అల్పాహారం ప్రతి ఒక్కరూ తప్పకుండా ఉదయాన్నే తీసుకునే ఆహారం.  ప్రతి రోజూ ఉదయం 8 నుండి 9 గంటలలోపు అల్పాహారం తీసుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, రోజంతా చురుగ్గా ఉండటానికి సహాయపడుతుందని వైద్యులు, ఆహార నిపుణులు చెబుతుంటారు.  అందుకే అల్పాహారం ఆరోగ్యకరంగా, పోషకాలతో నిండి ఉండాలని కూడా చెబుతారు.  అందరూ ఒకే విధమైన బ్రేక్పాస్ట్ తీసుకోరు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆహారం బ్రేక్పాస్ట్ లో తీసుకోవడం అలవాటుగా ఉంటుంది.  అయితే బ్రేక్పాస్ట్ విషయంలో చేసే కొన్ని మిస్టేక్స్ వల్ల టోటల్ గా బాడీ డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంటుందని ఆహార నిపుణులు అంటున్నారు. దీని వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని కూడా చెబుతున్నారు. ఇంతకీ బ్రేక్ పాస్ట్ విషయంలో అస్సలు చేయకూడని మిస్టేక్స్ ఏంటి? అసలు బ్రేక్పాస్ట్ చేయడం వల్ల జరిగే మేలు ఏంటి? తెలుసుకుంటే..

బ్రేక్పాస్ట్ ప్రయోజనం..

అల్పాహారం లేదా బ్రేక్పాస్ట్  రోజులో మొదటగా తీసుకునే ఆహారం.  ఇది రోజంతా శక్తివంతంగా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. జీవక్తియ రోజంతా చురుగ్గా ఉండేందుకు సహాయపడుతుంది. ఈ కారణంగా ఉదయాన్నే సరైన బ్రేక్పాస్ట్ చేయడం కూడా చాలా ముఖ్యంగా పరిగణించబడుతుంది.

బ్రేక్పాస్ట్ విషయంలో చేసే తప్పులు..

ఖాళీ కడుపుతో టీ..

ఉదయం లేవగానే టీ తాగే అలవాటు ఉంటే ఇది చాలా పెద్ద మిస్టేక్ అంటున్నారు వైద్యులు.  ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల ఆమ్లత్వం పెరుగుతుంది కార్టిసాల్ స్థాయిలు పెరుగుతాయని, డీహైడ్రేషన్‌కు కారణమవుతుందని,  ఆకలి కూడా  తగ్గుతుందని వైద్యులు అంటున్నారు.


చపాతీ, పరాటా..

మీరు ప్రతిరోజూ బ్రేక్పాస్ లో చపాతీలు లేదా  పరాటాలు  తింటే  ఉదయాన్నే ఎక్కువ  కార్బోహైడ్రేట్లను తీసుకోవడానికి కారణం అవుతుంది. ఇది ప్రోటీన్ లోపానికి కూడా దారితీస్తుంది. ఉదయాన్నే చపాతీలు లేదా పరాటాలు తినడం వల్ల  కడుపు నిండినట్టు అనిపిస్తుంది  కానీ ఇది ఇన్సులిన్ స్పైక్‌కు కారణమవుతుందట.  మధ్యాహ్నం  తీసుకునే ఆహారం వల్ల  మరింత హెవీగా  మారుతుందని ఇది శరీరాన్ని బరువుగా ,  పనుల మీద ఆసక్తి మరల్చేలా మారుస్తుందని చెబుతున్నారు.

ఇన్స్టంట్ ఓట్స్..

 అల్పాహారంలో చాలామంది  ఇన్‌స్టంట్ ఓట్స్ తింటుంటారు.  ఇది చాలా ఆరోగ్యకరమని కూడా అనుకుంటారు. ఇందులో ఫైబర్ ఉంటుంది కాబట్టి ఇది చాలా మంచిదని కూడా అనుకుంటారు.  కానీ ఈ ఓట్స్  అధికంగా ప్రాసెస్ చేసి ఉంటారు. ఇది చక్కెర స్థాయిలను పెంచుతుంది. బరువు తగ్గడానికి దీనిని తినకూడదని వైద్యులు సలహా ఇస్తున్నారు.

టీ తో బిస్కెట్,  జ్యూస్..

ఉదయాన్నే  టీతో పాటు బిస్కెట్లు లేదా జ్యూస్‌లు తీసుకోవడం చాలా మందికి అలవాటు.  దీన్నే బ్రేక్పాస్ట్ గా సరిపేట్టేస్తుంటారు కూడా. అయితే వీటిలో శుద్ధి చేసిన పిండి, చక్కెర,  ట్రాన్స్ ఫ్యాట్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్పైక్‌లకు కారణమవుతాయి,  ఊబకాయాన్ని పెంచుతాయి.

బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే..

చాలామంది డైటింగ్ పేరుతో ఉదయాన్నే బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తుంటారు.  బరువు తగ్గాలనే తాపత్రయంతో బ్రేక్పాస్ట్ స్కిప్ చేసి నేరుగా  బోజనం చేస్తుంటారు.  కానీ ఇది సరైన పద్దతి కాదని వైద్యులు చెబుతున్నారు.  బ్రేక్పాస్ట్ స్కిప్ చేస్తే జీవక్రియ మందగిస్తుందట. ఉదయం బ్రేక్పాస్ట్ స్కిప్ చేసే చాలామంది ఉదయం సమయంలో బిస్కెట్లు, జంగ్ ఫుడ్స్, ఇన్స్టంట్ డ్రింక్స్, ఇన్స్టంట్ ఫుడ్స్ తింటుంటారు. పైగా అవి చాలా లైట్ ఫుడ్స్ అని కూడా అనుకుంటారు.  ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.

                                    *రూపశ్రీ.

గమనిక:
ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...