నేరం నాది కాదు
వసుంధర
"నా పేరు రాధ. నేను, మనోరమా ఏజెన్సీస్ లో టైపిస్ట్ గా పని చేస్తున్నాను. నన్ను కాపాడగలవారు మీరు తప్ప మరెవ్వరూ లేరనే ఉద్దేశ్యంతో మీ దగ్గరకు వచ్చాను....' అంది రాధ.
సుధ ఆమెను పరీక్షగా చూసింది. ఇరవయ్యేళ్ళ లోపు వయసున్న రాధ దేవకన్య లాగుంది. కానీ ఆమె కళ్ళలో మాత్రందిగులు గూడు కట్టుకుని ఉంది.
"చెప్పండి ..." అంది సుధ.
"నాలుగు వారాల క్రితం నేను సామాన్య మధ్యతరగతి కుటుంబీకురాలీని. నా జీవితం అతి సామాన్యమైనదని భావిస్తూ వచ్చాను. కానీ హటాత్తుగా అదృష్టం నన్ను వెతుక్కుంటూ వచ్చింది. నా అంత అదృష్ట వంతురాలు లేదని రెండు వారాల క్రితం వరకూ అనుకుంటూ వచ్చాను. అప్పుడే నా అదృష్టాన్ని దురదృష్టం మింగేసింది. వారం రోజుల్నించి నన్ను శని దేవత వెంటాడ్డం కూడా ప్రారంభించింది..." అని ఆగింది రాధ.
"నాకు వివరాలు కావాలి...." అంది సుధ.
"చెబుతాను. సిగ్గు విడిచి అన్నీ చెబుతాను. అంతా విన్నాక నేనేం చేయాలో మీరే చెప్పాలి" అంటూ మొదలు పెట్టింది రాధ.
* * * *
"ఏదో పని మీద మనోరమా ఏజన్సీస్ కు వచ్చిన అతను నన్ను చూసి మ్రాన్పడి పోయాడు. "వాటే డాషింగ్ బ్యూటీ" అన్న మాటల ప్రయత్నంగా అతని నోట వచ్చాయి. కళ్ళప్పగించి నన్నుచూస్తున్న అతన్ని గమనిస్తున్న నేనా మాటలు విని ఆశ్చర్యపోయాను. అతను నా దగ్గరకు వచ్చి తన్ను పరిచయం చేసుకున్నాడు.
అతనో పెద్ద బిజినెస్ మాగ్నెట్. పేరు శర్మ, సుమారు పాతికేళ్ళ వయస్సు. సింపుల్ గా అతను నన్ను ప్రేమించాడు. లవ్ యిట్ ఫస్ట్ సైట్ అన్నమాట. అతనూ నాకు నచ్చాడు. సాయంత్రం మా ఇంటికి నమ్మమని ఆహ్వానించాను. వచ్చాడు అమ్మా నాన్నలతో మాట్లాడాడు. వర్ణం ఒక్కటే కానీ శాఖలు తేడా వచ్చాయి. ఆయినా కట్నమిచ్చి పెళ్ళి చేసే పరిస్థితుల్లో లేని అమ్మా నాన్నలకు కట్న మక్కర్లేదంటూ వెతుక్కుంటూ వచ్చి పిల్ల నడిగిన లక్షాధికారి ని అల్లుణ్ణి చేసుకునేందుకు అభ్యంతరం కనబడలేదు. అంతా సవ్యంగానే గడిచిపోయింది. పెళ్ళి శాస్త్ర ప్రకారం జరిపించడానికి నిశ్చయించారు. వారం రోజుల్లో ఇతర ఫార్మాలిటీస్ మిగిశాయి. ఇద్దరి జాతకాలను బట్టి నిర్ణయించిన ముహూర్తం అప్పటికి ఏడు వారాలుంది.
తిరిగి పోయిన నా అదృష్టాన్ని తల్చుకుని పొంగి పోయాను. పది రోజుల్లో నాలుగు సాయంత్రాలు శర్మతో బీచికి వెళ్ళాను. ఆ పరిచయం , ఆనుభవం అతని సంస్కారాన్ని, విశాల హృదయాన్ని , సంప్రదాయాలకతనిచ్చె విలువను నాకు బాగా తెలియజెప్పి అతనంటే ఆరాధనాభావాన్ని కలుగాజేశాయి.
తర్వాత ఒకరోజు అతనితో పరిచయం లభించిన రెండు వారాలకు - ఇద్దరు వ్యక్తులు మనోరమా ఎజన్సీస్ కు వచ్చారు. వాళ్ళిద్దరూ నాకు స్వల్పంగా పరిచయమైన వాళ్ళే! శర్మ కంపెనీలో ఉద్యోగులు వాళ్ళిద్దరూ. ఒక రోజు శర్మ నన్ను తన కంపెనీ కి తీసుకు వెళ్ళి- వీళ్ళీద్దరిని పరిచయం చేసి- తనకు చాలా ముఖ్యులని చెప్పాడు. నన్ను వాళ్ళకు పరిచయం చేస్తూ కాబోయే భార్య అని చెప్పాడు.
