చలికాలంలో అల్లం టీ.. లాభాలే కాదు ఈ  నష్టాలు కూడా..!

  చలికాలం శరీరానికి పరీక్ష కాలం.  చాలామంది శరీరం వెచ్చగా ఉండటం కోసం ఆహారంలో చాలా మార్పులు చేసుకుంటారు.  అల్లం, వెల్లుల్లి వంటి వంటింటి ఔషద మూలికలు కూడా చాలా ఎక్కువగా వాడుతుంటారు.   వీటి వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని,  సీజన్ సమస్యలు తగ్గించడంలో బాగా సహాయపడుతుందని అంటారు.  చలి నుండి ఊరట పొందడానికి చాలామంది టీ, కాఫీలు బాగా తాగుతారు. ముఖ్యంగా చలికాలంలో అల్లం టీ తాగడానికి చాలమంది ఇష్టపడతారు. అయితే అల్లం టీ వల్ల ఆరోగ్య ప్రయోజనాలే కాదు.. నష్టాలు కూడా ఉంటాయట. అల్లం టీ తాగడం చాలా రిలీఫ్ గా అనిపించినప్పటికీ ఇది కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచుతుంది.  రోజులో ఒకటి లేదా రెండు సార్లకు మించి అల్లం టీ తాగితే యాసిడ్ చాలా ఎక్కువ పెరిగి ఎసిడిటీ సమస్య విజృంభిస్తుంది.  ఇప్పటికే ఎసిడిటీ సమస్యతో ఇబ్బంది పడేవారు అల్లం టీ ఒకటి లేదా రెండు సార్లకు మించి తాగితే అది సమస్యను తీవ్రం చేస్తుంది. అల్లంలో రక్తపోటు సమస్యకు మంచి ఔషధం. అధిక రక్తపోటును నియంత్రించడంలో, తగ్గించడంలో ఇది సహాయపడుతుంది. కానీ ఇప్పటికే రక్తపోటు తక్కువ వారు అల్లం టీని పదే పదే తాగుతుంటే అది శరీరంలో రక్తపోటు తగ్గిపోయి లో బీపీ, మైకం వంటి సమస్యలు కలుగజేస్తుంది. రక్తం శరీరంలో చాలా కీలకమైన  ద్రవ పదార్థం.  అయితే అల్లంలో రక్తాన్ని పలుచన చేసే గుణాలు ఉంటాయి.  ఇప్పటికే రక్తం పలుచన కావడం కోసం మందులు వాడుతున్న వారు అల్లం టీ తాగితే చాలా సమస్య ఏర్పడుతుంది.   గర్భవతులకు వికారం, వాంతి వచ్చినట్టు అనిపించడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి.  అజీర్ణం కూడా చేస్తుంటుంది. అయితే అల్లం టీ తాగితే ఈ సమస్య చాలా వరకు సద్దుమణుగుతుంది.  కానీ ఇది మేలు చేస్తుంది కదా అని పదే పదే అల్లం టీని తాగితే గర్భవతులకు మేలు కంటే ఎక్కువ కీడు జరిగే అవకాశం ఉంది. అల్లం టీ తాగితే జీర్ణక్రియ సక్రమంగా పని చేస్తుంది. కానీ దీన్ని ఎక్కువగా తాగితే విరేచనాలు అయ్యే ప్రమాదం ఉంటుంది.  కడుపులో వికారం కలిగించి అతిసారం సమస్య సృష్టిస్తుంది. అల్లంలో టానిన్ లు ఉంటాయి. అలాగే అల్లంటీలో కెఫీన్ కూడా ఉంటుంది.  దీన్ని ఎక్కువగా తాగితే తీసుకునే ఆహారం నుండి ఐరన్  ను శరీరం గ్రహించకుండా చేస్తుంది. దీని వల్ల ఐరన్ లోపం ఏర్పడి  రక్తహీనత సమస్య వస్తుంది.                                                *రూపశ్రీ.

read more
ఆహారమే కాదు.. ఎసిడిటీకి ఇవి కూడా కారణాలేనట..!

  ఎసిడిటీ అనేది చాలా సాధారణమైన సమస్య. ప్రతి ఒక్కరూ   ఎప్పుడో ఒకప్పుడు ఎసిడిటీ సమస్యను అనుభవించి ఉంటారు. కొన్ని కారణాల వల్ల కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల ఈ సమస్య వస్తుంది. అసిడిటీ కారణంగా అజీర్ణం, జీర్ణ సమస్యలు, గ్యాస్ ఏర్పడటం వంటి సమస్యలు వస్తుంటాయి. ఎసిడిటీని ప్రధానంగా ఈటింగ్ డిజార్డర్స్ వల్ల వచ్చే సమస్యగా పరిగణిస్తారు. అయితే దీనికి  ఇతర  కారణాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా? కడుపులో యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం వల్ల వచ్చే సమస్య ఎసిడిటీ అని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఆహారం వల్ల ఎసిడిటీ సమస్య ఏర్పడినప్పుడు యాసిడ్ ఆహార నాళంలోకి  తిరిగి వస్తుంది.  దీని కారణంగా ఛాతీ దిగువ భాగంలో నొప్పి లేదా మంట వస్తాయి. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఏ వయసు వారికైనా ఎసిడిటీ రావచ్చు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు ఎసిడిటీకి ప్రధాన కారణమని వైద్యులు, పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది కాకుండా, ఎసిడిటీని కలిగించే కొన్ని పరిస్థితులు ఉన్నాయి. అసలు ఎసిడిటీ లక్షణాలు ఎలా ఉంటాయి? ఎసిడిటీ రావడానికి ఆహారం మాత్రమే కాకుండా వేరే ఇతర కారణాలు ఏమున్నాయి?  కడుపులో ఉండే యాసిడ్ (గ్యాస్ట్రిక్ జ్యూస్) అధిక మొత్తంలో ఉత్పత్తి కావడం వల్ల ఎసిడిటీ ఏర్పడుతుంది. ఈ కడుపు ఆమ్లం ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. అయితే యాసిడ్ అధికంగా ఉత్పత్తి కావడం లేదా కడుపు గోడలలో విచ్చలవిడిగా  వ్యాపించడం జరిగినప్పుడు అది కడుపులో మంట, నొప్పి,  ఇతర సమస్యలకు దారితీస్తుంది. అసిడిటీ లక్షణాలు వివిధ రకాలుగా ఉంటాయి.  ఇవి కూడా  తేలికపాటి నుండి తీవ్రమైన లక్షణాల  వరకు ఉంటాయి. తిన్న వెంటనే లేదా ఖాళీ కడుపుతో ఉన్నప్పుడు కడుపు మండే అనుభూతి కలిగి ఉంటుంది. త్రేనుపులు బాగా వస్తాయి ముఖ్యంగా పుల్లని త్రేనుపులు ఎక్కువ ఉంటాయి. తరచుగా నోటిలో పుల్లని రుచి ఉంటుంది. కడుపులో భారం, నొప్పి,  కడుపు ఉబ్బరం వంటి  సమస్యలు ఎప్పుడూ అనిపిస్తుంటాయి. గొంతులోకి యాసిడ్ చేరడం వల్ల మంట,  పొడి దగ్గు. వికారం,  వాంతులు లేదా తరచుగా రెగ్యురిటేషన్ ఆహారమే కారణమా? ఆహార సంబంధిత అలవాట్లు చాలా ముఖ్యమైనవి. మితిమీరిన కారంగా,  వేయించిన ఆహారాన్ని తినడం, టీ, కాఫీ లేదా కార్బోనేటేడ్ డ్రింక్స్ అధికంగా తీసుకోవడం ఎసిడిటీకి ప్రధాన కారణాలు. తిన్న వెంటనే పడుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం లేదా ఎక్కువ సేపు ఆకలితో ఉండడం, ఫ్యాటీ ఫుడ్, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఎసిడిటీ రావచ్చు. ఇవి కూడా  కారణాలే.. తినే అలవాట్లతో  పాటు అనేక జీవనశైలి సంబంధిత కారణాల వల్ల కూడా  ఎసిడిటీ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. ధూమపానం,  మద్యం సేవించే వ్యక్తులకు ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.  ఇది కాకుండా అధిక ఒత్తిడి,  ఆందోళనలో ఉన్నా.. తగినంత నిద్ర లేకున్నా..  లేదా ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ,  ఉన్నా ఎసిడిటీకి గురవుతారు.                                           *రూపశ్రీ.  

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
వెయ్ ప్రోటీన్ మార్కెట్లో కొనక్కర్లేదు ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు!

