క్రీన్‌ప్లే: పాయసం ధనుంజయ, సంగీతం: డ్రమ్స్‌ రాంబాబు, రీరికార్డింగ్‌: రాజు, సినిమాటోగ్రఫీ: డి.యాదగిరి, నిర్మాత, దర్శకత్వం: శెట్టిపల్లి శ్రీనివాసులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan)లిస్ట్ లో ఉన్న సినిమాల్లో నుంచి ప్రేక్షకుల ముందుకు రాబోయే ఫస్ట్ మూవీ హరిహరవీరమల్లు(Hariharaveeramallu).చారిత్రాత్మక నేపథ్యంతో కూడిన కథ కావడం,పైగా పవన్  పోరాటయోధుడుగా కనిపిస్తుండంతో వీరమల్లుపై పవన్ ఫ్యాన్స్ తో పాటు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి.రీసెంట్ గా 'మాట వినాలి' అనే సాంగ్ కూడా రిలీజ్ అయ్యి సినిమా మీద అంచనాలని పెంచేసిందని చెప్పవచ్చు.పైగా ఈ సాంగ్ ని పవన్ స్వయంగా పాడటం విశేషం. ఇక ఈ మూవీ మార్చి 28 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది.ఈ డేట్ లో ఎలాంటి మార్పు ఉండదని మేకర్స్ చెప్పడంతో పాటుగా,ప్రచార చిత్రాల్లో కూడా మార్చి 28 నే అని వేస్తున్నారు.ఇప్పుడు ఇదే డేట్ కి నితిన్(Nithiin)కొత్త మూవీ 'రాబిన్ హుడ్' విడుదల కానుంది.ఈ మేరకు నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నుంచి పోస్టర్ తో కూడిన అధికార ప్రకటన వచ్చింది.నితిన్ కి భీష్మతో మంచి విజయాన్నిఅందించిన వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ,నిజానికి గత ఏడాది డిసెంబర్ 25 న రిలీజ్  కావాల్సింది.ఆ తర్వాత ఏప్రిల్ 10 న రిలీజ్ డేట్ ఉంటుందనే ప్రచారం కూడా వచ్చింది. కానీ ఇప్పుడు అందరి అంచనాలని తలకిందులు చేస్తు మార్చి 28 న రిలీజ్ కానుంది. పవన్ కళ్యాణ్ అంటే నితిన్ కి ఎంత ఇష్టమో అందరకి తెలిసిందే.పవన్ కి ఉన్న అనేక మంది వీరాభిమానుల్లో నితిన్ కూడా ఒకడు.పవన్ అభిమానుల్లోకూడా చాలా మంది నితిన్ ని అభిమానిస్తారు.ఈ నేపథ్యంలో పవన్ తో నితిన్ పోటీపడటంపై ఇరువురి అభిమానులతో పాటు ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి ఏర్పడింది.  
ఎన్నికల వేళ జగన్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇన్నాళ్లే జగన్ మాటే శాసనం అన్నట్లుగా అణిగిమణిగి ఉన్న వారంతా సరిగ్గా ఎన్నికల ముంగిట ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. పార్టీపై తిరుగులేని పట్టు ఉందని భావిస్తున్న జగన్ కు ఆ పట్టు జారిపోవడం కళ్లముందు కనిపించేలా చేస్తున్నారు. టికెట్ నిరాకరించిన, సిట్టింగ్ స్థానాన్ని మార్చిన ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇప్పటికే పార్టీని వీడి వలసబాట పట్టారు. వారితో పాటు పెద్ద సంఖ్యలో క్యాడర్ కూడా పార్టీని వీడుతున్నారు. ఇక ఇప్పుడు నామినేటెడ్ పదవులలో ఉన్న వారి వంతు మొదలైనట్లు కనిపిస్తోంది. తనకు కానీ తన భర్తకు  కానీ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు టికెట్ ఇవ్వాలంటూ గత  కొంత కాలంగా కోరుతూ వస్తున్న మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ వంతు వచ్చింది. ఆమె కూడా రాజీనామా అస్త్రం సంధించారు.  జగన్ కు నమ్మిన బంటుగా గుర్తింపు పొందిన మహిళాకమిషన్ చైర్ పర్సన్ వాసి రెడ్డి పద్మ తన పదవికి రాజీనామా చేశారు. ఉరుములేని పిడుగులా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండా తన రాజీనామా లేఖను సీఎం జగన్ కు పంపేశారు. పేరుకు తాను పార్టీకి కాదు, కేవలం మహిళా కమిషన్ చైర్మన్ పదవికి మాత్రమే రాజీనామా చేశాననీ, ఇక నుంచి వైసీపీ కోసం పని చేస్తాననీ వాసిరెడ్డి పద్మ చెబుతున్నప్పటికీ, ఆమె రాజీనామాకు కారణం అసంతృప్తేనని పార్టీ వర్గాలు బాహాటంగానే చెబుతున్నాయి. చాలా కాలంగా వాసిరెడ్డి పద్మ వచ్చే ఎన్నికలలో పోటీ చేసేందుకు తనకు కానీ తన భక్తకు కానీ పార్టీ టికెట్ ఇవ్వాలని జగన్ ను కోరుతూ వస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ జగన్ చూద్దాం.. చేద్దాం అన్నట్లుగా దాట వేస్తూనే వచ్చారు. ఇప్పుడిక వరుసగా అభ్యర్థల జాబితాలను జగన్ ప్రకటించేస్తుండటం, తనకు గానీ తన భర్తకు కానీ పార్టీ టికెట్ విషయంలో ఎటువంటి స్పస్టత ఇవ్వకపోవడంతో ఆమె మనస్తాపం చెంది పదవికి రాజీనామా చేసేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రవేశం ప్రజారాజ్యం పార్టీతో జరిగింది. 2009లో ఆమె ప్రజారాజ్యం పార్టీలో చేరారు. ఇలా చేరడంతోనే ఆమె ప్రజారాజ్యం అధికార ప్రతినిథిగా పదవి దక్కించుకున్నారు. ప్రజారాజ్యం కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడంతో ఆమె 2012లో జగన్ పార్టీలో చేరారు. జగన్ కూడా ఆమెకు అధికార ప్రతినిథి పదవి ఇచ్చారు.  2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆమెను రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ గా నియమించారు. చైర్ పర్సన్ హోదాలో ఆమె జగన్ మెప్పు పొందేందుకు చేయగలిగినంతా చేశారు. ప్రతిపక్ష పార్టీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ఏకంగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు సైతం నోటీసులు జారీ చేశారు. వార్డు వలంటీర్లపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకు కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలంటూ ఆమె పవన్ కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. పవన్ హాజరు కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయాలని ఆదేశించారు. ఇన్ని చేసినా వాసిరెడ్డి పద్మకు ఆమె కోరినట్లుగా పార్టీ టికెట్ లభించకపోవడంతో అలిగి పదవికి రాజీనామా చేశారని, ఇది జగన్ కు షాకేననీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  
సంసారంలో నిస్సంగత్వంతో ఎలా జీవించాలో గురువు బోధిస్తాడు. మనల్ని సంసారబంధాల నుండి విముక్తుల్ని చేయడానికి తోడ్పడతాడు. కానీ అనేక జన్మల సంస్కారాల వల్ల మనలో సంసారాసక్తి సన్నగిల్లకపోవడంతో గురుబోధ అవగాహన చేసుకొనే మనోపరిపక్వత కలగదు. ఒకరైతు తనకు చేసిన సేవలకు ప్రీతి చెందిన గురువు అతడికి స్వర్గ ప్రాప్తిని కలగజేయాలని అనుకుంటాడు. కానీ సంసారాసక్తి వల్ల ఆ రైతు ఆ అవకాశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తాడు. చివరికి గురుకృప వల్ల ఆ రైతు స్వర్గ ప్రాప్తిని ఎలా పొందాడో ఈ కథ తెలియజేస్తుంది. "ఒక మహాపురుషుడు ప్రయాణం చేస్తూ, డస్సిపోయాడు. గొంతు ఎండిపోయింది. దారిలో ఒక రైతు కనపడితే నీళ్ళు అర్థించాడు. ఆ రైతు మహాత్మునికి సకల ఉపచారాలూ చేశాడు. చిరిగిపోయిన ఆయన ఉత్తరీయాన్ని రైతు జాగ్రత్తగా కుట్టి బాగుచేశాడు. రైతు పరిచర్యలకు సంతసించిన ఆ మహాత్ముడు శాంతి, ఆనందాలకు నిలయమైన స్వర్గానికి తనతోపాటు రమ్మని అంటాడు. అందుకు ఆ రైతు 'గురువుగారూ! మీరు నా మీద చూపిన దయకు కృతజ్ఞుణ్ణి. కానీ నా పిల్లలు ఇంకా చిన్నవాళ్ళు. ఓ ఏడేళ్ళ వ్యవధి ఇవ్వండి' అని అడుగుతాడు. అందుకు గురువు అంగీకరించాడు. సరిగ్గా ఏడేళ్ళ తర్వాత గురువు రైతును స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వచ్చాడు. అప్పుడు రైతు 'అయ్యా! కడపటి కొడుకు కష్టాలకు అంతు లేదు. అన్ని జంఝాటాలనూ ఒక్కడే సంబాళించుకోలేకపోతున్నాడు. కాబట్టి మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని గురువుని అడిగాడు. మరో ఏడేళ్ళ తరువాత గురువు వచ్చాడు. కానీ రైతు చనిపోయాడని తెలిసింది. చనిపోయిన ఆ రైతు ఎద్దుగా పుట్టాడని ఆ గురువు తన దివ్య దృష్టితో తెలుసుకున్నాడు. ఎద్దుగా పుట్టిన ఆ రైతు తన కొడుకు పొలాన్నే దున్నుతున్నాడు. అప్పుడు గురువు ఆ ఎద్దుపై మంత్ర జలం చిలకరించగానే ఎద్దు జన్మనెత్తిన రైతు 'నా కొడుకు పరిస్థితి మరి కాస్త మెరుగు పడనీయండి స్వామీ! మరో ఏడేళ్ళు గడువు ఇవ్వండి' అని అన్నాడు. ఇక చేసేది లేక వెనుదిరిగాడు గురువు. మరలా ఏడేళ్ళ తర్వాత వచ్చిన గురువుకు ఎద్దు చనిపోయిందని తెలిసింది. అది కుక్కగా పుట్టి కొడుకు ఇంటినీ, ఆస్తినీ కాపలా కాస్తోందని తన దివ్యదృష్టి ద్వారా తెలుసుకున్నాడు. గురువు. కుక్కగా పుట్టిన ఆ రైతు 'స్వామీ! నేను ఎంత దౌర్భాగ్యుణ్ణి. మీరు ఇంత దయ చూపుతున్నప్పటికీ మీతో స్వర్గమానం చేయలేకున్నాను. వీడికి ఆస్తిని కాపాడుకొనే దక్షత ఇంకా రాలేదు. కాబట్టి దయ చేసి మరో ఏడేళ్ళు వ్యవధి ఇవ్వండి' అని వేడుకున్నాడు. గురువు ఏడేళ్ళ తరువాత మళ్ళీ వచ్చేసరికి కుక్క మరణించింది. అది త్రాచుపాముగా జన్మనెత్తి, ఇప్పుడు కొడుకు భూమిలో ఉన్న లంకెబిందెలకు పడగెత్తి కాపలా కాస్తోంది. గుప్త ధనం ఇక్కడ ఉందని కొడుకుకి ఎలా తెలియజేయాలా అని పాము ఆలోచిస్తున్నప్పుడు గురువు ఆ రైతుకొడుకును పిలుచుకు వచ్చి లంకె బిందెలు ఉన్న చోట తవ్వమన్నాడు. లంకె బిందెలు బయటపడ్డాయి. ఆ పైన ఆ పామును చంపమన్నాడు. అనంతరం శిష్యుణ్ణి తీసుకొని స్వర్గారోహణం చేశాడు గురువు. సంసారంలోని ఈతి బాధల నుండి శిష్యుణ్ణి ఉద్ధరిస్తాడు సద్గురువు. అలాంటి గురువు అందరికీ అవసరం.                                      *నిశ్శబ్ద.
