Previous Page Next Page 
వసుంధర కధలు-10 పేజి 2


    ఈలోగా అ ఊళ్ళో నే మునసబు శేషావతారంతో ఆమెకు పెళ్ళి సంబంధం కుదిరింది. చంద్రవంక తలిదండ్రులు శేషావతారానికి పాతిక వేలు కట్నంగా ఇస్తామని చెప్పారు. శేషావతారం ఇలాంటి సంబంధం కోసమే ఎదురు చూస్తున్నాడు.
    శేషావతారం డబ్బున్న వాడే కానీ డబ్బు పిచ్చి ఎక్కువగా కలవాడు. ఎంత సంపాదించినా అతడికి తనివితీరలేదు. చంద్రవంక తండ్రి పొలాలు అతడి పొలాల కానుకునే వున్నాయి. అందుకే ఆమె మీద అతను చాలా కాలంగా కన్ను వేసి వుంచాడు.
    సంబంధం స్థిరపడ్డాక మునెయ్య చంద్ర వంకనోసారి కలుసుకుని "నా వంటి దౌర్భాగ్యుడి కి మీలాంటి పిల్లని చేసుకునే అదృష్ట మెండుకుంటుంది ? ఈ జన్మకిది చాలు నానుకుని ఆఖరిసారిగా నీ చేతిని ముద్దు పెట్టుకుని పోతాను"
    చంద్రవంక కు అతని మీద క్షణమాత్రం జాలి కలిగింది. అంతలోనే కాస్త కోపం కూడా వచ్చింది. 'ఇంక నువ్విలాంటి కబుర్లు మానేయాలి.... నేను పెద్దింట్లోకి వెడుతున్నాను కూడా."
    "పిల్ల లేదయినా అడిగారనుకొండి. ఓసారి అడిగిన దిచ్చేవరకూ అలా వేధిస్తూనే వుంటారు. కావాలనుకున్నది దొరికితే కాసేపు ఆడుకుని మళ్ళీ దాని విషయమే మర్చిపోతారు. మన చనువు నాలో కోరికను పెంచింది. అది తీరుపోతే మిమ్మల్ని మరిచి పోవడమంత కష్టం కాదు."
    "బాగుందిరా -- నేను నిన్ను పెళ్ళి చేసుకోవడం లేదుగా ...."
    "లేదనుకోండి . కానీ ఒక్కసారి...."
    చంద్రవంక కు అతడి ఉద్దేశ్యం అర్ధమైంది. అప్పటికీ వాడ్నించి తప్పించుకున్నా ఆ విషయం ఆమె ఆలోచనలను చేసింది.
    తమ ఇద్దరకూ మధ్య వున్న చనువు, బాల్య చాపల్యం లో తను వాడి నభ్యంతర పెట్టుకపోవడం  ఆమెకు గుర్తున్నాయి. ఆ చనువును మరి కాస్త దూరం తీసుకు వెళ్ళాలన్న కోరిక వాడికి వుంది. ఆ కోరిక తీరకపోతే జన్మజన్మలకూ తమ చనువును వాడు మరిచిపోడు. తీరిపోతే అన్నీ మరచి పోవచ్చు.
    ఈ విధమైన ఆలోచనలకు తోడుగా మునెయ్య మీద అంతరంతరాలలో తనకున్న కోరిక కూడా కలవగా చంద్రవంక మునెయ్య కోరిక తీర్హాలని నిర్ణయించుకుంది. పెళ్ళి పదిహేను రోజులున్నదనగా ఆమె తనకు తానుగా మునెయ్యకు అర్పించుకుంది. మునెయ్య అప్పుడు పొందిన ఆనందమంతా అంతా కాదు.
    అతడి వద్ద వీడ్కోలు ముద్దు తీసుకొంటూ -- "ఈ జన్మకు నన్ను మరిచిపోవాలి" అంది. మునెయ్య అభ్యంతరాన్ని తెలియజేస్తూ -- "అదెలా సాధ్యం - ఈ రోజు అనుభవం వెయ్యి జన్మలకు కూడా మరువలేదు. ఆ అనుభవన్నిచ్చిన మీకు జీవితాంతం కృతజ్ఞుడ్నీ " అన్నాడు.
