శ్రమను ప్రేమించటం అంటే ఇదేనేమో.... తన హోమ్ టౌన్ లో ఆటోమోబైల్ రిపేర్ షాప్ ని ఓపెన్ చేసిన హోండా రాత్రింబవళ్ళు శ్రమించి అనూహ్యమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు.
ఖాళీ సమయాల్లో యంత్రాలను సరిచేస్తూ, వాటితో ప్రయోగాలు చేస్తుండేవాడు.
సరిగ్గా ఆ సమయంలోనే, వేగంగా పరిగెత్తే కార్లను విపరీతంగా అభిమానించేవాడు హోండా, అలాంటి ఇంజన్ గురించి ఎడతెగని ప్రయోగాలు చేస్తూ, చివరకు విజయం సాధించాడు.
1936లో ఆల్ జపాన్ స్పీడ్ ర్యాలీలో తను సొంతంగా మోడిపై చేసుకున్న ఫోర్డ్ కారుతో పాల్గొన్నాడు. గంటకు 75 మైళ్ళ (120 కిలోమీటర్లు) వేగంతో కారును పరిగెత్తించి సరికొత్త జపనీస్ ఏవరేజ్ స్పీడ్ రికార్డ్ ని సృష్టించాడు.
అయితే చిన్న దురదృష్టం అతన్ని వెంటాడింది. పందెం చివరలో మరో పందెపు కారు కంట్రోలు తప్పి హోండా కారుని క్రాష్ చేయటంతో, హోండా తీవ్రంగా గాయపడి, ఎనిమిది నెలలు బెడ్ మీంచి దిగలేకపోయాడు.
తన ప్రాంతానికే చెందిన ఒక చిన్న వ్యవసాయదారుడి కూతుర్ని హోండా అంతకుముందే పెళ్ళి చేసుకున్నాడు. ఆమె పేరు సాచీ ఆమె తన భర్తను ఆ పదునెనిమిది నెలలు కంటికి రెప్పలా కాపాడి దక్కించుకుంది. ఆపైన తన భర్త కార్ రేసుల్లో పాల్గొనకుండా కట్టుదిట్టం చేసుకుంది.
అదే హోండా జీవితంలో గొప్ప మలుపు.
భార్య మాటను గౌరవించి రేసుల్లో పాల్గొనాలానే కోర్కెను చంపుకొని తన దృష్టిని వ్యాపారం మీదకు మరలించుకున్నాడు.
ఆ తరువాత కూడా అవిశ్రాంతంగా పనిచేస్తూ తన ఆటో రిపేర్ బిజినెస్ ని బాగా అభివృద్ధి చేసుకోగలిగాడు.
అతనిలోని జిజ్ఞాస, తపన, రోజు రోజుకి పెరిగిపోయి రిపేర్స్ తో సంతృప్తి పడలేకపోయాడు. ఆ చుట్టుప్రక్కల ప్రాంతాల్లో తిరిగే కార్లనే తను రిపేర్ చేయగలడు.
అమెరికా కార్ల యజమానులు, టోక్యో కార్ ల యజమానులు తన కారులను రిపేర్ చేయించుకొనేందుకు తనదాకా రాకపోవచ్చు... వస్తే మాత్రం ఎలాంటి కారునయినా తను రిపేర్ చేయగలడు. బట్ రాలేరు! దీని మూలంగా తన వ్యాపారం ఒక స్థాయికి మించి యెదగలేదు. ఎదగకపోతే తనలో రోజురోజుకి పెరిగిపోతున్న వృత్తిపరమైన తపనను, అసంతృప్తిని యెలా అణచుకోవాలి? ప్రపంచంలో ఏ మారుమూల యే కారు చెడిపోయినా తనకు బాగుచేయాలని వుంటుంది.
అలా అని కేవలం రిపేర్ షాప్స్ ని ప్రపంచ వ్యాప్తంగా ఓపెన్ చేస్తూ పోవటం శ్రమతో కూడుకున్నదేగాక నష్టాల్ని కూడా తెచ్చి పెడుతుంది. ప్రపంచంలోని కార్లు తయారుచేసే కంపెనీలు అన్నీ ఒకే రకమైన కార్లనే తయారుచేయవు.... ఇలా ఆలోచిస్తున్న అతనిలో ఒక అద్భుతమైన ఆలోచన రూపుదిద్దుకుంది.
తనే స్వయంగా ఆటోమొబైల్ తయారీలోకి ప్రవేశిస్తే ఎలా వుంటుందన్నదే ఆయనకు వచ్చిన ఆలోచన.
