జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. ఈ  గింజలు గుండె జబ్బులను పెంచుతాయా!

  కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మీకు చెవులలో శబ్దాలు వినిపిస్తుంటాయా అయితే కొంప మునిగినట్టే..

  మన శరీరంలోని అన్ని భాగాలు ఒకదానితో ఒకటి అనుసంధానించబడి ఉంటాయి, అందుకే ఏదైనా ఒక భాగంలో సమస్య తలెత్తితే అది మొత్తం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది. సాధారణంగా గుండె-ఊపిరితిత్తుల వంటి అవయవాలలో ఏర్పడే సమస్యల గురించి మనమందరం  అప్రమత్తంగా ఉంటాము. ఆ సమస్యల గురించి తెలుసుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. కానీ కళ్ళు,  చెవులు వంటి అవయవాల ఆరోగ్యంపై పెద్దగా శ్రద్ధ చూపం. ఆరోగ్య నిపుణులు  కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. కానీ ఈ అవయవాలలో సమస్యలు  తీవ్రమైన దుష్ప్రభావాల ప్రమాదాన్ని కూడా కలిగిస్తాయి. చాలామంది చెవులలో ఒకరకమైన శబ్ధం రావడం గమనిస్తుంటారు. ఇదొక టోన్ లాను, సముద్రపు హోరు లానూ, బీప్ వంటి శబ్ధం లాను ఉంటుంది. చాలామంది ఇదేమి చేస్తుందిలే.. తగ్గిపోతుంది. మనకు బాగా వినిపిస్తోంది కదా అనే నిర్లక్ష్యంతో పట్టించుకోరు. కానీ ఈ చెవి సమస్యను తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది, ఎందుకంటే ఇది  దీర్ఘకాలిక ప్రమాదాలను కలిగి ఉండే ప్రమాదముంది. ఇలా శబ్ధం వినిపించడాన్ని టిన్నిటస్ అని అంటారు.  టిన్నిటస్ సమస్య..  టిన్నిటస్ సమస్యలో  చెవులలో ఒకటి లేదా రెండింటిలో రింగింగ్ లేదా ఇతర శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇవి బయట నుండి వినిపించేవి కాదు. ఈ శబ్దాలు కేవలం ఈ సమస్య ఉన్నవ్యక్తులకే వినిపిస్తుంది . ఇతరులు దీన్ని వినలేదు. టిన్నిటస్ అనేది చాలా సాధారణ సమస్య  15% నుండి 20% మంది వ్యక్తులను ఇది ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా వృద్ధులలో ఇది వస్తుంటుంది. సాధారణంగా టిన్నిటస్ అనేది అంతర్లీన సమస్య వల్ల వస్తుందని, దానిని గమనించి చికిత్స చేయవలసి ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్ కారణం కావచ్చు.. ఆరోగ్య నిపుణులు, టిన్నిటస్ ను సాధారణంగా వయస్సు-సంబంధిత వినికిడి లోపం, చెవి గాయం లేదా ఇన్ఫెక్షన్  వంటి అంతర్లీన సమస్య వల్ల సంభవించవచ్చని చెబుతున్నారు. ఈ పరిస్థితులను సకాలంలో గుర్తించకపోతే లేదా చికిత్స చేయకపోతే, దీని కారణంగా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.  టిన్నిటస్ సమస్యకు  జలుబు వంటి ఎగువ శ్వాసకోశ ఇన్ఫెక్షన్ కూడా కారణం కావచ్చు, దీని గురించి కూడా శ్రద్ధ వహించాలి. ఈ సమస్యకు  సమయానికి చికిత్స చేయకపోతే, ఇది చెవికి సంబంధించి అనేక ఇతర సమస్యలకు దారితీస్తుంది, చెవుడు కూడా వ్వచే అవకాశం ఉంటుంది.  వినికిడి సమస్య శాశ్వతంగా తగ్గిపోవచ్చు.. ఆరోగ్య నిపుణులు అంటున్నారు, మన చెవి లోపలి భాగంలో చిన్న, సున్నితమైన కణాలు ఉంటాయి, అవి ధ్వని తరంగాలను స్వీకరించినప్పుడు కంపిస్తాయి. లోపలి చెవిలో ఏదైనా సమస్య ఉంటే, అది టిన్నిటస్‌కు కూడా కారణమవుతుంది.  సమయానికి చికిత్స చేయకపోతే, చెవుల శక్తి  తగ్గిపోతుంది. ఇది కాకుండా, చెవి ఇన్ఫెక్షన్ లేదా చెవిలో ఏవైనా అడ్డుపడటం వల్ల కూడా  ఈ సమస్య రావచ్చు. చెవి ఇన్ఫెక్షన్‌కు సకాలంలో చికిత్స అందకపోతే, మెదడు మాత్రమే కాకుండా ఇతర భాగాలపై కూడా దాని ప్రభావం పడే ప్రమాదం ఉంది.                              *నిశ్శబ్ద.

read more
Online Jyotish
Tone Academy
KidsOne Telugu
తీపి కూడా ఓ వ్యసనమే!

  కొన్ని దశాబ్దాల క్రితం పరిస్థితులతో పోల్చుకుంటే ఇప్పటి జీవనవిధానం మారింది. శారీరిక శ్రమ తగ్గిపోయింది, ఎక్కడికక్కడ పని సులువుగా జరిగిపోతోంది. కానీ అందుకు విరుద్ధంగా ఆహారపు అలవాట్లు మాత్రం దిగజారిపోయాయి. ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలియని పరిస్థితి. అందుకనే ఇప్పుడు కొత్త కొత్త సమస్యలు మొదలవుతున్నాయి. కొత్త కొత్త పదాలు వినిపిస్తున్నాయి. వాటిలో ఒకటే ‘కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌’. ఏమిటీ కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌! మన ఆహారంలో పిండిపదార్థలు ఓ ముఖ్య పాత్రని వహిస్తాయని తెలిసిందే! అయితే ఈ పిండి పదార్థాలను ఎడాపెడా తీసుకోవడం వల్ల వాటిలోని అధిక చక్కెర మన శరీరాన్ని నిర్వీర్యం చేసే ప్రమాదం ఉంది. ముఖ్యంగా బేకరీ పదార్థాలు, శీతల పానీయాలు, స్వీట్లు, తియ్యటి తేనీరు, చాక్లెట్లు, ఐస్ క్రీములు... ఇలా చెప్పుకుంటో పోవాలే కానీ చక్కెర అధికంగా ఉండే పదార్థాల జాబితా చాంతాడుని మించిపోతుంది. కొంతమంది ఈ పదార్థాలను వదిలి లేకపోవడమే కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్. ఏం జరుగుతుంది కార్బోహైడ్రేట్‌ ఎడిక్షన్‌ ఉన్నవారు చక్కెర అధికరంగా ఉండే పదార్థాలను తినేందుకు ఉబలాడపడిపోతుంటారు. ఒకటి రెండు రోజుల పాటు ఇలాంటి పదార్థాల దొరక్కపోతే వీరికి చాలా చిరాగ్గా ఉంటుంది. పిల్లలైతే ఆ పదార్థాన్ని తీసుకునేదాకా పేచీ పెడుతూనే ఉంటారు. వీరి శరీరం చక్కెరకు అలవాటు పడటం వల్ల, చక్కెర తీసుకున్న వెంటనే వారి ఒంట్లో ‘డోపమైన్‌’ అనే రసాయనం ఉత్పత్తి అవుతుంది. ఈ డోపమైన్‌ మనసు సంతోషంగా ఉన్న ఒక భావనని కలిగిస్తుంది. మద్యం వంటి వ్యసనాలలో కూడా ఈ డోపమైన్‌దే ముఖ్య పాత్ర. తరచూ ఏదో ఒక చక్కెర పదార్థాన్ని తినాలని నాలుక లాగుతూ ఉంటడం, ఎదురుగుండా ఎంత తీపి పదార్థం ఉంటే... అంతా తినేయడం, ఊబకాయం వస్తున్నా కూడా ఆహారాన్ని నియంత్రించుకోకపోవడం... ఇవన్నీ కూడా కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ లక్షణాలే! ప్రమాదం కార్బొహైడ్రేట్ ఎడిక్షన్‌ అనేది ఆషామాషీగా తీసుకోవల్సిన లక్షణం కాదని ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. చిన్నవయసులో ఊబకాయం బారిన పడేవారిలో 75 శాతం మందిలో ఈ లక్షణం కనిపిస్తోందట. కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉన్న వారిలో ఇన్సులిన్‌ చాలా అధికంగా ఉత్పత్తి అవుతుంది. అది కొన్నాళ్లకి అస్తవ్యస్తంగా మారిపోయి, చక్కెర వ్యాధికి దారితీస్తుంది. ఇక ఒంట్లో కొవ్వు పేరుకుపోవడం వల్ల వచ్చే గుండెజబ్బుల వంటి ఇతరత్రా సమస్యల గురించి చెప్పనే అక్కర్లేదు. పైగా చక్కెర అధికంగా ఉండే చాలా పదార్థాలలో విటమిన్లు, ఖనిజాలు తదితర పోషక పదార్థాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి శరీరం ఆరోగ్యంగా కనిపిస్తుందే కానీ, కూర్చుంటే లేవలేనంత నిస్సత్తువ ఉంటుంది. మరేం చేయడం! - ముందుగా తీపి పదార్థాలలోనే కాస్త ఆరోగ్యకరమైనవి ఎంచుకోండి. ఉదాహరణకు పండ్ల రసాలకు బదులుగా పండ్లు, ఐస్‌క్రీంకు బదులుగా పెరుగు... ఇలాగన్నమాట. - ఇంట్లో అదేపనిగా చిరుతిళ్లను నిలువ చేసుకోవడం అపేయండి. మీ ఇంట్లో చిరుతిండి డబ్బాలను ఖాళీ చేయండి. - ఆకలి వేయకపోయినా కూడా ఏదో ఒకటి తినాలని నోరు పీకేస్తుంటే బాదం పప్పులు, టమోటాలు, ఆమ్లెట్లు, మొలకలు... ఇలా తక్కువ పిండి పదార్థాలు ఉండే చిరుతిళ్లని తీసుకోండి. - నీరు తాగడం వల్ల ఆకలి తాత్కాలికంగా ఉపశమిస్తుంది. కడుపు నిండిన భావనా కలుగుతుంది. ఒంట్లోని చెడంతా బయటకి పోవడమూ ఉంటుంది. కాబట్టి కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్‌ నుంచి బయటపడే వరకూ కాస్త మంచినీరుని ఆరారగా తీసుకుంటూ ఉండండి. - వ్యాయామం వంటి శారీరిక శ్రమను అలవాటు చేసుకోండి. దీని వల్ల కొవ్వు కరగడమే కాదు, శరీరంలో ‘నిజమైన’ ఆకలి మొదలవుతుంది. అది తీపి పదార్థాల మీద కాకుండా పోషక పదార్థాలను తీసుకోవాలని కోరుకుంటుంది. - మీ పిల్లల్లో కనుక కార్బొహైడ్రేట్‌ ఎడిక్షన్ ఉందని గమనిస్తే, వారిని కూర్చోపెట్టి అందులోని లాభనష్టాల గురించి వివరించండి. - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా.. ఎంత హాని చేస్తుందో తెలిస్తే షాక్ అవుతారు!

  ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. ఇందుకోసం ఏవేవో చెయ్యక్కర్లేదు. తాజా ఆకుకూరలు, కూరగాయలు తింటుంటే ఆరోగ్యం ఆఫహే చేకూరుతుంది. మరీ ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండటానికి ఆకుపచ్చ కూరగాయలు పండ్లను తినమని పెద్దలు చెబుతారు. అన్ని రకాల కూరగాయలు తిన్నప్పుడే ఆరోగ్యం బాగుంటుంది. కానీ చాలామంది కొన్నింటికి స్టిక్ అయిపోయి ఉంటారు. అయితే ఆరోగ్య ప్రయోజనాల దృష్ట్యా కొందరు కొన్ని కూరగాయలను, పండ్లను ఎక్కువగా తీసుకుంటారు. అలాంటి వాటిలో కాకరకాయ కూడా ఒకటి. పిల్లలకు ఏమాత్రం ఇష్టం లేని ఈ కాకరకాయ ఆరోగ్యానికి మంచిదే అయినా విపరీతంగా తింటే చెప్పలేనన్ని సమస్యలు వస్తాయి.  కాకరకాయ తినడం వల్ల బరువు తగ్గవచ్చు, కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా అదుపులో ఉంటాయి. గుండె వేగాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో కూడా కాకరకాయ ఉపయోగపడుతుంది. అయితే కాకరకాయను ఎక్కువగా తీసుకోవడం వల్ల బోలెడు నష్టాలు ఫేస్ చేయాల్సిందే.. ఏదైనా మితిమీరితే హానికరం అనే మాట తెల్సిందే కదా.. కాకరకాయను ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యంపై పడే చెడు ప్రభావాల గురించి నష్టాల గురించి తెలుసుకుంటే..  కాకరకాయ  తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుందని అందరూ అనుకుంటారు. అయితే సాధారణ వ్యక్తుల్లో షుగర్ లెవల్స్ సాధాణంగానే ఉంటాయి. ఇలాంటి వారు కాకరకాయను ఎక్కువ తీసుకుంటే షుగర్ లెవెల్స్ మీద ప్రభావం పడుతుంది. అలాగే అధిక షుగర్ లెవెల్స్ ఉన్నవారు షుగర్ కంట్రోల్ ఉండటానికి మెడిసిన్ వాడుతుంటారు. ఇలాంటి వాళ్ళు కాకరకాయ ఎక్కువ తిన్నా షుగర్ లెవల్స్ డౌన్ అవుతాయి. అలాగే, హిమోలిటిక్ అనీమియా ప్రమాదం కూడా కాకరకాయ ఎక్కువ తినడం వల్ల పెరుగుతుంది. గర్భధారణ సమయంలో కాకరకాయను తినకూడదు. దీన్ని ఎక్కువగా తినడం వల్ల పుట్టబోయే బిడ్డకు హాని కలుగుతుంది. గర్భిణీ స్త్రీలు కాకరకాయకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది.  కాకరకాయను ఎక్కువగా తీసుకునేవారికి కాలేయానికి సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.  కాకరకాయలో లెక్టిన్ ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల కాలేయంలో ప్రొటీన్ల కమ్యూనికేషన్ నిలిచిపోతుంది. అందుకే పొట్లకాయను రెగ్యులర్ గా, ఎక్కువగా తినకూడదు. కాకరకాయ ఎక్కువగా తినడం వల్ల విరేచనాలు, వాంతుల సమస్య పెరుగుతుంది. కాకరకాయలో బోలెడు ప్రయోజనాలున్నాయని దాన్ని ఇంట్లో వారికి, పిల్లలకు ఎక్కువగా వండిపెట్టే వారు దీనిగురించి తెలుసుకోవాలి. ఆరోగ్యానికి మంచిదే అయినా హాని కూడా కలిగించడంలో కాకరకాయ కూడా ఒకటనే విషయం మరచిపోకూడదు.                                        ◆నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
సీజన్ మారుతోంది.. ఈ జాగ్రత్తలు పాటించండి..

  సీజన్ మారుతున్నప్పుడు శరీర ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతిసారి వాతావరణం మారినప్పుడు రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడం, సరైన జీవనశైలి పాటించడం ముఖ్యం. ఇందుకోసం కొన్ని ఆరోగ్య చిట్కాలు పాటించాలి.  ప్రస్తుతం వేసవి కాలం సాగుతున్నా.. వర్షాలు పడుతూ వాతావరణం చాలా డిస్టర్బ్ గా ఉంటోంది.  వర్షాలు వేసవిలో ఊరట అనిపిస్తాయి కానీ వీటి వల్ల కలిగే సమస్యలు కూడా ఉంటాయి.  ఈ వాతావరణ మార్పులలో పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటంటే.. పరిమిత ఆహారం తీసుకోవాలి. హైడ్రేట్‌డ్‌గా ఉండాలి.  వాతావరణం చల్లగా ఉంది కదా అని నీరు తగ్గించకూడదు.ఎక్కువ నీరు త్రాగాలి. తాజా పండ్లు, కూరగాయలు తీసుకోవాలి. విటమిన్ C ఎక్కువగా ఉన్న ఆహారం (లేత నిమ్మకాయ, ఉసిరికాయ, కివి, నారింజ) శరీర రక్షణ శక్తిని పెంచుతుంది. వేడి లేదా బరువుగా ఉన్న ఆహారం తక్కువగా తీసుకోవాలి (ముఖ్యంగా ఈ వేసవిలో). చల్లటి పదార్థాలు (ఐస్ క్రీమ్, చల్లని పానీయాలు) ఎక్కువగా తీసుకోవడం వలన శరీరం పై ప్రభావం చూపొచ్చు, జాగ్రత్తగా ఉండాలి.  ముఖ్యంగా వాతావరణం చల్లగా ఉన్న సమయంలో వాతావరణ మార్పులకు అలవాటు పడటం మంచిది. ఉదయం సూర్యోదయ సమయానికి బయట తిరగడం మంచిది. ఇది శరీరానికి డే-నైట్ సైకిల్‌ను స్థిరపరుస్తుంది. బయట ఉష్ణోగ్రత ప్రకారంగా దుస్తులు ధరించండం వల్ల చాలా మంచి ఉపశమనం ఉంటుంది. వ్యాయామం & యోగా చేయడం మరచిపోకూడదు. రోజూ కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ లేదా యోగా చేయాలి.  “ప్రాణాయామం” లాంటి శ్వాస వ్యాయామాలు శ్వాస సంబంధిత సమస్యలను తగ్గిస్తాయి. అలాగే ప్రకృతిలో కొంత సమయం గడపడం కూడా మంచిది. నిద్ర – విశ్రాంతి విషయంలో చాలా కేర్ గా ఉండాలి. ప్రతి రోజు కనీసం 7-8 గంటల నిద్ర తప్పనిసరిగా తీసుకోవాలి.  రాత్రిళ్లు ఆలస్యంగా మేలుకుని ఉండకూడదు. ఇది శరీర రక్షణ శక్తిని తగ్గిస్తుంది. హైజెనిక్ గా ఉండాలి.  శుభ్రత,  స్వచ్చత   పాటించడం చాలా ముఖ్యం.  తరచూ చేతులు కడుక్కోవడం అలవాటు చేసుకోవాలి.  బయట తినే ఆహారం తగ్గించాలి. ఇంటి ఆహారమే చాలా ఆరోగ్యం. ఆయుర్వేద చిట్కాలు పాటిస్తే మంచిది.  రోజూ ఉదయం ఉసిరికాయ పౌడర్ లేదా   "చ్యవనప్రాశ్" తీసుకోవచ్చు. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  తులసి, అల్లం, మిరియాలు,  తేనెతో చేసిన కషాయం చలికాలంలో ఉపయోగపడుతుంది. సీజనల్ సమస్యలను సమర్థవంతగా ఎదుర్కుంటుంది.                                     *రూపశ్రీ గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
నారింజ కంటే ఎక్కువ విటమిన్-సి ఉండే పండ్లు ఇవే..!

