Previous Page Next Page 
విరాజి పేజి 28

 

     "డబ్బుకూడా యిచ్చాను."

    మేరు పర్వతం విరిగి పడుతోంది.

    "చెబుతానులెండి" నీరసంగా అని ఫోన్ పెట్టేసింది. వంట్లొంచి సెగలు వ్యాపిస్తున్నాయి.

    కొంచెము యివతలకు జరిగి స్టేజికి అటువైపు నిలబడివున్న గౌతం ముఖంలోకి చూసింది.

    అదే సమయానికి అతనుకూడా ఆమెవంక చూసి పలకరింపుగా నవ్వేడు.

    విరాజి విసురుగా ముఖం తిప్పేసుకుంది.

    "ఇలా .... ఎందుకు ....?"

    మళ్ళీ ఫోన్ మ్రోగింది.

    రిసీవర్ చేతుల్లోకి తీసుకుంది.

    ...... గౌతం గారున్నారా!" యింకోగొంతు.

    .... ..... .....

    "నేను .... పత్రిక ఎడిటర్ని నాదమునిగారు రాయలేని భాగాలు పూర్తీ చేసియిస్తున్నారు. ఇంకా మేటర్ రాలేదు. డబ్బు తీసుకున్నారు.

    "................?"

    భూమి బ్రద్దలవుతోంది.

    ఏమిటది? కలా నిజమా? ఇన్నాళ్ళూ శ్రమపడి తీర్చిదిద్దింది.....

    సెగలు జ్వాలలుగా మారుతున్నాయి.

    మళ్ళీ ఫోను రింగయింది.

    ఇంకో సంపాదకుడు.

    "నాదమునిగారి సీరియల్ ..... మేజర్ అర్జంటు .... డబ్బు "

    చెవుల్లో హొరు! నిండా నిప్పు కణికలు _ రక్తం నిండాలావా.

    "ఏమిటిది? ఎందుకిలా....?"

    "అరె! ఇలా నిలబడే వున్నరేమిటి? మీ శీను వచ్చేసింది" ఎవరిదో గొంతు.

    ఏదో రాక్షస హస్తం విసిరేసినట్లు ఏ మరుక్షణంలో స్టేజిమీద వుంది.

     ఆమె దృశ్యంలోకి రావటమే విచిత్రంగా విభ్రమం కలిగించేదిగా వుంది. ప్రేక్షకులంతా ఊపిరి బిగాపెట్టి చూస్తున్నారు.

    గవుతమ్ త్రుళ్ళిపడినట్లయ్యాడు. అతనిలోని సునితమైన పరిశీలనా శక్తి ఆమెలో ఏదో తేడాని గమనించింది.

    నుదుట కుంకుమ చెరిగింది. జుట్టు విరాబొయ్యబడి వుంది. కళ్ళు విప్పారిజ్యోతిలతా మెరుస్తున్నాయి.

    శివశక్తిలా, ఉన్మత ప్రేరణిలా విరాజి విలయతాండవం చేస్తోంది.

    గవుతమ్ కళ్ళప్పగించి చూశాడు. ఆమె అలసిపోతుందని , శరీరం దెబ్బతింటుందని ఈ నాట్యం రిహార్సల్స్ చెయ్యటానికి తను ఒప్పుకోలేదు రిహార్సల్స్ చెయ్యటానికి తను ఒప్పుకోలేదు రిహార్సల్స్ లేకపోయినా ఆమె బాగా చెయ్యగలదని తెలుసు. కాని ఇంత అద్భుటగా హిమాలయ శిఖరాలు అధిరోహించ గలదని ఊహించలేదు.

    ఆమె శరీరంలోని ప్రతి అణువూ నిప్పురవ్వలు విరజిమ్ముతున్నది.

    ఉన్నట్లుండి ఆమె కడుపులో విధ్యుత్పతం తగిలినట్లు, భూమి ఫేళ ఫెళమని విచ్చుకుపోతున్నట్లు , విచ్చు కత్తులు కడుపులోకి జోనిపి ప్రేవులు విడదీస్తున్నట్లు భరించలేని బాధ.

    ఒక్కక్షణం ..... అడుగులు అగబావుయి, అంతలోనే శక్తిని పుంజుకుని మళ్ళీ గాలిలోకి తేలాయి.

    ఆ క్షణం సేపట్లో గౌతమ్ ఏం జరుగుతున్నదోగ్రహించాడు. "విరాజీ" అని కేక చేయబోయి పరిసరాలు జ్ఞాపకం చేసుకుని నిగ్రహించుకున్నాడు.

    ప్రేవుల్లో ప్రారంభమయిన నొప్పి నలువైపులా వ్య్పిస్తూ ఆమెను శపిస్తూ శక్తిని కృంగదీస్తూ శరవేగంతో ముందుకు జరుగుతోంది.

    విరాజి లెక్క చెయ్యకుండా ఆ నొప్పిని నిర్దాక్ష్యిణ్యంగా అదిమేస్తూ, తన పాత్ర రూపకల్పన అధిగమించి, అవధుల్ని చేధించి రసజగత్తులోకి దూసుకుపోతుంది.