    "నీకు నిజంగా కృతజ్ఞుతవుంటే ఈ విషయం మళ్ళీ గుర్తు చేయవద్దు " అంది చంద్రవంక....
    "ఈరోజు నువ్వు మాట తప్పుతున్నావు మునెయ్య.... పెళ్ళికి ముందు జరిగిన ఆ విషయం  మళ్ళీ గుర్తు చేయనన్నావ్. నీ ఉద్దేశ్యమేమిటి? నన్ను బెదిరిద్దామనుకుంతున్నావా ?"
    "మిమ్మల్ని బెదిరించడమా ? మీరు నా దేవత ! ఎన్ని సంవత్సరాలు గడిచినా మీ అందం తరగదు. ఇటువంటి దేవత పెళ్ళికి పదిహేను రోజుల ముందు , ఒక్క సారంటే ఒక్కసారయితే మాత్రం నాకెలా దక్కిందాని ఆశ్చర్య పోతుంటాను" అన్నాడు మునెయ్య.
    "కబుర్లు కట్టి పెట్టు. కుర్రాడేలా చదువుకుంటున్నాడు?"
    "బాగా చదువుతున్నాడండీ. మీ అబ్బాయి గారి క్లాసేనండి . మీసాటి మేము రామనుకొండి . మీ అబ్బాయి గారు క్లాసులో యెప్పుడూ ఫస్టేట! మా వాడు కూడా రెండో, మూడో , నాలుగో వస్తుంటాడు " అన్నాడు మునెయ్య.
    భారంగా నిట్టూర్చింది చంద్రవంక.
    సరిగ్గా అప్పుడే అక్కడికి శేషావతారం వచ్చాడు. అతన్ని చూస్తూనే చంద్రవంక ఉలిక్కిపడి తడబడింది.
    "అదేమిటే - అలా కంగారు పడ్డావ్ -- ఏం చేస్తున్నావిక్కడ ?' అన్నాడు శేషావతారం.
    "మునేయ్యకు అన్నం పెడుతున్నాను ."
    "అంతేనా ...."
    చంద్రవంక జవాబివ్వకుండా మజ్జిగ తేవడానికి లోపలి కెళ్ళింది.  ఆమె అలా వెళ్ళగానే శేషావతారం మునెయ్య వంక చూసి "సరుకంతా జాగ్రత్తగా తెచ్చావా?" అన్నాడు.
    "తెచ్చానండి " అన్నాడు మునెయ్య.
    "ఏమిటో నిన్ను చూస్తె యెంతో గొప్పవాడివి కావలసి ఆగిపోయి నట్లనిపిస్తోందిరా , బండి తోలడం మానేసి ఏదయినా వ్యాపారం చేసుకోకూడదు ...." అన్నాడు శేషావతారం.
    "వ్యాపారానికి పెట్టుబడి కావాలి కదండీ" అన్నాడు మునెయ్య.
    చంద్రవంక వచ్చి మజ్జిగ పోసి మళ్ళీ లోపలకు వెళ్ళి పోయింది. మునెయ్య మజ్జిగ అన్నం కలిపి నోట్లో పెట్టుకున్నాడు.
    "పెట్టుబడి దేముందిరా, ఏ దేవతనయినా అడిగితె ఇయ్యవచ్చు ."
    మునెయ్య కు ముద్ద గొంతు కడ్డం బడింది. రెండు సార్లు దగ్గి గొంతు సరిచేసుకుని   కొద్దిగా మంచినీళ్ళు తాగాడు..." "నాకు డబ్బిచ్చే దేవతలేక్కడ దొరుకుతారండీ ...." అన్నాడు.
    "మునెయ్య, దేవతలు వరాలేలాగిస్తారో తెలుసురా "
    "తెలియదండి."
