Previous Page Next Page 
గోడచాటు ముద్దు పేజి 36

   

    "నువ్వు మనిషివా, రాక్షసుడివా, వేదమంత్రాల మధ్య మంగళ సూత్రం కట్టి భార్యను చేసుకున్న నన్నుపరాయి మగాడిచేత రేప్ చేయిస్తున్నావా నిన్ను...." ఉగ్రంగా కాళిలా లేచి తనమీద కొస్తున్న నీగ్రో యువకుడి గుండెలమీద బలంగా తన్నింది మయూష ఆ నీగ్రో యువకుడు వెల్లకిలా పడిపోయి ఒక్క ఉదుటున పైకి లేచి మయూష మీదకు వెళ్ళబోయి ఆగిపోయాడో క్షణం.
   
    జ్వాలాముఖిరావు చిద్విలాసంగా ఆ దృశ్యాన్ని చూస్తున్నాడు.
   
    "కమాన్ బేబీ.....ఇన్ అవర్ కల్చర్....ఎవ్వెరిథింగ్ ఓపెన్ కమాన్ డోంట్ బీ షై" ముందుకొస్తున్న ఆ నీగ్రో యువకుడి బారినుండి తనని తాను రక్షించుకోవడానికి ప్రయత్నిస్తూ జ్వాలాముఖీరావు స్టాండ్ మీద పెట్టిన షర్ట్ వేపు జేబులోంచి కనబడుతున్న పిస్టల్ వేపు చూసి ఆ పిస్టల్ ని అందుకుంది మెరుపువేగంతో.
   
    మయూష చేతిలో పిస్టల్ ని చూడగానే ఆ నీగ్రోయువకుడు ఒక్కక్షణం భయపడి బయటకు పరుగెత్తాడు.
   
    పెద్దగా నవ్వుతూ చప్పట్లు చరిచాడు జ్వాలాముఖిరావు.
   
    "నీ పరువు కాపాడుకొన్నందుకు చాలా హేపీగా వుంది. అయినా నువ్వీ క్షణంలో ఎలా వున్నావో తెలుసా? ఆ చెదిరిపోయిన జాకెట్టు.....పొంగుకొస్తున్న యవ్వన సంపద......నేనే ఆర్టిస్టునయితే ఈ యాంగిల్ ని అద్భుతంగా పెయింటింగ్ చేసేవాడిని. ఆ నీగ్రో యువకుడితో నిన్ను రేప్ చేయించాననుకో నీకు గొప్ప సెక్స్ అనుభవం దక్కుతుంది అది నా కిష్టంలేదు. అసలు నీకు జీవితాంతం సెక్స్ అంటే తెలియకుండా చేయాలి. అదే గదా నా ఛాలెంజ్ అయితే ఇదంతా ఎందుకు చేసానంటే నిన్నేడిపించటం కోసం అంతే" అన్నాడు జ్వాలాముఖిరావు.
   
    "మిస్టర్ జ్వాలాముఖిరావు అయిపోయింది నా సహనానికి తుది పరీక్ష అయిపోయింది. సహనానికి ఆఖరి మెట్టే తిరుగుబాటుకి తొలిమెట్టు. నిన్ను చంపేస్తాను. నువ్వు బతికుంటే నన్ను ఇంకా ఎన్ని రకాలుగా శాడిస్టుగా, అవమానపరుస్తావో నాకు తెల్సిపోయింది. నీలాంటి విచక్షణ లేని కామ మృగాల్ని చంపడం ఒక్కటే పరిష్కార మార్గం. నా మీద కసి తీర్చుకోవడానికి పెళ్ళి చేసుకున్నావ్. కానీ నేనే నీ మృత్యువుని అవుతానని నువ్వూహించలేకపోయావ్ కదూ? కమాన్ గెటప్. ఒక్కసారి నువ్వు కూడబెట్టిన కోట్లాది ఆస్తిని తలుచుకో నీ చేతిలో నిర్దాక్షిణ్యంగా బలయిపోయిన భార్గవి లాంటి అమ్మాయిల్ని తలుచుకో....." పిస్టల్ ని అతని గుండెలవైపు గురి చూపిస్తూ మహోగ్రంగా అంది మయూష.
   