వాళ్ళిద్దరూ అప్పుడు నా దగ్గరకు వచ్చి శర్మకు చిన్న యాక్సిడెంట్ అయిందనీ, చెప్పుకో దగ్గ ప్రమాద మేమీ లేదు కానీ ఒక పర్యాయం నన్ను చూడాలనుకుంటున్నాడని చెప్పారు. నమ్మి వాళ్ళిద్దర్నీ అనుసరించాను. ఒక టాక్సీ లో ఇద్దరూ నన్నో ఇంటికి తీసుకు వెళ్ళారు. తర్వాత-- తర్వాత...."
* * * *
రాధ ముఖం మీద చేతులు కప్పుకుని ఏడ్చింది.
సుధ ఆమె వంక జాలిగా చూసి - "చెప్పండి -- అన్నీ వివరంగా చెప్పండి....'అంది.
"చెబుతాను, వివరంగానే చెబుతాను...." అంటూ మొదలు పెట్టింది రాధ.
* * * *
"ఇద్దరూ కలిసి నన్ను మోసగించారు. నిస్సహాయురాలిను చేసి ఒకరి తరువాత ఒకరు నన్ననుభవించారు. వాళ్ళ బెదిరింపుల కారణంగా నేను నిస్సహాయంగా వాళ్ళకి లొంగిపోయాను. ఒకడు నన్ననుభవిస్తున్నప్పుడు రెండో వాడు మా ఫోటో లు తీశాడు. అలా ఇద్దరితోనూ కలిసి కనీసం ముప్పై ఆరు ఫోటోలు ఉన్నాను.
నేను వాళ్ళకు సులభంగా లొంగలేదు. ముందొకడు నానోట్లో గుడ్డలు కుక్కి తర్వాత నన్ను వివస్త్ర ను చేసి -ఫోటో తీశారు. ఆ ఫోటో బహిర్గతం చేస్తామని బెదిరించి బలవంతంగా నన్ను లొంగదీసుకున్నారు. ఏది ఏమైనప్పటికీ అప్పటి నా దురదృష్టం అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది.
అయితే కధ ఇక్కడ ముగియలేదు. ఈ సంఘటన జరిగిన వారం రోజులకు నా శృంగార లీలలు ఫోటో రూపంలో నాకు చేరాయి. దాంతో పాటు ఒక ఉత్తరం, ఆ ఉత్తరం ప్రకారం నేను వాళ్ళు చెప్పినట్లు నడుచుకొని పక్షం లో - ఆ ఫోటోలు కాబోయే నా భర్త కందజేయబడతాయి. వాళ్ళు చెప్పినట్లు నడుచుకున్నానంటే నేనొక స్మగ్లర్ కావాల్సి ఉంటుంది.
శర్మ ఉదాత్త పురుషుడనీ, అతన్ని నేను నిజంగా ప్రేమిస్తున్నాననీ, ఆ కారణంగా అతని కన్యాయం చేయలేననీ- అతన్ని నేనెలాగూ వివాహం చేసుకోదలచ లేదనీ ఆ వెధవ లిద్దర్నీ కలుసుకుని చెప్పాను. కానీ వాళ్ళు నా మాటలు వినలేదు. నేను శర్మను వివాహం చేసుకుని తీరాలట. వాళ్ళ పనులు చేసి పెట్టాలట. వాళ్ళింకా ఏదో పెద్ద పధకంలో ఉన్నారని నాకు చాలా అనుమానంగా ఉంది.
ప్రస్తుతం నేను నరకం అనుభవిస్తున్నాను. శర్మని తప్పించుకు తిరుగుతున్నాను. నిజం చెప్పాలంటే జీవితం మీద విరక్తి కలిగింది నాకు. ఈ పరిస్థితుల్లో నాకెవరు సహాయపడగలరో తెలియలేదు. ఏదో పనిమీద మీరు మీ భర్తతో కలిసి ఈ ఊరు వచ్చారనివిన్నాను. మీరే నాకు దారి చూపగలరని పించింది వచ్చాను."
* * * *
సుధ రాధ వంక సూటిగా చూసింది - "నా దగ్గరకు రావడం లో మంచి పనే చేశావు నువ్వు - కానీ నాకు నీ ఉద్దేశ్యం అర్ధం కాలేదు. ఆ ఫోటోలు నన్ను సంపాదించి పెట్టమంటావా -- లేక...."
రాధ ఆశగా నావంక చూసింది - "వీలుపడుదంటారా ఆ నెగిటివ్స్ సంపాదించడం!"
"ప్రయత్నించాలి , అదీ కాస్త రహస్యంగా..."
'అదే మీరు చేయగలిగితే మీ ఋణం ఈ జన్మలో తీర్చుకోలేను....' అంది రాధ.
"ఋణం సంగతి సరే -- నాకు కొన్ని వివరాలు కావాలి-- శర్మదీ, నీదీ వాళ్ళందరినీ చిరునామాలు కావాలి.." అంది సుధ.