ఏద‌యినా ఒక వ‌స్తువు ఇంట్లోంచి పోయిందంటేనే ఎంతో బాధ‌గా వుంటుంది. ఎంతో ఇష్ట‌ప‌డి కొనుక్కున్న వ‌స్తువు చేజారి ప‌డి ప‌గిలిపోయినా, దొంగ‌త‌నం జ‌రిగినా, ఎక్క‌డో మ‌ర్చిపోయినా చాలా బాధేస్తుంది. దాన్ని తిరిగి పొంద‌లేమ‌ని దిగులు ప‌ట్టుకుం టుంది. కానీ 101 ఏళ్ల చార్లెటి బిషాఫ్ కు ఎంతో ఇష్ట‌మ‌యిన పెయింటింగ్  రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో దూర‌మ‌యింది.  80 ఏళ్లు దాని కోసం ఎదురు చూడ‌గ‌లి గింది. అదంటే మ‌రి ఆమెకు ప్రాణ స‌మానం. చాలా కాలం దొరుకుతుంద‌ని, త‌ర్వాత  ఇక దొర‌కదేమో అనీ ఎంతో బాధ‌పడింది. ఫిదా సినిమాలో హీరోయిన్ చెప్పినట్లు ఆమె గట్టిగా అనుకుని ఉంటుంది. అందుకే కాస్త ఆలస్యమైనా.. కాస్తేంటి ఎనిమిది దశాబ్దాలు ఆలస్యమైనా ఆమె పెయింటింగ్ ఆమెకు దక్కింది.   ఆ పెయింటింగ్ గ‌తేడాది ఆమెను చేరింది. ఆమెది నెద‌ర్లాండ్స్‌. ఆమె తండ్రి నెద‌ర్లాండ్స్‌లోని ఆర్నెహెమ్‌లో చిన్న‌పిల్ల‌ల ఆస్ప‌త్రి డైరెక్ట‌ర్. పోయి దొరికిన ఆ పెయింటింగ్ విష‌యానికి వ‌స్తే.. అది 1683లో కాస్ప‌ర్ నెష‌ర్ వేసిన స్టీవెన్ ఓల్ట‌ర్స్ పెయింటింగ్‌. రెండో ప్ర‌పంచ యుద్ధ స‌మ‌యంలో నాజీల ఆదేశాల‌ను చార్లెట్ తండ్రి వ్య‌తిరేకించారు. ఆయ‌న ర‌హ‌స్య జీవ‌నం సాగించేడు. కానీ ఈ పెయింటింగ్‌ని మాత్రం త‌న న‌గ‌రంలోని ఒక బ్యాంక్‌లో భ‌ద్ర‌ ప‌ర‌చ‌మ‌ని ఇచ్చార‌ట‌. 1940లో నాజీలు నెద‌ర్లాండ్ పై దాడులు చేసినపుడు ఆ బ్యాంక్ మీద ప‌డి దోచుకున్నా రు. అప్పుడు ఈ పెయింటింగ్ కూడా తీసుకెళ్లారు. యుద్ధం అయిపోయిన త‌ర్వాత ఈ పెయింటింగ్ ఎక్క‌డున్న‌దీ ఎవ‌రికీ తెలియ‌లేదు. చిత్రంగా 1950ల్లో డ‌స‌ల్‌డార్ష్ ఆర్ట్ గ్యాల‌రీలో అది ప్ర‌త్య‌క్ష‌మ‌యింది. 1969లో ఆమ్‌స్ట‌ర్‌డామ్‌లో దాన్ని వేలానికి తీసికెళ్లే ముందు దాన్ని ఆ ఆర్ట్ గ్యాల‌రీలో వుంద‌ని చూసిన‌వారు చెప్పారు. వేలంపాట త‌ర్వాత మొత్తానికి ఆ పెయింటింగ్‌ను 1971లో ఒక క‌ళాపిపాసి త‌న ద‌గ్గ‌ర పెట్టుకున్నాడు.    ఆ త‌ర్వాత 2021లో అది చార్లెటీని చేరింది.  మొత్తానికి వూహించ‌ని విధంగా ఎంతో కాలం దూర‌మ‌యిన గొప్ప క‌ళాఖండం తిరిగి త‌న వ‌ద్ద‌కు చేర‌డంలో చార్లెటీ ఆనందానికి అంతేలేదు. అంతే క‌దా.. పోయింద‌నుకున్న గొప్ప వ‌స్తువు తిరిగి చేరితే ఆ ఆనంద‌మే వేరు!  అయితే చార్లెటీకి ఇపుడు ఆ పెయిం టింగ్‌ను భ‌ద్రంగా చూసుకునే ఆస‌క్తి వున్న‌ప్ప‌టికీ శ‌క్తి సామ‌ర్ధ్యాలు లేవు. అందుక‌నే త్వ‌ర‌లో ఎవ‌రిక‌యినా అమ్మేసీ వ‌చ్చిన సొమ్మును పిల్ల‌ల‌కు పంచుదామ‌నుకుంటోందిట‌!  చార్లెటీ కుటుంబంలో అయిదుగురు అన్న‌ద‌మ్ములు అక్క‌చెల్లెళ్లు వున్నారు. అలాగే ఇర‌వై మంది పిల్ల‌లు ఉన్నారు. అంద‌రూ ఆమె అంటే ఎంతో ప్రేమ చూపుతున్నారు. అంద‌రం ఒకే కుటుంబం, చాలాకాలం త‌ర్వాత ఇల్లు చేరిన క‌ళాఖండం మా కుటుంబానిది అన్న‌ది చార్లెటీ!
ఓ వంక ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుంటే, మరో వంక జాతీయ స్థాయిలో, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తృతీయ ప్రత్యాన్మాయంగా థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఆలోచనలు  జోరందుకున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు, పీసీ చాకో, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)లో చేరారు. చాకోను పార్టీలోకి ఆహ్వానిస్తూ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్’ ఫ్రంట్ ఏర్పాటు గురించి ప్రత్యేకించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు కానీ, చాకో అలాంటి  సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం దేశంలో ఉన్న ఏ ఒక్కపార్టీ కూడా బీజేపీకి ప్రత్యాన్మాయం కాదని,సమీప భవిష్యత్ కాంగ్రెస్ సహా ఏ పార్టీ కూడా ఆ స్థాయికి ఎదిగే అవకాశాలు కూడా కనిపించడంలేదని అన్నారు. ఈ పరిస్థితుల్లో దేశంలోని బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ, ఏకమై, ఒకే గొడుగు కిందకు రావలసిన అవసరం ఉందని చాకో అన్నారు. అదే సమయంలో ప్రతిపక్షాలను ఏక తాటిపైకి తెచ్చే బాధ్యతను పవార్ తీసుకోవాలని సంకేత మాత్రంగా చెప్పారు. అంతే కాకుండా కాంగ్రెస్ పేరు ఎత్తకుండా బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసే ఆలోచన ఆ పార్టీ నాయకత్వానికి లేదని నెహ్రూ గాంధీ ఫ్యామిలీ (సోనియా, రాహుల్, ప్రియాంక)ఆలోచనా ధోరణిని పరోక్షంగానే అయినా ఎండ కట్టారు.ఆ విధంగా పవార్ ఆ బాధ్యత తీసుకోవాలని చాకో సూచించారు. ఇందుకు సంబంధించి, పవార్ బహిరంగంగా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. అయితే, చాకో సహా మరికొందరు ‘సీనియర్’ కాంగ్రెస్ నాయకులు, అలాగే సిపిఎం, సిపిఐ నాయకులు కూడా పవార్’తో చాలా కాలంగా థర్డ్ ఫ్రంట్  విషయంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. అయితే మహారాష్ట్రలో సంకీర్ణం మనుగడను దృష్టిలో ఉంచుకుని పవార్ ఆచితూచి అడుగులేస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే చాకో పార్టీలో చేరిన సందర్భంలో కూడా ‘చాకో చేరికతో మహారాష్ట్రలోని మహా వికాస్ అగాడీ ప్రభుత్వానికి ఎలాంటి నష్టం జరగదని, పవార్ మహారాష్ట్ర సంకీర్ణ సర్కార్ ప్రస్తావన చేశారని విశ్లేషకులు పేర్కొంటున్నారు.  మహారాష్ట్ర సంకీర్ణ ప్రభుత్వ మనుగడ గురించ్బి  పవార్ ప్రత్యేకంగా పేర్కొనడం ద్వారా, ఆయన థర్డ్ ఫ్రంట్ విషయంలో వేచి చూసే ఆలోచనలో ఉన్నట్లు అర్థమవుతోందని కూడా  రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే అదే ఎన్సీపీ అసెంబ్లీ ఎన్నికల జరుగతున్న కేరళలో, పశ్చిమ బెంగాల్లో  కాంగ్రెస్ వ్యతిరేక పార్టీలకు మద్దతు ఇస్తోంది. దీన్ని బట్టి చూస్తే, ఎన్సీపీ - కాంగ్రెస్ మధ్య దూరం పెరుగుతోందని స్పష్టమవుతోంది. అయితే, థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు ఏ రకంగా ముడి పడుతుంది అనే విషయంలో ఇంకా స్పష్టత రావలసి ఉంది. అలాగే, కాంగ్రెస్ లేకుండా జాతీయ స్త్గాయిలో బీజేపీ వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేయడం వలన, వ్యతిరేక ఓటు చీలి  అది మళ్ళీ బీజేపీకే మేలు చేస్తుందని, కాబట్టి, ప్రస్తుతం కాంగ్రెస్ సారధ్యంలోని యూపీఏని బలోపేతం చేయడమే ఉత్తమమనే అలోచన కూడా  విపక్ష శిబిరం నుంచి వినవస్తోంది. ఈ నేపధ్యంలోనే, ప్రస్తుతం యూపీఏ ఛైర్పర్సన్’గా ఉన్న సోనియా గాంధీ వయసు, అనారోగ్యం కారణంగా బాధ్యతల నుంచి తప్పుకుని పవార్’కు బాద్యతలు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చిందని అంటున్నారు. అలాగే, ఇతర పార్టీలను, ముఖ్యంగా కాంగ్రెస్ నుంచి విడిపోయి సొంత కుంపటి పెట్టుకున్న మమతా బెనర్జీ సారధ్యంలోని తృణమూల్, జగన్మోహన్ రెడ్డి సారధ్యంలోని వైసీపీలను కలుపుకుని కూటమిని బలోపేతం చేయడం ద్వారా బీజేపీని దీటుగా ఎదుర్కోవచ్చనే ఆలోచనలు కూడా సాగుతున్నాయి. అయితే, ఇటు థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు అయినా, యూపీఏని బలోపేతం చేయడమే అయినా, పవారే .. కేంద్ర బిందువు. ఆయన సారధ్యంలోనే ప్రత్యాన్మాయం అనేది విపక్ష శిభిరం నుంచి వినవస్తున్న ప్రస్తుత సమాచారం. మరి అదే జరిగితే రాహుల గాంధీ పరిస్థితి ఏమిటి ? గాంధీ నెహ్రూ కుటుంబం పరిస్థితి ఏమిటి? ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేకుండా అందరిలో ఒకరిగా ఫస్ట్ ఫ్యామిలీ సర్దుకు పోతుందా? అంటే..చివరకు ఏమవుతుందో .. ఇప్పుడే చెప్పలేమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తెలంగాణ  రాష్ట్ర బడ్జెట్ 2021-22ను ఆర్థిక మంత్రి హరీష్ రావు, ఈ నెల18న సభలో ప్రవేశ పెడతారు.కరోనా కారణంగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2020-21)లో ఎదురైన ఆర్థిక ఇబ్బందుల నేపధ్యంగా ప్రవేశపెడుతున్న బడ్జెట్ కావడంతో  సహజంగానే అందరిలోనూ ఆసక్తి నెలకొంది. గతంలో అనేక సందర్భాలలో ముఖ్యమంత్రి కేసీఆర్,ఆర్థిక మంత్రి హరీశ రావు, కరోనా కారణంగా రాష్ట్ర  ఆదాయం గణనీయంగా తగ్గిందని, పేర్కొన్నారు. అయితే, కరోనా నుంచి వేగంగా కోలుకుని, ఆర్థికంగా అంతే వేగంగా పుంజుకున్న రాష్ట్రాలలో తెలంగాణ ప్రధమ స్థానంలో  ఉందని కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సర్వే 2020-21 నివేదిక పేర్కొంది. పడిలేచిన కెరటంలా, తెలంగాణ ‘వీ’ ఆకారంలో ఆర్థికంగా నిలతొక్కుందని కేంద్రం జనవరి  చివరి వారంలో విడుదల చేసిన ఆర్థిక సర్వేలో పేర్కొంది. అలాగే, రెవిన్యూ వసూళ్ళలో రాష్ట్రం కరోనా పూర్వస్థితికి చేరిందని కూడా సర్వే చెప్పింది.   