    "మంచికో చెడ్డకో నేను నీ భర్తను, గ్రేట్ ఇండస్ట్రయిలిస్టును. నన్ను చంపితే నీకొక్క పైసా తిరిగిరాదు. గుర్తుంచుకో" ఏమాత్రం మృత్యుభయం లేకుండా సాదాగా అన్నాడు జ్వాలాముఖిరావు.
   
    "నీ డబ్బు ఎవడికి కావాలి? ఆ డబ్బుతో ఆ కరెన్సీ కాగితాల్తో నిన్ను నేనే స్వయంగా కాల్చేస్తాను. కరెన్సీ  కాగితాల్తో పాటు నువ్వూ బూడిదగా మారిపోతుంటే అప్పుడుగానీ నా మానసిక క్షోభ చల్లారదు కమాన్" ఒక్కొక్క అడుగూ ముందుకు వేస్తోంది మయూష.
   
    జ్వాలాముఖిరావు చెక్కు చెదరకుండా అలాగే నిలబడ్డాడు. జీవితంలో ఎప్పుడు అలాంటి సన్నివేశం ఎదురవుతుందని తను పిస్టల్ తో ఒక మనిషిని చంపడానికి సన్నద్దురాలవుతుందని ఊహించని మయూష ఒకవేపు భయంతో నలిగిపోతోంది. మరొక పక్క కక్షతో రగిలిపోతోంది.
   
    లాభంలేదు తను హంతకురాలిగా జైలుకెళ్ళినా ఫర్వాలేదు. ఈ కబంధ హస్తాల నుంచి బయటపడాలి. వీడ్ని బతకనివ్వకూడదు. దృఢంగా నిశ్చయించుకున్నదై చూపుడువేలితో పిస్టల్ ట్రిగ్గర్ నొక్కింది.
   
    అంతే!
   
    క్లిక్కుమని బుల్లెట్లు లేని శబ్దం విని పైకప్పు అదిరిపోయేటంతగా నవ్వాడు జ్వాలాముఖిరావు.
   
    ట్రిగ్గర్ మరొకసారి ఇంకొకసారి ప్రెస్ చేసి కంగారుగా మేగ్ జైన్ ని విప్పి చూసింది.
   
    ఆమె ముఖం ఒక్కసారి రక్తవిహీనం అయిపోయింది.
   
    "నన్నెవరూ చంపలేరు అవసరమైతే నేనే ఎవరికీ చెప్పకుండా చచ్చిపోతాను తప్ప. నీకు తెలీదు మృత్యువుకు కూడా నేనంటేభయం." బాటిల్లోని ఫెన్నీని వంటిమీద జల్లుకుంటూ డాన్స్ చేస్తూ అన్నాడు జ్వాలాముఖీరావు.
   
    చెమటతో తడిసి ముద్దయిపోయిన మయూష సన్నగా ఏడుస్తూ కూలబడిపోయింది నిస్సత్తువుతో, నిస్సహాయతతో.
   
    సరిగ్గా 72 గంటల తర్వాత-
   
    డైనింగ్ హాల్లో మయూష ప్రశ్నలకు ముక్తసరిగా జవాబులు చెపుతూన్న రాధమ్మ పోర్టికోలో ఆగిన కారు చప్పుడువిని భయంగా కిందకు వెళ్ళిపోయింది.
   
    అయిదు నిమిషాల తర్వాత మేడమీదకొచ్చాడు జ్వాలాముఖిరావు.
   
    "ఏంటీ పని మనిషి, తోటమాలి, కుక్ రంగస్వామి అందర్నీ మచ్చిక చేసుకోడానికి ప్రయత్నిస్తున్నావట. నిజమేనా?" భీకరంగా లేదు ఆ గొంతు చాలా సౌమ్యంగా వుంది. అయినా సమాధాన మివ్వలేదు మయూష.
   