విటమిన్ సి మన శరీరానికి అవసరమైన పోషకం. ఇది రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో, చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో, శరీరంలోని యాంటీఆక్సిడెంట్ల లోపాన్ని తీర్చడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. చాలామంది  ప్రజలు నారింజ పండ్లను విటమిన్ సి కి ఉత్తమ వనరుగా భావిస్తారు. కానీ కొన్ని పండ్లు నారింజ కంటే ఎక్కువ విటమిన్ సి ని అందిస్తాయి. విటమిన్ సి స్థాయిలో నారింజను కూడా అధిగమించే ఆ 4 పండ్లు  అయిన సహజ విటమిన్ సి ఆహారాల గురించి తెలుసుకుంటే.. ఉసిరి.. ఉసిరి విటమిన్ సి  ఉత్తమ వనరుగా పరిగణించబడుతుంది. ఒక నారింజ పండు కంటే ఒక ఉసిరిలో దాదాపు 20 రెట్లు ఎక్కువ విటమిన్ సి ఉంటుంది. 100 గ్రాముల ఉసిరికాయలో దాదాపు 600-700 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. అయితే నారింజలో ఈ పరిమాణం 50-60 మి.గ్రా మాత్రమే. ఉసిరిలో  విటమిన్ సి మాత్రమే కాకుండా, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్,  ఇతర పోషకాలు కూడా ఉంటాయి.  ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఉసిరిని పచ్చిగా, జ్యూస్, చట్నీ లేదా పొడి రూపంలో తినవచ్చు. కెవి.. కివి ఒక చిన్న పండు. కానీ దాని పోషక విలువలు చాలా ఎక్కువ. ఒక కివిలో నారింజ పండులో ఉండే విటమిన్ సి దాదాపు రెండు రెట్లు ఎక్కువ. 100 గ్రాముల కివిలో దాదాపు 90-100 మి.గ్రా. విటమిన్ సి లభిస్తుంది. కివిలో ఫైబర్, పొటాషియం,  ఇతర యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి.  ఇవి గుండె ఆరోగ్యానికి,  జీర్ణవ్యవస్థకు మేలు చేస్తాయి . కివిని నేరుగా తినవచ్చు లేదా ఫ్రూట్ సలాడ్‌లో కలపవచ్చు. స్ట్రాబెర్రీ.. స్ట్రాబెర్రీలు రుచికరమైనవి మాత్రమే కాదు, అవి విటమిన్ సి కి గొప్ప మూలం కూడా. 100 గ్రాముల స్ట్రాబెర్రీలో 60-70 మి.గ్రా విటమిన్ సి ఉంటుంది. ఇది నారింజ కంటే కొంచెం ఎక్కువ. స్ట్రాబెర్రీలలో మాంగనీస్, ఫోలేట్,  పొటాషియం కూడా ఉంటాయి. ఇవి శరీరానికి శక్తిని అందించడానికి,  ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడతాయి . స్ట్రాబెర్రీలను తాజా పండ్లు, స్మూతీలు లేదా డెజర్ట్‌గా తినవచ్చు. బొప్పాయి.. బొప్పాయి జీర్ణవ్యవస్థకు మేలు చేయడమే కాకుండా విటమిన్ సి అధికంగా ఉండే పండు. 100 గ్రాముల బొప్పాయిలో దాదాపు 60-70 మి.గ్రా విటమిన్ సి లభిస్తుంది. ఇది నారింజ కంటే ఎక్కువ. బొప్పాయిలో విటమిన్ ఎ, ఫైబర్,  ఎంజైమ్‌లు కూడా ఉన్నాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. బొప్పాయిని పచ్చిగా,  పండిన తరువాత రెండు విధాలుగా కూడా  తినవచ్చు.                                   *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
మనసు బాగోకపోతే... ఆర్థికంగా దివాళా!

ఆర్థిక సమస్యలు మనిషిని మానసిక ఒత్తిడికి లోను చేస్తాయని తెలుసు. కానీ మానసిక ఒత్తిడి మరిన్ని ఆర్థిక సమస్యలకి దారితీస్తుందనీ... ఇదొక విషవలయం అనీ ఎప్పుడన్నా అనిపించిందా! ఈ విషయంలోని నిజానిజాలను తెలుసుకునేందుకు బ్రిటన్‌కు చెందిన ‘Money and Mental Health Policy Institute’ ఒక పరిశోధనను నిర్వహించింది. ఇందులో భాగంగా 5,500 మంది అభిప్రాయాలను సేకరించింది. మానసికమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నవారి ఆర్థిక జీవితం ఏమంత సజావుగా సాగడం లేదని ఈ పరిశోధన నిరూపించింది. విచ్చలవిడిగా ఖర్చుపెట్టేయడం, అవసరం లేకున్నా అప్పులు తీసుకోవడం, ఆదాయాన్ని కాపాడుకోలేకపోవడం... ఇలా డబ్బు మీద నియంత్రణని కోల్పోతున్నారని తేలింది. చాలా తక్కువ ఆదాయం కలిగినవారు కూడా ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం ఆశ్చర్యకరం! ఈ సంస్థ నివేదిక ప్రకారం, మానసిక ఒత్తిడిలో ఉన్నవారిలో... - 93 శాతం మంది తాము అవసరానికి మించి ఖర్చుపెడుతున్నామని ఒప్పుకున్నారు. - 92 శాతం మంది తాము ఆర్థిక నిర్ణయాలను తీసుకోలేకపోతున్నామని తేల్చిచెప్పారు. - 59 శాతం, తమకి అవసరం లేకపోయినా కూడా అప్పులు తీసుకుంటున్నామని తెగ బాధపడిపోయారు. అవసరం లేకపోయినా అప్పులు తీసుకోవడమే కాదు... ఆ రుణాలకి సంబంధించిన నిబంధనలను అర్థం చేసేకోకుండానే రుణ ఒప్పందాలు పూర్తిచేశామని 24 శాతం మంది వాపోయారు. మరో 38 శాతం మంది ఆ అప్పు తీసుకునే సమయంలో తనకి ఏం చెప్పారో కూడా గుర్తులేదని చెప్పుకొచ్చారు. అనవసరంగా అప్పులకు దిగడం మాట అటుంచి, ఒత్తిడిలో నిర్ణయాలు తీసుకోవడం వల్ల ఏకంగా 38 శాతం మంది ఉద్యోగాన్ని కోల్పోయారని తేలింది. ఇలా ఆర్థిక నియంత్రణను కోల్పోవడం వల్ల ఇతరత్రా సమస్యలు కూడా చాలానే బయటపడ్డాయి. అప్పటిదాకా పొదుపు చేసుకున్న సొమ్మంతా ఆవిరైపోవడం, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం, ఆర్థిక సంబంధాలను చెడగొట్టుకోవడం... వంటి దీర్ఘకాలిక నష్టాలతో జీవితం కునారిల్లిపోతుందిట. పైన పేర్కొన్న కారణాలన్నింటివల్లా... మానసికమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు, ఆర్థిక విషయాలలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచిస్తున్నారు పరిశోధకులు. మనసులో ఉన్న అలజడి ఉపశమించేందుకో, సమాజంలో విలువను పెంచుకునేందుకో, అలవాటుగానో, నిర్ణయం తీసుకోలేకపోవడం వల్లనో... ఇష్టమొచ్చినట్లు ఖర్చుపెట్టించే మానసిక స్థితిని గమనించుకోమని సూచిస్తున్నారు. మరోవైపు అటు వైద్యులు కానీ, ఇటు ఆర్థికరంగ సలహాదారులుకానీ తమ దగ్గరికి వచ్చేవారిలో మానసిక ఒత్తిడిని గమనించడమూ... వారి ఆర్థిక స్థితి మీద ఆ ఒత్తిడి ప్రభావం కలుగకుండా తగు హెచ్చరికలు చేయడమూ ఉండాలి. - నిర్జర. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
జుట్టు బాగా రాలిపోతోందా? ఈ నాలుగే అసలు కారణాలు..!

