నందినికి తెలుసు. అతను పేకని షపుల్ చేసి ఒక్క ముక్క తిరగేస్తే ఆ తర్వాత ఏ కార్డు కింద ఏ కార్డు వుంటుందో చెప్పగల చాతుర్యం అతని షఫులింగ్ లో వుంది.
అతని తలపైన చేతిని వేసి వేళ్ళని జుత్తులోకి పోనిచ్చి నిమురుతూ-
"నాకు సరైన వాడివే దొరికావు" అంది నందిని. అతనిలోని మరో గుణంకూడా ఆమెకి నచ్చింది.
"నువ్వెవరు? మీ ఆయన ఏడి? ఆయన ఏం చేస్తుంటాడు? పిల్లలెందరు? నన్ను తీసుకొచ్చావు. మీ ఆయన నిన్ను కోప్పడడా?" లాంటి సిల్లీగా అతను ఆమెని ప్రశ్నించలేదు.
"భోజనం చేసి తీరుబడిగా ఆడుకొందుగానీ" అంది.
అతను లేచాడు. ఆమే స్వయంగా వడ్డన చేస్తుంటే ఆవురావురుమని తినసాగాడు పరుశురామ్.
అతను వాష్ బేసిన్ దగ్గర చేతులు కడుగుతుంటే అడిగింది నందిని.
"భోజనం ఎలా వుంది?"
ఆమెకేసి చూశాడు పరుశురామ్ వెనక్కి తిరుగుతూ---
"ఇంత గొప్ప భోజనం చేయడం ఇదే మొదటిసారి. మళ్ళీ జీవితంలో దొరుకుతుందో లేదో?" అన్నాడు.
"నేనున్నాను కదా!" అన్నదామె.
ఆ మాటకి ఆమె కళ్ళలోకి చూశాడు.
ఆ కళ్ళల్లో మెరుపుకి తట్టుకోలేక తల దించుకొన్నాడతను.
"రంగన్నా!" కేకేసింది నందిని.
"అమ్మా!" పరుగెత్తుకొచ్చాడు పనివాడు.
"బాబుగార్ని గెస్ట్ రూం లోకి తీసుకెళ్ళు...." అని పేకముక్కల్ని ఏరి అతనికిస్తూ-
"ఆడుదువుగా పేకాట! నేను వస్తాను. ఎంతసేపు ఆడగలవో చూస్తాను. నువ్వు ఫెయిలయితే ఈ రాత్రంతా నేను ఆడిస్తాను" నవ్వుతూ అంది నందిని.
పరుశురామ్ కార్డ్స్ తీసుకొని రంగన్నతో బయటికి నడుస్తుంటే నందిని కింది పెదిమని మునిపంటితో నొక్కిపట్టి కళ్ళు సగం మూస్తూ నవ్వుకొంది.
పదినిముషాల్లో ఆమె భోజనం చేసింది. బాత్రూంలోకెళ్ళి స్నానం చేసి డ్రస్సింగ్ టేబిల్ దగ్గరకి వచ్చింది.
బాబ్ చేసిన జుత్తుని దువ్వి భుజాలపైన వదిలేసింది.
మొహానికి క్రీమ్ రాసి పౌడర్ అద్దుకొని నుదుట చిన్న బొట్టి పెట్టుకుంది. పెదాలకి లిప్ స్టిక్ వేసుకొంది. చెవులకి బుట్ట లోలకులు పెట్టుకుంది. మెడలో సన్నని బంగారు గొలుసు. చేతులకున్న బంగారు గాజుల్ని తీసి డ్రస్సింగ్ టేబిల్ అరలో పడేసింది.
బ్లాక్ బ్రా వేసుకుని చేతులు వెనక్కి పోనిచ్చి హుక్స్ పెట్టుకొంది. ఒంటిమీద వున్న లంగా తీసేసి మినీ బ్రీప్ తొడుక్కుంది. లేత పసుపు పచ్చ ట్రాన్స్ పరెంట్ నైటీ వేసుకొంది. ఆమె రెండడుగులు వెనక్కి వేసి అద్దంలో చూసుకొంది.