రాధ అన్నీ వివరంగా ఒక కాగితం మీద రాసిచ్చింది.
2
రాము, ప్రసాద్- ఇద్దరూ బీచి దగ్గర కూర్చుని ఉండగా ఒకతను వచ్చి వాళ్ళను పలకరించి - "నన్ను విశ్వనాధం అంటారు ...." అన్నాడు.
"మిమ్మల్నేమంటే మాకేం?" అన్నాడు రాము చిరాగ్గా.ప్రసాద్ మాత్రం వినయంగా - "మీరెవరో మాకు తెలియదు -" అన్నాడు.
"నేను రాధకు బావను...." అన్నాడు విశ్వనాధం.
"రాధ.....ఏ రాధ ?" తడబడుతూ అన్నాడు రాము.
"మీకూ నాకూ తెలిసిన - ఒకే రాధ! మనోరమా ఏజన్సీన్ లో పనిచేస్తోంది ...." అన్నాడు విశ్వనాధం గంబీరంగా.
"కావచ్చు. కానీ మీకు మాతో పనేముంది?" అన్నాడు ప్రసాద్.
"అది నేను వేరే చెప్పనక్కరలేదు. నేను సరిగ్గా మూడు రోజుల క్రితం ఫారిన్ నుంచి వచ్చాను. మళ్ళీ పది రోజుల్లో వెళ్ళిపోతాను. రాధ నాకు మీ గురించి అంతా చెప్పింది. అమెనాకు కాబోయే భార్య. ఆమె నాతొ ఫారిన్ వచ్చేస్తుంది. ఆమెకు సంబంధించిన కొన్ని ఫోతోలుమీ దగ్గరున్నాయి'ట కదా -- నెగిటివ్స్ తో సహా వాటిని నాకిచ్చేస్తే మీకు లక్ష రూపాయలిస్తాను. ఇది మీకు చాలా మంచి ఆఫర్. రాధ నాతొ ఫారిన్ వచ్చేశాక ఆ నెగిటివ్స్ కానీ ఫోటోలు కానీ మీకు నాలిక గీచుకొందుక్కూడా పనికి రావు, ఆలోచించు కొండి-" అన్నాడు విశ్వనాధం.
రాము ఆలోచనలో పడ్డాడు. ప్రసాద్ మాత్రం ..... "ఆమె నిన్ను చేసుకోదు, శర్మను వివాహం చేసుకోబోతోంది--" అన్నాడు.
"అది పాత మాట. ఆమె వివాహం శర్మతో నిశ్చయం కాబోతుందన్న ఉత్తరం అందగానే సరాసరి ఫ్రాంక్ ఫర్ట్ నుంచి పరుగెత్తుకు వచ్చాన్నేను. నేను రాధని చాలాకాలంగా ప్రేమిస్తున్నాను. దూరాన ఉన్నానని ఆమె తలిదండ్రులకు ననిచ్చి చేయడం ఇష్టం లేదు. కానీ ఇప్పుడు మీరు పెట్టిన ఇరకాటం కారణంగా రాధ నన్నంగీకరించింది. మీరు తనకు చేసిన అన్యాయం వివరంగా నాకు చెప్పింది రాధ...."
ప్రసాద్ ఆశ్చర్యంగా అతని వంక చూసి - "అయినా ఆమెను పెళ్లాడదల్చు'కున్నారా?" అన్నాడు.
"ఆశ్చర్యంగా ఉందా? నీలాంటి దుష్టులున్నప్పుడు- రేపు మా వివాహమయ్యేక ఆమె ఇటువంటి అన్యాయానికి గురయితే ఏం చేస్తాం? కట్టుకున్న భార్యను వదులుకోలెం గదా - దేనికైనా మనసు ప్రధానం కానీ శారీరం కాదు. రాధ శరీరం మలిన మైన ఫర్వాలేదు. అది భౌతిక మైనది.ఒక్క స్నానంతో శరీరం మళ్ళీ పవిత్ర మవుతుంది. ముఖ్యమైన ఆమె మనసు ఎప్పటికీ పవిత్రంగానే ఉంటుంది." అన్నాడు విశ్వనాధం తన సంభోధన మారుస్తూ.
"సరే ఆమె మాకేలానూ కాకుండా పోతోంది. మా తృప్తికి ఫోటోలు దగ్గరుంచుకుంటూ ....." అన్నాడు రాము. కేవలం విశ్వనాధాన్ని రెచ్చ గొట్టాలని అతనామాట అన్నాడు. కానీ విశ్వనాధం రెచ్చిపోలేదు.
చాలా తాపీగా నీ ఇష్టం లక్ష రూపాయల ఆదాయాన్ని వదులుకోదలిస్తే అలా చేయి. అదీ కాక ఆ ఫోటోలు నా కిస్తే ఫారిన్ నుంచి తీసుకు వచ్చిన ఒక పోర్నో ఫిల్స్ నీకు ఫ్రీగా ఇస్తాను. రహస్యంగా చూపించుకుని మీరు డబ్బు చాలా సంపాదించవచ్చు...."అన్నాడు విశ్వనాధం.