చాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసా?
దుస్తులు శరీరాన్ని కప్పి ఉంచుతాయి. శరీరానికి వాతావరణం నుండి రక్షణ కూడా ఇస్తాయి. ఇప్పట్లో లో దుస్తులు ధరించడం చాలా కామన్. ఆడవారు అయినా మగవారు అయినా లో దుస్తులు ధరిస్తారు. అయితే లో దుస్తుల ఎంపికలో కొందరు తప్పులు చేస్తారు. చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తారు. లో దుస్తులే కదా ఏం అవుతుందిలే అనే కారణంతో కొందరు సైజ్ గురించి పెద్దగా పట్టించుకోకుండా లో దుస్తులు కొనుగోలు చేస్తారు. అయితే లో దుస్తులు కొనుగోలు చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు, ఎలాంటి ఫ్యాబ్రిక్ ఎంచుకోవాలి, సౌకర్యం, సైజ్ వంటి విషయాల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాలి. చాలా టైట్ గా ఉన్న లో దుస్తులు ధరిస్తే శరీరం షేప్ బాగా కనిపిస్తుందని అనుకుంటారు. కానీ చాలా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. లో దుస్తులు ధరించడం వల్ల నష్టాలు కలుగుతాయి. అవి ఆరోగ్యం మీద చాలా ప్రభావం చూపిస్తాయి. ముఖ్యంగా బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించడం వల్ల పెల్విక్ ప్రాంతం చుట్టూ దురద వస్తుంది. దీని కారణంగా నొప్పితో పాటు దురద కూడా వస్తుంది. ఇది క్రమంగా ఇన్ఫెక్షన్లు, చర్మం దెబ్బ తినడానికి కారణం అవుతుంది. చాలా బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే అది తొడపై భాగంలో రక్త ప్రసరణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది తొడపై ప్రభావం చూపిస్తుంది. రక్త ప్రసరణ సరిగా లేకపోతే ఆ ప్రాంతాలలో కండరాలు, నరాలపై ప్రభావం పడుతుంది. బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరిస్తే తొడపై ప్రభావం పడుతుంది. దీని వలన కాళ్లు తిమ్మిరిగా అనిపించవచ్చు. ఈ పరిస్థితిని తేలికగా తీసుకుంటే చాలా నష్టం కలుగుతుంది. ఎందుకంటే ఇలా బిగుతుగా ఉన్న దుస్తులు ఎక్కువ కాలం వేసుకుంటూ ఉంటే అది నడవడంలో ఇబ్బందులు సృష్టిస్తుంది. ముఖ్యంగా లో దుస్తులను రోజంతా వేసుకుంటాం కాబట్టి సమస్య ఎక్కువ ఉంటుంది. బిగుతుగా ఉండే బ్రా, పెట్టీ కోట్స్, టాప్స్ వంటివి వేసుకోవడం వల్ల పొట్ట కూడా బిగుతుగా ఉంటుంది. దీని వల్ల అసిడిటీ సమస్య రావచ్చు. బిగుతుగా ఉండే లో దుస్తులు ధరించడం వల్ల ఛాతీ బాగానికి రక్తప్రసరణ కూడా తగ్గుతుంది. బిగుతుగా ఉండే లో దుస్తులు ధరిస్తే ప్రైవేట్ ప్రాంతంలో గాలి ప్రసరణ నిరోధిస్తుంది. దీని వల్ల చెమట ఆరిపోవడానికి అవకాశం ఉండదు. దీని కారణంగా బ్యాక్టీరియల్ ఇన్పెక్షన్ ఏర్పడుతుంది. అందుకే బిగుతుగా ఉన్న లో దుస్తులు ధరించకూడదు. లో దుస్తులు ఎప్పుడూ కాటన్ వే ఎంచుకోవాలి. ఇవి చెమటను పీల్చుకుని ప్రైవేట్ ప్రాంతాన్ని పొడిగా ఉంచుతాయి. అలాగే లో దుస్తులను బాగా ఉతికి ఎండలో ఆరబెట్టాలి. వీటిని ఇంట్లోనే ఫ్యాన్ గాలికి ఆరబెట్టుకోవాల్సిన పని లేదు. సరిగా ఆరని లో దుస్తులు ధరించినా, శుభ్రత లేని లో దుస్తులు ధరించినా వాటి వల్ల ఇన్ఫెక్షన్లు చాలా తొందరగా వ్యాపిస్తాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreక్యాన్సర్ ను ఆమడదూరం ఉంచే రంగురంగుల ఆహారం.. రెయిన్ బో డైట్..!
క్యాన్సర్ చాలా మందిని కలవర పెట్టే సమస్య. క్యాన్సర్ వచ్చిందంటే ఇక చావు ఖాయం అనుకుంటారు కొందరు. దీనికి పేదోళ్లు వైద్యం చేయించుకోలేరు.. ధనికులకే ఆ వైద్య ఖర్చులు భరించే సామర్థ్యం ఉంటుంది అంటారు. అయితే క్యాన్సర్ వచ్చాక దానితో పోరాడటం కాదు.. క్యాన్సర్ రాకుండా ఏం చేయాలి? ఏం చేస్తే క్యాన్సర్ ఆమడ దూరంలో ఉంటుంది? దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. క్యాన్సరు.. హెచ్చరిక రంగులు.. క్యాన్సర్ అనగానే భయపడతారు సరే.. క్యాన్సర్ లో కూడా బోలెడు రకాలు ఉన్నాయి. క్యాన్సర్ రకాన్ని.. అది శరీరంలో పలు అవయవాలకు సంక్రమించడాన్ని బట్టి క్యాన్సర్ కు హెచ్చరిక రంగులు, రిబ్బన్ గుర్తులు ఉన్నాయి. గులాబీ రంగు రిబ్బన్.. రొమ్ము క్యాన్సర్ ను నారింజ రంగు రిబ్బన్.. లుకేమియా ను నలుపు రంగు రిబ్బన్.. చర్మ క్యాన్సర్ ను పసుపు రంగు రిబ్బన్.. బోన్ క్యాన్సర్ ను తెలుపు రంగు రిబ్బన్.. ఊపిరితిత్తుల క్యాన్సర్ ను టీల్ బ్లూ రంగు రిబ్బన్.. అండాశయ క్యాన్సర్ ను నీలం, గులాబీ, టీల్ రంగు రిబ్బన్లు.. థైరాయిడ్ క్యాన్సర్ ను పీచ్ కలర్ రిబ్బన్.. ఎండోమెట్రియల్ క్యాన్సర్ ను టీల్ అండ్ వైట్ రిబ్బన్.. సర్వైకల్ క్యాన్సర్ ను.. ఇలా రిబ్బన్ రంగులు వివిధ రకాల క్యాన్సర్లను సూచిస్తాయి. క్యాన్సర్ రాకుండా రంగురంగుల ఆహారం.. క్యాన్సర్ రాకుండా ఉండాలన్నా శరీరం ఏ జబ్బుల బారిన పడకుండా ఉండాలన్నా రంగురంగుల ఆహారాలు తీసుకోవాలని అంటున్నారు. ముఖ్యంగా రెయిన్ బో డైట్ క్యాన్సర్ ను ఆమడ దూరంలో ఉంచడంలో ప్రసిద్ధి చెందింది. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ, పర్పుల్ కలర్.. ఇలా రెయిన్ బో లో ఉండే ఏడు రంగుల మేళవింపులో ఆహారం తీసుకుంటే చాలా మంచిది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఎంజైమ్ లు, పైబర్.. ఇలా చాలా ఉంటాయి. ఇవన్నీ శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. వీటిలో కూడా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలు.. ఇలా అన్నీ తీసుకోవాలి. సీజనల్ పండ్లు, కూరగాయలను అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. సీజనల్ కూరగాయలు, ఆకుకూరలు ఆయా.. సీజన్ లలో వచ్చే వ్యాధులకు చెక్ పెట్టడంలో సహాయపడతాయి. కాబట్టి ఆహారం ద్వారా.. మద్యపానం, ధూమపానం, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులకు దూరం ఉండటం ద్వారా.. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమై అలవాట్లను కలిగి ఉండటం ద్వారా క్యాన్సర్ మహమ్మారికి ఆమడదూరం ఉండవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreనాలుక రంగును బట్టి జబ్బులను గెస్ చేయవచ్చు తెలుసా?