    ప్రోటీన్ శరీరానికి చాలా అవసరం.  ముఖ్యంగా ఈ మద్యకాలంలో శారీరక స్పృహ, ఆరోగ్య స్పహ పెరగిన కారణంగా  ప్రోటీన్ తీసుకోవడం, ఆరోగ్యకరమైన ఆహారం పట్ల ఆసక్తి పెరిగింది.  ప్రోటీన్ లోపం ఉండకూడదని చాలామంది ప్రోటీన్ పౌడర్లు కూడా వాడుతుంటారు.  దీనికి తగ్గట్టే ప్రోటీన్ పౌడర్ ఉత్పత్తులు చాలా విరివిగా మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.  వీటిలో వెయ్ ప్రోటీన్ చాలా ముఖ్యమైనది.  వెయ్ ప్రోటీన్ అంటే పాటవిరుగుడుతో తయారుచేస్తారు.మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ వాడటం మంచిదేనా? దీన్ని ఇంట్లోనే ఎలా చేసుకోవ్చచు? తెలుసుకుంటే..  మార్కెట్లో అమ్మే వెయ్ ప్రోటీన్ చాలా ఖరీదుగా ఉంటుంది.  అయితే ఆరోగ్యం కోసం ఎంతైనా ఖర్చు పెడుతూ ఉంటారు.  ఈ వెయ్ ప్రోటీన్ కూడా బాడీ బిల్డింగ్ చేసేవారు, అధికంగా వ్యాయామాలు చేసేవారికి అవసరం.  జిమ్ కు వెళుతూ వెయ్ ప్రోటీన్ ను వాడిన 19 ఏళ్ల కుర్రవాళ్లు కిడ్నీ ఫెయిల్ అయిన సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్కెట్లో లభించే వెయ్ ప్రోటీన్ లో ప్రోటీన్ మాత్రమే కాకుండా చాలా రసాయనాలు కూడా ఉంటాయి. ఇవి శరీరాన్ని చాలా దెబ్బతీస్తాయి. ప్రతి ఒక్కరికీ ప్రోటీన్ అవసరమే కానీ బాడీ బిల్డర్లకు అవసరమైనంత మాత్రం అవసరం లేదు.  అందుకే వెయ్ ప్రోటీన్ ను ఇంట్లోనే తయారు చేసుకుని వాడటం సురక్షితం అంటున్నారు పోషకాహార నిపుణులు. పాలు.. పాలు తాగడం వల్ల చాలావరకు వెయ్ ప్రోటీన్ లభిస్తుందని అంటున్నారు. ప్రతి ఒక్కరూ పాలు తాగాలని అది ఆరోగ్యానికి చాలా మంచిదని అంటున్నారు.  పాలలో దాదాపు 80శాతం పైన కేసైన్ ప్రోటీన్,  20శాతం వెయ్ ప్రోటీన్ ఉంటుంది. వెయ్ ప్రోటీన్.. పాల విరుగుడుతో చేసే ప్రోటీన్ నే వెయ్ ప్రోటీన్ అంటారు. అయితే దీన్ని ఇంట్లో కూడా తీసుకోవచ్చు.  పాలను మొదటగా జున్నులాగా చేయాలి.  దీని నుండి పన్నీర్ వస్తుంది.  పన్నీర్ ను వేరు చేసిన తరువాత నీరు మిగిలిపోతాయి.  చాలామంది ఈ నీటిని పడేస్తుంటారు. కానీ వెయ్ ప్రోటీన్ ఇందులోనే ఉంటుంది.  పాలలో ఉండే కేసైన్ ప్రోటీన్ పన్నీర్ లోకి వెళ్లిపోతుంది. పాలలో ఉండే వెయ్ ప్రోటీన్ ఈ నీటిలో ఉంటుంది.  ఈ నీటిని పారబోయకుండా ఆహారంలో భాగం చేసుకుంటే మంచిది. వెయ్ ప్రోటీన్ కండరాల పెరుగుదలను వేగవంతం చేస్తుంది. ఇది శరీర బరువును పెంచుతుంది,  బలాన్ని పెంచుతుంది. కొన్ని పరిశోధనలలో, ఇది అధిక BP మరియు మధుమేహాన్ని నియంత్రించగలదని కూడా కనుగొనబడింది . ఇది చాలా కాలం పాటు కడుపు నిండుగా ఉంచుతుంది.                                                       *రూపశ్రీ.  

read more
50రూపాయలకు దొరికే ఈ వస్తువులతో వారం రోజుల్లోనే థైరాయిడ్ నయం..!

 థైరాయిడ్ మానవ శరీరంలో ముఖ్యమైన గ్రంథి. చాలామంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.  ఇలాంటి వారు వైద్యులను రెగ్యులర్ గా కలుస్తూ ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు.  సాధారణంగా కొందరు వైద్యులు థైరాయిడ్ అనేది నయం కాదని, దీనికి అలా ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉండాలని అంటారు.  దీనికి తగ్గట్టే ప్రతిరోజూ  25, 50,  75 mg మందులు తీసుకుంటూ ఉంటారు.  అయితే   ఈ మందులను తీసుకున్న తర్వాత బాగా  అలసిపోతారు. ఇవి సమస్యను నయం చేయకపోగా హాని ఎక్కువ కలుగుతుంది.  కానీ ఆయుర్వేదం మాత్రం 50 రూపాయల ఖర్చు పెట్టి వారం రోజుల్లో థైరాయిడ్ ను మట్టుబెట్టవచ్చని చెబుతోంది. లక్షణాలు.. థైరాయిడ్ అనేది ఒక సాధారణ సమస్య.  దీనిలో థైరాయిడ్ అని పిలువబడే హార్మోన్ తక్కువ లేదా ఎక్కువ ఉత్పత్తి కావడం జరుగుతుంది.   దీని కారణంగా అలసట,  బలహీనత, బరువు పెరగడం, జుట్టు రాలడం, చర్మం పొడిబారడం, బలహీనమైన జ్ఞాపకశక్తి, మలబద్ధకం, మెడ నొప్పి, వాపు  వంటి అనేక సమస్యలు తలెత్తుతాయి. నొప్పి, ఆందోళన,  భయము,  హృదయ స్పందన వేగంగా ఉండటం, చెమట ఎక్కువగా పట్టడం,  వాపు, కళ్లు ఎర్రదా ఉండటం  లేదా ఉబ్బినట్టు ఉండటం వంటి లక్షణాలు ఉంటాయి. థైరాయిడ్ కు చెక్ పెట్టే మార్గం.. కావసిన పదార్థాలు.. నల్ల మిరియాలు .. 50 గ్రాములు పిప్పళ్లు.. 50 గ్రాములు ఎండు అల్లం.. 50 గ్రాములు తయారీ విధానం.. పైన చెప్పుకున్న పదార్థాలు అన్నింటిని బాగా గ్రైండ్ చేయాలి.   ఇది మెత్తని పొడిలాగా ఉండాలి.  ఈ చూర్ణాన్ని ప్రతి రోజూ ఉదయం అల్పాహారం తర్వాత నీటితో ఒక చిటికెడు తీసుకోవాలి. రోజూ ఇలా చేస్తుంటే కేవలం 7రోజుల్లోనే థైరాయిడ్ సమస్య నార్మల్ గా ఉందని రిపోర్ట్ కూడా వస్తుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. మరిన్ని లాభాలు.. పైన చెప్పుకున్న పౌడర్ ను వాడుతుంటే ఊబకాయం కూడా తగ్గుతుందట. సాధారణంగా థైరాయిడ్ ఉన్నవారిలో అధిక బరువు ఉంటుంది.  పైన చెప్పుకున్న పౌడర్ ను వాడుతుంటే అధిక బరువు, బలహీనత లక్షణాలు కూడా  తగ్గుతాయి.                                   *రూపశ్రీ.

read more
ముల్లంగి చాలా పవర్ఫుల్ కానీ.. 90శాతం మంది తప్పు పద్దతిలో తింటున్నారట..!

