Previous Page Next Page 
ఆఖరి ఘడియలు పేజి 4

 

    "ఏమిటి సార్ అవి?"
    "ఇంకా తెలీలేదా బ్రదర్.- టీవి. రేడియో, వెంటనే దాడి ప్రారంభించు! వాళ్ళ దగ్గర పనికిరాని స్క్రిప్టు అంటూ ఏమీ ఉండదు బ్రదర్! కమాన్ ఎటాక్-"
    విక్రమార్కారావు ముఖంలో అనందం చొచ్చుకొచ్చేసింది.
    "థాంక్ యూ సార్-" అన్నాడు కృతజ్ఞతతో. "మీ ప్రింట్లు ఇవాళ సాయంత్రానికల్లా ఇచ్చేస్తాను సార్-" అన్నాడు ప్రేమగా.
    భావానీశంకర్ కంగారుపడ్డాడు. స్మితారాణి మర్నాడు సాయంత్రం మళ్ళీ స్టూడియో కొస్తుంది. అందుచేత తనూ అప్పుడే రావాలి.
    "నో నో నో ........అలాంటి తొందరపాటు చర్యలు వద్దు బ్రదర్! రేపు సాయంత్రమే వస్తాను . ఓ.కే."
    "ఓ.కే.!"
    భావనీశంకర్ షాపు బయటికొచ్చేశాడు. టైమ్ పదయిపోయింది. చకచక బస్ స్టాప్ వేపు నడిచాడతను.
    ఆరోజు ఉదయం వరకూ తన భవిష్యత్తు ఏమిటా అన్న వర్రీ అతని ఉత్సాహాన్ని చాలా వరకూ సంహరిస్తూ వచ్చింది. కానీ హటాత్తుగా స్మిత అనే అందమైన దేవత కనిపించి అ వర్రేని అంతులేకుండా తరిమి కొట్టింది. దాంతో పూర్తీ ఉత్సాహంతో బస్ స్టాఫ్ చేరుకొని జన సమూహంలో నిలబడి హుషారుగా విజిల్ వేశాడు మళ్ళీ.
    కానీ పక్కనే ఓ పాము "బుస్" మని పరిగెత్తిన శబ్దం వినిపించేసరికి అదిరిపడి చూశాడు. చూసీ మరి ఆశ్చర్యపోయాడు. అది పాముకాదు దాని స్థానంలో స్మితారాణి మళ్ళీ అదే రూపంతో అదే అందంతో నిలబడి వుంది. కానీ పడగ విప్పిన పాములాంటి ఫోజులో వుంది. భావానీశంకర్ పశ్చాత్తాపపడ్డట్లు ఓవరాక్షన్ చేశాడు.
    పాము అవతారం చాలించేసి , "ఇడియట్" అని భావానీశంకర్ వినేట్లు అనుకుని అతనికి దూరంగా జరిగి నిలబడింది. తన్ను చూసే విజిల్ వేశాడనుకున్నట్లుంది - అయినా ఆ దేవతను తనెలా గమనించలేకపోయాడు . అర్ధం కావటం లేదు.
    భవనీశంకర్ పరిస్థితినంతా అవగాహన చేసుకునే సరికి బస్ వచ్చేసింది.
    పరుగుతో వెళ్ళి పుట్ బోర్డు ఎక్కడానికి యుద్ధం ప్రారంభించాడతను. రెండు నిమిషాల యుద్ధం తరువాత బస్ వెళ్ళిపోయింది కానీ అతను మిగిలిపోయాడు. నిజానికి పుట్ బోర్డు ఎక్కేందుకు కావలసిన అవకాశం ఆఖరి క్షణాల్లో అతనికి దొరికింది కానీ ముందు వేపు ఎంట్రన్స్ నుంచి లోపలి కేక్కలేక వెనక్కు తగ్గి నిలబడిపోయిన స్మిత రాణిని చూసి అతనూ తన అవకాశాన్ని వదిలేశాడు.
    బస్ స్టాప్ లో ఇప్పుడు నలుగురయిదుగురే మిగిలారు.