ఎప్పుడైనా ఏదైనా అనారోగ్యం వచ్చినప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్లినప్పుడు డాక్టర్ చేసే కొన్ని ప్రాథమిక పనులు ఉంటాయి. వాటిలో మొదటిది నాలుక చూడటం. నాలుక చూడటం, కళ్లు.. ముఖ్యంగా కనుగుడ్డు కింది భాగం, తరువాత మణికట్టు పట్టుకుని నాడి చూడటం వంటివి చేస్తారు. అయితే డాక్టర్లు ఇలా నాలుక చూడటం వెనుక బలమైన కారణాలు ఉంటాయి. నాలుక రంగును బట్టి శరీరంలో ఉన్న అనారోగ్యాన్ని చెప్పవచ్చు. అసలు నాలుక ఏ రంగులో ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు? ఎలాంటి రంగులు ఎలాంటి అనారోగ్య సమస్యలను సూచిస్తాయి? తెలుసుకుంటే.. నాలుక రంగు.. సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తి నాలుక గులాబీ కలర్ లో ఉంటుంది. ఇలా గులాబీ రంగులో కాకుండా వేరే ఇతర రంగులలో నాలుక ఉంటే వాటి వెనుక కొన్ని అనారోగ్య సమస్యలు ఉంటాయి. నలుపు రంగు.. కొన్నిసార్లు నాలుక రంగు నల్లగా మారవచ్చు. నాలుక నలుపు రంగుగా మారడం క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన ప్రాణాంతక వ్యాధికి సంకేతమట. నలుపు రంగు నాలుక ఫంగస్, అల్సర్ వంటి తీవ్రమైన వ్యాధికి లక్షణం కావచ్చునని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. తెలుపు రంగు.. కొందరికి నాలుక తెల్లగా పాలిపోయి ఉంటుంది. నాలుక రంగు తెల్లగా మారినట్లయితే శరీరంలో డీహైడ్రేషన్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది కాకుండా, తెల్లటి నాలుక ల్యుకోప్లాకియా వంటి తీవ్రమైన వ్యాధిని కూడా సూచిస్తుందట. పసుపు రంగు.. నాలుక పసుపు రంగులోకి మారుతుందా? అనే సందేహం చాలామందికి ఉంటుంది. కానీ ఇది నిజమే. కొందరికి కొన్ని పరిస్థితులలో నాలుక పసుపు రంగులోకి మారుతుంది. నాలుక పసుపు రంగులో ఉన్నట్టైతే జీర్ణక్రియను మెరుగుపరచడంపై దృష్టి పెట్టాలి. నోటిలో మిగిలిపోయిన బ్యాక్టీరియా కారణంగా నాలుక రంగు పసుపు రంగులోకి మారుతుంది. ఈ రంగు నాలుక కాలేయ ఆరోగ్యానికి సంబంధించిన కొన్ని సమస్యలను కూడా సూచిస్తుందట. ఎరుపు రంగు.. నాలుక ఎర్రగా పొక్కినట్టు ఉంటుంది కొందరికి. ఇలా ఎరుపు రంగులో నాలుక ఉండటం విటమిన్ B, ఐరన్ లోపాన్ని సూచిస్తుంది. ఫ్లూ, జ్వరం, ఇన్ఫెక్షన్ లు ఉన్నప్పుడు కూడా నాలుక ఎరుపు రంగులో ఉంటుంది. నాలుక రంగు మారడాన్ని మీరు గమనించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం. *రూపశ్రీ.
read moreఈ అలవాట్లు ఉన్నవారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందట..!
ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య రంగానికి క్యాన్సర్ పెద్ద సవాలుగా మారుతోంది. ఇది ప్రతి సంవత్సరం మిలియన్ల మంది మరణానికి కారణమవుతోంది. పెద్దవాళ్లయినా, చిన్నవాళ్లు అయినా ఎవరికైనా క్యాన్సర్ వస్తోంది.పిల్లలు కూడా ఈ ప్రాణాంతక వ్యాధి బారిన పడతారని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధ్యయనాల ఆధారంగా, భారతదేశంలో క్యాన్సర్ కేసులు పెరుగుతున్న వేగం రాబోయే సంవత్సరాల్లో ఈ సమస్యను పెంచే అవకాశం ఉంది. పరిశోధనల ప్రకారం ఈ సంవత్సరం (2025) ఈ సంఖ్య 12% నుండి 18% వరకు పెరగవచ్చని పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాధి గుండె జబ్బుల తర్వాత ప్రపంచవ్యాప్తంగా మరణాలకు రెండవ అతిపెద్ద కారణంగా మారింది. ఈ వ్యాధి ఏటా పెరుగుతుండడంతో ప్రతి ఒక్కరూ దీని ప్రమాదాన్ని అర్థం చేసుకుని నివారణ చర్యలు చేపట్టాలని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దినచర్యలో కొన్ని మార్పులు క్యాన్సర్ నుండి రక్షించడంలో సహాయపడతాయి. పెరుగుతున్న క్యాన్సర్ ప్రమాదాల గురించి అవగాహన పెంచడం, దాని నివారణ, దాన్ని గుర్తించే విధానం, దానికి చికిత్సను అందించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న క్యాన్సర్ డే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా CAUTIONUS ఫార్ములా గురించి అర్థం చేసుకోవాలి. 'CAUTIONUS' ఫార్ములా అంటే ఏమిటి? క్యాన్సర్ లక్షణాలను సకాలంలో గుర్తించడంలో 'CAUTIONUS' సహాయపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. C - Change మార్పు (మలవిసర్జన లేదా మూత్రవిసర్జనలో అసాధారణ మార్పు) A - A Sore ఒక పుండు (నయం కావడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది) U - Unusual అసాధారణం (శరీరంలోని ఏదైనా భాగం నుండి అసాధారణ రక్తస్రావం) T - Thickening గట్టిపడటం (రొమ్ము లేదా ఏదైనా భాగం యొక్క వాపు శరీరం. I- Indigestion స్పష్టమైన మార్పు (మొటిమల పెరుగుదల లేదా శరీరంలో ఏదైనా రకమైన మచ్చ) O- Obvious change అజీర్ణం (అజీర్ణం లేదా మింగడంలో ఇబ్బంది) N - Nagging cough దగ్గు(కోరింత దగ్గు) (దగ్గు లేదా ధ్వని కూర్చోవడం, స్వరంలో మార్పు) U - Unexplained Anaemia వివరించలేని రక్తహీనత (నయం కాని రక్తహీనత సమస్య) S - Sudden weight loss ఆకస్మిక బరువు తగ్గడం (ఆకస్మిక బరువు తగ్గడం) ధూమపానం.. పొగాకు వినియోగం (ధూమపానం లేదా గుట్కా) క్యాన్సర్‌కు ప్రధాన కారణం. ఇది భారతదేశంలోని 40 శాతం కేసులకు కారణమవుతోంది. కేవలం పొగాకు ఉత్పత్తులకు దూరంగా ఉంటే దాదాపు 10 రకాల క్యాన్సర్‌ల ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చిన్నతనం నుండే ఆహారపు అలవాట్లను మెరుగుపరచుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, వైద్యుల సలహా మేరకు క్రమం తప్పకుండా వైద్యులు సూచించిన విధంగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా భవిష్యత్తులో క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించవచ్చు. *రూపశ్రీ.
read moreపడుకునేముందు బాదం నూనెను బొడ్డుకు అప్లై చేస్తే జరిగేది ఇదే..!