    ప్రేక్షుకులు అమరమైన తన్మయావస్థలో వున్నారు.

    గౌతమ్ ఒక్కడే ..... నిలువునా నీరైపోతున్నాడు. ఏం జరుగుతోంది.? ఆమె ప్రేవులు చీలి పోతున్నాయా? కడుపును తోల్చుకుని, అతికిన చర్మాన్ని పగులకొట్టుకుని రక్తపు బిందువులు బయటకు ప్రవహిస్తుననాయా?

                                                            *    *    *   

    విరాజి కళ్ళు విప్పింది. క్షణంసేపు ఏం జరిగిందో తానెక్కడ వున్నదో అర్ధంకాలేదు. కాని క్రమంగా తెలివివోచిన్నట్లు తాను గ్రీన్ రూం లో నేనమీద పడుకోబెట్టపడి వున్నదనీ, తనచుట్టూ మనుషులు గుమికూడి వున్నారనీ గ్రహించింది.

    తన భుజంమీద చెయ్యివేసి కుదుపుతూ "విరాజీ! విరాజీ!" అంటున్నాడు గౌతమ్ అనదంతో

    ఆపరేషన్ చేసిన డాక్టరు ప్రక్కనే కూర్చుని ఆమెను ఎగ్జామిన్ చేస్తున్నాడు.

    విరాజికి బాగా నీరసంగావుంది. కడుపులో యిందాక కత్తులతో పొడిచినట్లు వున్న పోట్లు యిపుడంతగా అనిపించటంలేదు.

    "అదృష్టవశాత్తూ _ లోపల పచ్చిగా వుండటంచేత కలిగిన నోప్పివల్ల ఫేయింటుయింది. తప్పితే డ్యామేజీ ఏమీ జరగలేదు. "షియాజ్ అల్ రైట్ " అంటున్నాడు డాక్టరు.

    గౌతమ్ ముఖంలో గొప్ప రిలీఫ్ కనబడటం విరాజి గమనించింది.

    అంతలోకే ప్రదర్శన గుర్తువచ్చింది. "పోగ్రాం ఏమయింది?" అన్నది చిన్నగా _ బలహీనమైన కంఠంతో.

    "పోగ్రాం చాలా విజవంతంగా ముగిసింది. విరాజీ దాని గురించి బాధపడుకు అన్నాడు గౌతమ్ .

    "నేను చివరిదాకా చెయ్యగలిగానా?"

    "చివరిదాకా _ ప్రదర్శన పూర్తయ్యేదాకా అనుకున్నది అనుకున్నట్లు పూర్తిచేశావు." ప్రేక్షకులేవరికీ అనుమానం కలగలేదా?"

    ఒకటోకటిగా జరిగినవన్నీ గుర్తుకోస్తున్నాయి. క్లైమాక్స్ దృశ్యానికి ముందు. ఆ దృశ్యాన్ని మననం చేసుకుంటూ, మనసులో రూపురేఖలు దిద్దుకుంటూనే మూలనిల్చోటం ..... వరసగా ఫోన్ కాల్స్!

    "మేడమ్! ఎంతపని చేశావు? డబ్బుకోసం ఎంత దారుణంగా అమ్ముడుపోయావు నిన్ను రూపొందించాలని ఎంత తపించాను! ఎన్ని కలలుగన్నాను? ఇద్దరం కలసి యిరు కోణాలనుంచి జైత్రయాత్ర సాగించి యీ ప్రపంచానికి ఉత్తమ కళ అంటే చూపించాలని ఎంత ఉవ్విళ్ళూరానో! నా ఆశలు, ఆశయాలూ అన్ని నిర్దాక్షిణ్యంగా పటాపంచలుచేశావు. ఇలా ఎందుకు చేశావు గౌతమ్ ఇలా ఎందుకు మారిపోయావు?"

    గౌతమ్ విరాజి కళ్ళలోకి చూశాడు. ఆ కళ్ళలో ఎన్నెన్నో ప్రశ్నలు గ్రుచ్చి గ్రుచ్చి "నాకు సమాధానంచెప్పు" అన్నట్టు చూస్తున్నది.

    "అతనావాడి భరించలేనట్లు ముఖం ప్రక్కకి త్రిప్పేసుకున్నాడు రెండు మూడు రోజులదాకా కంప్లీట్ రెస్ట్ ఇవ్వండి" అన్నాడు.

                             *    *    *           

    రాత్రి పదకొండు దాటిపోయింది. టాక్సీ దిగాక విరాజి తలుపుతాళం తీసి లోపలకడుగు పేట్టి లైటు వేసింది. ఆమె వెంట గౌతమ్ కూడా లోపలకు వెళ్ళాడు.

