Previous Page Next Page 
బ్లాక్ టైగర్ పేజి 4


    ఒకరి మొఖాలోకరు చూచుకున్నారు.
    వెనుక నించి క్లాప్స్ వినిపించాయి. ఉలికిపడి లేచాడు జయసింహ. ఆఫీసర్స్ పాతిన మేకుల్లా బిగుసుకున్నారు.
    "డియర్ స్టుపిడ్స్! మిమ్మల్ని దంచేశాడు. తెలివి కలిగినవాళ్ళు అయితే, డిపార్ట్ మెంట్ మాగ్నేఫికేన్సీకి తగిన వారసులు అయితే అతనికి సమధానం చెప్పాలి!
    "ఓపెన్ ది డోర్ ఫర్ హిమ్ " ఆత్మీయంగా మందలిస్తూ అమిత వేగంగా లోనికి వెళ్ళిపోయాడు ఎఎస్ పి విక్రమ్!
    "ఎస్ సర్!" స్టిఫ్ గా అయిపోయి సెల్యూట్ కొట్టాడు . అర్దర్లీ స్ప్రింగ్ డోర్ తెరిచిపట్టుకున్నాడు.
    "తగినంత బలం లేకుండా తమాషాకయినా మావాళ్ళ జోలికి రాకూడదు. ఇట్స్ ఏ హెల్! సోయిట్ బి!
    మీరు చెప్పింది అంతా విన్నాను. కూర్చో జయసింహ!"
    "థాంక్యూ సర్!" కూర్చున్నాడు.
    "ఆ లాకర్ మీరు ఎందుకు తీసుకున్నారు? ఏందాచారందులో?"
    "రెండు ఎనిమిదులు. అదృష్టం కలిసి వస్తుందని తీసుకున్నాను."
    "నువ్వేం చదువుకున్నావు?"
    "ఎందుకుపయోగిస్తుందో తెలియదు. కాని ఎం.ఏ చేశాను"
    "పోస్టు గ్రాడ్యూఎషన్ చేశావు. అదృష్టం కోసం ఎదురు చూస్తావన్న మాట. రియల్లీ పిటీ! స్వశక్తి మీద నమ్మకం లేదా?"
    "జీవితంలో అనుకున్నది సాధించగలిగినవాళ్ళు స్వశక్తి గురించి మాట్లాడతారు. శక్తి ఉంది. అది రాణిస్తుందన్న నమ్మకం లేదు"
    "ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయావన్న మాట!"
    "నేను పోగొట్టుకోలేదు. నా చుట్టూ ఉన్న పరిస్థితులు చూచాక అదే నీరు కారిపోతోంది."
    "పరిస్థుతులా? నువ్వేం చూచావు! వయసులో నీకన్నా అంత పెద్ద వాడిని కాదనుకుంటాను. భయపడకుండా చెప్పు."
    "సర్! మన చుట్టూ ఉన్న సమాజం చాలా డిజార్దర్ లో ఉంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. అన్ సెక్యూర్ డ్ సొసైటీ ఎవరు ఏం చేస్తారో ఎవ్వరూ ఊహించలేరు కదా!
    ఈ సువిశాల పవిత్ర భారతవనిని పాలించే ఏ శిఖరాగ్ర నాయకుడి మీద ఏ క్షణంలో హత్యా ప్రయత్నం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు.
    ప్రజలు ఆర్ధికంగా సామాజికంగా ఊబిలో దిగిపోయి వున్నారు. వాళ్ళకి అందమయిన అబద్దాలు చెప్పి మరింత ఊబిలోకి దింపేవారే కొన్ని చోట్ల వారికి పాలకులవుతున్నారు.
    కొందరికి అర్ధం కాదు. కొందరు అర్ధం చేసుకోరు. కొందరు అర్ధమయినా కానట్లుగా నటిస్తారు.
    ఈ దేశంలో ప్రజాస్వామ్యం చాలా ఘోరంగా విఫలమైపోయి ప్రజల దీనులైపోయారని అందరికీ తెలుసు!
    కాని లాభం ఉన్నవాళ్ళు లేనివాళ్ళు కూడ ఈ ప్రజాస్వామ్యం చాల పవిత్రమయింది అంటారు. ఎందుకంటారో మరి?
    ఒక వంచితురాలు అధికారుల సాయం కోరితే ఆమె మరింతగా వంచితురాలు కావచ్చు.
    మనిషికి చాలా ప్రాధమికమయిన హక్కులు కదా విద్య వైద్యం న్యాయం లాంటివి.
    వాటిని కూడా డబ్బిచ్చి కొనుక్కోవాలి! చాలా ఖరీదయిపోతోంది.
    పాలకులు స్వార్ధపరులైతే ఇలాంటివి జరగటం అసాధ్యం కాకా పోవచ్చు! కాని దశాబ్దాల పాటు గురవుతున్న ప్రజలే ఇదేమిటని ప్రశ్నించరు.
    ఒక లక్షాధికారి డ్రయివర్ కి జీతం యివ్వకపోతే అది ఒక సంఘటన కాదు. ఏమి జరగదు.
    ఒక వీధి నాయకుడు రిక్షా కూలీకి బాడుగ యివ్వకుండా బెదిరిస్తే ఈ దేశంలో ఏ దిక్కు లేదు.
    హత్యలు, దోపీడిలు , దహన కాండలు , మానభంగాలు బలం కలిగినవాళ్ళు నిరాఘాటంగా సాగిస్తూనే ఉన్నారు.
    నేను చెప్పినదాన్లో ఏ ఒక్క అక్షరమయినా అబద్హం ఉందంటారా?