వేగంగా మారుతున్న జీవనశైలి ప్రభావం మన ఆరోగ్యంపైనే కాకుండా జుట్టుపై కూడా కనిపిస్తుంది.ఇప్పట్లో చాలామంది  జుట్టు రాలడం, జుట్టుకు సంబంధించి  అనేక ఇతర సమస్యలతో బాధపడుతున్నారు. తప్పుడు ఆహారపు అలవాట్లు, జీవన శైలి,  ఇతర కారణాల వల్ల, జుట్టు రాలే సమస్య తరచుగా మొదలవుతుంది. జుట్టు రాలడం, జుట్టు పలుచబడటం, బట్టతల రావడం వల్ల ఆత్మన్యూనతా భావం ఏర్పడుతుంది. జుట్టు రాలడానికి కారణాలు తెలుసుకుని,  దాని పరిష్కారాన్ని కనుగొనడం చాలా ముఖ్యం. జుట్టురాలడంలో ఈ 4 కారణాలే ప్రధానం... పోషకాహార లోపాలు.. ఇప్పట్లో ప్రజల  ఆహారపు అలవాట్లు వేగంగా మారిపోతున్నాయి. ఇవి కూడా అనారోగ్యంగా తయారవుతున్నాయి.  శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా, జుట్టు మీద కూడా లోతైన ప్రభావం చూపుతుంది. బయోటిన్ లేకపోవడం వల్ల  జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా విటమిన్ సి,  ఐరన్ లోపం వల్ల కూడా జుట్టు రాలిపోతుంది. జుట్టు రాలడాన్ని నివారించడానికి ఆహారంలో పోషకాలు అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. జుట్టు రాలే సమస్య వేగంగా అరికట్టడానికి, జుట్టు తిరిగి ఆరోగ్యంగా పెరగడానికి  ఆరోగ్య నిపుణుల సలహా కూడా తీసుకోవచ్చు. ఫలితాలు వేగంగా ఉంటాయి. ఒత్తిడి,  శారీరక సమస్యలు.. భావోద్వేగాలు ఎక్కువగా ఉండటం,  శారీరక ఒత్తిడి జుట్టు రాలడానికి దోహదం చేసే టెలోజెన్ ఎఫ్లూవియం అనే పరిస్థితిని ప్రేరేపిస్తుంది. అధిక ఒత్తిడి కారణంగా, జుట్టు రాలడం పెరుగుతుంది.  జుట్టును దువ్వినప్పుడు, తలస్నానం చేసినప్పుడు   జుట్టు రాలడం ఎక్కువగా ఉంటుంది. ఒత్తిడి కారణంగా జుట్టు రాలడాన్ని నివారించడానికి మొదట ఒత్తిడిని నియంత్రణలో ఉంచడానికి ప్రయత్నించాలి . దీని కోసం  రిలాక్సేషన్ టెక్నిక్స్, మెడిటేషన్, రెగ్యులర్ వ్యాయామం,  హెల్తీ వర్క్ లైఫ్ బ్యాలెన్స్  ఫాలో కావడం చేయాలి. జన్యు కారణాలు.. కొన్నిసార్లు హెయిర్ ఫాల్ సమస్య జన్యుపరమైన కారణాల వల్ల అంటే కుటుంబ చరిత్ర వల్ల కూడా రావచ్చు. దీనిని ఆండ్రోజెనెటిక్ అలోపేసియా అంటారు, ఇది చాలా మందిలో బట్టతలకి దారి తీస్తుంది. అలోపేసియా అరేటా అనే పరిస్థితిలో  రోగనిరోధక వ్యవస్థ జుట్టు కుదుళ్లపై దాడి చేస్తుంది.  ఫలితంగా జుట్టు రాలుతుంది. అలోపేసియా అరేటా శరీరంలో ఎక్కడైనా జుట్టు రాలడానికి కారణం అయినప్పటికీ, ఇది సాధారణంగా తల, ముఖాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ సమస్యకు చికిత్స ఎంపికలు మారుతూ ఉంటాయి. . కార్టికోస్టెరాయిడ్స్, ఇమ్యునోథెరపీ లేదా ఆరోగ్య నిపుణులు సూచించిన ఇతర మందులు కూడా ఉండవచ్చు. జుట్టు సంరక్షణలో చెడు అలవాట్లు.. ఈ రోజుల్లో  స్టైలింగ్ కోసం జుట్టుపై అనేక రకాల వస్తువులను ప్రయోగిస్తున్నారు.  దీని కారణంగా జుట్టు పాడైపోతోంది.  దీని కారణంగా జుట్టు రాలడం ప్రారంభమవుతుంది. జుట్టు సంరక్షణ కోసం సరైన పద్ధతులను పాటించాలి. హీట్ స్టైలింగ్‌ను తగ్గించాలి.  బిగుతుగా ఉండే కేశాలంకరణను నివారించాలి.  జుట్టుకు సరైన ఉత్పత్తులను ఉపయోగించాలి.                                      *నిశ్శబ్ద.  గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఏడిస్తే ఎన్ని లాభాలో...

మనిషి అన్నవాడికి స్పందించడం అవసరం అంటే కొన్ని సందర్భాలలో ఆనందం తో కన్నీరు వస్తే. బాధతో కన్నీరు వస్తుంది. అలా కన్నీరు పెట్టుకుంటే లాభమే. అని పరిశోదనలో తేల్చారు.కన్నీరు వల్ల లాభామ నష్టమా అన్న విషయం లో నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందామా మరి. కొందరికి కన్నీరు అస్సలు రాదు.కొందరికి కన్నీరు అతికష్టం మీద వస్తుంది. కొందరికి కన్నీరు అలవోకగా వస్తుంది.వాళ్ళ నెత్తిన నీళ్ళ కుండ ఉందేమో అని అనిపించే విధంగా అదే ధారగా కన్నీరు పెట్టుకుంటూ దిక్కులు పిక్కటిల్లేలా ఏడుస్తారు.కొందరు మనసులో ఉన్న బాధను దుఖం రూపం లో బయటికి వెళ్ళ గాక్కుతారు.పొర్లి పొర్లి ఏడుస్తూ ఉంటారు.గతం తలుచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. బాహాటంగా మనస్పూర్తిగా ఏడవడం లేదా కుళ్ళి కుళ్ళి ఏడవడం మనం గమనించ వచ్చు.అసలు కన్నీరు పెట్టుకుంటే లాభమా నష్టమా చూద్దాం. మనిషి ఏడవడం దుఃఖించడం ఒక సాధారణ ప్రక్రియ.ఒక్కోరిలో ఒక్కో భావనలు ఉంటాయి.దానికి బదులుగా దుఃఖం పెల్లుబికి బయటికి వస్తూ ఉంటుంది.అసలు మనిషి ఎందుకు ఏడు స్తాడో దుఃఖం తో ఎందుకు ఇబ్బంది పడుతున్నాడో తెలుసా? మీరు ఆలోచించారా ? ఈమేరకు శాస్త్రజ్ఞులు చేసిన పరిశోదనలు పలు ఆశక్తి కరమైన అంశాలు వెలుగు చూసాయి.మనము ఏడవడం ద్వారా మనశరీరం, మెదడు రెండూ కీలక మని కనుగొన్నారు.అప్పుడే దానిఫలితాలు మనకు అందుతాయని అన్నారు. పిల్లవాడు పుట్టిన వెంటనే మొదటి సారి ఏడుస్తాడు.అసలు ఏడవడం ద్వారా వచ్చే లాభాము మీకు తెలియదు. ఏడవడం వల్ల వచ్చే లాభాలు అశక్తి కలిగించే అంశాలు తెలుసుకుందాం. 1)శరీరం డీ టాక్సీ ఫై అవుతుంది. *కన్నీరు మూడు రకాలు...  *రిఫ్లెక్స్ ద్వారా వచ్చే కన్నీరు...  *అదే పనిగా వచ్చే కన్నీరు...  *భావనాత్మ కంగా వచ్చే కన్నీరు... *రిఫ్లెక్స్ వల్ల వచ్చే కన్నీరు... కంటిలో పేరుకు పోయిన మట్టి,ఇతర పనికిరాని చెత్త అది కంటిని శుభ్రం చేస్తుంది. అదే పనిగా కంటి నుండి కన్నీరు ప్రవహిస్తుంటే అది మీ కళ్ళు చేమ్మగిల్లినట్లు. ఇన్ఫెక్షన్ నుండి రక్షిస్తుంది.భావనాత్మకంగా వచ్చే కన్నీరు ఒత్తిడి వల్ల,లేదా ఉద్వేగాల వల్ల కన్నీరు బయటికి వస్తుంది.అవి మరల వేరే టాక్సిన్స్ ఉన్నట్లు శాస్త్రజ్ఞులు కనుగొన్నారు. కన్నీరు మన శరీరం లో ఉన్న వస్తువుల్ని శరీరం నుండి బయటికి వస్తుంది. మిమ్మల్ని మీరు శాంతింప చేసుకోవడం కన్నీరు సహకరిస్తుంది.. మన మనస్సు శాంత పరుచుకోవాలంటే ఏడవడం మంచి పద్ధతి.పరిశోదనలో ఏడవడం ద్వారా సింథటిక్ నర్వస్సిస్టం యాక్టివేట్ కావడాన్ని గమనించవచ్చని శాస్త్రజ్ఞులు పేర్కొన్నారు. తద్వారా మన శరీరానికి కొంత ఉపశమనం కల్పించడం లో సహకరిస్తుంది.కొంత సేపు ఏడ్చిన తరువాత శాంతం గా ప్రాశంతం గా ఉన్నట్లు  అనుభూతి పొందుతారు. మీకు సహకారం లభిస్తుంది.. ఒక వేళ మీరు నిరాశ చెందినట్లయితే ఏడవడం ద్వారా మీ చుట్టుపక్కల ఉన్నవారికి మీకు సపోర్ట్ అవసరం.అని భావిస్తారు.చిన్న పిల్లలు సైతం తమ పై దృష్టి పెట్టాలంటే ఏడవడం ఆయుధం గా వాడతారు.ఇలా చేయడం ద్వారా తాము అనుకున్న లక్ష్యం పూర్తి చేసామని  భావిస్తారు. దుఃఖం నుండి బయటికి రావడానికి దోహదం చేస్తుంది.. ఏడవడం లేదా దుఃఖించడం అన్నది ఒక ప్రక్రియ దుఃఖం పడడం,ఆగ్రహంతో కూడా దుఃఖం వస్తుంది.ఎడుస్తున్నప్పుడు ఏడ్చే సమయంలో ఒక పద్ధతి ప్రకారం ఏడవడం అవసరం దీనిద్వారా దుఃఖం నుండి బయటికి వచ్చినట్లు బరువు దిగి పోయినట్లు భావిస్తారు. నొప్పి నివారిస్తుంది.. దీర్ఘ కాలం పాటు ఏడవడం వల్ల ఆక్సిటోసిన్ మరియు ఎండార్ఫిన్ విడుదల అవుతుంది.ఇది ఫీల్ గుడ్ కెమికల్స్ గా పేర్కొన్నారు.శారీరక భావనాత్మక రెండువైపులా ఉన్న భావనను మనసులోని బాధను నివారించేందుకు సహకరిస్తుంది.ఒక్కో సారి ఎండోర్ఫిన్ విడుదల అయినప్పుడు మీ శరీరం ఒక నియమిత హద్దు వరకు వినే ప్రయత్నం చేస్తుంది.మన శరీరంలో ఉన్న ఆక్సిటోసిన్ ప్రశాంతత ఇస్తుంది. మూడ్ లో మార్పు వస్తుంది.. మన బాధను నొప్పిని తగ్గించడం లో సహకరిస్తుంది.ఏడవడం ద్వారా మీ మూడ్ కూడా బాగా అద్భుతంగా ఉంటుది.సత్వరంగా స్వేచ్చగా ఉండే విధంగా మీ మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు మెదడు చల్ల బడుతుంది.మీ మెదడులో ఉన్న వేడి తగ్గినప్పుడు చల్ల బడుతుంది.శారీరకంగా బాగా తేలికగా ఉన్నట్లు అనిపిస్తుంది. భావనలను నియంత్రిస్తుంది... ఏడవడం అన్నది బాధ పడడం అన్నది మరొకరి బాధకు ఏడుపుకు జవాబుగా కాదు.చాలా సార్లు ఎప్పుడు ఏదైనా చాలా ఆనందం గా ఉంటారు. భయం లేదా ఒత్తిడి లో యాలె విశ్వ విద్యాలయం పరిశోధకులు అంటున్న మాట  ఏమిటి అంటే ఈ విధంగా బాధపడడం వల్ల మిమ్మల్ని మీరు నియంత్రించు కునేందుకు సహకరిస్తుంది. అసలు సహజంగా ఎప్పుడు ఎప్పుడు ఏడుస్తారు.. భయంకర మైన ఒత్తిడిలో ఉన్నప్పు డు ,లేదా తాను అనుకున్న లక్ష్యం లో ఓటమి పాలై నప్పుడు.తనకు కావాల్సిన ఆప్తులైన వారు దూరమై నప్పుడు. లేదా తమకి ఇష్టమైన వారే తమను తీవ్రంగా ద్వేషించి నప్పుడు కుళ్ళి కుళ్ళి ఏడవడం పొర్లి పొర్లి ఏడవడం.మనకు కనిపిస్తుంది. మానసిక భావోద్వేగాలతో  ముడి పడిన సంఘటనలకు కారణంతామే అని భావించిన వారు.అనుకోని విధంగా అనూహ్య విజయం సాధించినందుకు ఆనంద భాష్పాలు కంటినుండి వస్తాయి. వైద్య చికిత్స ఎప్పుడు అవసరం... ఏడవడం ఎలాంటి వస్తువంటే మీకు సుఖం లభిస్తుంది.బాధ కలుగుతుంది.అందుకు ప్రతిగా మీరు ఏడుస్తారు అది సర్వసాధారణం మీరు ఏడవడం వల్ల మీరు బాగా ఉన్నట్లు భావిస్తారు.ఇలా చేస్తున్నందుకు సిగ్గు పడవద్దని ఏడుపు వచ్చినప్పుడు మనస్త్రుప్తిగా ఏడవండి. ఆబాధనుండి విముక్తి పొందండి. ఏదైనా విషయం లో ఆనందం లభిస్తుందో.లేదా దుఃఖం కలిగిస్తుందో చాలా సార్లు అప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నప్పుడు కూడా ఏడుస్తారు.అత్యంత సుఖంగా ఉన్నప్పుడు ఒత్తిడులు ఉన్నా ఎడుస్తారని ఏలే విశ్వవిద్యాలయం శాస్త్రజ్ఞులు అంగీకరిం చారు.ఏడవడం వల్ల భావనాత్మక నియంత్రణ బయటికి వస్తుంది.సహాయ పడుతుంది. ఏడుపు మంచిదే. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...                      

