Previous Page Next Page 
పిపాసి పేజి 3


    "అలా అనకండి. నా తల్లి ఎక్కడో అక్కడ క్షేమంగానే వుండి వుంటుంది" అంది, అసలు లేదనే, మాట భరించలేక.


    ఇద్దరూ రాధికని గురించి రకరకాలుగా ఆలోచిస్తూ మౌనంగా వుండిపోయారు.


    మద్రాసు వెళ్ళాక కొన్నిరోజులపాటు శ్రీహరిగారి కుటుంబాన్ని మర్చిపోలేకపోయారు.


    రాజేశ్వరమ్మ, సాంబశివరావుగారును క్రమేణా ఇరుగుపొరుగు వారితో పరిచయం చేసుకుంది రాజేశ్వరమ్మ. రెండు కుటుంబాల మధ్యనా ఉత్తరాలు సాగుతూనే వున్నాయ్.   


    మదన్ కి ఆఫీసూ ఇల్లూ తప్ప మరో ధోరణి లేదు. తీరిక వేళల్లో చిత్రలేఖనం చేస్తూ వుంటాడు. చిన్నతనంలో ఏ బొమ్మగీసినా ముందుగా రాధికకి చూపించేవాడు. పిల్లి బొమ్మగీసినా ఎలుకబొమ్మ గీసినా ఇప్పటికీ చిత్రం పూర్తయ్యాక వెంటనే ఆ విషయం గుర్తుకొస్తుంది మదన్ కి. పాపం రాధికెక్కడుందో?" అనుకుని నిట్టూరుస్తాడు.


    మదన్ కి మద్రాసులో సత్యనారాయణ ఒక్కడే స్నేహితుడు. మదన్ పనిచేస్తున్న కంపెనీలోనే సేల్సు రిప్రెజెంటేటివ్ గా పని చేస్తున్నాడు. సరదాగా కబుర్లు చెపుతాడు. అందర్నీ నవ్విస్తాడు. సాంబశివరావుగారు రాజేశ్వరమ్మ కూడా అతడ్ని ఓ కొడుకులా చూచుకుంటారు.


    ఆఫీసునుంచి అప్పుడే ఇంటికొచ్చి బట్టలు మార్చుకుని మదన్ వీక్లీ తిరిగేస్తూ పరుగులతో లోపలికొచ్చాడు. సత్యం ఒరేయ్ నీకెంత మతి మరుపురా, ఇవాళ సాయంత్రం రత్నావళి డాన్సు ప్రోగ్రాం వుందని చెప్పానా? టిక్కెట్లు కూడా కొని పెట్టాను, నిన్ను నమ్ముకుని. పద పోదాం, టైమయిపోతోంది. అన్నాడు.   


    "ఒరేయ్ నువ్వెళ్ళరా నన్ను చంపక" అన్నాడు మదన్.


    "ఒరేయ్ బాబూ నువ్వుట్టి సన్యాసివీకాదు, ఇటు మామూలు మనిషివీ కాదు. ఛస్తున్నానీతో, రత్నావళినిచూడ్డానికి జనం గిజగిజలాడిపోతున్నారు. టిక్కెట్లు దొరక్కపోతే బ్లాకులో కొన్నాను. ఒరేయ్ ఎంత అందంగా వుంటుందిరా ఆమె! ఆ అందం చూసి తీరాలి. అందులోనూ నీలాంటి చిత్రాకారుడు. రారా బాబూ.... ప్లీజ్....."


    "పోనీ వెళ్ళకూడదటరా అతనంత బతిమాలుతుంటే అంది తల్లి."


    బద్దకంగా లేచి బట్టలేసుకుని బయలుదేరాడు మదన్. టాక్సీని పిలిచి మ్యూజియంహాలుకి పొమ్మన్నాడు సత్యం .


    ఇసుకవేస్తే రాలనట్లుగా, వున్నారు జనం. ఎక్కడ చూసినా రత్నావళి పోస్టర్లే. టిక్కెట్లయిపోయాయి. అని బోర్డు పెట్టాడు కౌంటరు దగ్గర.


    "అబ్బ ఎంత మంది జనమో!" ఆశ్చర్యంగా అన్నాడు మధన్.


    "దట్ షోస్ హర్ పాపులారిటీ. షీ ఈజ్ ఏన్ ఏంజిల్ అన్నాడు సత్యం."    


    "ముందు నీ వర్ణన చాలా బాగుంది" అన్నాడు నవ్వుతూ మదన్.


    ఎలాగో జనాన్ని తప్పించుకుని లోపలికి తోసుకు వెళ్ళారు. సత్యం, మధన్.


