Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 45

    రెండు నెలలక్రితం అతడు గోపన్న కలిసి రాజ్ దూత్ మీద పక్కవూరికి వెళుతుంటే వీళ్ళెక్కిన రాజ్ దూత్ ఓ ప్లీడరుగారి చిన్న కారు గుద్దిందట...అతనికి దెబ్బలు తగలలేదుటగాని గోపన్నకి దెబ్బలు తగిలాయట.డాక్టర్ కృష్ణాజీ రావు నర్సింగ్ హోమ్ లో గోపన్నని చేర్చారుట....అయిదు రోజులకి తెలివి వచ్చిందట. చేతి ఎముక తొలగడంవల్ల గోపంనకి కృష్ణాజీరావు పిండికట్టు వేశాడుట. క్రితంనేల ఇరవై ఎనిమిదో తారీఖు పిండికట్టు విప్పి మామూలు కట్టు కట్టాడుట. అతను చెప్పిన కథ యిది."
   
    అంటూ ఇన్ స్పెక్టర్ చెప్పాడు.
   
    "ఇంపాజిబుల్, గోపన్న ఇరవై ఎనిమిదో తారీఖు జైలులో వున్నాడు. ఆ విషయం మీరు చెప్పల్సింది" బన్సీలాల్ అన్నాడు.
   
    "వాళ్ళకి తెలుసు గోపన్న ఇరవై ఎనిమిదో తారీఖు జైలు గోడలమధ్య వున్నట్లు."
   
    "మరి?"
   
    "ఈ అబద్దాలు ఏమిటి! కల్పితకథ ఏమిటి? అంటారు అదేనా మీ అనుమానం లాల్ జీ!"
   
    "అదే__"
   
    "వాళ్ళు దొంగా సాక్ష్యాదారాలు బలంగా ఏర్పరచుకున్నారు. మానని బెదిరించాటానికి యిదిగో ఈ కథ వకటి సృష్టించి వినిపించారు. మా యింటి నౌకరు...దొంగతనం చేశాడని మీరంటారు. వీడు దొంగవెధవ నేను జైలులో పారిపోయాడు అని చెపుతాను. మనది యదార్ధమైన సాక్ష్యం వాళ్ళు బలంగా దొంగ సాక్ష్యాలు సృష్టించారు. ప్లీడరు గారి కారు గుద్దిందని ఆయన స్వయంగా దగ్గరవుండి ఆసుపత్రిలో చేర్చాడు. డాక్టర్ కృష్ణాజీరావు సాక్ష్యం. ప్రతి రోజూ తను ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు ఠాకూర్ సాక్ష్యం. ప్రతి రోజూ తను ట్రీట్ మెంట్ ఇచ్చినట్లు ఠాకూర్ సాక్ష్యం తన బండిమీద వెళుతుంటే యాక్సి డెంట్ అయిందని అని అతను తనయింటి నౌకరు అని...."
   
    "ఇదంతా దేబికి?"
   
    "మనం వాడి జోలికి వెళ్ళకుండా వుండటానికి."
   
    "మీరు చెప్పేది నా కర్ధం కావటం లేదు....మీరు పోలీసు ఇన్ స్పెక్టర్ ... వాడు దొంగ. లాక్కొచ్చి జైలులో పడేయక..."
   
    "మీరు చెప్పినంత యీజీ కాదు లాల్ జీ! అలాంటి పని నేనేదైనా చేస్తే గోలగోల చేసి పారేయటానికి అతను పెద్ద సీను క్రియేట్ చేయటానికి రెడీగా వున్నాడు. వాడిని జైల్లో పెట్టనీయడు. ఓ వేళ పెట్టినా ఇన్ స్పెక్టర్ కావాలని గోపన్నని లాక్కువెళ్ళాడు అని చెప్పి పై నుంచి ఫోన్ చేయించి వాడికి బైలు యిప్పించి మనిద్దరినీ కోర్టుకు లాగి నానాయాగీ చేస్తాడు. అంతవరకూ ఖాయం...తప్పుడు సాక్ష్యాలకి వున్నా విలువ నిజాయితీకి లేదు. కోర్టులో సంవత్సరాల తరబడి కేసు నడుస్తూ వుంటుంది. ఈ లోపల గోపన్న పెళ్ళి చేసుకొనిముచ్చటగా ముగ్గురు బిడ్డలకి తండ్రికూడా అవుతాడు. నేను సస్పెండ్ కావటమో మన్యం అడవులకి టాన్స్ ఫర్ కావటమో మరేదో జరగటమో అవుతుంది. అతని ధైర్యం చూస్తుంటే ఈ కేసు స్వరూప స్వభావాలు తేటతెల్లంగా అర్ధం అయ్యాయి."
   