భారతదేశం కళలకు పుట్టినిల్లు అని అంటారు. అంతేకాదు.. భారతదేశం ప్రాచీన సంపదకు కూడా నిలయం. ఇక్కడ కళల నుండి వైద్యం, సంస్కృతి, అలవాట్లు, సంప్రదాయాలు, పద్దతులు.. ఇలా చాలా విషయాలలో భారతదేశం గొప్పదే.. ముఖ్యంగా భారతదేశ ఆయుర్వేదానికి ప్రపంచ వ్యాప్తంగా కూడా పేరు, గుర్తింపు ఉన్నాయి. అలాంటి వాటిలో నాభిలో నూనె వేయడం కూడా ఒకటి. సాధారణంగా వాడుక భాషలో నాభిని బొడ్డు అని అంటారు. బిడ్డ తల్లి కడుపులో ఉన్నప్పుడు బొడ్డు నుండే తల్లి నుండి బిడ్డకు ఆహారం అందుతుంది. అందుకే బొడ్డుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. ప్రతి రోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో బాదం నూనె వేస్తే షాకింగ్ ఫలితాలు ఉంటాయని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు. దీని గురించి తెలుసుకుంటే.. బాదం నూనెలో పోషకాలు.. బాదం నూనెలో విటమిన్-ఎ, విటమిన్-ఇ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్రోటీన్లు, మెగ్నీషియం, బయోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రయోజనాలు.. బాదం నూనెను బొడ్డులో వేయడం వల్ల పనిభారం, ఒత్తిడి, కాలుష్యం మొదలైన వాటి కారణంగా చర్మం కోల్పోయిన గ్లోను తిరిగి తీసుకు వస్తుందట. ఇది ఒత్తిడిని నియంత్రిస్తుందని, బొడ్డు చుట్టూ ఉండే నాడీ వ్యవస్థను సక్రమం చేస్తుందని అంటారు. ముఖం వాడిపోయి కళా విహీనంగా ఉన్నవాళ్లు ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు బొడ్డులో కొన్ని చుక్కల బాదం నూనె వేస్తుంటే చర్మం కాంతివంతం అవుతుంది. రోజూ రాత్రి పడుకునేముందు బొడ్డులో బాదం నూనె కొన్ని చుక్కలు వేస్తుంటే జుట్టు రాలే సమస్య కూడా తగ్గుతుందట. ఇది నాడీ వ్యవస్థను సక్రియం చేయడం వల్ల రక్తప్రసరణ మెరుగవుతుంది. దీని వల్ల జుట్టు, చర్మానికి మేలు జరుగుతుంది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం బాదం నూనెలో బొడ్డులో వేస్తుంటే కడుపులో నొప్పి, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. *రూపశ్రీ.
read moreడయాబెటిస్ రోగులకు అలెర్డ్.. ప్రమాదాలు ముంచుకొస్తున్నాయ్..!
డయాబెటిస్.. చ క్కెర వ్యాధిగా పేర్కొనే డయాబెటిస్ నేటికాలంలో చాలా సహజమైన జబ్బుల జాబితాలో చేరిపోయింది. ఒకప్పుడు పెద్ద వయసు వారిలో కనిపించే జబ్బులన్నీ ఇప్పుడు చిన్న వయసు వారిలో కనిపిస్తున్నాయి. డయాబెటిస్ కూడా ఇప్పుడు చిన్న వయసులోనే అటాక్ ఇస్తోంది. అయితే డయాబెటిస్ రోగులు చాలా అలెర్ట్ గా ఉండాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీరికి చాలా ప్రమాదాలు పొంచి ఉన్నాయట. డయాబెటిస్ రోగుల గురించి చేసిన అధ్యయనంలో చాలా షాకింగ్ నిజాలు బయటపడినట్టు పరిశోధకులు చెబుతున్నారు. దీని గురించి పూర్తీగా తెలుసుకుంటే.. వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలో టైప్-2 మధుమేహం ప్రధానమైనది. 2022లో ప్రపంచవ్యాప్తంగా 83 కోట్ల మందికి పైగా మధుమేహంతో బాధపడుతున్నవారు ఉన్నారు. 183 దేశాలలో 90% కంటే ఎక్కువ మధుమేహం కేసులు టైప్-2 మధుమేహంవే. మధుమేహం అనేది అంత లైట్ తీసుకోవాల్సిన వ్యాధి కాదు. ఇది తీవ్రమైన వ్యాధి. ఇది శరీరాన్ని అనేక విధాలుగా ప్రభావితం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. దీనిపై సకాలంలో శ్రద్ధ చూపకపోతే, మధుమేహం (బ్లడ్ షుగర్) సమస్య పెరుగుతూ ఉంటే అది కళ్ళు, మూత్రపిండాలు, నరాలపై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో ఇప్పటికే మధుమేహం ఉన్నవారుంటే ఈ వ్యాధి ప్రమాదం గురించి మరింత జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. డయాబెటిక్ రోగులలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అని ఇటీవల జరిగిన పరిశోధనలలోో వెల్లడైనట్టు పరిశోధకులు చెబుతున్నారు. విటమిన్-డి తరువాత మెగ్నీషియం లోపం ఉంటుందట. ఈ రెండు పోషకాలు మంచి ఆరోగ్యానికి చాలా అవసరమైనవిగా పరిగణించబడతాయి. మధుమేహంతో బాధపడుతున్న వారిలో 60 శాతం మందికి పైగా విటమిన్ డి లోపం ఉన్నట్లు పరిశోధనలో తేలింది. విటమిన్ డి ఎముకలను బలంగా ఉంచడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి అవసరం. ఇది కాకుండా మధుమేహంతో బాధపడుతున్న 42 శాతం మందిలో మెగ్నీషియం లోపం కనిపిస్తోందట. మెగ్నీషియం ఎముకలు, కండరాలు, నరాలను నిర్వహించడానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి అవసరమైన ఒక ముఖ్యమైన ఖనిజం. పురుషుల కంటే మధుమేహం ఉన్న మహిళలకు సూక్ష్మపోషకాల లోపాల ప్రమాదం ఎక్కువగా ఉందని, ఇది వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. మధుమేహం, దాని వల్ల కలిగే అనేక సమస్యలను తగ్గించడంలో సూక్ష్మపోషకాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది గ్లూకోజ్ జీవక్రియ, ఇన్సులిన్ సెన్సిటివిటీని నిర్వహించడంలో కూడా పాత్ర పోషిస్తుంది. విటమిన్ బి 12 లోపం ప్రపంచవ్యాప్తంగా 29 శాతం మధుమేహ రోగులను కూడా ప్రభావితం చేస్తుందని, డయాబెటిస్ కోసం మందులు వాడే వారిలో ఇది మరింత ఎక్కువగా ఉందని తేలిందట. డయాబెటిస్ వల్ల ఎదురయ్యే ప్రమాదాలను డయాబెటిక్ రోగులందరూ అర్థం చేసుకుని తమ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పరిశోధకులు తెలిపారు. వైద్య సలహాపై సప్లిమెంట్లను కూడా తీసుకోవచ్చు. ఈ పోషకాలు లేకపోవడం వల్ల రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుకోవడం కష్టమవుతుంది. విటమిన్ డి, మెగ్నీషియం లోపం వల్ల ఏమి జరుగుతుంది? మధుమేహం సమస్య శరీరాన్ని లోపలి నుంచి బోలుగా మారుస్తుంది. ఎముకలను దెబ్బతీస్తుంది. అలాంటి పరిస్థితుల్లో విటమిన్ డి లోపం వల్ల భవిష్యత్తులో ఎముకల నొప్పులు, కండరాల బలహీనత, ఆస్టియోపోరోసిస్ వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని నిపుణులు తెలిపారు. విటమిన్ డి లోపం శరీరంలో కాల్షియం శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఇది ఎముకలను ఆరోగ్యంగా ఉంచడానికి చాలా ముఖ్యమైనది. మెగ్నీషియం లోపం టైప్ -2 డయాబెటిస్‌కు కారణం కావచ్చు. ఇది డయాబెటిస్ లక్షణాలను పెంచే సమస్య కూడా. మెగ్నీషియం లోపం అధిక రక్తపోటు, బోలు ఎముకల వ్యాధి, మూత్రపిండాల సమస్యలను పెంచుతుంది. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపిల్లలు ఎత్తు పెరగడం లేదా.. ఆహారంలో ఈ విటమిన్లు మిస్ అవుతున్నట్టే..!
