Previous Page Next Page 
ప్రేమ జ్వాల పేజి 6

     "మీరిద్దరూ సినిమా కెళ్ళారని చెప్పానమ్మా అందుకని వెళ్ళి పోయారు అయ్యగారు మీ కోసమనే  తొందరగా కూడా వచ్చారు"

    "ఐసి" అంది సాలోచనంగా.

    విజయ్ మాట్లాడలేదు. రంగి లోపలి వెళ్ళిపోయింది!

    "నేను పుట్టి అప్పడే అరగంటయింది" అంది అర్జున.

    "అయితే పాపాయిని ఎత్తుకోవచ్చా!"

    "నిక్షేపంగా  ఎత్తుకోవచ్చు కాని వెంటనే దింపేస్తే ఏడుస్తుంది. పాపాయి.

    "పాపాయిని  ఏడవకుండా బుజ్జగించడం, ముద్దుచేయడం  నాకు తెలుసు. పాపాయికి ఇన్ని అలంకారాలు  దేనికి? పుట్టినప్పుడెలా వుంటుందో అలాగే చూడాలనిపిస్తోంది" అన్నాడు.

    "ఛీ పాడు " అంది సిగ్గుతో.

    చీకటి పడింది. చల్లవిగాలి  ఆహ్లాదంగా  వీస్తోంది.

    "ఇప్పుడు నువ్వెంత  అందంగా  వున్నానవో తెలుసా?" అన్నాడు విజయ్ అర్జుని  మొహాన్ని చేతుల్లోకి  తీసుకుంటూ.

    "విజయ్ " అంది

    "ఇది  నా బహుమతి"  అంటూ ఆమె పెదవుల సైన ముద్దు పెట్టుకున్నాడు విజయ్.

    "నా ప్రాణాలని  నీ పెదవుల్లో దాచుకోంటున్నా అర్జునా!"

    "జాగ్రత్తగా  దాస్తాను" అంది.

    అర్జున పున్నమినాటి వెన్నెలలా వుంది. అజంతాశిల్పంలా  వుంది. కొండపల్లి బొమ్మలా  నాజుకుగా  ఉంది. పాలకోవాలా  సున్నితంగా  వుంది. తళతళమని  మెరిసిపోతున్నా అచ్చుపోసిన బంగారు ప్రతిమలా  వుంది.

   కోలమొహం,  కొనతేలిన ముక్కు  పెద్దకళ్ళు, చిన్న నోరు , పలుచని పెదిమలు" గులాబి రేకుల్లాంటి చెక్కిళ్ళు, వత్తయిన జుత్తు, పెద్ద జడ , చిన్నగడ్డం, చెవులకి జూకాలు పెట్టుకుంది మెళ్ళో బంగారు గొలుసు. దానికి చిన్న లాకెట్  ఒక చేతికి  రెండు  బంగారు గాజులు, మరోచేతికి  గడియారం.

    పాల నురగలా  వున్నా తెల్లని మెత్తని షిఫాన్  పిల్కుచిర కట్టుకుంది. మల్లెపువ్వు లాంటి తెల్లని పాలిస్టర్ స్లీవ్ లెస్ బ్లౌజ్  వేసుకుంది.

    చీరకుచ్చెళ్ళకి, జాకేట్టుకి మధ్యగల జానెడు పొట్ట పాల సముద్రం వూగుతున్నట్టుగా  వుంది.

    కళ్ళార్పకుండా  చూడాలనిపించే  అందం ఆమెది.

    మన్మధుడు శివుడి కోపానికి గురైతే బూడిద అయ్యాడు కాని, బతికి  వుంటే ఈనాడు రాతిదేవికి  చిడతలిచ్చి అర్జున కోసం  పరుగెత్తు కోచ్చేవాడే.

    ఆమె గెడ్డం పైన వున్న చిన్న పుట్టుమచ్చని చూసి__

    "రియల్లి  ఆయాం లక్కి" అన్నాడు విజయ్.

