రాజారావు వాళ్ళను వారిస్తూ __ 'మనం వీళ్ళనేమీ చేయకూడదు పోలీసుల కప్పగించడమే మన కర్తవ్యం. ఊళ్ళో యువకుల్ని పాడుచేస్తున్నాడని వీళ్ళు సుదర్శనాన్ని హత్య చేశారు. నిజానికది సరయినది కాదు. ప్రజల తప్పుల్ని దండించడానికి ప్రభుత్వముంది. శిక్షను నిర్ణయించేది, దండించేదీ ప్రభుత్వ మాత్రమే!" కానీ, వీళ్ళు చట్టాన్ని తమ చేటుల్లోకి తీసుకోన్నారని మనం వీళ్ళను నేరస్థులని అంటున్నాం. మనం వీళ్ళను స్వయంగా శిక్షించాలనుకుంటే, వాళ్ళు చేసిన నేరమే మనమూ చేసినట్లవుతుంది. అప్పుడు వాళ్ళకూ, మనకూ తేడా ఏమిటి?" అన్నాడు.
అతడి మాటలకు కొందరు తగ్గినా, కొందరిలో ఇంకా ఆవేశం చల్లారక _ "ఇది ... ఇది మనిషికాదు _ దొంగ ... దొంగా కూడా కాదు ...." అని బూతుల్లోకి డిగి, లీలాసుందరి మీద చేయి చేసుకోబోయారు.
అప్పుడు రాజారావు లీలాసుందరికీ, జగ్గారావుకీ అడ్డంగా నిలబడి __ రెండు చేతులూ చాపి __ "అయ్యా! నామీద గౌరవ మున్నవాళ్ళు వీళ్ళను కొట్టవద్దు. ఏది ఏమయినా వాళ్ళను కొట్టడం తప్పనిసరనుకునే వాళ్ళు ముందు నన్ను తన్నండి ...." అన్నాడు.
ఈ మాటలతో అందరూ తగ్గారు. క్రమంగా జనం అక్కడ్నుంచి వెళ్ళిపోసాగారు.
కాసేపటికక్కడి రామాకాంతం, కనకరాజు చలమయ్య, గరవయ్య నరహరి మాత్రం మిగిలారు __ నేరస్తులు కాక.
రమాకాంతం బాధగా __ రాజారావుగారూ __ నేనిక్కడ అగడానికో ముఖ్య కారణముంది __" అన్నాడు.
మిగతా నలుగురూ కుతూహలంగా వింటూండగా రమాకాంతం ఏ పరిస్థితుల్లో తను రవి అనబడే జగ్గారావుకు ఆశ్రయమిచ్చిందీ చెప్పి _ " నేను వీడి మాటలు నమ్మాను ఎందుకంటే మీరు నా కందజేసిన ఉత్తరంలో _ ఈ గ్రామంలో అయిదుగురి అంతు చూస్తానన్న బెదిరించింది. ఆ అయిదుగుర్నీ ఈ గ్రామానికొచ్చిన కొత్తలో మీరు మీ ఇంటికి విందుకని ఆహ్వానించి ఉన్నారు. దాంతో ముమ్మల్ననుమానించి పక్కలో బల్లెంలా వీణ్ని౦ట్లో పెట్టుకుని _ వాడు కోరినట్లు అందరికీ మా బంధువని కూడా చెప్పుకున్నాను. మీ గురించి చలమయ్యనుకూడా హెచ్చరించాలనుకున్నాను. కానీ ఈ రవి గాడోద్దన్నాడని మానేశాను ....." అన్నాడు.
తనను రమాకాంత౦ నక్సలైటుగా అనుమానించాడని తెలియగానే రాజారావు తెల్లబోయి __ " ఇది నాకు తెలియనే తెలియదు. ఇతగాడు మీ బంధువని మీరంటే నేనస్చర్యపడ్డాను. మీతో చెప్పినట్లే ఇతడు నాతోనూ తను సీఐడీనన్నాడు. మీమీద అవినీతి ఆరోపణలను రహస్యంగాపరిశోధించడానికి వచ్చానన్నాడు. అంతకుముందు మీకు ఉత్తరం నాచేత ఇప్పించాడు. అప్పుడేమో తను నిరుద్యోగినన్నాడు." అంటూ మొదట, తనకూ, జగ్గరవుకీ ఎలా పరిచయమయి నదీ చెప్పాడు.
రాజరావింకా ఏదో చెబుతూండగా జగ్గారావు బిగ్గరగా నవ్వాడు __ "చెప్పుకోండి. మేం చేసినవన్నీ కథల్లా చెప్పుకోండి. ఆ కథలు నలుగురూ ఆశ్చర్యపోయేలా ప్రచారం చేయండి. మేం తల పెట్టిన పని సామాన్యమయినది. కాదు. కానీ మేము సామాన్యులం . అయినా మరీ మీ అంత సామాన్యులం కాదు. మీది సంకుచిత దృష్టి మాది విశాల దృష్టి. మీరు భారతీయ పౌరులయితే _ మేము ప్రపంచ పౌరసత్వాన్ని వాంచిస్తాం.సరయిన మార్గంలో ప్రజలను నడిపించే నాయకుడేదేశంలో ఉన్నా మేము పూజిస్తాం, అనుసరిస్తాం. తప్పు దారికి ప్రజలను మళ్ళించే నాయుకులందర్నీ మేము నిరసిస్తాం. వ్యతిరేకిస్తాం. మట్టుబెడదాం. ఇప్పుడు _ ప్రజా క్షేమాన్ని కోరుతూ __ తన జీవితాన్నందు కంకితం చేసిన _ ఒకే ఒక్క ప్రజా నాయుకుడు మావో! అందుకే చైనా దేశం ఒక్క అన్ని రంగాల్లోనూ ముందడుగు వేస్తూ ప్రపంచాన్నే గడగడలాడిస్తోంది. మన దేశానికీ అటువంటి నాయకత్వం లభించే వరకూ మా పోరాటం సాగుతూనే ఉంటుంది ...."