    శేషావతారం ముఖం తీవ్రంగా మారింది. "దేవతలిచ్చే వరాలు బలి కోరతాయి. ఆ విషయం తెలుసా నీకు?"
    మునెయ్య ముఖంలో భయం కనబడింది. "తెలియదు , కానీ తమరివన్నీ ఎందుకు చెబుతున్నారో నాకర్ధం కావడమూ లేదండీ."
    "సింపుల్ గా చెప్పమంటావా , నేను దేవుణ్ననుకో. నీకు వ్యాపారానికి పెట్టుబడి డబ్బు లిస్తాన్నాననుకో. నాకోసం ఏమయినా చెయ్యగలవా?"
    "తప్పకుండా చేస్తానండి" ఉత్సాహంగా అన్నాడు మునెయ్య.
    "ఏమయినా సరే " రెట్టించాడు శేషావతారం.
    "ఏమైనా సరే" దృడంగా అన్నాడు మునెయ్య.
    "నా భార్యను చంపెయ్యమంటే?" అన్నాడు శేషావతారం. మునెయ్య తెలల్బోయాడు. అతని నోట మాట రాలేదు.
    "అదేరా -- దేవతల వరాలు బలి కోరడమంటే !" అనిఅక్కడ్నించి కదిలాడు శేషావతారం.
    
                                   3
    మాలపల్లి లో ఇళ్ళంటుకున్నాయి. అక్కడ గాలి తోడు కాగా కొన్ని రవ్వలు ఎగిరి వచ్చి చాకలి పేటలో గుడిసెలు కొన్ని రగులుకున్నాయి.
    ఆరోజు గాలి చాలా యెక్కువగా వుంది. అందువల్ల గుడిసెలతో పాటు ఉళ్ళోని రెండు మూడు పెంకుటిల్లు కూడా అగ్ని ప్రమాదానికి గురయ్యాయి.
    ఊరంతా ఏకమై ప్రమాదాన్ని చాలావరకూ నివారించ గలిగాను. కానీ జరుగవలసిన నష్టం కొంత జరిగి పోయింది.
    "ఇందుక్కారణం వేరే యేమీ లేదు. ఊళ్ళో వాళ్ళకు భక్తీ లేదు. ఏంతో మంది అమ్మావారికి మొక్కుకొని ఆ మొక్కుబడులు చెల్లించలేదు. అందుకే అమ్మ నా ఊరి మీద పగబట్టింది ...." అన్నాడు అమ్మవారి గుడి పూజారి రంగయ్య.
    ఆ ఊరి అమ్మవారి పేరు మహాకాళి . ఎంతో మహత్యం గల దేవత అని ఆ వూళ్ళో నే కాక చుట్టూ ప్రక్కల కూడా చెప్పుకుంటారు. అందువల్ల వూళ్ళో ఎవరికేలాంటి ఇబ్బంది వచ్చినా వెళ్ళి అమ్మవారికి మొక్కు కుంటుంటారు.
    మహాకాళి మహత్యం గురించి ఎన్నో కధలున్నాయి. గుడికి వచ్చిన వారందరికీ పూజారి రంగయ్య వాటి గురించి చెబుతుంటాడు. అమ్మవారికి కోపం వస్తే నరబలి కూడా తీసుకొంటుందట.
    చాకలి పేటలో అరేడిళ్ళు పూర్తిగా దగ్ధమై పోయాయి. అయితే అ ఆరేడిళ్ళ వాళ్ళు కూడా మహాకాళి కి తలా ఒక కోడి పుంజు బాకీ వున్నారు. పెంకుటిళ్ళు కాలినవారు కూడా అమ్మవారికి వెండి కళ్ళు చేయిస్తామనో, ముక్కు పుడక చేయిస్తామనో అనుకున్న బాపతే -- రంగయ్య ఈ విషయాన్ని గుర్తు చేయగానే ఇలాంటి వారిలో సంచలనం కలగసాగింది.
