"నన్ను చూస్తే పిచ్చిపట్టేలా వుందా?" గర్వంగా అడిగింది కాశ్మీర.
"అవును."
"భయపడకు నీ పిచ్చి నేపోగోడతానులే" అంది.
"ఎలా?"
"అవకాశం వచ్చినప్పుడు నేనే చెప్తానులే. విజయ్, నువ్వు ఇరవైతె రోజులుగా కనబడకపోయేసరికి నాకే పిచ్చిపట్టింది. నువ్వే ఆ పిచ్చిని పోగొట్టాలి మరి!"
"మరింకా ఇక్కడే వున్నావే?" అన్నాడు పరిహాసానికి విజయ్. అతని మాటల్లోని అంతరార్ధాన్ని గ్రహించిన కాశ్మీర....
"నీ కోసం చాలా సేపట్నుంచి చూసి విసుగోచ్చేసింది, కనీసం నువ్వు గదిలోంచి కూడా బయటికి రాకపోతే కోపంవచ్చి పాట పాడేశాను" అంది.
"చూడు! నువ్వెప్పుడు పిలిస్తే అప్పుడు కనబడతాను పాట మాత్రం పాడకు."
"అలాగే"
"ధాంక్యూ."
"చూడు"
"ఏం చూడను?"
అతని మాటకి కాశ్మీర చిలిపిగా చూస్తూ పవిటని సర్దుకుంది.
"నీ దగ్గర ఏమన్నా పుస్తకాలున్నాయా?
"ఆ....ఏం ఇవ్వాలో చెప్పు."
"చందమామ, బొమ్మరిల్లు...." అంటూ నవ్వేసింది అల్లరిగా.
"రేపు గుర్తుంచుకొని నీ కోసం కొని తెస్తాను.
"ఛ ఊరికే అన్నాను. అవినాకెందుకు పనికొస్తాయి. ఏమన్నా... లేవా?" అని అర్దోక్తిగా ఆగిపోయింది.
"ఏమన్నా....లేవా....? అంటే?" అడిగాడు.
"అదే....ఛీ...నీకసలు బుర్రలేదు. అందులో బొమ్మలుకూడా వుంటాయి. ఎవరూ చూడకుండా ఇవ్వాలి."
"పెక్స్ బుక్స్ " అనుకోని కాశ్మీర కోరికకి విజయ్ అదిరి పోయాడు.
ఆమెకి ఆ వయసులో ఎంత కోరిక! తల్లి తండ్రి ఎవరి గొడవల్లో వాళ్ళు తిరుగుతుంటే పిల్లలు ఇలాగే తయారవుతారు. ఆడపిల్లలున్న తల్లి తండ్రి ఎంత జాగ్రత్తగా ఉండాలి.
పెక్స్ పత్రికలు కావాలని ఓ మొగాన్ని అడుగుతున్నావంటే ఏమనాలి?
కాశ్మీరాకేసి చూశాడు విజయ్. క్రింది పెదవిని మునిపళ్ళతో నొక్కిపట్టి చూస్తోంది కాశ్మీర.
ఆ క్షణంలో కాశ్మీర మగవాళ్ళని నిలువునా మింగేసే ఓ శక్తిలా కనబడింది.
విజయ్ ఒళ్ళు గగుర్పొడిచింది.
"ఏం మాట్లాడవూ! నీ వల్ల కాకపోతే చెప్పు" అంది.
అతనికే విధమ్తెన సమాధానం చెప్పాలో తోచలేదు.
"తప్పు కాశ్మీరా, నువ్వు అప్పడే అలాంటివి చదవకూడదు."
"అప్పడే అంటే ....నేనింకా పాపాయి ననుకున్నావా విజయ్. అయం నాట్ బేబి " అంది.
"నువ్వు చిన్నదానిననే అనుకున్నా, కాని పెద్దదానివని గుర్తు చేశావు. సరే రేపు తెచ్చిస్తాను" అన్నాడు విజయ్ మేడమేట్లు దిగుతూ.
"ఎక్కడికి?" అతను వెళ్ళిపోతుంటే చాలా నిరుత్సాహంగా అడిగింది.
"భోజనానికి."
"ఆకలిగా వుందా?"
"అవును."
"భోజనానికి అంతదూరం వెళ్ళక తప్పదన్నమాట" అంది.
అతను నవ్వుతూ రోడ్డుమిదికొచ్చి వెనక్కి తిరిగి చూశాడు.
కాశ్మీర అక్కడే నించుని అతన్ని చూస్తోంది.
* * *
గ్రే కలర్ బెల్ బాటం పాంటు, దానిపైతెన డార్క్ కలర్ చారలూ వున్న షర్టుని టక్ చేశాడు విజయ్ కాళ్ళకి ఎలివేటర్స్ , ఎడంచేతికి పచ్చల వుంగరం , రిస్ట్ వాచీ వున్నాయి. అతని నడుముకి పెట్టుకున్న వెడల్పాటి బెల్టు ముందు భాగంలోని స్టిల్ బకిల్ ప్రేమ్ లో సింహం బొమ్మ అందంగా వుంది.
విజయ్ ది ఆరుడుగుల భారి విగ్రహం ఎర్రని చాయతో ముచ్చటైన క్రాఫింగ్ , సన్నని మీసాలు, అతన్నోసారి చూస్తే తిరిగి చూడాలనిపించే అందం విజయ్ ది అందుకే ఆడపిల్లలు అతనంటే పడిచస్తారు.
అతను చేతులు చాస్తే పరుగెత్తికెళ్ళి అతని కౌగిలిలో కలిసిపోవాలనిపించింది అర్జునకి.
అతను చేతులు చాచనూలేదు. ఆమె పరుగెత్తికెళ్ళి అతని కౌగిలిలో కలిసిపోనూలేదు.
"ఇప్పుడు నువ్వెలా వున్నావో తెలుసా?" అంది అర్జున.
"నువ్వే చెప్పు" అన్నాడు విజయ్
అర్జున నవ్వింది.
తిరిగి నవ్వింది. అందంగా నవ్వింది. మతిపోయేలా నవ్వింది.
ఆ నవ్వునీ ఆ మనిషినీ చూసి అదిరిపోయాడు విజయ్.
"అచ్చం కోతిలా వున్నావు." అంది.
"నేనెలా వుంటే ఏం కాని రేపు రాబోయే వాడ్ని జాగ్రత్తగా చూసి కట్టుకో మళ్ళీ ఏ కోతో వస్తే కష్టం" అన్నాడు.
"నేను కోతినే ప్రేమించా కోతినే చేసుకుంటా" అంది అర్జున.
"ఇంతకీ ఏ సిన్మాకి?" అడిగాడు విజయ్.
"బాలనాగమ్మకథకి. "
"పద అదే మంచి కాలక్షేపం." అన్నాడు.