ఎంత బిజీ లైఫ్ లో ఉన్నా సరే.. తల్లిదండ్రులు తమ పిల్లల సంరక్షణలో ఏ చిన్న విషయాన్ని వదిలిపెట్టరు. చదువు దగ్గర్నుంచి తిండి వరకూ ప్రతి చిన్నా పెద్దా విషయాలు దగ్గరుండి చూసుకుంటారు. అయితే ఇంత జరిగినా కూడా పిల్లల ఎత్తు పెరగకపోతే ఆందోళన చెందే తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. నిజానికి పిల్లలు శారీరకంగా ఎదుగుదల బాగుండాల్సిన వయసులో అలా లేకపోతే వారు తీసుకునే ఆహారంలో ఏదో లోపిస్తున్నట్టే లెక్క. పిల్లలు తగినంత ఎత్తు ఉండటం అనేది శరీర ఆకృతి అందంగా కనిపించడం కోసమే కాదు.. అది ఆరోగ్యానికి, ఫిట్ననెస్ కు కూడా సంబంధించిన విషయం. అయితే ఎత్తు తక్కువ అనే సమస్యతో బాధపడేవారు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. సాధారణంగా కొన్ని హార్మోన్ల లోపం ఈ సమస్యకు ప్రధాన కారణం. ఏ విటమిన్ లోపం వల్ల పిల్లల ఎత్తు పెరగడం లేదో తెలుసుకోవడం చాలా ముఖ్యం. గ్రోత్ హార్మోన్.. గ్రోత్ హార్మోన్ లోపం (GHD) తక్కువ ఎత్తుకు ప్రధాన కారణమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఇది మాత్రమే కాదు, విటమిన్ డి లోపానికి పిల్లల ఎత్తు తక్కువగా ఉండటానికి కూడా సంబంధం ఉంటుంది. విటమిన్ డి ఎముకలను బలపరుస్తుంది. ఎముకల అభివృద్ధికి కూడా అవసరం. ఇలాంటి పరిస్థితిలోో శరీరంలో విటమిన్ డి లోపం ఉంటే, అది నేరుగా ఎత్తును ప్రభావితం చేస్తుంది. పిల్లల ఎత్తు, ఎముకల అభివృద్ధికి విటమిన్ డి ముఖ్యమైనది. 10 ml కంటే తక్కువ విటమిన్ లోపం సంవత్సరానికి 0.6 cm ఎత్తులో తక్కువ పెరుగుదలకు దారితీస్తుంది. విటమిన్-డి లోపం ఉంటే పిల్లలలో కింది లక్షణాలు ఉింటాయి. ఎముకల నొప్పి, త్వరగా అలసిపోవడం, జుట్టు రాలడం, నిద్రపోవడం, ఎప్పుడూ కోపంగా ఉండడం వంటి లక్షణాలు ఉంటాయి. పిల్లలో విటమిన్-డి లోపం అధిగమించాలంటే ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేపాలి. ఉదయం సమయంలో సూర్యుడి లేత కిరణాలలో పిల్లలను కొంత సమయం గడిపేలా ఎంకరేజ్ చేయాలి. ఎన్ని సప్లిమెంట్లు తీసుకున్నా సహజంగా లభించే విటమిన్-డి శరీరాన్ని చాలా తొందరగా రికవర్ అయ్యేలా చేస్తుంది. అలాగే పాలు, గుడ్డులోని పసుపు భాగం తినాలి. నారింజ వంటి సిట్రస్ పండ్లను తినాలి. ఇవన్నీ చేస్తే పిల్లలో ఎత్తు పెరుగుదల గమనించవచ్చు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreఎంత ట్రై చేసినా బరువు తగ్గడం లేదా.. ఇవే కారణాలు కావచ్చు..!
అధిక బరువు ఇప్పట్లో చాలా మందిని వేధిస్తున్న సమస్య. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో సహా చాలా రకాల కారణాలు బరువు మీద ప్రభావం చూపిస్తాయి. ఆరోగ్యం మీద స్పృహ పెరుగుతున్న నేటికాలంలో అధిక బరువును వదిలించుకోవడానికి చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా బరువు తగ్గడంలో ఫెయిల్ అవుతున్న వారే ఎక్కువ. జిమ్ చేసినా, నడక, వ్యాయామం, డైటింగ్.. ఇలా ప్రతిదీ బరువు తగ్గడానికి చేసే ప్రయత్నమే.. వీటి వల్ల ఫలితాలు రావడం లేదంటే దీని వెనుక ఇతర కారణాలు చాలా ఉంటాయి. కేలరీలు.. బరువు తగ్గడానికి ప్రయత్నం చేసేవారు ఆహారం తీసుకోవడం లో జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ రోజూ ఎన్ని కేలరీల ఆహారాన్ని తింటున్నారో అర్థం చేసుకోరు. ఎన్ని కేలరీల ఆహారం తీసుకుంటున్నాం, ఎన్ని కేలరీలు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేయగలుగుతున్నాం అనే విషయం చాలా మంది తెలుసుకోరు. ఇది బరువు తగ్గకపోవడానికి కారణం అవుతుంది. బరువు తగ్గాలి అంటే శరీరంలోకి వెళ్లే కేలరీలకు తగినట్టు శారీరక శ్రమ ద్వారా ఖర్చు చేసే కేలరీలు కూడా ఎక్కువే ఉండాలి. నిద్ర.. నిద్ర సరిగా లేకపోతే శరీరంలో హార్మోన్ల అసమతుల్యత దెబ్బ తింటుంది. ఇది ఆకలిని పెంచుతుంది. బరువు తగ్గడాన్ని కష్టం చేస్తుంది. అందుకే బరువు తగ్గడంలో మంచి ఫలితాలు రావాలి అంటే మంచి నిద్ర అవసరం. నీరు.. నీరు శరీరానికి చాలా ముఖ్యమైనది. ఇది జీవక్రియను పెంచుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. రోజూ కనీసం 3 లీటర్లకు పైగా నీరు తీసుకోవడం తప్పనిసరి. లేకపతే బరువు తగ్గడం కష్టం అవుతుంది. ఒత్తిడి.. చాలామంది ఒత్తిడితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఒత్తిడి అనేది మనిషి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ఒత్తిడి వల్ల సరిగా నిద్ర పట్టకపోవడం, ఆహారం ఎక్కువగా తినడం, హార్మన్ల అసమతుల్యత, కోపం, చిరాకు, అసహనం వంటివి ఉంటాయి. ఇవన్నీ బరువు పెరగడానికి కారణం అవుతాయి. కార్డియో.. బరువు తగ్గడానికి చాలా మంది వ్యాయామాలు చేస్తారు.అయితే వ్యాయామంలో కార్డియో వ్యాయామాలు మాత్రమే చేస్తుంటారు. కండరాలను బలంగా చేసే పనిపై దృష్టి పెట్టకపోతే జీవక్రియ వేగం మందగిస్తుంది. దీని వల్ల కూడా బరువు తగ్గే అవకాశం ఉండదు. ప్రోటీన్.. ఆహారంలో ప్రోటీన్ తప్పనిసరిగా ఉండాలి. ఇది కండరాలను నిర్మించడంలో సహాయపడుతుంది. ఆకలిని తగ్గిస్తుంది. జీవక్రియను కూడా పెంచుతుంది. అందుకే ఆహారంలో ప్రోటీన్ తగ్గినా బరువు తగ్గడంలో ఫలితాలు కనిపించవు. ఫైబర్.. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండాలంటే ఫైబర్ తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది జీవక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని అనుకునేవారు ఫైబర్ ఆహారాన్ని బాగా తీసుకోవాలి. ఆరోగ్య సమస్యలు.. కొందరిలో ఆరోగ్య సమస్యలు కూడా బరువు పెరగడానికి కారణం అవుతాయి. ముఖ్యంగా థైరాయిడ్, పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వంటి సమస్యలు, ఏదైనా అనారోగ్య సమస్యతో మందులు వాడుతున్నవారు బరువు పెరుగుతారు. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreశరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందంటే..!
