"అఫీషియల్ గా టెన్ పర్సెంట్ కమీషన్, అనఫీషియల్ గా ఫిఫ్టీపర్సెంట్ నొక్కేస్తూ వచ్చిన నా సెక్రటరీకి నా బూడిదలో కూడా ఆ పద్ధతిలోనే వాటాలు చేసి వాడి మొఖం మీద కొట్టండి-"
క్లయింట్ హడావుడిగా తన లాయర్ దగ్గరకొచ్చాడు.
"సార్- ఇకనుంచీ మనకేస్ గురించి ఏమాత్రం వర్రీ అవకండి సార్! ఇక జయం మనదే- గ్యారంటీ!"
"అంత గ్యారంటీగా ఎలా చెప్తున్నావయ్యా?"
"నిన్న దీపావళి పండుగ కదా! మన కేస్ విచారిస్తున్న జడ్జిగారికి ఓ సూట్ కేస్ లో లక్షరూపాయలు కాష్ పంపించాను-"
లాయర్ అదిరిపడ్డాడు.
"ఓర్నీయవ్వ! ఎంతపని చేశావయ్యా! ఆ జడ్జిగారసలే మహాస్ట్రిక్ట్! మనకేస్ పోవటమే కాకుండా మనిద్దరం జైలు కెళ్తామయ్యా!"
"మనమెందుకెళ్తాం సార్! ఆ సూట్ కేస్ లో కాగితం మీద మన కేస్ వివరాలన్నీ రాసి - మన అపోజిషన్ లాయర్ పేర్రాశా!"
ఫాక్టరీ యాక్సిడెంట్ లో గాయపడ్డ వ్యక్తిని చూడ్డానికొచ్చారు యూనియన్ లీడర్లు.
ఇంట్లో హాయిగా తిరుగుతూ మందుకొడుతూన్నా కార్మికుడిని చూసి ఆశ్చర్యపోయారు.
"గాయం పూర్తిగా తగ్గిపోయినట్లుంది కదా! మరి ఫాక్టరీకి రావటం లేదేం?" అడిగారు వాళ్ళు.
"ఎలా వస్తాను? హాపీగా ఫాక్టరీ కెళ్ళి పని చేసుకోవచ్చని డాక్టర్ అంటున్నాడు గానీ మా లాయర్ వప్పుకోవటం లేదు. నా గాయం మానడానికి కనీసం ఇంకో ఆరు నెలలు పట్టవచ్చంటున్నాడు-"
"అంతరాత్మ అంటే ఏంటి గురూ?"
"అంతరాత్మ అనేది నువ్ పాపం చేయకుండా అడ్డుపడలేదు గానీ ఆ పాపాల్ని ఎంజాయ్ చేయకుండా నాశనం చేసేస్తుంది."
జాబ్ చేస్తున్న కూతురు మల్లికా గిరావత్ రాత్రంతా ఇంటికి రాకపోయేసరికి తల్లి పాపం చాలా వర్రీ అయిపోయింది. రాత్రంతా కంటిమీద కునుకే లేదు. కూతురి సెల్ కూడా ఆఫ్ లో ఉండడంతో ఇంకా భయపడింది.
ఎర్లీ మాన్నింగ్ తన కూతురు నుంచి ఆమెకు ఫోన్ వచ్చింది.
"ఏమైపోయావే రాత్రంతా! చూడు మల్లికా- నువ్ ఆడపిల్లవు- పైగా గ్లామరస్ గా ఉంటావ్- బయట చూద్దామా అంటే కిడ్నాప్ లు, రేస్ లు, హత్యలు రెగ్యులర్ గా జరుగుతున్నాయ్. నువ్వేమయిపోయావోనని నాకు రాత్రంతా కంటిమీద కునుకేలేదంటే నమ్ము"
"అబ్బా! నా గురించి వర్రీ అవ్వద్దని చెప్పాను కదమ్మా.నాకేమీ కాలేదు నేను చాలా సేఫ్ గా ఉన్నాను- సరేనా?"
"పోనీ సెల్ కాల్ అయినా చేయవచ్చు కదా!"
"సెల్ లో ఫోన్లు ఎలౌ చేయరమ్మా!"
"సెల్లా! సెల్లేమిటే?"
"నేనుంది జైల్లో అమ్మా! ఇంతకంటే సేఫ్ ప్లేస్ ఇంకెక్కడుంటుంది చెప్పు! డోంట్ వర్రీ- బెయిల్ దొరగ్గానే ఇంటి కొచ్చేస్తా-"
జీవిత ఖైదు అనుభవిస్తోన్న ఓ ఖైదీ సంవత్సరం పాటు ఒక మాంఛి క్రైమ్ స్టోరీ రాసి ఒక పత్రికకు పంపించాడు.
ఆ స్టోరీ చదివిన ఎడిటర్ థ్రిల్లయిపోయాడు.
"అద్భుతంగా క్రైమంతా కళ్ళకు కట్టినట్లు రాశారు. కానీ రచనతో పాటు హామీపత్రం పంపటం మర్చిపోయారు. వెంటనే పంపండి!" అంటూ లెటర్ రాశాడు.
ఖైదీ వెంటనే హామీపత్రం పంపించాడు.