అలాగే,రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు కూడా ఈ మధ్య కాలంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై సంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరమ జనవరి,ఫిబ్రవరి, మార్చి నెలలతో పోలిస్తే ఈ సంవత్సరం ఈ మూడు నెలల కాలంలో రాష్ట్ర ఆర్థిక వృద్ది రేటు 10 నుంచి  15 శాతం మెరుగ్గా ఉందని హరీష్ రావు ఒకటి రెండు ఇంటర్వ్యూలలో పేర్కొన్నారు.అలాగే, బడ్జెట్ విషయంలోనూ ఆయన చాల ఆశావహ దృక్పథంతోనే ఉన్నారు. బడ్జెట్  పాజిటివ్’గా ఉంటుదని, ఎవ్వరూ ఎలాంటి ఆందోళన చెందవలసిన అవసరం లేదని, సంక్షేమ పథకాలలో,ఇతరత్రా బడ్జెట్ కేటాయింపులలో ఎలాంటి కోతలు ఉండవని కూడా హరీష్ హామీ ఇచ్చారు. గత సంవత్సరంలో కొంత మేర హామీ ఇచ్చిన మేరకు అమలు చేయలేక పోయిన సొంత జాగాలలో డబల్ బెడ్ రూమ్ ఇళ్ళ నిర్మాణం, రుణ మాఫీ వంటి  పథకాలను ఈ బడ్జెట్ ద్వారా అమలు చేస్తామని చెప్పారు. అలాగే, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ తమిళి సై చేసిన ప్రసంగంలోనూ ఆశావహ దృక్పధమే వ్యక్తమైంది. ఆమె తమ ప్రసంగంలో,  ప్రభుత్వం సంక్షేమ పథకాలకు పెద్ద పీట వేసిందని అన్నారు. ‘సంపద పంచాలి ,పేదలకు పంచాలి’ అనేది తమ ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు. అలాగే, పెరుగతున్న ఆదాయంలో అధికశాతం సంక్షేమానికే వెచ్చిస్తున్నామని స్పష్టం చేశారు. దీంతో బడ్జెట్’లో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంటుందా అన్న చర్చ జరుగుతోంది. మరో వంక ఉద్యోగ వర్గాల్లో పీఆర్సీకి సంబంధించి ఆర్థిక మంత్రి తమ ప్రసంగంలో  ప్రకటన చేస్తారా లేదా అనే ఆసక్తి నెలకొంది. అలాగే, సామాన్య  ప్రజలు ఇటీవల పెరిగిన పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ ధరల భారం నుంచి మంత్రి హరీష్, ఏదైనా ఉపసమనం కలిపిస్తారా అని ఎదురు చూస్తున్నారు. గతంలో వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సామాన్య ప్రజలపై వంటగ్యాస్ ధర భారాన్ని తగ్గించేందుకు కొంత మొత్తాన్ని, రూ.50(?) రాష్ట్ర ప్రభుత్వం తరపున  సబ్సిడీగా ఇచ్చిన విషయాన్ని, అదే విధంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న తమిళనాడులో డిఎంకే పార్టీ,తమ పార్టీని అధికారంలోకి వస్తే  గ్యాస్ బండపై వంద రూపాయల సబ్సిడీ ఇస్తామని చేసిన  వాగ్దానాన్ని  గుర్తు చేస్తున్నారు. ఇదిలా ఉంటే, ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు, సోమవారం ఆర్థిక మంత్రి హరీష్ రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, ఆర్థిక  శాఖ ముఖ్య కార్యదర్శి రామ కృష్ణా రావు,సలహాదారు జీఆర్ రెడ్డితో బడ్జెట్ పద్దులఫై సుదీర్ఘంగా చర్చించి తుది మెరుగులు దిద్దారు. బడ్జెట్ తుది రూపం సిద్దమైన నేపధ్యంలో ఆర్థిక శాఖ ప్రింటింగ్ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 18 ఉదయం మంత్రి వర్గం ఆమోదం పొందిన అనంతరం ఆర్థికమంత్రి హరీష్ రావు అదే రోజు రాష్ట్ర బడ్జెట్ 2021-22ను సభలో ప్రవేశ పెడతారు. 20, 22 తేదీల్లో బడ్జెట్‌పై సాధారణ చర్చ,23, 24, 25 తేదీల్లో బడ్జెట్‌ పద్దులపై చర్చ ఉంటుంది 26న ద్రవ్యవినిమయ బిల్లు (బడ్జెట్)పై చర్చ, సభామోదం ఉంటాయి.
అబద్ధాలు, అర్థ సత్యాలు, వ్యక్తిగత దూషణలు, అర్ధంపర్ధం లేని ఆరోపణలతో సుమారు నెలరోజులకు పైగా తెలంగాణలో సాగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది.రాష్ట్రంలోని మహబూబ్‌నగర్‌-హైదరాబాద్‌-రంగారెడ్డి పట్టభద్రుల నియోజకవర్గంతో పాటుగా,నల్లగొండ-ఖమ్మం-వరంగల్‌ స్థానానికి ఫిబ్రవరి 16 తేదీన నోటిఫికేషన్ వెలువడినా, ఎన్నికల ప్రచారం మాత్రం అంతకు చాలా ముందే అభ్యర్ధుల స్థాయిలో స్థానికంగా ఎన్నికల ప్రచారం ప్రారంభమైంది.  అధికార తెరాస, ఖమ్మం స్థానానికి సిట్టింగ్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర రెడ్డి పేరును ప్రకటించడంలో కొంచెం జాప్యం చేయడంతో పాటుగా, హైదరాబాద్ స్థానం నుంచి , పీవీ కుమార్తె వాణీ దేవి పేరును చివరి క్షణంలో తెరమీదకు తేవడంతో అంత వరకు కొంత స్తబ్దుగా సాగిన ప్రచారం ఆ తర్వాత వేడెక్కింది. ఉద్యోగ నియామకాల విషయంలో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ తప్పులో కాలేయడంతో విపక్షాలు, పోటీలో ఉన్న ప్రత్యర్ధులు, నిరుద్యోగ యువత, విద్యార్ధి సంఘాలు  ఒకే సారి ఆయన మీద  విరుచుకు పడ్డారు. ఆయన లెక్క తప్పని నిరుపిస్తం రమ్మని వరస సవాళ్ళు విసిరారు. దీంతో, మంత్రి నియామకా ఇష్యూని పక్కకు తప్పించేందుకు , ఐటీఐఆర్, వరంగల్ రైల్వే ఫ్యాక్టరీ వంటి సెంటిమెంటల్ ఇష్యూస్’ను తెరపైకి  తెచ్చారు. అలాగే, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడిని పెంచారు. చివరకు పొరుగు రాష్ట్రానికి చెందిన విశాఖ ఉక్కు ఆందోళన   కూడా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగమైంది.   రెండు నియోజక వర్గాలలో గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య రెట్టింపు అయింది. ఈసారి రెండు నియోజక వర్గాలలో కలిపి 10 లక్ష 36 వేల మంది తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. అలాగే, రెండు పట్ట భద్రుల నియోజక వర్గాల్లో 164 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు.  గత ఎన్నికలతో పోలిస్తే ఇటు ఓటర్ల సంఖ్య, అటు అభ్యర్థుల సంఖ్యా రెట్టింపునకు పైగానే పెరగడంతో ఎన్నికలలో జోష్ పెరిగింది. దీనికితోడు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో సాధారణ ఎన్నికలను తలపించే రీతిలో ప్రచారం సాగింది. ఎక్కువమంది అభ్యర్ధులు బరిలో ఉండడంతో, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి  తమకే ప్రయోజనం జరుగుతుందని అధికార పార్టీ ఆశపడుతోంది .  దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూసిన టీఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికలను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా వ్యూహ రచన చేసి కేటీఆర్, హరీష్ సహా మంత్రులు,ఎమ్మెల్యేలకు స్పెసిఫిక్ బాధ్యతలు అప్పగించారు. అలాగే,కాంగ్రెస్‌ అభ్యర్థులు చిన్నారెడ్డి, రాములునాయక్‌లకు మద్దతుగా ఉత్తమ్‌, భట్టి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తదితరులు విస్తృతంగా ప్రచారం చేశారు. బీజేపీ అభ్యర్థులు ఎన్‌.రాంచందర్‌రావు, ప్రేమేందర్‌రెడ్డిల తరఫున ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ అరవింద్‌ తదితరులు ప్రచారాన్ని వేడెక్కించారు.  ఖమ్మం స్థానం నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో తొలిసారి పోటీకి దిగిన కోదండరాంకు, టీజేఎస్‌ పార్టీకీ ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. ఖమ్మ స్థానం నుంచి పోటీ చేస్తున్న తీన్మార్ మల్లన్న ముందస్తు వ్యూహంతో ప్రధాన పార్టీల అభ్యర్ధులకు ధీటుగా ప్రచారం సాగించారు.  వామపక్షాల మద్దతుతో జయసారథి, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్‌, యువతెలంగాణ కార్యనిర్వాహక అధ్యక్షురాలు రాణీ రుద్రమ తదితరులు పోటీలో ఖమ్మం సీటును పట్టభద్రులు  ఎవరికి  పట్టం కడతారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. హైదరాబాద్ సీటు కూడా ఇటు అధికార తెరాసకు అటు సిట్టింగ్ సీటును నిలుపుకోవడం తో పాటుగా దుబ్బాక , జీహెచ్ఎంసి జోష్ ను కొనసాగించాలని ఆశ పడుతున్నబీజేలకే కూడా ఇజ్జత్ కీ సవాల్ గా మారింది. కాంగ్రెస్ అభ్యర్ధి పార్టీ సీనియర్ నాయకుడు సౌమ్యుడు, మాజీ మంత్రి చిన్నారెడ్డి, వామ పక్షాల మద్దతుతో పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా గట్టి పోటీ ఇస్తున్నారు. సో.. చివరకు ఏమి జరుగుతుంది అంటే ఏదైనా జరగవచ్చును. ఈ నెల 14 వ తేదీన పోలింగ్ జరుగుతుంది.17 ఫలితాలు వస్తాయి .. అంతవరకు వెయిట్ అండ్ వాచ్ .  