    "సర్\! ఇదంతా మనం రోజూ చూస్తున్నది కాదా?" అని ఉద్వేగంతో ప్రశ్నించాడు జయసింహ!
    అతడు తన సమస్యల్ని వ్యక్తిగతంగా కాదు ------
    సామాజిక న్యాయంతో కలబోసి ఆలోచిస్తున్నాడు !
    ఇలాంటి ఆలోచనలు సఫలం కావటం జరగదు. ఒకవేళ అలా జరిగితే ఎంత అద్భుతమయిన ఫలితాలుంటాయో ఊహించగలిగాడు విక్రమ్!
    అడ్మయిరింగ్ గా అతని కళ్ళు మెరుస్తున్నాయి.
    "మరి ఎలా జరిగితే బావుంటుందంటారు?" అన్నాడు.
    "సంఖ్యాబలం కలిగినవాళ్ళు లేనివాళ్ళని తెలివి కలిగిన వాళ్ళు అది లేని వాళ్ళని మోసగించటానికి వీలులేని వ్యవస్థ ఒకటి రావాలి. అందాకా మనిషి గతి యింతే!"
    "అటువంటి వ్యవస్థని ఎలా తీసుకురావచ్చంటారు?"
    "ప్రకృతి కి సమీకరణ శక్తి ఉందంటారు కదా! తరతమ బేధాల అంతరాల్ని అదే స్వయంగా సమన్వయం చేసుకుంటుంది. బాక్టీరియా ఫంగస్ వైరస్ ఈష్ లాంటివి కోటాను కోట్లుగా పెరుగుతాయి . వాటిని ప్రకృతి కంట్రోల్ చేస్తుంది. ప్రకృతి సృష్టిస్తుంది, రక్షిస్తుంది. పురుగుల్ని కప్పలు తింటాయి. కప్పల్ని పాములు తింటాయి. పాముల్ని కొన్ని దేశాల వాళ్ళు తినేస్తారు. మిగిలినవాళ్ళు చంపుతారు. అలా ప్రకృతి దానిలో అంతర్భాగాలయిన ప్రాణులూ ఈక్వేషన్ ని కాపాడుకుంటాయి.
    మన చుట్టూ ఉన్న వాతావరణం అలాంటి పరిస్థితుల్లోనే మారాలేమో! అందాకా శక్తికి రాణింపు వుండదు.
    విశ్వాసానికి సార్ధకతా ఉండదు.
    అందుకే నేను అదృష్టం మీద అధారపడటాన్ని అవమానం అనుకోను. మీరు అదృష్టవంతులు! నేరుగా ఎఎస్ పి ఉద్యోగం సంపాదించగలిగారు. ఆ కారణంగా నాఅభిప్రాయం పొరపాటని మీరు అనుకోవచ్చు."
    "నో! మై ఫ్రెండ్! ఈ ఉద్యోగం నాకు ఎలా వచ్చిందో నాకు తెలుసు కదా! మీరు పొరపాటు పడుతున్నారని అనుకోను.
    కంటుది పాయింట్.
    లాకర్స్ చాలామందికి ఉన్నాయి. వాటిలో చాల విలువయిన వస్తువులు ఉండి ఉంటాయనటంలో సందేహం లేదు.
    గ్లాసింగ్ జరిగిన తరువాత అక్కడకు మొదటగా వెళ్ళి వారిని చూచింది నేను. దొరికిన బంగారం డాక్యుమెంట్స్ అన్నీ భద్రంగా దాచి ఉంచాను. డోంట్ వర్రీ! రహస్యంగా ఉంచాను.
    అందరికీ ఆసక్తి ఉంటుంది తెలుసుకోవాలి అని!
    కాని ఎవరూ సాహసించి నేరుగా నా దగ్గరకు రాలేదు"
    "మరికొంత కాలం ఆగేందుకు వారికి అవకాశం ఉందేమో! నాకలాంటి అవకాశం లేదు సర్!' జయసింహ ముఖం సీరీయస్ గా అయిపొయింది.
    దిగులు తాలుకూ నీలినీడలు తారాడుతున్నాయి.
    "అలా అయితే మీకు ప్రత్యేకమయిన ఏర్పాటు చేయిస్తాను. మీవి నగలా/ డాక్యుమెంట్లా? వాటి వివరాలు చెప్పండి. పరిశోధనకి అభ్యంతరకరం కానివి అయితే వెంటనే మీకు అందే ఏర్పాట్లు చేయిస్తాను ."
    "థాంక్యూ సర్! డబుల్ ఎయిట్ ప్రేలిపోయిందా ?"
    "అవును మూడు వరసలు బ్రద్దలు అయినాయి. డెబ్బై ఒకటి నించి తొంబైతొమ్మిది వరకూ! ఎనభై ఎనిమిది ఈ సంఖ్యలన్నింటిని యించుమించు క్రెంద్రం అనుకోవాలి. చాలా ఫైల్స్ తగులబడ్డాయి."
    "మీకు ఎలాంటి వస్తువులు దొరికాయి."
    "టూ మచ్! అయినా చెప్తాను. నాతొ యింకా ఎక్కువసేపు మాటాడతావు   " ఈసారి రిస్ట్ వాచీ వంక చూచుకున్నాడు.
    'బంగారం ఏమయినా దాచుకున్నారా?"
    "నో సర్! అంతకన్నా విలువయినదే దాచుకున్నాను."
    "డాక్యుమెంట్లున్నాయా ?"
    "అలాంటివేమీ కాదు"
    "కొన్ని సర్టిఫికెట్స్ దొరికాయి "
    "వాటికి విలువేముంది? అలాంటివి దాచుకునేందుకు వెయ్యి రూపాయలు అప్పు చేసి లాకర్ తీసుకొను"

 Previous Page Next Page