Previous Page Next Page 
కూచిపూడి కళాసాగరము పేజి 21

                                 

 

                                     ముద్రికలు

 

వెతుకుట, ఆశీర్వాదము వీనియందు  ఈ పతాక హస్తము వినియోగించునని పండితులు చెప్పియున్నారు.


              -: త్రిపతాక హస్త లక్షణ వినియోగములు :-

    పతాకస్త్రి పతాకస్యాత్కుంచితా  నామికాయది !
    హరేరస్య జనిర్ధైవం  హరోజాతి స్తుబాహుజా !
    ఋషిర్గుహో రుణోవర్ణో  వినియోగస్తుకధ్యతే !!

    తా: పతాక  హస్తమందు  అనామికను  సగమువరకు   వంచిబట్టిన త్రిపతాక హస్తమగును. ఇది ఇంద్రునివల్ల పుట్టినది. దైవము శివుడు, జాతి క్షత్రియు, ఋషి గుహుడు, ఎర్రని రంగుకలది.

    వి ని యో గ ము లు :-
        నెరసిన వెంట్రుకలు, కిరీటము, వృక్షము, దేవేంద్రుడు, మొగలిపువ్వు, దీపిక, అగ్నిజ్వాలలు, చక్రము, విష్ణువు, పరాజయము, కోపము, అరణ్యము, భయము, వీరరసము, శయనము, సందేహములు, అద్దము, శిరము, బొట్టు, చెంప, కేశసమూహము, చిగురుటాకులు, దంతము, మనోవికారము, క్రిందిపెదవి, బాణము, రాజు, అరటిచెట్టు, మకరికాపత్రము, యెరుపువర్ణము, ఊర్ధ్వపుండ్రము, తరుణిభాష్పము, వంశము, వాహనము, ఈగ, స్థాణువు, నిష్టురము, వర్షము, సంతానము, దేవతలు, శాపము, చేప, తుమ్ము, కడగంటి చూపులు, తాపము, ఉద్దీపనము, వ్రాయుట, చెప్పుట, వస్తువులను తాకుట, మంగళవారం, ప్రతీపమను అర్ధాలంకారము, కాటుక, అంకుళము, ఓడ, ముళ్ళు, గోళ్ళు, చెక్కిలి, నుదురు, నడుము, రాగి వీనియందు ఈ త్రిపతాక హస్తము వినియోగించును.

 

 Previous Page Next Page