దాన్ని గమనించిన శశాంక ఓ.కే....50 లక్షలు కాద్దాం...." అన్నాడు హుషారుగా.
"మీ బాబు విడుదల కావటం ఖాయం. ఈ రోజే అన్నీ భరత్ తో మాట్లాడివచ్చాను...." వీక్ పాయింట్ మీద వేసాడు మరో దెబ్బ శుక్రాచార్య.
"ఆ పని మీరు చేస్తే జీవితాంతం ఋణపడి ఉంటాను."
"తప్పకుండా....నాకు మరో అయిడియా వచ్చింది. రేపు రేసెస్ గాలరీలో ఇద్దరు కలుస్తారు అంటే మీరు, భూపతి.
"కలిస్తే...."
"రమ్మీకి ఇన్ వైట్ చేయండి. లక్ష స్టేక్ అని చెప్పండి...." అన్నాడు శుక్రాచార్య శశాంక ఫీలింగ్స్ ని పరిశీలిస్తూ.
"చేయవచ్చు. కాని రమ్మీలో భూపతి ఎక్స్ పర్ట్" శశాంక సందేహం వెలిబుచ్చాడు.
"కావచ్చు, కానీ నేను మీ వేపు లేనంత వరకే....ఇప్పుడు నేనున్నాను...."
"ఎలా గెలుస్తాం."
"గెలుస్తాం అంతే."
"శకుని మాయ పాచికలు లాగా నీ దగ్గరేమన్నా మాయా ప్లేయింగ్ కార్డ్స్ ఉన్నాయా....?" నవ్వుతూ అడిగాడు శశాంక.
కాని అందులో ధ్వనించిన పరిహాసం శుక్రాచార్య దృష్టిని దాటిపోలేదు.
మౌనంగా నవ్వుతూ గడ్డం నిమురుకున్నాడు శుక్రాచార్య.
"రమ్మీ 50 లక్షలకి, భూపతితో ప్రత్యక్షంగా "టెంపుల్ కోర్టు" మీద 50 లక్షలకి పందాలకి దిగాలి. అదే అతనికి మనం ఇచ్చే మొదటి ఎటాక్...." అన్నాడు కవ్విస్తున్న ధోరణిలో శుక్రాచార్య.
శశాంక పౌరుషం, కోపం బుసలుకొడుతోంది. తన కొడుకు మర్డర్ చేయటానికి ప్రవోక్ చేసింది, మర్డర్ చేసింది తన కొడుకేనని ఆ టైమ్ లో డెత్ స్పాట్ లో పేరు ఉచ్చరించింది భూపతి పధకమేనని శశాంక నమ్మకం. మొత్తానికి రెండు పందేలకు శశాంకను ఒప్పించగలిగాడు శుక్రాచార్య.
శుక్రాచార్య లేచాడు.
సరాసరి సిటీలో రమ్మీలో ఎక్స్ పర్టు అయినవ్యక్తి దగ్గరకు వెళ్ళాడు శుక్రాచార్య. అక్కడి నుండి ఓ కంప్యూటర్ ఇంజనీర్ దగ్గరకు వెళ్ళాడు.
* * *
ఆదివారం రేస్ లో ఆనందరావు సలహా మీద వెయ్యికాశాడు వివిధ కాంబినేషన్స్ మీద.
ఇది ఒక సిరీస్ ఆఫ్ కాంబినేషన్స్ మాత్రమే. మొత్తం రేస్ లు 2 అనుకుంటే__అందులో ఒకో దానిలో 5 గుర్రాలనుకుంటే__
2x2x2x2x2 = 32 కాంబినేషన్స్.
మామూలు బెట్టింగ్ 5 రూపాయలు
జాక్ పాట్ అయితే 10 రూపాయలు
32x10 = 320 రూపాయలు
అదే 7 రేసులు__ఒక్కో రేసులో ఎనిమిది గుర్రాలయితే బెట్టింగ్ వేళల్లో ఉంటుంది)
కాంబినేషన్స్ కి ఎక్కువ పే చేయాలి.
ఏ గుర్రం గెలుస్తుందో కరక్టుగా అంచనా వేయనప్పుడు__గుర్రాలన్నీ బలంగా ఉండి, విన్నింగ్ ఛాన్సెస్ సమానంగా ఉన్నప్పుడు పంటర్స్ కన్ ప్యూజ్ అయి ఒక కాంబినేషన్ మీదనే కాకపోతే మరొకటి వస్తుందనే గుడ్డి నమ్మకంతో ఎక్కువ కాంబినేషన్ బెట్టింగ్ కాస్తారు.