ముల్లంగి చాలా ఆరోగ్యకరమైన కూరగాయలలో ఒకటి.  నీటి శాతం అధికంగా ఉండే ఈ కూరగాయ తినడం వల్ల బోలెడు ఆరోగ్య సమస్యలు మంత్రించినట్టు మాయమవుతాయి. శీతాకాలపు రోజుల్లో ముల్లంగి కూరగాయలు సమృద్ధిగా పండుతాయి.  వీటిని ఎక్కువగా తినే కాలం కూడా శీతాకాలమే..   చాలామంది ముల్లంగి వాసనను ఇష్టపడరు. కానీ ఇతర రాష్టాలలో ముల్లంగిని కీర దోస లాగా చక్రాలుగా కట్ చేసుకుని తింటారు. కానీ చాలామందికి ముల్లంగిని ఎలా తినాలో క్లియర్ గా తెలియదట. ముల్లంగిలో పోషకాల గురించి, దాన్ని ఎలా తినాలనే విషయం గురించి పూర్తీగా తెలుసుకుంటే.. ముల్లంగిలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది.  పొటాషియం,  యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒక కప్పు ముల్లంగిలో 17.2 గ్రాముల విటమిన్ సి ఉంటుంది.  ముల్లంగిలో  కాల్షియం, విటమిన్ బి6, ఫోలేట్, రైబోఫ్లేవిన్, మెగ్నీషియం, ఐరన్‌ పుష్కలంగా ఉంటాయి. ముల్లంగి ఆకుల్లో దుంపల కంటే రెట్టింపు యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటిని ఆహారంలో తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. క్యాన్సర్‌ను నివారించడంలో, బరువును నియంత్రించడంలో, కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో,  రక్తంలో చక్కెరను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. ముల్లంగిని సరైన పద్ధతిలో తీసుకుంటేనే ఈ ప్రయోజనాలను పొందవచ్చు. సలాడ్.. ముల్లంగిని, వీటి ఆకులను సన్నని ముక్కలుగా కట్ చేసి వాటిని సలాడ్‌లో జోడించాలి. ఆకుపచ్చ కూరగాయలు, దోసకాయ, క్యారెట్లతో కలిపి సలాడ్ తయారు చేసుకోవాలి. ముల్లంగి ముక్కలను హుమ్ముస్ లేదా పెరుగుతో తినవచ్చు. సూప్‌లు, టాకోస్ లేదా అన్నంతో కలిపి తీసుకోవచ్చు. ఆకులు.. ముల్లంగి మాత్రమే కాదు.. ఆకులు కూడా ఆరోగ్యమే..  వీటిలో పోషకాలు కూడా  అధికం. ముల్లంగి కంటే ముల్లంగి ఆకులలో ఎక్కువ కాల్షియం,  విటమిన్ సి ఉంటాయి. స్మూతీస్‌లో ముల్లంగి ఆకులను జోడించడం ద్వారా పోషకాహాలను  పెంచుకోవచ్చు. వెల్లుల్లి, ఆలివ్ నూనె,  చిటికెడు ఉప్పుతో వేయించిన  ముల్లంగి ఆకులను తిసుకోవచ్చు. తరిగిన ముల్లంగి ఆకులను సూప్‌లు,  వంటలలో జోడించవచ్చు. ఊరగాయ.. ముల్లంగితో ఊరగాయ అనగానే చాలామంది షాకవుతారేమో.. కానీ ఇలా ముల్లంగిని ఊరబెట్టడం ద్వారా దానిలో ప్రోబయోటిక్ కంటెంట్ పెరుగుతుంది. ఇది గట్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.  ముల్లంగి ఊరగాయ కోసం ముల్లంగి ముక్కలను ఉప్పు నీటిలో పులియబెట్టాలి.  దీనిని శాండ్విచ్ లేదా సైడ్ డిష్ గా తినవచ్చు.  ఇంకా ముల్లంగితో కిమ్చిని కూడా తయారు చేయవచ్చు.  చైనా, జపాన్ లలో వీటిని ఎక్కువగా తింటారు. ఆరోగ్యకరమైన కొవ్వులతో.. ముల్లంగిలో కొవ్వులో కరిగే యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైన కొవ్వులతో బాగా శోషించబడతాయి. సలాడ్ లేదా టోస్ట్ చేసేటప్పుడు  అవోకాడోతో ముల్లంగిని జోడించవచ్చు. కాల్చిన గింజలు లేదా విత్తనాలతో ముల్లంగి సలాడ్ తీసుకోవ్చచు. ముల్లంగి ముక్కల్లో ఆలివ్ ఆయిల్, ఉప్పు వేసి తినవచ్చు. స్మూతీ.. ముల్లంగి రసం కాలేయాన్ని శుధ్ది చేయడంలో సహాయపడుతుంది.  జీర్ణక్రియకు తోడ్పడుతుంది. ముల్లంగి, యాపిల్, క్యారెట్,  అల్లం కలిపి తాజా జ్యూస్ తయారు చేసుకుని తీసుకోవచ్చు. ముల్లంగి, దోసకాయ, నిమ్మ,  బచ్చలికూరతో డిటాక్స్ స్మూతీని కూడా తయారు చేసి త్రాగవచ్చు.                                      *రూపశ్రీ.  

read more
ఫైల్స్ సమస్య మూడు రోజుల్లోనే నయం కావాలంటే ఈ పవర్ఫుల్ చిట్కా ఫాలో అవ్వాల్సిందే..!

  మలబద్ధకం సమస్య దీర్ఘకాలం కొనసాగినప్పుడు, పైల్స్ ఏర్పడతాయి. ఇది తీవ్రమైన సమస్య.   పైల్స్  ఫిస్టులా వంటి ప్రమాదకరమైన పరిస్థితులకు దారితీస్తుంది. ఫైల్స్ వచ్చినవారు  దాని నివారణకు పైల్స్ తొలగించడం కోసం  శస్త్రచికిత్స,  ఇంజెక్షన్ సహాయం తీసుకుంటారు. కానీ చాలా సార్లు ఈ చికిత్స ప్రభావవంతంగా ఉండదు. ఎందుకంటే మలబద్దకం సమస్యను నివారించకపోతే పైల్స్ సమస్య మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం ఉంది.  దీని వల్ల చాలా దుష్ప్రభావాలను  ఎదుర్కోవలసి రావచ్చు. యోగా గురువు బాబా రామ్‌దేవ్ రెండు వేల సంవత్సరాల నాటి పద్దతులను అనుసరించడం ద్వారా కేవలం 3 రోజుల్లోనే ఈ సమస్య నయమవుతుందని పేర్కొన్నారు. అసలు పైల్స్ సమస్య లక్షణాలేంటి? పైల్స్ తగ్గించే పద్దతులు ఏంటి? పైల్స్ రాకుండా తీసుకోవాల్సిన చర్యలు ఏంటి?  తెలుసుకుంటే.. పైల్స్ లక్షణాలు.. మలంతో పాటు ఎర్రటి రక్తం రావడం. మలద్వారం వద్ద దురద రావడం. మూత్ర విసర్జన చేసిన వెంటనే మలం ఒత్తిడి. మలద్వారం వద్ద గడ్డలాగా ఏర్పడటం. మలద్వారం వద్ద నొప్పిగా ఉండటం. పైల్స్ కు బాబా రాందేవ్ చెప్పిన చిట్కాలు.. పాలు, నిమ్మకాయ.. బాబా రామ్ దేవ్ చెప్పిన టిప్స్ లో పాలు, నిమ్మకాయ టిప్ చాలా బాగా పనిచేస్తుంది.  ఒక కప్పు చల్లని పాలలో ఒక నిమ్మకాయ పిండాలి.   తరువాత ఈ నిమ్మకాయ పిండిన పాలను వెంటనే తాగేయాలి.  ఈ పాలను ఎక్కువసేపు ఉంచిదే పాలు పగిలిపోతాయి. కాబట్టి పాలలో నిమ్మరసం పిండగానే తాగెయ్యాలి.  దీన్ని మూడు రోజుల పాటు తీసుకోవాలి. అయితే ఇందుకోసం గేదె పాలు తీసుకోకూడదు.  దానికి  బదులుగా ఆవు పాలను మాత్రమే వినియోగించాలి. అరటి, కర్పూరం.. పైల్స్ నివారణ  కోసం అరటి,  కర్పూరం  కూడా ఉపయోగించవచ్చు. పండిన అరటిపండులో పావు వంతు తీసుకుని దాన్ని చీల్చాలి. దానిలో గ్రాముకు సమానమైన కర్పూరాన్ని ఉంచి ఆపై దానిని మింగాలట. ఇలా మూడు రోజులు తింటే పైల్స్ సమస్య కంట్రోల్ అవుతుందని అంటున్నారు. అయితే ఈ చిట్కా ఫాలో అయ్యేవారు  భీమసేని కర్పూరం వాడాలి. పైల్స్ రాకుండా ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే.. పుష్కలంగా నీరు త్రాగాలి. మలద్వారం వద్ద  దురద,  నొప్పిని తగ్గించడానికి గోరువెచ్చని నీటితో స్నానం చేయాలి. రోజూ వ్యాయామం చేయాలి. పైబర్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. లిక్విడ్ ఫుడ్స్ తీసుకోవాలి. ఘన ఆహారం,  ఎక్కువ సేపు జీర్ణం అయ్యే ఆహారాలకు దూరం ఉండాలి. పైన చెప్పుకున్న చిట్కాలు  పైల్స్ సమస్యను  తగ్గిస్తాయని చెప్పారు తప్ప..  వైద్యులు ఇచ్చే ఔషధాలు,  వైద్యులు చేసే ట్రీట్‌మెంట్ కు ఇవి  ప్రత్యామ్నాయం కాదు. పైల్స్ సమస్య వల్ల ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటే వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం.                                           *రూపశ్రీ.  

read more
చలికాలంలో పెరిగే ఆర్థరైటిస్ సమస్యలకు ఇలా చెక్ పెట్టండి..!