read more
టీతో బిస్కెట్లు తినే అలవాటుందా.. కొంపమునిగినట్టే.. ఇవి తింటే ...

ఉదయం లేవగానే రోజు మొదలుపెట్టాలంటే టీ కావాలి. డ్యూటీ మధ్యలో కాస్త బయటకు వెళ్ళాలంటే టీ బెస్ట్ సాకు, సాయంత్రం స్నేహితులతో కలసి టీ కొట్టు దగ్గర కబుర్లు చెబుతూ చాయ్ తాగితే ఆ ఫీల్ వేరు.  టైమ్ పాడు లేకుండా టీ తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. టీ కొట్టు ఓపెన్ చేశాక కట్టేసేవరకు స్టౌ మీద టీ ఉడుకుతూనే ఉంటుందంటే టీ కి ఉన్న గిరాకీ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు టీ కహానీ ఎందుకంటారా? టీ అంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా వేడి వేడి టీలో బిస్కెట్లు ముంచుకుని తింటే మరీ ఇష్టం. ఇరానీ ఛాయ్, ఉస్మానియా బిస్కెట్లు, అప్పటికప్పుడు హాట్ హాట్ గా బేక్ చేసిన బిస్కెట్లు.. ఓయబ్బో టీ పక్కనే వయ్యారాలు పోతాయి బిస్కెట్లు. కానీ టీతో బిస్కెట్లు తినడం మహా ఇష్టమైన వారికి బ్యాడ్ న్యూస్.. దీని వల్ల బోలెడు నష్టాలున్నాయి. టీతో బిస్కెట్ తింటే కలిగే నష్టాలేంటి? టీ తో ఏం తింటే ఆరోగ్యప్రయోజనాలు ఉంటాయి? పూర్తీగా తెలుసుకుంటే.. భారతదేశంలో టీ తాగేవారు ఎక్కువ. ఇక టీ బిస్కెట్ కాంబినేషన్ కు ఫ్యాన్స్ ఎక్కువ. అయితే టీ బిస్కెట్ వల్ల ఆరోగ్య నష్టాలున్నాయి. యువతలో హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి  టీ తో బిస్కెట్ తినడం ఒక కారణంగా తెలుస్తోంది. టీ బిస్కెట్ కాంబినేషన్ గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది. బిస్కెట్లలో సోడియం అధికంగా ఉంటుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఇది గుండెజబ్బులకు ప్రధానకారణం అవుతుంది. బిస్కెట్ల తయారీకి శుద్ది చేసిన పిండి, శుద్ది చేసిన పంచదార ఉపయోగిస్తారు. ఇది శరీరంలో ఇన్సులిన్ శోషణకు ఆటంకం కలిగిస్తుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ అసమతుల్యత కారణంగా మధుమేహం ప్రమాదం పెరుగుతుంది. మరొకవైపు ఇది జీర్ణక్రియను కూడా దెబ్బతీస్తుంది. దీని వల్ల మలబద్దకం వస్తుంది. బిస్కెట్లు ఎక్కువగా ప్రాసెస్ చేయబడే ఆహారం. ఇందులో  BHA (butylated hydroxyanisole),  BHT (butylated hydroxytoluene) ఉంటాయి. ఇవి మానవ శరీరంలో ఉండే DNA ను దెబ్బతీస్తాయి. మరీ ముఖ్యంగా బిస్కెట్లలో హైడ్రోజనేటెడ్ వెజిటబుల్ ఆయిల్  ఉంటుంది. ఇది శరీరంలో హార్మోన్లను డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లు తినడం ఆరోగ్యానికి నష్టం కలిగిస్తుంది. టీతో వేయించిన శనగలు తింటే.. వేయించిన శనగలు ఆరోగ్యానికి చాలా మంచిదం. టీ టైమ్ లో స్నాక్ గా వేయించిన శనగలు తింటే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. వేయించిన శనగలు ఇన్సులిన్ ను కంట్రోల్ చేయడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది. ఇందులో రోగనిరోధక శక్తిని పెంచే బి-కాంప్లెక్స్ విటమిన్ ఉంటుంది కాబట్టి బి-విటమిన్ లోపాన్ని జయించవచ్చు. ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియం, మెగ్నీషియం శనగలలో పుష్కలంగా ఉంటుంది. శనగలలో యాంటీ ఇన్ఫ్లమేటరీ అయిన కోలిన్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కాబట్టి టీతో బిస్కెట్లకు బదులు వేయించిన శనగలు తింటే మంచిది.                                          *నిశ్శబ్ద. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...  

read more
బలహీనంగా .. నీరసంగా అనిపిస్తుందా? మీ సమస్య ఇదే కావచ్చు..