శరీరానికి ప్రోటీన్లు, విటమిన్ల మాదిరిగానే ఖనిజాలు కూడా అవసరం అవుతాయి. శరీరానికి చాలా అవసరమైన ఖనిజాలలో మెగ్నీషియం ముఖ్యమైనది. మెగ్నీషియం లోపించడం వల్ల శరీరంలో కొన్ని లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే దాన్ని హైపోమాగ్నేసిమియా అని పిలుస్తారు. ఇది చాలా రకాల ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే ఏం జరుగుతుందో తెలుసుకుంటే.. మెగ్నీషియం కండరాల సంకోచాలను నియంత్రిస్తుంది. దీని లోపం కారణంగా కండరాల తిమ్మిరి, బలహీనత తీవ్రమవుతాయి. ఇవి రూజువారి జీవనశైలిని చాలా ఇబ్బంది పెడతాయి. మెగ్నీషియం శరీరం శక్తివంతంగా ఉండటంలో సహాయపడుతుంది. కానీ మెగ్నీషియం లోపిస్తే తీవ్రమైన అలసట, నీరసం ఏర్పడతాయి. చాలా బలహీనంగా అనిపిస్తుంది. ఏ చిన్న పని పూర్తీ చేయడానికి కూడా చాలా కష్టపడాల్సి వస్తుంది. గుండె ఆరోగ్యం గా ఉండాలన్నా మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం. ఇది గుండె స్పందనను, రక్తపోటును సక్రమంగా ఉండేలా చేస్తుంది. అదే మెగ్నీషియం లోపిస్తే హృదయ స్పందన రేటు తారుమారు అవుతుంది. రక్తపోటు కూడా అస్తవ్యస్తంగా మారుతుంది. ఒత్తిడి, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే మెగ్నీషియం తప్పనిసరిగా అవసరం. అదే మెగ్నీషియం లోపిస్తే మానసిక ఆరోగ్యం దెబ్బతింటుంది. అసహనం, కోపం, చిరాకు, ఒత్తిడి మొదలైన సమస్యలు పెరుగుతాయి. అంతేకాదు.. మెగ్నీషియం లోపం ఉన్నవారికి ఎముకలు చాలా బలహీనంగా ఉంటాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంటుంది. సరిగా నిద్రపట్టకపోవడం, జీర్ణవ్యవస్థ దెబ్బతినడం వంటి సమస్యలు కూడా కలుగుతాయి. *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...
read moreపాలకూర ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా తింటే ఏమవుతుందో తెలుసా?
ఆకుకూరలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఆకు కూరలలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే ఆహారంలో ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలని చెబుతారు. ఆకుకూరలలో పాలకూర చాలా ఆదరణ పొందింది. పాలకూరను కేవలం పప్పు గానే కాకుండా పనీర్ కూరలు, పాలక్ చపాతీ, పాలకూర పులావ్.. పాలకూరను నాన్ వెజ్ తో కలిపి వండటం వంటి ప్రయోగాలు కూడా చేస్తుంటారు. పాలకూర ఆరోగ్యానికి చాలామంచిది.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని పాలకూరను ఎక్కువగా తీసుకోవడం అస్సలు మంచిది కాదట. పాలకూర ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలేంటో తెలుసుకుంటే.. పాలకూరలో అధిక మొత్తంలో ఆక్సలేట్లు ఉంటాయి. దీని కారణంగా పాలకూరను అధికంగా తింటే కిడ్నీల రాళ్లు ఏర్పడే ప్రమాదం. కొందరు పాలకూర తినడానికి సంకోచించేది కూడా ఈ కారణంతోనే. మరీ ముఖ్యంగా ఇప్పటికే రాళ్ల సమస్య ఉన్నా.. వంశంలో ఎవరికైనా రాళ్ల సమస్య ఉన్నా.. పాలకూర తినడం మానేయడం మంచిదని ఆహార నిపుణులు అంటున్నారు. గిన్నెడు పాలకూరను వండినా అది ఓ కప్పు అంత మాత్రమే అవుతుంది. ఇది వేడికి చాలా మెత్తగా అయిపోతుంది. అయితే పాలకూరను తినడం వల్ల కొందరిలో గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయి. ఇది జీర్ణం కావడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఇప్పటికే జీర్ణ సంబంధ సమస్యలు, గ్యాస్ , ఉబ్బరం వంటి సమస్యలు ఉన్నవారు పాలకూరను తినడం మంచిది కాదు. థైరాయిడ్ సమస్య ఉన్నవారికి పాలకూర అస్సలు మంచిది కాదు.. పాలకూరలో గోయిట్రోజెన్లు ఉంటాయట. ఇవి థైరాయిడ్ గ్రంథి పనితీరును దెబ్బతీస్తాయి. దీని కారణంగా థైరాయిడ్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే పాలకూరను అతిగా తినకూడదు. పాలకూర తినడం వల్ల అలెర్జీ కూడా ఉంటుంది. కొందరికి పాలకూర తినడం వల్ల శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చర్మం పైన దురద, దద్దుర్లు రావడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. పాలకూరను ఎక్కువగా వినియోగించని వారు.. ఆకుకూరలంటే ఇష్టం ఉన్నవారు పాలకూరను ఎడాపెడా తినకూడదు. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు... *రూపశ్రీ.
read moreఏ పోషకాలు లోపించడం వల్ల జుట్టు బాగా రాలిపోతుందో తెలుసా?
జుట్టు రాలడం అనేది చాలా మంది ఎదుర్కునే సాధారణ సమస్య. అయితే అమ్మాయిలే దీనికి ఎక్కువ బాధితులుగా ఉంటారు. అలాగే జుట్టు రాలుతోందని ఆందోళన చెందేవారిలో కూడా అగ్రభాగం అమ్మాయిలే ఉంటారు. అయితే వాతావరణం, కేశ సంరక్షణ కోసం ఉపయోగించే ఉత్పత్తులు.. జీవనశైలి మొదలైనవి మాత్రమే కాకుండా తీసుకునే ఆహారం కూడా జుట్టు రాలడానికి కారణం అవుతుంది. ఆహారంలో కొన్ని పోషకాలు లోపిస్తే జుట్టు బాగా రాలిపోతుందట. ఇంతకీ ఆ పోషకాలు ఏంటో తెలుసుకుంటే.. ఐరన్.. ఐరన్ అనేది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలను మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. మహిళలు ఐరన్ బాగా తీసుకోవాలని చెబుతారు. ఐరన్ లోపం ఉన్న మహిళలలో జుట్టు చాలా పలుచగా ఉంటుంది. అలాగే జుట్టు రాలిపోవడం, జుట్టు రాగి రంగులో ఉండటం వంటి సమస్యలు కూడా ఉంటాయి. ఐరన్ లోపం ఉంటే జుట్టు మూలాలకు ఆక్సిజన్ సరఫరా సరిగా ఉండదు. అందుకే జుట్టు సమస్యలు వస్తాయి. జింక్.. జింక్ కూడా శరీరానికి చాలా అవసరమైన ఖనిజం. ఇది శరీరంలో కణజాలాన్ని రిపేర్ చేయడానికి కణజాలం పెరుగుదలకు, కణజాలం ఆరోగ్యంగా ఉండటానికి చాలా సహాయపడుతుంది. జింక్ లోపిస్తే జుట్టు రాలిపోయే సమస్య ఎక్కువ ఉంటుంది. బయెటిన్.. బయోటిన్ జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యమైన పోషకం. బయోటిన్ ఆధారిత షాంపూలు, సీరమ్ లు, కండీషనర్లు మార్కెట్లో చాలా అందుబాటులో ఉంటాయి. బయోటిన్ లోపిస్తే జుట్టు పెళుసుగా మారుతుంది. తొందరగా విరిగిపోతుంది. జుట్టు బాగా రాలిపోతుంది. ప్రోటీన్లు.. జుట్టు ఆరోగ్యానికి ప్రోటీన్లు కూడా చాలా ముఖ్యం. జుట్టు కెరాటిన్ తో తయారు అవుతుంది. ఇది ఒక రకమైన ప్రోటీన్. ఇవి లోపిస్తే జుట్టు రాలే సమస్య పెరుగుతుంది. తిరిగి జుట్టు పెరుగుదలలో ఎలాంటి మెరుగుదల కనిపించదు. విటమిన్-ఇ.. విటమిన్-ఇ అనేది గొప్ప యాంటీ ఆక్సిడెంట్. ఇది తలలో రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. దీని లోపం వల్ల జుట్టు రాలుతుంది. ఇప్పట్లో చాలా కేశ సంరక్షణ ఉత్పత్తులలో విటమిన్-ఇ చేర్చబడి ఉంటుంది. అప్పటికి ఈ విటమిన్-ఇ అనేది జుట్టుకు ఎంత అవసరమో అర్థం చేసుకోవచ్చు. విటమిన్-డి.. విటమిన్-ఇ లాగానే విటమిన్-డికూడా జుట్టు పెరుగుదలకు చాలా ముఖ్యం. ఇది వెంట్రుకల కుదుళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది. అదే విటమిన్-డి లోపిస్తే కుదుళ్లు బలహీనపడతాయి. జుట్టు రాలడానికి కారణం అవుతుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు... *రూపశ్రీ.
read moreసలాడ్ తినే అలవాటుందా? ఈ అయితే ఈ నిజాలు తెలుసుకోండి..!