మొత్తానికి మొదటిసారి చక్రవర్తికి 14 వేలు వచ్చాయి చక్రవర్తి ఆనందానికి అవధులు లేవు. ఆనందరావుని అమాంతం గాల్లో లేపేసాడు చక్రవర్తి.
"బిగినర్స్ లక్" మనిషిని ఎక్కడికైనా తీసుకెళ్తుంది. ఏ పనైనా చేయిస్తుంది. ఇక అప్పటి నుండి తన మీద తనకే అపారమైన గుడ్డి నమ్మకం_ఆ గుడ్డి నమ్మకంలో వినాశనం చివరి అంచులదాకా వెళ్ళగలరు.
చక్రవర్తి ఆనందరావుకి మంచి పార్టీ ఇచ్చాడు.
ఆ తరువాత ఇద్దరూ టాక్సీలో ఇంటికి వచ్చేసారు.
తనకోసమే ఎదురు చూస్తూన్న శారదను అమాంతం ఎత్తి గాల్లో తిప్పాడు చక్రవర్తి.
శారద అంతా అయోమయంగా ఉంది.
"ఏంటి ఇవ్వాళ అయ్యగారు ఇంత హుషారుగా ఉన్నారు__?" అడిగింది శారద భర్త జుత్తులోకి వేళ్ళు పెట్టి మృదువుగా దువ్వుతూ.
"అయ్యగారు ఇవ్వాళ గెలిచారు" అన్నాడు.
"గెలవటమేంటి....?" అనుమానంగా అడిగింది. చక్రవర్తి ముందు కంగారు పడ్డా అంతలోనే సర్దుకొని__
"గెలవటం అంటే కోర్టులో."
"కోర్టులోనా?!"
"అవును. మా చిన్నాన్నమీద మా నాన్న కేసు పెట్టారు గతంలో. అదిప్పుడు గెలిచాం. దాని తాలూకు డబ్బు వచ్చింది. ఇదిగో...." అంటూ 14 వేలు తీసి భార్యకిచ్చాడు చక్రవర్తి.
పేకాటలో, గుర్రప్పందాలలో తొలిసారి ఆడిన వాళ్ళకు గెలుపే లభిస్తుంది. దీనికి లాజిక్ లేదు. ఒకసారి, రెండుసార్లు మూడుసార్లు గెలుస్తారు. తమది గెయినింగ్ హేండనుకొని ముందుకు సాగుతారు. ఇక వరసగా వదిలించుకుంటూ పోతారు.
మొదట వంద గెలుస్తాడు. తరువాత మరో వంద, ఆ తరువాత ఓ వంద పోగొట్టుకుంటాడు. ఆ వచ్చిన రెండొందల్లో వందపోతే ఏం__ఇంకా వంద లాభం. మరో వందపోతాయి. ఆ....వచ్చినవి పోయాయి.
మరో వంద పోతాయి. రెండొందలు వచ్చినప్పుడు వందపోతే ఏం....మరో వందపోతాయి....పందెం అన్నాక పోవటం రావటం సహజం అనుకుంటారు. ఆ తరువాత ఒక్కసారే రెండొందలు కాస్తాడు_ గెలిస్తే నష్టం పూడ్చుకోవచ్చని పోతాయి. ఈసారి 400 కాస్తాడు. ఆ తరువాత ఎనిమిది వందలు ఇలా ఆశగా....ఆబగా....ఆత్రంగా....అప్పనంగా గుంజేయాలనే
చరాచర సృష్టిలో మనిషే ఓ వింత.
ఆ వింతలో మరో వింత అతని బలహీనత.
ఆ బలహీనతల్లో మరో గొప్పది దురాశ.
చక్రవర్తి రేస్ క్లబ్ నుంచి వస్తూ వస్తూ తెచ్చుకున్న రేస్ బుక్ లుంగీలో దాచుకున్నాడు. లావెట్రీలో దూరాడు. ఆ బుక్ చూస్తూ అక్కడే గంట గడిపాడు.
బైట భార్య కంగారు. లోపల భర్త ఏమైపోయాడోనని భయం.
మొత్తానికి బయట కొచ్చాడు.
* * *
సాయంత్రం ఏడు కావస్తోంది. మెర్సిడస్ కారొకటి వచ్చి గాంధీ హాస్పిటల్ ముందు ఆగింది.
అందులోంచి హుందాగా దిగాడు శశాంక.
శశాంక వస్తున్నట్లు ముందే తెలియటంతో సూపర్నెంట్ తో సహా హాస్పిటల్ స్టాఫ్ అంతా వచ్చి శశాంక కోసం అప్పటికే ఎదురుచూస్తూ నిల్చున్నారు.