శరీరానికి పోషకాలు ఎంతో అవసరం. అయితే ఈ పోషకాల విషయానికి వస్తే, చాలా మందికి ఐరన్, కాల్షియం, ప్రోటీన్ లేదా ఫైబర్ గురించి మాత్రమే తెలుసు. ఇవన్నీ శరీరానికి చాలా అవసరం. కానీ వీటికంటే ప్రభావవంతమైనది, శరీరానికి తప్పనిసరిగా కావాల్సినది మరొకటి  ఉంది, ఇది శరీరం  మెరుగైన పనితీరుకు అవసరం. ఇది లోపిస్తే శరీరం అంతా నీరసంగానూ, ఏ చిన్న పనిచేసినా అలసటగానూ అనిపిస్తుంది. ఎన్ని పోషకాలు తీసుకున్నా, ఎంత బలవర్థకమైన ఆహారం తీసుకున్నా ఈ ఒక్కటి తక్కువై శరీరం నిలదొక్కుకోలేదు. అంతటి శక్తివంతమైన   పదార్థం  మెగ్నీషియం. మెగ్నీషియం కేవలం శారీరక బలానికే కాదు అనేక మానసిక భావోద్వేగాలకు కూడా  ఇది ఎంతో  అవసరం. ఇది  శరీరంలో కండరాలను నిర్మించడానికి  నరాలను ఆరోగ్యంగా ఉంచడానికి పనిచేస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపం  ఏర్పడితే  కండరాల తిమ్మిరి, నరాల  బలహీనత, కండరాలు మెలితిప్పినట్లు, శరీరంలోని వివిధ ప్రాంతాల్లో  తిమ్మిరి లేదా జలదరింపు వంటి అనేక లక్షణాలను కనిపిస్తాయి. శరీరంలో మెగ్నీషియం లోపం ఎన్నో కారణాల వల్ల ఏర్పడుతుంది.  విటమిన్ డి లోపం  వల్ల మెగ్నీషియం లోపిస్తుంది, యాంటాసిడ్‌ల మితిమీరిన వినియోగం, ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం, తీవ్రమైన విరేచనాలు, ఆహారంలో తక్కువ మెగ్నీషియం గల ఆహారాలను చేర్చకపోవడం వంటి అనేక కారణాల వల్ల శరీరంలో ఈ ముఖ్యమైన మూలకం లోపం ఏర్పడుతుంది. ఇది మాత్రమే కాకుండా, గర్భధారణ సమయంలో మెగ్నీషియం లోపం ఏర్పడే అవకాశం ఉంటుంది. మెగ్నీషియం లోపాన్ని నివారించడానికి  ఆహారంలో మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలను చేర్చుకోవాలి. ఈ కింది ఆహారాలలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది.  బాదంపప్పులో మెగ్నీషియం ఉంటుంది.  10గ్రాముల బాదం పప్పులో  రోజువారీ శరీరానికి కావలసిన  మెగ్నీషియంలో 20% (76 mg) లభిస్తుంది. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి,  మెగ్నీషియం శరీరానికి అందడానికి  ప్రతిరోజూ కొన్ని బాదంపప్పులను తినడం మంచి మార్గం. గుమ్మడికాయ గింజలలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. చాలా మంది  తమ ఆహారం ద్వారా మెగ్నీషియం  తగినంతగా పొందలేరు. ప్రతి 100 గ్రాముల గుమ్మడికాయ గింజల్లో 262 మిల్లీగ్రాముల వరకు మెగ్నీషియం ఉంటుంది. ప్రతిరోజూ కొన్ని గుమ్మడి గింజలు తింటూ ఉంటే ఈ లోపాన్ని భర్తీ చేయవచ్చు. అరటిపండ్లు  ఎముకలను బలపరిచే పొటాషియం అధికంగా ఉండే పండు. ఒక మధ్యస్థ అరటిపండు 10.3 mg విటమిన్ సి,  32 mg మెగ్నీషియంను  అందిస్తుంది. ఇది గుండె ఆరోగ్యానికి ఎంతో మేలుచేస్తుంది. పాలకూర అందరికీ అందుబాటులో ఉంటే ఆకుకూర. పాలకూరలో మెగ్నీషియం మాత్రమే కాదు ఐరన్ కూడా సమృద్దిగా ఉంటుంది. కాబట్టి ఐరన్, మెగ్నీషియం లోపంతో ఇబ్బంది పడేవారు పాలకూరను తప్పనిసరిగా తీసుకోవాలి.   జీడిపప్పులో కూడా మెగ్నీషియం పుష్కలంగా ఉంటుంది. ఇది కాకుండా ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు కూడా జీడిపప్పులో ఉంటాయి. ప్రతిరోజూ కాసింత జీడిపప్పు తీసుకోవడం వల్ల ఇది మెగ్నీషియంతో పాటు, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు కూడా పొందవచ్చు.  ఇవి కాకుండా, వోట్మీల్, బ్రౌన్ రైస్, వేరుశెనగ నూనె, చియా గింజలు,  బీన్స్‌లో కూడా ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
బంగాళదుంప కొంపలు ముంచుతుందని తెలుసా

  బంగాళదుంప చాలా మందికి ఇష్టమైన దుంప కూరగాయ.  పేరుకు ఇది కూరగాయ కానీ ఇది  అన్ని రకాలుగా తినడానికి అనుకూలంగా ఉంటుంది. కూరల్లో అయినా, బజ్జీలలో అయినా, వేపుళ్లలో అయినా,  చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి నోరూరించే తినుబండారాలలో అయినా బంగాళదుంప చేసే మ్యాజిక్ అంతా ఇంతా కాదు. ఏ కూర చేస్తున్నా సరే..అందులో బంగాళదుంప ముక్కలు జోడిస్తే కూరలకు రుచి రెట్టింపు అవుతుంది. ఎంతో రుచిగా ఉండే బంగాళదుంపను తినడానికి చాలా మంది చాలా ఆసక్తి చూపిస్తారు. అయితే బంగాళదుంపలను ఎడా పెడా తింటే మాత్రం కొంపలు ముంచుతుందట.  ఇంతకీ బంగాళదుంపలు ఆరోగ్యానికి చేసే చేటు ఏంటో తెలుసుకుంటే.. ఊబకాయం.. బంగాళదుంపలను ఎక్కువగా తినడం వల్ల బరువు పెరుగుతారట.  బంగాళదుంపలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి అదనపు కేలరీలుగా పొట్టలో కొవ్వు రూపంలో పేరుకుపోతాయి. దీని కారణంగా బరువు ఈజీగా పెరుగుతారు. రక్తపోటు.. రక్తపోటు లేదా బీపీ ఇప్పట్లో చాలామందికి వస్తున్న సమస్య.  చిన్న వయసులోనే బీపీ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు ఉంటున్నారు.  ఇలాంటి వారు బంగాళదుంపలను ఎక్కువగా తీసుకోకూడదట.  బంగాళదుంపలు  బీపీ సమస్యను మరింత పెంచుతాయట. ఆర్థరైటిస్.. ఆర్థరైటిస్ సమస్య చలికాలంలో చాలా ఎక్కువ ఇబ్బంది పెడుతుంది. సాధారణ రోజులలో కూడా ఆర్థరైటిస్ సమస్య కారణంగా  ఎముకలు, కీళ్ల సమస్యలు పెరుగుతాయి.  బంగాళదుంపలు తింటే ఆర్థరైటిస్ సమస్య మరింత తీవ్రం అవుతుంది.  ఇందులో కార్బోహైడ్రేట్లు ఆర్థరైటిస్ నొప్పిని పెంచుతాయి. జీర్ణసమస్యలు.. బంగాళదుంపలలో పిండి పదార్థం చాలా ఎక్కువగా ఉంటుంది.  ఇది గ్యాస్, ఉబ్బరం,  మలబద్దకం వంటి సమస్యలు సృష్టిస్తుంది.  బంగాళదుంపను అతిగా తింటే పై సమస్యలు అధికం అవుతాయి. మధుమేహం.. మధుమేహం ఉన్నవారికి నిషేధించిన ఆహారాలలో బంగాళదుంప కూడా ఒకటి.  బంగాళదుంపలు తీసుకోవడం వల్ల మధుమేహం సమస్య మరింత పెరుగుతుంది.  బంగాళదుంపలలో ఉండే కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిని మరింత పెంచుతాయి. కంటి సమస్యలు.. బంగాళదుంపలలో సోలనిన్ అనే రసాయనం ఉంటుంది.  ఇది కంటి సమస్యలను కలిగిస్తుంది.  బంగాళదుంపలను ఎక్కువగా తీసుకునేవారు తొందరగా కంటి సమస్యల బారిన పడే అవకాశం ఉంటుంది.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
పసుపు, తేనె కలిపి తీసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?

  పసుపు,  తేనె భారతీయ వంటగదిలో రెండు ప్రధాన పదార్థాలు. ఇవి రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా ప్రయోజనకరంగా పరిగణించబడతాయి. పసుపులో  కుర్కుమిన్ ఉంటుంది, అలాగే తేనెలో  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. పసుపును శతాబ్దాలుగా ఆయుర్వేదంలో ఉపయోగిస్తున్నారు. ఇది కీళ్ల నొప్పులు , చర్మ వ్యాధులు,  జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది . సహజ తీపి, ఔషధ గుణాలకు ప్రసిద్ధి చెందిన తేనె గొంతు నొప్పి, దగ్గు,  గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. పసుపు మరియు తేనె కలయిక ఆరోగ్యానికి మేలు చేసినప్పటికీ, దానిని తీసుకునే ముందు సరైన మోతాదు,  దాని దుష్ప్రభావాల గురించి తెలుసుకోవడం ముఖ్యం. దీని గురించి తెలుసుకుంటే.. వాపును తగ్గించడంలో సహాయపడతాయి.. పసుపులో ఉండే కర్కుమిన్,  తేనెలోని యాంటీఆక్సిడెంట్లు కలిసి శరీరంలో మంటను తగ్గించడంలో సహాయపడతాయి. ఈ కలయిక కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్,  ఇతర శోథ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది. రోగనిరోధక శక్తి.. పసుపు,  తేనె రెండూ రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉంటాయి. వాటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరం ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడుతుంది. ఈ కలయిక ముఖ్యంగా సీజన్ మారే సమయంలో  ప్రయోజనకరంగా ఉంటుంది. జీర్ణక్రియ.. పసుపు,  తేనె మిశ్రమం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇది గ్యాస్, అజీర్ణం,  ఇతర జీర్ణ సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. అయితే అధిక వినియోగాన్ని నివారించాలి. చర్మ ఆరోగ్యం.. మొటిమలు, మచ్చలు,  మంట వంటి చర్మ సమస్యల నుండి ఉపశమనం పొందడానికి పసుపు,  తేనెను ఉపయోగించవచ్చు. ఈ మిశ్రమాన్ని ఫేస్ మాస్క్‌గా ఉపయోగించడం వల్ల చర్మం ప్రకాశవంతంగా,  ఆరోగ్యంగా ఉంటుంది. ఎలా తీసుకోవాలి..? పసుపు,  తేనెను గోరువెచ్చని నీటిలో కలిపి, టీగా లేదా పాలతో కలిపి వివిధ రకాలుగా తీసుకోవచ్చు. అయితే, దాని పరిమాణం,  తీసుకునే సమయం వ్యక్తి ఆరోగ్య స్థితిని బట్టి ఉండాలి. గర్భిణీ స్త్రీలు, మధుమేహ వ్యాధిగ్రస్తులు,  ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.                                    *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
నిమ్మరసం నీళ్లు తాగితే.. షుగర్ తగ్గుతుందా?

నిమ్మకాయ చాలా పానీయాలలో ఉపయోగిస్తారు.  అటు వంటలలోనూ, ఇటు స్వీట్ల లోనూ, మరొక వైపు రిఫ్రెషింగ్ పానీయాలలోనూ నిమ్మకాయను ఉపయోగిస్తారు.  చాలామంది ఉదయాన్నే నీటిలో నిమ్మరసం కలిపి తాగుతూ ఉంటారు. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదని చెబుతారు. అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల శరీరంలో షుగర్ కూడా తగ్గుతుందని కొందరు అంటారు. ఈ కారణంగా చాలామంది షుగర్ పేషెంట్ లు నిమ్మరసం కలిపిన నీళ్లు తాగుతూ ఉంటారు.  అయితే నిమ్మరసం కలిపిన నీళ్లు తాగడం వల్ల నిజంగానే శరీరంలో షుగర్ శాతం తగ్గుతుందా?  నిమ్మరసం నీరు శరీరంలో షుగర్ తగ్గించడంలో సహాయపడుతుందా? తెలుసుకుంటే.. నిమ్మరసాన్ని నీటిలో కలిపి తాగితే రక్తంలో చక్కెర శాతం తగ్గుతుందని చాలామంది అనుకుంటారు. కానీ నిజానికి నిమ్మరసం కలిపిన నీరు రక్తంలో చక్కెరను తగ్గించదు, కానీ చక్కెరను నియంత్రించడంలో సహాయపడుతుంది.  ఈ రెండింటికి తేడా ఏంటని చాలా మంది అయోమయానికి గురవుతూ ఉంటారు. తీసుకునే ప్రతి ఆహారంలో ఉండే గ్లూకోజ్ పరిమాణాన్ని బట్టి దాని గ్లైసెమిక్ ఇండెక్స్ ను నిర్ణయిస్తారు.  అలాగే నిమ్మకాయ గ్లైసెమిక్ ఇండెక్స్ ను గమనిస్తే ఇది చాలా తక్కువగా ఉంటుంది.  తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగిన ఆహారాలు రక్తంలో చక్కెర స్థాయిలను ఆకస్మికంగా పెరగకుండా చేస్తాయి. నిమ్మకాయలో కరికే ఫైబర్ ఉంటుంది.  ఈ కరిగే ఫైబర్ నెమ్మదిగా జీర్ణం అవుతూ రక్తంలో శోషించబడుతుంది.  తద్వారా  రక్తంలో చక్కెరను నెమ్మదిగా పెంచడంలో సహాయపడుతుంది. సహాయపడుతుంది. అలాగే కొన్ని అధ్యయనాలు ఏం చెబుతున్నాయంటే..  నిమ్మరసం కలిపిన నీరు ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుందని చెబుతున్నాయి. నిమ్మకాయ నీరు హైడ్రేషన్ ను నిర్వహిస్తుంది. ఇది రక్తంలో చక్కెరను స్థిరంగా ఉంచుతుంది.  ఈ కారణంగా నిమ్మరసాన్ని వేసవిలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అయితే నిమ్మరసానికి చక్కెర,  చక్కెర సంబంధిత పదార్థాలు జోడించడం వల్ల షుగర్ ఉన్నవారికి నష్టమే తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండదు. నిమ్మరసంలో విటమిన్-సి ఉంటుంది.  ఇది వాపును, ఇన్ఫెక్షన్లను తగ్గించడంలో సహాయపడుతుంది.  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  జీవక్రియను కూడా మెరుగుపరుస్తుంది. ఈ కారణంగానే కడుపు ఉబ్బరం, గ్యాస్,  అజీర్తి వంటివి చేసినప్పుడు నిమ్మరసం నీటిలో కాసింత జీలకర్ర పొడి కూడా కలిపి తాగమని చెబుతూ ఉంటారు. నిమ్మకాయ నీరు కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది.  ఇది రక్తంలో చక్కెర స్థాయిలను బాగా నియంత్రించడంలో సహాయపడుతుంది.                                     *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు..

read more
కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా నిరోధించే చిట్కాలు..!

నేటికాలంలో చాలామందిలో కనిపిస్తున్న సమస్య ఫ్యాటీ లివర్.. చిన్న వయసు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. నేటి కాలంలో ఈ ఫ్యాటీ లివర్ సమస్య చాలా సాధారణం అయిపోయింది. కానీ ఇది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యగా పరిగణించబడుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య లివర్ సిర్రోసిస్,  ఫైబ్రోసిస్, లివర్ క్యాన్సర్ మొదలైన సమస్యలకు కూడా దారి తీస్తుంది. ఫ్యాటీ లివర్ అంటే కాలేయ కణాలలో కొవ్వు పరిమాణం సాధారణం కంటే ఎక్కువ మొత్తంలో పేరుకుపోవడం.  సాధారణంగా కాలేయంలో 5% కంటే తక్కువ కొవ్వు ఉండాలి, కానీ ఈ మొత్తం 5-10% మించితే అది ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాలేయంలో కొవ్వు ఏర్పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటో తెలుసుకుంటే.. దేశంలో ప్రతి మూడవ వ్యక్తి ఫ్యాటీ లివర్ వ్యాధితో బాధపడవచ్చని గణాంకాలు చెబుతున్నాయి. మధుమేహం,  ఇతర జీవక్రియ రుగ్మతల వల్ల కలిగే ఈ వ్యాధి ప్రమాదం మద్యం తాగని వారిలో కూడా వేగంగా పెరుగుతోంది. ఈ రకమైన పరిస్థితిని నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) అంటారు. జంక్ ఫుడ్ ఎక్కువగా తినే అలవాటు, వేయించిన,  ప్రాసెస్ చేసిన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేకపోవడం,  అధిక ఒత్తిడి వల్ల కాలేయంలో కొవ్వు పెరిగే సమస్య పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఊబకాయం,  జీవక్రియ సిండ్రోమ్ వంటి పరిస్థితులు కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోయే ప్రమాదాన్ని పెంచుతాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. NAFLD ఉన్నవారిపై జరిపిన పరిశోధనలో దాని బాధితుల్లో 60–70% మంది ఊబకాయంతో బాధపడుతున్నారని తేలింది.  ఊబకాయం టైప్ 2 డయాబెటిస్,  ఇన్సులిన్ నిరోధకత ప్రమాదాన్ని కూడా పెంచుతుంది. ఇది కాలేయ సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాలేయంలో కొవ్వు ఏర్పడటానికి ఆరోగ్య నిపుణులు పరిగణించే కారణాలు.. తగినంత నిద్ర లేకపోవడం. ధూమపానం అలవాటు. క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోవడం లేదా అధిక బరువు ఉండటం. ఎనర్జీ డ్రింక్స్  లేదా తీపి పానీయాల అధిక వినియోగం. ఫ్యాటీ లివర్ సమస్యను ఎలా నివారించాలి? జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఈ కాలేయ సమస్యను నివారించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అధిక బరువుతో ఉంటే దానిని 7-10% తగ్గించడం వల్ల కాలేయ సమస్యలను కూడా నివారించవచ్చు. అధిక ఫైబర్, తక్కువ కార్బోహైడ్రేట్లు,  తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉన్న సమతుల్య ఆహారం సహాయంతో కాలేయంలో కొవ్వు సమస్యను కూడా తగ్గించవచ్చు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ ద్వారా కూడా కొవ్వు కాలేయాన్ని నివారించవచ్చు. ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం వల్ల కాలేయ సమస్యలను కూడా నివారించవచ్చు.                                      *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
కీళ్లనొప్పితో బాధపడేవాళ్లు ఈ మూడు పనులు చేస్తే చాలు.. మందులు కూడా వాడాల్సిన అవసరం లేదు..!

  కీళ్ల నొప్పులు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేసే ఒక సాధారణ సమస్య. ఇది శరీరంలోని ఏ కీలుకు అయినా సమస్యగా మారవచ్చు. మోకాలు, భుజాలు, మోచేతులు, తుంటి, చేతులు లేదా కాలి వేళ్లు వంటివి. నొప్పి తేలికగా,  అడపాదడపా ఉండవచ్చు. లేదా రోజువారీ కార్యకలాపాలు చేయడం కష్టతరం చేసేంత తీవ్రంగా  కూడా ఉండవచ్చు. సాధారణంగా ఈ సమస్య వృద్ధులలో కనిపిస్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో ఇది చిన్నవారిని కూడా ప్రభావితం చేస్తుంది. భారతదేశంలో దాదాపు 15% మంది కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారు.  ఈ సమస్య మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుంది. మందులు ఉపశమనం కలిగించగలిగినప్పటికీ, కొన్నిసార్లు ఈ మందులు దుష్ప్రభావాలను కూడా కలిగిస్తాయి. అటువంటి పరిస్థితిలో మందులు లేని కొన్ని సహజ నివారణలు కీళ్ల నొప్పులను తగ్గించడంలో ప్రభావవంతంగా ఉంటాయి. అవేంటో తెలుసుకుంటే.. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఆర్థరైటిస్,  కీళ్ల నొప్పుల కారణాలు,  లక్షణాలను బట్టి ప్రతి వ్యక్తికి చికిత్స మారవచ్చు. ఆర్థరైటిస్ ప్రధానంగా రెండు రకాలు.. అవి.. ఇన్‌ఫ్లమేటరీ,  నాన్-ఇన్ఫ్లమేటరీ. నాన్-ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్‌లో కొన్ని చర్యలు మందులు లేకుండా కూడా  ఉపశమనం కలిగిస్తాయి. అవేంటో తెలుసుకుంటే.. వ్యాయామం.. కీళ్ల నొప్పులను తగ్గించడంలో క్రమం తప్పకుండా వ్యాయామం,  శరీరాన్ని సాగదీయడం  చాలా ప్రభావవంతంగా ఉంటుంది. యోగా, ఈత,  చురుకైన నడక వంటి తక్కువ ప్రభావ వ్యాయామాలు కీళ్లలో వశ్యతను పెంచుతాయి, కండరాలను బలోపేతం చేస్తాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం 'ఉదయం 10-15 నిమిషాలు శరీరాన్ని సాగదీయడం వల్ల కీళ్లలో సరళత ఉండి దృఢత్వం తగ్గుతుంది.' యోగాలో, తడసాన, వజ్రాసాన,  భుజంగాసాన వంటి ఆసనాలు కీళ్లకు ప్రయోజనకరంగా ఉంటాయి. కూల్,  హాట్ ట్రీట్మెంట్.. కీళ్ల నొప్పులు,  వాపు నుండి ఉపశమనం పొందడానికి హాట్, కూల్ ట్రీట్మెంట్  ఒక సహజ మార్గం. ప్రభావిత కీళ్లపై 15-20 నిమిషాలు వేడి నీటి బాటిల్ లేదా హీటింగ్ ప్యాడ్‌ను ఉంచాలి. వేడి రక్త ప్రవాహాన్ని పెంచుతుంది,  కండరాలను సడలిస్తుంది, దృఢత్వాన్ని తగ్గిస్తుంది. కీళ్లలో వాపు లేదా తీవ్రమైన నొప్పి ఉంటే కోల్డ్ థెరపీ (ఐస్ కంప్రెస్) ప్రయత్నించాలి. ఐస్‌ను ఒక గుడ్డలో చుట్టి, కీలు మీద 10-15 నిమిషాలు అప్లై చేయాలి. ఇది వాపు,  నొప్పిని నియంత్రిస్తుంది. బరువు.. అధిక శరీర బరువు కీళ్లపై, ముఖ్యంగా మోకాళ్లు,  తుంటిపై అదనపు ఒత్తిడిని కలిగిస్తుంది. దీనివల్ల నొప్పి వస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, 5-10% బరువు తగ్గడం వల్ల కీళ్ల నొప్పులకు గొప్ప ఉపశమనం లభిస్తుంది. ఫైబర్, ప్రోటీన్,  ఆకుపచ్చ కూరగాయలు కలిగిన సమతుల్య ఆహారం బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. చక్కెర, వేయించిన ఆహార ఉత్పత్తులు,  ప్రాసెస్ చేసిన ఆహారాలకు దూరంగా ఉండాలి.                                          *రూపశ్రీ. గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

read more
ఎక్కువ సేపు ఏసి లో గడిపే వారికి ఈ షాకింగ్ నిజాలు తెలుసా?

  వేసవి కాలం అంటేనే చాలా ఇబ్బంది కాలం. అందులోనూ మునుపటి కంటే ప్రతి ఏడాది ఎండల తీవ్రత పెరుగుతూనే ఉంటుంది.  ఈ కారణంగా మధ్యతరగతి కుటుంబాలు కూడా ఏసి ఏర్పాటు చేసుకుంటున్నారు.  అయితే ఏసి ఏర్పాటు చేయించుకోవడం అయితే జరుగుతుంది కానీ.. ఏసి గురించి, ఏసి లో ఉండటం వల్ల జరిగే పరిణామాలు కానీ చాలా మందికి తెలియవు.  వేసవి కాలం నడుస్తున్నందున ఏసిలో ఎక్కువ సమయం గడిపే వారికి కొన్ని షాకింగ్ నిజాలను ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. AC సురక్షితమైనదే కానీ AC ఉన్న ప్రదేశాలలో మంచి వెంటిలేషన్ వ్యవస్థ ఉండాలి. అంటే సరైన గాలి ప్రసరణ ఉండాలి.  ఏసీని వెంటిలేషన్ సరిగా లేని ప్రదేశంలో ఏర్పాటు చేస్తే  తలనొప్పి, పొడి దగ్గు, తలతిరుగుడు-వికారం, ఏకాగ్రత పెట్టడంలో ఇబ్బంది,  అలసట వంటి సమస్యలు ఎదురవుతాయి. తలనొప్పి,  మైగ్రేన్ ప్రమాదం.. నిపుణుల అభిప్రాయం ప్రకారం ఎక్కువసేపు ఏసీలో ఉండేవారిలో తలనొప్పి,  మైగ్రేన్ ప్రమాదం పెరుగుతుంది. దీనికి ప్రధాన కారణాలలో ఒకటి, AC గది గాలి నుండి తేమను గ్రహిస్తుంది, దీని వలన గాలి చాలా పొడిగా ఉంటుంది. ఈ పొడి గాలి సైనస్‌లను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ఈ పొడి వాతావరణం  కళ్ళను కూడా ప్రభావితం చేస్తుంది. ఇది తలనొప్పికి కారణమవుతుంది. అకస్మాత్తుగా చల్లని, AC వాతావరణం నుండి వేడిలోకి మారినప్పుడు ఉష్ణోగ్రతలో ఈ ఆకస్మిక మార్పు కొంతమంది సున్నితమైన వ్యక్తులలో మైగ్రేన్ సమస్యను  ప్రేరేపిస్తుంది. శ్వాసకోశ సమస్యల ప్రమాదం.. ఏసీలో ఎక్కువసేపు గడిపే వ్యక్తులకు ఇతరుల కంటే శ్వాసకోశ సమస్యలు  అనగా.. నాసికా రంధ్రాలలో చికాకు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే AC నుండి వెలువడే చల్లని,  పొడి గాలి నేరుగా తాకినప్పుడు ముక్కు,  గొంతు  సున్నితమైన పొరలను ఎండిపోయేలా చేస్తుంది. దీనివల్ల చికాకు, నొప్పి,  పొడిబారడం జరుగుతుంది. ఆస్తమా-బ్రోన్కైటిస్ సమస్యలు ఉన్నవారు ఏసీలో ఎక్కువ సమయం గడపకుండా ఉండాలి. జీవక్రియపై ప్రభావం.. కొన్ని అధ్యయనాలు,  నిపుణుల అభిప్రాయాల ప్రకారం, ACలో స్థిరమైన చల్లని ఉష్ణోగ్రతలో ఉండటం వల్ల శరీర జీవక్రియ కూడా ప్రభావితమవుతుంది. సాధారణ పరిస్థితులలో శరీరం వేర్వేరు ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు దాని అంతర్గత ఉష్ణోగ్రతను నిర్వహించడానికి కొంత శక్తిని ఖర్చు చేస్తుంది. మనకు వేడిగా అనిపించినప్పుడు, మనకు చెమట పడుతుంది,  చల్లగా అనిపించినప్పుడు, శరీరం వేడిని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తుంది. ఈ ప్రక్రియలలో కేలరీలు కాలిపోతాయి. నియంత్రిత వాతావరణంలో ఏసీలో గడపడం  వల్ల ఉష్ణోగ్రతను సమతుల్యం చేయడానికి శరీరం అంత కష్టపడాల్సిన అవసరం ఉండదు. దీనివల్ల  తక్కువ కొవ్వును కాల్చేస్తారు. అంతేకాకుండా, చల్లని వాతావరణంలో  సాధారణం కంటే తక్కువ నీరు తాగుతారు. ఇది జీర్ణ ఆరోగ్యంపై కూడా ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ పరిస్థితులు మలబద్ధకం,  అజీర్ణం వంటి సమస్యలను కలిగిస్తాయి. కాబట్టి ఏసీ లో ఎక్కువ సమయం గడిపేవారు  జాగ్రత్తగా ఉండాలి.                                   *రూపశ్రీ.  

read more