ఈమద్యకాలంలో చాలామంది ఓ ఆహారపు అలవాటును బాగా ఫాలో అవుతున్నారు. అదే సలాడ్. కొందరు పండ్లతో సలాడ్ తింటే.. మరికొందరు పచ్చిగా తినదగిన కూరగాయలతో సలాడ్ చేసుకుని తింటూంటారు. ఇది శరీరానికి ఆరోగ్యాన్ని, విటమిన్లను, పైబర్ ను సమృద్దిగా అందిస్తుందని.. బరువు నిర్వాహణలో తోడ్పడుతుందని చెబుతారు. అయితే సలాడ్ లు ఎప్పుడు తినాలి? ఏ సమయంలో తినాలి? ఎలా తింటే ఆరోగ్యం? ఎప్పుడు తినకూడదు? తెలుసుకుంటే.. సలాడ్ తింటే కలిగే ప్రయోజనాలు.. సలాడ్ లో చాలావరకు పచ్చికూరగాయలు ఉంటాయి. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి ఇది ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలోపేతం అవుతుంది. మలబద్దకం సమస్య తగ్గిపోతుంది. చర్మం లోపలి కణాలు, శరీరానికి బయట కలిగే గాయలను తొందరగా తగ్గించడంలో సలాడ్లు తినడం సహాయపడుతుంది. దోసకాయ, బీట్ రూట్, పచ్చి ఉల్లిపాయ,నిమ్మకాయ, టమోటా మొదలైనవి పచ్చిగా తీసుకుంటే కాలేయ ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. చలికాలంలో సలాడ్ తినడం గురించి చాలామంది సందిగ్ధంలో ఉంటారు. దీనికి కారణం పచ్చి కూరగాయలు తినడం వల్ల జలుబు, దగ్గు, తలనొప్పి వంటి సమస్యలు సులువుగా వస్తాయని. అయితే చలికాలంలో క్యారెట్, ముల్లంగి, క్యాబేజీ, ముల్లంగి రుచితో బీట్రూట్ ఆకారంలో ఉండే టర్నిప్ దుంపలు చలికాలపు సలాడ్ లో జోడించుకోవచ్చు. ఇవే కాకుండా పండ్లు కూడా తీసుకోవచ్చు. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి కొరత ఉండదు. సలాడ్ తినడానికి సరైన సమయం.. చాలామంది సలాడ్ అంటే ఎక్కువగా కీరా, క్యారెట్, టమోటాలను తింటూంటారు. వీటిని కూడా భోజనంతో పాటు తింటూంటారు. ముఖ్యంగా బిరియానీలతో పచ్చి ఉల్లిపాయ, క్యారెట్, నిమ్మకాయ, టమోటా వంటివి ఇవ్వడం చూస్తుంటాం. వీటిని ఉడికించిన ఆహారంతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ మందగిస్తుంది. జీర్ణసమస్యలు ఎదురవుతాయి. ఉడికించిన ఆహారంలో ఉష్టోగ్రత, ఆహారం గుణాలు, సలాడ్ లోని ఉష్టోగ్రత, వాటి గుణాలు రెండూ వేరు వేరు కాబట్టి ఇది జరుగుతుంది. అందుకే సలాడ్ లను ఎప్పుడూ ఆహారానికి అరగంట ముందు తీసుకోవాలి. లేదా ఉదయం కాస్త ఆకలిగా ఉన్నప్పుడు కూడా తీసుకోవచ్చు. ఆహారంతో ఎందుకు తినకూడదంటే.. ఆహారంతో పాటు సలాడ్లు తీసుకోకూడదు అనడానికి మరిన్ని కారణాలు ఉన్నాయి. ఆహార స్థితిని బట్టి దాన్ని జీర్ణం చేయడానికి శరీరంలో కాలేయం ఎంజైమ్ లను విడుదల చేస్తుంది. దీనివల్లే ఆహారం జీర్ణం అవుతుంది. కానీ సలాడ్లు ఆహారంతో తీసుకోవడం వల్ల కాలేయం ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మరొక కారణం ఏమిటంటే.. చల్లని ఆహారం, ఉడికించిన ఆహారం రెండూ కలిపి తింటే ఆయుర్వేదం ప్రకారం జఠరాగ్ని మందగిస్తుంది. జఠరాగ్ని అనేది ఆహారాన్ని జీర్ణం చేసే శక్తి. సలాడ్లు ఆహారంతో కలిపి తీసుకోవడం దీర్ఘకాలం కొనసాగితే జీర్ణశక్తి మందగిస్తుంది. *నిశ్శబ్ద.
read moreపసుపు ఆరోగ్యానికి మంచిదే.. కానీ ఎక్కువగా వాడితే ఈ నష్టాలు తప్పవు..!
పసుపు భారతీయ వంటింట్లో తప్పనిసరిగా ఉండే పదార్థం. పసుపును వంటల నుండి వైద్యం వరకు చాలా రకాలుగా వాడతారు. పసుపు గొప్ప ఔషద గుణాలు కలిగి ఉంటుందని ఆయుర్వేదం చెబుతోంది. పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. అందుకే ఏదైనా దెబ్బ తగలగానే మొదట పసుపు పెడతారు. ఇది రక్తస్రావం ఎక్కువ జరగకుండా చేస్తుంది. ఇక చర్మ సంరక్షణలో కూడా పసుపు వాడకం ఎక్కువే.. పచ్చి పసుపు, ఛాయ పసుపు.. కస్తూరి పసుపు .. ఇలా చాలా రకాలే ఉన్నాయి. పసుపు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అయితే పసుపు ఆరోగ్యానికి మంచిదే కానీ.. పసుపును ఎక్కువగా వాడితే దాని వల్ల నష్టం కూడా తప్పదట. ఇంతకీ వసుపు వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుంటే.. పసుపు ఆరోగ్యానికి మంచిదే కానీ దాన్ని ఎక్కువగా వాడితే అది అతిసారం సమస్యకు కారణం అవుతుంది. గ్యాస్, అపానవాయువు, డయేరియా వంటి సమస్యలకు దారి తీస్తుంది. అందుకే పసుపును మితంగానే వాడాలి. రక్తం చాలా చిక్కగా ఉన్న వ్యక్తులు రక్తం పలుచ బడటానికి మందులు వాడుతుంటారు. ఇలాంటి వారు పసుపును చాలా జాగ్రత్తగా వాడాలి. పసుపును అతిగా తీసుకోవడం వల్ల రక్తానికి సంబంధించిన సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. పసుపు వేడి స్వభావం కలిగి ఉంటుంది. దీన్ని అధికంగా వాడితే ఇది శరీరంలో వేడిని పుట్టిస్తుంది. ఫలితంగా చర్మం పైన దద్దుర్లు, మంట, దురద వంటివి కలిగిస్తుంది. చర్మం లోపలి నుండి వాపులు కూడా కలిగిస్తుంది. అందుకే పసుపును అతిగా వాడకూడదు. పసుపును ఎక్కువగా వాడితే కిడ్నీలో రాళ్లు వచ్చే ప్రమాదం ఉంటుందట. కిడ్నీ స్టోన్స్ మాత్రమే కాకుండా తలనొప్పి సమస్య కూడా రావచ్చట. అందుకే పసుపును అధికంగా తినకూడదు. పసుపు గర్బాశయ కండరాలను ఉత్తేజ పరుస్తుంది. అందుకే గర్బిణీ స్త్రీలు పసుపును ఎక్కువగా తీసుకోకూడదు. ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం. *రూపశ్రీ.
read moreకంటి నుండి కిడ్నీల వరకు సమస్యలను పెంచే చిన్న పొరపాటు ఇది..!
శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే సరైన జీవనశైలి, సమతుల ఆహారాన్ని తీసుకోవడం తో పాటు కొన్ని విషయాలలో ఎక్కువ శ్రద్ధ చూపడం చాలా ముఖ్యం. ఈకాలంలో మధుమేహం, రక్తపోటు సమస్యలు యువతలో కూడా కనిపిస్తున్నాయి. ఇది చాలా మందిని ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ రెండింటినీ అదుపులో ఉంచుకోవడం చాలా అవసరం. చాలామంది షుగర్ లెవల్ పెరగడం గురించి చాలా నిర్లక్ష్యంగా ఉంటారు. చిన్న వయసే కదా ఏమవుతుందిలే.. మందులతో నియంత్రణ చేసుకోవచ్చులే అని నిర్లక్ష్యం చేస్తారు. అయితే షుగర్ లెవెల్ పెరగడం అనే చిన్న పొరపాటు వల్ల కలిగే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకుంటే.. ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతున్న ఆరోగ్య సమస్యలలో మధుమేహం ఒకటి. ఒక అంచనా ప్రకారం 2024 సంవత్సరంలో భారతదేశంలో డయాబెటిస్తో బాధపడుతున్న వారి సంఖ్య 212 మిలియన్లు. అంటే 21 కోట్లకు పైగా భారతీయులు మధుమేహంతో బాధపడుతున్నారు. ఇది ప్రపంచంలోని మొత్తం రోగులలో 26%. అధిక చక్కెర స్థాయిలు ఉండటం వల్ల శరీరం చాలా విధాలుగా నష్టపోతుంది. మూత్రపిండాల నుండి కళ్ళు, రోగనిరోధక శక్తి వరకు ప్రతిదానిపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆరోగ్య నిపుణులు ఏం చెప్పారంటే.. ఆరోగ్య నిపుణులు మధుమేహం తీవ్రమైన ఆరోగ్య సమస్య అని, శరీరంలోని అనేక ఇతర అవయవాలకు కూడా తీవ్రమైన హానిని కలిగిస్తుందని చెబుతున్నారు. రక్తంలో చక్కెర ఎక్కువగా ఉన్న సమస్యను హైపర్గ్లైసీమియా అంటారు. దీని బారిన పడిన వ్యక్తులు అంటు వ్యాధులు, కిడ్నీ వ్యాధి, చూపు మందగించడం వంటి అనేక సమస్యలను ఎదుర్కొంటారు. మధుమేహం సమస్య ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని వైద్యులు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ఉండాలి. కొన్నిసార్లు రక్తంలో అధికంగా చక్కెర స్థాయిలు ఉండటం వల్ల ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కళ్లు, కిడ్నీ.. హై బ్లడ్ షుగర్ సమస్య (హైపర్గ్లైసీమియా) కంటి రక్తనాళాలను దెబ్బతీయడం ప్రారంభిస్తుంది. దీని కారణంగా అస్పష్టమైన దృష్టి సమస్య రావచ్చు. ఇది మాత్రమే కాదు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో కాకుండా తరచుగా ఎక్కువగా ఉంటే, అది కంటి చూపు పోవడానికి కూడా దారి తీస్తుంది. మధుమేహం వల్ల వచ్చే కంటి సమస్యలను డయాబెటిక్ రెటినోపతి అంటారు. అదేవిధంగా రక్తంలో చక్కెర స్థాయి ఎక్కువగా ఉంటే అది మూత్రపిండాలను దెబ్బతీస్తుంది. ఇది దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధికి దారితీస్తుంది. రక్తంలో అధిక చక్కెర మూత్రపిండాల రక్తనాళాలను దెబ్బతీస్తుంది, అవి పాడైపోయే ప్రమాదం ఉంది. గాయాలు.. మధుమేహ వ్యాధిగ్రస్తులలో గాయాలు చాలా సాధారణం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, హైపర్గ్లైసీమియా రోగనిరోధక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తుంది. దీని కారణంగా గాయాలను నయం చేయడానికి శరీరం ప్రతిస్పందన నెమ్మదిగా మారుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు రోజులలో మానాల్సిన గాయాలు మానడానికి కొన్ని నెలలు పట్టవచ్చు. ఇన్పెక్షన్.. హైపర్గ్లైసీమియా కారణంగా, రోగులలో సంక్రమణ ప్రమాదం ఇతర వ్యక్తుల కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి రోగులకు తీవ్రమైన మూత్రపిండ సమస్యలను కలిగించే మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ల ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. హైపర్గ్లైసీమియాకు కారణమయ్యే ఇన్ఫెక్షన్లు శరీరంలో ఒత్తిడి ప్రతిస్పందనకు దారితీస్తాయి, ఇది కార్టిసాల్, అడ్రినలిన్ హార్మోన్ స్రావాన్ని పెంచుతుంది. *రూపశ్రీ.
read moreఈ మూడు ఆహారాలు తింటే చాలు.. బాడీ స్టామినా అదే పెరుగుద్ది..!
శరీరాన్ని కాపాడటంలో స్టామినాది చాలా ముఖ్యమైన పాత్ర. ఇది శరీరాన్ని తొందరగా అలసిపోకుండా చేయడంలో, పెద్ద పెద్ద పనులను సునాయాసంగా చేయడంలో, ఏదైనా శారీరక ఇబ్బంది ఏర్పడినా దాన్ని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో సహాయపడుతుంది. కానీ స్టామినా తక్కువ ఉంటే శరీరం తొందరగా అలసిపోతుంది. బాగా నీరసంగా అనిపిస్తుంది. ఎప్పుడూ శరీరానికి ఏదో జబ్బు పడ్డట్టు ఉంటుంది. అయితే స్టామినాను పెంచుకోవడం తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం మూడు ఆహారాలు తింటూ ఉంటే చాలు.. శరీర స్టామినా ఊహించని విధంగా పెరుగుతుందట. ఇంతకీ ఆ ఆహారాలు ఏంటో తెలుసుకుంటే.. బాదం.. బాదం పప్పు స్టామినా పెరగడానికి బాగా సహాయపడుతుందట. బాదం పప్పులో ప్రోటీన్, విటమిన్-ఇ, ఐరన్ వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరానికి అమితమైన బలాన్ని ఇవ్వడమే కాకుండా శరీరం బరువు పెరగకుండా చేస్తుంది. మెదడుకు పదును పెడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది. అరటిపండ్లు.. అరటిపండ్లలో విటమిన్లు సమృద్దిగా ఉంటాయి. ఇందులో ఫైబర్, పొటాషియం ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని ఇస్తాయి. రోజూ ఒక అరటిపండు అయినా తింటూ ఉంటే బాడీ స్టామినా అనూహ్యంగా పెరుగుతుంది. వ్యాయామం చేసేవారు, ఫిట్ నెస్ ను తమ దినచర్యలో ఉంచుకునేవారు అరటిపండ్లు తప్పనిసరిగా తింటారు. అరటిపండ్లు డోపమైన అనే హార్మోన్ ను ప్రోత్సహిస్తాయి. ఇది అలసటను, పనిచేసేటప్పుడు నీరసం రాకుండా చేస్తుంది. ఆకుపచ్చ ఆకుకూరలు.. ఆకుకూరలను ప్రతిరోజూ తీసుకునేవారి శరీర స్టామినా మెరుగ్గా ఉంటుంది. ఇది శరీరానికి శక్తి పెంచడంలో బాగా సహాయపడుతుంది. ఆకుకూరలలో విటమిన్-ఎ, కాల్షియం, ఐరన్ వంటి పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా పాలకూర, మెంతికూర, మునగ ఆకు, బచ్చలికూర ఆహారంలో తీసుకోవడమే కాకుండా.. ఆకుకూరల జ్యూస్ కూడా తీసుకోవచ్చు. *రూపశ్రీ.
read moreఫ్యాట్ బర్నింగ్ ఫుడ్స్.. ఈ ఆహారాలు తింటే పొట్ట కొవ్వు ఐస్ లా కరుగుతుంది..!