    ఊళ్ళో అమ్మవారి వాగ్దానాలు చెల్లించని జనాలు ఇంకా చాలామంది వున్నారు. వాళ్ళందరికీ కూడా గుండె లలో బెదురుగా వుంది. రంగయ్య మాటలు విన్నాక, అమ్మవారు తమపైన ఏ విధంగా పగ తీర్చుకుంటుందో నని.
    చంద్రయ్య చుట్టం నర్సన్న కిప్పుడు తగని చిక్కొచ్చింది. అతని దొడ్లో పశువుల పాక కాలిపోయింది. ఇది అమ్మవారి పనేనని అతడు నమ్ముతున్నాడు.
    ఇదివరలో ఒక పర్యాయం కొడుక్కి జబ్బు చేస్తే -- అది త్వరగా నయమై పొతే అమ్మవారికి ముక్కుపుడక చేయిస్తానని మొక్కు కున్నాడతను. కొడుక్కు జబ్బు త్వరగానే నయమైపోయింది. కానీ అంతనింత వరకూ అన్న మాట చెల్లించలేదు. అతనిప్పుడు కొద్దిగా అప్పు కావాలని చంద్రయ్య నడిగాడు.
    "డబ్బు దేనికి?" అన్నాడు చంద్రయ్య.
    విషయం చెప్పాడు నర్శన్న.
    "బతికున్న పశువులకు పాక సంగతి ముందు చూడు. అమ్మోరి సంగతి తరవాత చూడొచ్చు" అన్నాడు చంద్రయ్య విసుగ్గా.
    'అలా అనకు. ఇప్పటికే బాధపడుతున్నాన్నేను ."
    "ఏడిశావ్ లేరా . మందర్నీ చల్లగా చూడాల్సిన అమ్మవారు మనమీద కోపగించుకోవడ మేమిటి? ఆ రంగయ్యేదో అంటే మీరు నమ్మేయడమే! ఆ మాలపల్లి వాళ్ళు అజాగ్రత్తగా ఉండడం వల్ల యింత జరిగింది.ఇలాంటివి జరగటం మామూలే. దీనికి అమ్మవారికి ఏం సంబంధం లేదు"అన్నాడు చంద్రయ్య.
    నర్సన్న ముందు అంగీకరించలేదు. కాని చంద్రయ్య చాలాసేపు చెప్పాక 'అవును - మనందర్నీ కాపాడవలసిన ఆ తల్లి డబ్బాశతో ఇలా ఏడిపిస్తుందేమిటి?" అని వెళ్ళిపోయాడు.
    ముక్కుపుడకకు ఈ రోజుల్లో చాలా ఖర్చవుతుంది. అది కూడా అతను చంద్రయ్య మాటలు వినడానికి కొంతవరకూ కారణం.
    అయితే ఆరోజు సాయంత్రమే చంద్రయ్య కొడుకు కృష్ణమూర్తికి ఆటలో బలమైన గాయం తగిలి , స్పృహ తప్పి పడిపోయాడు.
    నిముషాల మీద కృష్ణమూర్తి శరీరం గ్రామంలోని వైద్యుడి ఇల్లు చేరింది. ఈలోగా కబురు కృష్ణమూర్తి తల్లి ముత్యాలమ్మకు చేరింది.
    నాటు వైద్యుడు మరీ మోటు వైద్యుడు కాడు.అతడు పట్నంలో ఓ పెద్ద డాక్టరు దగ్గర చాలా కాలం కంపౌడరు గా పనిచేసి ఆ అనుభవంతో ఇక్కడవైద్యం ప్రారంభించాడు. అతని వస్తావాసి మంచిదన్న పేరు అచిరి కాలం లోనే వచ్చేసింది. ఇప్పుడతను కృష్ణమూర్తి తల మీద గాయాన్ని పరిశీలించి "దెబ్బ గట్టిగా తగిలింది-" పెద్దది " అన్నాడు.

 Previous Page Next Page