తద్వారా సుదూర ప్రాంతాలలో సయితం తను విస్తృతంగా అల్లుకుపోవచ్చని భావించాడు. కలలు కన్నాడు.
1937లో తన స్నేహితుల నుంచి, బంధువుల నుంచి ఆర్ధిక సహాయాన్ని పొంది ఆ మొత్తంతో ఫిస్టన్ రింగ్స్ తయారుచేసే ఫ్యాక్టరీని ఆరంభించాడు.
అతనెంత తన వ్యాపారానికి అంకితమై పోయాడంటే.... యింటికెళ్ళడం మానేసి ఫ్యాక్టరీలోనే తన మకాం పెట్టేశాడు... ఇంటికి వెళ్ళిరావటం మూలంగా యెంతో విలువయిన కాలం వృధా అయిపోతుందని భావించే ఆ పని చేసాడు.
ఓపిక ఉన్నంత వరకు అక్కడే పనిచేసి, ఆ యంత్రాల ముందే ఫ్లోర్ మీద విశ్రమించేవాడు.
భర్త పట్టుదలను ఎరిగున్న భార్య సాచీ, భోజనాన్ని ఫ్యాక్టరీకే పట్టుకొస్తుండేది.
ఆ వ్యాపారం బాగా అభివృద్ధి చెందేవరకు హోండా ఫ్యాక్టరీలోనే వున్నాడు.
ఓరోజు హోండా ఫ్రెండ్ అతన్ని కలిసేందుకు వచ్చాడు.
అతనికి పెద్ద ఫౌండ్రీ వుంది.
"మానవ మాతృడెవరు పడని కష్టాన్ని పడుతున్నావు. రాత్రింబవళ్ళు నిద్రాహారాలు మాని, శ్రమించి ఫిస్టన్ రింగ్స్ ఫ్యాక్టరీని పైకి తెచ్చుకున్నావు. కాని.....ప్రపంచానికి నీ కష్టాలతో సంబంధం లేదు. అక్కర్లేదు. కేస్టింగ్ లో నువ్వు ఎక్స్ పర్ట్ వి కావాలి. లేదంటే భవిష్యత్ లో పరాజయాన్ని ఎదుర్కోవలసి వస్తుంది.
నీకు తెలిసిన సాంకేతిక పరిజ్ఞానం వ్యాపార మెళకువలు చాలవు గనుక యీ వ్యాపారం గురించి యింకా బాగా తెలుసుకునేందుకు అప్రెస్ టిస్ షిప్ స్థాయిలో పెద్ద కంపెనీలో పనిచేయి.
అలాంటి కంపెనీ ఒకటి నాకు బాగా తెలుసు. నీ కిష్టమయితే రికమెండ్ చేస్తాను..." అని చెప్పటంతో హోండా ఆలోచనల్లో పడిపోయాడు.
ఆ తరువాత తమ ప్రాంతంలోనే ఉన్న హమామాట్స్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళి ఒక ప్రొఫెసర్ ని కలిసి (ఇప్పుడది షిజుయోకా యూనివర్శిటీగా రూపాంతరం చెందినది) తమ వ్యాపారం గురించి సవివరంగా తెలియజెప్పి, సరిపడినంత సిలికాన్ మెటీరియల్ ని ఫిస్టన్ రింగ్స్ తయారీలో వుపయోగించటం లేదని.... అందుకు కారణం సిలికాన్ గురించి నాకు నాలెడ్జ్ లేకపొవటమే కాదు..... దాని అవసరం వుందని నాకు తెలీకపోవడమే కారణమని సిగ్గుపడుతూ చెప్పాడట హోండా.
తెలీదని చెప్పటానికి సిగ్గుపడితే తెలుసుకొనే అవకాశాన్ని కోల్పోతామని ఆయన వుద్దేశ్యం.
ఆర్ధిక సమస్యలతో సతమతమయ్యే తల్లి దండ్రులకు సహకరించేందుకు స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళకుండా వున్న ఒకప్పటి పేద విద్యార్ధి హోండా...
స్కూల్ కి రెగ్యులర్ గా వెళ్ళినా ఫిస్టన్ రింగ్స్ ఆటో మొబైల్ యంత్రాల గురించి కాక, క్లాసులో వేరే విషయాల గురించి చెబితే తక్కువ అటెన్షన్ ని పే చేసి, యెలాంటి నోట్స్ తీసుకోకుండా, ఏ పరీక్షలకూ అటెండ్ కాకుండా వుంటున్న హోండాని చూసి యిలా అయితే డిప్లొమా రాదని ఆ స్కూల్ హెడ్ హెచ్చరించాడట.