    "నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నా నుంచి ఇక్కడ నుండి తప్పించుకోలేవు. నువ్వు మచ్చిక చేసుకొన్న కుక్క ఏవైందో తెలుసు కదా? వీళ్ళు నిర్ధాక్షిణ్యంగా శవాలుగా మారిపోతారు వీళ్ళను ఈ గార్డెన్లోనే పూడ్చేస్తాను. వాళ్ళు చచ్చిపోవడం నీ కిష్టమేనా వాళ్ళ శవాల్ని చూస్తావా నువ్వు"
   
    ఏ మాత్రం క్రూరత్వంలేని సింపుల్ కాన్వర్ సేషన్. భయంతో మయూష రక్తనాళాలు గడ్డకట్టుకుపోయాయి అతని మాటలకు.
   
    "ఈ క్షణం నుంచి నేనెవరితోనూ మాట్లాడను. వాళ్ళను శవాలుగా మార్చొద్దు" భీతావహంగా అందామె.
   
    "గుడ్! మరిచేపోయాను. నీకో ఇంపార్టెంట్ న్యూస్. ఏవిటో చెప్పనా నువ్వు ఓ మూడు గంటల సేపు ఫోనులో మాట్లాడొచ్చు. ఎవరితో నయినా.
   
    "ఎందుకు?" వెంటనే అడిగింది మయూష.
   
    "ఈ మూడు గంటల తర్వాత నువ్వు నేను ఒక యంగ్ అమ్మాయితో సెక్సువల్ గా ఎంత పటిష్టంగా వున్నానో ఆమెతో ఎలా రకరకాలుగా ఆడుకున్నానో తెల్సుకుంటావ్ కాబట్టి."
   
    "అంటే.....?" తన స్వరంలో మార్పు తనకే తెలుస్తూనే వుంది మయూషకు.
   
    "నేను నా మనసులో కొచ్చిన ఏ విషయాన్నీ ఎప్పుడూ మరచిపోను. ఆ గాయత్రి నీ ఫ్రెండ్ నా యవ్వనం గురించి నీకు చెప్పాలన్నది నా బెట్ కదా" విలాసంగా అన్నాడతను.
   
    "నో" కీచుమంటూ అరిచింది మయూష.
   
    "అయిపోయింది. సిటీలో నా అతివిలాసవంతమైన గెస్ట్ హౌసుల్లో ఒకదాంట్లో ఈ రాత్రి నా కోరికకు నీ ఫ్రెండ్ బలైపోతుంది. ఆ విషయం రేపుదయాన్నే నీకు తెలుస్తుంది. ఈ లోపల నువ్వు నా బారినుంచి నీ ఫ్రెండ్ ను రక్షించుకోగలిగితే రక్షించుకో. నీ అదృష్టాన్ని పరీక్షించుకో....సీ....యూ....." అంటూ వెనుదిరిగి మళ్ళీ వెనక్కొచ్చి-
   
    "నేను రేపు మార్నింగ్ ఫ్లయిట్ కి బ్యాంకాక్ వెళుతున్నాను పది రోజులు హాయిగా నువ్వు గడపొచ్చు. కానీ ఒక్క నిబంధన. ఈ బందిఖానాలోనే అందుకే నిన్ను అనుక్షణం వెర్రెక్కించి పిచ్చెక్కించే ఓ హేండ్ సమ్ కుర్రాణ్ణి బాడీగార్డుగా నియమించాను. రేపుదయం అతను నీ దగ్గర డ్యూటీలో చేరతాడు. ప్రతిక్షణం నీ కదలికల గురించి నాకు తెలియజేస్తాడు. అతడెవడో తెలుసా? నువ్వే చూస్తావుగా" అని నవ్వి కన్నీటి శిలలా మ్రాన్పడిపోయి నిల్చున్న మయూష బుగ్గమీద చిటికేసి గబగబా ముందుకెళ్ళిపోయాడు జ్వాలాముఖిరావు.              

 Previous Page Next Page