మునిపంటను బాధను అణగద్రొక్కుకుంటూ శూన్యంలోకి చూస్తోందామె ఎందుకో.
ఆ సమయంలో ఆమెకు ఒక్కక్షణం మొట్టమొదటిసారి పక్కింటి బాత్ రూమ్ వేపు తను చూడగా-
గాయత్రి శివాజీల గోడచాటు ముద్దు గుర్తుకొచ్చింది. యూనివర్సిటీ వంతెన దగ్గర రిక్షా కార్మికుడు అతని భార్యా గుర్తుకొచ్చారు. షంషాబాద్ వెళుతున్నప్పుడు పల్లెటూరి యువతీ యువకులు జ్ఞాపకానికొచ్చారు.
కలలెప్పుడూ నిజం కావు అన్నమాట మరోసారి రుజువైనట్టుగా అన్పించిందామెకు.
"సీ......యూ......మళ్ళీ కలుద్దాం" అని గబగబా ఆ రూమ్ లోంచి బయటికెళ్ళి పక్క రూమ్ లోకి దూరిపోయాడు జ్వాలాముఖిరావు.
వెన్వెంటనే మయూష బిగాగ్రగా ఏడ్చేసింది.
చీకటిలో ఆ ఏడుపు హృదయవిదారకంగా వుంది. ఆ రాత్రంతా ఆమె అలా ఏడుస్తూనే వుండిపోయింది.
* * * *
ఎప్పుడూ ఉత్సాహంగా పుట్టింట్లో ఉదయాన్నే అయిదు గంటలకు లేచే మయూష మర్నాడు ఉదయం ఎనిమిది గంటలకు గానీ లేవలేకపోయింది.
ఏదో తెలియని బాధ నిస్సత్తువ. కళ్ళిప్పి నలువేపులా చూసింది చప్పుడు చెయ్యకుండా ప్రవహిస్తున్న ఎయిర్ కండిషనర్ గాలి.
రూమ్ లోని గోడలవేపు చూసిన మయూష ఒక్కసారిగా విస్తుపోయింది. గదిలో మూడు గోడల మీద అసభ్య భంగిమల్లో పెయింటింగ్స్ వాత్స్యాయనుడి కామసూత్రాల చిత్రణ.
బెడ్ రూమ్ లో ఎడమవేపున ఒక మూల నిలువెత్తున్న కామంతో వేగిపోతున్న నిలువెత్తు యువతి నగ్న ప్రతిమ.
ఆ బొమ్మను ఒక్కసారిగా చూడగానే మయూషకు పట్టలేని కోపం వచ్చింది.
తన గదిలో తన భర్త ఆ ఏర్పాట్లు ఎందుకు చేయించాడో అవన్నీ ఎందుకు అమర్చాడో అర్ధం చేసుకున్న మయూష కోపంతో గబుక్కున మంచం మీంచి లేచి ఆ నగ్న ప్రతిమను చేతిలోకి అందుకుని నేలకేసి విరిసికొట్టింది.
ఆ ప్రతిమ ముక్కలు ముక్కలైపోయింది.
కసిగా, కోపంగా, అసహ్యంగా ఆ ముక్కలవేపు చూసి విసురుగా గోడవేపు అడుగువేసి గోడకు వేలాడుతున్న ఒక పెయింటింగ్ ని బలంగా లాగి మెయిన్ డోర్ వేపు విసిరికొట్టింది.
రెండో పెయింటింగ్ వేపు నడుస్తుండగా-
చిత్రమైన నవ్వు విన్పిస్తే తల తిప్పి చూసింది మయూష.
గ్రే కలర్ సూట్ లో ఎర్రటి పెదవులతో జ్వాలాముఖిరావ్.
"నాకు తెలుసు కొత్తగా పెళ్ళయిన అమ్మాయికి అలాంటి ప్రతిమలు ఎదురుగా వుంటే ఏమవుతుందో నిన్ను టెంప్ట్ చేయడానికే వాటిని అక్కడ పెట్టించాను" ధిలాసాగా అన్నాడతను.
"నీ కాముకత్వానికి అవి నిదర్శనాలు అందుకే పగలగొట్టాను. ఇవాళ ఈ పెయింటింగ్స్ పగలకొట్టాను. రేపు ఈ బిల్డింగ్ ను, ఎల్లుండి నిన్నూ.......ఇలాగే పగలకొడతాను" కసిగా అంది మయూష.
"కాలేజీలోని రాడికల్ భావాలు, కొన్నాళ్ళపాటు నీలో వుంటాయి నన్ను నువ్వు పగలగొట్టడానికి నేనేం పెయింటింగ్ నీ కాను. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన ప్రతిమనూ కాను. ఉక్కు మనిషిని. నీలాంటి వంద మందితో ఒకే టైమ్ లో సెక్సువల్ గా ఎంజాయ్ చెయ్యగలిగే సత్తా గలిగిన ఉక్కు మనిషిని" డ్రెస్సింగ్ టేబుల్ మీదున్న డీసెంట్ సెంట్ ను తీసుకుని డ్రెస్సు మీద స్ప్రే చేసుకుంటూ అన్నాడు జ్వాలా ముఖిరావు.
"ఛీ.....సిగ్గులేదూ అలా చెప్పుకోడానికి నువ్వు కాముకుడివే అనుకున్నాను. సమూహ లైంగికత్వాన్ని కోరుకునే పశువ్వని ఇప్పుడే తెల్సుకున్నాను పర్ఫెక్ట్ డ్ సెక్స్ మానియక్ వి."