బరువు తగ్గడానికి ఏమి తినాలి, వేగంగా బరువు తగ్గడానికి ఏమి తినాలి, పొట్ట కొవ్వు తగ్గడానికి ఉదయాన్నే ఏమి తినాలి, వేగంగా బరువు తగ్గడానికి ఏ ఆహారం సహాయపడుతుంది? ఇప్పట్లో చాలా మంది నెట్టింట్లో సెర్చ్ చేస్తున్న విషయం ఇది. దీనికి తగ్గట్టే ఈ కాలంలో చాలా మంది బానడంత పొట్టతోనూ, అధికబరువు తోనూ ఇబ్బంది పడుతున్నారు. ఊబకాయం అందాన్ని పాడు చేయడమే కాకుండా క్యాన్సర్, మధుమేహం నుండి గుండెపోటు వరకు అనేక ప్రాణాంతక వ్యాధుల వైపు ప్రజలను నెట్టివేస్తుంది. ముఖ్యంగా చాలా మంది పొట్ట, నడుము చుట్టూ కొవ్వు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు, ఆరోగ్యకరమైన ఆహారం మైంటెన్ చేసినా జిమ్‌కి వెళ్లినా ఈ పొట్ట కొవ్వు మాత్రం తగ్గదు. పొట్ట తగ్గాలంటే తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తినాలి. ఇవి పొట్టను తగ్గిస్తాయి. ఈ ఆహారాల లిస్ట్ తెలుసుకుంటే.. దోసకాయ.. దోసకాయలో కేలరీలు తక్కువ, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది. 104 గ్రాముల దోసకాయలో 16 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇందులోని ఫైబర్ ప్రేగు కదలికలకు సహాయపడుతుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. దోసకాయలు ఎక్కువగా నీరుతో నిండి ఉంటాయి., ఇది ఆకలిని తగ్గిస్తుంది. ఇందులో చక్కెర ఉండదు కాబట్టి ఇ బరువు పెరుగుతామనే ప్రశ్నే ఉండదు. పార్స్లీ.. పార్స్లీ ఆకులు ఫైబర్, పోషకాలకు మంచి మూలం. కేలరీలు తక్కువగా ఉంటాయి. బరువు తగ్గడానికి ఇది గొప్ప ఆహారంగా సహాయపడుతుంది. పార్స్లీలో ఉండే పీచు ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉండేందుకు సహాయపడుతుంది. పార్స్లీలో 95% నీరు ఉంటుంది. కాబట్టి ఇది హైడ్రేటెడ్‌గా ఉండటానికి సహాయపడుతుంది. పుచ్చకాయ.. పుచ్చకాయ బరువు తగ్గడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఇందులో ఎక్కువగా నీరు ఉంటుంది. విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పుచ్చకాయ గింజలు ఫైబర్, ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వుల మంచి మూలం. పుచ్చకాయలో 90% నీరు ఉంటుంది. కాబట్టి ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పుచ్చకాయలో విటమిన్ ఎ, సి అధికంగా ఉంటాయి, ఇది జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. పుచ్చకాయ గింజల్లో ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉండేందుకు, ఆకలిని తగ్గించడంలో సహాయపడతాయి. గుమ్మడికాయ.. గుమ్మడికాయ తక్కువ కేలరీల కూరగాయ. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. ఇందులో ఫైబర్, నీరు అధికంగా ఉంటాయి. ఇది కడుపు నిండుగా అనిపించేలా, తక్కువ తినడానికి సహాయపడుతుంది. పాస్తా లేదా బియ్యం వంటి అధిక కేలరీల పదార్థాలకు ప్రత్యామ్నాయంగా కూడా దీనిని ఉపయోగించవచ్చు. ఇది 100 గ్రాములకు దాదాపు 17 కేలరీలు కలిగి ఉంటుంది. ఇందులో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియను నెమ్మది చేస్తుంది. ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. బ్రోకలీ.. బ్రోకలీ బరువు తగ్గడానికి మంచి ఎంపిక. ఎందుకంటే ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇవి కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తాయి. రక్తంలో చక్కెరను నియంత్రించడంలో, జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి. బ్రోకలీలో విటమిన్ ఎ, సి, కె అలాగే ఫోలేట్, పొటాషియం ఉంటాయి. బ్రోకలీలో ఉండే సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఆకలిని అణిచివేసేందుకు, రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. పైన పేర్కొన్న ఆహారాలే కాకుండా టొమాటోలు, పుట్టగొడుగులు, పాలకూర, క్యాబేజీ, బ్లాక్ కాఫీ వంటివి ఆహారంలో చేర్చుకుంటే మంచిది. బ్లాక్ కాఫీలో కెఫిన్ ఉంటుంది. ఇది అధిక ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. అయితే అధిక కెఫీన్ మంచిది కాదు. *రూపశ్రీ.
read moreచలికాలంలో ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఈ అయిదు రకాల సూప్ లు ట్రై చేయండి..!
చలికాలం శరీరాన్ని చాలా ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజుల్లో తీసుకునే ఆహారం స్థానంలో చాలా మార్పులు జరుగుతాయి. ముఖ్యంగా చలికాలంలో వేడిగా ఉన్న ఆహారాలు కానీ పానీయాలు కానీ తీసుకోవాలని అనిపిస్తుంది. అయితే వేడిగా ఉన్న లిక్విడ్ ఆహారాలు తీసుకునే విషయంలో కాఫీ, టీ వంటి డ్రింక్స్ ఏ మొదటి స్థానంలో ఉంటాయి. కానీ చలికాలంలో ఆరోగ్యంగా ఉండాలంటే సూపులు బెస్ట్ ఆప్షన్. ఇవి ఒకవైపు శరీరానికి ఓదార్పును ఇస్తూ.. మరొకవైపు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఫలితంగా చలికాలంలో ఇన్ఫెక్షన్లు, అనారోగ్యం చేయడం, సీజన్ సమస్యల నుండి ఊరట లభిస్తుంది. ఇంతకీ శరీరానికి అంతగా మేలు చేసే సూపులు ఏంటో.. వాటిలో ఉండే పోషకాలు ఏంటో తెలుసుకుంటే.. పాలకూర, బఠానీ సూప్.. పాలకూర ఐరన్ కంటెంట్ కు ప్రసిద్ధి చెందింది. రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడేవారు పాలకూర సమృద్దిగా తీసుకుంటే మంచిదని వైద్యులు చెబుతారు. ఇకపోతే పాలకూర, బఠానీ సూప్ లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. చలికాలంలో శరీరానికి తగినంత ఐరన్ లభించడంతో శరీరంలో రోగనిరోధక శక్తి కూడా బాగా లభిస్తుంది. బ్రోకలీ సూప్.. బ్రోకలీ, క్యాప్సికం రెండింటి లోనూ విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. బ్రోకలీ సూప్ ను తీసుకోవడం వల్ల శరీరానికి కావలసినంత విటమిన్-సి అందుతుంది. బీన్ సూప్.. బీన్స్ ఆరోగ్యానికి చాలా మంచివి. బీన్స్ లో ప్రోటీన్, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. విటమిన్లు కూడా ఉంటాయి. బీన్స్ తో తయారు చేసిన సూప్ ను చలికాలంలో తీసుకోవడం వల్ల శరీరంలో నొప్పులు కూడా తగ్గుతాయి. మెంతి కూర సూప్.. మెంతి కూర చేదు గురించి చాలా మంది కంప్లైంట్ చేస్తారేమో.. కానీ మెంతికూరతో సూప్ చేసుకోవచ్చు. లేత మెంతికూర ను సూప్ గా తయారు చేసుకుని తాగితే బోలెడు లాభాలు ఉంటాయి. మెంతికూరలో ఐరన్, ఫోలిక్ యాసిడ్ ఉంటాయి. ఇది డయాబెటిక్ రోగులకు కూడా చాలా సహాయపడుతుంది. *రూపశ్రీ.
read more








.webp)




.webp)

.webp)
.webp)


.webp)

.webp)