టాటా, బిర్లా, దార్మియాలాంటి ధనవంతుల కోవకు చెందే శశాంక తేజదత్త ఒక పబ్లిక్ ప్లేస్ లోకి రావటం ఒక వింతే.
శశాంక తమ హాస్పిటల్ కి వస్తున్నాడంటే స్టాఫ్ కి కాదు. పేషంట్స్ కి కూడా థ్రిల్లింగ్ గా ఉంది.
సూపర్నెంట్ శశాంకకి ఎదురొచ్చి వినయంగా తలవంచి "రండి సార్" అంటూ భరత్ రూమ్ వేపు దారి చూపించాడు.
లాబీలో హుందాగా నడిచి వెళ్తూన్న శశాంక, వెనుక అతని పరివారం, ఆ వ్నేఉక హాస్పిటల్ స్టాఫ్ ను, వార్డులో వున్న పేషెంట్స్ థ్రిల్లింగ్ గా చూస్తున్నారు.
"ఇండియాలో పెద్ద రేస్ హార్స్ ఓనర్ ఆయనేనట."
"ఆయన ఎస్టేట్ లో 500 మంది పనివాళ్ళట."
గవర్నమెంట్ లెక్కల్లోకి వచ్చిందే మూడుకోట్ల గ్రాముల బంగారం ఆ వంశానికి ఉందట."
"ఒక ఇండియన్ హార్స్ ని విదేశాలకు తీసుకెళ్ళి గెలిచిన ఘనత ఆయనదేనట.
"1981 లో కేవలం స్టేక్ ఎమౌంట్ 20 లక్షలట."
హాస్పిటల్లో వున్న పేషంట్స్ ఇలా ఒక్కొక్కరు ఒక్కో విధంగా శశాంక గురించి అనుకుంటున్నారు.
శశాంక, సూపర్నెంట్ ని మాత్రం లోనకు వెళ్ళనిచ్చి మిగతావార్ని రూమ్ బయటే ఆపేసారు సెక్యూరిటీవాళ్ళు.
ఏదో చదువుకుంటున్న భరత్ తలెత్తి శశాంకవేపు చూసి ముందుగా ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత మౌనంగా నవ్వుకున్నాడు.
"ఎలా వుంది?" అన్నాడు అప్పటికే అక్కడేనున్న రాయల చైర్ లో కూర్చుంటూ.
భరత్ మంచంమీద లేచి కూర్చున్నాడు.
"ఫర్వాలేదు...." అన్నాడు పొడిగా.
ఈలోపు ఒకరు వెళ్ళి త్రివేణీని హడావుడిగా తీసుకొచ్చారు. త్రివేణి వస్తూనే రూమ్ బయట హడావుడి, వార్డుల్లో సందడి గమనించి ఆశ్చర్యపోయింది.
త్రివేణి రూమ్ లోకి ఎంటర్ అయి ముగ్గుర్నీ విష్ చేసింది.
"మిస్ త్రివేణి....భరత్ ని ఎప్పుడు డిస్చార్జి చేయవచ్చు....!"
రేపు చేయవచ్చు మిస్టర్ సూపర్నెంట్" అంది చేతులు కట్టుకొని శశాంక ముందు నిలబడ్డ సూపర్నెంట్ ని చూస్తూ.
"వెల్....నేనొస్తాను. ట్రీట్ మెంట్ బాగా ఉండాలి అర్ధమైందా?" అన్నాడు శశాంక.
వినయంగా తలూపుతూ దారి చూపించాడు సూపర్నెంట్. ఎవర్నీ లెక్కచేయకుండా, హెడ్ స్ట్రాంగ్ గా బిహేవ్ చేసే సూపర్నెంట్ ఎందుకలా ఒక సర్వెంట్ లా ఆ వ్యక్తిముందు బిహేవ్ చేస్తున్నాడో త్రివేణికేం అర్ధం కాలేదు.
ఏడు నిమిషాలకుగాని శశాంక తాలూకు సందడి తగ్గలేదు హాస్పిటల్ లో.
"ఎవరతను?" త్రివేణి అడిగింది భరత్ ను.
"బిగ్గెస్ట్ హార్స్ ఓనర్ ఇన్ ఇండియా. మిస్టర్ శశాంక తేజదత్త.
"ఆశ్చర్యపోయింది అది విని త్రివేణి.
"ఎందుకలా ఆశ్చర్యం....?"
"మీరంటున్నది నిజమేనా?" నమ్మనట్లుగా కనురెప్పల్ని అల్లల్లా అడిగింది.