    మరోపది నిమిషాల కల్లా లైట్లు ఆరిపోయాయి. తెల్లని జరీకుట్టిన సిల్కుగరరా, వాటికి జతగా తెల్ల రాళ్ళ నగలు ధగధగా, మెరిసిపోతూ ఆమె శరీరచ్చాయతో పోటీ పడ్డాయి.


    ఒక్కసారిగా ఎవరో అప్సరస భూలోకానికి దిగొచ్చినట్టుగా అనిపించింది మదన్ కి. కళ్ళు చెదిరే ఆమె అందాన్ని, ఒళ్ళు మరచి చూస్తున్నాడు మదన్. హాలంతా వుంది, ఆ నిశ్శబ్దంలో కమ్మగా రత్నావళి కంఠం. ఖవాలీ ప్రోగ్రాం చుట్టూ ఆరుగురు మగవాళ్ళు రెండు జట్లుగా కూర్చున్నారు. ఈమె పాటకి లయగా వంత పాడుతున్నారు, "అమోఘం. అద్భుతం...." అంటున్నాయి కొన్ని కంఠాలు. "వా" అంటున్నాయి. మరికొన్ని కొందరు దాదాపు అరగంటలసేపు చడీ చప్పుడూ లేకుండా విన్నారు జనం. కరతాళ ధ్వనులు మధ్య కర్టెనుపడుతూ వుంటే హంసలా నడిచి లోపలికి వెళ్ళిపోయింది రత్నావళి. రత్న ప్రభరత్నమంజరి ఇద్దరూ కలిసి ఓ పాట పాడారు. ఆ తరువాత మళ్ళీ రత్నావళి, రంగం మీది కొచ్చింది. ఈసారి మయూరిలా!! ఆకుపచ్చ నిబనారస్ చీరకి, ఎఱ్ఱని అంచు. అదే రంగు బ్లౌజ్. కాళ్ళ గజ్జెలు ఘల్లుమంటుంటే కలహంసలా. ఎగిరే పిట్టలా, కదిలే నెమలిలా, పాడుతూ చక్కటి జావళీ చేసింది తన్మయులై చూస్తున్నారు జనం. మన సాయేరా మాధవా నిన్ను చూడ మనసాయెరా" అనే జావళీని పాడుతూ, నాట్యం చేస్తూ వుంటే, ఉన్నట్టుండి.ఏదో ఏదో జ్ఞాపకానికొచ్చినవాడిలా "రాధిక" అన్నాడు మదన్. "ఏమోయ్ మదనా..... ఏమిటో రాధిక అంటున్నావు. ఎక్కడున్నావేమిటీ బృందావనంలోనా?" సత్యం వేళాకోళం చేస్తూ వుంటే. మదన్ కి అర్థమైంది, తనా మాటలు పైకే అనేశాడని. సిగ్గుపడ్డాడు.    


    అతని మాటలు విననట్టే, మధన్ ఆమెకేసే చూస్తూ ఆలోచనల్లో మునిగిపోయాడు.


    ఆమె రాధికేనా కాదా అని. మదన మోహనా..... మురళీకృష్ణా.... ఏదీ తమ మురళీగానం. బృందావనంలో రాధ ఆట ఒక్కటేనా? మరి తమరి పాటేది? మళ్ళీ ఎగతాళి చేశాడు సత్యం నవ్వుతూ.


    "ఒరేయ్ సత్యం నీ ఎగతాళి తరవాతగానీ, ముందు నాతో అమ్మాయిని పరిచయం చెయ్యరా.


    "ఒరేయ్ ఒరేయ్ ఏమిటిరోయ్..... ఫరవాలేదే! ఏమో అనుకున్నా. అవున్లే ఎంతవారైనా కాంతదాసులేగా."


    మధన్ ఏదో ఆలోచిస్తున్నాడు. రత్నావళి స్టేజిమీద వచ్చినప్పుడల్లా కన్నార్పకుండా చూస్తున్నాడు. మరి కాస్సేపటికి ప్రోగ్రాం ముగిసింది. దీపాలు వెలిగాయి. గ్రీన్ రూమ్ కేసి పరుగెత్తుతూన్న జనాన్ని పోలీసు వాళ్ళు ఆపు చేస్తున్నారు.


    "మధన్..... మనం కాస్సేపు అవతలనుంచుందాం. రద్దీ కాస్త తగ్గితే, లోపలికెళ్ళొచ్చు అన్నాడు సత్యం. ఇద్దరు బయట నుంచున్నారు కాస్సేపు. ఆ తరువాత ఎలాగో సందుచేసుకుని, సత్యం, అందర్నీ తోసుకుంటూ ముందుకెళ్ళిపోయాడు. మధన్ ని, చిన్నపిల్లాడిలా చెయ్యిపట్టుకుని తీసుకెళుతూ.


 Previous Page Next Page 

  • WRITERS
    PUBLICATIONS