    భవనీశంకర్ చిరునవ్వుతో స్మితారాణి వేపు చూశాడు మళ్ళీ. ఆమె ముఖం చిట్లించుకుని తల మరోవేపు తిప్పుకుంది.
    ఈసారి ఖాళీ బస్ వచ్చింది.
    ఇద్దరూ బస్ ఎక్కేశారు.
    ముందు భవానీశంకర్ దగ్గరకే వచ్చాడు కండక్టర్.
    "ఎక్కడికి?"
    భవానీశంకర్ కేం చెప్పాలో తెలీలేదు. "తెలీదు బ్రదర్." బస్సు "వెనక్కు తిరిగేవరకూ కొట్టు--" చిరునవ్వుతో చెప్పాడతను.
    "ఆహ్హహ్హ......" అన్నాడు కండక్టర్ అర్ధమైనట్లు నవ్వుతూ.
    "కరెక్టు- కరెక్టు -" అన్నాడు భవానీశంకర్.
    కండక్టరు స్మిత దగ్గరకు నడిచాడు.
    "విజయనగర్ కాలనీ" అందామె పదిరూపాయల నోటిస్తూ.
    "చేంజ్" అన్నాడు కండక్టర్.
    "లేదు" అందామె బాగ్ లో చూస్తూ.
    కండక్టర్ బెల్ కొట్టాడు. బస్ ఆగిపోయింది.
    "దిగండి" అన్నాడతను.
    స్మితకు కోపం ముంచుకొచ్చింది. "ఎందుకు దిగాలి" అంది మొండిగా. భవానీశంకర్ ఆ అవకాశాన్ని ఇంక వదల దలచుకోలేదు.
    తనే బెల్ కొట్టేశాడు. బస్ స్టార్టయింది మళ్ళీ.
    కండక్టరు భవానీ శంకర్ వేపు చూశాడు కోపంగా.
    "క్యా హై" అన్నాడు ఉర్దూలో.
    "కబీ నహీ" అన్నాడు భవానీ శంకర్.
    "బెల్ క్యోం మారా?"
    "బస్ స్టార్ట్ కర్ నేకో!"
    "ఫీర్ మేమ్ సాబ్ కా టికెట్ కోన్ ఖరీదెంగా?"
    "హామ్ ." అంటూ జేబులోంచి చిల్లర తీసి ఇవ్వబోయాడతను ---
    స్మితారాణికి అతని వరసే మాత్రం నచ్చలేదు. ఆడపిల్లను చూసి విజిల్స్ వేసే రౌడీ సజ్జు దగ్గర టిక్కెట్ కోసం చిల్లర తీసుకోవటం చాలా అవమానకరంగా తోచింది. దానికంటే బస్సు దిగి మరో బస్సులో వెళ్ళటం ఉత్తమమనిపించింది.
    అంచేత ఈసారి తనే బెల్ కొట్టింది. డ్రయివర్ కి వళ్ళు మండిపోయింది. సడెన్ బ్రేకుతో బస్సు ఆపి అందరినీ కిందపడేట్లు చేసి "యే క్యాహో రహేహై!" అన్నాడు గట్టిగా.
    "ఏమిటి సంగతి!" స్మిత వైపు ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు కండక్టరు.
    "నాకతని డబ్బు అవసరం లేదు. బస్ దిగిపోతున్నాను......." అంది. డ్రయివర్ కాబిన్ వైపు నడుస్తూ.
    భవానీశంకర్ చప్పున కల్పించుకున్నాడు.
    "నేను చిల్లర మీకివ్వటం ;లేదు మేడమ్. కండక్టరుకి పది చిల్లర ఇస్తున్నాను - " ఆమె దిగాక ముందే డ్రయివర్ బస్సు స్టార్ట్ చేశాడు మళ్ళీ.
    "డ్రయివర్ బస్ అపు - నేను దిగాలి- " అరచిందామే ఉక్రోషంగా.
    "ఇది స్టేజి కాదు -" అన్నాడు నిర్లక్ష్యంగా.
    "మీ పది నోటివ్వండి- " అన్నాడు కండక్టర్.
    స్మిత పది నోటిచ్చింది.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS