Read more!
Next Page 
మా ఊళ్ళోమహానుభావుడు పేజి 1

                                 

                               

                                     మా ఊళ్ళో మహానుభావుడు



                                                                                __ వసుంధర

 

                                        



    లాంచీ బొబ్బర్లంక రేవులో ఆగింది.

    ముందుగా రాజారావు, అతడి వెనుకనే అతడి భార్య వసంత, నాలుగేళ్ళ కూతురు నీల దిగారు. కూలివాడి సహాయంతో ఆ తర్వాత సామానంతా దిగింది. సామాను _ ట్రాన్స్ ఫర్ మీద వెళ్ళే ఉద్యోగి సంసారిసమానులా చాలా ఉంది.

    "సామాను బస్సుకాండీ?" అన్నాడు కూలివాడు రాజారావు తల అడ్డంగా ఊపి _ "రీక్షాకావాలి!" అంటూ బేరమడ్డానికి రిక్షా వాళ్ళున్నవైపు నడిచాడు.

    బొబ్బర్లంక నుంచి రిక్షా కట్టించుకునేది సాధారణంగా పేరవరం గ్రామవస్తావ్యులే అయుంటారు. పేరవరం బొబ్బర్లంక నుంచి రెండు మైళ్ళ దూరంలో మాత్రమే ఉంది? అ ఊరి జనాభా సుమారు అయిడువేలే కాబట్టి చెప్పుకో తగ్గ పెద్ద ఊరు కాదనే చెప్పుకోవాలి . కాబట్టి ఆ ఊళ్ళోని వారంతా రిక్షావాళ్ళకు తెలిసనవారే! కానీ రాజారావు ముఖాన్ని చూసిన గుర్తు వాళ్ళలో ఎవరికీ లేకపోవడం వల్ల _ అతడోస్తున్నది తమకోసమేనని వాళ్ళెవ్వరూ ఊహించలేదు. అందు కేకాబోలు ఒక్కరూ అతడ్ని _ "రిక్షా కావాలా బాబూ __ " అని పలకరించలేదు.

    రాజరావే వాళ్ళను పలకరించాడు.

    "మూడు రిక్షాలు కావాలి _ చలమయ్యగారింటికి!"

    అనుకొని కొత్త బేరానికి రిక్షా వాళ్ళకుత్సాహా మొచ్చింది.

    "మామూలుగా అయితే రిక్షాకి రూపాయుచ్చు కుంటా మండి. సామాను బాగా ఉంటే మాత్రం రెండ్రూ పాయలవుతుందండి__" అన్నాడు వచ్చింది కొత్తవాడని పసిగట్టిన ఓ రిక్షావాడు.

    "సామాను బాగానే ఉంది మరి _ రండి చూద్దురుగాని. అన్నాడు రాజారావు అతడింకేమీ బేరమాడకుండా వాళ్ళు చెప్పిందాని కొప్పేసుకుని రిక్షా ఎక్కేశాడు. బరువుగా, నిండు గర్భిణీలా మూడు రిక్షాలూ బయల్దేరాయి.

    రిక్షాలు వేడుతున్నది సన్నని తారు రోడ్డుమీద. ప్రక్కగా గోదావరి నుండి తవ్విన కాలువ. కాలువకవతల అరటి తోటలు, వరిచేలు , రోడ్డుకు మరో ప్రక్క ఆనకట్టను దాటి ప్రవహించే గోదావరికివతల మళ్ళీ అరటి తోటలు , వరిచేలు ఆగకుండా వీచే చల్లటి పైరు గాలి:

    "ఈ వాతావరణం చాలా బాగుంది కదూ!" అంది వసంత.

    "పాపానడుగు?" అన్నాడు రాజారావు.

    అడక్కుండానే _ "తోటలూ , కాలువా బాగున్నాయి_" అంది నీల.