అప్పుడు హోండా నవ్వుతూ అన్నాడట-ఒక డిప్లొమా కన్నా ఒక సినిమా టికెట్ కే నా దృష్టిలో విలువ ఎక్కువ. సినిమా టికెట్ కొంటే థియేటర్ లో ఒక సీటు మనకు ఎలాట్ అవుతుంది.... అదే డిప్లొమా సర్టిఫికెట్ కి జాబ్ వస్తుందన్న గ్యారంటీ లేదు. A movie ticket will get you a seatin movie the- ater, but a diploma won't get you a job! అని అంటే ఆ స్కూల్ హెడ్ ఖిన్నుడయి పోయాడట.
అలా అని చదువు పట్ల, చదువుకొనే వారిపట్ల హోండాకి గౌరవం లేదని కాదు.....ప్రాక్టికల్ నాలెడ్జ్ లేని బుక్కిష్ నాలెడ్జ్ పట్ల తనకు చిన్న చూపుండేది.
ఐదేండ్లు ఆటో మొబైల్ ఇంజనీరింగ్ చదివి పట్టా తీసుకుని అప్పుడే బయటకు వచ్చిన విద్యార్ధికన్నా..... రెండేండ్లు మెకానిక్ షెడ్ లో పనిచేసిన కుర్రాడే త్వరగా చెడిపోయిన కారును బాగుచేయగలడని హోండా స్ట్రాంగ్ ఒపీనియన్.
అయితే జపనీస్ బిజినెస్ కమ్యూనిటీలో మాత్రం పెద్ద యూనివర్శిటీలో చదువుకున్న విద్యార్ధులకే ఉద్యోగాలివ్వటం జరుగుతోంది.
ప్రపంచ స్థాయిలో నెంబర్ ఒన్ స్థాయికి ఎదిగే ప్రయత్నంలో దాదాపు అన్ని మైలు రాళ్ళను అధిగమించి అప్రతిహతంగా ముందుకు సాగిపోతున్న హోండా కార్ల కంపెనీలో మాత్రం హోండా అభిప్రాయాలే ప్రాముఖ్యత ఇవ్వటం వూపిరి పోసుకుంటాయి.
హోండా మోటార్ కంపెనీలో అవసరం మేరకు డిగ్రీ హోల్డర్స్ హోల్డర్స్ డిప్లొమా వున్నప్పటికీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వున్నవారికే ఎక్కువ జరుగుతోంది.
ఎప్పుడయితే హోండా ఫిస్టన్ రింగ్స్ తయారీలో ప్రావీణ్యాన్ని సంపాదించుకున్నాడో, అప్పటి నుంచి రెండేండ్లలో అనితర సాధ్యమయిన ప్రగతిని సాధించాడు హోండా.
జపాన్ దేశపు అతి పెద్ద ఆటోమేకర్ అయిన టయోటా కంపెనీకి ఫిస్టన్ రింగ్స్ ని సప్లయ్ చేసే ఆర్డర్ ని సంపాదించుకున్నాడు.
అయితే రెండవ ప్రపంచ యుద్దంలో ఫైరింగ్ బాంబ్స్ మూలంగా హోండా కంపెనీ బాగా దెబ్బతినిపోయింది.
ఆ వెంటనే వచ్చిన భూకంపం మూలంగా మిగిలిన కంపెనీ కూడా దెబ్బ తినిపోయింది.
అవి అతన్ని వ్యాపారపరంగా బాగా దెబ్బతీసాయి... అయినా హోండా కళ్ళవెంట ఒక్క కన్నీటి బొట్టు కూడా రాలలేదు...ఒక్క క్షణం కలత చెందలేదు.
తనను తాను సంభాళించుకొని తిరిగి అదే వ్యాపారంలోకి ప్రవేశించాడు.
1946 అక్టోబర్ లో హోండా తిరిగి పట్టుదలతో హోండా టెక్నికల్ రీసర్చ్ ఇన్ స్టిట్యూట్ స్థాపించాడు.
అది చిన్న సంస్థ.... ఫేన్సీ నేమ్ తో ఆరంభమయింది.
కొంతమంది అనుభవమున్న మెకానిక్స్ ని తనతో కలుపుకొని ఇంజన్స్ ని టింకరింగ్ చేసే వ్యాపారాన్ని చేపట్టాడు. అలా రెండు సంవత్సరాలు గడిచాక 1948లో తన ఇన్ స్టిట్యూట్ పేరును మార్చివేసి హోండా మోటార్ కంపెనీ అనే కొత్త పేరును పెట్టి దాన్ని ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చివేశాడు.