Previous Page Next Page 
నీలికనుల నీడల్లో పేజి 43

    "ఆపండి లాల్ జీ!" ఆరిచినట్లే అన్నాడు అతను.
   
    "అపమంటే ఆపుతాను...కానియిది వున్నమాటే కదా!"
   
    "ఉన్నమాటో లేనిమాటో నా కనవసరం నేను ఓ బాధ్యతగల పోలీసు అధికారిగా ప్రశ్నలు అడుగుతాను. సూటిగా ఏది దాయకుండా సమాధానాలు యివ్వండి చాలు. ఆ తర్వాత చూడండి నా విశ్వరూపం" ఇన్ స్పెక్టర్ కన్నా రావు కుర్చీలో నిటారుగా కూర్చుని కందగడ్డలాగా ముఖం మారిపోగా సీరియస్ గా అన్నాడు.
   
    ఇన్ స్పెక్టర్ కి బాగా రోషం రావాలనే అన్నాడు బన్సీలాల్. తన యింట్లో నౌకరు గోపన్న.... తన శతృవు ఠాకూర్ నౌకరు కూతురిని పదిమంది సమక్షంలో గోపన్న పెళ్ళాడుతుంటే ఠాకూర్ దగ్గరవుండి ఈ పెళ్ళి జరిపిస్తుంటే అది తన కెంత అవమానం. పైగా ఆ పెళ్ళికి తనని రమ్మని ఆహ్వానమా! ఇది ఘోరమయిన అవమానం కాదా?"
   
    "యిన్ స్పెక్టర్ ని తను మేపటం తప్ప కించిత్ ఫలితం కానరావటం లేదు. చాటు శతృవు ఎవరో కాదు ఠాకూర్ అయివుంటాడు. అన్న ఒకమాట తప్పించి తనకి యింకేం సాయం చేయగలిగాడు? గోపన్నని పట్టి అప్పగిస్తే జైలులో పెట్టి నాలుగు వుతకాల్సింది పోయి వాడు పారిపోతే కళ్ళు తేలవేశాడు.... తనతో పైకి అనకపోయినా ఠాకూర్ అంటే అతనికి ఏ మూలో రవ్వంత భయమే. వెళ్ళి గోపన్నని అరెస్ట్ చేస్తాడన్నది కూడా అనుమానమే.
   
    అందుకే...
   
    ఇన్ స్పెక్టర్ ని రెచ్చగొట్టాలి.
   
    నీకింత ధైర్యం వుందా అని హేళన చేయాలి.
   
    వురి ఎక్కించాలి.
   
    అతని చేతులతోనే గోపన్న చేతులకి సంకెళ్ళు వేయించాలి ఠాకూర్ మీసాలు కిందకి వాలేలా చూడాలి... అప్పుడుగాని తను గెలిచినట్లు కాదు.
   
    ఇదీ బన్సీలాల్ ఆలోచన.
   
    ఇంబ్ స్పెక్టర్ బన్సీలాల్ ని అవమానం చేద్దామనుకున్నాడు.
   
    ఇప్పుడు__
   
    బన్సీలాల్ ఇన్ స్పెక్టర్ ని అవమానం చేద్దామనుకుంటున్నాడు.
   
    అంతే...
   
    "ప్రశ్నలు అడగండి సమాధానాలు నాకు తెలిసినవి దాచుకోకుండా యిస్తాను" బన్సీలాల్ ముఖంలో ఏ భావాలు కానరాకుండా జాగ్రత్తపడుతూ అన్నాడు.
   
    "గోపన్నకి పెళ్ళి అని మీ కెవరు చెప్పారు?"
   
    "గోపంనకి కాబోయే మామగారు సూరప్పగాడు మా యింటికి స్వయంగా వచ్చి శుఖలేఖ యిచ్చాడు."
   
    "అప్పుడు మీరు వాడిని ఏమేమి అడిగారు?"
   
    సూరప్పని ఏమేమి అడిగింది బన్సీలాల్ వివరించాడు.
   
    "గోపన్న ఎక్కడ వున్నాడుట?"
   
    "గోపన్నని ఠాకూర్ తన దగ్గర వుంచుకున్నాడుట."
   
    ఇలా ప్రశ్నలు ఇన్ స్పెక్టర్ అడుగుతుంటే బన్సీలాల్ తనకి తెలిసింది దాచుకోకుండా చెప్పాడు. వారిరువురి మధ్య సంభాషణ పావుగంట సేపుసాగింది.
   
    "లాల్ జీ! నేను వెళ్ళి గోపన్నని అరెస్ట్ చేస్తాను. అవసారం అయితే మీరు సాస్ఖ్యం యివ్వవలసి వుంటుంది." అతను కుర్చీలోంచి లేస్తూ అన్నాడు.
   
    బన్సీలాల్ తెల్లబోయాడు.... "నేను సాక్ష్యమా దేనికి?" అన్నాడు.
   
    "గోపన్న జైలునుంచి తప్పించుకొని పోయిందేగాక ఈ వూళ్ళోనే వుండి ధైర్యంగా పెళ్ళికొడుకు అవతారం ఎత్తటం వుంది చూశారూ అది నా కవమానంగా భావిస్తున్నాను. అందుకే అరెస్ట్ చేయటానికి యమర్జంటుగా పోతున్నాను....మీ యింట్లో దొంగతనం చేస్తుంటే మీరు గోపన్నని పట్టుకోబోవటం అతను మీ మీదకి కత్తి విసిరి పారిపోతుంటే మీరు ధైర్యంగా వాడిని పట్టేసి నాకు అప్పగించటం నేను వాడిని జైలులో వుంచితే వాడు పెద్దస్మగ్లర్ల సహాయంతో పారిపోవటం నేను ఈ విషయం రహస్యంగా ఉంచి పరిశోధన చేస్తుంటే గోపన్న ఆచూకీ చిక్కింది....దాంతో వాడిని అరెస్ట్ చేయడం జరిగింది... ఇది నేను చెప్పేకథ...గోపన్నని జైల్ కి పంపించాను.... దొంగతనం చేసిందేగాక నా మీద హత్యాప్రయత్నం కూడా చేశాడు. అని అవసర పడితే మీ సాక్ష్యం కేసు బలంగా ఉండటానికి యిదంతా" విడమర్చి చెప్పాడు అతను.
   
    "అది యదార్ధమే కదా అవసరమయితే తప్పకుండా సాక్ష్యం యిస్తాను" బన్సీలాల్ అన్నాడు.
   
    "మంచిది..." ముక్తసరిగా అని ఇన్ స్పెక్టర్ వెళ్ళి పోయాడు.
   
                                           
26
   
    ట్రింగ్...ట్రింగ్...
   
    ఫోన్ మోగిన శబ్దం కావటంతో బన్సీలాల్ మంచం మీదనుంచి లేచి రెండంగల్లో ఫోన్ దగ్గరకు వెళ్ళి రిసీవర్ అందుకున్నాడు.
   
    ఫోన్ చేసింది ఇన్ స్పెక్టర్ కన్నారావు.
   
    "బన్సీలాల్ ముఖం చింకిచాటంత అయింది. గోపన్న మెడకు తాడు వేశారా?" వుషారుగా అడిగాడు.

 Previous Page Next Page