ఆ మాటలకు నరహరి పిడికిళ్ళు బిగిశాయి. కళ్ళెర్రబడ్డాయి.
అతడి ఆవేశాన్ని రాజారావు గమనించి నెమ్మదిగా భుజం తట్టి __ "నరహరిగారూ! మనం ఆవేశపడి లాభంలేదు. ఊరుకొనడంలోనే మనం మన దేశపుటౌన్నత్వాన్ని రుజువు చేసిన వాళ్ళమవుతాం. ఇదాహరకు __ ఇతడిప్పు డింత ధైర్యంగా కాహినాను పొగిడి , మన దేశంలో కాబట్టి బ్రతికి పోయాడు. ఇదేవిధంగా చైనా దేశంలో భారతదేశాన్ని పొగిడితే ఇతడి గతి ఏమవుతుంది? మన దేశపు టౌనత్వం ఒకరి కారణంగా తరిగేది, మరికారి కారణంగా పెరిగేది కాదు. ఈ రవి _ నాతో తన పేరు జగ్గారావుని చెప్పేదనుకోండి __ ఎందుకో చైనా దేశాన్ని ప్రేమిస్తున్నాడు. ప్రేమించనీయండి. భారతీయుడిగా పుట్టిన అదృష్టానికి _ అతడికీ స్వతంత్రం లభించింది. అయితే మనమిప్పుడు తడ్ని పోలీసులప్పగిస్తున్నామంటే _ అందుక్కారణం చైనాను ప్రేమిస్తున్నాడని కాదు. దేశంలో అల్లకల్లోలం రేపుతూ, దేశద్రోహానికే తలపడినందుకు .... ఇదీ మీరు గుర్తించుకోవాల్సిన విషయం ...." అన్నాడు.
ఈసారి లీలాసుందరి ఉరిమింది __
"దేశం మాకు ద్రోహం చేసిందా, మేం దేశానికి ద్రోహం చేశామా? మే మేటువంటి అన్యాయాలకు గురయ్యోమో మీలో ఎందరికీ తెలుసు? ఎంతలా కడుపు మంది పోకపోతే _ ఇంతకు తెగించామో మీకెలా అర్ధమవుతుంది? నీడపట్టున కూర్చుని బువ్వ తింటున్న మహారాజులు మీరు. ప్రజా సేవకోసం కార్లలోనూ విమానాల్లోనూ పర్యటించే వాళ్ళు మీకు నాయుకులు మీకు తెలుసా __ ఊళ్లోని పెత్తందారు కామగ్నికి నా తల్లిఉ బలయిపోయింది. నా తల్లి ఆత్మహత్య చేసుకుందన్న ఆవేశంతో నా తండ్రి ఆ పెత్త౦ దారుని హత్యచేస్తే, ఆయనకురిశిక్ష పడింది. నేను నా బాబాయి సంరక్షణలో పెరిగాను. నాలో విప్లవ భావాలు రేకెత్తించినవాడు నా బాబాయి. మాటలు వినకుండా దేశాన్ని ప్రేమిస్తూ కూర్చుంటే __ నాకు ఒరిగిందేమిటి?
"ఇదుగో __ ఈ రవిశంకర్ ని చూడండి. పైసా దగ్గర్నుంచీ కూడబెట్టి తల్లి ఇతడ్ని చదివించింది. బీయస్సీ ప్యాసయ్యాడు. వ్యూను ఉద్యోగానిక్కూడా గతిలేదు. ఏ చేస్తాడు.? నిరుద్యోగిగా రెండేళ్ళు బ్రతికి ఉద్యోగం దొరకలేదు. అదయినా మాతృదేశం ఇవ్వలేదు. చైనా దేశం ఏజంటు __ ఇచ్చాడు . అతడికి సాయపడితే అది దేశ ద్రిహామెందుకవుతుంది? కన్నతల్లిని రక్షించుకోడానికి సాయపడని దేశం మాతృదేశ మేలాగవుతుంది? మా దగ్గర తెలివి ఉంది, శక్తి ఉంది. ఎవరు వాటిని ఆదరించి, ప్రోత్సాహిస్తారో __ వారికోసమే అవి వినియోగిస్తాం. ఎవరు మమ్మల్ని బాధించారో __ వారిపై పగ తీర్చుకుంటాం __ అంతే!"
రాజారావు భారంగా నిట్టూర్చి రమాకాంతం వైపు తిరిగాడు.
"చూశారా _ రమాకాంతంగారూ! వీళ్ళి౦కా బాగా కుర్రవాళ్ళు . అప్పుడే వీళ్ళ మనసులెంత కలుషితమైపోయాయో చూడండి. కొంతమంది అవకాశవాదులు __ ఈ చిన్నవయసులోనే ఎంతో గాఢంగా ఇలాంటి భావాల్ని వీళ్ళ మనస్సులో నాటారు. అందుకే మనమెప్పుడూ యువతరాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఏ దేశపు భవిష్యత్తయినా యువతరం మీదనే ఆధారపడి ఉంది.