"గుడ్ వెరీ గుడ్ అయామ్ వెరీ హేపీ దట్ యూ ఆర్ నోయింగ్ వన్ బై వన్ పాయింట్. బట్ నేను నీ భర్తను. నీకన్నా పెద్దవాడిని. మీరు అని గౌరవించడం సంప్రదాయం అనుకుంటాను."
"నిను మీరని పిలవడమా? నలుగురి ఎదుట మాత్రమే నువ్వు నా భర్తవని నువ్వే అన్నావ్ కదా ఇక్కడ నిన్ను నిన్నుగానే పిలిస్తేనే నాకు ఆనందం" ఆవేశంగా అంది మయూష.
"ఒకే....కానీయ్ నువ్వు కోరుకునేది చిన్న ఆనందం లిటిల్ బిట్ ప్లెబర్ భార్యగా ఆ మాత్రమైనా ఆనందాన్ని ఇవ్వాల్సిన బాధ్యత నాకుంది కదా. అయితే ఒకటి మాత్రం జ్ఞాపకం ఉంచుకో.
నువ్వీ బందీవి నువ్వెక్కడికీ వెళ్ళలేవు. ఇక్కడ నీతో ఎవరూ మాట్లాడరు. నువ్వు బయట ప్రపంచంలో ఎవ్వరితోనైనా మాట్లాడడానికి వీలు పడదు. ఎందుకంటే నీ రూమ్ లో ఫోన్ మాత్రమే శాశ్వతంగా డెడ్ అయి వుంటుంది ఇంక నీ కోసం నీ బంధువులెవరూ రారు. ఇంకో ముఖ్యమైన విషయం నాతో తప్ప నువ్వు బయటకు వెళ్ళడానికెప్పుడూ అవకాశం వుండదు. నిన్ను మరీ అవమాన పరచాలనుకున్నప్పుడు మాత్రమే నేను నిన్ను బయటకు తీసికెళతాను."
"నీతో నేను బయటకు రావడమా నెవ్వర్" టీపాయ్ మీదున్న బొమ్మను అతనివేపు గిరాటు వేస్తూ అంది మయూష కోపంగా.
ఆ సమయంలో కొన్ని క్షణాలు ఆమె వేపు సూటిగా చూసాడు జ్వాలాముఖిరావు.
"ఏంటీ నా వేపు అలా చూస్తున్నావ్. కోరిక కలిగిందా?" వేళాకోళంగా అడిగింది మయూష.
"నాతో అనవసరంగా గొడవపడి నా చేతిలో ఇరుక్కుపోయావ్. లేకపోతే భర్త పేరుతో వచ్చే కోరికలతో కాగిపోయే ఏ కుర్రాడికో నీ అందాన్ని విచ్చలవిడిగా సమర్పించుకునే దానివి కదూ?" అంటూ జ్వాలాముఖిరావు పక్కకు తిరిగాడు.
"అవును నీలాంటివాడు ఊహలతోనే కదా బతికేది ఊహల్లోనే జారిపోయే మగతనం....." అసహ్యంగా అంది ఆ మాటల్ని కావాలనే.
ఆ రూమ్ లోంచి బయటకు వెళ్ళబోతున్న వాడల్లా ఆ మాటకు తల తిప్పి ఆమె ముఖంలోకి సూటిగా చూసి దగ్గరగా వెళ్ళి ఆమె చుబుకాన్ని పట్టుకుని "నువ్వు చాలా అందంగా ఉంటావ్. అయ్ నో దట్. నీ జుత్తు దగ్గర్నుంచి నీ కాలి గోరు వరకూ కసికసిగా యవ్వనంతో కాలిపోతున్న దశలో ప్రస్తుతమున్నావని నాకు తెలుసు, ఊహల్లోనే జారిపోయే మగతనమని, నన్ను ఈసడించడం కాదు. ఎలాగోలా నన్ను రెట్టించి నాతో సంసారం చేయాలనుకుంటున్నావ్. తెలివైన దానివే."
"నీతో సంసారం చేసి నేనేం సుఖపడతాను" అలా తనని గడ్డిపోచలా తీసేస్తుందని జ్వాలాముఖిరావు ఊహించలేదు.
అంతెత్తున సర్రుమని లేచిన కోపాన్ని అరనిమిషంలోనే అణచేసుకుని చూపుడు వేలితో ఆమె పెదిమల మీద రాసి.....
పక్క రూమ్ లోకెళ్ళి కార్డ్ లెస్ టెలిఫోన్ తీసుకొచ్చి ఒక బటన్ ని ప్రెస్ చేసాడు.
"మిస్టర్ గిరీ, ఇవాళా రేపు ఎంగేజ్ మెంట్స్ ఏవైనా ఉన్నాయా" అని అడిగాడు.
"ఎస్ సర్. సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ని రేపుదయం మీరు ఢిల్లీలో కలుస్తున్నారు సార్" పి.ఎ చెప్పాడు వినయంగా.
"ఓ.కే. ఆ విషయం మరిచే పోయాను తర్వాత......"
"నొయడాలో జరిగే బిజినెస్ గేదరింగ్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు."
"నేను పార్టిసిపేట్ చెయ్యకపోయినా పెద్ద నష్టమేం లేదుగా."
ఆ మాటకు పి.ఎ ఏం జవాబివ్వలేదు.
"కేన్సిల్ ద నొయిడా మీటింగ్. రేపు సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ ని కలుసుకున్న సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వచ్చే ఫ్లయిట్ కి టిక్కెట్ తీసుకో."
"ఓ కే సార్."