సహజంగా కష్టాల్లో ఉన్నపుడు ఎవరికైనా దేవుడు గుర్తు వస్తారు. లౌకిక వాద రాజకీయ నాయకులకు అయితే హటాత్తుగా  తాము హిందువులం అనే విషయం జ్ఞప్తికి వస్తుంది. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ పార్టీ అధినాయకురాలు మమతా బెనర్జీకి   కూడా తానూ హిందువును అనే విషయం ఇప్పుడు గుర్తుకొచ్చింది. ఒకప్పుడు ఎర్ర జెండాను దిగ్విజయంగా ఎదిరించి, మార్క్సిస్టులను మట్టి కరిపించిన మమతా దీదీ ప్రస్తుతం, కాషాయ కూటమి నుంచి గట్టి సవాలును ఎదుర్కుంటున్నారు. వరసగా పదేళ్ళు పాలించడం వలన సహజంగా వచ్చిన ప్రభుత్వ వ్యతిరేకత  కంటే, హిందూ ఓటు పోలరైజేషన్ ఆమెను మరింతగా భయపెడుతోంది. నిజానికి ఐదేళ్ళ క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఐదు శాతం కంటే తక్కువ ఓట్లు, మూడంటే మూడు అసెంబ్లీ సీట్లు మాత్రమే గెలుచుకున్న బీజేపీ..  2019 లోక్ సభ ఎన్నికల్లో ఏకంగా 40 శాతం ఓట్లతో 18 స్థానాలు గెలుచుకుంది. ఈ  మార్పు ఇంకా కొన్ని కారణాలు ఉంటే ఉండవచ్చును కానీ.. హిందువుల ఓటు పోలరైజ్  కావడమే ప్రధాన కారణం.  ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ చివరకు కమ్యూనిస్టులు కూడా బీజేపీలో  చేరారు. ఎన్నికల ప్రకటన వెలువడిన తర్వాత కూడా సిట్టింగ్ ఎమ్మెల్ల్యేలు సహా  తృణమూల్ టికెట్ వచ్చిన నాయకులు కూడా బీజేపీలో చేరుతున్నారు. అనేక మంది ఇతర రంగాల ప్రముఖులు, ముఖ్యంగా ఇంతకాలం, బీజేపీని హిదుత్వ అనుకూల ‘అచ్చుత్’ (అంటారని) పార్టీగా చూసిన ‘సెక్యులర్’ ప్రముఖులు కాషాయం కప్పుకోవడంతో మమతా బెనర్జీకి కొంచెం అలస్యంగానే అయినా, తత్త్వం బోధపడింది. అందుకే ఆమె ఇప్పుడు గుళ్ళూ,గోపురాలకు తిరుగుతున్నారు. కార్యకర్తల సమావేశాల్లో తానూ హిందువునేనని, చెప్పుకుంటున్నారు.  నిజానికి ఇలా నేనూ హిందువునే  అని సెక్యులర్ నేతలు బహిరంగంగా ప్రకటించుకోవడం మమతా బెనర్జీతోనే మొదలు కాలేదు. రాహుల్ గాంధీ తాను హిందువునని, జన్యుధారీ కశ్మీరీ బ్రాహ్మణుని అనీ.. తమ గోత్రం, ‘దత్తాత్రేయ’ గోత్రమని బహిరంగంగా ప్రకటించుకున్నారు. అలాగే  కొద్ది రోజుల క్రితం ప్రియాంకా గాంధీ తానూ హిందువునని చెప్పుకునేందుకు ‘మౌని అమావాస్య’ సందర్భంగా అలహాబాద్ లో గంగా స్నానం చేశారు. గతంలోనూ ఆమె ఎన్నికలకు ముందు గంగా యాత్ర చేశారు. అంతవరకు ఎందుకు కొద్దిరోజుల క్రితం సిపిఐ నారాయణ విశాఖ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. చంద్రబాబు, జగన్ రెడ్డి, కేసీఆర్ ఇలా తెలుగు నేతలు అనేక మంది లౌకిక వాదానికి కాలం చెల్లిందన్న సత్యాన్ని గ్రహించి కావచ్చు ‘నేనూ హిందువును’ అంటూ ప్రకటించుకునేందుకు పోటీ పడుతున్నారు. రాముడిని తలచుకున్నా, జై శ్రీరామ్ అన్నా తమ  లౌకిక వాదం మయలపడి పోతుందని భయపడిన నాయకులు ఇప్పుడు .. జై శ్రీరామ్ అనేందుకు కూడా వెనకాడడం లేదు.
దేశంలోని ఉత్తరాది రాష్ట్రాలలో అటు కాంగ్రెస్ ఇటు స్థానికంగా ఉన్న ప్రాంతీయ పార్టీలను మట్టి కరిపిస్తూ అధికారాన్ని కైవసం చేసుకుంటున్న బీజేపీ.. దక్షిణాదికి వచ్చేసరికి ఒక్క కర్ణాటకలో తప్ప ఇతర రాష్ట్రాలలో ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏమాత్రం సక్సెస్ కాలేకపోతోంది. గత కొంత కాలంగా సబర్మలతో సహా అనేక అంశాలపై స్పందిస్తూ.. కేరళను టార్గెట్ చేస్తున్న బీజేపీ నాయకులు అక్కడ తమ జెండా ఎగరేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా పార్టీ పాలసీని కూడా పక్కన పెట్టి మెట్రో మ్యాన్ శ్రీధరన్ ను పార్టీలో చేర్చుకుని ఆయనే తమ సీఎం అభ్యర్థి అని ప్రకటించిన 24 గంటలలో యూ టర్న్ తీసుకున్నారు. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం సీఎంగా ఉన్న కమ్యూనిస్ట్ నేత పినరై విజయన్ పై గోల్డ్ స్మగ్లింగ్ ఆరోపణలు రావడంతో.. ఈ ఎన్నికలలో ఎల్డిఎఫ్ భవిష్యత్తుపై ప్రజలు ఏ తీర్పు ఇవ్వబోతున్నారనే ఉత్కంఠ సర్వత్రా నెలకొంది ఈ నేపథ్యంలో అక్షరాస్యతలో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్న ఆ రాష్ట్ర ప్రజలు ఎవరిని ఆశీర్వదిస్తారు అనే అంశంపై ప్రముఖ మీడియా సంస్థ టైమ్స్ నౌ, సీ ఓటరుతో కలిసి ఒక సర్వేను నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం చూస్తే పాపం కమలనాథులు అక్కడ పవర్ చేతికి రావటం అటుంచి కనీసం రెండు మూడు అసెంబ్లీ స్థానాల్లో గెలవటం కూడా కష్టమేనని ఆ సర్వే తేల్చి చెబుతోంది. కేరళలో ఈసారి జరిగే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ తన హవా చాటుతుందన్న ఆ పార్టీ నేతల మాటలలో ఎలాంటి నిజం లేదని.. ప్రస్తుతానికి అది ఏమాత్రం సాధ్యం కాదని ఈ తాజా సర్వే తేల్చి చెప్పింది. అంతేకాకుండా మొత్తం 140 స్థానాలు ఉన్న కేరళలో.. ప్రస్తుత సీఎం పినరయి విజయన్ నేతృత్వంలోని లెఫ్ట్డ్ డెమొక్రటిక్ ఫ్రంట్ కు 82 సీట్లు పక్కా అని.. ఆయనే తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటాడని సర్వే చెపుతోంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూనైటెడ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ కు 56 నుంచి 60 వరకు సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. అంతేకాకుండా 2016 ఎన్నికలతో పోలిస్తే ఎల్ డీఎఫ్ ఓటింగ్ శాతం కూడా కొంత పెరగటం ఇక్కడ గమనార్హం. ప్రస్తుతం సీఎంగా ఉన్న విజయన్ మరోసారి సీఎం కావాలని 43.34 శాతం మంది మొగ్గు చూపినట్లుగా సర్వేలో తేలింది. కరోనా సమయంలో విజయన్ సీఎంగా బాగా పని చేసారని ఈ సర్వే పేర్కొంది. మరోపక్క దేశ ప్రధానిగా రాహుల్ గాంధీ ఉండాలని కేరళ ప్రజల్లో 55.84 శాతం మంది కోరుకుంటున్నట్లుగా ఈ సర్వే;లో తేలింది. అయితే కేరళలో ఎలాగైనా పాగా వేయాలని పట్టుదలతో కృషి చేస్తున్న బీజేపీకి ఈసారి కూడా నిరాశ తప్పదని ఈ సర్వేలో స్పష్టం అయింది. ఈ ఎన్నికలలో బీజేపీకి రెండు సీట్లు కూడా రావటం కూడా కష్టమేనని ఈ సర్వే తేల్చింది. అయితే ఎన్నికలకు ముందు ఇలాంటి సర్వేలు బయటకు రావడం.. తరువాత అందులో కొన్ని చతికిల పడడం మనం చూస్తూనే ఉన్నాం. మరి ఈ సర్వే ఫలితాలు నిజామా అవుతాయో లేదో తేలాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.        