చలికాలం లేదా శీతాకాలం ప్రజలకు అనేక సవాళ్ళను విసురుతుంది. చాలా వరకు వైరస్లు తక్కువ ఉష్ణోగ్రతలలో చురుకుగా మారతాయి. దీని కారణంగా ఇన్ఫ్లుఎంజా,  ఇతర ఇన్ఫెక్షన్ల ప్రమాదం పెరుగుతుంది. ఈ సీజన్  ఇలాంటి ఇన్పెక్షన్ సమస్యలే కాకుండా ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా చాలా పెద్ద సమస్యలు తెచ్చిపెడుతుంది.  చల్లని నెలల్లో ఆర్థరైటిస్ తో బాధపడేవారు మంటను కలిగి ఉంటారు. కీళ్ల నొప్పులు పెరుగుతాయి.  ఇది సాధారణ రోజుల్లో కంటే శీతాకాలంలో అధికంగా ఉండటం వల్ల మామూలు కంటే ఎక్కువ ఇబ్బంది పడతారు.  అందుకే ఆర్థరైటిస్ సమస్యతో ఇబ్బంది పడేవారు చలికాలంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చల్లని వాతావరణంలో సైనోవియల్ ఫ్లూయిడ్ (రెండు ఎముకల మధ్య ఉండే పదార్థం) మందంలో మార్పుల వల్ల ఈ సమస్యలు వస్తాయి. సైనోవియల్ ద్రవం కీళ్ళు సజావుగా పనిచేయడానికి సహాయపడుతుంది. ఈ ద్రవం గట్టిపడటం వల్ల కీళ్లు గట్టిగా మారడం వల్ల నొప్పి, దృఢత్వంలో ఇబ్బంది వంటి సమస్యలు పెరుగుతాయి. చలికాలంలో కీళ్లనొప్పులు ఇందుకే.. చలికాలంలో ఆర్థరైటిస్ సమస్య పెరగడానికి ప్రధాన కారణం వ్యాయామం లేకపోవడం,  శారీరకంగా చురుగ్గా లేకపోవడమే అని వైద్యులు అంటున్నారు.  ఇలా ఉండటం  వల్ల కండరాల బలహీనత,  కీళ్లు బిగుసుకుపోవడం జరుగుతుంది.   శీతాకాలంలో సూర్యరశ్మి తక్కువగా ఉంటుంది. ఇది విటమిన్ డి కి మూలం. సూర్యరశ్మి తక్కువగా ఉండటం వల్ల  విటమిన్ డి లోపం ఏర్పడుతుంది.  ఇది  ఎముకలకు చాలా హానికరం. కీళ్ల సమస్యలు తగ్గాలంటే.. శీతాకాలంలో  శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి ఎలక్ట్రిక్ బ్లాంకెట్, రూమ్ హీటర్ లేదా గది వెచ్చగా ఉండేలా చూసుకోవాలి.  శీతాకాలంలో ఉన్ని బట్టలు,  థర్మల్‌లను ధరించాలి.  ముఖ్యంగా కీళ్లను కప్పి ఉంచాలి.  ఈ పనులు చేయడం వల్ల   కీళ్ళు బిగుసుకుపోవడాన్ని నివారించవచ్చు. కీళ్లకు వెచ్చని కంప్రెస్ను ఉంచాలి. ఇది  కూడా బాగా పని చేస్తుంది.  ఇవన్నీ పాటిస్తే కీళ్లు బిగుసుకుపోకుండా చూసుకోవచ్చు. మొత్తం ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం చాలా ముఖ్యం.  వ్యాయామం కీళ్ల కదలికను నిర్వహించడంలో కూడా సహాయపడుతుంది. చలి కారణంగా నడక చాలా కష్టంగా ఉంటే, యోగా,  స్ట్రెచింగ్ వంటి తేలికపాటి ఇండోర్ వ్యాయామాలను ప్రయత్నించాలి. వ్యాయామాలు కండరాల బలం,  ఉమ్మడి కదలికను నిర్వహించడానికి సహాయపడతాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసేవారికి కీళ్లనొప్పులు లేదా దాని వల్ల వచ్చే సమస్యలు తక్కువగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు.  కీళ్ళను ఆరోగ్యంగా ఉంచడానికి,  ఆర్థరైటిస్ సమస్య పెరగకుండా నిరోధించడానికి శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం,  ప్రతి రాత్రి 6 నుండి 8 గంటలు నిద్రించడం చాలా ముఖ్యం. మొత్తం ఆరోగ్యానికి మంచి నిద్ర అవసరం. ఇది తాపజనక ప్రతిస్పందనలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది, తద్వారా ఆర్థరైటిస్ లక్షణాలను తగ్గిస్తుంది.                                             *రూపశ్రీ.  

read more
చలికాలంలో ఎన్ని గ్లాసుల నీరు తాగాలి?

నీటి ఉనికి ఉన్న చోట మానవ మనుగడ సాధ్యమవుతుందని అంటారు. మనుషులకే కాకుండా సకల జీవకోటికి నీరు అవసరం.  శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే..  ప్రతిరోజూ  8 గ్లాసుల నీరు తాగాలని చెబుతూ ఉంటారు. ఇక లీటర్లలో అయితే 2 నుండి 3 లీటర్లకు తక్కువ కాకుండా నీరు తాగాలని కూడా అంటారు.  కానీ చలికాలంలో చాలా మంది నీరు తాగడం దగ్గర నిర్లక్ష్యంగా ఉంటారు. చలికారణంగా చాలా మందికి దాహం అనిపించదు.  దీని కారణంగా నీరు ఎక్కువగా తాగరు. అయితే చలికాలంలో ఎన్ని గ్లాసుల నీరు తాగానే విషయాన్ని వైద్యులు చెబుతున్నారు. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే పోషకాహారంతో పాటు నీరు కూడా బాగా తాగాలి.  నీరు శరీరానికి ఇంధన వనరు లాంటిది. నీరు బాగా తాగితే శరీరం హైడ్రేట్ గా ఉండటమే కాకుండా శరీరంలో వ్యర్థాలు కూడా చెమట రూపంలో, మూత్రం రూపంలో బయటకు  వెళ్లిపోతాయి. చలి కారణంగా చలికాలంలో దాహం బాగా తగ్గుతుంది.  ఈ కారణంగా నీరు తాగడంలో నిర్లక్ష్యంగా ఉంటారు. ముఖ్యంగా ఇంటి పట్టునే ఉండి పని చేసుకునే వారు నీరు తక్కువగా తాగుతుంటారు. ఈ అలవాటు అస్సలు మంచిది కాదు. సీజన్ ఏదైనా సరే.. ప్రతి ఒక్కరూ కనీసం రోజుకు రెండున్నర నుండి మూడు లీటర్ల నీరు తాగాలని అంటారు. అంటే ఇది 8 నుండి 12 గ్లాసుల నీటికి సమానం. తక్కువ నీరు తాగడం వల్ల శరీరం డీహైడ్రేట్ అవ్వడమే కాకుండా శరీరంలో వ్యర్థాలు పేరుకుని పోయి అనేక రకాల రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. చలికాలంలో నీరు తక్కువగా తీసుకుంటే శరీరంలో నీటి కొరత ఏర్పడుతుంది. ఇది చర్మం పొడిబారేలా చేస్తుంది.  దీని వల్ల చర్మ సంబంధ సమస్యలు మరింత తీవ్రం అవుతాయి. నీరు తక్కువగా తాగడం వల్ల శరీరంలో జీర్ణాశయానికి ఇబ్బంది ఏర్పడుతుంది.  తిన్న ఆహారం సరిగా జీర్ణం కాదు.  దీని వల్ల మలబద్దకం, పైల్స్ వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి చలికాలం కదా అని నీరు తక్కువగా తీసుకోకూడదు.  కనీసం రెండున్నర నుండి మూడు లీటర్ల నీటిని తప్పనిసరిగా తాగాలి.                                            *రూపశ్రీ.  

read more
గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయా? ఇలా వదిలించుకోండి..!

