Previous Page
Next Page
ఖడ్గసృష్టి పేజి 20
DE - COMPOSITIONS
1
తురాయి కంటె, ఆ
కు రాయికంటె, కీ
చు రాయికంటె - హిమాం
శు రాయి గొప్పవాడు.
2
భుజంగా ప్రయాతం, బుభుక్షాభిఘాతం
చలంగారి పాపం, ప్రజా మిత్రకోపం
జరుక్ నాథ Zam-Buk, మిణీ శాస్త్రి Humbu (k)
లతాంతార్ద్ర రాగంబు లంబాడిలంగా...
3
కాకికేమి తెలుసు Psycho analysis?
ఆటవెలది ద్విపద కత్తగారు:
5, 3, 2 ఆముక్త మూల్యద:
విశ్వదాభిరామ వినురవేమ.
(పాఠాంతరం: దీని భావమేమి తిరుమలేశ)
4
హాంగ్ కాంగ్ లో
కింగ్ కాంగ్ తో
ఒరాంగ్ - టాంగ్ ఆడిన
పింగ్ పాంగ్ లాగు!!!
(సశేషం, బహుశా)
- ప్రతిభ త్రైమాసిక సంపుటి, 4 - 1940
Previous Page
Next Page