రాజకీయాలు అంటేనే అదో జూదం. పూలమ్మిన చోటనే కట్టెలు అమ్మవలసి రావచ్చును. అలాంటి పరిస్థితే వచ్చినా, తలవంచుకుని పోగలిగితేనే, ఎవరైనా రాజకీయాలలో రాణించగలరు. అలాకాదని, అలిమి కానిచోట, కూడా తామే అధికులమని భావిస్తే, ఎందుకూ కాకుండా పోతారు. అలాంటి వారు ఇద్దరూ కూడా ఇప్పుడు మన కళ్ళముందే ఉన్నారు.  జయలలిత జీవించి ఉన్నత కాలం, ఆమె నెచ్చలిగా పేరొందిన శశికళ, తమిళ రాజకీయాల్లో ఓ వెలుగువెలిగారు. కొన్ని విషయాల్లో జయలలిత కంటే, ఆమె మోర్ పవర్ఫుల్ లేడీ అనిపించుకున్నారు. ముఖ్యమంత్రులు, మంత్రులు కూడా ఆమె ముందు చేతులు కట్టుకుని నిలుచున్నారు.ఆమెకు పాదాభివందనాలు చేశారు. అలాగే జయ మరణం తర్వాత ఆమె పరిస్థితి ఏమిటో కూడా వేరే చెప్పవలసిన, అవసరం లేదు. జైలు పాలయ్యారు. సర్వం తానై నడిపించిన పార్టీ నుంచి  బహిష్కరణకు గురయ్యారు. జయ ఉన్నంత వరకు తన వారుగా ఉన్న వారందరూ కానివారయ్యారు. ఒంటరిగా మిగిలారు.  నిజానికి నాలుగేళ్ళు జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆమె తలచుకుంటే.. రాష్ట్ర రాజకీయాలలో, ముఖ్యంగా అధికారంలో ఉన్న డిఎంకే కూటమిలో అలజడి సృష్టించగలరు. ఎన్నికలలో ఆమె గెలవక పోవచ్చును కానీ.. తనను కాదన్న అన్నాడిఎంకేను ఓడించగలరు. అయిన  ఆమె అందుకు విరుద్ధంగా  రాజకీయాలకు వీడ్కోలు పలికి మౌనంగా పక్కకు తప్పుకున్నారు. రాజకీయ సన్యాసం ప్రకటించారు. ఉమ్మడి శతృవు డిఎంకే ను ఓడించేందుకు అన్నా డిఎంకే కూటమి  పోటీ చేయాలని, కూటమి ఐక్యతను దెబ్బతీయరాదనే ఉద్దేశంతోనే ఆమె రాజకీయ సన్యాసం ప్రకటించారు.    శశికళ మౌనంగా వెళ్లి పోవడం వెనక ఇంకా అనేక కారణాలున్నా ,అసలు కారణం ఆమె, రాజకీయ విజ్ఞత, వివేకం. ఆమె జైలుకు వెళ్ళిన సమయంలో జయలలిత సమాధి వద్ద ఎంత కసిగా, కోపంగా ‘మౌన’ ప్రతిజ్ఞ చేశారో చూశా. అలాంటి ఆమె ఇప్పుడు ఇలా ‘మౌనం’గా వెనకడుగు వేశారంటే, అది ఆలోచించ వలసిన విషయమే.ఆమె వ్యుహతంకంగానే సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే అనేక మంది అనేక కోణాల్లో శశికళ సంచలన నిర్ణయాన్ని విశ్లేషించారు.జైలు జీవితం తర్వాత కూడా అన్నా డిఎంకే నాయకులు తనను అగ్రనేతగా అంగీకరించక పోవడం, అమిత్ షా చెప్పినా.. అన్నా డిఎంకే నాయకులు ఆమెను, మేనల్లుడు దినకరన్’ను కులం పేరున, కుటుంబం పేరున దూరం చేయడం, తిరిగి పార్టీలోకి తీసుకోకపోవడంతో ఆమె మనసు కష్టపెట్టుకుని, సన్యాస నిర్ణయం తీసుకున్నారని కొందరంటున్నారు. పార్టీ మీద పట్టు లేదని, చరిష్మా అసలే లేదని, అందుకే ఆమె అలా నిశ్శబ్ధంగా రాజకీయ సన్యాసం స్వీకరించారని ఇంకొందరు విశ్లేషించారు. ఈ విశ్లేషణలో కొంత నిజం ఉంటే ఉండవచ్చును.. కానీ ఆమె గతాన్ని, నైజాన్ని గుర్తు చేసుకుంటే ఆమె స్ట్రైక్ బ్యాక్ వ్యూహంతోనే ఒకడుగు వెనక్కివేశారని ఆమెతో సన్నిహితంగా మెలిగినవారు, ఆమె రాజకీయ చాణక్యం తెలిసిన వారు అంటారు.   నిజానికి జైలులో ఉన్న కాలంలో కానీ, జైలు నుంచి విడుదలై వచ్చిన తర్వాత కానీ, ఆమె రాజకీయ సన్యాసం వైపు అడుగులు వేస్తున్నట్లు కనిపించలేదు. బెంగుళూరు జైలు నుంచి విడుదలై చెన్నైలో ప్రవేశించిన నప్పుడు ఆమె పెద్ద కాన్వాయ్ తో  తమ కారుకు అన్నాడిఎంకే జెండాతోనే ఎంటరయ్యారు. అలా ఎంట్రీలోనే రాజకీయ ఆకాంక్షను వెంట తెచ్చుకున్నారు. చివరకు ‘సన్యాస’ ప్రకట చేసే వరకు కూడా ఆమె రాజకీయ కార్యకలాపాలు సాగిస్తూనే ఉన్నారు. అటు ఢిల్లీని ఇటు చెన్నైనికూడా కదిల్చారు. అంతేకాదు, రాజకీయాలపై విరక్తితో కాదు, రాజకీయ కసితో, ఉమ్మడి శత్రువు (డిఎంకే) ను ఓడించేందుకే తాను రాజకీయాలనుంచి తపుకుంటున్నట్లు చెప్పారు.  సో .. సన్యాసం తీసుకోవాలనే ఆలోచన, రాజకీయవ్యూహం లోంచి పుట్టిందే కానీ,వైరాగ్యంతో పుట్టింది కాదు ,అన్నవిశ్లేషణ వాస్తవానికి ఇంకొంత దగ్గరగా ఉందని అనుకోవచ్చును. ఇది ‘కామా’నే కాని ‘ఫుల్స్టాప్’ కాదని అంటున్నారు.  ముఖ్యమంత్రి ఎడప్పాడి కే. పళని స్వామి (ఈపీఎస్) ఆమెను పార్టీలోకి అనుమతిస్తే తన కుర్చికీ ఎసరు పెడతారనే భయంతోనే,, ఆమె ఎంట్రీని అడ్డుకున్నారు. ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం, శశికళ ఒకే సామజిక వర్గానికి చెందిన వారు కావడం కూడా, ముఖ్యమంత్రి ఈపీఎస్’ భయానికి కారణంగా పేర్కొంటారు. అందుకే  ఆయన, ‘మన్నార్గుడి’ ఫ్యామిలీని బూచిగా చూపించి, ఆమెను దూరంగా ఉంచారని పార్టీలో ఒక వర్గం గట్టిగా విశ్వసిస్తుంది. అయితే ఆమె శక్తియుక్తులను కూడతీసుకుని  పులిలా పంజా విసిరేందుకే ఆమె వ్యూహాత్మకంగా ఒక అడుగు వెనక్కి వేశారు కావచ్చును అని కూడా, తమిళ రాజకీయ వర్గాల్లో ఒక చర్చ జరుగుతోంది.  గతంలో ఆమె జయలలితతో విబేధాలు వచ్చిన సమయంలో కూడా ఇలాగే కొద్ది కాలం మౌనంగా తెర చాటుకు వెళ్లి పోయారు.  కొద్ది కాలంలోనే మళ్ళీ ‘పోయస్ గార్డెన్’లో ప్రత్యక్షమయ్యారు. జయలలిత స్వయంగా ఆమెను వెనక్కి పిలుపించుకోవలసిన పరిస్థితులను సృష్టించారు. అలా  మళ్ళీ  చక్రం తిప్పారు. జయలలిత మరణం వరకు ఆమె అందరికీ చిన్నమ్మగా అమ్మకు పెద్దమ్మగా సర్వం తానై నిలిచారు. చివరకు జయ అంత్యక్రియల్లో కూడా ఆమెదే పై చేయిగా కనిపించింది.   జయలలిత చనిపోయిన సందర్భంలోనే అన్నా డిఎంకే ఎమ్మెల్ల్యేలో సుమారు 30 మంది వరకు ఆమెకు మద్దతుగా ఉన్నారన్న వార్తలొచ్చాయి. నిజానికి,ఇప్పటికి కూడా ఒక్క అన్నా డిఎంకే లోనేకాదు,డిఎంకే ఇతర పార్టీలలో కూడా  ఆమె అవసరం ఉన్న వాళ్ళు ఉన్నారు. కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో ‘మన్నార్గుడి’ ఫ్యామిలీ మద్దతు లేకుండా గెలిచే అవకాశం లేదు.  ఇవ్వన్నీ నిజమే అయినా.. అన్నీ ఉండి, ఎవరు లేని శశికళలో, ఇంకా  ఎవరి కోసం తాపత్రయ పడాలి? అనే ప్రశ్న జనించి ఉంటే, ఆమె రాజకీయ సన్యాసం నిజం కావచ్చును. ఎందుకంటే ఆమె నెచ్చలి, జయలిత లేరు, భర్త అంతకంటే ముందే చనిపోయారు, పిల్లలు లేరు... పైగా నాలుగేళ్ళ జైలు జీవితం ఆమెలో మార్పు తెచ్చి ఉండవచ్చును. ఈ వయస్సులో తనవారంటూ ఎవరు లేని తనకు రాజకీయాలు ఎందుకు ? శేష జీవితాన్ని ఇలా సాగిద్దామనే ఆలోచన నిజంగా వచ్చి ఉంటే, ఆమె సన్యాసం సత్యం అయినా కావచ్చును, కాకపోనూ వచ్చును. కానీ  శశికళ... ఆమెను అర్థం చేసుకోవడం, అంచనా వేయడం , అంత తేలిగ్గా అయ్యే పని కాదు..