చాలామందికి ఆహారం, అలవాట్ల వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. కొందరికి  ఈ సమస్య వంశపార్యపరంగా కూడా వస్తుంది. అయితే ఈ మద్యకాలంలో గాల్ బ్లాడర్ స్టోన్స్ సమస్య అధికంగా మారింది. చాలామంది ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. గాల్ బ్లాడర్ స్టోన్స్ ను తెలుగులో పిత్తాశయంలో రాళ్లు ఏర్పడ్డాయని చెబుతారు.  పిత్తాశయం లివర్ కు కొంచెం దిగువ భాగంలో ఉంటుంది.   చాలా వరకు ఆపరేషన్ చేసి పిత్తాశయాన్ని తొలగిస్తుంటారు. దీని వల్ల వచ్చే సమస్య ఏమీ లేదని కూడా అంటారు. కానీ పిత్తాశయాన్ని తొలగించకుండా పిత్తాశయంలో రాళ్లు తొలగించుకునే ప్రయత్నం చేయవచ్చు.  ఇందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే.. యాపిల్ సైడర్ వెనిగర్.. వెనిగర్ గురించి చాలామంది వినే ఉంటారు. అయితే యాపిల్ సైడర్ వెనిగర్ గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఆరోగ్య స్పృహ ఎక్కువ ఉన్నవారు యాపిల్ సైడర్ వెనిగర్ ను నీళ్లలో మిక్స్ చేసుకుని తాగుతుంటారు.  దీన్ని తాగడం వల్ల పిత్తాశయం రాళ్ల నుండి ఉపశమనం లభిస్తుంది.  అంతేకాదు ఈ రాళ్లను కరిగించడంలో కూడా ఇది సహాయపడుతుంది. పియర్.. పియర్ పండ్లలో పెక్టిన్ అనే మూలకం ఉంటుంది. ఇది రాళ్లను తొలగించడంలో సహాయపడుతుంది.  పియర్ పండ్లు అందుబాటులో ఉన్నప్పుడు వీటిని తప్పనిసరిగా తినాలి.  ఇది మధుమేహ రోగులకు కూడా చాలా మంచిది. జ్యూస్.. జ్యూస్ లు శరీరాన్ని శుద్ది చేయడంలో, శరీరంలో టాక్సన్లు బయటకు పంపడంలో సహాయపడతాయి.  బిట్ రూట్, క్యారెట్,  కీర దోసకాయ.. ఈ మూడు కలిపి జ్యూస్ తయారు చేసుకుని తాగాలి,  ఇది సులభంగా జీర్ణం అవుతుంది.  గాల్ బ్లాడర్ లో రాళ్లను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. తంగేడు.. తంగేడు ఆకులు పల్లె ప్రాంతాలలో విరివిగా లభిస్తాయి.  ఈ తంగేడు ఆకులను కూడా పిత్తాశయం రాళ్లు వదిలించుకోవడంలో ఉపయోగించవచ్చు. ఇందుకోసం తంగేడు ఆకులను తేనెతో కలిపి తీసుకోవాలి.  దీని వల్ల రాళ్ల నొప్పి కూడా తగ్గిపోతుంది. పుదీనా.. పుదీనా రాళ్లను తగ్గించడంలో సహాయపుడుతుంది. కేవలం గాల్ బ్లాడర్ సమస్యకే కాదు.. కిడ్నీ రాళ్లకు కూడా ఇది సహాయపడుతుంది.  పుదీనాలో టెర్పెన్ అనే మూలకం ఉంటుంది.  ఇది రాళ్లను నెమ్మదిగా తొలగిస్తుంది. పుదీనాను వీలైనంత ఆహారంలో తీసుకోవాలి.  పుదీనా జ్యూస్ తాగినా మంచి ఫలితం ఉంటుంది. విటమిన్-సి.. విటమిన్-సి పుష్కలంగా తీసుకోవాలి.  ఎరుపు రంగు క్యాప్సికం లో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది.  ఇది రాళ్ల సమస్యను దూరం చేయడంలో సహాయపడుతుంది.   తృణధాన్యాలు.. ఫైబర్ అధికంగా ఉండే తృణధాన్యాలు తినడం వల్ల గాల్ బ్లాడర్ లో రాళ్ల సమస్య, దాని ప్రమాదం కూడా దూరం అవుతుంది. పసుపు.. పసుపులో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి.  పసుపు తినడం వల్ల పిత్తాశయం రాళ్లు క్రమంగా విరిగిపోయి అవి బయటకు వచ్చేస్తాయి.                                                *రూపశ్రీ.  

read more
చలికాలంలో అందరూ చేసే ఈ తప్పు మీరు చేయకండి..!

ప్రతి సీజన్ శారీరంగా కొన్ని సవాళ్లను వెంట బెట్టుకుని వస్తుంది. వేసవి కాలం రాగానే ఎక్కడ వడదెబ్బ కొడుతుందో.. ఎక్కడ శరీరం నీరస పడిపోతుందో అని అల్లాడిపోతారు ప్రజలు.  ముఖ్యంగా శరీరానికి తగినంత నీటి అవసరాన్ని తీర్చడానికి నీరు, పండ్ల రసాలు, కొబ్బరినీరు.. నీటి శాతం ఎక్కువ ఉన్న పండ్లు.. ఇలా చాలా తీసుకుంటారు. కానీ చలికాలం దగ్గరకు వచ్చే సరికి సీన్ మారిపోతుంది.  నీరు తాగాలన్నా,  నీరు అధికంగా ఉన్నపండ్లు తినాలన్నా అస్సలు ఇష్టపడరు.  దీని వల్ల కొంప కొల్లేరు అవుతుందని చాలా మంది తెలుసుకోరు.  వేసవి కాలంలో కంటే చలికాలంలోనే నీరు తాగడం తగ్గుతుంది.  ఇది చాలా ప్రమాదరమైన పరిస్థితి. చలికాలంలో కూడా కనీసం 2 నుండి 3 లీటర్ల నీటిని తప్పనిసరిగా తీసుకోవాలని అంటున్నారు వైద్యులు. చల్లటి వాతావరణంలో కూడా శరీరాన్ని ఎనర్జిటిక్‌గా, హైడ్రేటెడ్‌గా ఉంచుకోవడానికి కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. శరీరం డీహైడ్రేట్ అయితే.. శరీరం నిర్జలీకరణానికి గురైనప్పుడు మూత్రం ముదురు రంగులో ఉంటుంది.  కళ్లు తిరగడం, చర్మం పొడిబారడం, తలనొప్పి, అలసట, బలహీనత,  పెదవులు పగిలిపోవడం వంటి కొన్ని సాధారణ లక్షణాలు కనిపిస్తాయి. వేసవిలో మాత్రమే కాకుండా శీతాకాలంలో కూడా హైడ్రేట్ గా ఉండటం,  శరీరానికి  శక్తి అధికంగా ఇచ్చే ఆహారాలు తినడం చేయాలి. చలికాలంలోనే కాదు వేసవిలో కూడా గోరువెచ్చని నీటితో రోజును ప్రారంభిస్తే  ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుంది. అందుకే ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన తర్వాత ఖాళీ కడుపుతో ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది  హైడ్రేటెడ్‌గా అనిపిస్తుంది,  శరీరం శక్తితో నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం వల్ల  జీర్ణవ్యవస్థ కూడా మెరుగుపడుతుంది. ఇందులో నిమ్మ, పుదీనా, తేనె వంటి సహజసిద్ధమైన పదార్థాలను కలుపుకుని కూడా తాగవచ్చు. హైడ్రేటెడ్ గా ఉండటానికి ఆహారంలో నీరు మాత్రమే కాకుండా నీరు అధికంగా ఉండే పండ్లు,  కూరగాయలను కూడా చేర్చుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవాలి.  రోజువారీ ఆహారంలో పుచ్చకాయ, దోసకాయ, నారింజ, ఆకుకూరలు  టమోటాలు తీసుకోవాలి. డీహైడ్రేషన్‌ను నివారించడానికి ఎల్లప్పుడూ వాటర్ బాటిల్‌ను వెంట ఉంచుకోవాలి.  ఎక్కడికైనా బయటకు వెళ్లినా..  బ్యాగ్‌లో లేదా కారులో బాటిల్ ఉంచుకోవాలి. ఇది ఎప్పటికప్పుడు నీరు త్రాగడానికి  గుర్తు చేస్తు ఉంటుంది. ప్రతిసారీ నీరు త్రాగడానికి ప్రయత్నించాలి. ఇది కాకుండా వ్యాయామం తర్వాత వాటర్ బాటిల్‌లో ఎలక్ట్రోలైట్స్ కలిపి తాగడం వల్ల ఎఫెక్టివ్ హైడ్రేషన్ లభిస్తుంది. రాత్రి పడుకునే ముందు కొంచెం నీరు త్రాగాలి. ఇలా చేయడం వల్ల రాత్రంతా  శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. అయితే రాత్రి పడుకునే ముందు ఎక్కువ నీరు త్రాగవద్దు. లేకుంటే  నిద్రలో పదేపదే బాత్రూమ్‌కు వెళ్లవలసి ఉంటుంది, దీని కారణంగా  నిద్రకు భంగం కలగవచ్చు. అదే సమయంలో ఆహారం తీసుకునే ముందు 1 గ్లాసు నీరు త్రాగాలి. ఇలా నీరు తాగుతుంటే శరీరం చలికాలంలో కూడా హైడ్రేట్ గా ఉంటుంది.                                                              *రూపశ్రీ.  

read more
పండ్ల రసాలు తాగేటప్పుడు ఈ విషయాలు   తెలుసుకోకపోతే నష్టపోతారు..!