    "అర్ధంకాంగానే మీరు లేచివచ్చారు. అంతేనా?" బన్సీలాల్ వ్యంగ్యంగా అడిగాడు.
   
    "అంతే" అతను ముక్తసరిగ జవాబు యిచ్చాడు.
   
    ఠాకూర్ మాటలకి భయపడిగాని లేక అతను పెద్ద మొత్తంలో లంచం యిచ్చేసరికి అయిసయిగాని ఇన్ స్పెక్టర్ గోపన్న కేసుని వదిలేసి వుంటాడు. పైకి కట్టుకథ సృష్టించి చెపుతున్నాడు. ఈయనగారు చెప్పేది ఎక్కడన్నా నమ్మేటట్లు వుందా? వీడు నా తిండి బొక్కుతూ ఠాకూర్ కి అనుకూలంగా పనిచేస్తున్నాడు. అందుకే మొదటనుంచీ నాకన్నీ అవమానాలు జరుగుతున్నాయి. రెండు వైపులా పనిచేస్తూ పబ్బం గడుపుకుంటున్న ఈ ఇన్ స్పెక్టర్ గాడి పనిపట్టాలి. నమ్మినట్లే నటించి వీడి గొంతుకి తడిగుడ్డ చుట్టి పరపర కోయాలి. అందాక తనకి మనశ్శాంతి లేదు.... ముందు వీడి అంతు చూడకపోతే తను లాల్ వంశంలో తప్పు పుట్టినంత వట్టు.
   
    చాలా డీప్ గా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చిన బన్సీలాల్. మామూలుగా అడిగినట్లు అడిగాడు. "అయితే ప్రస్తుతానికి మనం మౌనం వహించాల్సిందేగా?"
   
    "తప్పదు లాల్ జీ! పాండవులంతటి వాళ్ళకి అరణ్య వాసం తప్పలేదు. శ్రీరాముడు అంతటివాడికి కష్టాలు తప్పలేదు. ఆఫ్ ట్రాల్ మనమెంత మానవమాత్రులం" అతను వేదాంత ధోరణిలో అన్నాడు.
   
    "నిజమే" నన్నట్లు తల తాటించాడు బన్సీలాల్.
   
    అరగంట తర్వాత అతను వెళ్ళిపోయాడు.
   
    బన్సీలాల్ వల్ల పెద్దగా తనకి ఉపయోగం లేదు. అయినా లాల్ జీల కన్నా ఠాకూర్ లు ధనబలం, బుద్దిబలం కలవాళ్ళు ఏదైనా చేయగల సమర్ధులు...గోపన్న నిర్భయంగా వాళ్ళింట్లో ఉన్నాడు అంటే ఏదో పెద్ద అండ ధైర్యం చూసేకదా! జైలులోంచి తెలివిగా గోపన్నని తప్పించాడు. అంటే ఠాకూర్ పులిలాంటి మనిషి అనుకోవాలి... పులితో తను యుద్ధం చేయదల్చుకోలేదు....లేనిపోని తలనెప్పి తన కెందుకు?
   
    ఇలా అనుకొన్న ఇన్ స్పెక్టర్ ఠాకూర్ యింటి చాయలకి కూడా ప్రస్తుతం వెళ్ళలేదు__వెళ్ళకుండానే ఓ కథ అల్లి బన్సీలాల్ కి వినిపించాడు.... చల్లగా తప్పుకున్నాడు.
   
    ఈ కథని యింత లోతుగా వెళ్ళి ఆలోచించి చూడని బన్సీలాల్ తనకి తోచిన విధంగా మరో కథ అల్లుకుని.... అతని దగ్గర లంచంతిని ఇన్ స్పెక్టర్ అటుమనిషి అయ్యాడు వాడి రోగం కుదర్చాలి అనుకున్నాడు.

 Previous Page Next Page