కాంగ్రెస్ పార్టీలో రగులుతున్న అంతర్యుద్ధం కొత్త పుంతలు తొక్కుతోంది. మరిన్ని మలుపులు తిరుగుతోంది.ఇటీవల జమ్మూలో సమావేసమైన జీ 23 నాయకులు  అసమ్మతి స్వరాన్ని పెంచారు. కాంగ్రెస్ అధినాయకత్వం పై నేరుగా అస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ పేరు చెప్పకుండానే, ఆయన నాయకత్వానికి పనికిరాడని తేల్చి చెప్పారు. ఎవరైనా పార్టీ అధ్యక్షుడు అయితే కావచ్చును, కానీ, ప్రజానాయకుడు కాలేడని, రాహుల గాంధీ ప్రజానాయకుడు కాదు కాలేరు,అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరచూ రాహుల్ గాంధీని ఉద్దేశించి చేసే  ‘నామ్’ధారీ వ్యంగ్యాస్త్రాన్నే కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా సందించారు. ఇక అక్కడి నుంచి విధేయ, అసమ్మతి వర్గాల మధ్య మాటల యుద్ధం ఎదో ఒక రూపంలో సాగుతూనే వుంది. అదే క్రమంలో పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ, కరుడు కట్టిన ముస్లిం మతోన్మాది, అబ్బాస్ సిద్దిఖీతో కాంగ్రెస్ పార్టీ చేతులు కలపడం అసమ్మతి నాయకులకు మరో అస్త్రాన్ని అందించింది. విషయంలోకి వెళితే, ఇటీవల పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా లోక్’సభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు, పశ్చిమ బెంగాల్ పీసీసీ అధ్యక్షుడు అధీర్’రంజన్ చౌదరి, ముస్లిం మత ప్రచారకుడు, అబ్బాస్ సిద్దిఖీతో  వేదిక పంచుకున్నారు.అంతకు ముందే వామ పక్ష కూటమితో  పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్ పార్టీ, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)ను కూటమిలో చేర్చుకుంది. ఇలా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) అమోదం లేకుండా మతోన్మాద ఐఎస్ఎఫ్’ తో ఎన్నికల పొత్తు పెట్టుకోవడం ఆ పార్టీ నాయకుడు,సిద్ధిఖీతో  పీసీసీ చీఫ్ వేదిక  పంచుకోవడం పై అసమ్మతి నేతలు మండి పడుతున్నారు. ఇలా సిద్దిఖీతో వేదిక పంచుకోవడం పార్టీ మౌలిక సిద్ధాంతాలకు వ్యతిరేకం అంటూ అసమ్మతి వర్గానికి చెందిన కీలక నేత, రాజ్యసభ సభ్యుడు,ఆనంద్ శర్మ మండిపడ్డారు. అంతే కాదు, సిద్ధిఖీ సారధ్యంలోని ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ (ఐఎస్ఎఫ్)తో జనవరిలో కుదుర్చుకున్న పొత్తుకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ)అమోదం లేదని ఆనంద్ శర్మ, అభ్యంతరం వ్యక్త చేశారు. పార్టీ విశ్వసించే లౌకిక వాదానికి కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం గొడ్డలి పెట్టని ఆయన తీవ్రంగా స్పందించారు.   శర్మ వ్యాఖ్యలపై అధీర్ రంజన్ చౌదరి అంతే ఘాటుగా ప్రతిస్పందించారు. “నిజాలు తెలుసుకోండి ఆనంద్ శ‌ర్మ జీ” అంటూ ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. వ్య‌క్తిగ‌త ప్ర‌యోజ‌నాలు ప‌క్క‌న‌పెట్టి, ప్ర‌ధానిని పొగిడి టైమ్ వేస్ట్ చేయ‌కండంటూ ఆయ‌న ఓ ట్వీట్లో అన్నారు. ఆనంద్ శ‌ర్మ అన‌వ‌స‌రంగా కాంగ్రెస్‌ను ల‌క్ష్యంగా చేసుకుంటున్నార‌ని, ఈ అంశాన్ని పెద్ద‌ది చేసి చూపిస్తున్నార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న ఉద్దేశాలు స‌రైన‌వే అయితే నేరుగా తనతో మాట్లాడ వలసిందని అన్నారు. బెంగాల్‌లో సీపీఐ(ఎం) కూట‌మికి నేతృత్వం వ‌హిస్తోంది. అందులో కాంగ్రెస్ ఓ భాగం. మ‌త‌తత్వ‌, విభ‌జ‌న రాజ‌కీయాలు చేస్తున్న బీజేపీకి చెక్ పెట్ట‌డానికే ఈ కూట‌మి అని మ‌రో ట్వీట్‌లో అధిర్ రంజ‌న్ అన్నారు. అక్కడతోనూ ఆగలేదు ... ట్వీట్ల మీద ట్వీట్లు సంధిస్తూ, ఆనంద్ శర్మ, బీజేపీ మత విభజన, అజెండాను బలపరుస్తున్నారని, పరోక్షంగా జీ23 నాయకులు బీజేపీకి ప్రయోజనం చేకూరుస్తున్నారని ఆరోపించారు.అంతే కాదు, క్షేత్ర స్థాయి వాస్తవ పరిస్థితులు తెలియకుండా, ఆనంద్ శర్మ పార్టీ మీద దండెత్తడం ఉచితం కాదని చౌదరి ఎదురుదాడి చేశారు. అసమ్మతిలో అసమ్మతి. ఇదలా ఉంటే, కాంగ్రెస్ పార్టీ  సమూల పక్షాళన కోరుతూ సోనియా గాంధీకి,గత సంవత్సరం  జీ 23గా ప్రాచుర్యం పొందిన సీనియర్ నాయకులు రాసిన లేఖపై సంతకాలు చేసిన  నాయకుల్లో నలుగురు,జమ్మూలోసమావేసమైన నాయకుల తాజా నిర్ణయాలు, వ్యాఖ్యలు,విమర్శల పట్ల అసంతృప్తిని వ్యక్త పరిచారు. గత సంవత్సరం సోనియా గాంధీకి రాసిన లేఖలో ప్రస్తావించిన అంశాలకు కట్టుబడి ఉన్నామని, అయితే, జీ 23లోని కొందరు సహచరులు, ఇటీవల గీతదాటి చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలను తాము సమర్ధించడం లేదని ఆ నలుగురు పేర్కొన్నారు. ఇందులో ముఖ్యంగా, రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, పీజే కురియన్ అయితే, “కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు అవసరమైన సంస్కరణలు తెచ్చేందుకు చేసే ప్రయత్నాలను పూర్తిగా సమర్దిస్తాను, కానీ, ‘లక్ష్మణ రేఖ’ దాటితే ఒప్పుకునేది లేదు”అని అసమ్మతిలో అసమ్మతికి తెర తీశారు.అలాగే, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ కుమారడు, మాజీ ఎంపీ సందీప్ దీక్షిత్,మధ్య ప్రదేశ్ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అజయ్ సింగ్’ కూడా గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్, ఆనంద్ శర్మ, మనీష్ తివారీ వంటి జీ 23 కీలక నేతలు అధినాయకత్వంపై చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. అలాగే, పార్టీ సీనియర్ నాయకుడు కేంద్ర మాజీమంత్రి వీరప్ప మొయిలీ కూడా,గత సంవత్సరం పార్టీ సీనియర్ నాయకులు  ఒక పరిమిత లక్ష్యంతో  సోనియా గాంధీకి లేఖ రాయడం జరిగిందని, ఆ పేరున జరుగతున్న  కార్యక్రమాలు లేఖ సంకల్పానికి  విరుద్ధమని అన్నారు. జీ 23 కార్యకలాపాలపై రాహుల్ గాంధీ కూడా పరోక్షగా స్పందించారు, ఒకప్పుడు ఎన్ఎస్’యుఐ, యూత్ కాంగ్రెస్’ కు సంస్థాగత ఎన్నికలు వద్దన్న వారే ఇప్పుడు ఇంకోలా మాట్లాడుతున్నారని పరోక్షంగానే అయినా సంస్థాగత ఎన్నికలు నిర్వహించడంతో పాటుగా, పార్టీ పక్షాలనకు తమ కుటుంబం వ్యతిరేకం కాదని, అందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీలో చెలరిగిన కలకలం  ఇక ముందు ఏమవుతుందో .. ఇంకెన్ని  మలుపులు తిరుగుతోందో ..చూడవలసిందే కానీ ఉహించలేము.