పండ్లు ఆరోగ్యానికి చాలా మంచివని చెబుతారు.  ముఖ్యంగా ఆరోగ్యం బాగాలేనప్పుడు పండ్లు లేదా పండ్ల రసం ఇస్తుంటే చాలా తొందరగా కోలుకుంటారనే విషయం అందరికీ తెలిసిందే.  మంచి ఆరోగ్యం కోసం పండ్లు, పండ్ల రసాలు తీసుకోమని వైద్యులు కూడా చెబుతారు. చాలా మంది పండ్ల రసాలు తాగాలని అనిపిస్తే  సింపుల్ గా ఫ్రూట్ జ్యూస్ షాప్ కు వెళ్లి తాగేస్తుంటారు.  మరికొందరు ఓపికగా ఇంట్లోనే జ్యూస్ చేసుకుంటారు. అయితే జ్యూస్ తాగే ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి. పండ్ల రసం చాలా వరకు బయట తాగడం చాలామంది అలవాటు.  అయితే పండ్ల రసం తాగే దుకాణం శుభ్రతగా ఉందా లేదా గమనించాలి. శుభ్రత లేని చోట  పండ్ల రసాలు తాగితే అది అనారోగ్యానికి కారణం అవుతుంది. కేవలం ఆ దుకాణం మాత్రమే కాదు.. చుట్టు ప్రక్కల పరిసరాలు కూడా శుభ్రతగా లేకుంటే  ఆ దుకాణాలలో జ్యూస్ లు తాగడం మంచిది కాదు. జ్యూస్ తాగేముందు అక్కడే అప్పటికప్పుడు తాజాగా తయారు చేసిన జ్యూస్ ను మాత్రమే తాగడం మంచిది. ముందే జ్యూస్ జార్ లేదా గిన్నెలలో నిల్వ ఉంచిన జ్యూస్ ను అస్సలు తాగకూడదు. అలాంటి జ్యూస్ లో  బ్యాక్టీరియా పెరుగుతుంది. అందుకే ఎప్పుడూ తాజా పండ్ల జ్యూస్ ను మాత్రమే రికమెండ్ చేయాలి. పండ్ల జ్యూస్ లు అమ్మే షాపులలో  కొన్నిసార్లు ముందే పండ్లను కట్ చేసి ఉంటారు. అలాంటి పండ్ల నుండి జ్యూస్ ను తయారు చేయించుకోకూడదు. తాజాగా కట్ చేసిన పండ్ల నుండే జ్యూస్ ను చేయించుకోవాలి.  ముందే కట్ చేసిన పండ్లలో కొన్ని సార్లు చెడి పోయిన పండ్లను కొంత భాగం కట్ చేసి పెట్టుకుని ఉంటారు.  ఇది బ్యాక్టీరియాను కలిగి ఉంటుంది. పండ్ల రసం తయారు చేసేవారు జ్యూస్ మరింత రుచిగా,  తాజాగా ఉండటం కోసం జ్యూస్ లో ఏదైనా రసాయనాలు లేదా పౌడర్ లేదా లిక్విడ్స్ మిక్స్ చేస్తుంటారు.  కొన్నిసార్లు రంగు కూడా జోడిస్తూ ఉంటారు. అలాంటి చోట జ్యూస్ అస్సలు తాగకూడదు. వాడిపోయిన,   పాతబడిన కాయలతో ఫ్రూట్ జ్యూస్ లు తయారు చేసి అమ్ముతుంటారు. అలాంటివి నివారించాలి. వీటిలో నీటి శాతం ఏమీ ఉండదు. పై పెచ్చు కార్బోహేడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి.  వీటిలో పోషకాలు ఏమీ ఉండవు.  ఇవి ఆరోగ్యానికి కూడా మంచివి కావు.                                                 *రూపశ్రీ.

read more
చేపల కంటే 10 రెట్ల పోషకాలు ఉన్న గింజలు ఇవి..!

  చేపలు చాలా శక్తి వంతమైన ఆహారం.  సమతుల ఆహారంలో చేపలకు కూడా స్థానం ఉంది. చేపలను తీసుకుంటే శరీరానికి ప్రోటీన్, విటమిన్లు,  ఆరోగ్యకరమైన కొవ్వులు కూడా అందుతాయి.  వారంలో కనీసం రెండు సార్లు అయినా చేపలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెబుతారు. అయితే చేపల కంటే ఎక్కువ పోషకాలు ఉన్న గింజలు ఉన్నాయి. ఈ గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే 10 రెట్ల పోషకాలు లభిస్తాయట. ఇంతకీ ఇవేం గింజలు.  వీటి ప్రయోజనాలేంటి తెలుసుకుంటే.. గుమ్మడి.. గుమ్మడి కాయ వినియోగం భారతదేశంలో ఎక్కువ.  గుమ్మడి కాయను కట్ చేసిన తరువాత చాలా మంది అందులో విత్తనాలు పడేస్తుంటారు. అయితే గుమ్మడి గింజలు పోషకాల నిధి.  గుమ్మడి గింజలను ఆహారంలో తీసుకుంటే చేపల కంటే అధిక శక్తి,  శరీరానికి ప్రయోజనాలను చేకూరుస్తాయట. 100 అత్యంత శక్తివంతమైన ఆహారాల జాబితాలో గుమ్మడి గింజలు ఆరవ స్థానం పొందాయి.  ఇక ఎంతో మేలు అని చెప్పుకునే చేపలు 77వ స్థానంలో నిలిచాయి. గుమ్మడికాయ గింజలలో పోషకాల విలువ 84 అయితే.. చేపలలో ఎంతో మంచిదని చెప్పుకునే సాల్మన్ చేపల పోషక విలువ 52 మాత్రమే. అందుకే గుమ్మడికాయ గింజలను అస్సలు మిస్ చేసుకోకుండా తినమని చెబుతున్నారు. పోషకాలు.. గుమ్మడికాయ గింజలలో ఐరన్, మాంగనీస్ వంటి పోషకాలు ఉంటాయి. ఇవి రక్తహీనతను తొలగించడంలో సహాయపడతాయి. శరీరంలో ఎముకలను బలోపేతం చేయడంలో కూడా సహాయపడతాయి. గుమ్మడి గింజలలో మెగ్నీషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. హార్ట్ బీట్ ను సక్రమంగా ఉంచడంలో సహాయపడుతుంది. గుమ్మడి గింజలలో ఉండే ఒమేగా-3,  ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు మంటను తగ్గించి,  చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో సహాయపడతాయి.  మంచి కొలెస్ట్రాల్ పెంచడంలో సహాయపడతాయి. గుమ్మడి గింజల్లో ఉండే జింక్ రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. శరీరానికి  ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యాన్ని ఇస్తుంది. విటమిన్ ఇ వాపును తగ్గించడం ద్వారా రోగనిరోధక శక్తిని మరింత పెంచుతుంది. ఇందులో ఉండే కెరోటినాయిడ్స్,  విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతాయి. మెగ్నీషియం, భాస్వరం,  జింక్ ఎముకల సాంద్రతను పెంచడానికి,  బోలు ఎముకల వ్యాధిని నివారించడానికి చాలా అవసరం. ఈ మూడు మూలకాలు గుమ్మడి గింజల్లో మంచి పరిమాణంలో ఉంటాయి. దీన్ని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఎముకలు బలపడతాయి. గుమ్మడికాయ గింజలు ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తాయి.   డయాబెటిస్ సమస్యలను నివారిస్తాయి. దీని గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రొటీన్,  ఫైబర్ ఆకలిని నియంత్రిస్తాయి, తద్వారా బరువును నియంత్రిస్తాయి. ముఖ్యమైన  విషయం ఏమిటంటే 100 గ్రాముల గుమ్మడి గింజల్లో 164 కేలరీలు మాత్రమే ఉంటాయి. అంటే ఇందులో కేలరీలు తక్కువ.                                             *రూపశ్రీ.

read more
వైద్యులు చెప్పిన ఈ సలహాలు పాటిస్తే 50 ఏళ్ల తర్వాత కూడా పూర్తీ ఫిట్ గా ఉంటారు..!