    రాజారావు నవ్వి ఆప్యాయంగా కూతురి తల నిమిరాడు:

    "తెలిసిన వాళ్ళందర్నీ వదిలేశాం! చేస్తూన్న ఉద్యోగం మానేశాను. అన్నీ వదులుకుని మనకేమీ, ఎవరూలేని ఈ ఊళ్ళో అడుగుడుతున్నాం. అయినా అటువంటి అవకాశం కూడా కలిసొచ్చింధనుకో _ ఇక ముందు మన జీవితం కూడా ఈ వాతావరణం లాగే బాగుంటే." అని అర్ధోక్తిలో ఆగినిట్టూర్చాడు రాజారావు.

    మనమేప్పుడెం చేయబోతున్నామో, మనకేప్పుడెం జరగబోతోందో తెలిస్తే _ జీవితం అనబడే దాంట్లో పసేలేదు." అంది వసంత.

    "తమరు చలమయ్యగారి బంధువులాండీ?" రిక్షావాడు పలకరించాడు.

    "లేదోయ్ __వాళ్ళింట్లో అద్దేకుండడానికి వెడుతున్నాం...."

    "ఎలట్రాఫీసులో ఉద్యోగమాండీ?" మళ్ళీ అడిగాడు రిక్షావాడు.

    "ఏ ఉధ్యోగమూ లేదు. కాళీ ....."

    "మా ఊళ్ళో తమరేమైనా  భూములుగానీ, తొవులు గానీ ఖరీదు చేశారండీ _" అనడిగాడు రిక్షావాడు కుతూహలంగా.

    "అటువంటిదే౦లేదు ....." అన్నాడు  రాజారావు ముక్తసరిగా.

    రిక్షావాడితో కుతూహలం పెరిగింది. ఈ మనిషిని తానిదివరకేన్నడూ చూసిన గుర్తులేదు ఊరికి కొత్తవాడిలా గున్నాడు. ఊళ్ళో యెవరూ బంధువులున్నట్లు లేదు. ఉద్యోగందులే భూమిలేదు. మరీ ఊరేందుకోస్తున్నాడు?

    ఓ అయిదు నిముషాలాలోచించాకా రిక్షావాడికి స్పురించింది.

    పెద్ద పెద్ద వాళ్ళకి జబ్బు చేసినప్పుడు _ డాక్టర్ల సలహా మీద గాలి     మార్పుకోసం పల్లెటూళ్ళకు వెడుతుంటారు. ఇతడూ అదే బాపతయుంటాడనుకుని _ "తమరిక్కడేన్నళ్ళు౦టారేంటి బాబూ_ " అనడిగాడు.

    "వీలైతే శాశ్వతంగా ఉండిపోదా మానుకుంటున్నాను......"

    భర్త జవాబు విని వసంత అతడివంక విస్మయంగా చూసింది. ఆ చూపులో __ "మీరాబద్దమెందుకు చెప్పారు?" అన్న ప్రశ్న ఉంది.

    రిక్షావాడు మాత్రం వాళ్ళనింకేమీ ప్రశ్నించలేదు. రాజారావు విషయమేమిటో వాడికి సరిగ్గా అర్ధంకాలేదు . నెమ్మదిగా రిక్షా తొక్కసాగాడు.

    "చలమయ్య గారిల్లు చాలా సదుపాయంగా ఉంటుందని చాలామందన్నారు వసూ! అసలా యిల్లు కాళీగా ఉండడం మన అదృష్టమంట. అంతకుముందా యింట్లో హైస్కూలు హేడ్మామాష్టరు గారుండేవారట. ఇప్పుడైనా అయిమ్టికీ పోటీ లేక పోలేదు. కానీ నేను మరోఐదురూపాయలేక్కువిస్తాననడంతో మనకు దక్కింది . మనమిదివరకు టౌన్లో ఇచ్చే అరవైరూపాయలతో పోలిస్తే పాతికరూపాయలు లెక్కల్లో అద్దికాదు. పైగా యిల్లుకూడా పెద్దది __" అన్నాడు రాజారావు.

Next Page