"ఈ కథలో నేను రాసిందంతా పచ్చినిజం! ఎక్కడా కాపీ కొట్టలా! అయితే ఇందులో నేరస్థుల్ని పోలీసులు గుర్తించకుండా ఉండటం కోసం వేరే పేర్లు పెట్టా ఓకేనా?"
ఒక క్రిస్టియన్ లేడీ అమెరికాలో ఉద్యోగం చేస్తోన్న కొడుక్కి పోస్ట్ లో బైబుల్ పంపించాలనుకుని, దాన్ని నీట్ గా అందంగా పాక్ చేసుకుని పోస్టాఫీస్ కొచ్చింది.
పోస్ట్ మాస్టర్ ఆ పాకెట్ అనుమానంగా చూశాడు.
"ఇందులో పగిలిపోయేవి ఏమయినా ఉన్నాయా?"
"ఉన్నయ్" వప్పుకుందామె.
"ఏంటవి?"
"టెన్ కమాండ్ మెంట్స్-"
ఎలక్షన్లో కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేసినా తర్వాత మంత్రి పదవి కోసం లాలూ సోనియా దగ్గరకెళ్ళి ఇంకెప్పుడూ కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పనిచేయనని చెంపలేసుకుని ఏదొక మంత్రి పదవి ఇమ్మని బ్రతిమాలాడు. సోనియా జాలిపడి అతనిని హెల్త్ మినిష్టర్ చేసింది.
వెంటనే ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు లాలూ!
"అదివరకు బెర్త్ కంట్రోల్ చేసేవాడ్ని! ఇప్పుడు బర్త్ కంట్రోల్ టేకప్ చేస్తున్నా-"
ఫ్రెండ్స్ కొంతమంది అడవిలో కాంప్ వేసుకున్నారు.
ఒకడు సాయంత్రం అలా ఒంటరిగా షికారుకెళ్ళి అరగంటలో పరుగుతో వచ్చాడు-
"ఏం జరిగింది?" అడిగారు వాళ్ళు.
"నేను ఆ చెట్ల గుబుర్లలో నుంచి వెళ్తూంటే ఒక చోట పాము కనబడింది. దానితోక పట్టుకుందామని ట్రై చేశాను. తీరా చూస్తే అది కర్రలాగా అనిపించింది. దాన్నక్కడ పడేసి ఇంకో నాలుగడుగులు వేసేసరికి కర్ర కనిపించింది. ఆ కర్రతో పాముని కొడదామని చేతిలోకి తీసుకుని చూస్తే అది కర్ర కాదు- పాము"
డాక్టర్ పేషెంట్ ని ఎగ్జామిన్ చేశాడు.
"ఒకవేళ ఆపరేషన్ అవసరమనుకుంటే-చేయించుకోడానికి అంత డబ్బుందా-నీ దగ్గర మరి?" అడిగాడు డాక్టరు.
"చూడండి! ఒకవేళ నా దగ్గర అస్సలు డబ్బులేదని తెలుస్తే అప్పుడు కూడా మీరు ఆపరేషన్ అవసరమంటారా?" అడిగాడు పేషెంట్.
ఒక డాక్టర్ దగ్గరకు పేషెంట్ వచ్చి తన జబ్బులక్షణాలు అరగంట సేపు చెప్పాడు. ఎంత విన్నా అదేం జబ్బో డాక్టర్ కేమాత్రం అర్ధం కాలేదు. రెండ్రోజులపాటు మొత్తం మెడికల్ బుక్సన్నీ చదివినా, ఇంటర్నెట్ లో చూసినా అదేం జబ్బో ఏమాత్రం తెలీలేదు-
మర్నాడు పేషెంట్ వచ్చాడు మళ్ళీ.
'ఆ! చూడవోయ్ ఇంతకుముందు ఈ జబ్బు ఎప్పుడయినా వచ్చింది?" అడిగాడు డాక్టర్.
"ఆ! వచ్చిందిసార్-"
"మరా మాట చెప్పవేం? ఇప్పుడూ అదే వచ్చింది. నువ్వేం వర్రీ అవ్వక్కర్లేదు-"
"మరి దీనికి మందులు-"
"అదే- అదివరకు ఏమందు వేసుకున్నావో అదే వేసుకో! తగ్గకపోతే అప్పుడు చూద్దాం- ఫీజు రెండొందలు కట్టు-"
"ఇద్దరు హాస్టల్ స్టూడెంట్స్ కలుసుకున్నారు.
"ఏంట్రా! అలా డల్ గా ఉన్నావ్?" ఒకడు రెండోవాడి నడిగాడు.
"నాకు డబ్బు అవసరమయి, నేను తాజ్ మహల్ చూడ్డానికి ఆగ్రా వెళ్తున్నాననీ- అందుకని రైలు ఛార్జీల కోసం ఐదువేలు పంపమనీ మా ఇంటికి ఫోన్ చేసి అబద్దం చెప్పాను. కానీ మా వాళ్ళేం చేశారో చూశావా? ఇంటర్నెట్ లో రానూబోనూ రైలు టికెట్లు బ్లాక్ చేశామనీ, ప్రింటవుట్ తీసుకోమనీ చెప్పారు-"