    "ఏమిటి?"

    "నీ అంత  అందగత్తే నాకు  దొరకడం,"

    "షటప్" నా అందమే  కాని నేను కాదన్నమాట  నీకు కావాల్సింది" చిరుకోపంతో అంది అర్జున.

    "సారి! అలా అన్నానా!" అంటూ  ఆమె భుజాల చుట్టూ చేతులు వేసి దగ్గరగా లాక్కుని గట్టిగా కౌగిలించుకున్నాడు.

    ఏనాడూ లేనిది ఆరోజు అతనిలో ఆవేశం కట్టలు తెంచుకుంది .

    అతను చేసిన చొరవకి అర్జున ఆశ్చర్యపోయింది. అతను  మితి మీరతాడన్నా  సంశయం కలిగింది ఆమెకి.

    "చాల్లే, దొంగవేషాలు" అంటూ అతని చేతుల్లోంచి తప్పించుకుంది అర్జున.

    అతను మత్తెక్కిన  కళ్ళతో చూశాడు.

    అర్జున తేలిగ్గా నవ్వుతూ-

    "గుడ్ నైట్ " అంది.

    "అంటే నన్ను గెటవుట్ చేస్తున్నావా?"

    "ఊ" అంది నవ్వుతూ.

    నిజానికి అతనికి వెళ్ళాలని లేదు. అతను వెళ్ళిపోవడం ఆమెకి ఇష్టంలేదు.

    కాని ఇద్దరిలో కోరిక చెలరేగుతోంది. పరిస్ధితిని అదుపులోకి  తేవాలంటే ఆ సమయంలో దూరం అవసరం, బలహీనతకి లొంగి పోవడం ఇద్దరికీ ఇష్టంలేదు కాని లొంగిపోవాలని ఇద్దరికీ వుంది.

    "గుడ్ నైట్" అని విజయ్ బయటకి  వచ్చేశాడు.

    గేటు పక్కినే వున్నా ఓ నల్లపిల్లి అతన్ని చూసి దారికి అడ్డంగా పరిగెత్తింది.

    "ఛీ వెధవ పిల్లి" అని తిట్టుకున్నాడు విజయ్ .

    ఓ కారు  సర్రున ఆగింది.

    నల్లపిల్లి ఆ కారు  చక్రాలకింద పడి నలిగిపోయింది.

    క్షణకాలంలో జరిగిపోయిన ఆ సంఘటనకి విజయ్ చాలా విచారించాడు. గేటు పక్కన దేనికోసమో పొంచివుంది పిల్లి తనని చూసి బెదిరిపరుగు తీసింది, ప్రాణాలు పోగొట్టుకొంది. ఆ పాపం తనకి  చుట్టూ కొంటుందని  భయపడ్డాడు విజయ్ .

    మెస్ లో  భోజనం  చేసి  గదికి చేరుకున్నడే గాని అతని మనసు చల్లారలేదు.

    అతని మనసునిండా గుండెలనిండా ఆలోచనలనిండా అర్జున పూర్తిగా నిండిపోయింది.

    తనందుకున్న  అర్జున పెదవులు....దగ్గరికి తీసుకుని కౌగిలించు కున్నప్పుడు పొందిన ఆమె గుండెల  మెత్తదనం తాలూకు తియ్యని అనుభూతి జ్ఞపకం  వచ్చి అతని మనసింకా  వేడిగా వాడిగా కోర్క పైన అతనిలో  కాంక్షని రెచ్చగొడుతుంది.

    వెన్నెల సోయగాల పోతోంది.

    మనోహరమయిన మధురమయిన  ఆ కాలాన్ని వృధాగా పాడుచేసుకోవాల్సి వచ్చిందుకు  తనని తానే తిట్టుకున్నాడు విజయ్.    

 Previous Page Next Page