    ఆమెతో మాట్లాడాలంటేనే అతనికి భయంగా వుంది. తలెత్తికళ్ళలోకి చూడలేకపోతున్నాడు టాక్సీలో రెండుమూడుసార్లు పలకరించాలని ప్రయత్నిస్తే ఆమె మౌనంగా ఊరుకుంది. _ ఏదో జరిగింది. ఆమె మనసులో అదిమి పెట్టుకున్న బాధవున్నట్టు తెలుస్తోంది.

    లోపలకు వెళ్ళాక ఆమె అతన్ని కూర్చోమనికూడా అనలేదు. అతనివైపు తల త్రిప్పి కూడా చూడలేదు . కిటికీ తలుపులు తెరచి _ బయట చీకట్లో వింత ఆకారాలుగా నిశ్చలంగా వున్న చెట్లుకేసి చూస్తూ నిలబడింది.

    "విరాజీ!"

    ఆమె పలకలేదు .

    ధైర్యం చేసి ఆమె వెనక్కివెళ్ళి దగ్గరగా నిలబడి భుజంమీద చెయ్యి వేశాడు.

    అతని చేతిని మృదువుగా భుజంమీద నుంచి తీసివేసింది.

    "విరాజీ!"

    "నాకు మనసేం బావుండలేదు గౌతమ్ . నన్ను వొంటరిగా వొదిలి దయవుంచి వెళ్ళిపో ."

    అతని గుండె కళుక్కుమంది, "ఏం చేశాను విరాజీ నేను? ఇంత కటువుగా ఎలా మాట్లాడాగలుగుతున్నావు?" అన్నాడు.

    "నువ్వేం చెయ్యలేదు. నువ్వేం చెయ్యలేదు. నేనే అంతా ....." ఉబుకుతోవున్న ఆవేశాన్ని అణుచుకుంటూ "ప్లీజ్ గౌతమ్! నిన్ను వేడుకుంటున్నాను వెళ్ళిపో" అన్నది.

    ఉన్నట్లుండి అతనికి కోపం ముంచుకు వచ్చింది. "అసలు నేనేం చేశాననీ, ఏమంత చెయ్యరాని నేరం చేశాననీ వెళ్ళిపొమ్మ౦టున్నావు?" అని అరిచాడు.

    విరాజి గిరుక్కున వెనుదిరిగింది . అసృవులతో నిండిన ఆమె కళ్ళు కెంపుళ్ళా మెరుస్తున్నాయి.

    "ఏం చేశావా! ఎంతోకష్టపడి ప్రోవుచేసుకున్న అమూల్య సంపదను కనురెప్ప పాటులో కోల్పోయేటట్లు చేశావు. నిన్ను ..... నిన్ను ... ఓ గొప్ప రచయితగా తీర్చిదిద్దాలని. ఈ దేశం గర్వపడే ఉత్తమ రచయితగా తీర్చిదిద్దాలనీ ఇవ్విళ్ళూరాను. ఆరోజెంతో దూరంలేదని మురిసిపోయాను. నువ్వంతా భిన్నాభిన్నంచేసి పారేశావు. డబ్బుకు అమ్ముడుపోయావు. భావస్వాతంత్రాన్ని పోగొట్టుకుని వ్యాపార వేత్తల చేతుల్లో కీలుబొమ్మగా మారిపోయావు.

    "అవును మారాను కాని ఎందుకిలా జరిగిందో తెలుసా? నీకోసం ...."

    "నా కోసమా?"

    "అవును నిన్ను కాపాడుకోవటం కోసం నిన్ను బ్రతికించుకోవటం కోసం."

    నిజానికి అర్ధం కాలేదు ఆశ్చర్యంగా చూసింది.

    "అవును విరాజీ! డాక్టర్ గారు నీకు ఎమర్జన్సీ అపరేషన్ చెయ్యాలని చెప్పాడు ఖర్చు ఎంతవుతుందని అడిగితే రెండు వేలవుతుందని తెలిసింది. నా జేబులో అప్పటికి యిరవై ముప్పయి రూపాయలకన్నా లేవు. అడగతానికి ఎవరూ తెలీదు నాకు అంతకు ముందు ట్రీట్ మెంట్  కోసం మూడొందలదాకా టీ కొట్టు వరదరాజు దగ్గర తీసుకున్నను. నీ పరిస్థితి విషమంగా వుంది. నీకు అత్యవసరంగా ఆపరేషన్ చేసితీరాలి ఆ పరిస్థితులో ఏం చెయ్యాలి? ఎవర్నడగాలి? పత్రిక ఎడిటర్ దగ్గర కెళ్ళి ప్రాధేయపడ్డాను. నిరాకరించాడు. అంతలో .... అంతలో ఓ మలుపు , షాక్ లో వున్న నాదమునిగారి సీరియల్ అయన పేరుతో కంటిన్యూ చేస్తే డబ్బాశ చూపారు. నీ కోసం నా ఆత్మను చంపుకున్నాను నన్ను నేను చంపుకున్నను. నీ మీది ప్రేమచేత నిన్ను పోగొట్టుకుంటాననన్ భయం అలా లొంగిపోయాను. నేను నేరం చేశానా? అపరాధినా?

 Previous Page Next Page