  పెరుగుతున్న వయస్సుతో  రోగనిరోధక వ్యవస్థ బలహీనపడటం అనేది ఒక సహజంగా జరిగేదే. దీనిని ఇమ్యునోసెన్సెన్స్ అంటారు. 50 తర్వాత దాని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తుంది. బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ కారణంగా, శరీరం వైరస్లు,  బ్యాక్టీరియాతో పోరాడడంలో విఫలమవుతుంది. ఇది ఫ్లూ, షింగిల్స్,  న్యుమోనియా వంటి వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అయితే  కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అనుసరించడం ద్వారా  రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఇందుకోసం వైద్యులు కొన్ని సలహాలు సూచిస్తున్నారు.   వీటిని పాటిస్తే  50 ఏళ్ల తర్వాత కూడా మిమ్మల్ని మీరు ఫిట్‌గా ఉంచుకోవచ్చు. నీరు.. తగినంత నీరు త్రాగడం అనేది చాలామంది  పట్టించుకోని విషయం.  కానీ ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు నీరు పుష్కలంగా తాగడం చాలా ముఖ్యం. శరీరంలో నీటి శాతం లోపిస్తే  శరీరం ఇన్ఫెక్షన్‌తో పోరాడే సామర్థ్యంపై ప్రతికూల ప్రభావాలను పడతాయి.  ఎందుకంటే ఇది రోగనిరోధక కణాల పనితీరును ప్రభావితం చేస్తుంది.   శరీరం యొక్క రక్షణ యంత్రాంగాన్ని బలహీనపరుస్తుంది. వయసు పెరిగే కొద్దీ మన దాహం తగ్గుతుంది. డీహైడ్రేషన్‌కు గురయ్యే ప్రమాదం కూడా పెరుగుతుంది. కాబట్టి  నీరు, హెర్బల్ టీలు  పండ్లు,  కూరగాయలతో సహా రోజంతా తగినంత ద్రవ ఆహారాన్ని తీసుకోవాలి. శరీరాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడం ద్వారా పోషకాలను గ్రహించడం, వ్యర్థాలను తొలగించడం,  మొత్తం రోగనిరోధక వ్యవస్థ పనితీరులో సహాయపడుతుంది. ఆహారం.. మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడానికి పోషకాహారం చాలా ముఖ్యం. వయసు పెరిగే కొద్దీ మన శరీరం పోషకాలను గ్రహించలేకపోతుంది. కాబట్టి  పండ్లు, కూరగాయలు, ధాన్యాలు,  లీన్ ప్రోటీన్లు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారం తీసుకోవాలి. రోగనిరోధక వ్యవస్థకు చాలా ముఖ్యమైన జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రోబయోటిక్స్ కూడా సహాయపడతాయి. విటమిన్లు సి,  ఇ, జింక్,  సెలీనియం వంటి పోషకాలు యాంటీఆక్సిడెంట్లుగా పనిచేస్తాయి.  శరీర కణాలను దెబ్బతినకుండా కాపాడతాయి. వ్యాక్సిన్లు.. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి లేదా పెరుగుతున్న వయస్సుతో సంభవించే ఇన్ఫెక్షన్ల నుండి రక్షించడానికి వ్యాక్సిన్  అనేది అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో ఒకటి. కాలక్రమేణా మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది. దీని కారణంగా వృద్ధులలో షింగిల్స్, న్యుమోనియా,  ఫ్లూ వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. వ్యాక్సిన్‌లు మన శరీరం ఈ ఇన్‌ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడే ప్రతిరోధకాలను తయారు చేయడంలో సహాయపడతాయి. ఉదాహరణకు, షింగిల్స్ వ్యాక్సిన్ 50 ఏళ్లు పైబడిన వారికి చాలా ముఖ్యమైనది, ఎందుకంటే చిన్ననాటి చికెన్ పాక్స్ మళ్లీ చురుకుగా మారవచ్చు.  ఇది  షింగిల్స్ వంటి బాధాకరమైన ఇన్‌ఫెక్షన్‌కు కారణమవుతుంది. నిద్ర.. మంచి నిద్ర మన శరీరానికి చాలా ముఖ్యం. ఇది మన శరీరాన్ని రిపేర్ చేయడం మరియు పునరుత్పత్తి చేయడమే కాకుండా, మన రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుతుంది. తగినంత నిద్ర లేకపోవడం వల్ల, మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, దాని కారణంగా మనం వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురవుతాము. నిజానికి, నిద్రలో మన శరీరం సైటోకిన్స్ అనే ప్రత్యేకమైన ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తుంది, ఇది ఇన్‌ఫెక్షన్ మరియు ఇన్‌ఫ్లమేషన్‌తో పోరాడడంలో సహాయపడుతుంది. తక్కువ నిద్ర కారణంగా, సైటోకిన్‌ల ఉత్పత్తి మందగిస్తుంది, దీని వల్ల వ్యాధులతో పోరాడే మన సామర్థ్యం బలహీనపడుతుందని మీకు చెప్పండి. అందువల్ల, ప్రతి రాత్రి 7-9 గంటలు మంచి నిద్ర పొందాలని లక్ష్యంగా పెట్టుకోవాలి, తద్వారా మన రోగనిరోధక శక్తి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటుంది. చురుకుదనం.. వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. వ్యాయామం చేయడం వల్ల  బరువు అదుపులో ఉండటమే కాకుండా కండరాలు బలపడతాయి.  వ్యాధులతో పోరాడే శక్తి పెరుగుతుంది.  నిత్యం వ్యాయామం చేస్తే మన శరీరంలో రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. రక్తంలో మన శరీరాన్ని వ్యాధుల నుంచి కాపాడే కొన్ని ప్రత్యేక కణాలు ఉన్నాయి. రక్త ప్రసరణ మెరుగుపడినప్పుడు ఈ కణాలు శరీరం అంతటా సులభంగా కదలగలవు.  ఏదైనా సూక్ష్మక్రిములతో పోరాడటానికి ఇవి సిద్ధంగా ఉంటాయి. వ్యాయామం చేయడం వల్ల మన శరీరంలో వాపులు కూడా తగ్గుతాయి.  ఇన్ఫ్లమేషన్ వయసు పెరిగే కొద్దీ వ్యాధులతో పోరాడే మన శరీర సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. కాబట్టి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా మనం  వాపును తగ్గించి ఆరోగ్యంగా ఉండవచ్చు.                                          *రూపశ్రీ.

read more
చలికాలంలో తెల్ల నువ్వులు తింటే ఈ లాభాలు సొంతం..!

  సీజన్ ను బట్టి శరీరానికి ఆహారం అందించాలి. అలా అందించినప్పుడే  శరీరం వాతావరణానికి తగినట్టు బలంగా ఉంటుంది.  ముఖ్యంగా ఇప్పుడు చలికాలం మొదలైంది.  ఈ చలికాలంలో శరీరం వెచ్చగా ఉండాలి. ఇందుకోసం ఆహారంలో మార్పులు చేసుకోవాలి.   అదే విధంగా పోషకాలు అధికంగా ఉన్న ఆహారం కూడా తీసుకోవాలి.  ఇలాంటి ఆహారాలలో నువ్వులు  ముఖ్యమైనవి. నువ్వులలో రెండు రకాలు ఉంటాయి.  వాటిలో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు రెండూ ఉన్నాయి.  కానీ చలికాలంలో తెల్ల నువ్వులు తీసుకుంటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయట.  అవేంటో తెలుసుకుంటే.. నువ్వులు వేడి గుణం కలిగి ఉంటాయి. చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి తెల్ల నువ్వులను తీసుకోవాలి. తెల్ల నువ్వులను రోజూ కనీసం ఒక స్పూన్ మొత్తంలో తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  చలికాలంలో వచ్చే జలుబు,  దగ్గు, ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులను తగ్గించడలో ఇది సహాయపడుతుంది. తెల్ల నువ్వులలో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఫైబర్ ఉన్న ఆహారం తీసుకుంటే జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది.  చలికాలంలో జీర్ణక్రియ సహజంగానే నెమ్మదిస్తుంది.  ఈ జీర్ణక్రియను ఆరోగ్యంగాను,  వేగంగా చేయడంలో తెల్ల నువ్వులు సహాయపడతాయి.  దీని కారణంగా మలబద్దకం సమస్య కూడా దరిచేరదు. తెల్ల నువ్వులలో లిగ్నాన్స్,  ఫైటూస్టెరాల్స్ ఉంటాయి.  ఇవి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.  శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడాన్ని ఇది తగ్గిస్తుంది. నువ్వులలో కాల్షియం,  మెగ్నీషియం, మాంగనీస్,  ఫాస్పరస్ వంటి ముఖ్యమైన ఖనిజాలు ఉంటాయి.  ఇవి ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. నువ్వులలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చాలా శక్తివంతంగా పనిచేస్తాయి.  ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలోనూ,  ఆరోగ్య సమస్యలను నివారించడంలోనూ సహాయపడతాయి. చలికాలంలో ఎముకలకు సంబంధించిన సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ఆర్థరైటిస్,  కీళ్ల నొప్పులు పెరుగుతాయి. కానీ తెల్ల నువ్వులు తీసుకోవడం వల్ల ఈ నొప్పులు తగ్గుతాయి.                                                       *రూపశ్రీ.

read more
చలికాలంలో బొప్పాయి తింటే ఈ లాభాలన్నీ సొంతం..!

శరీరానికి పండ్లు ఎంతగానో మేలు చేస్తాయి.  ఆరోగ్యం బాగా లేనప్పుడు పండ్లను బాగా తీసుకుంటే తొందరగా అనారోగ్యం నుండి బయటపడతారు.  అయితే పండ్లు కూడా సీజన్ ను బట్టి తీసుకుంటే శరీరానికి ఎక్కువ లాభం కలుగుతుంది.  ప్రస్తుతం చలికాలం సాగుతున్న తరుణంలో చలికాలంలో బొప్పాయి తింటే మంచిదని అంటున్నారు.  బొప్పాయి తింటే కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో కాస్త వేడి గుణం కలిగిన ఆహారాలు తీసుకోవాలి. దీనివల్ల శరీరం వెచ్చగా ఉంటుంది.  చలి కారణంగా శరీరం డిస్టర్బ్ అవ్వదు. బొప్పాయిలో కూడా వేడి గుణం కలిగి ఉంటుంది.  చలికాలంలో వీలైనపుడల్లా బొప్పాయిని తినాలి. చలికాలంలో బొప్పాయిని తింటే రోగనిరోధక శక్తి పెరుగుతుంది.  బొప్పాయిలో విటమిన్-సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.  విటమిన్-సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  చలికాలంలో వచ్చే సీజన్ సమస్యలను ఎదుర్కోవడంలో సహాయపడుతుంది.  దగ్గు, జలుబు, చలికారణంగా ఎదురయ్యే తలనొప్పి, ఫ్లూ వంటి సమస్యలకు చెక్ పెడుతుంది. బొప్పాయి పండులో ఎక్కువ శాతం ఫైబర్ ఉంటుంది. అలాగే ఇందులో ఎంజైమ్ లు కూడా అధిక మొత్తంలో ఉంటాయి.  ఇవన్నీ జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయి.  మలబద్దకం,  మోషన్ కావడంలో ఇబ్బందులు,  అజీర్తి వంటి సమస్యలు బొప్పాయి తినడం వల్ల అధిగమించవచ్చు. బొప్పాయిలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది.  ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది.  ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.  గుండెకు సంబంధించిన జబ్బులు రాకుండా చేస్తాయి. కఠినమైన  వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. గుండె యవ్వనంగా ఉండాలన్నా,  ఎంత వయసు పెరిగినా ఇంకా యవ్వనంగా ఉన్నవారిలా గుండె పనిచేయాలని కోరుకుంటున్నా బొప్పాయిని తినమని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయికి చాలా మేలు చేస్తుంది.  ఇందులో ఉండే విటమిన్-సి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది.  విటమిన్-సి గొప్ప యాంటీ ఆక్సిడెంట్ కాబట్టి ఇది చర్మ కణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది.  చర్మానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడుతుంది. బొప్పాయిలో ఉండే పోషకాలు చలికాలంలో కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.  కేవలం ఆహారంగానే కాకుండా  చర్మ సంరక్షణలో కూడా బొప్పాయిని చేర్చుకోవచ్చు.  బొప్పాయి ఫేస్ వాష్,  బొప్పాయి ఫేస్ ప్యాక్ ట్రై చేయచ్చు. చలికాలంలో వేడి ఆహారాల మీద అందకీ కన్ను ఉంటుంది.  ముఖ్యంగా నూనెలో డీప్ ఫ్రై చేసే పకోడీలు,    వడలు,  సమోసా వంటి స్నాక్స్ ను ఇష్టపడతారు.  వీటి వల్ల బరువు వేగంగా పెరుగుతారు.  కానీ బొప్పాయి తీసుకుంటే ఆకలి ఎక్కువగా కాదు.  ఎందుకంటే ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీల్ ఇస్తుంది.  కాబట్టి దీన్ని తింటే బరువు పెరగకపోవడమే కాకుండా.. బరువు తగ్గడం కూడా సులువు.                                                    *రూపశ్రీ.