నలభై వసంతాల వయసొచ్చినా చెక్కుచెదరని తన అందాలకి ఆమె ముగ్ధురాలైంది.
ఒంటిపైన, బట్టలపైన మాస్కులైన్ స్ప్రే చేసుకొంది.
కింది పెదిమని నాలుకతో తడిచేసుకుంటూ తననిలా చూస్తే పరుశురామ్ ఉక్కిరిబిక్కిరి అయిపోతాడనుకొంది.
మెల్లగా హంసలా, ఒయ్యారంగా ఆమె గెస్ట్ రూం వేపు నడిచింది. ఆమె నడుస్తుంటే నైటీ మధ్యలో రెండుగా చీలిపోతోంది. ఆమె కాళ్ళు తొడల వరకు కనిపిస్తూ లైట్ల వెలుగులో బంగారంలా మెరుస్తున్నాయి.
గది తలుపులు దగ్గరకేసి వున్నాయి. ఆమె తలుపు తోసింది. లోపల బెడ్ లైట్ వెలుగుతోంది. మంచం దగ్గరగా నడిచింది నందిని.
అతను మంచంమీద పడుకొని వున్నాడు!
పరుశురామ్ గురకపెట్టి నిద్రపోతున్నాడు. మంచంపైన పేక ముక్కలు చుట్టూ పరచివున్నాయి.
"రామ్" మృదువుగా పిలిచింది నందిని. అతను పలకలేదు.
"నిన్నే!"
అతను కళ్ళు విప్పలేదు.
"నీ కోసం ఒచ్చానయ్యా!"
మెత్తగా అతని భుజంపైన చేయి వేసింది. అది గులాబీ పువ్వుమీద పడినంత సున్నితంగా వేసింది.
అతను మొద్దులా నిద్రపోతున్నాడు. అతను భోజనం చేసి ఎన్ని రోజులైందో? అసలే అలసటపైన వుండటం చేత స్నానంచేసి భోజనం సుష్టుగా చేయటంతో వెంటనే నిద్రపోయాడని ఆమె గ్రహించింది.
పేకముక్కల్ని ఏరి టీపాయ్ పైన పెట్టింది. నిద్రపోతున్న అతన్ని తదేకంగా చూస్తూ అతని తలవేపు నిలబడింది నందిని. రెండు చేతులతో అతని చెంపలని చేతులతో సవరదీస్తూ ముందుకి వంగి అతని నుదురుపైన ముద్దు పెట్టుకొంది నందిని.
మెల్లగా తన గదిలోకి వచ్చేసి మంచంపైన వాలిపోయిందామె.
నిద్రరావడం లేదు ఆమెకి.
"పరుశురామ్!"
ఆమె కళ్ళు మూసుకొంటూ చిన్నగా నవ్వుకొంది.
3
పరుశురామ్ ఉల్లాసంగా లేచి మంచంపైన కూర్చున్నాడు. టైమ్ ఎంతయిందో తెలీదు. అలసిపోయిన శరీరానికి కావాల్సినంత విశ్రాంతి దొరకడంతో ఇప్పుడెంతో రిలీఫ్ గా వుందతనికి.
రాత్రి గొడ్డులా నిద్రపోయాడు. భోజనం అయినాక రంగన్నతో ఆ గదిలోకి వచ్చాడు. కాస్సేపు అదీ కొన్ని నిమిషాలపాటు మేడం యిచ్చిన కార్డ్సు ఆడుకున్నాడు. అలాగే మంచంమీద వాలిపోయాడు.
రాత్రి నందిని వస్తానంది. ఆమె వచ్చే వుంటుంది. తన మొద్దునిద్ర చూసి ఏమనుకుంటుందో?
నిద్ర సిగ్గెరగదనే సామెత కరెక్ట్ అనిపించింది పరుశురామ్ కి.