  విశ్వదాభిరామ వినురవేమ..  ఈ వాక్యం దాటి ఏ విద్యార్థి ముందుకు వెళ్లడు.  పిల్లల నాల్కల మీద నాట్యం అడే తొలి పద్యాలు వేమన పద్యాలే.. ఎంతో సులువుగా ఉంటూ ఎంతో లోతైన విషయ సమాచారాన్ని తెలపడం వేమన పద్యాల విశిష్టత.  వేమన 1367-1478 కాలాల మధ్య జీవించాడు.  సి.పి బ్రౌన్ వేమన పద్యాలను పుస్తక రూపంలో అచ్చు వేయించడం ద్వారా వేమన పద్యాలు అందరికీ అందుబాటులోకి వచ్చాయి.  అంతేనా.. సి.పి బ్రౌన్ వేమన పద్యాలను ఇంగ్లీషులోకి కూడా అనువదించాడు. పామరులకు అర్థమయ్యే భాషలు పద్యాలు చెప్పిన ప్రజాకవి వేమన. ఆటవెలది పద్యాలతో అందరిని మెప్పించిన వేమన జయంతిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వేడుకగా ప్రతి సంవత్సరం అధికారికంగా నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా యోగి వేమన గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుంటే.. యోగి వేమన ఎంత ప్రాచీన కవినో అందరికీ తెలిసిందే.. అయితే ఈయన గురించి చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి. ఈయన కులం నుండి ఈయన జన్మ వృత్తాంతం, కవిగా మారిన వైనం అన్నీ ఇప్పటికీ  స్పష్టత లేకుండానే ఉన్నాయి. వేమన గురించి పరిశోధన చేసిన వారు ఒక్కొక్కరు ఒకో విధమైన విశ్లేషణ,  ఒకో విధమైన కథనం అందించారు. అయితే వీటిలో వేమన వేశ్యాలోలుడి నుండి కవిగా మారిన కథనే చాలా ఆదరణ పొందింది.  పైగా వేమన కవిగా మారిన విధానం,  వేమన పద్యాల మకుటం గురించి కూడా స్పష్టత ఇస్తుంది. వేమన కథ.. కొండవీటిని పరిపాలించిన కోమటి వేమారెడ్డి అసలు పేరు అనువేమారెడ్డి. ఈయన చిన్నతమ్ముడే వేమన్న.  వేమన వదిన నరసాంబారాణి. వేమన ఒక వేశ్య వలలో చిక్కుకుంటాడు. వేశ్య ఏది అది కాదనకుండా ఆమె ముందు ఉంచేవాడు.  ఒకరోజు వేశ్య తనకు రాణి అయిన నరసాంబారాణి ఆభరణాలు వేసుకుని సంతోషపడాలని ఉందని వేమనకు చెబుతుంది.  వేమన వేశ్య మాటను కాదనలేక తన వదినతో ఆభరణాలు అడుగుతాడు.  నరసాంబారాణి తన ముక్కుకు ఉన్న బులాకీ తప్ప మిగిలిన ఆభరణాలు అన్నీ వేమనకు ఇచ్చి పంపుతుంది. కానీ వేశ్య మాత్రం తనకు బులాకీ కూడా కావాల్సిందే అని పట్టుబడుతుంది. దీంతో వేమన బులాకీ కూడా అడుగుతాడు.  అయితే నరసాంబారాణి తన బులాకీని ఇస్తూ నేను ఇచ్చిన ఆభరణాలు అన్నీ వేసుకుని నగ్నం ఉన్నప్పుడే నువ్వు ఆమెను చూడు అని చెప్పి పంపుతుంది.   వేమన వేశ్యను అలాగే చూడగా అతనికి స్త్రీలు అంటే విరక్తి పుట్టింది.  వెంటనే కోటకు వెళ్లిపోయాడు. నరసాంబారాణి నగలను తయారుచేసే అభిరాముడు ఎప్పుడూ కోటకు ఆలస్యంగా వచ్చేవాడు. ఇది గమనించిన వేమన అతను ఎందుకు కోటకు వస్తున్నాడో తెలుసుకోవాలని అభిరాముడిని కంట కనిపెట్టాడు.  అభిరాముడు దగ్గరలో ఒక కొండ గుహలో ఉన్న అంబికాశివయోగిని సేవించడం వేమన్న చూశాడు.  అంబికాశివయోగి అబిరాముడితో రేపు రా నీకు మంత్రోపదేశం చేస్తాను అంటాడు.  అయితే వేమన్న అంబికాశివయోగిని బంధించి అబిరాముడిలాగా కొండ గుహకు వెళతారు.  యోగి వేమన్న చెవిలో మంత్రోపదేశం చేసి నాలుక మీద బీజాక్షరాలు రాస్తాడు. దీంతో వేమన్నకు పాండిత్యం లభిస్తుంది.  అబిరాముడికి దక్కాల్సినది తనకు దక్కినందుకు వేమన పశ్చాత్తాప పడి అబిరాముడి కాళ్ల మీద పడి.. తను రాసే పద్యాల మకుటంలో అభిరాముడి పేరు చేర్చి అభిరాముడి పేరును చిరస్థాయిగా నిలిచేలా చేశాడు. ఇదీ వేమన వెనుక ఉన్న కథ. యోగి వేమన గురించి తెలుగు సాహిత్యం చాలా గొప్పగా చెప్తుంది.  తెలుగు కవులు, రచయితలు వేమన పద్యాల లోతును, పద్యాల విశిష్టతను తమ పరిశోధనలు,   విశ్లేషణల ద్వారా తెలిపారు.  వేమన గురించి,  వేమన పద్యాల గురించి ఎన్నో పరిశోధనా వ్యాసాలు కూడా వెలువడ్డాయి. కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నార్ల వెంకటేశ్వరరావు  వేమన జీవిత చరిత్రను రాయగా అది 14 భాషలలోకి అనువాదం అయ్యింది.  ఐక్యరాజ్యసమితి -యునెస్కో విభాగం వారు ప్రపంచ భాష కవులలో గొప్పవారిని ఎంపిక చేసే సందర్భంలో వేమనను కూడా ఎన్నుకుని ఆయన పద్యాలను వివిధ భాషలలోకి అనువదించారు.                                             *రూపశ్రీ.
  సైకోపాత్.. వినడానికి కాస్త భయం పుట్టించే పదం.  మానసికంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు సైకోపాత్ లాగా బిహేవ్ చేస్తుంటారు.  సాధారణంగా బయట ఎవరికో ఇలాంటి సమస్య ఉంటే పెద్దగా ఇబ్బందేమీ ఉండదు. కానీ  రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు ఇలాంటి వ్యక్తులతో జీవితం పంచుకోవాల్సి వస్తే మాత్రం అది నరకమే.  సైకోపాత్ ల ప్రవర్తన, వారి స్వభావం చాలా ప్రమాదకంగా ఉంటుంది. సైకోపాత్ లకు ఉన్న కొన్ని లక్షణాలు తెలుసుకుంటే.. సైకోపాత్  లక్షణాలున్న లైఫ్ పార్ట్నర్ ను గుర్తించడం కష్టం, ఎందుకంటే వారు తమ నిజమైన వ్యక్తిత్వాన్ని దాచడంలో చాలా తెలివైనవారు.  సైకోపాత్ భాగస్వామితో జీవించడం  మానసిక,  భావోద్వేగ ఆరోగ్యానికి ప్రమాదకరం. అబద్దం చెప్పే అలవాటు.. సైకోపాత్‌లు తమ అసలు వ్యక్తిత్వాన్ని దాచుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు చిన్న విషయాల గురించి కూడా అబద్ధాలు చెబుతారు. తమ అబద్ధాలను నిజమని నిరూపించుకునేందుకు కొత్త కథలను అల్లుతూనే ఉంటారు. అతని మాటలు తరచూ ఒక్కోసారి ఒక్కో విధంగా ఉంటాయి. ఎమోషన్స్.. ఎలాంటి   తప్పు చేయకపోయినా,  ఏమాత్రం సంబంధం లేకోపోయినా సరే.. తప్పు చేసిన భావనను కల్పించేలా వారు ప్రవర్తిస్తారు.  అవి వారితో రిలేషన్ లో ఉన్న వారిని  మళ్లీ మళ్లీ అపరాధ భావంలోకి లాగేస్తాయి. సైకోపాత్ లైఫ్ పార్ట్నర్స్ తమ భాగస్వాములను  నియంత్రించడానికి ఎమోషన్స్ తో ఆడుకుంటారు.   ఇలాంటి వారితో రిలేషన్ లో ఉంటే తమ రిలేషనే్ బలంగా ఉందని వారితో రిలేషన్ లో ఉన్నవారికి అస్సలు అనిపించదు. విమర్శ.. సైకోపాత్‌లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని  అవమానపరచడానికి ఎటువంటి చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. అలాంటి వారికి తమతో రిలేషన్ లో ఉన్న వారి తప్పులను పదే పదే ఎత్తి చూపడం అలవాటుగా ఉంటుంది. ముఖ్యంగా వారితో రిలేషన్ లో ఉన్న వారి ఆత్మగౌరవాన్ని నాశనం చేసేందుకు చాలా ప్రయత్నిస్తారు. ప్రతిస్పందన.. సాధారణంగా మనిషికి ఎదుటివారు ఎమోషన్స్ లో ఉన్నప్పుడు రెస్పాండ్ కావడం అనే అలవాటు ఉంటుంది.  కానీ సైకోపాత్ లతో రిలేషన్ లో ఉంటే వారి నుండి ఎలాంటి ప్రతిస్పందన లభించదు. ఎమోషన్ అవుతున్న వ్యక్తులను ఊరడించక పోగా.. విమర్మలు గుప్పించి మరింత బాధపెట్టడానికి, తమ స్వప్రయోజనాల కోసం మాత్రమే వారు ఆలోచిస్తారు. నిందలు.. సైకోపాత్ లు తాము చేసే తప్పులను ఎప్పుడూ అంగీకరించరు.  ప్రతిసారీ ఎదుటి వారినే నిందిస్తుంటారు.  తాము చేసిన తప్పులకు కూడా ఎదుటివారినే భాద్యలను చేసి వారిని దూషించి మరీ సంతోషపడతారు. వారికి అహం కూడా ఎక్కువగా ఉంటుంది. వారి అహాన్ని తృప్తి పరచుకోవడానికి  తమ భాగస్వామిని ఎంత బాధపెట్టడానికి అయినా సైకోపాత్ లు వెనుకాడరు. నియంత్రణ.. సైకోపాత్ లు తమతో రిలేషన్ లో ఉన్నవారిని ఎప్పుడూ నియంత్రించాలని  కోరుకుంటారు.  వారు ప్రథితీ తమ కనుసన్నల్లో జరగాలని అనుకుంటారు. వారి నిర్ణయాలతో వారి భాగస్వాములను పదే పదే ఇబ్బంది పెడతారు. వారితో రిలేషన్ లో ఉండేవారు చాలా వరకు స్వతంత్రత కోల్పోతుంటారు. ఎలాంటి సొంత నిర్ణయాలు తీసుకోలేరు. కోపం.. సైకోపాత్ లకు కోపం ఎక్కువ.  చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటారు. ఒక్కోసారి కోపంలో హింసాత్మకంగా కూడా మారుతుంటారు .  ఆ తరువాత తమ ప్రవర్తనకు తమ భాగస్వామినే భాధ్యులను చేస్తారు.                                          *రూపశ్రీ.  