read more
వాటర్ చెస్ట్ నట్ తిన్నారా? ఇవి తింటే కలిగే లాభాలు ఇవే..!

శరీరానికి ఆహారం చేసే మేలు అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆహారంలో పండ్లు, కూరగాయలు,  డ్రై ఫ్రూట్స్,  డ్రై నట్స్ వంటివి ఉండాలి.  వీటి నుండి విటమిన్లు,  మినరల్స్, ప్రోటీన్లు అన్నీ శరీరానికి లభిస్తాయి. అయితే సీజన్ అనుగుణంగా లభించే వాటిలో శరీరానికి కావలసిన పోషకాలు, శరీరానికి మేలు చేసే సమ్మేళనాలు మెరుగ్గా ఉంటాయి. అలాంటి వాటిలో వాటర్ చెస్ట్ నట్స్ కూడా ఒకటి.  వీటిని తెలుగులో సింగోడ అని అంటారు.  ఇవి శీతాకాలంలో మార్కెట్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇవి రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడతాయి.  శీతాకాలంలో ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తప్పకుండా తినాలని ఆహార నిపుణులు చెబుతున్నారు.  ఇంతకీ ఇవి తింటే కలిగే లాబాలు తెలుసుకుంటే.. వాటర్ చెస్ట్ నట్ తింటే రోగనిరోధక శక్తి బలపడుతుంది.  ఇది వివిధ రకాల వ్యాధులతో పోరాడటంలో సహాయపడుతుంది. ఏవైనా జబ్బులు వచ్చినప్పుడు ఈ వాటర్ చెస్ట్ నట్స్ ను తింటూ ఉంటే తొందరగా రికవరీ కావచ్చు. చలికాలంలో జీర్ణ వ్యవస్థ నెమ్మదిస్తుంది.  దీని కారణంగా ఆహారం జీర్ణం కావడంలో ఇబ్బందులు ఏర్పడతాయి.  మలబద్దకం, అజీర్ణం వంటి సమస్యలు ఏర్పడతాయి. కానీ వాటర్ చెస్ట్ నట్స్ తింటే  జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది.  మలబద్దకం సమస్యలు తగ్గుతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది.  ఇది రక్త పోటును అదుపులో ఉంచుతుంది.  దీని కారణంగా చలికాలంలో గుండె సంబంధ వ్యాధుల బారిన పడే అవకాశం తగ్గుతుంది.  సాధారణంగా చలికాలంలో శరీరంలో రక్తప్రసరణ తగ్గడం వల్ల గుండె కండరాలు బిగుసుకుపోయినట్టు ఉంటాయి. కానీ ఈ సమస్య తగ్గించడంలో వాటర్ చెస్ట్ నట్స్ సహాయపడతాయి. వాటర్ చెస్ట్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో చర్మం మెరుస్తూ ఉండేలా చేయడంలో సహాయపడతాయి. ముఖం మీద మొటిమలను  తొలగించడమే కాకుండా కాలుష్యం వల్ల వచ్చే సమస్యల నుండి కూడా ఇవి కాపాడతాయి. అన్నింటి కంటే ముఖ్యంగా వాటర్ చెస్ట్ నట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది.  ఈ ఫైబర్ శరీరానికి చాలా అవసరం.  ఇది ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడంలో సహాయపడుతుంది.  ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది.  ఫలితంగా బరువు తగ్గడంలో సహాయపడుతుంది.                                           *రూపశ్రీ.     

read more
చలికాలంలో ఈ ఆహారాలను పొరపాటున కూడా తినకూడదు..!

  ఆహారమే ఆరోగ్యం అనే మాట వినే ఉంటారు.  శరీరానికి శక్తిని ఇచ్చేది ఆహారమే.  అయితే ఆరోగ్యానికి ఔషధంలా పని చేసే ఆహారమే అనారోగ్యాన్ని కూడా తెచ్చిపెడుతుంది. దీనికి కారణం సీజన్.. సీజన్ కు తగ్గట్టు ఆహారం తినాలని అంటుంటారు.  ఏ కాలంలో పండే కూరగాయలు, పండ్లు ఆ కాలంలో తింటే ఎలాంటి జబ్బులు పెద్దగా ఇబ్బంది పెట్టవు. కానీ నేటి కాలంలో పరిస్థితి వేరుగా ఉంది.  ఏ సీజన్ లో అయినా ఎలాంటి ఆహారం అయినా దొరుకుతుంది.  కొందరు  ఖరీదు ఎక్కువ పెట్టి సీజన్ లో లభించని ఆహారాలు కొని తినడాన్ని గొప్పగా ఫీలవుతారు కూడా. అయితే చలికాలంలో కొన్ని ఆహారాలు తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఈ ఆహారాలు తినడం వల్ల ఆరోగ్యం పాడయ్యి వ్యాధుల బారిన పడతారట. చాలా వరకు ఏ ఆహారాలు హాని కలిగిస్తాయి అనే విషయం చాలా మందికి తెలియదు.  సాధారణ రోజుల్లో ఎంతో ఆరోగ్యం అనుకునే ఆహారాలే ఆ తరువాత హాని కలిగిస్తాయి.  చలికాలంలో తినకూడని ఆహారాలేంటో తెలుసుకుంటే.. చలికాలంలో ఐస్ క్రీమ్ తినడం,  వర్షం పడుతుండగా ఐస్ క్రీమ్ ఆస్వాదించడం చాలామంది అదేదో  గొప్పగా చెబుతారు. కానీ చలికాలంలో చాలావరకు ఐస్ క్రీములు,  చల్లని జ్యూసులు తీసుకోవడం వల్ల జలుబు,  దగ్గు,  ఇతర సీజనల్ సమస్యలు చాలా తొందరగా వస్తాయి. చల్లని వాతావరణంలో వేడిగా ఏదైనా తినాలని అనుకునే చాలామంది నూనెలో వేయించిన ఆహారాలు,  కరకరలాడే ఫ్రై లు తినాలని అనుకుంటారు.  అలాంటి ఆహారానికే మొగ్గు చూపుతారు. కానీ చలికాలంలో సాధారణంగానే జీర్ణవ్యవస్థ పనితీరు నెమ్మదిస్తుంది.  ఇది జీర్ణవ్యవస్థను పాడు చేసి అజీర్ణం,  మలబద్దకం వంటి సమస్యలు కలిగిస్తుంది. బాగా కారంగా ఉన్న ఆహారం తినడాన్ని ఇష్టపడే వారు అధికం అయ్యారు.  కారం తినడం అంటే తమ వ్యక్తిత్వం, శరీరం బాగా బలంగా ఉందని వ్యక్తం చేయడం అనుకుంటారు. దీని కారణంగానే చాలామంది బిరియానీ,  మసాలా వంటకాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ ఇలాంటి ఆహారాలు తినడం వల్ల చలికాలంలో ఎసిడిటీ,  గుండెల్లో మంట వంటి సమస్యలు వస్తాయి. చలికాలంలో జీర్ణ వ్యవస్థ పనితీరు నెమ్మదిగా ఉంటుంది. జీర్ణం కావడానికి ఎక్కువ సమయం తీసుకునే ఆహారాలను ఈ కాలంలో తీసుకోకపోవడమే మంచిది.  అలాంటి ఆహారాలలో పచ్చి కూరగాయలు కూడా ఒక భాగం.  పచ్చి కూరగాయలను తినడం మానుకోవాలి. చక్కెర ఎక్కువగా జోడించిన ఆహారాలు తినడం వల్ల జలుబు, ఫ్లూ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  వీటిని చలికాలంలో వీలైనంత వరకు తగ్గించాలి.                                                *రూపశ్రీ.

read more