  తల్లిదండ్రులుగా  పిల్లలకు ఇవ్వగల గొప్ప బహుమతి ఆరోగ్యకరమైన, సమతుల్య జీవనశైలి.  దీని కోసం పిల్లలకు తగిన  శక్తిని,  సమతుల్య జీవనశైలి మీద తగిన అవగాహనను పిల్లలకు కల్పించాలి. చిన్న వయస్సు నుండే సరళమైన, స్పృహతో కూడిన అలవాట్లను నేర్పించడం అనేది పిల్లల శారీరక, మానసిక శ్రేయస్సుకు పునాది వేస్తుంది.  అదే సమయంలో పిల్లల రోజును కూడా పర్పెక్ట్ గా ఉండేలా చేస్తుంది. పిల్లలకు సరైన దినచర్యను అందించి మంచి అలవాట్లు నేర్పాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంది. ఆహారం.. పిల్లలు ముందుగా తమ కళ్లతో ఆహారాన్ని చూసి అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు. పిల్లల ప్లేట్‌లో రంగురంగుల ఆహారాన్ని చేర్చాలి . ఇందులో పండ్లు, కూరగాయలు, గింజలు,  విత్తనాలు మొదలైనవి ఉంటాయి. వివిధ ఆకారాలలో ఆహారాన్ని పెట్టడం వల్ల పిల్లలు ఆహారం పట్ల ఆకర్షితులవుతారు. ఆహారాన్ని ఇష్టంగా,  వృథా చేయకుండా తినడం అలవాటు చేసుకుంటారు. యాక్టీవిటీ.. పిల్లలు సాధారణంగానే చురుగ్గా అల్లరి చేస్తూ ఆడుతూ ఉంటారు. అయితే వారిని సైక్లింగ్,  వాకింగా్,  డాన్స్ వంటి ఫిజికల్ యాక్టివిటీ ల వైపు ఆకర్షితులయ్యేలా తల్లిదండ్రులే చేయాలి. నిద్ర.. పిల్లలు కొంతమంది రాత్రి సమయంలో నిద్రపోవడానికి ఇబ్బంది పడుతుంటారు.  రాత్రి నిద్రించడానికి ఇబ్బంది ఉంటే పడుకునే ముందు ప్రశాంతమైన దినచర్యను అలవాటు చేయాలి. వెచ్చని స్నానం చేయడం, తేలికపాటి సంగీతం వినడం, నిద్రవేళ కథ వినడం మొదలైనవి బిడ్డ రాత్రిపూట బాగా నిద్రపోవడానికి సహాయపడతాయి.ఇవి పిల్లల మానసిక స్థితిని మెరుగుపరుస్తాయి.  బాగా నిద్ర పట్టేలా చేస్తాయి. ఎమోషన్స్..  “ఈ రోజు మీకు ఎలా అనిపిస్తుంది?”.. ఇాలాంటి ప్రశ్నను పిల్లలకు ఎప్పుడైనా వేశారా? ఇలాంటి ప్రశ్నలు పిల్లల ఎమోషన్స్ ను తెలుసుకోవడంలో సహాయపడతాయి.  భావోద్వేగాలను గుర్తించడానికి,  వ్యక్తీకరించడానికి పిల్లలకు ఇదొక మార్గం.  దీన్ని పిల్లలకు  నేర్పించడం చాలా ముఖ్యం. ప్రతి ఒక్కరికి భావాలు ఉంటాయి.  వాటిని పంచుకోవడం ఎల్లప్పుడూ సరైందేనని అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడాలి. పని.. రోజువారీ కార్యకలాపాలను వారి స్వంతంగా చేయడం వలన పిల్లలు తమ అవసరాలపై తాము దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. పళ్లు తోముకోవడం, బాత్‌రూమ్‌కి వెళ్లడం, స్నానం చేయడం, దుస్తులు ధరించడం, తినడం.. ఇవన్నీ పిల్లలను వ్యక్తిగతంగా ఎదగడంలో సహాపడతాయి.  పిల్లల పనులు వారు చేసుకోవడం అలవాటు చేసుకుంటే వారి ప్రవర్తన కూడా మెచ్యురిటీగా మారుతుంది.  ఇలా పనులు చేసుకోవడాన్ని పిల్లలు  స్వాతంత్ర్యం గా భావిస్తారు.  ఇది వారిలో సెల్ఫ్ రెస్పెక్ట్ ను,  సెల్ఫ్ కాన్పిడెంట్ ను పెంచుతుంది.                                        *రూపశ్రీ.
    శనగలు భారతీయులు ఆహారంలో బాగా ఉపయోగించే పప్పు ధాన్యం.  బస్సు ప్రయాణాలలో,  పార్కుల దగ్గర, సినిమా సెంటర్ల దగ్గర, స్కూళ్ల దగ్గర వేయించిన శనగలు తింటూ ఎంజాయ్ చేసేవారు బోలెడు మంది ఉంటారు. ఈ వేయించిన శనగలు పది, ఇరవై ఏళ్ల కిందట మంచి టైం పాస్ చిరుతిండి. ఇప్పుడు అవే శనగలు పోషకాహార జాబితాలో ఉంది. కాల్చిన శనగలను తినడం వల్ల ఆరోగ్యం చాలా బావుంటుందని అంటున్నారు.  ఇంతకీ ఈ కాల్చిన శనగలను తినడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసుకుంటే.. పోషకాలు.. వేయించిన శనగలలో ప్రోటీన్,  ఫైబర్,  కాల్షియం,  మెగ్నీషియం,  ఫాస్పరస్,  ఐరన్,  కార్బోహైడ్రేట్లు, ఫోలేట్,  యాంటీ ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలు ఉంటాయి.  చలికాలంలో వేయించిన శనగలు తినడం వల్ల ఆరోగ్య లాభాలు కూడా ఉన్నాయి. శనగలను సాధారణ కాలంలోనే కాకుండా చలికాలంలో కూడా నిక్షేపంగా తినవచ్చు. ఎముకలు బలంగా ఉండాలంటే   వేయించిన శనగలను తీసుకవడం మంచిది.  శనగలలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం వేయించిన శనగలలో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచడంలో అద్బుతంగా సహాయపడుతుంది. అందుకే ప్రతి రోజూ వేయించిన శనగలు తింటూ ఉంటే రోగనిరోధ శక్తి కూడా బలపడుతుంది. శరీరానికి మంచి శక్తి లభించాలంటే వేయించిన శనగలు తినడం మంచి మార్గం.  సాధారణంగా పచ్చి శనగలను కూర చేసుకుంటారు. కానీ వాటిని రోజూ వండుకోలేం. అదే వేయించిన శనగలు అయితే రోజూ కొన్ని తినవచ్చు.  వేయించిన శనగలలో కార్బోహేడ్రేట్లు, ప్రోటీన్,  ఐరన్ పుష్కలంగా ఉంటాయి.  ఇవన్నీ శరీరానికి అమితమైన శక్తిని ఇస్తాయి. వేయించిన శనగలు తింటే శక్తి లభించడం,  రోగనిరోధక శక్తి పెరగడం, ఎముకలు బలంగా మారడం మాత్రమే కాదు.. మధుమేహ రోగులకు చాలా మంచిది.   వేయించిన శనగలను స్నాక్స్ గా తీసుకుంటే  రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. బరువు  తగ్గాలని అనుకునే వారు చిరుతిండిగా వేయించిన శనగలు తీసుకుంటే మేలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  పైగా ఇప్పట్లో ప్రతి ముగ్గురు వ్యక్తులలో ఒకరు అధిక బరువు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు.  వేయించిన శనగలలో కేలరీలు చాలా తక్కువ.  పైగా ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.   చలికాలంలో జీర్ణసమస్యలు వస్తుంటాయి.  ఇలాంటి సమయంలో  ఆహారం జీర్ణం కాకపోవడం,  మలబద్దకం,  గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు ఒక దాని వెంట ఒకటి వస్తాయి.  వీటికి చెక్ పెట్టాలంటే వేయించిన శనగలు చాలా మంచి ఆప్షన్. ఎందుకంటే వేయించిన శనగలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.                                        *రూపశ్రీ.
  ఒత్తిడి చాలామందిని వేధించే సమస్య. ఇప్పటికాలం బిజీ జీవితాలలో ఒత్తిడి లేదు అంటే ఆశ్చర్యపోవాలి కానీ.. ఒత్తిడి ఉందంటే పెద్దగా వింతగా ఫీలవ్వాల్సింది ఏమీ లేదు. అయితే ఒత్తిడి సమస్య ఉంది కదా అని అందరూ అలాగే ఉండిపోరు.. ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే అది తీవ్ర సమస్యకు దారితీస్తుందని వైద్యులు చెబుతూనే ఉన్నారు.  అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి  వైద్యులను కలవడం నుండి,  జీవనశైలి,  ఆహారపు అలవాట్లు మార్చుకోవడం వరకు చాలా పాటిస్తారు.  ఈ కోవకు చెందినదే ఒత్తిడి తగ్గించే నూనెలు వాడటం.  కొన్ని రకాల నూనెలు ఒత్తిడిని తగ్గించడంలో చాలా బాగా పనిచేస్తాయి.  అదేలా అంటే.. ఒత్తిడిని తగ్గించడంలో అరోమాథెరపీ చాలా బాగా పనిచేస్తుంది.  కొన్ని రకాల వాసనలు మనసుకు, మెదకుడు చాలా గొప్ప ఓదార్పును ఇస్తాయి.  ఇవి ఒత్తిడి హార్మోన్లను నియంత్రించడం,  తగ్గించడం ద్వారా ఒత్తిడిని తగ్గించడంలో పనిచేస్తాయి. అలాంటి నూనెలు ఏనో తెలుసుకుంటే.. లావెండర్ ఆయిల్.. లావెండ్ ఆయిల్ ను చాలా రకాలుగా ఉపయోగిస్తారు.  సోపులు,  పెర్ఫ్యూమ్, ఎయిర్ ఫ్రెషనర్లు, వివిధ రకాల క్రీములు మొదలైనవాటిలో ఉపయోగిస్తారు. లావెండర్ ఆయిల్ ను డిఫ్యూజర్ లో ఉంచవచ్చు లేదా చర్మానికి అప్లై చేయవచ్చు.  లేదంటే ఇంట్లోనే ఒక దీపం వెలిగించి దాని పైన ఒక చిన్న కప్ లో నీరు పోసి అందులో లావెండర్ ఆయిల్ ను కొన్ని చుక్కలు వేయవచ్చు. ఇది గది మొత్తాన్ని కూడా చాలా సువాసనా భరితంగా మార్చేస్తుంది. ఫలితంగా ఒత్తిడి తగ్గుతుంది. శాండల్ ఆయిల్.. శాండల్ ఆయిల్ లేదా గంధపు నూనె చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ధ్యానం చేసేటప్పుడు, నిద్రపోయేముందు ఈ నూనెను  వాడితే చాలా మంచి ఫలితం ఉంటుంది.  ఇది మానసకి ఒత్తిడిని చాలా బాగా తగ్గిస్తుంది. రోమరిన్ ఆయిల్.. రోమరిన్ ఆయిల్ అనేది ఒత్తిడిని తగ్గించడంలో మాత్రమే కాకుండా మానసిక అలసటను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.  దీని సువాసన మానసికోల్లాసాన్ని ఇస్తుంది. పిప్పరమెంట్ ఆయిల్.. పిప్పరమెంట్ చాలా రకాల ఆహారాలు,  ప్రోడక్ట్ లలో చూస్తుంటాం. ఇందులో ఉండే మెంథాల్ ఫ్లేవర్ కూలింగ్ ఎఫెక్ట్ కలిగి ఉంటుంది.  పిప్పరమెంట్ ఆయిల్ వాసన తలనొప్పి, మానసిక అలసట,  మైగ్రేషన్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. ఇది మానసకి శక్తి స్థాయిలను పెంచుతుంది. జాస్మిన్ ఆయిల్.. జాస్మిన్ ఆయిల్ లేదా మల్లెపూల నూనె చాలా సువాసన కలిగి ఉంటుంది.  ఈ నూనె జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.  ఏకాగ్రత పెంచడంలో సహాయపడుతుంది.  మానసిక ఒత్తిడిని చాలా సులువుగా తగ్గిస్తుంది. ఆరెంజ్ ఆయిల్.. ఆరెంజ్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడంతో పాటు మానసిక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. మానసిక అలసటను తగ్గిస్తుంది. యూకలిప్టస్ ఆయిల్.. యూకలిప్టస్ ఆయిల్ లేదా నీలగిరి తైలం చాలా మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇందులో చాలా ఔషద గుణాలు ఉంటాయి.  ఈ నూనె జలుబు, దగ్గు, శ్వాస సంబంధ ఔషదాల తయారీలో ఉపయోగించబడుతుంది.   ఈ నూనెను వినియోగించి  ఒత్తిడిని తగ్గించుకోవచ్చు.                                           *రూపశ్రీ.